కోల్‌కతా ఆర్టీ కర్ హాస్పిటల్ ట్రైనీ డాక్టర్ హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ దారుణ ఘటనపై బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని, అలాగే ఆస్పత్రుల్లో భద్రత, సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌తో జూనియర్ డాక్టర్ల ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. అయితే వారి నిరసన దీక్షకు రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. జూనియర్ డాక్టర్ల చేస్తున్న నిరసనకు సంఘీభావంగా ఇప్పటివరకు సుమారు 200 మంది డాక్టర్లు మూకుమ్మడిగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ వ్యవహారంపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం స్పందించింది.
ఆ రాజీనామాలన్నీ చట్టబద్ధంగా అవి చెల్లుబాటు కావని తెలిపింది. ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చిన లేఖలలో సామూహిక రాజీనామాల ప్రస్తావన లేదని స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ముఖ్య సలహాదారు అలపన్ బందోపాధ్యాయ మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రుల్లో పనిచేస్తున్న సీనియర్ డాక్టర్లు రాజీనామాలు చేయడంపై ఇటీవల గందరగోళ పరిస్థితి నెలకొంది. మూకుమ్మడిగా రాజీనామాలను సూచించే కొన్ని లేఖలు మాకు అందుతున్నాయి. అయితే అటువంటి లేఖల్లో సబ్జెక్ట్ ప్రస్తావన లేకుండా కొన్ని పేజీలు జతచేయబడ్డాయి. హోదాలు సంబంధించిన సమాచారం లేకుండా కేవలం కొన్ని సంతకాలను కలిగి పేపర్లు జతచేయపడ్డాయి. వాస్తవానికి ఈ రాజీనామా లేఖలకు ఎటువంటి చట్టబద్దమైన విలువ లేదు. ఈ రకమైన సాధారణ లేఖలకు చట్టపరమైన ఉండదు’ అని తెలిపారు.
#WATCH | Howrah: Chief advisor to West Bengal CM Mamata Banerjee, Alapan Bandyopadhyay says, "There has been confusion recently regarding the so-called resignation of senior doctors working in government medical colleges and hospitals. We have been receiving certain letters which… pic.twitter.com/2jP1dkhCkJ
— ANI (@ANI) October 12, 2024
జూనియర్ డాక్టర్ల బృందం గత ఏడు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం న్యాయం చేయడంలో జాప్యం చేస్తుందని, పని ప్రదేశంలో ఆరోగ్య కార్యకర్తల భద్రతకు సరైన చర్యలు తీసుకోలేదని డాక్టర్లు ఆరోపిస్తున్నారు. ఆమరణ నిరాహార దీక్షలో ఉన్న డాక్టర్ల ఆరోగ్య పరిస్థితి సైతం క్షీణిస్తోందని తోటి డాక్టర్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment