mamatha banerjee
-
అభయ ఘటన కేసు : సీఎం మమతా బెనర్జీకి భారీ షాక్
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి భారీ షాక్ తగిలింది. కోల్‌కతా ఆర్జీకార్ ఆస్పత్రి అభయ ఘటనలో మమతా బెనర్జీ వ్యవహరిస్తున్న తీరుపై అధికార తృణముల్ కాంగ్రెస్ (టీఎంసీ) రాజ్యసభ ఎంపీ జవహర్ సిర్కార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం తన పార్లమెంటరీ పదవికి రాజీనామా చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు మమతా బెనర్జీకి లేఖ రాశారు. ఆ లేఖలో.. తప్పు చేస్తున్నా సరే ప్రభుత్వంపై అభిమానం ఉందని కొంతమందిని, అవినీతిపరుల్ని పట్టించుకోవడం లేదని, వారిపై చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుబట్టారు. సీఎంతో మాట్లాడేందుకు ప్రయత్నించినా, అందుకు సాధ్యపడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తోడు అవితీని పాల్పడ్డ అధికారులకు(లేదా వైద్యులు) ప్రమోషన్లు ఇచ్చి వారికి మరింత ఉన్నత స్థానాల్ని కేటాయించడాన్ని తాను అంగీకరించబోమని’ అని సిర్కార్ చెప్పారు.అంతేకాదు అభయ కేసులో బాధితురాలికి సత్వర న్యాయం జరుగుతుందని ఆశించా. దారుణం జరిగిన నాటి నుంచి న్యాయం చేస్తారనే ఎంతో ఒపికతో ఎదురు చూశా. అది జరగలేదు. పైగా ప్రభుత్వం నిందితుల్ని గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవడం విఫలమైంది అని దీదీకి రాసిన లేఖలో సిర్కార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా దీదీ ఓ సలహా ఇచ్చారు. రాజకీయం కోసం నిరసనలు చేయకుండా.. బాధితురాలికి న్యాయం చేకూరేలా.. నిందితులకు శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇటీవలి కాలంలో ఆర్జీకార్ అభయం ఘటనలో మమతా బెనర్జీ వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్జీకార్ ఆస్పత్రి ఘటనలో సొంత పార్టీ నేతలే మమతా తీరును విమర్శిస్తున్నారు. అలా విమర్శించినందుకే టీఎంసీ నేత శాంతాను సేన్‌ను పార్టీ పదవి నుంచి తొలగించింది. సుఖేందు శేఖర్ సైతం తిరుగు బావుటా ఎగురవేశారు. అభయ ఘటనలో దీదీ వైఫల్యాల్ని ఎత్తి చూపుతున్నారు. తాజాగా, రాజ్యసభ సభ్యుడు జవహార్ సిర్కార్ రాజీనామా చేయడం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. -
బెంగాల్ బంద్ - దీదీ సీరియస్.. రేపిస్టులందరికి ఉరిశిక్ష
-
కోల్‌కతా డాక్టర్ ఘటన: పోలీసులకు దీదీ డెడ్‌లైన్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఆర్జీ కార్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం, హత్యోదంతంపై వైద్యులు, విద్యార్ధులు ఆందోళన ఉధృతం చేస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం దేశ వ్యాప్తంగా పలు వైద్య సేవల్ని నిలిపివేస్తున్నట్లు ది ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఇండియా ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ ఘటనపై ప్రతిపక్ష బీజేపీ.. అధికార టీఎంసీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం బాధిత కుటుంబాన్ని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కలిశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసును పోలీసులు వచ్చే ఆదివారం లోపు పరిష్కరించకపోతే.. అనంతరం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్( సీబీఐ)కి అప్పగిస్తామని అన్నారు. ఈ మేరకు ఈ ఘటనను పరిష్కరించాలని పోలీసులకు డెడ్‌లైన్ విధించారు. ఈ కేసులో ఎక్కువ మంది నిందితులు ఉంటే.. ఆదివారం లోపు అందరినీ అరెస్ట్ చేయాలని ఆదేశించారు. పోలీసులు చేసే దర్యాప్తు వేగంగా లేకపోతే కూడా సీబీఐకి అప్పగిస్తామని అన్నారు.చదవండి: చంపేశాడు... ఇంటికొచ్చి నిద్రపోయాడు! -
బంగ్లా దేశీయులకు ఆశ్రయం ఇస్తాం: సీఎం మమత
కోల్‌కతా: బంగ్లాదేశ్ నుంచి వచ్చే శరణార్థులుకు తమ రాష్ట్రం ఆశ్రయం కల్పిస్తుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ఆదివారం అధికార టీఎంసీ నిర్వహించిన అమరవీరుల దినోత్సవ ర్యాలీలో సీఎం మమత పాల్గొని మాట్లాడారు.‘‘ బంగ్లాదేశ్ పొరుగున ఉన్న దేశం.. కావున ఆ దేశం గురించి ఎటువంటి వ్యాఖ్యలు చేయలేను. బంగ్లాదేశ్ గురించి భారత ప్రభుత్వం మాట్లాడాలి. అయితే నిస్సహాయులైన ప్రజలు (బంగ్లాదేశ్‌కు చెందినవారు) బెంగాల్ తలుపు తడితే మాత్రం.. తాము కచ్చింతంగా ఆ ప్రజలకు ఆశ్రయం కల్పిస్తాం. ఐక్యరాజ్య సమితిలోనే దీనిపై నిర్మానం చేయబడి ఉంది. శరణార్థులును పొరుగుదేశం వాళ్లు గౌరవించాలని అందులో ఉంది. బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల్లో ఇబ్బంది పడుతున్న బెంగాల్ ప్రజల బంధువులకు తాము పూర్తి సహకారం అందిస్తాం’ అని సీఎం మమత తెలిపారు.Mamata Banerjee at her Best. Biggest Mass Leader West Bengal has ever seen. #ShahidDibas pic.twitter.com/QMk0H9XeNg— The Enigmous (@_TheEnigmous) July 21, 2024 ఈ ర్యాలీలో పాల్గొన్న సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ లోక్‌సభ ఎన్నికల ప్రదర్శనపై సీఎం మమత ప్రశంసలు కురిపించారు.‘‘ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఎక్కువ కాలం అధికారంలో ఉండలేదు. ఇది స్థిరమైన ప్రభుత్వం కాదు.. త్వరలోనే కూలిపోయింది. మీరు (అఖిలేష్) ఇచ్చిన లోక్ససభ ఎన్నికల ప్రదర్శనకు యూపీలో బీజేపీ ప్రభుత్వం రాజీనామా చేయాలి. కానీ, సిగ్గులేని బీజేపీ ప్రభుత్వం.. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ ఇంకా అధికారంలోనే కొనసాగుతోంది’’ అని బీజేపీపై విమర్శలు గుప్పించారామె.అనంరతం ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మాట్లాడారు. ‘‘ప్రశ్చిమ బెంగాల్ ప్రజల వలే యూపీ ప్రజలు కూడా బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఢిల్లీలో అధికారంలో కూర్చున్నవారి అధికారం కొన్నిరోజుల మాత్రమే ఉంటుంది. కేంద్రంలోని ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది’’ అని అన్నారు. బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ప్రభుత్వ అనుకూల విద్యార్థి సంఘాలకు చెందిన విద్యార్థులు, రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న ఆందోళనకారుల మధ్య జరిగిన హింసలో ఇప్పటివరకు 151 మంది ప్రాణాలు కోల్పోయారు. బంగ్లాదేశ్‌లో సంక్షోభం నెలకొన్న ఈ సమయంలో బెంగాల్ సీఎం మమత చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. -
పాతాళంలో దాక్కున్నా మిమ్మల్ని వదలం.. అమిత్ షా హెచ్చరిక
పాతాళంలో దాక్కున్నా సందేశ్ ఖాలీ దోషుల్ని వదలి పెట్టేది లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హెచ్చరించారు. పశ్చిమ బెంగాల్ నదియా జిల్లాలోని రణఘాట్ లోక్‌సభ స్థానంలోని మజ్డియాలో ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి అమిత్ షా మాట్లాడారు.సందేశ్‌ఖాలీ అంశంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎందుకు మౌనం వహిస్తున్నారని అమిత్ షా ప్రశ్నించారు. బీజేపీ అలా కాదు. ఒక్క దోషిని వదిలిపెట్టదు. వారిని తలక్రిందులుగా వేలాడదీస్తోందన్నారు. నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని సందేశ్‌ఖాలీలో టీఎంసీ నేతలపై వస్తున్న ఆరోపణలపై అమిత్ షా మాట్లాడుతూ.. మమతా బెనర్జీ, మహిళా ముఖ్యమంత్రి అయినప్పటికీ, దోషులను రక్షించడానికి ప్రయత్నించడం సిగ్గుచేటు అని అన్నారు.సందేశ్‌ఖాలీలో టీఎంసీ నేతలు వందలాది మంది అక్కాచెల్లెళ్లను మతం ఆధారంగా చిత్రహింసలకు గురిచేశారు . సందేశ్‌ఖలీ నేరస్థులను అరెస్టు చేసేందుకు మమతా దీదీ సిద్ధంగా లేరు. హైకోర్టు ఆదేశాల తర్వాత కూడా విచారణ జరగకపోవడంతో హైకోర్టు విచారణను సీబీఐకి అప్పగించిందని తెలిపారు. సందేశ్‌ఖాలీలో అఘాయిత్యాలకు పాల్పడిన వారెవరైనా.. పాతాళంలో దాక్కున్నా.. కనిపెట్టి జైల్లో పెడతాం.. ఈ దోషులను బీజేపీ శిక్షిస్తుందని అమిత్ షా పునరుద్ఘాటించారు. -
100 మందికే అనుమతి.. పశ్చిమ బెంగాల్ రాజభవన్ కీలక ప్రకటన
పశ్చిమ బెంగాల్ గవర్నర్ డాక్టర్ సీవీ ఆనంద బోస్పై మహిళా ఉద్యోగి వేధింపుల అభియోగం మోపిన నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ, ఆమె పోలీసులు మినహా 100 మందికి సంబంధిత సీసీటీవీ ఫుటేజీని చూపుతామని రాజ్ భవన్ అధికారిక ప్రకటన చేసింది.రాజ్‌భవన్‌లో జరిగే కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రజలు తమ అభ్యర్థనలు ఇమెయిల్ లేదా ఫోన్ ద్వారా పంపాలని కోరింది. మొదటి 100 మంది వ్యక్తులు గురువారం ఉదయం గవర్నర్ హౌస్ లోపల ఫుటేజీని చూడటానికి అనుమతిస్తున్నట్లు పశ్చిమ బెంగాల్ రాజ్‌భవన్ అధికారులు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్గవర్నర్సీవీ ఆనందబోస్ తననువేధింపులకు గురిచేశారంటూ ఓ మహిళ సంచలన ఆరోపణ చేసింది. ఈ మేరకు అక్కడి రాజ్ అక్కడి రాజ్‌భవన్‌లో తాత్కాలిక సిబ్బందిగా పని చేస్తున్న మహిళ స్థానికంగా ఉన్న హరే స్ట్రీట్పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఉద్యోగం విషయమై బోస్ ఆ మహిళను రెండు సార్లు పిలిచినట్లు, ఆ రెండు సందర్భాల్లోనూ వేధింపులకు గురిచేసినట్లు ఆరోపించింది. -
దొందూ.. దొందే, సీపీఐ.. కాంగ్రెస్‌పై దీదీ విమర్శలు
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బీజేపీకి.. కాంగ్రెస్, సీపీఐలు రెండు కళ్లులాంటివని సీఎం మమతా బెనర్జీ ఎద్దేవా చేశారు.మాల్దా జిల్లా ఎన్నికల ప్రచారంలో మమతా బెనర్జీ మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తోందని సీఎం మమతా బెనర్జీ పునరుద్ఘాటించారు.కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీఎంసీ పోరాటం చేస్తుందన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత భారత కూటమి ప్రభుత్వాన్ని స్థాపించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.‘బెంగాల్లో కాంగ్రెస్‌తో మాకు పొత్తు లేదు. ఇక్కడ సీపీఎం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంది. రెండూ బీజేపీతో చేతులు కలిపినట్లు, మీరు (ఓటర్లు) కాంగ్రెస్ లేదా సీపీఐ(ఎం)కి ఓటేస్తే అది బీజేపీకి వేసినట్లేనన్నారు. బీజేపీ వ్యతిరేక ఓట్లను తగ్గించుకోవడం, మోదీకి సహాయం చేయడం ఆ రెండు పార్టీల లక్ష్యమన్నారు. రాష్ట్రంలో బీజేపీకి.. కాంగ్రెస్, సీపీఐలు రెండు కళ్లులాంటివని’ దీదీ ఆరోపించారు.పశ్చిమ బెంగాల్‌లోని కాంగ్రెస్, సీపీఐ నాయకులు బీజేపీ స్వరంతో మాట్లాడుతున్నారని, రాష్ట్రంలో ప్రజాపాలనను నడుపుతున్న టీఎంసీ విధానాలకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని ఆమె అన్నారు.దేశంలో ప్రతిపక్షాల కూటమి బలంగా ఉంది. దానికి ఇండియా కూటమి అని పేరు పెట్టింది నేనే. కానీ బెంగాల్లో కూటమి ఉనికిలో లేదు. దాని రాష్ట్ర నాయకులు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని దీదీ మండిపడ్డారు. -
ఓటమి భయంతోనే ట్యాపింగ్ డ్రామా
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం తథ్యమని స్పష్టం కావడంతో చంద్రబాబు కోటరీ బెంబేలెత్తుతోంది. ప్రజల దృష్టిని మళ్లించేందుకు కొత్త పన్నాగాలు పన్నుతోంది. టీడీపీ అధికారంలో ఉండగా ఫోన్ ట్యాపింగ్ కుట్రలకు పాల్పడిన చరిత్ర ఉన్న చంద్రబాబు తిరిగి అవే ఆరోపణలతో వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై దు్రష్పచారం చేసేందుకు యత్నిస్తున్నారు. చంద్రబాబు కుమారుడు లోకేశ్ ఐ ఫోన్‌ను ట్యాపింగ్ చేస్తున్నారంటూ టీడీపీ ఎన్నికల కమిషన్ (ఈసీ)కి ఫిర్యాదు చేయడం ఆ కుట్రలో భాగమేనన్నది సుస్పష్టం. వాస్తవం ఏమిటంటే అసలు ఫోన్లు ట్యాపింగ్ చేసే టెక్నాలజీ ప్రస్తుత ఏపీ ప్రభుత్వం వద్ద లేనే లేదు. ఈ విషయాన్ని కేంద్రం కూడా ఇటీవల స్పష్టంగా చెప్పింది. అసలు వాస్తవానికి వస్తే డాటా చోరీ, ఫోన్ల ట్యాపింగ్‌లో చంద్రబాబే సిద్ధహస్తుడు. ఇందుకోసం ఆయన సీఎంగా ఉండగా ఇజ్రాయెల్ నుంచి స్పైవేర్ 2019ను కొనుగోలు చేశారన్నది బహిరంగ రహస్యం. ఆ విషయాన్ని పశ్చిమ బెంగాల్ సీఎం మమత ఆ రాష్ట్ర అసెంబ్లీలోనే వెల్లడించారు కూడా. భద్రతా చట్టాలను ఉల్లంఘించి పెగసస్ సాఫ్ట్వేర్ కొన్న చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఫోన్ ట్యాపింగ్ జాడ్యానికి ఆద్యుడు చంద్రబాబే. 2004 ఎన్నికల్లో అప్పటి సీఎంగా ఉన్న ఆయన ప్రతిపక్ష నేతల ఫోన్ల ట్యాపింగ్ కోసం ఏకంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన తరువాత 2014లో ఆంధ్రప్రదేశ్‌కు సీఎం అయిన చంద్రబాబు మరోసారి ఫోన్ ట్యాపింగ్ అక్రమాలకు పాల్పడ్డారు. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు నేతృత్వంలో ప్రత్యేకంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేశారు. వైఎస్సార్సీపీ నేతల ఫోన్ల ట్యాపింగ్‌తోపాటు ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడటం ఆ వ్యవస్థ లక్ష్యం. ఐటీ గ్రిడ్స్ అనే ప్రైవేటు కంపెనీ, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు కుమారుడు భాగస్వామిగా ఉన్న ఆకాశ్ ఎంటర్ప్రైజెస్ కంపెనీల ద్వారా ఏరోస్టాట్ బెలూన్లు, ఇతర ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ కొనుగోలుకు ఇజ్రాయెల్‌కు చెందిన పెగసస్‌తో సంప్రదింపులు జరిపారు. అందుకోసం ఏబీవీ బృందం ఇజ్రాయెల్‌లో పర్యటించింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం విదేశీ కంపెనీల నుంచి ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ కొనాలంటే కేంద్ర రక్షణ శాఖ అనుమతి తప్పనిసరి. జాతీయ భద్రత చట్టాన్ని సైతం చంద్రబాబు ప్రభుత్వం ఉల్లంఘించింది. రక్షణ శాఖకు సమాచారం ఇవ్వకుండానే ఐటీ గ్రిడ్స్ కంపెనీ ద్వారా ఫోన్ ట్యాపింగ్ పరికరాలు కొనుగోలు చేసి, వాటిని టీడీపీ కార్యాలయాల్లో పెట్టుకుంది. 35 లక్షల మంది డేటా చౌర్యం అక్రమంగా కొన్న ఫోన్ ట్యాపింగ్, డేటా చౌర్యం సాఫ్ట్‌వేర్‌తో చంద్రబాబు ప్రభుత్వం బరితెగించింది. అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌తో పాటు వైఎస్సార్సీపీకి చెందిన 65 మంది నేతల ఫోన్ల ట్యాపింగ్‌కు పాల్పడింది. దీనిపై పూర్తి ఆధారాలతో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2019 ఎన్నికలకు ముందు వివిధ కేసుల దర్యాప్తు ముసుగులో ఏకంగా వైఎస్సార్సీపీకి చెందిన 150 మంది ఫోన్లను ట్యాప్ చేయడం చంద్రబాబు దుర్మార్గ రాజకీయాలకు నిదర్శనం. మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన ప్రజా సాధికార సర్వే ద్వారా సేకరించిన ఓటర్ల సమాచారం మొత్తాన్ని టీడీపీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం రూపొందించిన సేవా మిత్ర యాప్‌నకు అనుసంధానించారు. ఇలా రాష్ట్రంలోని ఓటర్ల వ్యక్తిగత సమాచారం చౌర్యానికి పాల్పడ్డారు. మరోవైపు టీడీపీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉన్న 35 లక్షల మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించేందుకు కుట్ర పన్నారు. ఈ కుట్రకు వ్యతిరేకంగా అప్పట్లోనే వైఎస్సార్సీపీ ఆందోళనలు చేసింది. పోలీసులు, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పూర్తి ఆధారాలతో ఫిర్యాదులు చేసింది. నిగ్గు తేల్చిన శాసన సభ ఉప సంఘం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ ప్రభుత్వం చేసిన డేటా చౌర్యంపై విచారణకు శాసన సభ ఉప సంఘాన్ని నియమించింది. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి నేతృత్వంలోని ఈ కమిటీ హోం, ఆర్థిక, సమాచార–పౌర సంబంధాల శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులను విచారించింది. అప్పటి సీఎం చంద్రబాబు ఆదేశాలతోనే తాము ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని టీడీపీ సేవా మిత్ర యాప్‌నకు బదీలీ చేశామని ఆ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇజ్రాయెల్ నుంచి ఫోన్ ట్యాపింగ్, డేటా చౌర్యం సాఫ్ట్‌వేర్‌ను అక్రమంగా కొన్న మాట వాస్తవమేనని, అందుకే ఆ దేశంలో పర్యటించామని తెలిపారు. ఈ వ్యవహారంపై శాసన సభా ఉప సంఘం మధ్యంతర నివేదికను కూడా శాసన సభకు సమరి్పంచింది. ఐ ఫోన్‌ను ట్యాప్ చేసే టెక్నాలజీ ఏపీ వద్ద లేదు ఫోన్ల ట్యాపింగ్ అంశంపై కేంద్ర హోమ్ శాఖ ఇటీవల కీలక ప్రకటన చేసింది. ఐ ఫోన్లను ట్యాప్ చేసే టెక్నాలజీ ఏపీ ప్రభుత్వం వద్ద లేదని తెలిపింది. ఆ టెక్నాలజీ కేంద్ర హోం, రక్షణ శాఖల వద్దే ఉంది. ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించడం, దేశ భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం అత్యున్నతస్థాయిలో ఆ పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. మరి లోకేశ్ ఐ ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారని యాపిల్ కంపెనీ అలెర్ట్ మెస్సేజ్ పంపిందని టీడీపీ అంటోంది. అంటే లోకేశ్ ఫోన్‌ను ట్యాప్ చేసే అవకాశం కేంద్ర ప్రభుత్వానికే ఉందని పరిశీలకులు చెబుతున్నారు. మరి కేంద్ర ప్రభుత్వాన్నిగానీ, బీజేపీనిగానీ ప్రశ్నించే ధైర్యం టీడీపీకి ఉందా? బీజేపీ నేతలతో సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్న చంద్రబాబు ఆ సమయంలోనే వారిని లోకేశ్ ఫోన్ ట్యాపింగ్‌పై నిలదీయవచ్చు. చంద్రబాబు అంత ధైర్యం చేయగలరా? కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈసీకి ఫిర్యాదు చేస్తారా? లేకపోతే తాము వైఎస్సార్సీపీపై చేస్తున్న ఆరోపణలను ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్తారా? చంద్రబాబు పెగసస్ సాఫ్ట్వేర్ కొన్నారు: మమతా బెనర్జీ ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం రూ.25 కోట్లు వెచ్చించి పెగసస్ నుంచి అక్రమంగా ఫోన్ ట్యాపింగ్, డేటా చౌర్యం సాఫ్ట్వేర్ కొన్నారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా ప్రకటించడం జాతీయ స్థాయిలో పెను సంచలనం సృష్టించింది. 2022లో పశ్చిమ బెంగాల్ శాసన సభలో ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ డేటా చౌర్యం సాఫ్ట్వేర్ కొనాలని పెగసస్ కంపెనీ ప్రతినిధులు తనను సంప్రదించినా, తిరస్కరించినట్టు వెల్లడించారు. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఆ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసిందని, మీరు కూడా కొనాలంటూ ఆ సంస్థ ప్రతిపాదించిందని తెలిపారు. చట్ట విరుద్ధమైన ఆ పనిని తాను చేయలేనని తిరస్కరించానని ఆమె చెప్పారు. ఇవన్నీ చంద్రబాబు కుతంత్రాలను బయటపెట్టే వాస్తవాలు. -
మమతా బెనర్జీ గాయంపై వైద్యుల అనుమానాలు
సాక్షి, కోల్‌కతా : తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇంట్లో ప్రమాదవశాత్తు జారిపడలేదని, గుర్తు తెలియని అంగతకులు వెనుక నుంచి నెట్టడం వల్ల ఆమె తల, ముక్కు భాగాల్లో తీవ్ర గాయాలైనట్లు ఎస్కేఎం ప్రభుత్వ ఆస్పత్రి డైరెక్టర్ అనుమానం వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం 7.30 గంటలసమయంలో మమతా బెనర్జీ కాళీగట్లో తన నివాసంలో కింద పడ్డారు. అయితే సిబ్బంది అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రిలోని వుడ్‌బర్న్ వార్డ్‌లో చేర్చారు. పలు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు దీదీ నుదిటిపై 3కుట్లు, ముక్కుపై ఒక కుట్టు వేశారు. మల్టీడిసిప్లినరీ వైద్య బృందం సిఫార్సు మేరకు సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ చేయించారు. రాత్రి 9:45 గంటలకు, ఆమె డిశ్చార్జ్ అయ్యి ఇంటికి తిరిగి వెళ్లారు. ఈ తరుణంలో పశ్చిమ బెంగాల్ సీఎం ఇంట్లో పడిపోవడం వల్లే గాయమైందని అందరూ అనుకున్నారు. కానీ మమతా బెనర్జీ తీవ్ర గాయాలు పాలు కావడం వెనుక కోట్ర దాగినట్లు సమాచారం. ఎస్ఎస్కేఎం డైరెక్టర్ మణిమోయ్ బంద్యోపాధ్యాయ ఈ సంఘటనకు గల కారణాల్ని వెల్లడించారు. సీఎం తనకు తానుగా పడిపోవడం వల్ల జరిగే గాయాలకంటే.. ఆమె వెనుక నుంచి ఎవరో బలవంతంగా నెట్టడం వల్లే నుదిటికి, ముక్కుకి గాయాలయ్యే అవకాశం ఉందని తెలిపారు. కానీ ప్రమాదానికి గల కారణాల్ని నిర్ధారించలేదు. ఈ సందర్భంగా ఈసీజీ, సిటిస్కాన్ చేసినట్లు చెప్పిన ఆయన.. వైద్యుల పర్యవేక్షణ కోసం ఆస్పత్రిలో ఉండాలని సూచించామని, కానీ ఆమె ఇంటికి వెళ్లేందుకు ఇష్టపడినట్లు తెలిపారు. ఇక శుక్రవారం వరకు ఆమెకు వైద్య పరీక్షలు కొనసాగుతాయని తెలిపారు. మరోవైపు మమత కోడలు, తృణమూల్ కౌన్సిలర్ కజారీ బెనర్జీ దీదీకి గాయాలు కావడంపై అనుమానం వ్యక్తం చేశారు. దీదీ పడిపోయింది అని విన్నాను. ఎవరో నెడితేనే తీవ్రగాయాయ్యాయని అన్నారు. కాగా, గురువారం సాయంత్రం, దివంగత తృణమూల్ నాయకుడు సుబ్రతా ముఖర్జీ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఆమె కాళీఘాట్ ఇంటికి కొద్ది దూరంలో ఉన్న దక్షిణ కోల్‌కతాలోని గరియాహట్ సమీపంలో జరిగిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఇంటికి తిరిగి వచ్చిన కొద్దిసేపటికే ఆమె కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. -
తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీకి ఝలక్
తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీకి మరో ఝలక్. త్వరలో పశ్చిమ బెంగాల్ బారక్పూర్ లోక్‌సభ నియోజకవర్గం సిట్టింగ్ ఎంపీ అర్జున్ సింగ్ పార్టీని వీడనున్నారు. 2019లో అర్జున్ సింగ్ టీఎంసీ నుండి బీజేపీలో చేరారు. బీజేపీ నుంచి బరాక్‌పూర్ లోక్‌సభ సీటును దక్కించుకున్నారు. ఎన్నికల్లో గెలిచారు. అయితే 2022లో బీజేపీని వీడి మళ్లీ టీఎంసీకి వచ్చారు. ఇప్పుడు ఆయనే తిరిగి బీజేపీలో చేరనున్నారు. అందుకు ఊతం ఇచ్చేలా టీఎంసీ అధినేత్రి దీదీ సీఏఏ చట్టాన్ని వ్యతిరేకిస్తుంటే బారక్పూర్ ఎంపీ మాత్రం స్వాగతించారు. సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్(సీఏఏ)పై కేంద్రం తీసుకున్న నిర్ణయం తనకు సంతోషంగా ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఏఏ అమలుతో 2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాలే మళ్లీ రిపీట్ అవుతాయని జోస్యం చెప్పారు. దీంతో ఆయన టీఎంసీ నుంచి బీజేపీలోకి చేరడం ఖాయమని ఆ రాష్ట్ర రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా, 2019 లోక్‌సభ ఎన్నికల్లో కమలం అనూహ్యంగా పుంజుకుంది. ఏకంగా 41 శాతం ఓటింగ్‌తో 42 స్థానాల్లో 18 స్థానాల్ని కైవసం చేసుకుంది. అధికార పార్టీ టీఎంసీ అదే ఎన్నికల్లో 42 శాతం ఓటింగ్‌తో 22 స్థానాల్లో గెలుపొందింది. అర్జున్ సింగ్‌కు నో టికెట్ టీఎంసీ ఇటీవల మొత్తం 42 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కానీ బరాక్‌పూర్ నుండి అర్జున్ సింగ్‌కు టికెట్ నిరాకరించింది. పార్లమెంటరీ ఎన్నికల నుంచి తప్పుకున్న వారికి అసెంబ్లీ ఎన్నికల్లో స్థానం కల్పిస్తామని పార్టీ పేర్కొంది. అయితే, బలమైన వ్యక్తిగా పరిగణించబడుతున్న అర్జున్ సింగ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చని సూచించాడు. మీరు పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తారా అని అడిగినప్పుడు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అనేది కాలమే చెబుతుంది అని అన్నారు. -
కేంద్రం ఆధార్ కార్డులను డీయాక్టివేట్ చేస్తోందా?
న్యూఢిల్లీ: ఆధార్ కార్డ్ తొలగింపులంటూ వస్తున్న ఆరోపణలపై భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI)కీలక వ్యాఖ్యలు చేసింది. ఆధార్ డేటా బేస్ ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తామని, తమ నుంచి ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే ప్రజలకు సమాచారం అందిస్తామని తెలిపింది. అంతే తప్పా.. ఆధార్ కార్డులను ఎట్టి పరిస్థితుల్లో తొలగించమని యూఐడీఏఐ స్పష్టం చేసింది. ప్రజాప్రయోజనాల కోసం ఆధార్ కార్డ్ అత్యవసరం. కాబట్టే, ఆధార్ డేటాబేస్ ఖచ్చితత్వాన్ని కొనసాగిస్తూ, కార్డు దారులు మార్పులు చేసుకుంటుంటే సంబంధిత డాక్యుమెంట్లు, ఇతర సమాచారం డేటాబేస్‌లో ఎప్పటికప్పుడు అప్ డేట్ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. అయినప్పటికీ ఆధార్ కార్డ్ దారులు సమస్యలు తలెత్తితే యూఐడీఏఐకి ఫిర్యాదు చేయాలని కోరింది. రాష్ట్రం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందకుండా ఉండేలా యూఐడీఏఐ ద్వారా కేంద్రం ఆధార్ కార్డ్ లను డీయాక్టీవేట్ చేస్తుందన్న వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపణలు చేసిన నేపథ్యంలో యూఐడీఏఐ పై విధంగా స్పందించింది. కుట్రపూరితంగా కేంద్రం కేంద్రం కుట్రపూరితంగా తమ రాష్ట్ర ప్రజల ఆధార్ కార్డ్ లను నిరుపయోగం చేస్తుందని వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ యూఐడీఏఐపై పలు ఆరోపణలు చేశారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తమ రాష్ట్రంలోని ప్రజలు వివిధ సామాజిక సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందకుండా నిరోధించేలా వారి ఆధార్ కార్డ్ లను డీయాక్టీవ్ చేసిందని అన్నారు. బీర్ భూమ్ జిల్లాలో జరిగిన ప్రజా పంపిణీ కార్యక్రమంలో మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ఆధార్ కార్డు లేని లబ్ధిదారులతో సంబంధం లేకుండా ప్రభుత్వం నిర్వహించే సంఓేమ కార్యక్రమాలను తమ ప్రభుత్వం కొనసాగిస్తుందని చెప్పారు. ఆందోళన వద్దు..మీకు నేనున్నా బెంగాల్ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ కోసం నేను ఉన్నాను. జాగ్రత్తగా ఉండండి. వారు (కేంద్రాన్ని ఉద్దేశిస్తూ) ఆధార్ కార్డ్ లను డీయాక్టీవేట్ చేస్తున్నారు. బెంగాల్ లోని అనేక జిల్లాల్లో అనేక ఆధార్ కార్డ్ లు డీయాక్టీవేట్ అయ్యాయి. లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రజలు ఉచిత రేషన్, బ్యాంకుల ద్వారా లక్ష్మీ భండార్ పథకం ప్రయోజనాలను పొందకూడదనేదే కేంద్రం ఉద్దేశమని, దీనిని తెలుసుకోవాలని ప్రజలను కోరారు. తన ప్రభుత్వం ఆధార్ కార్డు లేనివారికి సైతం పథకాలను అందించడం కొనసాగిస్తుందని భరోసా ఇచ్చారు. పుర్బా బర్ధమాన్ జిల్లా పరిధిలోని జమాల్‌పూర్‌లో 50 మంది, బీర్భూం, నార్త్, సౌత్ 24 పరగణాలు జిల్లాతో పాటు ఉత్తర బెంగాల్లో అనేక మంది లబ్ధిదారుల ఆధార్ కార్డులు డీలింక్ చేసినట్లు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. -
బీజేపీని అడ్డుకునే శక్తి వారికి మాత్రమే ఉంది: కేటీఆర్ వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీని ఆపగలిగే శక్తి కేవలం బలమైన ప్రాంతీయ రాజకీయ శక్తులకే ఉందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి వల్లే ఇండియా కూటమి చెల్లాచెదురవుతోందని దుయ్యబట్టారు. ఇది, బీజేపీకే లాభం అంటూ కామెంట్స్ చేశారు. కాగా, తాజాగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా కేటీఆర్..‘కాంగ్రెస్ పార్టీకి డబ్బుంటే వారణాసిలో పోటీ చేసి గెలవాలని, కాంగ్రెస్ పార్టీ తనకున్న 40 స్థానాలను కూడా ఈసారి నిలబెట్టుకునే అవకాశం లేదంటూ కాంగ్రెస్ పార్టీపై మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి వల్లనే ఇండియా కూటమి చెల్లాచెదురు అవుతోంది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. I completely concur with Didi. Congress should introspect on how its attitude has resulted in implosion of the proposed INDIA alliance Instead of taking on the BJP in UP & Gujarat (where it is a direct face-off) and making something out of it, Congress ends up playing spoiler… https://t.co/7WSIgBlRtG — KTR (@KTRBRS) February 3, 2024 గుజరాత్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో బీజేపీతో నేరుగా పోటీ పడాల్సి ఉన్న కాంగ్రెస్, ఆ రాష్ట్రాలను వదిలిపెట్టి ఇతర రాష్ట్రాల్లో ఇతర పార్టీలతో పోటీ పడుతోంది. దీంతో బీజేపీకి లాభం చేకూరుతుంది. ఇండియా కూటమిలోని పార్టీల గెలుపు అవకాశాలను దెబ్బతీసేలా కాంగ్రెస్ వ్యవహరిస్తుంది. నిజానికి బీజేపీని ఆపగలిగే శక్తి కేవలం బలమైన ప్రాంతీయ రాజకీయ శక్తులకే ఉంది. మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, స్టాలిన్, కేసీఆర్ వంటి బలమైన నాయకులే దేశంలో బీజేపీని అడ్డుకోగలరు. బీజేపీకి కాంగ్రెస్ ఏ మాత్రం ప్రత్యామ్నాయం కాదు’ అంటూ కామెంట్స్ చేశారు. -
మహువా మొయిత్రా వివాదం: తొలిసారి మౌనం వీడిన మమత
కోలకతా: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాను లోక్‌సభ నుండి బహిష్కరణ వివాదంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తొలిసారి స్పందించారు. పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలపై ఎట్టకేలకు మౌనం వీడిన దీదీ ఇదంతా ముందస్తు ప్లాన్ ప్రకారం జరిగిన కుట్ర అని బీజేపీపై మండి పడ్డారు. అయితే ఇది వచ్చే ఏడాది (2024) ఎన్నికల ముందు మహువాకే సాయం చేస్తుందని వ్యాఖ్యానించారు. గురువారం కోల్‌కతాలో జరిగిన ఒక కార్యక్రమంలో టీఎంసీ చీఫ్ మమత, మహువా మొయిత్రాకు మద్దతుగా నిలిచారు. వివిధ కేసులలో తమ పార్టీ నాయకులను అరెస్టు చేసిన తర్వాత, లోక్‌సభ నుంచి మొయిత్రాను బహిష్కరించే అవకాశం ఉందని, మొయిత్రాను లోక్‌సభ నుంచి తప్పించాలనేదే బీజేపీ ప్లాన్ అని, అయితే ఈ కుట్రలు మహువా మరింత పాపులర్ కావడానికి దోహద పడతాయని పేర్కొన్నారు. ఇపుడామె బయట మాట్లాడగలుతున్నారన్నారు. అంతేకాదు కేంద్రంలో బీజేపీకి రోజులు దగ్గర పడ్డాయని,కేవలం మూడు నెలలు మాత్రమే మోదీ సర్కార్ ఉంటుందన్నారు. అంతేకాదు ప్రత్యర్థి నాయకులే లక్ష్యంగా దాడులు చేస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎన్నికల తరువాత బీజేపీని వెంటాడుతాయంటూ జోస్యం చెప్పారు. కాగా పార్లమెంటులో ప్రశ్నలడగటానికి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుండి లంచం తీసుకున్నట్లు ఆరోపణలు పెను దుమారాన్ని రాజేశాయి. దీనిపై బీజేపీ ఎంపీ వినోద్ కుమార్ సోంకర్ అధ్యక్షతన ఏర్పాటైన 15 మంది సభ్యుల ఎథిక్స్ కమిటీ మహువాను లోక్‌సభ నుంచి సస్పెండ్ చేయాలని సిఫారసు చేసింది. Kolkata | West Bengal CM Mamata Banerjee says "Their (BJP) plan is to remove Mahua Moitra (from Lok Sabha). This will help her become more popular before the elections. What she used to speak inside (Parliament), now she will speak outside..." pic.twitter.com/V10seOqprj — ANI (@ANI) November 23, 2023 -
ముగిసిన ప్రతిపక్షాల భేటీ.. మమతా బెనర్జీ ఏమన్నారంటే..
-
ఫలితాలు రానేలేదు .. ప్రశాంత్ కిషోర్‌పై సంచలన ఆరోపణలు
పనాజీ: రాజకీయ సలహాదారు ప్రశాంత్ కిషోర్, గోవా తృణముల్ కాంగ్రెస్ చీఫ్ కిరణ్ కండోల్కర్ మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. కండోల్కర్.. ప్రశాంత్ కిషోర్‌పై సంచలన ఆరోపణలు గుప్పించారు. ఫిబ్రవరి 14వ తేదీన గోవాలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరిగింది. అయితే, ఈ ఎన్నికల్లో తృణముల్ కాంగ్రెస్‌కు ఎన్నికల సలహాదారులుగా ప్రశాంత్ కిషోర్ బృందం వ్యవహరించింది. ఇదిలా ఉండగా కిరణ్ కండోల్కర్ మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ సలహాదారు I-PAC(ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ) తమ పార్టీ అభ్యర్థులను విడిచిపెట్టిందని విమర్శించారు. కాగా, ప్రశాంత్ కిషోర్, అతని బృందం తీరుతో కలత చెందానని అన్నారు. ఈ క్రమంలోనే తాను తృణమూల్ కాంగ్రెస్ గోవా యూనిట్ చీఫ్ పదవిని వదులుకోవడం లేదని స్పష్టం చేశారు. అయితే, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మమతా బెనర్జీ నేతృత్వంలోని పార్టీకి I-PAC (ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ) సాయం అందించిన విషయం తెలిసిందే. మరోవైపు, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో తృణముల్ కాంగ్రెస్.. మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (ఎంజిపి)తో పొత్తు పెట్టుకుని పోటీ చేసింది. కండోల్కర్.. ఆల్డోనా అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయగా, అతని భార్య కవిత తృణమూల్ టిక్కెట్‌పై థివిమ్ నుండి పోటీ చేశారు. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరుగనుంది. -
టీఎంసీ సీనియర్ నేత కన్నుమూత.. ఆవేదనలో సీఎం మమత బెనర్జీ
కోల్కత్తా: మాజీ మంత్రి, తృణముల్ కాంగ్రెస్ సీనియర్ నేత సాధన్ పాండే(71) ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పాండే ముంబైలోని ఆసుపత్రిలో చిక్సిత పొందుతూ మృతి చెందినట్టు ఆయన కూతురు శ్రేయ వెల్లడించారు. కాగా, పాండే మృతిపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. సీనియర్ లీడర్, కేబినెట్ మంత్రి పాండే మరణం ఎంతగానో బాధించిదన్నారు. సాధన్ పాండేతో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని ఆమె గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే పాండే కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. అనంతరం సీనియర్ నేత సలహాలను తాము కోల్పోయామంటూ మమత ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఆయన మృతిపట్ల బెంగాల్ గవర్నర్ సహా, జగదీప్ ధన్కర్ సహా టీఎంసీ నేతలు సంతాపం తెలిపారు. ఇక, సాధన్ పాండే ఉత్తర కోల్‌కత్తాలోని బుర్టోలా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2011 వరకు ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. -
పోస్టర్ కలకలం.. మోదీని అవమానిస్తూ అలా పెట్టారు.. ఎక్కడో తెలుసా?
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్లో అధికార తృణముల్ కాంగ్రెస్(టీఎంసీ), బీజేపీ పార్టీల మధ్య ఎన్నికల వేడి ఇంకా తగ్గలేదు. ఇప్పటికే పలు చోట్ల ఈ రెండు పార్టీల నేతల మధ్య భౌతిక దాడులు సైతం చోటుచేసుకున్నాయి. తాజాగా మరో వివాదం బెంగాల్లో తెరపైకి వచ్చింది. బెంగాల్ జిల్లాలోని మిడ్నాపూర్‌లో ఓ పోస్టర్ కలకలం సృష్టించింది. ఈ పోస్టర్లో ప్రధాని నరేంద్ర మోదీని 'మహిషాసురుడు'గా, బెంగాల్ సీఎం మమతా బెనర్జీని 'దుర్గ'గా చూపిస్తూ పోస్టర్‌ను అంటించారు. ఈ పోస్టర్లో గొర్రెలుగా కాంగ్రెస్, సీపీఎం పార్టీలను పోల్చారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర దుమారం చెలరేగింది. ఈ పోస్టర్‌పై ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. బెంగాల్లో 108 మున్సిపాలిటీలకు ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పోస్టర్ రాష్ట్రంలో రాజకీయంగా వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనపై బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తుందని స్థానిక కమలం నేత విపుల్ ఆచార్య తెలిపారు. కాగా, ఈ పోస్టర్‌ను ఎవరు అంటించారో తనకు తెలియదంటూ స్థానిక వార్డ్ మెంబర్ అనిమా సాహా(టీఎంసీ) వెల్లడించారు. -
ఈ డీ విచారణకు హాజరైన దీదీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ
-
ప్రధాని మోదీతో మమతా బెనర్జీ భేటీ
-
పెగాసస్ కుంభకోణంపై మమతా బెనర్జీ సంచలన నిర్ణయం
-
ప్రధాని మోదీకి మామిడి పండ్లు పంపిన దీదీ
కోలకతా: దేశ రాజకీయాల్లో ప్రధాని నరేంద్ర మోదీని సైతం ఢీకొట్టి నిలిచే ధైర్యం ఎవరికైనా ఉందంటే పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జినే అని చెప్పాలి. ప్రత్యర్థులపై తనదైన మాటల దాడితో విరుచుకుపడటంలో మమతకు మరెవరు సాటిలేరనే సంగతి తెలిసిందే. రాజకీయాల పరంగా ఎంత సూటిగా, ఘాటుగా వ్యవహరిస్తారో అలానే సంప్రదాయాల పరంగానూ అదే తీరు కనుబరుస్తారని నిరూపించారు దీదీ. తాజాగా మమత ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక మామిడి పండ్లను బహుమతిగా పంపారు. 2011లో తొలిసారి సీఎం అయిన నాటి నుంచి ఈ సంప్రదాయాన్ని ఆమె కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా హిమసాగర్, మాల్డా, లక్ష్మణ్‌భోగ్ వంటి ప్రత్యేక రకాల మామిడి పండ్లను మోదీకి పంపారు. కాగా ఈ వరుసలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కూడా ఆమె పశ్చిమ బెంగాల్ మామిడి పండ్లను బహుమతిగా పంపారు. చదవండి: అమ్మపార్టీలో.. చిన్నమ్మ భయం -
నందిగ్రామ్ ఎన్నికల ఫలితాల విచారణ వాయిదా
-
ప్రధాని బెంగాల్ పర్యటనలో రాజకీయ వివాదం
కోల్‌కతా: ‘యాస్’ తుపాను కారణంగా ఒడిశా,పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయాయి. దీనిలో భాగంగా ఒడిశా, పశ్చిమబెంగాల్లోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం ప్రధాని మోదీ.. పశ్చిమబెంగాల్లో తుఫాన్ పరిస్థితిపై అక్కడి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్కర్, ముఖ్యమంత్రి మమతాబెనర్జి కూడా హాజరు కావాల్సి ఉండగా ఆమె సుమారు అరగంట ఆలస్యంగా వచ్చారు. అనంతరం మమత రెండు పేజీల నివేదిక ఇచ్చి త్వరగానే వెనక్కి వెళ్లిపోయారు. శుక్రవారం బెంగాల్ ప్రాంతాలలో ‘యాస్’ తుపాను వల్ల కలిగిన నష్టాన్ని అంచనా వేయడానికి ఇరువురు నాయకులు సమీక్షా సమావేశం నిర్వహించాల్సి ఉంది. మమత ఈ అంశంపై స్పందిస్తూ.. ప్రధానమంత్రి సమావేశానికి పిలిచారు.. కానీ నా కార్యలయానికి ఆ సమాచారం చేరలేదు. ఈ కారణంగా నేడు దిఘాలో ఒక సమావేశనికి హాజరయ్యాను. కానీ నేను కలైకుండకు వెళ్లి తుపాను నష్టానికి సంబంధించిన నివేదిక అందజేసిన అనంతరం ప్రధాని అనుమతితో తిరిగి వెళ్ళినట్లు తెలిపింది. కాగా సీఎం తీరుపై బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్కర్ అసహనం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. It would have served interests of state and its people for CM and officials @MamataOfficial to attend Review Meet by PM. Confrontational stance ill serves interests of State or democracy. Non participation by CM and officials not in sync with constitutionalism or rule of law.— Governor West Bengal Jagdeep Dhankhar (@jdhankhar1) May 28, 2021 చదవండి: ‘కరోనాకు గేట్లు తెరిచిన మోదీ: లెక్కలన్నీ అబద్ధం’ -
‘దీదీ ఓ దీదీ సినిమా..’ ఆర్జీవీ వైరల్ వీడియో..!
బెంగాల్ దంగల్‌లో మమతా బెనర్జీ విజయకేతనం ఎగరవేసింది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 213 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. ఎన్నికల్లో మోదీ, అమిత్ షా ద్వయం వ్యూహాలు బెడిసికొట్టాయి. బెంగాల్ ప్రజలు తిరిగి దీదీకే పట్టం కట్టారు. నందిగ్రామ్‌లో మమత ఓడిపోయినప్పటీకి, తిరిగి మూడోసారి బెంగాల్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనుంది. కాగా, ఈ ఎన్నిక ఫలితాలపై రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగిందనే విషయాన్ని ట్విటర్లో వీడియో రూపంలో పోస్ట్ చేశారు. ఈ వీడియోకు ట్విటర్లో ‘దీదీ ఓ దీదీ సినిమా.. కథనాయకులు ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, మమతా బెనర్జీ’ అంటూ రాసుకొచ్చారు. వీడియోలో ఒంటరిగా వెళ్తున్న మహిళను ఇద్దరు ఆగంతకులు బైక్‌పై వచ్చి, ఆ మహిళ దగ్గర ఉన్న బ్యాగును లాక్కోవడానికి ప్రయత్నిస్తారు. తెలివిగా ఆ మహిళ తన దగ్గర ఉన్న బ్యాగును దూరంగా విసిరేసి, వారు బ్యాగును తీసుకోవడానికి వెళ్లేలా ఆగంతకుల దృష్టి మరల్చి వారి బైకును తీసుకొని పారిపోయింది. దీంతో ఆగంతకులు బిత్తరపోయి, ఒకరి మోహాళ్లు ఒకరు చూసుకుంటారు. అటువైపుగా వెళ్తున్న వారి నుంచి ఆ మహిళ బైక్‌పై తిరిగి వచ్చి తన బ్యాగును తీసుకొనిపోతుంది. ఆర్జీవీ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను ఈ వీడియోతో పోల్చారు. ఈ వీడియోను చూసి నెటిజన్లు పడిపడి నవ్వుకుంటున్నారు. DIDI O DIDI film ..starring Mamta,Modi and Amit pic.twitter.com/eNaRGT9wkS — Ram Gopal Varma (@RGVzoomin) May 2, 2021 చదవండి: నారా లోకేష్‌పై ఆర్జీవీ సంచలన కామెంట్లు..! -
కాల్పుల ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు మమతా బెనర్జీ పరామర్శ
-
అది నేతాజీని అవమానించడమే
సోనార్పూర్: బీజేపీ నాయకులను బయటి వారంటూ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ చేస్తున్న వ్యాఖ్యలపై ప్రధాని మోదీ మండిపడ్డారు. అలాంటి వ్యాఖ్యలు చేయడం నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆదర్శాలను, భారత రాజ్యాంగ విలువలను అవమానించడమేనన్నారు. బీజేపీ గెలిస్తే ఈ గడ్డపై పుట్టినవారే సీఎం అవుతారన్నారు. బెంగాల్లో శనివారం ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొన్నారు. ‘బ్రిటిషర్లు భారత్‌ను విభజించాలని చూసినప్పుడు భారతదేశం అంతా ఒక్కటే. భారతీయుల ఆకాంక్షలు ఒక్కటే అని నేతాజీ స్పష్టం చేశారు. కానీ ఇప్పుడు నేతాజీ ఆదర్శాలను, సిద్ధాంతాలను ప్రచారం చేయడానికి బదులుగా బయటివారు అంటూ దీదీ మాట్లాడుతున్నారు’ అని మోదీ వ్యాఖ్యానించారు. భారతీయులంతా భరతమాత పిల్లలని, భారతీయులెవరూ ఇక్కడ బయటివారు కాదని స్పష్టం చేశారు. ‘మీ గూండాలకు జాగ్రత్తగా ఉండమని చెప్పండి. మోదీ వచ్చాడు.. మీ ఆటలు సాగవని వారికి చెప్పండి’ అని మమతకు సూచించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మమతా బెనర్జీ మోదీకి పోటీగా వారణాసిలో పోటీ చేస్తారన్న వార్తలను ప్రస్తావిస్తూ.. దాంతో మమత దీదీ ఇక్కడ ఓటమిని అంగీకరించినట్లు స్పష్టమైందన్నారు. యూపీ, వారణాసి ప్రజలు బెంగాలీల మాదిరిగానే సహృదయులని, మమతను వారు బయటి వ్యక్తి అని అవమానించబోరని ఎద్దేవా చేశారు. ‘మమతా బెనర్జీ తరచూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని విమర్శిస్తున్నారు. ఆటగాళ్లు అంపైర్‌ను తప్పుబడితే.. ఆట ముగిసినట్లే అన్న విషయం మీకు తెలుసు కదా’ అని మోదీ హూగ్లీ జిల్లాలో జరిగిన ఒక ప్రచార సభలో వ్యాఖ్యానించారు. సింగూర్‌లో టాటా నానో కారు ప్లాంట్‌ను అడ్డుకోవడాన్ని గుర్తు చేస్తూ.. మమతా బెనర్జీ, టీఎంసీల నిరోధక మనస్తత్వం కారణంగా రాష్ట్రంలో అభివృద్ధి నిలిచిపోయిందని మోదీ పేర్కొన్నారు. అభివృద్ధిని అడ్డుకుని, అదే గొప్పగా చెప్పుకునే పార్టీని ఎక్కడా చూడలేదన్నారు. అస్సాంలో.. ఇంకా లొంగిపోని మిలిటెంట్లు జనజీవన స్రవంతిలో కలవాలని మోదీ కోరారు. అస్సాంలోని బోడోలాండ్ టెరిటోరియల్ రీజియన్‌లో ఉన్న బక్సా జిల్లాలో శనివారం ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొన్నారు. మిగిలిన మిలిటెంట్లు కూడా ప్రధాన స్రవంతిలోకి రావాలని, అది ఆత్మనిర్బర్ అస్సాంకు అవసరమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ హింసను ప్రోత్సహించిందని, అయితే, రాష్ట్ర ప్రజలు అభివృద్ధికి, శాంతికి, సుస్థిరతకు ఓటేశారని వ్యాఖ్యానించారు. బీజేపీ సభలకు పెద్ద ఎత్తున మహిళలు రావడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. కోక్రాగఢ్ జిల్లాలో గురువారం జరిగిన సభకు కూడా మహిళలు భారీగా రావడంపై ఒక విశ్లేషకుడిని ప్రశ్నించగా.. తమ పిల్లలు ఇక మళ్లీ ఆయుధాలు పట్టి అడవుల్లోకి వెళ్లరనే విశ్వాసంతో వారు బీజేపీకి మద్దతిస్తున్నారని ఆయన చెప్పారని మోదీ వివరించారు. -
కేంద్ర బలగాల అదుపులో నందిగ్రామ్: ఈసీ
సాక్షి, న్యూఢిల్లీ: నందిగ్రామ్ ఈ పేరు పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు మెదలైనప్పటి నుంచి ఎదో ఓ రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. దశాబ్దాల వామపక్ష పాలనకు చరమగీతం పాడుతూ, మమతా బెనర్జీని అధికార పీఠంపై కూర్చోపెట్టడంలో కీలకంగా మారిన నందిగ్రామ్.. 14 ఏళ్ల తర్వాత మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో కేంద్ర బిందువైంది. పశ్చిమ బెంగాల్లో మొదటి దశ పోలింగ్ తరువాత ఇప్పుడు అందరి దృష్టి నందిగ్రామ్‌పైనే ఉంది. అంత కీలకం కాబట్టే ఎలక్షన్ కమీషన్ కేంద్ర బలగాలతో పోలింగ్ రోజున ఈ నియోజకవర్గాన్ని పూర్తిగా తమ అదుపులో ఉంచనున్నట్లు తెలిపింది. ఎన్నికల రోజైన ఏప్రిల్ 1న 22 కేంద్ర బలగాల కంపెనీల సిబ్బందితో పాటు, 22 క్యూఆర్టి టీం (అత్యవసరంగా స్పందించే కూటమి) నందిగ్రామ్‌లో విధులు నిర్వహించబోతున్నారు. వీరు పోలింగ్ ప్రదేశాలలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పర్యవేక్షించడమే ప్రధాన ఎజెండాగా పని చేయనున్నట్లు ఈసీ తెలిపింది. కంపెనీగా పిలువబడే ఈ కేంద్ర బలగాలలో 100 మంది సిబ్బంది ఉంటారు. అదనంగా కోల్‌కత్తాలోని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కార్యాలయంలోని ఒక ప్రత్యేక బృందం కూడా నందిగ్రామ్ పరిస్థితిని పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. నందిగ్రామ్‌కు సంబంధించి మొత్తం 355 పోలింగ్ బూత్‌లు ఉన్నాయి, వాటిలో 75 శాతం కేంద్రాలకు వెబ్‌కాస్టింగ్ సౌకర్యాన్నిఏర్పాటు చేశారు. దీంతో సమస్యాత్మక ప్రాంతాలన్ని దీని ద్వారా నిరంతరం పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. నందిగ్రామ్‌లో ఎక్కడ కూడా హింసకు తావులేకుండా, ప్రజాస్వామ్యబద్ధంగా పోలింగ్ జరగడం కోసం అన్నిఏర్పాట్లను పూర్తి చేసినట్లు కమీషన్ అధికారి తెలిపారు. ఎందుకు నందిగ్రామ్‌కే ఇంత భద్రత చాలా సంవత్సరాల పాటు మమతకు కుడిభుజంగా ఉన్న సుబేందు ఒక్కసారిగా ప్లేటు మార్చేసి బీజేపీలోకి ఫిరాయించిన సంగతి తెలిసిందే. ఫిరాయించిన సుబేందు ఊరికే ఉండకుండా ధైర్యముంటే తనపై నందిగ్రామ్ నుంచి పోటీచేసి గెలవాలంటు మమతకు సవాలు విసిరారు. మామాలుగానే మమత ఫైర్ బ్రాండ్‌గా పేరుంది, దీంతో ఈ సవాలును స్వీకరించడంతో నందిగ్రామ్ ప్రతిష్టాత్మకంగా మారింది. సుబేందు కుటుంబానికి నందిగ్రామ్ చుట్టుపక్కలున్న దాదాపు 40 నియోజకవర్గాల్లో మంచి పట్టుంది. ఇంతటి సుబేందే ఓడిపోతే బీజేపీకి దిక్కెవరు ? అసలు సుబేందు కుటుంబాన్ని చూసుకునే నరేంద్రమోడి, అమిత్ బెంగాల్లో మమతపై రెచ్చిపోతున్నారు. ఎలాగైనా నందిగ్రామ్ గెలిచి తన సత్తా చాటాలని తీవ్రంగా శ్రమిస్తోంది. రెండోదశ ఎన్నికలో నందిగ్రామ్ కూడా ఉండటంతో పోలింగ్ అయ్యేవరకు మమత ఈ నియోజకవర్గంలోనే క్యాంపువేశారు. ప్రస్తుతం ఒకవైపు కేంద్రబలగాలు మరోవైపు రాష్ట్ర పోలీసులు నియోజకవర్గం మొత్తం దిగేశారు. మొత్తానికి ఈ ఎన్నికల్లో నందిగ్రామ్ నియోజకవర్గం గెలుపు కోసం నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్న ఈ వార్ లో విజయంతో ఎవరిదో తెలియాలంటే ఫలితాలు వెలువడే వరకు వేచి చూడాల్సిందే. ( చదవండి : West Bengal Election 2021: ‘నందిగ్రామ్’ పోరు రసవత్తరం ) -
మమతకు మరో షాక్ :కీలక మంత్రి గుడ్‌బై
సాక్షి, కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో వరుస పరిణామాలు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)ని తీవ్ర ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టి వేస్తున్నాయి. తాజా కేబినెట్ మంత్రి రాజీవ్ బెనర్జీ తన పదవికి రాజీనామా చేశారు. మంత్రి పదవికి తాను రాజీనామా చేస్తున్నట్టు రాజీవ్ స్వయంగా ట్విటర్లో వెల్లడించారు. త్వరలోనే రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న తరుణంలో వరుసగా కీలక నేతలు పార్టీని వీడటం, అదీ బీజేపీ కండువా కప్పుకోవడం తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఎదురుదెబ్బగా భావించాలి. దోంజూర్కు చెందిన తృణమూల్ ఎమ్మెల్యే, రాష్ట్ర అటవీశాఖ మంత్రి అయిన రాజీవ్ బెనర్జీ చాలా కాలంగా అసమ్మతిని వ్యక్తం చేస్తున్న ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కూడా బీజేపీలో చేరతారనే అంచనాలు భారీగా నెలకొన్నాయి. ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి బెంగాల్ పర్యటనకు ముందు రాజీవ్ రాజీనామా ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా ఇప్పటికే టీఎంసీ ఎంపీ సువేందు అధికారి బీజేపీలో చేరారు. ఆయన నేతృత్వంలో మరో ఏడుగురు తృణమూల్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్ అయిన సంగతి తెలిసిందే. అలాగే శాంతిపూర్‌కు చెందిన ఎమ్మెల్యే అరిందాం భట్టాచార్య కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. This is to inform you that I am resigning as the Minister in Charge, Department of Forest, West Bengal from today. pic.twitter.com/dfVq6aVxUj — Rajib Banerjee (@RajibBaitc) January 22, 2021 -
కీలక నిర్ణయం: బీజేపీ బాటలో మమత
కోల్కత్తా : దేశ వ్యాప్తంగా ఆసక్తిని రేకిస్తున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. మరో మూడు నాలుగు నెలల్లో ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేశాయి. విజయమే లక్ష్యంగా పెట్టుకున్న అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ ఆ దిశగా పావులు కదుపుతున్నాయి. ఓ వైపు ప్రత్యర్థిపై విమర్శల బాణాలు సందిస్తూనే అభివృద్ధి, సంక్షేమంతో పాటు ప్రజా ఆకర్శణ పథకాలను ప్రచారం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓ కీలక హామీనిచ్చారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్‌ను ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. ఈ ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని ఆదివారం నాటి ప్రకటనలో స్పష్టం చేశారు. ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న తరుణంలో మమత ఇలాంటి ప్రకటన చేయడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. (బీజేపీ వ్యూహం.. మమతకు చెక్) కాగా గత ఏడాది చివరలో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కూడా ఇలాంటి హామీనే ఇచ్చిన విషయం తెలిసిందే. తాము అధికారంలోకి వస్తే ప్రజలందరికీ ఉచిత వ్యాక్సిన్ పంపిణీ చేస్తామని ఆ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. పార్టీ మేనిఫెస్టోలో సైతం పొందుపరిచారు. ఈ ప్రకటన భారీగానే ఓట్లను రాబట్టింది. అయితే ఉచిత వ్యాక్సిన్ హామీపై దేశ వ్యాప్తంగా అప్పట్లో పెను దుమారమే చెలరేగింది. కేవలం ఎన్నికలు జరిగే ప్రాంతంలో ఇలాంటి హామీని ఇచ్చి ఇతర రాష్ట్రాల ప్రజలను చిన్నచూపు చూస్తున్నారనే సందేశాన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తోందని పెద్ద ఎత్తున విమర్శలు సైతం వినిపించాయి. ఓ అడుగు ముందుకేసిన ప్రతిపక్షం ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘానికే ఫిర్యాదు చేసింది. బీజేపీ బాటలో మమత.. ఉచిత వ్యాక్సిన్ ప్రకటనను పరిశీలించిన సీఈసీ దానిలో ఎలాంటి తప్పదంలేదని, ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు రాదని తెలిపింది. దీంతో కరోనా వ్యాక్సిన్‌కు రాజకీయ రంగం పులుముకుంది. బిహార్ ఎన్నికల అనంతరం జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ బీజేపీ ఇదే హామీని ప్రధానంగా ప్రచారం చేసింది. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీ ఏవిధంగా ఓట్లు దండుకుందో తెలిసిందే. ఈ క్రమంలోనే బీజేపీ బాటనే ఎంచుకున్న మమతా బెనర్జీ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తరుణంగా ఉచిత వ్యాక్సిన్ పంపిణీ హామీపై ముందుగానే కర్చిఫ్ వేసింది. తాము అధికారంలోకి వస్తే వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తామని సాక్ష్యాత్తూ సీఎం మమత ప్రకటించారు. కరోనాపై పోరాటం చేస్తున్న వైద్యులు, మున్సిపల్ కార్మికులు, పోలీసు సిబ్బందికి ముందుగా వ్యాక్సిన్ అందిస్తామని తెలిపారు. వ్యాక్సిన్ పంపిణీకి సిద్ధం... కాగా భారత్‌లో కోవిడ్–19 వ్యాక్సినేషన్ కార్యక్రమం ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. 3 కోట్ల మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు తొలి డోసు అందజేయనున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ అని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ తాజా పరిస్థితి, వ్యాక్సిన్ సన్నద్ధతపై ప్రధాని ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. త్వరలో రాబోయే లోహ్రీ, మకర సంక్రాంతి, పొంగల్, మాఘబిహూ తదితర పండుగలను దృష్టిలో పెట్టుకొని ఈ నెల 16 నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభించాలని నిర్ణయించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్ల తర్వాత 50 ఏళ్ల వయసు పైబడిన వారికి, 50 ఏళ్లలోపు వయసుండి రకరకాల వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా వీరంతా కలిపి 27 కోట్ల మంది ఉంటారని అంచనా. అక్స్‌ఫర్ట్ వర్సిటీ అభివృద్ధి చేసిన కోవిషీల్డ్, హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ వారి కోవాగ్జిన్‌కు భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ రెండు వ్యాక్సిన్లు సురక్షితమేనని, కరోనాకు వ్యతిరేకంగా మనిషి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతున్నట్లు తేలిందని ఆరోగ్య శాఖ వెల్లడించింది -
అమిత్ షా ఎత్తుగడ.. మమతకు మద్దతు!
కోల్కత్తా : పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు యావత్ దేశ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్, విపక్ష బీజేపీ మధ్య ఇటీవల చెలరేగిన వివాదం దేశ రాజకీయ వర్గాల్లో పెను దుమారాన్నే రేపి పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. ఎప్పటి నుంచో బెంగాల్ కోటపై కాషాయ జెండా ఎగరేయాలని కలలు కంటున్న బీజేపీ.. దానికి అనుగుణంగా ప్రణాళికలు, ఎత్తుగడలను సిద్ధం చేసి ఒక్కొక్కటిగా ప్రయోగిస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీని గట్టిదెబ్బ కొట్టి తన ఉనికి చాటుకున్న కాషాయదళం.. క్రమంగా బలపడుతూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సవాలు విసురుతోంది. అనంతరం ఇటీవల జేపీ నడ్డా పర్యటనలో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులు.. ఇరు పార్టీల మధ్య వివాదం మరింత పెంచాయి. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా ర్యాలీతో మమతకు ఊహించని షాక్ ఇచ్చారు. టీఎంసీకి చెందిన కీలక నేత సువేందు అధికారితో పాటు మరో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు బీజేపీ గూటికి చేరడం కలకలం రేపింది. (ఐదేళ్లలో ‘బంగారు బెంగాల్’) కీలకమైన అసెంబ్లీ ఎన్నికల ముందు మమతకు ఈ పరిణామం భారీ ఎదురుదెబ్బ లాంటిది. ఎన్నికల నాటికి చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు టీఎంసీని వీడి బీజేపీలో చేరతారని, చివరికి మమత మాత్రమే ఆ పార్టీలో మిగులుతారని అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దీదీ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. టీఎంసీని చావుదెబ్బ తీసి కాషాయజెండా ఎగరేస్తామని షా ప్రకటించడం అధికార పార్టీ నేతల్ని కలవరానికి గురిచేస్తోంది. మరోవైపు బీజేపీ నేతల ఎత్తుగడలను తిప్పికొట్టేందుకు మమతా బెనర్జీ తనదైన శైలిలో వ్యూహరచన చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా గల బీజేపీ వ్యతిరేక పక్షాల నుంచి మద్దతను కూడగట్టకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మమతతో చర్చించారు. బెంగాల్లో జరుతున్న పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. బీజేపీ నేతలను దీటుగా ఎదుర్కొనేందుకు తాను మద్దతుగా ఉంటానని పవార్ ప్రకటించారు. అంతేకాకుండా అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థుల తరఫున ప్రచారంలో సైతం పాల్గొంటానని హామీ ఇచ్చినట్లు అధికార పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. అయితే దానికంటే ముందుగా బెంగాల్లో భారీ ర్యాలీని మమత ఏర్పాటు చేయబోతున్నారని, దీనికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్, శివసేన అధినేత సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో పాటు కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులను ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. బెంగాల్లో జేడీ నడ్డాపై దాడికి ప్రతిచర్యగా ముగ్గురు ఐపీఎస్ అధికారులపై కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించడం వివాదంగా మారిన విషయం తెలిసిందే. కేంద్ర నిర్ణయం అనంతరం.. అనేక మంది జాతీయ నేతలు మమతకు అండగా నిలిచి.. బీజేపీ తీరును తప్పుపట్టారు. కాగా మమత, పవార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉన్న విషయం తెలిసింది. గతంలో అనేకమార్లు బెంగాల్ ప్రభుత్వానికి పవార్ అండగా నిలిచారు. మొత్తం 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీకి మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరుగనున్నాయి. -
భారత్ బంద్‌పై మమతా బెనర్జీ ట్విస్ట్
పశ్చిమ బెంగాల్: భారతీయ జనతా పార్టీ(బిజెపి) తన తుపాకులకు శిక్షణ ఇచ్చి పశ్చిమ బెంగాల్‌ను గుజరాత్‌గా మార్చడానికి ప్రయత్నిస్తుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. బెంగాల్‌లోని వెస్ట్ మిడ్నాపూర్‌లో సోమవారం(డిసెంబర్ 7) ఏర్పాటు చేసిన ఓ సభలో మమతా మాట్లాడారు. బెంగాల్ రాష్ట్రంలో బిజెపి చేపట్టిన ర్యాలీని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ.. బిజెపి పార్టీ ఇక్కడ అల్లర్లు సృష్టించాలని ప్రయత్నిస్తుంది, గుర్తుంచుకోండి బెంగాల్ ప్రభుత్వం అల్లర్లు జరగటానికి అనుమతించదు అని అన్నారు. విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో డబ్బు సంచులతో ఆ ప్రభుత్వాలను కూల్చాలని చూసే బీజేపీ తరహా పార్టీ మాదు కాదు అని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. కాషాయ పార్టీకకి ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగిపోయేది లేదన్నారు. బీజేపీ మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయగలరని భావిస్తే చాలా తప్పు.. నిప్పుతో, తృణమూల్ కాంగ్రెస్ ఆటలు అడకండి అని మమతా అన్నారు. (చదవండి: రైతుల ఆందోళనలకు ఉద్ధవ్ మద్దతు) గాంధీ హంతకులకు పశ్చిమ బెంగాల్ ఎన్నటికీ తలవంచదు, ఈ రాష్ట్రంపై ఇతరుల నియంత్రణను ఎప్పటికి ఒప్పుకోదు అని మిడ్నాపూర్ సభలో అన్నారు. అంతేకాదు, బీజేపీ అధికార దుర్వినియోగం పట్ల మౌనంగా ఉండటం కంటే జైల్లో ఉండటానికైనా తాను సిద్దమేనని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్రంలో హిందూ-ముస్లిం మరియు ఇతర వర్గాల మధ్య చీలికను సృష్టించాలని భావిస్తుంది. మేము అలాంటి వాటిని అసలు సహించం అన్నారు. అవినీతి నేతలే బీజేపీతో చేతులు కలుపుతున్నారని మమతా బెనర్జీ విమర్శించారు. సీపీఐ(ఎం) గూండాలు రాష్ట్రంలో బీజేపీకి కార్యకర్తల్లా పనిచేస్తున్నారని ఆరోపించారు. దేశ వ్యాప్తంగా రేపు జరిగే భారత్ బంద్ కు పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇస్తున్నా. 'కేంద్రం తక్షణమే కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలి లేదా ప్రభుత్వం నుంచి దిగిపోవాలి. రైతుల హక్కులను కాలరాసిన ప్రభుత్వం కేంద్రంలో ఉండకూడదు'అని మమతా బెనర్జీ పేర్కొన్నారు. అయితే రేపు(డిసెంబర్ 8) రాష్ట్రంలో జరిగే భారత్ బంద్‌కు మాత్రం తాము మద్దతునివ్వట్లేదని ప్రకటించారు. -
అమిత్ షా భోజనం ఫొటోపై మమత ట్వీట్
కోల్‌కతా: బెంగాల్లో కొన్ని సంవత్సరాలుగా అధికార పార్టీ టీఎంసీ, ప్రతిపక్షం బీజేపీ మధ్య రాజకీయాలు రగులుతున్నాయి. రెండు పార్టీలు దూకుడుతో అక్కడి రాజకీయం రణరంగాన్ని తలపిస్తోంది. ఇన్ని రోజులుగా బీజేపీ ప్రధాన నాయకులు బెంగాల్లో అడుగుపెట్టలేదు అందుకే ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు అమిత్ షా ఈ రాష్ట్రంలో పర్యటన చేస్తున్నారు. బిహార్ విజయంతో బీజేపీ మంచి జోరు మీద ఉంది. ఇదే అదునుగా చూసుకొని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అమిత్ షాపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ రాష్ట్రంలోని బంకురా జిల్లాలో ఒక గిరిజన పార్టీ కార్యకర్త ఇంట్లో అమిత్‌షా భోజనం చేస్తుండగా తీసిన ఫోటోను ఆయన తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనిపై స్పందించిన మమత తీవ్రంగా విమర్శించారు. బయట నుంచి తెచ్చిన భోజనం తింటూ గిరిజన కార్యకర్త ఇంట్లో తింటున్నట్లు ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు ఉచిత రేషన్ పంపిణీ జూన్ వరకు ఇచ్చామని దానిని ఇంకా పెంచుతామని మమత ప్రకటించారు. అమిత్ షా రాకతో బెంగాల్ రాజకీయాలు కొత్త మలుపులు తిరగనున్నాయి. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలున్న బెంగాల్లో వచ్చే ఏడాది ఏప్రిల్ మే మధ్య ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తాయి. ఎలా అయిన బెంగాల్లో మకాం వెయ్యాలని బీజేపీ చూస్తోంది. అందుకే ఇప్పటి నుంచే పర్యటనల పేరుతో ప్రజలలో మంచి పేరు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంది. వారికి శుభ సూచికంగా మమత శిబిరంలో చీలికలు మొదలైనట్లు కనిపిస్తుంది. బీజేపీ బలం పెంచుకోవడానికి ఇదే మంచి సమయం అని భావించి అమిత్ షాను రంగంలోకి దించింది. కానీ ఈ పర్యటనలో స్వలాభం ఉందని మమతఎద్దేవా చేయడంతో ప్రజలలో కొంతమేర వ్యతిరేకత వచ్చినట్లు కనిపిస్తుంది. (గ్రేటర్ హైదరాబాద్ పోరు.. రంగంలోకి అమిత్ షా) Had amazing Bengali food at Shri Vivishan Hansda ji’s home in Chaturdhi village. No words can express their warmth and hospitality. চতুরডিহি গ্রামে শ্রী বিভীষণ হাঁসদা জীর বাড়িতে চমৎকার বাঙালী খাবার খাওয়ার সুযোগ পেলাম। কোনো শব্দই তাদের আতিথেয়তা বর্ণনা করতে পারবেনা। pic.twitter.com/pdeMCEa6Xp — Amit Shah (@AmitShah) November 5, 2020 -
బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు మృతి
కోల్‌కతా: బెంగాల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ( పీసీసీ) అధ్యక్షుడు సోమెన్ మిత్ర(78) గురువారం మృతి చెందారు. 1972-2006 వరకు ఆయన ఎమ్మెల్యేగా పని చేశారు. పశ్చిమ బెంగాల్ యూత్ కాంగ్రెస్ ఆయన మరణించినట్లు ట్విట్టర్ ద్వారా తెలిపింది. కిడ్ని, గుండె సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్న మిత్రను కోల్‌కతా ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన జూలై 30వ తేదీ అర్ధరాత్రి 1.30 గంటలకు గుండె నొప్పితో తుది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది. మిత్రకు కరోనా టెస్ట్ చేయగా నెగిటివ్ వచ్చినట్లు డాక్టర్లు తెలిపారు. మొదటి నుంచి కాంగ్రెస్‌లోనే ఉన్న మిత్ర ప్రస్తుత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఆమె ఎదుగుదలలో ముఖ్యపాత్ర పోషించారు. ఆయన తన భార్య, కుమారుడితో కలిసి నివసిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు మిత్ర మరణవార్తను ఆయన కుటుంబం అధికారికంగా ప్రకటించలేదు. సోమెన్ మిత్ర మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నాయి. చదవండి: కరోనా కంటే తీవ్రంగా ఉంది: మమతా బెనర్జీ My heart goes out to the family of the Lt Somen Mitra. He was a giant of Bengal and he touched the lives of millions of people in his long journey. My condolences to his family and all those who admired him. His legacy will not be forgotten. @INCIndia @INCWestBengal https://t.co/YljhsJ0f0M — Gaurav Gogoi (@GauravGogoiAsm) July 29, 2020 -
ఉంపన్ విధ్వంసం : 72 మంది మృతి
కోల్కత్తా : పశ్చిమ బెంగాల్లో ఉంపన్ తుపాను పెను వినాశనాన్ని సృష్టిస్తోంది. ఇప్పటికే ప్రాణాంతక కరోనా వైరస్ ధాటికి వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన బెంగాల్లో ఉంపన్ వల్ల భారీ విధ్వంసం చోటుచేసుకుంది. భారీ తుపాను కారణంగా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 72 మంది మృత్యువాత పడ్డారు. వేలమంది ప్రజలు నిరాశ్రయులు అయ్యారు. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓ ప్రకటన విడుదల చేశారు. తుపాన్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. ఇప్పటి వరకు ఇలాంటి విధ్వంసం చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం బెంగాల్లో పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా వచ్చి ఇక్కడి పరిస్థితిని చూడాలని మమత కోరారు. మరోవైపు ఉంపన్ తీవ్ర రూపం దాల్చడంతో బెంగాల్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆస్తి ప్రాణ నష్టం సంభవించింది. రాజధాని కోల్కత్తా ప్రాంతంలో రవాణా వ్యవస్థ, విద్యుత్ సరాఫరా నిలిచిపోయింది. గాలులు, భారీ వర్షాల కారణంగా కోల్కత్తా ఎయిర్పోర్ట్ పూర్తిగా నీట మునిగింది. (నీట మునిగిన కోల్‌కతా ఎయిర్‌పోర్టు) -
మమత పెద్ద మనసు వారి కోసం ప్రత్యేకంగా...
కోల్కత్తా: కరోనా మహమ్మారి కారణంగా లాక్డౌన్ విధించడంతో ఎక్కడివారు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో వలస కార్మికుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. పనుల కోసం సొంత ఊరిని వదిలి ఉపాధిని వెతుకుంటూ వచ్చిన వారికి ఇక్కడ ఉద్యోగం లేక ఏం చేయాలో తోచక చాలా కష్టాలు పడ్డాయి. ఎప్పుడెప్పుడు లాక్డౌన్ అయిపోతుందా ఇంటికి వెళ్లి అయిన వారిని చూసుకుందాం అని ఆశపడిన వారికి లాక్‌డౌన్‌ను మూడు సార్లు సడలించడంతో నిరాశే మిగిలింది. అందుకే చాలా మంది వలస కార్మికులు కాలినడకనే వేల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి ఇంటిని చేరకుండానే ప్రాణాలు కూడా కోల్పొయారు. అయితే వలస కార్మికులను ఇంటికి చేర్చడం కోసం కేంద్రప్రభుత్వం శ్రామిక్‌రైళ్ల పేరిట ప్రత్యేక రైళ్లను మే1 వతేదీ నుంచి అందుబాటులోనికి తెచ్చింది. అయితే వీటితో పాటు వలస కార్మికుల కోసం 105 ప్రత్యేక రైళ్లను కూడా నడిపించనున్నట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తెలిపారు. దీనికి సంబంధించి ఆమె ట్వీట్ చేశారు. ఈ ప్రత్యేక ట్రైన్లు వివిధ ప్రాంతాల నుంచి త్వరలో ప్రారంభం కానున్నాయి అని మమత పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్‌గోయల్ బెంగాల్ ప్రభుత్వం వలస కార్మికుల రైళ్లను రాష్ట్రంలోకి అనుమతించబోము అని పేర్కొంది అని ఆరోపించిన ఒక్కరోజు తరువాతే మమత ఈ ప్రకటన చేయడం గమనార్హం. Towards our commitment to helping all our people stuck in different parts of the country and who want to return back to Bengal, I am pleased to announce that we have arranged 105 additional special trains. (1/2) — Mamata Banerjee (@MamataOfficial) May 14, 2020 ఇదేవిషయం కేంద్రహోం మంత్రి అమిషా కూడా మమతకు చాలా సార్లు లేఖ రాశారు. వలస కార్మికులు కూడా మీ ప్రజలే. వారిని ఇంటికి తిరిగి రానివ్వండి. ఆర్ధిక వ్యవస్థ బాగుపడి వారికి ఉద్యోగాలు దొరుకుతాయి దీనిని రాజకీయం చేయ్యొద్దు అంటూ కూడా అమిత్ షా చాలా సార్లు పేర్కొన్నారు. ఈ విషయంలో బెంగాల్ ప్రభుత్వానికి, కేంద్ర సర్కార్‌కి మధ్య యుద్దమే నడిచింది. అయితే కరోనా కట్టడి విషయంలో కేంద్రం చేపడుతున్న అనేక చర్యలను దీదీ వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. -
సీఎం మమతా.. నా బిడ్డకు పేరు పెడతారు
హుగ్లీ : దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజుకోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో లాక్డౌన్ పొడిగించిన సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డిసెంబర్ నుంచి మొదలుకొని 5 నెలలుగా ప్రపంచంలో కరోనా, లాక్డౌన్, ఐసోలేషన్, క్వారంటైన్ వంటి పదాలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఈ 5 నెలల్లో ఎంతోమంది తల్లిదండ్రులు తమకు పుట్టిన బిడ్డలకు కరోనా , కోవిడ్ లాంటి పేర్లు పెట్టడం చూస్తున్నాం. మొన్నటికి మొన్న టెస్లా కార్ల సంస్థ సీఈవో ఎలన్ మస్క్ తన కొడుక్కి అర్థం కాని పేరు పెట్టి నెటిజన్లను కన్ప్యూజన్లోకి నెట్టేశారు.(కరోనా.. ఒక్క రోజులోనే 103 మంది మృతి) తాజాగా ఈ జాబితాలోకి తృణముల్ కాంగ్రెస్ ఎంపీ అపరూప పొద్దార్ చేరారు. గురువారం రాత్రి హుగ్లీ జిల్లాలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో అపరూప పొద్దార్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ' కరోనా సమయంలో నాకు బిడ్డ పుట్టింది కాబట్టే దానికి కరోనా అనే పేరు పెడుతున్నా. అయితే ఇది కేవలం నిక్‌నేమ్ మాత్రమే. నా బిడ్డకు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నామకరణం చేస్తారు. నాకు బిడ్డ పుట్టడం నా భర్త షాకిర్ అలీకి సంతోషం కలిగించింది. ప్రస్తుతానికి నేను, నా బిడ్డ క్షమంగా ఉన్నాం' అంటూ అపరూప పొద్దార్ పేర్కొన్నారు. సాధారణంగా బెంగాల్లో అప్పుడే పుట్టిన బిడ్డలకు రెండు పేర్లు పెట్టే సంప్రదాయం కొనసాగుతుంది. తల్లిదండ్రులు తమకి నచ్చిన పేరును పెట్టుకోవచ్చు. అయితే ప్రధాన నామకరణం మాత్రం ఇంటిపెద్ద నిర్ణయించాలన్నది వారి సంప్రదాయంగా వస్తుంది. -
ఢిల్లీ అల్లర్లపై మమత సంచలన వ్యాఖ్యలు
కోల్కత్తా : దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల చోటుచేసుకున్న అల్లర్లపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ అల్లర్ల వెనుక పెద్దకుట్ర దాగిఉందని, దీని వెనక కేంద్ర ప్రభుత్వం హస్తం కూడా ఉందని ఆరోపించారు. పక్కా ప్రణాళిక ప్రకారమే ఈ హత్యాకాండ జరిగిందని కేంద్రంపై విరుచుకుపడ్డారు. అలాగే ఢిల్లీ అల్లర్లపై పరిశీలనకు ఓ కమిటీని సైతం ఏర్పాటు చేస్తామని, ఘర్షణలు చోటుచేసుకున్న ప్రాంతంలో టీఎంసీ ప్రతినిధులు పర్యటిస్తారని మమత స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన ఘర్షణలపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ క్షమాపణలు చెప్పకపోవడం బాధాకరమన్నారు. సోమవారం కోల్‌కత్తాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన పార్టీ సమావేశంలో మమత ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా కేంద్ర హోమంత్రి అమిత్ షా ఆదివారం కోల్‌కత్తాలో పర్యటించిన విషయం తెలిసిందే. షా పర్యటనపై దీదీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బెంగాల్లో అల్లర్లు సృష్టించడానికి బీజేపీ నాయకత్వం ప్రయత్నిస్తోందని, ఇదేమీ ఢిల్లీ కాదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అమిత్ షా బెంగాల్ పర్యటన సందర్భంగా బీజేపీ కార్యకర్తలు గోలీమారో నినాదాలు చేయడంపై సీఎం స్పందించారు. హింసను ప్రేరేపించే విధంగా నినాదాలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా ఈ ఘటనలో అనుమానితులుగా భావిస్తున్న ముగ్గురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు ఇదివరకే అదుపులోకి తీసుకున్నారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 46 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. -
సీఏఏపై మమత కీలక నిర్ణయం
కోల్కత్తా : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఏఏకు వ్యతిరేకంగా బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం సభ దానిని ఆమోదించింది. బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి మమత తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగానే అసెంబ్లీలో ద్వారా సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. వివాదాస్పద చట్టానికి వ్యతిరేకంగా తీర్మానించిన నాలుగో రాష్ట్రంగా బెంగాల్ నిలిచింది. తొలుత కేరళ, రాజస్తాన్, పంజాబ్ రాష్ట్రాలు సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో బిల్లు ఆమోదించాయి. అయితే.. ఇదే విషయంపై కేరళ ప్రభుత్వం ఇప్పటికే సుప్రీం కోర్టుకు వెళ్లగా సీఏఏపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. (‘పౌరసత్వ’ బిల్లుకు వ్యతిరేకం) -
కాంగ్రెస్‌కు షాకిచ్చిన విపక్షాలు..!
