setback
-
అనిల్ అంబానీకి మళ్లీ భారీ ఎదురుదెబ్బ!
ఆర్థిక కష్టాలు తొలగిపోతున్నాయి.. అప్పులన్నీ దాదాపుగా తీరిపోయాయి.. నష్టాలు పోయి లాభాలు కూడా పలకరించాయి. ఇక అంతా ఆనందమే అనుకుంటున్న సమయంలో రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి మళ్లీ భారీ ఎదురుదెబ్బ తగిలింది.నకిలీ బ్యాంక్ గ్యారెంటీని సమర్పించారంటూ రిలయన్స్ పవర్‌కి, దాని అనుబంధ సంస్థకు భారత క్లీన్ ఎనర్జీ ఏజెన్సీ ఎస్ఈసీఐ షోకాజ్ నోటీసు పంపింది. సంస్థలపై క్రిమినల్ చర్యలు ఎందుకు తీసుకోకూడదంటూ సంజాయిషి కోరింది.రిలయన్స్ పవర్‌కు చెందిన ఒక యూనిట్ విదేశీ బ్యాంక్ గ్యారెంటీకి సంబంధించిన నకిలీ ఎండార్స్‌మెంట్‌ను సమర్పించిందనే ఆరోపణలపై రిలయన్స్ పవర్‌ను, దాని యూనిట్‌ను మూడేళ్లపాటు వేలంలో పాల్గొనకుండా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SECI) గత వారం నిషేధించింది.రిలయన్స్ పవర్‌కు అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ ఎన్యూ బీఈఎస్ఎస్ సమర్పించిన బ్యాంక్ గ్యారెంటీ కూడా నకిలీదని ఎస్ఈసీఐ తన నవంబర్ 13 నాటి నోటీసులో పేర్కొంది. ఈ చర్య తర్వాత, గురువారం బీఎస్ఈలో రిలయన్స్ పవర్ షేర్లు 1.53 శాతం పడిపోయి రూ.36 వద్ద స్థిరపడ్డాయి.కాగా ఆరోపణలపై రిలయన్స్ పవర్ స్పందిస్తూ.. "మోసం, ఫోర్జరీ, కుట్రలో బాధితులం" అని పేర్కొంది. “దీనికి సంబంధించి ఇప్పటికే థర్డ్ పార్టీపై అక్టోబర్ 16న ఢిల్లీ పోలీస్ ఎకనామిక్ అఫెన్స్ వింగ్‌లో క్రిమినల్ ఫిర్యాదు దాఖలు చేశాం. దాని ఆధారంగా నవంబర్ 11న ఎఫ్ఐఆర్ నమోదైంది. విషయం దర్యాప్తు పరిధిలో ఉంది. న్యాయ ప్రక్రియ కొనసాగుతుంది” అని రిలయన్స్ పవర్ తెలిపింది. -
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు ఎదురుదెబ్బ
ఒట్టావా: కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడోకు ఎదురుదెబ్బ తగిలింది. టొరంటో-సెయింట్.పాల్ స్థానానికి మంగళవారం జగిరిన ఉప ఎన్నికలో ట్రూడో నేృత్వంలోని లిబరల్ పార్టీ ఓటమి పాలైంది. ఈ స్థానం లిబరల్ పార్టీ కంచుకోట స్థానం. లిబరల్ పార్టీ అభ్యర్థి లెస్లీ చర్చి.. కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థి డాన్ స్టీవర్ట్ చేతిలో ఓడిపోయారు. డాన్ స్టీవర్ట్‌కు 42 శాతం ఓట్లు రాగా, లెస్లీకి 40 శాతం ఓట్లు పడ్డాయి. టొరంటో-సెయింట్.పాల్ స్థానంలో లిబరల్ పార్టీ గత 30 ఏళ్లుగా ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. 2011లో లిబరల్ పార్టీ తరఫున తక్కువ మంది ఎంపీలు గెలిచినప్పటికీ.. టొరంటో-సెయింట్.పాల్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రస్తుతం ఈ స్థానాన్ని కోల్పోయిన లిబరల్‌పార్టీకి మొత్తం 338 స్థానాలకు గాను 155 ఎంపీలు ఉన్నారు. వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగనున్న క్రమంలో ఈ ఓటమి ట్రూడోకు పెద్ద ఎదరుదెబ్బ అని రాజకీయల విశ్లేషకులు పేర్కొంటున్నారు. టొరంటో-సెయింట్.పాల్ స్థానంలో ఓటమిపై ప్రధాని ట్రూడో స్పందించారు. ‘ఇవి చాలా కష్టమైన పరిస్థితులు. అందుకే, నేను నా టీం కెనడా ప్రజల అభివృద్ధి కోసం మరింత శ్రమిస్తాం’అని అన్నారు. -
రామ నవమి అల్లర్ల కేసు.. సీఎం మమతా బెనర్జీకి సుప్రీంకోర్టు షాక్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రామ నవమి సందర్భంగా చెలరేగిన అల్లర్ల కేసును ఎన్ఐఏకు అప్పగిస్తున్నట్లు కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. ఈ మేరకు హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ బెంగాల్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది.టీ మేరకు సీజేఐ డీవై చంద్రచుడ్, జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పు వెల్లడించింది. రామనవమి అల్లర్ల కేసును ఎన్ఐఏకు అప్పగించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును బెంగాల్ ప్రభుత్వం ఖండించింది. అల్లర్లలో ఎలాంటి పేలుడు ఘటనలు జరగలేదని తెలిపింది. రాజకీయ ప్రలోభంతో వేసిన పిల్ ఆధారంగా హైకోర్టు తీర్పు ఉందని ఆరోపించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీం మెట్లెక్కింది. కాగా ఈ ఏడాది రామ నవమి సందర్భంగా రాష్ట్రంలో అల్లర్లు చెలరేగాయి. దీనిపై మార్చి 30 నుంచి ఏప్రిల్ 3 మధ్య పలు పోలీసు స్టేషన్లలో ఆరు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. అల్లర్లలో మందుగుండు పదార్థాలను ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలినట్లు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనానికి విన్నవించారు. వాదోపవాదాలు విన్న తర్వాత కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్లు, పత్రాలు, స్వాధీనం చేసుకున్న వస్తువులు, సీసీటీవీ ఆధారాలు అన్నీ ఎన్ఐఏకు అప్పగించాల్సిందిగా హైకోర్టు ఇంతకు ముందు ఇచ్చిన తీర్పులో ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పు సమర్థనీయమేనని స్పష్టం చేసింది. గత మార్చిలో జరిగిన ఈ అల్లర్లలో దాదాపు 500 మంది ఆందోళనకారులు రాళ్లు రువ్వుకున్నారు. పలు వాహనాలు దగ్దమయ్యాయి. ఇద్దరు మరణించగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇదీ చదవండి: Zomato Delivery Boy: జొమాటో బాయ్‌గా పనిచేస్తూనే.. చిరకాల స్వప్నాన్ని సాధించాడు.. -
ఎన్సీఎల్ఏటీలో గో ఫస్ట్‌కు ఊరట
న్యూఢిల్లీ: నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎస్‌సీఎల్‌ఏటీ) సోమవారం సంక్షోభంలో ఉన్న ఎయిర్‌లైన్ గో ఫస్ట్‌పై దివాలా పరిష్కార ప్రక్రియను సమర్థించింది. దీనితో సంక్షోభంలో పడిన వాడియా గ్రూప్ సంస్థ– గో ఫస్ట్ నుండి తమ విమానాలను వెనక్కి తీసుకునేందుకు ఎయిర్‌క్రాఫ్ట్ లీజర్లు చేసిన ప్రయత్నాలకు తక్షణం అడ్డుకట్ట పడింది.. క్లెయిమ్‌లపై ఎన్సీఎల్టీకి వెళ్లవచ్చు... క్లెయిమ్‌లకు సంబంధించి ఎయిర్‌క్రాఫ్ట్ లీజర్లు అలాగే గో ఫస్ట్ మధ్యంతర రిజల్యూషన్ ప్రొఫెషనల్ (ఐఆర్పీ) నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎస్‌సీఎల్‌టీ)ని ఆశ్రయించాలని చైర్పర్సన్ జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ఇద్దరు సభ్యుల అప్పిలేట్ బెంచ్ ఆదేశించింది. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న గో ఫస్ట్‌కు మే నెల 10వ తేదీన నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) కాస్త ఊరటనిస్తూ, కంపెనీ స్వచ్ఛందంగా దాఖలు చేసిన దివాలా పిటీషన్‌ను విచారణకు స్వీకరించింది. అలాగే ఆర్థిక వ్యవహారాలు, చెల్లింపులకు సంబంధించి మారటోరియం విధించింది. మే 4న మధ్యంతర పరిష్కార నిపుణుడిగా (ఐఆర్పీ) అభిలాష్ లాల్‌ను నియమించడంతో పాటు ఏ ఉద్యోగినీ తీసివేయకూడదని ఆదేశించింది. అలాగే, రద్దయిన మేనేజ్మెంట్.. తక్షణ ఖర్చుల కోసం రూ. 5 కోట్ల మొత్తాన్ని ఐఆర్పీ వద్ద డిపాజిట్ చేయాలని సూచించింది. తమ విజ్ఞప్తులను కూడా తెలుసుకున్న తర్వాతే గో ఫస్ట్ దివాలా పిటీషన్‌పై తగు నిర్ణయం తీసుకోవాలంటూ సంస్థకు విమానాలను లీజుకిచ్చిన కంపెనీల అభ్యంతరాలను ఎన్సీఎల్టీ తోసిపుచ్చింది. దీనితో దివాలా విచారణ పూర్తయ్యే వరకూ ఇతరత్రా దావాల నుంచి గో ఫస్ట్‌కు రక్షణ లభించనట్లయ్యింది. సంస్థ ఆస్తులను బదిలీ చేయడానికి గానీ రుణ దాతలు రికవర్ చేసుకోవడానికి గానీ ఈ ఉత్తర్వు్యలతో వీలుండదు. -
లద్దాఖ్‌లో కేంద్రానికి ఎదురుదెబ్బ!
లద్దాఖ్: జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది కేంద్ర ప్రభుత్వం. కశ్మీర్ ప్రాంత అభివృద్ధి, ప్రజలకు సుపరిపాలన, భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. అయితే, లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించటం, ఆరవ అధికరణ ప్రకారం ప్రత్యేక హోదా ఇవ్వాలని అక్కడి నేతలు కొద్ది రోజులుగా నిరసనలు తెలుపుతున్నారు. ప్రజాగ్రహాన్ని తొలగించేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ వేశారు. అయితే, ఈ ప్యానల్లో భాగమయ్యేందుకు నిరాకరించారు లద్దాఖ్ నేతలు. కేంద్ర పాలిత ప్రాంతంగా ఉండడం కన్నా జమ్ముకశ్మీర్‌తో కలవడమే మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేయడంతో కేంద్రానికి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఈ కమిటీ కార్యకలాపాల్లో భాగం కాకూడదని అపెక్స్ బాడీ ఆఫ్ లద్దాఖ్, కార్గిల్ డెమొక్రాటిక్ అలియాన్స్ ఏకగ్రీవంగా నిర్ణయించింది. తమ డిమాండ్లను తీర్చే వరకు ప్యానల్‌తో కలిసేది లేదని తేల్చి చెప్పారు. ‘ప్రస్తుత పరిస్థితుల ప్రకారం.. పూర్వ జమ్మూకశ్మీర్‌లో కలవడమే మంచిదనే భావన కలుగుతోంది.’అని పేర్కొన్నారు అపెక్స్ బాడీ ఆఫ్ లేహ్, లద్దాఖ్ బుద్దిస్ట్ అసోసియేషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఛేరింగ్ డోర్జయ్. రాష్ట్ర హోదా, ప్రత్యేక హోదా కల్పించకుండా కమిటీని ఏర్పాటు చేసి లద్దాఖ్ ప్రజలను కేంద్రం పిచ్చివారిని చేయాలని చూస్తోందని ఆరోపించారు. కమిటీ అజెండాలో ఉద్యోగ భద్రత, లద్దాఖ్ ప్రజల గుర్తింపు, భూభాగాన్ని పరిరక్షిస్తామని చెబుతున్నారని, అయితే ఏ చట్టం, షెడ్యూల్ ప్రకారం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏడాది క్రితం రాష్ట్ర హోదా, ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ లద్దాఖ్‌లో ఆందోళనలు మొదలయ్యాయి. లద్దాఖ్‌లో చైనాతో సరిహద్దు వివాదాల వేళ ఈ నిరసనలు కేంద్ర ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా మారాయి. ఇదీ చదవండి: ‘ఎయిరిండియా’ ఘటనపై టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ కీలక వ్యాఖ్యలు -
సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ
అలహాబాద్: ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకొచ్చిన ముసాయిదా నోటిఫికెషన్‌ను తోసిపుచ్చింది అలహాబాద్ హైకోర్టు. రాష్ట్ర ప్రభుత్వ డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను బుట్టదాఖలు చేస్తూ ఓబీసీలకు రిజర్వేషన్ లేకుండానే అర్బణ్ లోకల్ బాడీ ఎన్నికలను నిర్వహించాలని జస్టిస్ డీకే ఉపాధ్యాయ, జస్టిస్ సౌరవ్ లావానియాలతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది. అర్బణ్ లోకల్ బాడీ ఎన్నికల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ డిసెంబర్ 5న ముసాయిదా నోటిఫికేషన్‌ను జారీ చేసింది ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం. ఉత్తర్‌ప్రదేశ్‌లోని 200 మున్సిపల్ కౌన్సిల్లో 54 ఛైర్పర్సన్ సీట్లు ఓబీసీలకు కేటాయిస్తూ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చింది. అందులో 18 మహిలకు కేటాయించింది. అలాగే 545 నగర పంచాయతీల్లో 147 సీట్లు ఓబీసీ అభ్యర్థులకు రిజర్వేషన్ కల్పించింది. అందులో 49 మహిళలకు కేటాయించారు. దీనిపై పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ క్రమంలో సుప్రీం కోర్టు సూచించిన ట్రిపుల్ టెస్ట్ ఫార్ములానూ అనుసరించకుండానే ఓబీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారని హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు పిటిషనర్లు. రిజర్వేషన్లు కల్పించే ముందు రాజకీయంలో ఓబీసీలు వెనకబడి ఉన్నారనే అంశంపై ఓ కమిషన్‌ను ఏర్పాటు చేయాలన్న సుప్రీం కోర్టు సూచనలను ప్రభుత్వం అనుసరించలేదని కోరారు. అయితే, తాము రాపిడ్ సర్వే నిర్వహించామని, అది ట్రిపుల్ టెస్ట్ ఫార్ములాను అనుసరిస్తోందని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఈ పిల్‌పై శనివారం విచారించిన డివిజన్ బెంచ్ ఇరువైపుల వాదనలు విని తీర్పును మంగళవారానికి వాయిదా వేసింది. తాజాగా డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. ఇదీ చదవండి: బూస్టర్ డోస్‌గా ‘నాసల్’ వ్యాక్సిన్.. ధర ఎంతంటే? -
సీఎం షిండేకు ఎదురుదెబ్బ.. ఆ కేసులో హైకోర్టు మొట్టికాయలు!
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. నాగ్‌పూర్ ల్యాండ్ కేసులో బాంబే హైకోర్టు మొట్టికాయలు వేసింది. ఎంవీఏ ప్రభుత్వంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న సమయంలో.. కోర్టులో కేసు ఉన్నప్పటికీ 5 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలని నాగ్‌పూర్ అభివృద్ధి ట్రస్టును ఎలా ఆదేశించారని ప్రశ్నించింది. ఈ మేరకు సమాధానం ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అగాడీ(ఎంవీఏ) ప్రభుత్వంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశారు ఏక్నాథ్ షిండే. 2021లో మురికివాడల పేదల కోసం కేటాయించిన 5 ఎకరాల ప్రభుత్వ భూమిని తక్కువ ధరకే 16 మంది బిల్డర్స్‌కు కేటాయించారు షిండే. దీనిపై ప్రభుత్వ భూమికి సంబంధించిన కేసు కోర్టులో ఉన్నప్పటికీ షిండే ఆదేశాలు జారీ చేశారని పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు. రూ.83 కోట్లు విలువ చేసే భూమికి నాగ్‌పూర్ అభివృద్ధి ట్రస్టుకు కేవలం రూ.2 కోట్ల లోపే దక్కాయని పేర్కొన్నారు. ఈ కేసులో విచారణ చేస్తున్న బాంబే హైకోర్టు.. ఆ 5 ఎకరాలు భూమి విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలని అధికారులను ఆదేశించింది. ఈ కేసుపై సమాధానం ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను 2023, జనవరి 4కు వాయిదా వేసింది. ఇదీ చదవండి: చేతిలో చంటి బిడ్డతో ఆ ఎమ్మెల్యే.. ఆమె సమాధానం వింటే అభినందించకుండా ఉండలేరు -
ఎయిరిండియాకు భారీ షాక్, మిలియన్ డాలర్ల జరిమానా
సాక్షి, ముంబై: టాటా-గ్రూప్ యాజమాన్యంలోని ఎయిరిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కరోనా మహమ్మారి సమయంలో విమానాలను రద్దు చేయడం లేదా మార్చిన కారణంగా ప్రయాణీకులకు రీఫండ్లను అందించడంలో తీవ్ర జాప్యం చేసినందుకుగాను భారీ జరిమానా విధించాలని అమెరికా ఆదేశించింది. 121.5 మిలియన్ డాలర్లు (దాదాపు 990 కోట్ల రూపాయలు) రీఫండ్‌తోపాటు జరిమానాగా 1.4 మిలియన్ డాలర్లు (రూ.11.35 కోట్లు) చెల్లించాలని ఆదేశించింది. ఇదీ చదవండి: చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో: అమెజాన్ సంచలన నిర్ణయం! 600 మిలియన్ డాలర్లకు పైగా వాపసు చెల్లించడానికి అంగీకరించిన ఆరు విమానయాన సంస్థలలో ఎయిరిండియా కూడా ఒకటని యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ సోమవారం ప్రకటించింది. ఎయిరిండియా ‘రిఫండ్ ఆన్ రిక్వెస్ట్’ విధానం, తమ పాలసీకి విరుద్ధంగా ఉందని పేర్కొంది. తమ రవాణాశాఖ నిబంధనల ప్రకారం విమానాన్ని రద్దు చేసినా లేదా మార్పు చేసినా చట్టబద్ధంగా టిక్కెట్లను వాపసు చేయాలని, ఈ మేరకు ఎయిరిండియాకు ఆదేశించినట్లు రవాణా కార్యదర్శి పీట్ బుట్టిగీగ్ తెలిపారు. అలాగే ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్ 222 మిలియన్ డాలర్లతోపాటు 2.2 మిలియన్ల డాలర్లు పెనాల్టీ చెల్లించాల్సిఉందన్నారు. (ElonMusk: తీవ్ర వాదన, ఊడిపోయిన ఉద్యోగం, అసలేం జరిగిందంటే?) -
హరియాణా స్థానిక ఎన్నికల్లో బీజేపీకి షాక్!
చండీగఢ్: ఢిల్లీ సరిహద్దుల్లో నెలకుపైగా రైతులు సాగిస్తున్న ఆందోళన ప్రభావం సరిహద్దు రాష్ట్రమైన హరియాణా స్థానిక ఎన్నికల్లో బీజేపీపై పడింది. హరియాణా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార బీజేపీ–జేజేపీ ప్రభుత్వానికి ప్రతికూల ఫలితాలు వచ్చాయి. కీలకమైన సోనిపట్, అంబాలా, ఉక్లనా, ధరుహిరా స్థానాల్లో బీజేపీ, జేజేపీ వెనుకంజ వేశాయి. ఆదివారం అంబాలా, పంచకుల, సోనిపట్, రేవారి, ధరుహిరా, సంప్లా, ఉక్లనా నగరాల్లో స్థానిక ఎన్నికలు జరిగాయి. సోనిపట్‌ను కాంగ్రెస్ గెలుచుకుంది, అంబాలాలో హెచ్‌జేపీ పార్టీ గెలుపొందగా పంచకుల, రెవారిలో మాత్రం బీజేపీకి గెలుపు దక్కింది. ఉక్లానా, ధరుహిరాల్లో జేజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. -
ఐఎన్ఎక్స్ కేసులో చిదంబరానికి షాక్
సాక్షి, న్యూఢిల్లీ : సీనియర్ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరానికి ఐఎన్ఎక్స్ మీడియా కేసులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం ఆరోపణలు ఎదుర్కొంటుండగా తాజాగా చిదంబరంను ప్రాసిక్యూట్ చేసేందుకు సీబీఐకి న్యాయమంత్రిత్వ శాఖ అనుమతి లభించింది. కేసులో సేకరించిన సాక్ష్యాధారాలను సమర్పించిన మీదట చిదంబరంపై న్యాయపరమైన చర్యలతో ముందుకెళ్లేందుకు గతంలో న్యాయమంత్రిత్వ శాఖను దర్యాప్తు సంస్ధ ఆశ్రయించిన సంగతి తెలసిందే. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం కస్టడీ విచారణ అవసరమని సీబీఐ, ఈడీ ఈనెల 25న ఢిల్లీ హైకోర్టులో పేర్కొన్నాయి. కాగా ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ కేసులో చిదంబరాన్ని ప్రాసిక్యూట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సీబీఐకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన క్రమంలో తాజా పరిణామాలు ఆయనకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఐఎన్ఎక్స్ మీడియాలో విదేశీ పెట్టుబడులకు క్లియరెన్స్ ఇచ్చే క్రమంలో పెద్దమొత్తంలో ముడుపులు ముట్టాయని చిదంబరంతో పాటు ఆయన కుమారుడు కార్తీ చిదంబరంపై సీబీఐ ఆరోపిస్తోంది. -
టీడీపీకి మరో ఎదురుదెబ్బ
సాక్షి, నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌లో అధికార తెలుగుదేశం పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి పార్టీ జిల్లా కార్యదర్శి యేసు నాయుడుతో పాటు డివిజన్ నేతలు నేల్ సాయిరామ్, అశోక్, శ్రీనివాసరావు, నరసింహులు రాజీనామా చేశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 22న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు వారు ప్రకటించారు. రాష్ట్ర మాజీ మంత్రి, జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు ఆనం రామనారాయణరెడ్డి గత నెలలో టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు ఎన్డీసీసీబీ మాజీ అధ్యక్షుడు వేమారెడ్డి శ్యాంసుందర్‌రెడ్డి, నెల్లూరు కార్పొరేటర్ రంగమయూరరెడ్డి, దివంగత మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి కుమారుడు సంజీవరెడ్డి, చేజర్ల మండల టీడీపీ నాయకుడు నవకృష్ణారెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు ఆదిశేషయ్య, సంగం మండలానికి చెందిన హిందూపురరెడ్డి, పారిశ్రామిక వేత్త కె.ధనుంజయ్‌రెడ్డి, సర్పంచుల సంఘం రాష్ట్ర నాయకుడు విజయభాస్కర్‌రెడ్డి, పి.పెంచలయ్య, చర్ల రవికుమార్, ఆనం ప్రసాదరెడ్డి, రూపక్‌యాదవ్, ఏ.ఓబుల్‌రెడ్డి, కోటిరెడ్డి, చిన్నారెడ్డి తదితరులు కూడా వైఎస్సార్సీపీలోకి వచ్చారు. -
గూగుల్‌కు పెద్ద ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ సెర్చింజన్ దిగ్గజం గూగుల్‌కు ఇండియాలో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇండియాలో ‘స్ట్రీట్ వ్యూ’ సర్వీసు ప్రారంభిద్దామనుకున్న గూగుల్ ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ముందు ఉంచింది. భద్రతా కారణాలతో తిరస్కరిస్తున్నట్లు భారత ప్రభుత్వం పేర్కొంది. ఈ విషయాన్ని లోక్‌సభలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్సరాజ్ గంగారం అహిర్ వెల్లడించారు. బహిరంగ ప్రదేశాలను 360 డిగ్రీల కోణంలో చూయించేందుకు అనుమతి తీసుకునేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి 2015, జూలైలో సమర్పించింది. కానీ ఈ ప్రతిపాదనను ప్రభుత్వం తిరస్కరిస్తున్నట్లు కేంద్రమంత్రి వెల్లడించారు.ఈ విషయం గురించి వేలూరు ఎంపీ బాలసుబ్రమణియన్ రాతపూర్వకంగా పశ్న అడిగినప్పటికీ ఈ నిర్ణయం తీసుకోవడానికి ఎటువంటి ప్రత్యేక కారణం లేదంటూ సమాధానం దాటవేశారు. రక్షణశాఖ అధికారులు భద్రతకు ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉందని చెప్పినట్లు మంత్రి వివరించారు. ఈ ‘స్ట్రీట్ వ్యూ’ సర్వీసును మొదటగా 2011లో బెంగుళూరులో ప్రారంభించారు. బహిరంగ ప్రదేశాలను కెమెరాలో బంధింస్తుడటంతో స్థానిక అధికారులు అభ్యంతరంవ్యక్తం చేశారు. దీంతో అప్పుడు సర్వీసు నిలిచిపోయింది. మళ్లీ 31 చారిత్రాత్రక కట్టడాలను 360 డిగ్రీల కోణంలో చిత్రీకరించేందుకు 2015లో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాతో గూగుల్ ఒప్పందం కుదుర్చుకుంది. అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వంతో ఈ సర్వీసు గురించి చర్చలు జరుపుతోంది. గూగుల్ స్ట్రీట్ వ్యూ సర్వీస్ ప్రస్తుతం 82 దేశాల్లో ఉంది, ఈ సర్వీసు వల్ల పర్యాటకులకు ఎంతో మేలు కలుగుతుంది. మొట్టమొదటి సారి 2007లో కార్లు, బైక్‌లపై కెమెరాలను అమర్చి 360 డిగ్రీల కోణంలో చిత్రాలను సేకరించడం, సేకరించిన చిత్రాలను పనోరమిక్ త్రీడీ కోణంలో చూసేవిధంగా గూగుల్ అమెరికాలో ప్రవేశపెట్టింది. -
'మోదీ సర్కారుకు గట్టి ఎదురుదెబ్బ'
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో కాంగ్రెస్ గెలవడం నరేంద్ర మోదీ సర్కారుకు గట్టి ఎదురుదెబ్బగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఇక నుంచైనా ప్రభుత్వాలను కూల్చడం మానుకోవాలని హితవు పలికారు. ప్రధాని మోదీ ఇకనైనా ప్రభుత్వాలను కూల్చచడం మానుకుంటారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్ శాసనసభలో విశ్వాసపరీక్ష ముగిసిన తర్వాత కేజ్రీవాల్ ఈ మేరకు ట్వీట్ చేశారు. బలపరీక్షలో తమదే విజయమని కాంగ్రెస్ దీమా వ్యక్తం చేసింది. ఫలితాన్ని సుప్రీంకోర్టు రేపు అధికారికంగా ప్రకటించనుంది. -
టీడీపీ చిన్నాభిన్నం!
వరుస దెబ్బలతో ఉనికి కోల్పోయే స్థితిలో తెలుగుదేశం పార్టీ ఐదుగురు ఎమ్మెల్యేల్లో ఇక మిగిలేదెందరో? మంచి ఆఫర్ వస్తే వెళ్లేందుకు సిద్ధమంటున్న ‘మిగిలిన’ వాళ్లు నియోజకవర్గాల ఇన్చార్జులు సైతం గులాబీ గూటికే సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉనికి ప్రశ్నార్థకమవుతోంది. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను వ్యతిరేకించిన పార్టీగా ముద్రపడిన టీడీపీ... 2014 ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతినగా, ఇటీవలి పరిణామాలతో పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో 15 సీట్లు గెలుచుకున్న టీడీపీకి.. ‘గ్రేటర్’ ఎన్నికల తరువాత అందులో మూడోవంతు సభ్యులు కూడా మిగలకపోవడం గమనార్హం. టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఏడాదిన్నర కాలంలో ఒక్కొక్కరుగా టీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా పార్టీ శాసనసభాపక్ష నేతగా ఉంటూ ఏడాదిన్నర కాలంగా టీఆర్ఎస్ను, కేసీఆర్‌ను విమర్శించిన ఎర్రబెల్లి దయాకర్‌రావు మరో ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌తో కలసి టీఆర్ఎస్లో చేరడంతో టీడీపీ శ్రేణులు ఉలిక్కిపడ్డాయి. దాని నుంచి తేరుకోకముందే నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరనున్నట్లు గురువారం రాత్రి ప్రకటించారు. మరోవైపు తెలంగాణలో పార్టీని నిలబెట్టుకునేందుకు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో... గురువారం పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొందరు నాయకులు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా... మరికొందరు మాత్రం తెలంగాణలో పార్టీ వినాశనానికి నేతలే కారణమని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ సమావేశానికి హాజరై టీడీపీ భవిష్యత్తు గురించి ఉపన్యాసం ఇచ్చిన ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి... సమావేశం అనంతరం నేరుగా మంత్రులు హరీశ్‌రావు, లక్ష్మారెడ్డిలతో భేటీ అయి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించడం గమనార్హం. ఖమ్మంతో మొదలు సాధారణ ఎన్నికల్లో తెలంగాణలోని ఐదు జిల్లాల్లో టీడీపీ ఖాతా తెరవలేదు. మహబూబ్‌నగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఒకటి రెండు సీట్లకు పరిమితమైంది. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించింది. ముందుగా ఖమ్మం జిల్లాపై దృష్టి పెట్టిన గులాబీ పెద్దలు... తుమ్మల నాగేశ్వర్రావు నేతృత్వంలో అక్కడి జెడ్పీ చైర్మన్, ఇతర స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో సహా గంపగుత్తగా టీఆర్ఎస్లో కలిపేయడంతో టీడీపీ పతనం మొదలైంది. తరువాత గ్రేటర్‌పై దృష్టి పెట్టిన అధికార పార్టీ... టీడీపీలో బలమైన నేతలుగా పేరున్న తలసాని శ్రీనివాస్‌యాదవ్, తీగల కృష్ణారెడ్డిలకు వలవేసింది. అనంతరం మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, సాయన్నలతో పాటు తాజాగా వివేకానంద గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ ఫ్లోర్‌లీడర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రకాశ్‌గౌడ్, రాజేందర్‌రెడ్డి కూడా అధికారపార్టీలో బాటపట్టడంతో టీడీపీ శ్రేణులు తెల్లబోయాయి. ఆఫర్ వస్తే రేవంత్ మినహా అందరూ.. టీడీపీలో ప్రస్తుతం ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. వారిలో అరికపూడి గాంధీ పార్టీ మారడం లాంఛనమేనని ప్రచారం జరుగుతోంది. మిగతా వారిలో ఖమ్మం జిల్లాకు చెందిన సండ్ర వెంకట వీరయ్య ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్లో చేరే అవకాశముంది. ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య కొంతకాలంగా టీడీపీకి దూరంగా ఉంటున్నారు. బీసీ ఉద్యమాల్లో బిజీ అయి.. ఏపీలో కాపులను బీసీల్లో చేర్చే అంశంపై అక్కడి టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతు విప్పారు. ఈ పరిస్థితుల్లో బీసీల అంశంపై కేసీఆర్ స్పష్టమైన హామీ ఇస్తే అధికార పార్టీలో చేరేందుకు అభ్యంతరం ఉండదని ఆయన సన్నిహితులు చెపుతున్నారు. ఇక టీడీపీ హైదరాబాద్ అధ్యక్షుడిగా, గ్రేటర్ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపుపై ఆరోపణలు ఎదుర్కొన్న మాగంటి గోపీనాథ్ కూడా టీఆర్ఎస్ నుంచి వచ్చే ఆఫర్ కోసం ఎదురు చూస్తున్నట్లు సమాచారం. వీరితో పాటు గ్రేటర్ సహా అన్ని జిల్లాల్లో నియోజకవర్గాల ఇన్చార్జులుగా ఉన్న వారు కూడా టీఆర్ఎస్లోకి క్యూ కట్టారు.