టీడీపీకి మరో ఎదురుదెబ్బ | Another Shock For TDP In Nellore District | Sakshi
Sakshi News home page

నెల్లూరు జిల్లాలో టీడీపీకి మరో షాక్‌

Published Fri, Oct 19 2018 3:42 PM | Last Updated on Fri, Oct 19 2018 3:59 PM

Another Shock For TDP In Nellore District - Sakshi

సాక్షి, నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌లో అధికార తెలుగుదేశం పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి పార్టీ జిల్లా కార్యదర్శి యేసు నాయుడుతో పాటు డివిజన్ నేతలు నేల్ సాయిరామ్, అశోక్, శ్రీనివాసరావు, నరసింహులు రాజీనామా చేశారు. నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 22న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్టు వారు ప్రకటించారు.

రాష్ట్ర మాజీ మంత్రి, జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు ఆనం రామనారాయణరెడ్డి గత నెలలో టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆయనతో పాటు ఎన్‌డీసీసీబీ మాజీ అధ్యక్షుడు వేమారెడ్డి శ్యాంసుందర్‌రెడ్డి, నెల్లూరు కార్పొరేటర్‌ రంగమయూరరెడ్డి, దివంగత మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి కుమారుడు సంజీవరెడ్డి, చేజర్ల మండల టీడీపీ నాయకుడు నవకృష్ణారెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు ఆదిశేషయ్య, సంగం మండలానికి చెందిన హిందూపురరెడ్డి, పారిశ్రామిక వేత్త కె.ధనుంజయ్‌రెడ్డి, సర్పంచుల సంఘం రాష్ట్ర నాయకుడు విజయభాస్కర్‌రెడ్డి, పి.పెంచలయ్య, చర్ల రవికుమార్, ఆనం ప్రసాదరెడ్డి, రూపక్‌యాదవ్, ఏ.ఓబుల్‌రెడ్డి, కోటిరెడ్డి, చిన్నారెడ్డి తదితరులు కూడా వైఎస్సార్‌సీపీలోకి వచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement