kotamreddy sridhar reddy
-
సీఐ బెదిరిస్తున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
-
టీడీపీలో అంతర్గత ఆధిపత్యం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు టీడీపీలో అంతర్గత ఆధిపత్యం ఆరంభమైంది. పార్టీలో ఏ హోదా లేకపోయినా.. పార్టీ అంటే తాను, తానంటే పార్టీ అంటూ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తనకు తాను గొప్పగా పొగుడుకుంటే.. పార్టీలో కోటంరెడ్డి నంబర్ వన్ అయితే.. రెండో వ్యక్తి నారాయణ, పార్టీని బతికించిన మూడో వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అంటూ తన అనుచరులతో భజన కీర్తన ఉదంతం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల క్రితం నెల్లూరు నగరంలోని 14వ డివిజన్ ఏసీనగర్ సెంటర్లో టీడీపీ జెండాను కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆవిష్కరించారు. సాధారణంగా పార్టీ జెండా ఆవిష్కరణను ఫ్రొటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యే, మంత్రి అయిన నారాయణతో చేయించడం గౌరవనీయం. అయితే పార్టీలో ఏ పదవి లేని కోటంరెడ్డి ఆధిపత్యం చాటుకునేందుకు ఈ కార్యక్రమం చేపట్టడంపై సర్వత్రా చర్చకు దారి తీసింది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన మూడో రోజు నుంచే ఆ పార్టీ తో యుద్ధం ప్రారంభించానని, మిగతా వారంతా మూడేళ్ల తర్వాత ప్రజాక్షేత్రంలోకి వచ్చారంటూ పరోక్షంగా నారాయణపై విమర్శలు గుప్పించారు. ఈ రోజు నెల్లూరు సిటీలో పార్టీ బతికిందంటే తన వల్లేనంటూ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి చెప్పుకొచ్చారు. తన రాజకీయ భవిష్యత్ కొందరి వల్ల లేకుండా పోయిందని, తన జీవితమంతా ఒకరికి పల్లకిలు మోసే బతుకై ందంటూ వాపోయారు. ఓ వైపు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, మంత్రి పొంగూరు నారాయణపై అక్కసు వెళ్లగక్కుతూనే మరో వైపు ఆయన్ను సిటీని అభివృద్ధి చేసిన గొప్ప నాయకుడంటూ కీర్తించడం కొసమెరుపు. ఇదే సమయంలో అదే డివిజన్ ఇన్చార్జి నేత మాట్లాడుతూ నెల్లూరు నగరంలో టీడీపీ నేతలంటే నంబర్ వన్ కోటంరెడ్డి అయితే.. నారాయణ రెండో వ్యక్తిగా, వేమిరెడ్డి మూడో వ్యక్తిగా అభివర్ణించాడు. ఈ కార్యక్రమం ద్వారా తనను తాను పొగుడుకోవడం, తన అనుచరులతో కీర్తించుకోవడం కోసమే కాకుండా.. నెల్లూరు నగరంలో తన ఆధిపత్యం చాటుకునే ప్రయత్నమే అనే సందేశాన్ని పంపారని ఆ పార్టీలోనే చర్చ జరుగుతోంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కోటంరెడ్డితో పాటు టీడీపీకి చెందిన డివిజన్ ఇన్చార్జిలను నారాయణ పక్కన పెట్టేశారు. వారికి ఏ విధంగా సంబంధం లేకుండానే తన సొంత యంత్రాంగంతో ఎన్నికలను నిర్వహించుకున్నారనే అక్కసును ఈ విధంగా వెలిబుచ్చుతున్నారని ఆ పార్టీ కేడర్ చెవులు కొరుక్కోవడం విశేషం. -
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి దాష్టీకాలు మొదలు
నెల్లూరు (బారకాసు): ఎన్నికలు ముగియగానే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి దాష్టీకాలు ప్రారంభమయ్యాయి. నెల్లూరు మేయర్ దంపతులను బెదిరించి రాజకీయ అరాచకానికి తెరతీశారు. గిరిజన మహిళ రిజర్వేషన్‌తో వైఎస్సార్సీపీ నుంచి మేయర్‌గా ఎన్నికైన పోట్లూరి స్రవంతి, ఆమె భర్త జయవర్ధన్లను పార్టీ మారాలని, లేదంటే కేసుల్లో ఇరికిస్తామని బెదిరించారు. నిస్సహాయ స్థితిలో ఆ గిరిజన దంపతులు వైఎస్సార్సీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వైఎస్సార్సీపీ నుంచి గెలిచిన కార్పొరేటర్లు, నేతలను టీడీపీలో చేరాలంటూ ఎన్నికలకు ముందు నుంచే శ్రీధర్‌రెడ్డి బెదిరింపులకు దిగారు.కొందరిపై రాజకీయంగానూ కేసులు పెట్టించారు. ఇప్పుడు అధికార పార్టీలో ఉండటంతో మరింతగా బెదిరింపులకు దిగుతున్నారు. రెండున్నరేళ్ల క్రితం జరిగిన నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో 12వ డివిజన్ నుంచి పోట్లూరి స్రవంతి వైఎస్సార్సీపీ తరపున పోటీ చేసి కార్పొరేటర్‌గా గెలుపొందారు. ఈ డివిజన్ నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉండటంతో స్రవంతి దంపతులు అప్పట్లో వైఎస్సార్సీపీలోనే ఉన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అనుచరులుగా కొనసాగేవారు.అప్పటి మంత్రి పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్ సహకారంతో స్రవంతి మేయర్‌గా ఎన్నికయ్యారు. 9 నెలల క్రితం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వైఎస్సార్సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ సమయంలో మేయర్ స్రవంతి దంపతులు, కొందరు కార్పొరేటర్లు ఆయన వెంట వెళ్లారు. కొద్దిరోజుల్లోనే స్రవంతి దంపతులు తిరిగి వైఎస్సార్సీపీ గూటికి చేరారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి టీడీపీ టిక్కెట్‌పై గెలుపొందారు.జరిగిందిదీ..నెల్లూరు నగరంలో దాదాపు 70 భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేకుండానే తనఖా చేసిన ఆస్తులను మాన్యువల్‌గా కమిషనర్ ఫోర్జరీ సంతకాలతో రిలీజ్ ఆర్డర్లు ఇచ్చారని, దీనివల్ల ప్రభుత్వానికి రూ.కోట్లు నష్టం వచ్చిందంటూ ఓ న్యాయవాది నగర పాలక సంస్థ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో మేయర్ భర్త జయవర్ధన్ పాత్ర ప్రధానంగా ఉన్నట్లు ఆరోపించారు. దీంతో ఈ వ్యవహారంపై కమిషనర్ విచారణకు ఆదేశించారు.గతంలో తన వెంట ఉండి, వైఎస్సార్సీపీలోనే కొనసాగుతున్న మేయర్ దంపతులను తన దారికి తెచ్చుకునేందుకు, వారిపై పెత్తనం సాగించేందుకు ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి ఈ ‘ఫోర్జరీ’ ఫిర్యాదును ఆయుధంగా ఉపయోగించుకున్నారు. టీడీపీలో చేరితే కేసులు ఉండవని, లేదంటే జైలుకు పంపిస్తామని బెదిరించారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో భయపడిన ఆ గిరిజన దంపతులు నిస్సహాయ స్థితిలో వైఎస్సార్సీపీకి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు. -
కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై ప్రొ.వసుంధర సంచలన వ్యాఖ్యలు
సాక్షి, విజయవాడ: జమీన్ రైతు పత్రిక ఎడిటర్ డోలేంద్ర ప్రసాద్‌పై కోటంరెడ్డి దాడి చేసిన ఘటనకు తాను ప్రత్యక్ష సాక్షినని ప్రొఫెసర్ వసుంధర అన్నారు. డోలేంద్రపై దాడి చేసిన అనంతరం తనను, మరో మహిళను కోటంరెడ్డి కారులో ఎత్తుకెళ్లాడని తెలిపారు.సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, మోసానికి, కపటానికి ప్యాంటు, షర్టు వేసి చేతిలో బీరు బాటిల్ పెడితే అతడే కోటంరెడ్డి అని.. కోటంరెడ్డి పైకి మాత్రం వేదాలు వల్లిస్తాడంటూ మండిపడ్డారు.