కోల్‌కత్తా : పశ్చిమ బెంగాల్‌లోని డమ్ డమ్‌లో గాంధీ జయంతి నాడు భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ ఏడేళ్ల బాలుడు మృతి చెందగా, పది మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషయంగా ఉందని వైద్యులు తెలిపారు. డమ్‌డమ్ సమీపంలోని నగర్‌బజార్‌లో మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఉదయం భారీ శబ్ధంతో బాంబు పేలగానే దానిలోంచి గాజు పెంకులు, ఇనుప చువ్వలు దూసుకుని వచ్చాయని స్థానికులు చెపుతున్నారు. మార్కెట్ సమీపంలో రద్దీగా ఉండే ప్రాంతంలో దుండగులు పేలుడు పదార్ధాలు ఏర్పాటు చేశారు. ప్రమాదం జరిగినే వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, బాండ్ డిస్పోజల్ స్వాడ్ తనికీ నిర్వహించారు. ఘటనలో గాయపడ్డ వారిని దగ్గరలోని జీకే కౌర్ మెడికల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన డమ్ డమ్ మున్సిపాలిటీ చైర్మన్ పంచూ రాయ్ పార్టీ కార్యాలయం సమీపంలో ఈ పేళుల్లు సంభవించాయి. దీంతో అధికార తృణమూల్ దీనిపై తీవ్రంగా మండిపడుతోంది. తమను రాజకీయంగా ఎదుర్కొలేకనే గాంధీ జయంతి నాడు రాష్ట్రంలో శాంతి, భద్రతలకు విఘాతం కలిగించాలిన బీజేపీ ఈ చర్యకు పాల్పడిందని టీఎంసీ ఆరోపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల భద్రతను గాలికొదిలేసిందని వామపక్షాలు ఆరోపిస్తున్నాయి. తమకు లండన్ లాంటి నగరం అవసరంలేదని.. బెంగాల్‌లోనే భద్రత కల్పిస్తే చాలని సీపీఎం నేతలు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment