కోల్‌కత్తా: మాజీ మంత్రి, తృణముల్ కాంగ్రెస్ సీనియర్ నేత సాధన్ పాండే(71) ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పాండే ముంబైలోని ఆసుపత్రిలో చిక్సిత పొందుతూ మృతి చెందినట్టు ఆయన కూతురు శ్రేయ వెల్లడించారు.
కాగా, పాండే మృతిపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. సీనియర్ లీడర్, కేబినెట్ మంత్రి పాండే మరణం ఎంతగానో బాధించిదన్నారు. సాధన్ పాండేతో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని ఆమె గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే పాండే కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. అనంతరం సీనియర్ నేత సలహాలను తాము కోల్పోయామంటూ మమత ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా ఆయన మృతిపట్ల బెంగాల్ గవర్నర్ సహా, జగదీప్ ధన్కర్ సహా టీఎంసీ నేతలు సంతాపం తెలిపారు. ఇక, సాధన్ పాండే ఉత్తర కోల్‌కత్తాలోని బుర్టోలా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2011 వరకు ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
Comments
Please login to add a commentAdd a comment