కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రామ నవమి సందర్భంగా చెలరేగిన అల్లర్ల కేసును ఎన్‌ఐఏకు అప్పగిస్తున్నట్లు కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. ఈ మేరకు హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ బెంగాల్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది.టీ మేరకు సీజేఐ డీవై చంద్రచుడ్, జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పు వెల్లడించింది.
రామనవమి అల్లర్ల కేసును ఎన్‌ఐఏకు అప్పగించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును బెంగాల్ ప్రభుత్వం ఖండించింది. అల్లర్లలో ఎలాంటి పేలుడు ఘటనలు జరగలేదని తెలిపింది. రాజకీయ ప్రలోభంతో వేసిన పిల్ ఆధారంగా హైకోర్టు తీర్పు ఉందని ఆరోపించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీం మెట్లెక్కింది. కాగా ఈ ఏడాది రామ నవమి సందర్భంగా రాష్ట్రంలో అల్లర్లు చెలరేగాయి. దీనిపై మార్చి 30 నుంచి ఏప్రిల్ 3 మధ్య పలు పోలీసు స్టేషన్‌లలో ఆరు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.
అల్లర్లలో మందుగుండు పదార్థాలను ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలినట్లు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనానికి విన్నవించారు. వాదోపవాదాలు విన్న తర్వాత కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లు, పత్రాలు, స్వాధీనం చేసుకున్న వస్తువులు, సీసీటీవీ ఆధారాలు అన్నీ ఎన్‌ఐఏకు అప్పగించాల్సిందిగా హైకోర్టు ఇంతకు ముందు ఇచ్చిన తీర్పులో ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పు సమర్థనీయమేనని స్పష్టం చేసింది.
గత మార్చిలో జరిగిన ఈ అల్లర్లలో దాదాపు 500 మంది ఆందోళనకారులు రాళ్లు రువ్వుకున్నారు. పలు వాహనాలు దగ్దమయ్యాయి. ఇద్దరు మరణించగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
ఇదీ చదవండి: Zomato Delivery Boy: జొమాటో బాయ్‌గా పనిచేస్తూనే.. చిరకాల స్వప్నాన్ని సాధించాడు..
Comments
Please login to add a commentAdd a comment