Bengal government
-
డాక్టర్ల రాజీమాలు చట్టపరంగా చెల్లవు: బెంగాల్ సర్కార్
కోల్‌కతా ఆర్టీ కర్ హాస్పిటల్ ట్రైనీ డాక్టర్ హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ దారుణ ఘటనపై బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని, అలాగే ఆస్పత్రుల్లో భద్రత, సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌తో జూనియర్ డాక్టర్ల ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. అయితే వారి నిరసన దీక్షకు రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. జూనియర్ డాక్టర్ల చేస్తున్న నిరసనకు సంఘీభావంగా ఇప్పటివరకు సుమారు 200 మంది డాక్టర్లు మూకుమ్మడిగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ వ్యవహారంపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం స్పందించింది.ఆ రాజీనామాలన్నీ చట్టబద్ధంగా అవి చెల్లుబాటు కావని తెలిపింది. ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చిన లేఖలలో సామూహిక రాజీనామాల ప్రస్తావన లేదని స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ముఖ్య సలహాదారు అలపన్ బందోపాధ్యాయ మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రుల్లో పనిచేస్తున్న సీనియర్ డాక్టర్లు రాజీనామాలు చేయడంపై ఇటీవల గందరగోళ పరిస్థితి నెలకొంది. మూకుమ్మడిగా రాజీనామాలను సూచించే కొన్ని లేఖలు మాకు అందుతున్నాయి. అయితే అటువంటి లేఖల్లో సబ్జెక్ట్ ప్రస్తావన లేకుండా కొన్ని పేజీలు జతచేయబడ్డాయి. హోదాలు సంబంధించిన సమాచారం లేకుండా కేవలం కొన్ని సంతకాలను కలిగి పేపర్లు జతచేయపడ్డాయి. వాస్తవానికి ఈ రాజీనామా లేఖలకు ఎటువంటి చట్టబద్దమైన విలువ లేదు. ఈ రకమైన సాధారణ లేఖలకు చట్టపరమైన ఉండదు’ అని తెలిపారు.#WATCH | Howrah: Chief advisor to West Bengal CM Mamata Banerjee, Alapan Bandyopadhyay says, "There has been confusion recently regarding the so-called resignation of senior doctors working in government medical colleges and hospitals. We have been receiving certain letters which… pic.twitter.com/2jP1dkhCkJ— ANI (@ANI) October 12, 2024 జూనియర్ డాక్టర్ల బృందం గత ఏడు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం న్యాయం చేయడంలో జాప్యం చేస్తుందని, పని ప్రదేశంలో ఆరోగ్య కార్యకర్తల భద్రతకు సరైన చర్యలు తీసుకోలేదని డాక్టర్లు ఆరోపిస్తున్నారు. ఆమరణ నిరాహార దీక్షలో ఉన్న డాక్టర్ల ఆరోగ్య పరిస్థితి సైతం క్షీణిస్తోందని తోటి డాక్టర్లు తెలిపారు. -
రామ నవమి అల్లర్ల కేసు.. సీఎం మమతా బెనర్జీకి సుప్రీంకోర్టు షాక్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రామ నవమి సందర్భంగా చెలరేగిన అల్లర్ల కేసును ఎన్ఐఏకు అప్పగిస్తున్నట్లు కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. ఈ మేరకు హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ బెంగాల్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది.టీ మేరకు సీజేఐ డీవై చంద్రచుడ్, జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పు వెల్లడించింది. రామనవమి అల్లర్ల కేసును ఎన్ఐఏకు అప్పగించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును బెంగాల్ ప్రభుత్వం ఖండించింది. అల్లర్లలో ఎలాంటి పేలుడు ఘటనలు జరగలేదని తెలిపింది. రాజకీయ ప్రలోభంతో వేసిన పిల్ ఆధారంగా హైకోర్టు తీర్పు ఉందని ఆరోపించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీం మెట్లెక్కింది. కాగా ఈ ఏడాది రామ నవమి సందర్భంగా రాష్ట్రంలో అల్లర్లు చెలరేగాయి. దీనిపై మార్చి 30 నుంచి ఏప్రిల్ 3 మధ్య పలు పోలీసు స్టేషన్లలో ఆరు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. అల్లర్లలో మందుగుండు పదార్థాలను ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలినట్లు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనానికి విన్నవించారు. వాదోపవాదాలు విన్న తర్వాత కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్లు, పత్రాలు, స్వాధీనం చేసుకున్న వస్తువులు, సీసీటీవీ ఆధారాలు అన్నీ ఎన్ఐఏకు అప్పగించాల్సిందిగా హైకోర్టు ఇంతకు ముందు ఇచ్చిన తీర్పులో ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పు సమర్థనీయమేనని స్పష్టం చేసింది. గత మార్చిలో జరిగిన ఈ అల్లర్లలో దాదాపు 500 మంది ఆందోళనకారులు రాళ్లు రువ్వుకున్నారు. పలు వాహనాలు దగ్దమయ్యాయి. ఇద్దరు మరణించగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇదీ చదవండి: Zomato Delivery Boy: జొమాటో బాయ్‌గా పనిచేస్తూనే.. చిరకాల స్వప్నాన్ని సాధించాడు.. -
‘ప్రతీ బుల్లెట్‌ను లెక్కిస్తున్నాం’
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. జుల్పాయిగురి జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న దిలీప్ ఘోష్.. ‘మా పార్టీకి మద్దతుగా నిలుస్తున్న వారిపై జరుగుతున్న దాడులను చూస్తున్నాం. బీజేపీ కార్యకర్తలపై పేలుతున్న ప్రతీ బుల్లెట్‌ను లెక్కిస్తున్నాం. వాటితోనే తిరిగి సమాధానం చెప్తాం. ఇక్కడ బుల్లెట్లకు కరువు లేదు. మేము తలచుకుంటే ప్రతిచోటును ప్రత్యర్థుల శవాలతో నింపేయగలమంటూ’ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నామన్న దిలీప్ ఘోష్.. ఇకపై హింసాకాండను సహించేది లేదంటూ బెంగాల్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాగా, గతంలో కూడా బెంగాల్ పోలీసులు అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని.. బీజేపీ అధికారంలోకి వచ్చాక అటువంటి వారందరినీ విధుల నుంచి తొలగిస్తామంటూ దిలీప్ ఘోష్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అంతేకాకుండా రాష్ట్రంలో ప్రతిపక్షమనేదే లేకుండా చేసేందుకు ప్రభుత్వం ఎంతటి దుర్మార్గానికైనా వెనుకాడబోదంటూ ఆయన వ్యాఖ్యానించారు. -
భూమి పుత్రికలు
సురక్ష పేదింటి బాలికల పేరిట బెంగాల్ ప్రభుత్వం భూమి పట్టాలను మంజూరు చేయడంతో వారి జీవితానికి భరోసా ఏర్పడి క్రమంగా అక్కడ మైనర్ బాలికల వివాహలు తగ్గుముఖం పడుతున్నాయి. పదిహేనేళ్ల వయసున్న అమ్మాయిలు ప్రతి ఐదుగురిలో ఒకరికి పెళ్లి జరుగుతోంది. కాదు కాదు... పెళ్లి బంధంలోకి నెట్టివేతకు గురవుతున్నారు. అది కూడా, వాళ్లకంటే పదేళ్లకు పైగా వయసున్నవారు తాళి కడుతున్నారు. ఇది పశ్చిమబెంగాల్లోని మారుమూల గ్రామాల దుఃస్థితి. చిన్న వయసులోనే పెళ్లి... కుటుంబభారం, గర్భం మోయడం, పిల్లల్ని కనడం – ఈ చట్రంలో బందీలవుతున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం లేకపోవడంతో పిల్లల్ని కనలేకపోవడం, కన్నా ఆ పిల్లలు తక్కువ బరువుతో పుట్టడం... ఇదీ పరిస్థితి. యునిసెఫ్ సర్వే చేసి నివేదిక ప్రకటించే వరకు అక్కడి గ్రామీణ మహిళ జీవితం ఇంతే. బాలికల విద్య, ఆరోగ్యం మీద సర్వే చేసిన యునిసెఫ్ పశ్చిమ బెంగాల్‌లోని మారుమూల గ్రామాలు తీవ్రమైన దారిద్య్రాన్ని అనుభవిస్తున్నాయని, ఆ ప్రభావం బాలికలు, మహిళల మీద పడుతోందని తెలిపింది. చదువులేకపోవడం, బాల్యవివాహాలు, పోషకాహార లోపం, లైంగిక హింస, ట్రాఫికింగ్ భూతాల నడుమ మహిళలు బిక్కుబిక్కుమంటూ రోజులు గడుపుతున్నారని నివేదిక హెచ్చరించింది. యునిసెఫ్ హెచ్చరికతో వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం నిద్ర లేచింది. ఎందుకిలా జరుగుతోందని ఆరాలు తీసింది. ఆడపిల్లకు పెళ్లి చేయాలంటే కట్నం ఇవ్వాలి. అమ్మాయి వయసు పెరిగే కొద్దీ మగపెళ్లి వారు ఎక్కువ కట్నం డిమాండ్ చేస్తారు. చిన్న పిల్ల అయితే తక్కువ కట్నంతో చేసుకుంటారు, కొంతమంది కట్నం లేకుండానూ చేసుకుంటారు. అందుకే పన్నెండేళ్లు నిండితే చాలు... స్కూలుకు పోతున్న అమ్మాయిని ఇంట్లో కూలేసి, పుస్తకాలు అటకెక్కించి, పుస్తెల తాడు మెళ్లో వేస్తున్నారు. అత్తవారింటికి పంపేసి తమ బరువు తీరిందని, తల్లితండ్రులుగా తమ బాధ్యతను కచ్చితంగా నిర్వర్తించామని ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ఈ ధోరణి ఇలాగే కొసాగితే ఆడపిల్లకు భవిష్యత్తే ఉండదని, ఏదో ఒకటి చేయకపోతే జరిగే అనర్థానికి కొన్ని తరాలు భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందని తలచిన బెంగాల్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది. ఒక చిన్న ప్రయత్నంతో... ఈ సమస్యకు పెద్ద పరిష్కారం చూపించింది. దాంతో ఇప్పుడు ఆ గ్రామాల్లో బాలికల ముఖాలు ఆనందంతో వెలుగుతున్నాయి. నిజానికి ఈ అద్భుతం జరగడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నం చాలా చిన్నదే. అయితే అది వైవిధ్యమైంది. గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ భూములను వ్యవసాయం మీద ఆధారపడిన భూమిలేని పేదవారికి పంపిణీ చేయడం మామూలుగా జరిగేపని. ఇప్పుడు ఆ భూములను బాలికలకు ఇస్తున్నారు. వారి పేరుతోనే పట్టాలు జారీ చేస్తున్నారు. వ్యవసాయం, కూరగాయల పెంపకంలో వారికి శిక్షణ ఇప్పించి, మెలకువలు నేర్పే పనిని స్వచ్ఛంద సంస్థలకు అప్పగించారు. ఇప్పుడు బాలికలున్న ప్రతి ఇంటి పెరడూ కూరగాయల మొక్కలతో పచ్చగా ఉంది. ఇంటి అవసరాలకు పోను మిగిలిన వాటిని బయట విక్రయిస్తున్నారు. కొంతమంది అమ్మాయిలు ఆ డబ్బును పై చదువులకు సద్వినియోగం చేసుకుంటు న్నారు. ఒకప్పుడు ఆ గ్రామాల్లో ఆడపిల్ల అంటే తల మీద భారం అన్నట్లు ఉండేవారు తల్లితండ్రులు. అందుకే పన్నెండేళ్లు నిండితే చాలు... పెళ్లి చేసి భారాన్ని వదిలించుకున్నట్లు భావించేవారు. ఇప్పుడా గ్రామాల్లో తల్లిదండ్రులకు ఆడపిల్ల అంటే ఖర్చు కాదు... ఆస్తి! కట్నం కోసం కష్టపడక్కర్లేదు. కట్నం డబ్బు అల్లుడి దోసిట్లో పోసి తమ బిడ్డకు వేళకింత కడుపునిండా తిండి పెట్టమని వేడుకోవాల్సి అగత్యం లేదిప్పుడు. అమ్మాయి భూమి మీద హక్కు ఎప్పటికీ ఆ అమ్మాయిదే. తాను కడుపు నిండా తినగలుగుతుంది. నలుగురికి అన్నం పెట్టగలుగుతుంది. ఆరోగ్యకరమైన బిడ్డల్ని కనగలుగుతుంది. -
అక్కడ నిషేధిస్తే.. ఇక్కడెలా అనుమతిచ్చారు?
- మందుల కొనుగోళ్లలో టీఎస్ఎంఎస్ఐడీసీ కక్కుర్తి - హసీబ్ ఫార్మా స్టెరైల్ వాటర్‌లో నాణ్యత లేదని నిర్ధారించిన బెంగాల్ సాక్షి, హైదరాబాద్ : కమీషన్ల కక్కుర్తి.. రోగుల పట్ల నిర్లక్ష్యం.. ముందుచూపు లేకపోవడం వెరసి టీఎస్ఎంఎస్ఐడీసీ పేద ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. స్టెరైల్ వాటర్‌నే నాణ్యతా ప్రమాణాల మేరకు తయారుచేయని కంపెనీకి.. సెలైన్ బాటిళ్ల టెండర్లను కట్టబెట్టింది. సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో ఏడుగురి చూపు పోవడానికి సెలైన్ బాటిళ్లలోని బ్యాక్టీరియానే కారణమని వైద్యులు చెబుతున్న విషయం తెలిసిందే. ఈ సెలైన్ బాటిళ్లను సరఫరా చేసిన నాగపూర్‌కు చెందిన హసీబ్ ఫార్మాసూటికల్స్ కంపెనీ తయారు చేసిన స్టెరైల్ వాటర్ బాటిళ్లను 2013సెప్టెంబర్‌లో నాణ్యతా ప్రమాణాలు లేవంటూ బెంగాల్ ప్రభుత్వం నిషేధించింది. కానీ అదే కంపెనీకి చెందిన 13.07లక్షల సెలైన్ బాటిళ్లను రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ) కొనుగోలు చేసి అన్ని జిల్లాలకు పంపింది. చర్యలు కరువు: మూడు బ్యాచ్‌లకు చెందిన సెలైన్ బాటిళ్లలో బ్యాక్టీరియా ఉండటంతో ఇన్ఫెక్షన్ సోకి ఏడుగురు కంటి చూపు కోల్పోయారు. నిలోఫర్ ఆసుపత్రిలోనూ సెలైన్ బాటిళ్లలో ఫంగస్ చేరినట్లు గుర్తించారు. కానీ ప్రభుత్వం ఇప్పటివరకూ ఒక్కరిపైనా చర్యలు తీసుకోలేదు. కేవలం సెలైన్ బాటిళ్లను సీజ్ చేసి చేతులు దులుపుకుంది. మరోవైపు స్టెరైల్ వాటర్‌నే సరిగా తయారు చేయలేని కంపెనీకి సెలైన్ బాటిళ్ల టెండర్ ఎలా అప్పగించారని కొందరు వైద్యాధికారులు ప్రశ్నిస్తున్నారు. స్టెరైల్ నుంచే సెలైన్: స్టెరైల్ వాటర్‌ను ఇంజెక్షన్ల కోసం ఉపయోగిస్తుం టారు. స్టెరైల్ వాటర్‌ను విని యోగించుకునే సెలైన్ ఐవీ ఫ్లూయీడ్స్ వంటి వాటిని తయారు చేస్తారని డ్రగ్ కంట్రోల్ అధికారులు చెబుతున్నారు. అలాంటిది స్టెరైల్ వాటరే నాణ్యతా ప్రమాణాల మేరకు లేకపోతే... దాని నుంచి తయారయ్యే సెలైన్ ఎంత వరకు సురక్షితమనేది అర్థం చేసుకోవచ్చు. హసీబ్ ఫార్మాస్యూటికల్స్ నుంచి కొనుగోలు చేసిన 13.07 లక్షల సెలైన్ బాటిళ్లో 8లక్షలు ఇప్పటికే వినియోగించగా, మిగతావి సీజ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఐదు లక్షల సెలైన్ బాటిళ్లను సీజ్ చేసిన టీఎస్ఎంఎస్ఐడీసీ అధికారులు ఇప్పుడు వాటికి ప్రత్యామ్నాయంగా రెండు లక్షల సెలైన్ బాటిళ్లను గోవా, అహ్మదాబాద్‌ల నుంచి తెప్పిస్తున్నారు. -
బహుళ ప్రయోజనకారి వాటర్‌గ్రిడ్
అధికారులతో సమీక్షలో మంత్రి కేటీఆర్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తాగునీటి సరఫరా (వాటర్‌గ్రిడ్) ప్రాజెక్ట్‌ను బహుళ ప్రయోజనకారిగా మార్చాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు అధికారులను ఆదేశించారు. వాటర్‌గ్రిడ్ పైప్‌లైన్ తో పాటు ఫైబర్ ఆప్టికల్ కేబుల్స్‌ను కూడా వేయడం ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలని నిర ్ణయించినట్లు చెప్పారు. దీనిపై ఆర్డబ్ల్యూఎస్, ఐటీ శాఖ ఉన్నతాధికారులతో సోమవారం మంత్రి సమీక్షించారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఫైబర్ కేబులింగ్ పనులు చేపట్టాలని ఆదేశించారు. పైప్లైన్ల కోసం త్వరలోనే తవ్వకాలు ప్రారంభిస్తున్నందున, ఇంటింటికీ ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వడానికి సంబంధించిన విధి విధానాలను ఈనెల 9లోగా తయారు చేయాలని నిర్దేశించారు. వాటర్‌గ్రిడ్ ప్రాజెక్ట్ పైప్‌లైన్‌తో పాటు కేబుల్స్ వేయడం ద్వారా 80 శాతం ఖర్చు తగ్గుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఐటీశాఖకు సూచించారు. సమావేశంలో ఐటీశాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వాటర్‌గ్రిడ్‌పై పశ్చిమబెంగాల్ ఆసక్తి: వాటర్గ్రిడ్పె పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అమితాసక్తిని కనబరుస్తోందని ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ సురేందర్‌రెడ్డి తెలిపారు. ప్రాజెక్ట్ డిజైన్‌తో పాటు ఫైనాన్షియల్ మోడల్ గురించి వివరించాలని ఆ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సౌరభ్దాస్ తనకు లేఖ రాశారని పేర్కొన్నారు. ఈనెల 4న బెంగాల్ రాష్ట్ర పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన బృందం రాష్ట్రానికి వస్తున్నట్లు చెప్పారన్నారు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేశ్ యాదవ్ వాటర్‌గ్రిడ్ గురించి తెలుసుకోగా, బిహార్ ఎన్నికల ప్రచారంలోనూ ఆ రాష్ట్ర సీఎం నితీశ్‌కుమార్ వాటర్‌గ్రిడ్ ఏర్పాటుపై హామీ ఇచ్చినట్లు తెలిసిందని ఈఎన్సీ చెప్పారు. -
ఆ నిర్వచనమే తప్పు
హిందీ చిత్రాలను జాతీయ సినిమాలుగా, మిగతా వాటిని ప్రాంతీయ చిత్రాలుగా పిలిచే సంస్కృతి మంచిది కాదని జాతీయ అవార్డు గ్రహీత గౌతమ్ ఘోష్ అన్నారు. అన్ని సినిమాలనూ భారతీయ చిత్రాలని మాత్రమే పిలవాలని కోరారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దూరదర్శన్ సంయుక్తంగా ఈ నెల ఆరు నుంచి ఢిల్లీలో నిర్వహిస్తున్న బెంగాల్ చిత్రోత్సవంలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ ఘోష్ పైవిధంగా అన్నారు. అంతర్జాతీయస్థాయి అవార్డులు, ప్రశంసలు సాధించిన సినిమాలను ఈ ఉత్సవంలో ప్రదర్శిస్తున్నారు. ఈ సందర్భంగా ఘోష్ మాట్లాడుతూ ‘సినిమాకు దర్శకుడు అత్యంత కీలకం. నిజానికి సినిమాలో అతణ్నే ముఖ్యపాత్రగా భావించాలి. సినిమా జయాపజయాలకు అతడిదే పూర్తి బాధ్యత. నటులు, సిబ్బందిని నియంత్రించాల్సిన బాధ్యత కూడా దర్శకుడిపైనే ఉంటుంది. మనదేశంలో అన్ని సినిమాలనూ భారతీయ చిత్రాలని మాత్రమే పిలవాలి’ అని వివరించారు. ఘోష్ గురించి మరో ఆసక్తికర విషయమేమంటే ఆయన ప్రఖ్యాత దర్శకుడే కాదు.. సంగీత దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ కూడా. ప్రతి దర్శకుడు నటీనటుల మనోభావాలను గుర్తెరిగి వారితో పనిచేయించుకోవాలని సూచించాడు. ఎంత పెద్ద నటులైనా, నటన రానివాళ్లకైనా ఈ సూత్రం వర్తిస్తుందని స్పష్టం చేశాడు. ‘సినిమా, అనువర్తిత కళలు-పరస్పరాశ్రయం’ పేరుతో నిర్వహించిన చర్చలో మాట్లాడిన ఈ బెంగాలీ దర్శకుడు పైవిషయాలు తెలిపారు. ప్రముఖ దర్శకుడు అశోక్ విశ్వనాథన్, సినీ విమర్శకుడు మనోజిత్ లాహిరి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సమకాలీన సినీపరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల గురించి విశ్వనాథన్ మాట్లాడుతూ సినిమా కళ అంతర్భాగమేనని గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఘోష్ 2005లో తీసిన నిశబ్ద్ సినిమాను కూడా ఈ ఉత్సవంలో ప్రదర్శించారు.