కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మీడియాపై ఉక్కుపాదం మోపింది. రాష్ట్రంలో మూడు టీవీ ఛానెల్స్‌పై సీఎం మమతా బెనర్జీ నిషేధం విధించారు.
అభయ ఘటన అనంతరం జరగుతున్న పరిణామలపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. అభయ ఘటనపై రాష్ట్రంలో అలజడులు సృష్టించే ప్రయత్నం జరుగుతుందంటూ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా పలు టీవీ ఛానెల్స్ అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. అంతేకాదు అధికార తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఎవరు సదరు ఛానెల్స్ నిర్వహించే చర్చా కార్యక్రమాల్లో పాల్గొనడం, ఇంటర్వ్యూలు ఇవ్వడంలాంటివి చేయొద్దని ఆదేశాలు జారీ చేశారు.
Statement in connection with the recent media developments pic.twitter.com/e5qvjd4oBm
— All India Trinamool Congress (@AITCofficial) September 1, 2024
కేంద్రం బీజేపీని పరోక్షంగా ప్రస్తావిస్తూ..టీవీ ప్రమోటర్లు ఈడీ,సీబీఐ కేసుల నుంచి బయటపడేందుకు ఢిల్లీ జమీందార్‌లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మేం వారిని అర్ధం చేసుకున్నామని ఎద్దేవా చేశారు. ఈ మేరకు దీదీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
టీవీ చర్చలో రచ్చ
కొద్ది రోజుల క్రితం ఏబీపీ ఆనంద టీవీలో చర్చ జరిగింది. ఆ చర్చలో అభయ కేసులో మమతా బెనర్జీ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్నారంటూ తృణమూల్ ఎంపీ కకోలి ఘోష్ దస్తిదార్.. బీజేపీ ఎమ్మెల్యే అగ్నిమిత్ర పాల్ మధ్య వాగ్వాదం జరిగింది. ఎంపీ దస్తిదార్.. ఎమ్మెల్యే అగ్ని మిత్ర పాల్‌ను ‘శారీ మేకర్’ అంటూ వ్యాఖ్యానించారు. అందుకు నా వృత్తిపై నాకు గర్వంగా ఉందన్న అగ్నిమిత్ర పాల్.. మమతా బెనర్జీ ప్రభుత్వం నేరస్థులకు ఆశ్రయం కల్పిస్తోందని, మహిళల కష్టాలను పట్టించుకోదని ఆరోపించారు.
చివరగా శారీ మేకర్ వ్యాఖ్యలపై ఎంపీ దస్తిదార్, ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో దస్తిదార్ క్షమాపణలు చెప్పి వివాదానికి పులిస్టాప్ పెట్టారు. తాజా పరిణామాలతో దీదీ పశ్చిమ బెంగాల్‌లో మూడు టీవీ ఛానెల్స్‌పై నిషేధం విధిస్తున్నట్లు అధికారంగా ప్రకటన చేశారు.
Comments
Please login to add a commentAdd a comment