
కోల్‌కతా : 2019 ఎన్నికలలో బీజేపీకి ఓటమి తప్పదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జోస్యం చెప్పారు. త్రిపుర లాంటి చిన్న రాష్ట్రాన్ని గెలవడానికి బీజేపీ కేంద్ర బలగాలను, పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేసిందన్నారు. ఇప్పుడు ఆ పార్టీ బెంగాల్‌పై దృష్టిసారించిందని, బీజేపీ ప్రయత్నాలను బెంగాలీలు నిలువరిస్తారన్నారు. టీడీపీ, శివసేనలు ఎన్‌డీఏ కూటమినుంచి తప్పుకోవడం చూస్తుంటే బీజేపీకి గడ్డుకాలం తప్పదనిపిస్తోందని అభిప్రాయపడ్డారు.
త్రిపురలో లెనిన్ విగ్రాహాన్ని కూల్చడానికి బీజేపీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంలోకి వచ్చిన పార్టీ ప్రజలకు మంచి చేయాలని చూడాలే తప్ప ఇలా అంతర్జాతీయ నేతల విగ్రహాలను కూల్చడం హేయమైన చర్యని ఆమె అభిప్రాయపడ్డారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ విగ్రహాన్ని కూల్చిన వారిపై తాము కఠినంగా వ్యవహరిస్తామని, నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టమన్నారు.