సాక్షి, న్యూఢిల్లీ : వరస ఎన్నికల్లో ఓటమితో పీకల్లోతు కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి విపక్షాలు కోలుకోలేని షాకులిస్తున్నాయి. కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివాదాస్పద ఎన్ఆర్సీ, సీఏఏపై చర్చించేందుకు కాంగ్రెస్ సోమవారం ఢిల్లీలో అఖిలపక్ష సమావేశాన్ని తలపెట్టింది. అయితే ఈ కీలక భేటీకి హాజరయ్యేంది లేదంటూ దేశంలోని ప్రధాన విపక్ష పార్టీలు తెల్చిబెతున్నాయి. ఈ సమావేశానికి తాము హాజరయ్యేది లేదంటూ తొలుత తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, బెంగాల్ సీఎం మమతాబెనర్జీ ప్రకటించారు. ఆ తరువాత బీఎస్పీ చీఫ్ మాయావతి కూడా అదే ప్రకటన చేశారు. తాజాగా ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కూడా వారి బాటలోనే నడిచారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున కేజ్రీవాల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ మిత్రపక్షమైన శివసేన కూడా గైర్హాజరు కావడం గమనార్హం. కాంగ్రెస్ నిర్వహించే అఖిలపక్ష సమావేశానికి తాము హాజరుకావడం లేదంటూ మొండిచేయి చూపారు. కాగా కాంగ్రెస్ నేతలపై మాయావతి ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున బహిరంగ విమర్శలకు దిగుతోన్న విషయం తెలిసిందే. నేడు జరిగే ఈ భేటీలో ఎన్ఆర్సీ, సీఏఏతో పాటు ఇటీవల దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన జేఎన్‌యూ హింసపై కూడా చర్చించే అవకాశం ఉంది. అయితే కీలకమైన సమావేశానికి ప్రధాన పార్టీలు గైర్హాజరు కావడంపై కాంగ్రెస్ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎన్సీపీ, ఆర్జేడీ, వామపక్షాలు, డీఎంకే, ఎస్పీ మాత్రమే ఈ సమావేశానికి హాజరుకానున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో శివసేనకు కాంగ్రెస్ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ ఈ భేటీలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు తొలినుంచి ప్రచారం సాగిన.. చివరి నిమిషంలో వెనక్కి తగ్గారు. -
ప్రధాని మోదీకి చేదు అనుభవం..
కోల్కత్తా : బెంగాల్ పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీకి చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీలోని జేఎన్‌యూ హింసకు నిరసనగా... విద్యార్థి సంఘాల నాయకులు ‘గోబ్యాక్ మోదీ’ అంటూ ప్లేకార్డులు పట్టుకుని నిరసన ప్రదర్శించారు. ప్రధాని కాన్వాయ్ వెళ్లే మార్గంలో పెద్ద ఎత్తున బ్యానర్లు ఏర్పాటు చేశారు. నల్లజెండాలతో నిరసన వ్యక్తం చేశారు. పలు ప్రాంతాల్లో నిరసనకారులను ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా రెండు రోజుల పర్యటిన నిమిత్తం శనివారం మధ్యాహ్నం ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి కోల్‌కత్తాకు బయటదేరిన విషయం తెలిసిందే. కోల్కత్తా విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి పలువురు స్వాగతం పలికారు. ప్రధాని మోదీ, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీలు శనివారం కోల్‌కతాలోని రాజ్‌భవన్ వేదికగా భేటీ అయ్యారు. అయితే ఏ అంశాలపై భేటీ జరగనుందో తెలియాల్సి ఉంది. అలాగే ఈ నెల 12న కోల్‌కతాలో జరగనున్న కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్ (కేఓపీటీ) 150వ వసంతోత్సవ కార్యక్రమంలో వీరిరువురు మరలా ఒకే వేదికపై కలిసే అవకాశం ఉంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రాలేదు. -
కరుణానిధి విగ్రహాన్ని ఆవిష్కరించిన మమత
చెన్నై: కరుణానిధి ప్రథమ వర్థంతి సందర్భంగా బుధవారం తమిళనాడుకి వచ్చిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోడంబాక్కంలోని మురసొలి కార్యాలయంలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, పుదుచ్చేరి సీఎం వి. నారాయణసామి తదితరులు హాజరయ్యారు. మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి ఫరూక్ అబ్దుల్లా రావాల్సి ఉన్నా, చివరి నిమిషంలో రాలేకపోయారని తెలిపారు. ఫరూక్ అబ్దుల్లా తన కుమార్తె ఇంటికి కూడా వెళ్లలేని పరిస్థితిలో ఏడుస్తున్న వీడియోనూ తాను నిన్న చూశానని మమతా పేర్కొన్నారు. కశ్మీర్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి ఆ వీడియోనే నిదర్శనమని వెల్లడించారు. ఇది నిజంగా ఆందోళన చెందాల్సిన విషయమని, ఒక రాష్ట్రంపై నిర్ణయం తీసుకునే ముందు అక్కడి ప్రజల అభిప్రాయాలను గౌరవించాల్సిన అవసరం ఉందని తెలిపారు. కానీ ఇవేవి పరిగణలోకి తీసుకోకుండా బీజేపీ ప్రభుత్వం కశ్మీర్ విషయంలో సొంత నిర్ణయం తీసుకోవడం దారుణమని మమత విమర్శించారు. -
అఖిలపక్షానికి విపక్షాల డుమ్మా..!
సాక్షి, న్యూఢిల్లీ: జమిలి ఎన్నికల నిర్వహణ అంశంపై నేడు జరిగే అఖిలపక్ష సమావేశానికి కేంద్రం పంపిన ఆహ్వానాన్ని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, డీఎంకే చీఫ్ స్టాలిన్ తిరస్కరించారు. ఏక కాలంలో ఎన్నికలతో పాటు కీలకమైన అంశాలపై చర్చించేందుకు జరిగే ఈ సమావేశానికి లోక్‌సభ, రాజ్యసభల్లో కనీసం ఒక సభ్యుడున్న అన్ని రాజకీయ పార్టీలను ప్రధాని మోదీ ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే జమిలి ఎన్నికల అంశం బీజేపీ మేనిఫెస్టోకి సంబంధించిన విషయమని.. ఈ సమావేశానికి తాము హాజరుకాక పోవడమే మంచిదని విపక్షాలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే తమ పార్టీ తరఫున ప్రతినిధిని మాత్రం పంపుతామని కేజ్రీవాల్ ప్రకటించారు. ఆప్ తరఫున ఎంపీ రాఘవ్ చందా ప్రాతినిథ్యం వహించనున్నారు. ఈ భేటీకి టీడీపీ పూర్తిగా గైర్హాజరు కానుంది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇదివరకే ఆహ్వానాన్ని తిరస్కరించగా కాంగ్రెస్, మిగతా ప్రతిపక్ష పార్టీలు ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. దీనిపై నిర్ణయం తీసుకునేందుకు సోనియా గాంధీ అధ్యక్షతన యూపీఏ పక్షాలు భేటీ అయ్యాయి. అయితే తృణమూల్, డీఎంకే బాటనే కాంగ్రెస్‌తో మిగతా పార్టీలు కూడా అనుసరించే అవకాశం ఉంది. కాగా తెలంగాణ నుంచి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతుండగా, ఏపీ నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అఖిలపక్ష సమావేశంలో పాల్గొననున్నారు. మహాత్మాగాంధీ 150వ వర్థంతి, 2022లో జరిగే 75వ స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాలపైనా ఈ భేటీలో చర్చించనున్నారు. హడావుడిగా ఇలా సమావేశం జరపడం కంటే ఏకకాలంలో ఎన్నికలపై ముందుగా శ్వేతపత్రం విడుదల చేసి, పార్టీలు, నిపుణులతో సంప్రదింపులు జరపాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి ప్రహ్లాద్ జోషికి మంగళవారం మమత లేఖ రాశారు. అలా చేసినప్పుడే చాలా కీలకమైన ఈ అంశంపై తాము నిర్దిష్టమైన సలహాలు ఇవ్వగలుగుతామన్నారు. -
హీట్ తగ్గట్లే..!
-
దమ్ముంటే అరెస్ట్ చేయండి
బరసత్/కన్నింగ్: పశ్చిమబెంగాల్లో బీజేపీ జైత్రయాత్రను ఎవ్వరూ అడ్డుకోలేరని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. బంగారు బెంగా ల్ను దివాళా బెంగాల్‌గా సీఎం మమత మార్చేశారన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన పడకేసిందని విమర్శించారు. తాను బెంగాల్ గడ్డపై జైశ్రీరామ్ నినాదం ఇస్తున్నాననీ, దమ్ముంటే మమత తనను అరెస్ట్ చేయించాలని సవాల్ విసిరారు. బెంగాల్‌లోని కన్నింగ్‌లో ప్రచారంలో అమిత్ పాల్గొన్నారు. మమతకు కోపం వచ్చేస్తుంది ఇటీవల పశ్చిమ మిడ్నాపూర్‌లో ఓ సభ సందర్భంగా జై శ్రీరామ్ నినాదాలు ఇచ్చిన బీజేపీ కార్యకర్తలపై మమతా బెనర్జీ దూసుకుపోవడాన్ని షా ప్రస్తావించారు. ‘ఎవరైనా జై శ్రీరామ్ అని నినాదం ఇస్తే మమతా దీదీకి కోపం వచ్చేస్తుంది. ఈరోజు నేను జై శ్రీరామ్ నినాదం ఇస్తున్నాను. మీకు(మమత) నిజంగా దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి. మంగళవారం కూడా నేను కోల్‌కతాలోనే ఉంటాను’ అని సవాల్ విసిరారు. జాదవ్పూర్లోని బరుయిపూర్‌లో తన హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వడకపోవడంతో బీజేపీ సభ రద్దు కావడంపై అమిత్ షా తీవ్రంగా మండిపడ్డారు. కాగా బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ వ్యక్తిగత సహాయకుడిగా భావిస్తున్న ఓ వ్యక్తి నుంచి పోలీసులు రూ.కోటి స్వాధీనం చేసుకున్నారు. అసన్‌స్టోల్ రైల్వే స్టేషన్లో ఉన్న ఘోష్ సహాయకుడు గౌతమ్ చటోపాధ్యాయతోపాటు లక్ష్మీకాంత్ షా అనే మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ–టీఎంసీ మాటలయుద్ధం బరుయిపూర్‌లో అమిత్ షా సభ రద్దుకావడంపై బీజేపీ, అధికార తృణమూల్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడిచింది. బెంగాల్లో ప్రజాస్వామ్యానికి బదులు నియంత పాలన నడుస్తోందనీ, అందుకే షా హెలికాప్టర్ ల్యాండింగ్‌తో పాటు సభకు కూడా అనుమతి ఇవ్వలేదని బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ్‌వర్గీయ ఆరోపించారు. ఈ వ్యవహారంలో ఈసీ మౌనప్రేక్షకుడిగా మారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోల్‌కతాలో ఈ నెల 15న యూపీ సీఎం యోగి పాల్గొనే సభకు అధికారులు అనుమతి రద్దుచేశారు. -
నిరూపించకుంటే 100 గుంజీలు తీయాలి
బంకురా/పురూలియా: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అభ్యర్థులు అక్రమంగా బొగ్గు తవ్వకాలకు పాల్పడుతున్నారంటూ మోదీ చేసిన ఆరోపణలను రుజువుచేయలేకపోతే ఆయన వంద గుంజీలు తీయాలని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. అదే మోదీ తాను చేసిన ఆరోపణలను ఏ ఒక్క అభ్యర్థిపైనైనా రుజువు చేస్తే లోక్‌సభ బరిలో ఉన్న మొత్తం 42 మంది టీఎంసీ అభ్యర్థులను పోటీ నుంచి ఉపసంహరిస్తానని ఆమె సవాల్ విసిరారు. గురువారం బెంగాల్‌లోని బంకురా నియోజకవర్గంలో మోదీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ టీఎంసీ అభ్యర్థులు అక్రమంగా బొగ్గు తవ్వకాలకు పాల్పడి డబ్బు సంపాదిస్తున్నారని ఆరోపించారు. అనంతరం మమత కూడా అదే నియోజకవర్గంలోని ఓ సభలో మాట్లాడుతూ ‘బొగ్గు గనుల తవ్వకాల వ్యవహారమంతా కేంద్రంలోని బొగ్గు మంత్రిత్వ శాఖ అధీనంలో ఉంటుంది. గనులకు కాపలాగా ఉండేది కూడా కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్ఎఫ్). బొగ్గు గనులను అక్రమంగా తవ్వుతున్నది బీజేపీ వాళ్లే’ అంటూ మోదీపై ఎదురుదాడి చేశారు. తన దగ్గర ఒక పెన్‌డ్రైవ్ ఉందనీ, దాన్ని బయటపెడితే బొగ్గు మాఫియా, పశువుల అక్రమ రవాణాకు సంబంధించిన కళ్లు చెదిరే నిజాలు వెలుగుచూస్తాయని మమత హెచ్చరించారు. ఓ కేంద్ర మంత్రి, మరో బీజేపీ ఎంపీకి సంబంధించిన వివరాలు ఆ పెన్‌డ్రైవ్‌లో ఉన్నాయన్నారు. చిట్‌ఫండ్ కుంభకోణాల్లో టీఎంసీ నేతలపై వచ్చిన ఆరోపణలు కూడా రుజువుకాలేదని ఆమె పేర్కొన్నారు. ఈ దేశాన్ని దుర్యోధన, దుశ్శాసనులు పాలిస్తున్నారంటూ ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ద్వయంపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. మోదీని కొడతానని నేను అనలేదు.. మోదీని చెంపదెబ్బ కొడతానని తానెప్పుడూ అనలేదని మమత స్పష్టం చేశారు. ఆయనను కొట్టాల్సిన అవసరం తనకు ఏంటని ఆమె ప్రశ్నించారు. బుధవారం మమత మాట్లాడుతూ ప్రజాస్వామ్యపు చెంపదెబ్బను మోదీ రుచి చూస్తారని అనడం తెలిసిందే. దీనిపై మోదీ గురువారం మాట్లాడుతూ ‘మమత నన్ను కొడతానంటున్నారు. ఆమె నాకు అక్క వంటివారు. ఆమె కొట్టినా నాకు అది ఆశీర్వాదమే’ అని పేర్కొన్నారు. దీంతో మమత మాట్లాడుతూ మోదీ తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుని, వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యపు చెంపదెబ్బను మోదీ రుచి చూస్తారని తాను అన్నానే తప్ప, తానే మోదీని చెంపదెబ్బ కొడతానని కాదని వెల్లడించారు. ప్రజలే తమ ఓటుతో మోదీకి బుద్ధి చెబుతారనే అర్థంలో తాను ‘ప్రజాస్వామ్యపు చెంపదెబ్బ’ అన్నానని తెలిపారు. -
అసన్సోల్ అమీతుమీ
పశ్చిమ బెంగాల్‌లోని 42లోక్‌సభ స్థానాల్లో కీలకమైన అసన్సోల్ నియోజకవర్గంలో గెలుపును ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.ఇక్కడ రెండో సారి గెలిచి పట్టు బిగించాలని బీజేపీ ప్రయత్నిస్తోంటే, ఎలాగైనా ఇక్కడ బోణీ కొట్టాలని తృణమూల్ కాంగ్రెస్ ఎత్తులు వేస్తోంది.బొగ్గు గనులు, ఫ్యాక్టరీల కార్మికులు, స్క్రాప్ డీలర్లతో పాటు కోల్ మాఫియా కూడా ఈ నియోజకవర్గంలో గెలుపోటములను నిర్ణయించే శక్తులు. రాష్ట్రంలో రెండో పెద్ద నగరమైన(కోల్‌కతా తర్వాత) అసన్సోల్లో 75 శాతం హిందువులు,21శాతం ముస్లింలు ఉన్నారు. జనాభాలో 50శాతం హిందీ మాట్లాడతారు. బిహార్, జార్ఖండ్ వంటి పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు ఎక్కువగా ఉన్నారు. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్న అసన్సోల్ లోక్‌సభ నియోజకవర్గం కమ్యూనిస్టులకు ఆయువు పట్టుగా ఉండేది.1957 నుంచి 2014 వరకు జరిగిన ఎన్నికల్లో ఇక్కడ సీపీఎం 10 సార్లు, కాంగ్రెస్ ఐదు సార్లు, బీజేపీ ఒక సారి నెగ్గాయి.1989 నుంచి 2009 వరకు ఈ నియోజకవర్గం సీపీఎంకే దక్కుతూ వచ్చింది. 2014 ఎన్నికల్లో మొదటి సారి బీజేపీ జయకేతనం ఎగుర వేసింది.ఏప్రిల్29 పోలింగ్ జరిగే ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ బాబుల్ సుప్రియో, తృణమూల్ నుంచి సినీనటి మూన్‌మూన్‌సేన్, సీపీఎం తరఫున గౌరంగా చటర్జీ, కాంగ్రెస్ టికెట్‌పై బిశ్వరూప్ మండల్ పోటీ చేస్తున్నారు.అయితే, బీజేపీ, తృణ మూల్ మధ్యే ప్రధానంగా పోటీ ఉంటుంది. తృణమూల్ జెండా ఎగురుతుందా రాష్ట్రంలో కమ్యూనిస్టు పాలనకు చరమగీతం పాడి అధికారాన్ని దక్కించుకున్న తృణమూల్ ఈ ఎన్నికను సవాలుగా తీసుకుంది. రాష్ట్రంలో ఇంత వరకు తృణమూల్ జెండా ఎగరని ఎనిమిది లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈ అసన్సోల్ ఒకటి.ఈ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఐదు తృణమూల్ చేతిలో ఉన్నాయి. 2014లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్ అభ్యర్థి డోలా సేన్ కేవలం 70వేల ఓట్ల తేడాతో బీజేపీ చేతిలో ఓడిపోయారు. అందుకే ఈ సారి ఎలాగైనా నెగ్గాలన్న పట్టుదలతో డోలా సేన్‌ను పక్కన పెట్టి మూన్‌మూన్ సేన్‌ను బరిలో దింపింది. గత లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో తృణమూల్ హవా నడిచినా బీజేపీ గెలుచుకున్న రెండు సీట్లలో అసన్సోల్ ఒకటి. ఈ సారి కూడా ఇక్కడ నెగ్గి మమతా బెనర్జీకి మోదీ దెబ్బ రుచి చూపించాలని కమలనాధులు ఆశిస్తున్నారు.హిందూ మెజారిటీ ఓటర్లు ఉండటం.సీపీఎంలో తటస్తుల ఓట్లు తమకు వస్తాయన్న ఆశ బీజేపీకి గెలుపుపై నమ్మకం కలిగిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో బీజేపీకి 37శాతం, సీపీఎంకు 22 శాతం ఓట్లు వచ్చాయి. ఈ సారి సీపీఎం ఓట్లు సగం వచ్చినా గెలుపు తమదేనని బీజేపీ భావిస్తోంది. సిట్టింగ్ ఎంపీ సుప్రియోకు నియోజకవర్గం ప్రజలతో మంచి సంబంధాలే ఉన్నా యి. జనంలో కలిసిపోయి ఆయన చేసే ప్రచారం ఓటర్లను ఆకట్టుకుంటోంది.అయితే,2018లో నియోజకవర్గంలో జరిగిన మత కలహాలు కషాయం పరపతిని తగ్గించాయి. ఆ గొడవల్లో ఓటర్లు హిందూ–ముస్లింలుగా విడిపోయారు. కలహాల తదనంతరం ఆరెస్సెస్, వీహెచ్‌పీ వంటి బీజేపీ అనుబంధ సంస్థల కార్యకలాపాలు ముమ్మరం కావడంతో ముస్లింలు భద్రత కోసం తృణమూల్ వైపు మళ్లారు. ఈసారి తృణమూల్‌కే ఓటేస్తా మని ముస్లిం పెద్దలు కూడా చెబుతున్నారు. అదీగాక నిరుద్యోగ సమస్య పరిష్కారంలో, మూతపడ్డ పరిశ్రమలను తెరిపించడంలో, ముఖ్యంగా హిందూస్తాన్ కేబుల్స్‌ను తిరిగి తెరిపించడంలో సుప్రియో విఫలమయ్యారన్న ఆగ్రహం ఓటర్లలో బాగా ఉంది. నియోజకవర్గంలో రెండు పార్టీలూ కూడా గెలుపుపై నమ్మ కం పెట్టుకునే పరిస్థితులులేవని ఎన్నికల పరిశీలకుల భావన. -
ఓట్లు పెరిగాయి మరి సీట్లేవీ?
