పోస్టర్‌ కలకలం.. మోదీని అవమానిస్తూ అలా పెట్టారు.. ఎక్కడో తెలుసా? | Political Controversial Poster In Bengal Midnapore | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీని అవమానిస్తూ బెంగాల్‌లో పోస్టర్‌ కలకలం.. బీజేపీ నేతల ఆగ్రహం

Published Fri, Feb 18 2022 3:33 PM | Last Updated on Fri, Feb 18 2022 4:39 PM

Political Controversial Poster In Bengal Midnapore - Sakshi

కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణముల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ), బీజేపీ పార్టీల మధ్య ఎన్నికల వేడి ఇంకా తగ్గలేదు. ఇప్పటికే పలు చోట్ల ఈ రెండు పార్టీల నేతల మధ్య భౌతిక దాడులు సైతం చోటుచేసుకున్నాయి. తాజాగా మరో వివాదం బెంగాల్‌లో తెరపైకి వచ్చింది.

బెంగాల్ జిల్లాలోని మిడ్నాపూర్‌లో ఓ పోస్టర్‌ కలకలం సృష్టించింది. ఈ పోస్టర్‌లో ప్రధాని నరేంద్ర మోదీని 'మహిషాసురుడు'గా, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీని 'దుర్గ'గా చూపిస్తూ పోస్టర్‌ను అంటించారు. ఈ పోస్టర్‌లో గొర్రెలుగా కాంగ్రెస్‌, సీపీఎం పార్టీలను పోల్చారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర దుమారం చెలరేగింది. ఈ పోస్టర్‌పై ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక‍్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. బెంగాల్‌లో 108 మున్సిపాలిటీలకు ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పోస్టర్‌ రాష్ట్రంలో రాజకీయంగా వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనపై బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తుందని స్థానిక కమలం నేత విపుల్ ఆచార్య తెలిపారు. కాగా, ఈ పోస్టర్‌ను ఎవరు అంటించారో తనకు తెలియదంటూ స్థానిక వార్డ్‌ మెంబర్‌ అనిమా సాహా(టీఎంసీ) వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement