
పశ్చిమ బెంగాల్ గవర్నర్ డాక్టర్ సీవీ ఆనంద బోస్‌పై మహిళా ఉద్యోగి వేధింపుల అభియోగం మోపిన నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ, ఆమె పోలీసులు మినహా 100 మందికి సంబంధిత సీసీటీవీ ఫుటేజీని చూపుతామని రాజ్ భవన్ అధికారిక ప్రకటన చేసింది.
రాజ్‌భవన్‌లో జరిగే కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రజలు తమ అభ్యర్థనలు ఇమెయిల్ లేదా ఫోన్ ద్వారా పంపాలని కోరింది. మొదటి 100 మంది వ్యక్తులు గురువారం ఉదయం గవర్నర్ హౌస్ లోపల ఫుటేజీని చూడటానికి అనుమతిస్తున్నట్లు పశ్చిమ బెంగాల్ రాజ్‌భవన్ అధికారులు వెల్లడించారు.
పశ్చిమ బెంగాల్గవర్నర్సీవీ ఆనందబోస్ తననువేధింపులకు గురిచేశారంటూ ఓ మహిళ సంచలన ఆరోపణ చేసింది. ఈ మేరకు అక్కడి రాజ్ అక్కడి రాజ్‌భవన్‌లో తాత్కాలిక సిబ్బందిగా పని చేస్తున్న మహిళ స్థానికంగా ఉన్న హరే స్ట్రీట్పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఉద్యోగం విషయమై బోస్ ఆ మహిళను రెండు సార్లు పిలిచినట్లు, ఆ రెండు సందర్భాల్లోనూ వేధింపులకు గురిచేసినట్లు ఆరోపించింది.
Comments
Please login to add a commentAdd a comment