సాక్షి, సెంట్రల్ డెస్క్ : తొట్టతొలి ఎన్నికల నుంచి నేటి వరకూ ప్రతి ఎన్నికల్లో మహిళా ఓటర్ల భాగస్వామ్యం పెరుగుతూ వస్తోంది. ఓటుహక్కుని వినియోగించుకొంటోన్న స్త్రీల సంఖ్య క్రమేణా పెరుగుతోన్నా, రాజకీయ భాగస్వామ్యం మాత్రం స్త్రీలకు అందనంత దూరంలోనే ఉంది. అయితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం మహిళలకి సీట్ల కేటాయింపులో కొంత పరిణతి కనపడుతోంది. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ నాయకత్వంలోని బిజూ జనతాదళ్ (బీజేడీ) మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తామని ప్రకటించింది. ఆ తరువాత తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా దీదీ మహిళలకు 41 శాతం సీట్లిచ్చి తాను మహిళా పక్షపాతినని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. శతాబ్దాలుగా రాజకీయాల్లో మహిళలకు వారి వాటా వారికి దక్కని పరిస్థితుల్లో ఈ రెండు ప్రకటనలూ భారత రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యానికి పునాదిగా నిలవబోతున్నాయి. మమతా బెనర్జీ, మాయావతి, ప్రియాంకాగాంధీ వాద్రా భారత రాజకీయాల్లో బాగా రాణిస్తోన్న నేటి తరుణంలో కూడా క్షేత్రస్థాయిలో మహిళల నాయకత్వానికి ఆమోదం అంతంతగానే ఉంది. ప్రత్యక్షంగా స్త్రీలకు రాజకీయాల్లో అవకాశాలు ఇవ్వకపోవడం ఒకవైపు ఉంటే, మరోవైపు ప్రతి ఎన్నికల్లోనూ స్త్రీల ఓట్ల శాతం మాత్రం పెరుగుతోందని ఇటీవలి ఓ అధ్యయనం వెల్లడించింది. 1962 నుంచీ దేశంలో స్త్రీల ఓట్ల శాతం మొత్తం ఓట్లలో దాదాపు సగభాగంగా ఉన్నా 47 నుంచి 48 శాతమే పోలవుతున్నాయి. పురుషులకన్నా ఓటుహక్కును వినియోగించుకునే స్త్రీల సంఖ్య తక్కువగానే ఉంది. ఇప్పుడిప్పుడే పరిస్థితిలో మార్పు వస్తోంది. 2014లో పోలైన మొత్తం ఓట్లలో మహిళా ఓటర్లు 65 శాతం ఉన్నారు. ఎన్నికల కమిషన్ గణాంకాల ప్రకారం 1967 నుంచి ఇంత అధికసంఖ్యలో మహిళలు ఓటుహక్కుని వినియోగించుకోవడం ఇదే తొలిసారి. 2014లోనే పురుషుల పోలింగ్ శాతం 67గా ఉంది. జమ్మూ కశ్మీర్లో 2014లో అతి తక్కువగా 48 శాతం మాత్రమే మహిళల ఓట్లు పోలయ్యాయి. నాగాలాండ్, లక్షద్వీప్‌లో అత్యధికంగా 88 శాతం మహిళల ఓట్లు పోలయ్యాయి. పెరుగుతున్న స్త్రీల ఓటింగ్ శాతం ప్రణయ్‌రాయ్, దోరబ్ సుపారీవాలా ఇటీవల విడుదల చేసిన పుస్తకంలో పెరిగిన మహిళల ఓట్ల శాతాన్ని నమోదు చేసింది. 2017, 18 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పురుషుల కన్నా మహిళల ఓట్ల శాతం పెరుగుతుందని అంచనా. అంతర్జాతీయ శాంతి సంస్థ కార్నేగీ ఎండోమెంట్ ప్రకారం ఎన్నికల్లో మహిళల భాగస్వామ్యం పెరగడానికి చాలా కారణాలున్నాయి. అందులో ప్రధానమైనవి మహిళల నిర్ణాయకశక్తి, అక్షరాస్యత పెరగడం. భారత ఎన్నికల కమిషన్ సైతం ఎక్కువమంది మహిళలు ఓటుహక్కు వినియోగించుకునేలా అనేక ప్రయత్నాలు చేస్తోంది. మహిళలకు ప్రత్యేక వరుసలు, ప్రత్యేక పోలింగ్ బూత్‌లు, పింక్ బూత్‌ల పేరుతో సౌకర్యాలు కల్పిస్తోంది. ఓటూ లేదు.. సీట్లూ లేవు.. 2014లో 65 శాతం మహిళల ఓట్లు పోలైనా.. ఇంకా అధికసంఖ్యలో స్త్రీలు ఓటుహక్కును వినియోగించుకోవడం లేదు. 2011 సెన్సెస్ ప్రకారం దేశంలో ప్రతి 1000 మంది పురుష ఓటర్లకి 943 మంది మహిళా ఓటర్లున్నారు. 2019 గణాంకాల ప్రకారం ప్రతి వెయ్యిమంది పురుష ఓటర్లకి కేవలం 925 మంది మహిళా ఓటర్లే ఉన్నట్టు తేలింది. ఇదే వివక్ష పార్లమెంటులో మహిళల భాగస్వామ్యాన్ని సైతం ప్రతిబింబిస్తోంది. లోక్‌సభలోని మొత్తం 524 సీట్లలో 66 మంది మహిళలు ఎంపీలుగా ఎన్నికయ్యారు. అందులో ఎక్కువమంది (32) బీజేపీ నుంచే ఉన్నారు. 1952లో లోక్‌సభలో మహిళల సంఖ్య 22. 2014 ఎన్నికల నాటికి ఇది 61కి పెరిగింది. ప్రతి పది మంది లోక్‌సభ సభ్యుల్లో 9 మంది పురుషులుండటం లింగవివక్షకు నిదర్శనం. ప్రపంచ స్థాయిలో చట్టసభల్లో మహిళల సగటు భాగస్వామ్యం 20 శాతం ఉంది. అయితే మన దేశంలో 1952లో 4.4 శాతం ఉండగా, 2014 నాటికి 11 శాతానికి చేరింది. సీట్ల పంపకంలో జాతీయ రాజకీయ పార్టీలు వివక్షను పాటిస్తూనే ఉన్నాయి. మహిళలు గెలవలేరనే భావంతో జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలు స్త్రీలకు సీట్లు కేటాయించడం లేదు. అయితే, మహిళలకు సీట్ల కేటాయింపులో కొంతలో కొంత కాంగ్రెస్ ముందుంది. 2004 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 355 మంది మహిళలు పోటీ చేయగా 45 మందే (కాంగ్రెస్–12, బీజేపీ–10, ఇతరులు– 23 మంది) గెలిచారు. 2009 ఎన్నికల్లో 556 మంది పోటీచేయగా 59 మంది (కాంగ్రెస్–23, బీజేపీ–13, ఇతరులు–23) గెలిచారు. 2014 ఎన్నికల్లో 668 మంది మహిళలు పోటీచేయగా 61 మంది (కాంగ్రెస్–4, బీజేపీ–28, ఇతరులు–29) గెలిచారు. -
బెంగాల్: లేడీస్ దంగల్
సాక్షి, కోల్‌కతా: 2014 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 60 మంది మహిళా సభ్యులు గెలుపొందగా, అందులో 12 మంది అంటే 20 శాతం మంది పశ్చిమ బెంగాల్ నుంచే కావడం గమనార్హం. దేశంలో బెంగాలీల జనాభా శాతానికి ఇది రెట్టింపు కన్నా అధికం. తృణమూల్ కాంగ్రెస్ తరఫున పోటీచేసిన మహిళా అభ్యర్థుల్లో 30 శాతానికి పైగా మంది గెలుపొందారు. తృణమూల్‌కు చెందిన ఉమా సోరెన్ అత్యంత పేద సభ్యురాలు. ఆమె మొత్తం ఆస్తుల విలువ రూ.5 లక్షల కన్నా తక్కువే. గతంలో కన్నా 2014లోనే అత్యధిక సంఖ్యలో మహిళా సభ్యులు లోక్‌సభకు ఎన్నికయ్యారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం తృణమూల్ 41 శాతం సీట్లను మహిళలకే కేటాయించిన సంగతి తెలిసిందే. -
పశ్చిమ బెంగాల్లో యోగి ర్యాలీకి దీదీ షాక్
-
‘మోదీకి కాదు.. దేశానికి వ్యతిరేకులు’
గాంధీనగర్: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిర్వహించిన విపక్షాల ర్యాలీపై ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. వారంతా మోదీ వ్యతిరేకులు కాదనీ, దేశానికి, ప్రజల అభివృద్ధికి వ్యతిరేక శక్తులని విమర్శించారు. దేశంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేని వారే తమపై ఆరోపణలు చేస్తున్నారని మోదీ మండిపడ్డారు. గుజరాత్‌లోని సిల్వసాలో జరిగిన ఓ కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. ప్రజల సొమ్మును దోచుకోకుండా అడ్డుపడుతున్నందుకు వారికి తనపై కోపం రావడం సహజమేనని ఎద్దేవా చేశారు. మహాకూటమి నేతల్లో ఒకరినొకరు కలిసి మాట్లాడుకోలేని నాయకులు అప్పుడే వాటాలను పంచుకోవడం మొదలుపెట్టారని మోదీ ఆరోపించారు. గుజరాత్ పర్యటనలో భాగంగా మోదీ సిల్వసాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. -
బీజేపీకి అనుకూలంగా హైకోర్టు తీర్పు
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో బీజేపీ తలపెట్టిన ‘రథయాత్ర’కు కోల్‌కతా హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. మతపరమైన అల్లర్లు చెలరేగే అవకాశం ఉందనే పశ్చిమబెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో బీజేపీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. గురువారం ఈ కేసులో వాదోపవాదనలు విన్న జస్టిస్ తపబ్రత చక్రవర్తి.. బీజేపీ రథయాత్రకు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు తమ విచక్షణాధికారాలను విపరీతమైన ధోరణిలో చలాయించిన సందర్భాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చు’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ‘సరైన కారణాలు చూపకుండానే అధికారులు యాత్రకు అనుమతిని నిరాకరిస్తున్నారు. సహేతుకమైన షరతులు విధించడం ద్వారానైనా యాత్రను అనుమతించాలా వద్దా అనే ప్రయత్నం కూడా వారు చేయలేదు’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు. రథయాత్ర సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసులను ఆదేశించారు. ‘యాత్ర సాగే మార్గంలో వాహనాల రాకపోకలకు ఎటువంటి అంతరాయం కలిగించరాదు. ప్రభుత్వ ఆస్తులకు ఎలాంటి నష్టం కలిగినా బాధ్యత వహించాలి. రథయాత్రపై కనీసం 12 గంటలు ముందుగా సంబంధిత జిల్లా పోలీసు సూపరింటెండెంట్లకు సమాచారం అందించాలి’ అని బీజేపీ నాయకత్వాన్ని ఆయన ఆదేశించారు. అయితే, ఈ తీర్పును రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసే అవకాశాలున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. తీర్పును స్వాగతించిన జైట్లీ తీర్పును కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ స్వాగతించారు. తమ పార్టీ ర్యాలీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతివ్వకపోవడంపై రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ఎందుకు మౌనంగా ఉన్నాయని ప్రశ్నించారు. ‘పశ్చిమబెంగాల్లో ఒక రాజకీయ పార్టీ తనకున్న హక్కు ప్రకారం తన కార్యక్రమాన్ని నిర్వహించకుండా ప్రభుత్వం అడ్డుకుంటే మానవ హక్కుల కార్యకర్తలు, ప్రతిపక్ష పార్టీలు ఎందుకు మౌనంగా ఉన్నాయి? ఒకవేళ ఎన్డీఏ, బీజేపీ ప్రభుత్వం ఇలా చేస్తే అప్రకటిత ఎమర్జెన్సీ అనే వారు కదా! ఇప్పుడెందుకు మౌనం?’ అంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ నెల 7వ తేదీన ప్రారంభం కావాల్సిన బీజేపీ రథయాత్ర ‘సేవ్ డెమోక్రసీ ర్యాలీ’ప్రభుత్వ అనుమతి నిరాకరణ కారణంగా ఆగిపోయింది. కొత్త షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటించి, యాత్ర ప్రారంభిస్తామని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి దిలీప్ ఘోష్ తెలిపారు. -
స్త్రీలోక సంచారం
►2019 సార్వత్రిక ఎన్నికల్లో సమాజ్‌వాదీ (ఎస్పీ) పార్టీతో పొత్తు కుదుర్చుకోవాలంటే ఆ పార్టీ తమను తగినన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు అంగీకరించవలసి ఉంటుందని స్పష్టం చేసిన బహుజన సమాజ్‌వాదీ (బీఎస్పీ) పార్టీ అధినేత్రి మాయావతి.. అదే సందర్భంలో, ‘భీమ్ ఆర్మీ’ వ్యవస్థాపకుడు చంద్రశేఖర్ఆజాద్ తనను ‘బువా’గా (ఆంటీ) పేర్కొంటూ.. ‘మా ఇద్దరిదీ ఒకే రక్తం’ అని ప్రచారం చేసుకోవడం సరికాదు అని అన్నారు. దీనిపై స్పందించిన ఆజాద్.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశంగానీ, పొత్తులు పెట్టుకోవాలన్న ఆకాంక్ష గానీ తమకు లేవు కనుక బీఎస్పీ ఆందోళన చెందనవసరం లేదని, మాయావతిని తన రక్తసంబంధీకురాలిగా చెప్పుకోవడం వెనుక.. తామిద్దరం దళితులమేనన్న భావన తప్ప, మరొకటి లేదని అన్నారు. ►ఇండియా రాకెట్ రహస్యాలను పాకిస్తాన్‌కు చేరవేశాడన్న ఆరోపణలపై 1994లో అరెస్ట్ అయి, విచారణ అనంతరం 1998లో నిర్దోషిగా విడుదలైన ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్‌కు పరువు నష్టపరిహారంగా కేరళ ప్రభుత్వం ఎనిమిది వారాలలోపు 50 లక్షల రూపాయలను చెల్లించాలని సుప్రీంకోర్టు తాజా తీర్పు. ఆనాటి కేసులో కేరళ పోలీసు అధికారుల ప్రమేయంపై దర్యాప్తు జరిపేందుకు ఒక కమిటీని కూడా నియమించింది. రెండు రోజుల అనంతరం ఈ కేసులోనే 1997లో అరెస్ట్ అయి, ఏడాది తర్వాత నిర్దోషిగా విడుదలైన బాధితురాలు మరియం రషీదా.. తను కూడా కేరళ పోలీసులపై కేసు వేసి, పరిహారం కోరనున్నట్లు ఓ రహస్య ప్రదేశం నుంచి మీడియాకు సమాచారం అందించారు. ‘ఫారినర్స్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ సెల్’ ఇన్స్పెక్టర్గా ఉన్న విజయన్ అనే వ్యక్తి తనను అక్రమంగా నిర్బంధించి, లైంగిక సుఖం కోసం తనను వేధించి, తను తిరస్కరించడంతో కక్షగట్టి ‘ఇస్రో గూఢచర్యం’ కేసులో ఇరికించినట్లు మాల్దీవుల పౌరురాలైన మరియం రషీదా అప్పట్లోనే మీడియా దృష్టికి తీసుకురాగా.. ఇప్పుడీ సుప్రీంకోర్టు తీర్పుతో, దర్యాప్తు కమిటీ నియామకంతో.. రషీదా ధైర్యంగా బయటికి వచ్చారు. ►పనిచేసే చోట మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు నానాటికీ అధికమౌతున్నాయని, బాధితుల నుండి సిటీ పోలీసులకు నెలకు నలభై వరకు లైంగిక వేధింపుల ఫిర్యాదులు అందుతుండగా వాటిల్లో కనీసం మూడు ఫిర్యాదులు పని చేసే చోట లైంగిక వేధింపులపైనే ఉంటున్నాయని హైదరాబాద్ (రాచకొండ) సైబర్ క్రైమ్ విభాగం అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ఎస్.హరినాథ్ తెలిపారు. ఈ విషయమై ‘షీ’ టీమ్స్ ఏసీపీ నర్మద మాట్లాడుతూ.. వాస్తవానికి ఏ కొద్ది మంది మహిళలో ఫిర్యాదు వరకు వస్తున్నారని, ఫిర్యాదు చేయని బాధితులు ఇంకా ఎక్కువ సంఖ్యలోనే ఉండే అవకాశాలున్నాయని అన్నారు. ► రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులను సమీకరించుకోవడం కోసం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన 12 రోజుల పర్యటనలో భాగంగా ఆర్థికమంత్రి అమిత్ మిశ్రా, ఆర్థికశాఖ కార్యదర్శి హెచ్.కె.ద్వివేది, ప్రధాన కార్యదర్శి మాలేడేలతో కలిసి ఆదివారం ఉదయం ఫ్రాంక్ఫర్ట్ (జర్మనీ) బయల్దేరారు. జర్మనీ, ఇటలీ దేశాలలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, అక్కడి ప్రభుత్వ అధికారుల ఆహ్వానంపై విదేశీ పర్యటనకు వెళ్లిన మమత తిరిగి ఈ నెల 28న స్వదేశానికి చేరుకుంటారు. ►ఒక కేరళ న¯Œ పై పలుమార్లు అత్యాచారం జరిపిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జలంధర్ బిషప్ ఫ్రాంకో ములక్కల్.. విచారణకు హాజరయ్యే నిమిత్తం రేపు (సెప్టెంబర్ 18) కొచ్చి ఎయిర్‌పోర్ట్‌లో దిగవలసి ఉండగా.. ప్రజాగ్రహాన్ని, మీడియాను తప్పించుకోడానికి అతడు బెంగళూరు, చెన్నై లేదా మంగళూరు ఎయిర్‌పోర్ట్‌లలో ఏదైనా ఒక దానిలో దిగి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కొచ్చి చేరుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు, బిషప్ తనపై అత్యాచారం జరిపిన విషయాన్ని బాధితురాలు 2016 సెప్టెంబర్‌లో.. రెండు భాగాలుగా విభజించి ఉన్న కన్ఫెషన్ బాక్సులోని ఒక భాగంలో నిలబడి, రెండో భాగంలో ఉన్న మత ప్రబోధకుని ఎదుట చెప్పుకోగా.. ఆమె చెప్పిన వివరాలను వినిన ప్రబోధకుడెవరో గుర్తించడం కోసం 12 మంది ప్రీస్ట్‌లను ప్రత్యేక పోలీసు బృందం ఒకటి రేపే విచారించబోతోంది. ►లండన్‌లో ప్రస్తుతం జరుగుతున్న ‘లండన్ ఫ్యాషన్ వీక్’ ఈవెంట్లో అర్జెంటీనా మోడల్ వలేరియా గార్షియా.. క్యాట్ వాక్ చేస్తూనే ‘బ్రెస్ట్ పంప్’ను ఉపయోగించడం విశేష వార్తాంశం అయింది. ఇద్దరు బిడ్డల తల్లి అయిన వలేరియా.. నలుపురంగు ట్రౌజర్స్ సూటు, బ్రా ధరించి, బ్రా లోపల ఎల్వీ కంపెనీ వారి చప్పుడు చెయ్యని తేలికపాటి బ్రెస్ట్ పంప్‌ను అమర్చుకుని అక్కడ లేని తన రెండో బిడ్డకు అందించడం కోసం పాలను తీసిపెట్టుకుంటున్న ఆ మాతృమూర్తిని ర్యాంప్ పక్కన వరుసగా కూర్చొని ఉన్న న్యాయనిర్ణేతలు అభినందించకుండా ఉండలేకపోయారు. ►బాలలపై లైంగిక అకృత్యాలు జరుగుతున్నాయన్న ఆరోపణలతో ప్రస్తుతం అనేక దేశాల్లోని చర్చిలు తమ ప్రతిష్టను కోల్పోతున్న తరుణంలో.. మహిళలు మతాధికారి పాత్రలను పోషించడం ఎంతైనా అవసరమని కెనడియన్ కార్డినల్ మార్క్ క్వెలెట్ అభిప్రాయపడ్డారు. ఇందు కోసం మహిళలకు శిక్షణ ఇచ్చి మత బోధకులుగా వారికి తర్ఫీదు ఇచ్చేందుకు చర్చి యాజమాన్యాలు ముందుకు రావాలనీ, నిజానికి ‘ప్రీస్ట్హుడ్’ అనే ఉదాత్తమైన బాధ్యత మహిళల నిర్వహణ వల్ల మరింత గౌరవప్రదం అవుతుందని ఆయన అన్నారు. ►28 ఏళ్ల అమెరికన్ గాయని టేలర్ స్విఫ్ట్‌కు కనీసం రెండేళ్ల పాటు దూరంగా ఉండాలని.. కొన్నాళ్లుగా ఆమెను వెంబడిస్తూ, ఉత్తరాలతో వేధిస్తూ, భయపెడుతూ, ద్వేషిస్తూ, ‘ప్రేమిస్తూ’ ఉన్న ఎరిక్ స్వార్బ్రిక్ అనే సైకో అభిమానిని ఆదేశించిన యు.ఎస్.కోర్టు.. ఆ ఆదేశాలు తక్షణం అమలయ్యేలా ‘రిస్ట్రెయినింగ్ ఆర్డర్’(నిషేధాజ్ఞ)ను జారీ చేసింది. ‘‘నిన్ను రేప్ చేస్తాను. రేప్ చేశాక చంపేస్తాను. నీ లాయర్లు, నీ న్యాయస్థానం నా నుండి నిన్ను కాపాడుకోలేవు. ఎందుకంటే నిన్ను అంతగా నేను ప్రేమిస్తున్నాను’’ అంటూ ఎరిక్ స్వార్బ్రిక్ నుంచి వస్తున్న వరుస ఉత్తరాలకు భీతిల్లిన టేలర్ స్విఫ్ట్ కోర్టును ఆశ్రయించగా.. ఎరిక్ ఇకముందు ఆమెను వెంబడించడంపై, ఉత్తరాలు రాయడంపై కోర్టు నిషేధం విధించింది. -
బీజేపీ, కాంగ్రెస్‌లకు షాక్
కోల్కత్తా : రానున్న ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)ను ఎదుర్కొవాలనుకుంటున్న బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత చందన్ మిత్రా శనివారం టీఎంసీలో చేరారు. బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి ప్రధాన సహచరుడైన మిత్రా రెండు సార్లు రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించారు. గత కొంత కాలంగా నరేంద్ర మోదీ, అమిత్ షా నాయకత్వంతో విభేదిస్తున్న మిత్రా ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన మొదటిసారి 2003లో రాజ్యసభలో అడుగుపెట్టగా, 2010లో రెండోసారి మధ్యప్రదేశ్ నుంచి పెద్దల సభకు ఎన్నికైయ్యారు. 2014లో హుగ్లి లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు. మిత్రాతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో నలుగురు ఎమ్మెల్యేలు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమక్షంలో టీఎంసీలో చేరారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమర్ ముఖర్జీ, అబూ తెహర్, షబీనా యాస్మిన్, అఖ్రుజ్‌మాన్‌లు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీఎంసీలు చేరారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీనియర్ నేతలు పార్టీని వీడటం బీజేపీ, కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బగానే భావించాలి. -
‘మానవజాతిని అవమానించింది’
కోల్కత్తా : బెంగాల్లో మరో బీజేపీ కార్యకర్త అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ముర్షిదాబాద్‌కు సమీపంలో మంగళవారం ధోర్మ హజరా అనే బీజేపీ కార్యకర్త అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందారు. ఆదివారం నుంచి కనిపించకుండా పోయిన హజరా చెరువులో మృతదేహమై కనిపించాడు. హజరాను తృణమూల్ నేతలే హత్యచేశారని బీజేపీ ఆరోపిస్తోంది. బీజేపీ కార్యకర్తలు వరస హత్యలకు గురైతున్న నేపథ్యంలో అమిత్ షా అధికార తృణమూల్ కాంగ్రెస్‌పై మండిపడ్డారు. ‘తృణమూల్ కాంగ్రెస్ మరోసారి మానవ జాతిని అవమానపరిచింది. అత్యంత అనాగరికంగా మరో బీజేపీ కార్యకర్తను హత్య చేసింది. బెంగాల్ మరోసారి హింసాత్మకంగా, క్రూరంగా మారింది. హజరాకు నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నా’ అని ట్వీట్ చేశారు. ఘటన జరిగిన వెంటనే బెంగాల్ బీజేపీ ప్రధాన కార్యదర్శి సాయంతన్ బసు, బీజేపీ నేత ముఖుల్ రాయ్ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో ఢిల్లీలో భేటి అయ్యారు. ప్రత్యర్ధులను దెబ్బ తీసేందుకు టీఎంసీ హత్యా రాజకీయలు చేస్తోందని హోం మంత్రికి ఫిర్యాదు చేశారు. బీజేపీ చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని టీఎంసీ జిల్లా పరిషత్ చైర్మన్ షహనాజ్ భేగం అన్నారు. బీజేపీ కార్యకర్త హత్యతో తమ పార్టీకి ఏలాంటి సంబంధం లేదని, అనవసరపు ఆరోపణలు చేస్తే పరవు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. కాగా ఇప్పటి వరకూ ఒక్కరిపై కూడా పోలీసులు కేసు నమోదు చేయలేదని బీజేపీ నేతలు తెలిపారు. -
కాంగ్రెస్‌తో దోస్తీకి సై?
సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. బీజేపీని ఢీకొట్టాలంటే విభేదాలు పక్కన పెట్టి ప్రాంతీయ పార్టీలతో జట్టుకట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్‌తో కలిసి కూటమిగా ముందుకెళ్లేందుకు కాంగ్రెస్ నాయకత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. కాంగ్రెస్, తృణమూల్ పొత్తుపై కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అధీర్ రాజన్ చౌదరి ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్‌తో సంప్రదింపులు మొదలుపెట్టినట్లు ఓ ప్రముఖ జాతీయ దినపత్రిక కథనం ప్రచురించింది. తృణమూల్‌తో పొత్తుకు రాష్ట్ర ఎమ్మెల్యేలు, ఎంపీలు సానూకూలంగా ఉన్నట్లు, టీఎంసీతో కలిసి పోటీ చేస్తే పార్టీ ఓటింగ్ శాతంకూడా పెరిగే అవకాశం ఉందని రాజన్ చౌదరి అధిష్టానానికి తెలిపినట్టు సమాచారం. ఇదే అంశపై టీఎంసీతో చర్చించేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు మొనీహుల్ హక్, అబూ హసిమ్ ఖాన్లు టీఎంసీ ప్రధాన కార్యదర్శి మంత్రి పార్థ ఛటర్జీతో గురువారం సమావేశం అయ్యారు. ఆ మరుసటి రోజే కాంగ్రెస్ నేతలు శుక్రవారం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయ్యారు. రాష్ట్ర నాయకత్వం సానుకూలంగా ఉన్న నేపథ్యంలో తృణమూల్‌తో పొత్తుకు అధిష్ఠానం అంగీకరించే అవకాశం ఉన్నట్లు సదరు వార్తాసంస్థ కథనంలో పేర్కొంది. కాగా 2009 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్-తృణమూల్ కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత కాంగ్రెస్‌తో విభేదించిన మమత 2012లో యూపీఏ ప్రభుత్వం నుంచి బయటకువచ్చారు. 2016లో జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ ఘోర పరాజయంపాలైన విషయం తెలిసిందే. -
నీతి ఆయోగ్‌తో లాభం లేదు
న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ సమావేశం సందర్భంగా బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు (విపక్ష పార్టీలు) తమ ఐక్యతను ప్రదర్శించారు. సమావేశంలో కేంద్ర ప్రభుత్వంపై అంశాల వారీగా విమర్శలు చేశారు. 15వ ఆర్థిక సంఘం నివేదిక, కేంద్ర నిధుల పంపిణీ తదతర అంశాలపై ఎన్డీయే ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. నీతి ఆయోగ్‌తో రాష్ట్రాలకు ఎలాంటి లాభం లేదని. ఏదో జరుగుతుందని కూడా తాము భావించడం లేదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. ‘రాష్ట్రాల సమస్యలను తెలుసుకునేందుకు కేంద్రం ప్రయత్నించిందా? ప్రతి రాష్ట్రానికి వేర్వేరు సమస్యలున్నాయి. కేంద్రం విధివిధానాలను నిర్ణయిస్తుంది. కానీ అమలుచేయాల్సిన బాధ్యత రాష్ట్రాలదే కదా. కేంద్రం సహకార సమాఖ్య విధానాన్ని అవలంబించాలి. రాష్ట్రాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు’ అని ఆమె పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు రైతు రుణమాఫీని సమావేశంలో లేవనెత్తారు. రైతు రుణమాఫీలో 50 శాతం సాయాన్ని కేంద్రమే భరించాలని కర్ణాటక సీఎం కుమారస్వామి కోరారు. 15వ ఆర్థిక సంఘం విధివిధానాలను పునర్నిర్వచించాలని కేరళ సీఎం పినరయి విజయన్ కోరారు. ‘కేంద్రం విడుదల చేసే నిధులు రాష్ట్రాలకు సమానంగా చేరేందుకు.. 15వ ఆర్థిక సంఘం విధివిధానాలను పునర్నిర్వచించాలి’ అని ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నారు. -
బెంగాల్‌పై కమళనాథుల గురి
కోల్‌కతా: రానున్న ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో పాగా వేసేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగా లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం మరళీదర్ సేన్ రోడ్ ఉన్న రాష్ట్ర ప్రధాన కార్యాలయాన్ని విశాలమైన ప్రాంతానికి తరలిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ తెలిపారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జిల్లా కేంద్రం నుంచి ఢిల్లీలోని ప్రధాన కార్యలయానికి అనుసంధానిస్తూ వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడే విధంగా పార్టీ కార్యాలయాలను నిర్మిస్తున్నట్లు దిలీప్ ప్రకటించారు. ప్రస్తుతం పార్టీని 36 శాఖలను విభజించామని, గ్రామీణ, బ్లాక్లేవల్లో కార్యకర్తలకు అందుబాటులో ఉండేందుకు వీలుగా నిర్మిస్తున్నామని తెలిపారు. వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలకు రాష్ట్రంలో అన్ని ప్రధాన నగరాల్లో విశాలమైన, అధునాతన భవనాలు ఉన్నాయని, తాము ఇంకా జిల్లా స్థాయిలో కూడా కార్యాలయాలు నిర్మించుకోలేదన్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో పార్టీకి అందుబాటులో ఉండే నేతలకు కొత్త వాహనాలను ఇవ్వనున్నట్లు తెలిపారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 42 స్థానాల్లో బీజేపీ పోటీచేస్తుందని పార్టీ ప్రధాన కార్యదర్శి శుభాష్ సర్కార్ ప్రకటించారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ మంచి ఫలితాలు సాధించిందని, తృణమూల్‌కి ప్రత్యామ్నాయం బీజేపీనే అని అన్నారు. -
నా సోది
మన గ్రామాల్లో ఇప్పటికీ సోది చెప్పేవారు వస్తుంటారు. వీరు సాధారణంగా గిరిజనులై ఉంటారు. సినీమాలో సోదిని సాధారణంగా మారు వేషంలో హీరో హీరోయిన్‌కీ, హీరోయిన్‌కి హీరో మనిషి సోది చెప్పి ఇద్దరూ కలిసేటట్టు చేస్తారు. ఏమైనా ఈ ‘సోది’లో చిన్న నాటకం పాలు ఎక్కు వుంది. మనం సినీమా ‘సోది’ మనిషితో సాధారణంగా ఏకీభవి స్తాం. ఒకప్పుడు ఏకీభవించకపోనూ వచ్చు. ఇప్పుడు నాకు అలాంటి సోది చెప్పాలని మనసు పుట్టింది. మన దేశంలో ప్రతిపక్షాలన్నీ ఒక్కటై పోటీ చేస్తే బీజేపీని ‘సోది’లోకి లేకుండా ఓడించగలవు. సందే హం లేదు. కానీ సమస్య అల్లా ఎలా అన్నదే. ఈ దేశంలో ఎవరూ ఎవరితోనూ ఏకీభవించరు. దాదాపు మెజారిటీ వచ్చిన బీజేపీని అటకెక్కించిన కర్ణాటకలో పదవీ స్వీకారం చేసిన రెండు వారాలకు ఒకానొకరకమైన మంత్రిమండలి ఏర్పడింది. మళ్లీ ఎందుకైనా మంచి దని కాంగ్రెస్ తన వాటా కోటాలో నాలుగైదు మంత్రి పదవుల స్థానాలను ఖాళీగా ఉంచింది. అలాగే కుమారస్వామి కూడా కనీసం మూడు స్థానాలను ఖాళీ ఉంచారు. ఇప్పుడు ఎం.బి. పాటిల్ వంటి వారు ఎదురు తిరిగితే వారికి ఇవ్వ డానికి స్థానాలు రెడీగా ఉన్నాయి. ఇది కలిసి పనిచేసే రెండు దక్షిణాది ప్రతిపక్షాల నీతి. నేను మాయావతి పెద్దరికాన్ని అంగీకరించి అవసరమైతే– బీజేపీని ఓడించటానికి తలవొంచుతాను– అని అఖిలేష్ యాదవ్ ఇవాళ వాక్రుచ్చారు. మమతా బెనర్జీ ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌తో చెయ్యి కలపరు. అలా కలపడం ఇష్టంలేని మరో సీఎం కేసీఆర్ ముందురోజే వచ్చి కుమారస్వామిని పలకరించి వెళ్లారు. అలాంటి మరొక వ్యక్తి ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్. సరే. తమ రాష్ట్రానికి రావలసిన ప్రత్యేక హోదా కోసం మన బాబు ఎవరితోనైనా చేతులు కలపగలరు. ఇక కమ్యూనిస్టు పార్టీకీ, కాంగ్రెస్కీ చుక్కెదురు. అయితే బీజేపీకి ‘పెద్ద’ చుక్క ఎదురు. కనుక– ప్రతిపక్షాల సమీకరణలో వారు కలుస్తారా? ఇది ప్రశ్న. కానీ ఈ పార్టీలన్నీ ఈ దిక్కుమాలిన బీజేపీని కలిసికట్టుగా ఓడించాలి. ఎలా? నాది ఒక బ్రహ్మాస్త్రం ఉంది. ఎవరికీ ఏమీ ఇబ్బంది లేకుండా ఈ దేశం అంతటిలో 380 పార్లమెంటు సభ్యులను ఎంపిక చెయ్యండి. మరి ఇంతమంది మన పార్లమెం టులో పడతారా? ఎవడు చూడొచ్చాడు? ఆయా ప్రాంతాలకు వినియోగపడేటట్టు–కనీసం–15 పద వులు వేరుగా ఉంచండి. ఎవరైనా గట్టిగా ఎదురుతిరి గితే– కార్యార్థం మంత్రి పదవి ఖాళీగా ఉంటుంది. మరి మమతాబెనర్జీ, కేరళ సీఎం పినరయి విజ యన్ మాట వింటారా? అలాగే బాబు కేసీఆర్ ఆజ్ఞని పాటిస్తారా? కనుక– ఇక్కడే నా ‘ఆసు’ ఉంది. ఈ ఏర్పాటులో ప్రతీ ప్రాంతానికీ ఒక ప్రధానమంత్రి ఉండాలి. తమరు గమనించారో లేదో– ఇప్పుడు పద వులు పొందిన కర్ణాటక మంత్రులకు ఐదేళ్ల ‘పదవి’ లేదు. అలాగే ప్రాంతీయ ప్రధానమంత్రులకు కూడా పూర్తి ఐదేళ్లు ఇవ్వనక్కరలేదని నా ఉద్దేశం. ఉదా హరణకి దక్షిణాదికి ఎడపాడి పళనిస్వామి, పన్నీరుసెల్వం ఉంటారు. రెండో భాగంలో కేసీఆర్ రావచ్చు. అలాగే– తూర్పుకి శర ద్పవార్, పశ్చిమానికి మమతా బెనర్జీ, ఉత్తరానికి–నాకు రెండు పేర్లున్నాయి. షేక్ అబ్దుల్లా, కేజ్రీవాల్. ఇంక తగాదాలు వచ్చే ప్రసక్తి లేదు. ఏ ప్రాంతపు ప్రధాని, ఆ ప్రాంతపు సమ స్యలను పరిష్కరిస్తారు. అవసరమైతే పద వులు మార్చడానికి బోలెడన్ని పదవులు న్నాయి. మాయావతి ఏనుగుల పార్కుల్ని నిర్మించి– దళితులకు సేవ చేస్తారు. బాబు నదులన్నీ ఏకం చేసే పనిమీద ఉంటారు. అందరు పార్లమెంటు మెంబ ర్లకూ రోజూ దిక్కుమాలిన పార్లమెంటుకి వెళ్లాల్సిన అవసరం లేదు. కేకలువేసి, అల్లరి చేసి, స్పీకర్ మీద చిత్తు కాగితాలు విసిరే వారికే ప్రాధాన్యం ఇస్తారు. దేశంలో ఏ గొడవా లేకుండా, బీజేపీ సోదిలోకి కనిపించకుండా– సామరస్యంగా పాలన జరుగు తుంది. వీళ్లందరూ ఎవరితోనూ ప్రమేయం పెట్టుకో కుండా– చక్కగా తమ ప్రాంతంలో ‘ప్రధాని’ పద విని నిర్వహించుకోవచ్చు. అసలు ఎందుకిలా అయింది? ఈ నాయకులు మొన్న మొన్నటిదాకా ప్రజలతో ‘మన’ అంటూ మాట్లాడి ప్రస్తుతం ‘తన’కి సెటిల్ అయ్యారని రాజకీయాలు చెప్తున్నాయి. ఈ దేశంలో ప్రతిపక్షాలన్నీ ఏకమై– పాలక వర్గాన్ని ఓడించటంలో ‘చమత్కారం’ ఈ దేశంలో ఇద్దరికే తెలుసని నా ఉద్దేశం–మోదీ, అమిత్ షా. ఇది నా సోది. గొల్లపూడి మారుతీరావు -
బెంగాల్లో రాజకీయ హత్య?
కోల్‌కతా : బెంగాల్లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కార్యకర్త రాజకీయ హత్య సంచలనం రేపుతోంది. పురులియా జిల్లాలోని దాభా గ్రామంలో శనివారం దులాల్ అనే వ్యక్తి విద్యుత్ స్తంభానికి ఉరి వేసి వేలాడుతున్నాడు. రెండు రోజుల క్రితం ఇదే ప్రాంతంలో త్రిలోంచల్ అనే బీజేపీ కార్యకర్త చెట్టుకు వేలాడుతూ శవమై కనిపించిన సంగతి తెలిసిందే. కాగా, దులాల్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాడని, దీని వెనుక తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)నేతల హస్తం ఉందని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. టీఎంసీ నేతలే ఇరువురు కార్యకర్తలను హతమార్చి ఆత్మహత్యలుగా చిత్రీకరిస్తున్నారని స్థానిక బీజేపీ నేతలు ఆరోపించారు. దీనిపై వెంటనే సీబీఐపై దర్యాప్తుకు ఆదేశించాలని స్థానిక బీజేపీ నేత రాహుల్ సిన్హా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యకర్తల మృతిపై బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంలో సీఎం పూర్తిగా విఫలమయ్యారని షా మండిపడ్డారు. కాగా, బీజేపీ చేస్తున్న ఆరోపణలను టీఎంసీ సీనియర్ నేత, ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ ఖండించారు. బీజేపీ కార్యకర్తల మరణాలతో తృణమూల్‌కు ఎలాంటి సంబంధం లేదని, పోలీసుల విచారణలో నిజాలన్నీ వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. వరుస అనుమానాస్పద మృతి సంఘటనలపై వెంటనే దర్యాప్తు చేయాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్టుమెంట్(సీఐడీ)ను ఆదేశించారు. వరుస ఘటనలపై దర్యాప్తును ప్రారంభించిన ఎస్పీ జాయ్ బిశ్వాస్.. మొదటి ఘటనపై హత్య అనుమానాలు(వ్యక్తిగత కక్ష కారణంతో హత్య) ఉన్నాయని, రెండో ఘటన ఆత్మహత్యలా ఉందని చెప్పారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన అనంతరం విచారణను ముమ్మరం చేస్తామని వెల్లడించారు. Distressed to know about yet another killing of BJP karyakarta Dulal Kumar in Balrampur, West Bengal. This continued brutality and violence in the land of West Bengal is shameful and inhuman. Mamata Banerjee’s govt has completely failed to maintain law and order in the state. pic.twitter.com/jrA1prcs91 — Amit Shah (@AmitShah) June 2, 2018 -
మమతా బెనర్జీ అసంతృప్తి..!!
బెంగుళూరు : కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల కూటమి తరపున జేడీఎస్ నేత కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. బుధవారం జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి సోనియా గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీలతో పాటు పలు రాష్ట్రాల కీలక నేతలు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ ప్రతిపక్షాల కూటమిని చూస్తే 2019లో జరగబోయే ఎన్నికలకు ముందుగానే సమరశంఖం పూరించారన్నట్లు ఉంది. ఈ కార్యక్రమానికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా హజరయిన సంగతి తెలిసిందే. అయితే దీదీ వేదిక వద్దకు వచ్చేటప్పుడు ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. వేదిక వద్దకు వెళ్లడానికి ఏర్పాటు చేసిన భద్రతా చర్యల వల్ల మమతా బెనర్జీకి ఇబ్బంది తలెత్తిందని సమాచారం. ప్రమాణ స్వీకారం జరుగుతున్న వేదిక వద్దకు చేరుకోవడానికి ఉన్న దారిలో కదలడానికి వీలు లేకుండా వాహనాలతో రోడ్డును మూసివేసారని, దాని వల్ల దీదీ వేదికను చేరుకునేందుకు కొద్దీ దూరం నడిచి వచ్చారని సమాచారం. దీదీ వేదిక మీదకు వస్తున్నప్పుడు ఆమె అసహనం ఉండటం కెమెరా కంటికి చిక్కింది. అంతేకాకుండా తనకు కలిగిన ఇబ్బంది గురించి కర్ణాటక డీజీపీ నీలమణి రాజు వద్ద కూడా మమతా బెనర్జీ అసంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం రెడ్ కార్పెట్ మీద నడుచుకుంటూ అతిథులు ఉన్న వేదిక వద్దకు చేరారు. అక్కడ మమతా బెనర్జీని మాజీ ప్రధాని, కుమార స్వామీ తండ్రి హేచ్‌డీ దేవగౌడ వేదిక మీదకు ఆహ్వానించారు. అనంతరం అతిథులకు కేటాయించిన ప్రదేశంలో కూర్చున్న తర్వాత మిగతా ప్రముఖులతో మమతా ముచ్చటించారు. అలానే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హజరయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పాటు మరికొంత మంది ఆప్ పార్టీ నాయకులకు కూడా ప్రమాణ స్వీకార వేదిక వద్దకు హజరు కావడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదు. ఈ విషయం గురించి ఆప్ అధికార ప్రతినిధి రాఘవ్ చదా ‘బెంగుళూరులో ఉన్నంత ట్రాఫిక్ దేశంలో మరెక్కడా ఉండదు. అందువల్లే మేము ప్రమాణ స్వీకార వేదిక వద్దకు నడుచుకుంటూ వెళ్లాము’అని ట్విట్ చేశారు. -
పంచాయతీ ఎన్నికల్లో టీఎంసీ హవా
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో టీఎంసీ హవా కొనసాగుతోంది. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు తృణమూల్ కాంగ్రెస్ 110 పంచాయతీలను గెలుచుకోగా.. 1200 స్థానాలకు పైగా అధిక్యంలో కొనసాగుతుంది. బీజేపీ 4 స్థానాలు గెలుచుకుని, 81 స్థానాల్లో ముందంజలో ఉంది. సీపీఐ(ఎం) 3 స్థానాలు గెలుచుకుని 58 స్థానాల్లో అధిక్యంలో ఉంది. కాగా గొడవలు, గందరగోళం మధ్య జరిగిన పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికలకు ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ప్రారంభమైంది. సోమవారం జరిగిన ఎన్నికలు చాలా చోట్ల ఘర్షణ వాతావరణంలోనే జరిగాయి. పంచాయతీ ఎన్నికల్లో జరుగుతున్న ఘర్షణలపై ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీపై తీవ్రంగా మండిపడ్డారు. 2019 ఎన్నికలకు ముందు జరుగుతున్న ఎన్నికలైనందున అన్ని పార్టీలు వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. -
‘ఎన్నికల కంటే ప్రజాస్వామ్యం ముఖ్యం’
కోల్‌కతా: పంచాయతీ ఎన్నికల సందర్భంగా బెంగాల్లో జరిగిన హింసాత్మక ఘటనలను ప్రధాని మోదీ ఖండించారు. ఈ నెల 12 జరిగిన బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో అధికార తృణమూల్, బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో 12 మంది ఓటర్లు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మోదీ బుదవారం స్పందించారు. ఎన్నికల కంటే ప్రజాస్వామ్యం ముఖ్యమని వ్యాఖ్యానించారు. అధికార తృణమూల్ బీజేపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుందని, ఇది ప్రజాస్వామ్యంపై దాడిలాంటిదని ఆరోపించారు. బెంగాల్ ప్రాంతం చాలా గొప్పదని అలాంటి ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే ఎన్నికలు కూడా శాంతియుతంగా నిర్వహించుకోవాలని మోదీ తెలిపారు. ఇలాంటి ఘటనలను ఖండించాల్సిన అవసరముందని, వాటికి ఇంతటితో ముగింపు పలకాలని కోరారు. ఎన్నికల సందర్భంగా ఆరవైవేల మంది సిబ్బందిని మోహరించినా కూడా పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరగడంపై ప్రతిపక్షాలు అధికార తృణమూల్‌పై విమర్శిల వర్షం కురిపిస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ అధికారాన్ని అడ్డంపెట్టుకుని హింసాత్మక ఘటనలను ప్రోత్సహిస్తోందని, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయాలని త్నణమూల్ నేతలు భావిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. -
‘ర్యాలీలతో రాముడి పేరు చెడగొడుతున్నారు’
సాక్షి, కోల్‌కతా: శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా నిర్వహించే ర్యాలీలతో శ్రీరాముడి పేరును చెడగొడుతున్నారంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీరామ నవమి రోజు ర్యాలీల సందర్భంగా జరిగే మత ఘర్షణలపై సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆయుధాలతో శోభాయాత్రలు జరపాలని దేవుడు ఎవరికైనా చెప్పారా అంటూ ఆమె ప్రశ్నించారు. కొంత మంది అవివేకులు ఆయుధాలతో ర్యాలీలు చేస్తూ దేవుడి పేరు చెడగొడుతున్నారని ఆమె మండిపడ్డారు. శాంతీయుతమైన ర్యాలీలకు మాత్రమే తాను అనుమతి ఇస్తానని, ఆయుధాలతో ఇతరుల ఇంట్లోకి వెళ్లి హత్యచేసే ర్యాలీలకు అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మత పరమైన ర్యాలీలు నిర్వహించినప్పుడు ఘర్షణలు జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా, గతేడాది దుర్గ మాత శోభాయాత్ర, మొహర్రం పండుగలు ఒకే రోజున వచ్చినప్పుడు కూడా సీఎం మమతా బెనర్జీ చాకచక్యంగా వ్యవహరించి మత ఘర్షణలు జరగకుండా జగ్రత్తలు తీసుకున్నారు. మన దేశంలో సాధారణంగా సిక్కు మతస్థులు ఆయుధాలతో ర్యాలీలు నిర్వహించడం చూస్తుంటాం. అయితే మత పరమైన ర్యాలీలలో కత్తులు, తుపాకులతో ప్రదర్శనలు నిర్వహించడం చట్టరీత్యా నేరం. -
‘బీజేపీకి గడ్డుకాలం తప్పదు’
కోల్‌కతా : 2019 ఎన్నికలలో బీజేపీకి ఓటమి తప్పదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జోస్యం చెప్పారు. త్రిపుర లాంటి చిన్న రాష్ట్రాన్ని గెలవడానికి బీజేపీ కేంద్ర బలగాలను, పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేసిందన్నారు. ఇప్పుడు ఆ పార్టీ బెంగాల్‌పై దృష్టిసారించిందని, బీజేపీ ప్రయత్నాలను బెంగాలీలు నిలువరిస్తారన్నారు. టీడీపీ, శివసేనలు ఎన్డీఏ కూటమినుంచి తప్పుకోవడం చూస్తుంటే బీజేపీకి గడ్డుకాలం తప్పదనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. త్రిపురలో లెనిన్ విగ్రాహాన్ని కూల్చడానికి బీజేపీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంలోకి వచ్చిన పార్టీ ప్రజలకు మంచి చేయాలని చూడాలే తప్ప ఇలా అంతర్జాతీయ నేతల విగ్రహాలను కూల్చడం హేయమైన చర్యని ఆమె అభిప్రాయపడ్డారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ విగ్రహాన్ని కూల్చిన వారిపై తాము కఠినంగా వ్యవహరిస్తామని, నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టమన్నారు. -
ఈ చిక్కులు వారి చలవే..
సాక్షి,కోల్‌కతా: సులభతర వాణిజ్యంలో పశ్చిమ బెంగాల్ మెరుగైన సామర్థ్యం కనబరిచినా గత వామపక్ష ప్రభుత్వ హయాం నుంచి సంక్రమించిన సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ప్రవాస భారతీయులు బెంగాల్‌కు పెద్ద ఎత్తున పెట్టుబడులతో తరలిరావాలని పిలుపు ఇచ్చారు.హొరాసిస్ ఏసియా సదస్సును ఉద్దేశించి మమతా బెనర్జీ మాట్లాడారు. సులభతర వాణిజ్యంలో బెంగాల్ ర్యాంక్ గణనీయంగా మెరుగుపడి దేశంలోనే తృతీయ స్ధానానికి ఎగబాకిందన్నారు. 34 ఏళ్ల వామపక్ష పాలనతో కొన్ని అంశాలు ముందుకొచ్చాయని, అవి సమసిపోయేందుకు కొద్దిసమయం పడుతుందన్నారు. బెంగాల్లో మౌలిక సదుపాయాలు, పనిసంస్కృతి గణనీయంగా మెరుగయ్యాయని అన్నారు. జనవరి 16,17 తేదీల్లో జరిగే బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సదస్సుకు హాజరుకావాలని ప్రతినిధులను మమతా బెనర్జీ ఆహ్వానించారు. -
వ్యక్తిగత స్వేచ్ఛకు ఆధార్ ముప్పు
సాక్షి,కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆధార్ అనుసంధానాన్ని మరోసారి తప్పుపట్టారు. ఆధార్ వివరాలను ప్రభుత్వ వెబ్సైట్లలో ఉంచుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆధార్ లింకేజ్ సమస్యాత్మకం..ఆధార్ కార్డు పేరుతో 210 ప్రభుత్వ వెబ్సైట్లలో వివరాలు ఉంచుతున్నారు..ఇది వ్యకిగత స్వేచ్ఛకు, సమాజానికి, దేశానికి పెను ముపు’ అని దీదీ ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు తప్పులు చేస్తూ కూడా సంతోషంగా ఉన్నారని కేంద్ర పెద్దలకు చురకలు వేశారు. ఆధార్‌పై గతంలోనూ మమతా బెనర్జీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు.తన మొబైల్ కనెక్షన్ కట్ చేసినా తాను మాత్రం ఆధార్‌ను మొబైల్ పోన్‌కు లింక్ చేయనని మమతా తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. -
తొలి వార్షికోత్సవం : నా ట్విట్టర్ డీపీ అదే
కోల్కత్తా : పెద్ద నోట్ల రద్దు తొలి వార్షికోత్సవ సందర్భంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన ట్విట్టర్ అకౌంట్ డీపీని మార్చేశారు. తన ట్విట్టర్ డీపీ పూర్తిగా నల్లటి రంగును పెట్టుకున్నారు. నోట్ బ్యాన్‌కు వ్యతిరేకంగా ఆమె ఈ విధంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. '' నోట్ల రద్దు ఓ విపత్తులాంటిది. ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన ఈ స్కామ్(డీమానిటైజేషన్)కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ.. నవంబర్ 8ని మేము బ్లాక్ డేగా పరిగణిస్తాం'' అని మమతా చెప్పారు. ప్రజలను తీవ్ర స్థాయిలో బాధపెట్టిన నోట్ల రద్దు, జీఎస్టీకి వ్యతిరేంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వర్కర్లు ర్యాలీలు జరుపుతారని తెలిపారు. ప్రజలను వేధించిన జీఎస్టీ, అతిపెద్ద స్వార్థపరమైన పన్ను అని అభివర్ణించారు. ఉద్యోగాలను కొల్లగొట్టిందని, వ్యాపారాలను దెబ్బతీసిందని, ఆర్థిక వ్యవస్థకు నష్టం వాటిల్లేలా చేసిందని మండిపడ్డారు. జీఎస్టీ విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తీవ్రంగా విమర్శించారు. గతేడాది ప్రభుత్వం ప్రకటించిన నోట్ల రద్దును తీవ్ర స్థాయిలో వ్యతిరేకించిన వారిలో మమతా బెనర్జీ ఒకరు. బ్లాక్‌మనీకి వ్యతిరేకంగా ప్రధాని నరేంద్రమోదీ పాత రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేసిన కొన్ని రోజుల్లోనే, దీనిపై అధ్యక్షుడికి ఓ మెమోరాండం సమర్పించారు. తర్వాత మోదీ ప్రభుత్వం తీసుకున్న అతిపెద్ద ఆర్థిక సంస్కరణ జీఎస్టీ అమలును కూడా ఆమె వ్యతిరేకించారు. దీని ఆవిష్కరణ సందర్భంగా పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఆ అర్థరాత్రి జరిగిన ఫంక్షన్‌కు మమతా బెనర్జీ పార్టీ బాయ్‌కాట్ చేసింది. -
మమతా సర్కార్‌పై సుప్రీం సీరియస్
సాక్షి, న్యూఢిల్లీ: సాంఘిక సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందేందుకు ఆధార్ లింకేజ్‌ను అనివార్యం చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ న్యాయస్ధానాన్ని ఆశ్రయించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సర్కార్‌పై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఓ రాష్ట్రం కేంద్ర నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఎలా అప్పీల్‌ను నమోదు చేస్తుందని సర్వోన్నత న్యాయస్ధానం ప్రశ్నించింది. సమాఖ్య వ్యవస్థలో పార్లమెంట్ అధికారాన్ని సవాల్ చేస్తూ ఓ రాష్ట్రం ప్రభుత్వం న్యాయస్ధానాన్ని ఎలా ఆశ్రయిస్తుందని నిలదీసింది. ప్రభుత్వ పథకాల సబ్సిడీలు కార్మిక శాఖ నుంచి లబ్ధిదారులకు చేరుతున్న క్రమంలో ఆ శాఖ పిటిషన్‌ను దాఖలు చేసిందని మమతా సర్కార్ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకు నివేదించారు. కేంద్రం నిర్ణయాన్ని వ్యక్తులు సవాల్ చేయవచ్చని, రాష్ట్రాలు కోర్టులను ఆశ్రయించలేవని దీనిపై తమకు స్పష్టత ఇవ్వాలని జస్టిస్ ఏకే సిక్రీ, అశోక్ భూషణ్‌లతో కూడిన ధర్మాసనం బెంగాల్ సర్కార్‌ను వివరణ కోరింది. మమతా బెనర్జీ ఓ వ్యక్తిగా ముందుకు వచ్చి దీనిపై పిటిషన్ వేస్తే స్వాగతిస్తామని కోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి పిటిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వాలు వేయవచ్చని, అందుకు అనుగుణమైన మార్పులను పిటిషన్లో సవరిస్తామని కపిల్ సిబల్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అనంతరం ఆధార్‌తో మొబైల్ ఫోన్ నెంబర్ల అనుసంధానం వంటి నిర్ణయాలను సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై నాలుగు వారాల్లోగా బదులివ్వాలని నోటీసుల్లో పేర్కొంది. తాను మొబైల్ ఫోన్ నెంబర్‌ను ఆధార్‌కు లింక్ చేయనని, అధికారులు దమ్ముంటే తన ఫోన్‌ను డిస్కనెక్ట్ చేయవచ్చని దీదీ సవాల్ విసిరిన నేపథ్యంలో సుప్రీంకోర్టు రూలింగ్ తృణమూల్ చీఫ్‌కు ఇబ్బందికరమేనని భావిస్తున్నారు. -
ఫోన్ పనిచేయకపోయినా ఆ పని చేయను
కోల్‌కతా: తన మొబైల్ నెంబర్‌కు ఆధార్ జతపరిచేది లేదని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఈ రోజు జరిగిన పార్టీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. తన ఫోన్ పనిచేయకపోయినా సరే తాను మాత్రం మొబైల్ నెంబర్‌కు ఆధార్ లింక్ చేసుకునేది లేదని ఆమె తెలిపారు. ఈ ఆధార్ లింక్ చేయాలనే దానిపై వేసిన కేసులను ఈ నెల 30వ తేదీన సుప్రీంకోర్టు పరిశీలించనున్నది. కేంద్ర ప్రభుత్వం నిరంకుశ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, కేంద్రంలో అధికారం నుంచి బీజేపీని తప్పించేందుకు తమ పార్టీ కృషి చేస్తుందని ఆమె తెలిపారు. బీజేపీ పాలకులు ప్రజల స్వేచ్ఛ, హక్కుల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆమె విమర్శించారు. ఆధార్ నంబర్‌ను మొబైల్ ఫోన్‌కు లింకు చేయాలనడం తగదన్నారు. నోట్ల రద్దుకు వ్యతిరేకంగా నవంబర్ 8న బ్లాక్ డే నిర్వహిస్తామని, ఆ రోజున రాష్ట్రంలో నల్ల జెండాలతో నిరసన చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఎవరూ తనకు వ్యతిరేకంగా నోరెత్తకూడదని కేంద్ర ప్రభుత్వం ఐటీ, ఈడీ, సీబీఐ సంస్థలను ప్రయోగిస్తోందని బెనర్జీ ఆరోపించారు. తమ పార్టీ నాయకులందరూ జైలుకు వెళ్లినా సరే టీఎంసీ పోరాడుతుందని, తాము పిరికివాళ్లం కాదని అన్నారు. -
ఢిల్లీలో నేనుంటే.. మోడీ జైలుకే!
మమతా బెనర్జీ మండిపాటు ఎన్నికల తరువాత బెంగాల్ ప్రజలే ఆయన్ను తరిమేస్తారు నమో అంటే కాంగ్రెస్‌కు వణుకు బరంపూర్ (పశ్చిమ బెంగాల్): తానే హస్తినలో ఉంటే నరేంద్రమోడీని జైలుకు పంపేదాన్నని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే మే 16 తరువాత అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయులను కట్టగట్టి దేశం నుంచి వెళ్లగొడతామంటూ మోడీ పేర్కొనటంపై ఆమె తీ వ్రంగా ప్రతిస్పందించారు. వారంతా దీర్ఘకాలంగా నివసిస్తున్న పౌరులని చెప్పారు. మోడీ పేరు చెబితే కాంగ్రెస్ వెన్ను లో వణుకు పుడుతోందని ఎద్దేవా చేశారు. ‘వారికి (కాంగ్రెస్) ధైర్యం లేదు. అది భయం గూడుకట్టుకున్న పార్టీ. సర్దుబా ట్లు, మ్యాచ్ ఫిక్సింగ్‌లతో ఆ పార్టీ నెట్టుకొస్తోంది. మోడీతో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయింది’ అని మమత వ్యాఖ్యానించారు. శుక్రవారం ముర్షీదాబాద్ జిల్లాలో ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ స్థానంలో ఢిల్లీలో తాను అధికారంలో ఉంటే నరేంద్రమోడీ నడుముకు తాడు కట్టి జైలుకు పంపేదాన్నని వ్యాఖ్యానించారు. మోడీ అప్పుడే ప్రధాని అయినట్లు భ్రమలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ‘మైనార్టీ సోదర సోదరీమణులారా.. మే16 తరువాత మిమ్మల్ని వెళ్లగొడతారట. మీరిది విన్నారా..?’ అని మమత ప్రశ్నించారు. ఎన్నికల ఫలితాల తరువాత బెంగాల్ ప్రజలు ఆయన్నే తరిమేస్తారని, సామాన్లు సర్దుకుని సిద్ధంగా ఉండాలని సూచించారు. మోడీ ప్రధాని కావటం అసాధ్యం: కాంగ్రెస్ మోడీ ప్రధాని కావటం అసాధ్యమని కాంగ్రెస్ పేర్కొంది. ‘బీజేపీ లేదా ఎన్డీయేకు మద్దతిచ్చే పార్టీలు లేవు. ప్రతి పార్టీ బీజేపీ, మోడీ నుంచి దూరంగా జరుగుతున్నాయి. తగినంత బలం లేకుండా మోడీ ప్రధాని కాలేరని, బీజేపీ అధికారంలోకి రాదని మేం ఎప్పటి నుంచో చెబుతున్నాం. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యా బలం వారికి లభించదు’ అని కాంగ్రెస్ పేర్కొంది. -
ఈసీ ఆదేశాలకు తలొగ్గిన మమత
అధికారుల బదిలీకి అంగీకారం... ఇది కక్షసాధింపంటూ ధ్వజం దుర్గాపూర్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ ఎట్టకేలకు ఎన్నికల కమిషన్ (ఈసీ) ఆదేశాలకు తలొగ్గారు. జైలుకైనా వెళ్తానుగానీ ఎన్నికల అధికారుల బదిలీకి అంగీకరించబోనంటూ సోమవారం తెగేసి చెప్పిన ‘దీదీ’ మంగళవారం మెట్టుదిగారు. విధుల్లో పక్షపాతంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురు అధికారులను బుధవారం ఉదయం 10 గంటల్లోగా బదిలీ చేయాల్సిందేనంటూ ఈసీ అల్టిమేటం జారీచేయడంతో మమత అయిష్టంగానే బదిలీకి అంగీకరించారు. ఈసీ ఆదేశాలను అమలు చేస్తానని దుర్గాపూర్‌లో మంగళవారం హడావిడిగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ‘‘ఈసీ ఆదేశాల ప్రకారం నలుగురు జిల్లా ఎస్పీలు, ఒక జిల్లా మేజిస్ట్రేట్, ఇద్దరు అదనపు జిల్లా మేజిస్ట్రేట్లను బదిలీ చేసి వారి స్థానంలో వేరే వాళ్లను నియమిస్తా. దీనిపై నాకు అభ్యంతరం లేదు’’ అని మమత పేర్కొన్నారు. అయితే ఈసీపై మమత మాటల దాడిని కొనసాగించారు. ఈ ఆదేశాలను రాజకీయ కక్షసాధింపు చర్యగా అభివర్ణించారు. మాజీ ఇన్ఫీలపై భారీ అంచనాలు బెంగళూరు: ఇన్ఫోసిస్ మాజీలు నందన్ నీలేకని, వి.బాలకృష్ణన్‌ల విషయంలో ఐటీ దిగ్గజాలు భారీ అంచనాలతోనే ఉన్నారు. రాజకీయ వాతావరణంలో మార్పుకు వారు నాయకత్వం వహిస్తారని, ఉపాధి కల్పన, ఆర్ధికాభివృద్ధి దిశగా ఇద్దరూ కృషి చేస్తారని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నీలేకని బెంగళూరు సౌత్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా, బాలకృష్ణన్ ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు పోటీ చేస్తుండటం తెలిసిందే. -
దేశానికి ప్రమాదకర సంకేతం: మమతా బెనర్జీ
కోల్‌కతా: తెలంగాణ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందిన తీరు రాజ్యాంగవిరుద్ధమని, అప్రజాస్వామికమని, అనైతికమని, చట్టవ్యతిరేకమని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పునరుద్ఘాటించారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందిన తీరుపై మమతాబెనర్జీ శుక్రవారం ఫేస్బుక్లో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తమ రాజకీయ ఎజెండా కోసమే కాంగ్రెస్-బీజేపీ కుమ్మక్కై ఆంధ్రప్రదేశ్ విభజనకు పూనుకున్నాయని ధ్వజమెత్తారు. కాంగ్రెస్-బీజేపీ అపవిత్ర బంధం దేశానికి ప్రమాదకర సంకేతమని ఆమె అభివర్ణించారు. ఆ రెండు పార్టీలు పార్లమెంట్లో వ్యవహరించిన తీరు తనను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. కీలకమైన బిల్లుల విషయంలో ఈ రెండు జాతీయ పార్టీలూ రాష్ట్రాల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఈ విధంగా కుమ్మక్కైతే రాష్ట్రాల పరిస్థితి ఏమిటని ఆమె నిలదీశారు. ఇదే జరిగితే దేశ భవిష్యత్తు ఏమవుతుందని ప్రశ్నించారు. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. అత్యంత కీలకమైన విభజన బిల్లును చీకట్లో, ప్రత్యక్ష ప్రసారాన్ని నిలుపుదల చేసి ఆమోదించాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తిని మంటగలపడమే అని చెప్పారు. లోక్‌సభలో అన్యాయంగా ఆమోదం పొందిన బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టి అంతే అన్యాయంగా ఆమోదింపజేశారని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలు డివిజన్ కోరినా, సవరణలు కోరినా పట్టించుకోకుండా ఆమోదించారని ధ్వజమెత్తారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్రప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోందని మమత ఆరోపించారు.