‘‘కోటంరెడ్డి సోదరులు నియోజకవర్గంలో అనేక దందాలకు, అరాచకాలకు పాల్పడ్డారు. ఎంపీడీఓ సరళపై దాడికి పాల్పడి, ఆ దాడి నేనే చేయించానని కోటంరెడ్డి ఫోన్ చేసి మరీ ఆమెకు చెప్పారు. తిరుమల నాయుడు సహా అనేక మందిపై దాడులు జరిపారు. కోటంరెడ్డి లాంటి నీచుడికి ఓటు వేయొద్దు’’ అని వసుంధర పేర్కొన్నారు.‘‘రియల్ ఎస్టేట్ దగ్గర నుంచి దుకాణాల వరకూ మామూళ్లు వసూలు చేశారు. మహిళల జీవితాలను నాశనం చేశారు. దాడులు, దౌర్జన్యాలకు పాల్పడ్డారు. నెల్లూరు రూరల్ వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డికి అభివృద్ధి చేసిన ట్రాక్ రికార్డు ఉంది. నెల్లూరు రూరల్ ప్రజలంతా ఆదాలకు ఓటు వేయాలి’ అని వసుంధర విజ్ఞప్తి చేశారు. -
కోటంరెడ్డి, నారాయణ పై విజయ్ సాయి రెడ్డి ఫైర్
-
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి నెల్లూరు ప్రజలు భారీ షాక్
-
అధికారంలోకి వస్తే మేమేంటో చూపిస్తాం
నెల్లూరు సిటీ: టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమను ఇబ్బంది పెట్టిన పోలీసు అధికారులకు తామేంటో చూపిస్తామంటూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పోలీసులను బెదిరించారు. నగరంలోని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో సోమవారం నారాయణ గ్రూప్ జనరల్ మేనేజర్ విజయభాస్కర్‌రెడ్డి, టీడీపీ నాయకులతో కలిసి ఆయన విలేక రుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ నారాయణను, టీడీపీ సానుభూతిపరులను పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ముఖ్యంగా ఇంటిలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, కొల్లి రఘురామిరెడ్డి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా రని ఆరోపించారు. తమను ఇబ్బంది పెట్టిన ఎవరినీ వదిలేది లేదన్నారు. వారి జాతకాలు బయటపెడతానని హెచ్చరించారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. -
నలుగురికీ చివరి అవకాశం ఈసారి విచారణకు రాకపోతే
-
టీడీపీలో అయోమయంగా ఫిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి
-
కోటంరెడ్డి బండారం బయటపెట్టిన ఆనం విజయకుమార్ రెడ్డి
-
బ్రాహ్మణి, కోటంరెడ్డిపై అనిల్ కుమార్ పంచులు
-
స్పీకర్ పై దౌర్జన్యం కోటంరెడ్డి సస్పెండ్
-
ప్చ్.. నెల్లూరు టీడీపీ సీనియర్ల దుస్థితి ఇది
జిల్లాలో నారా లోకేశ్ నిర్వహించిన యువగళం పాదయాత్ర టీడీపీలో చిచ్చురేపింది. ఇప్పటికే పార్టీ పరిస్థితి దిగజారుతున్న క్రమంలో పాదయాత్ర జోష్ నింపుతుందని ఆశించిన ఆ పార్టీ శ్రేణులకు నిరుత్సాహమే మిగిలింది. పాదయాత్రలో వలస నేతలకు రెడ్‌కార్పెట్ వేసిన చినబాబు కష్టకాలంలో పార్టీ వెన్నంటి ఉండి జెండా మోసిన సీనియర్ నేతలు అవమానపడేలా చేయడంతో వారు అంటీముట్టనట్లు వ్యవహరించారు. పాదయాత్రకు ప్రజల్లో కూడా సృందన కరువై ఫ్లాప్‌షోగా మారింది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: టీడీపీ నేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర గత నెల 13వ తేదీన జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో దాదాపు నెల రోజులకు పైగా చినబాబు పాదయాత్ర చేపట్టారు. నిత్యం పసలేని ఆరోపణలు, తడబడిన ఉచ్ఛారణ వెరసి ప్రజల్లో మరింత చులకన అయ్యాడు. ప్రజల్లో కూడా స్పందన లేకపోవడంతో కొన్ని నియోజకవర్గాల్లో ఫ్లాప్‌షోగా మారింది. ఓ వైపు టీడీపీ నేతలు సభలను విజయవంతం చేసేందుకు జన సమీకరణ కోసం కోట్లాది రూపాయలు వెదజల్లినా ఆశించిన ఫలితాలు కన్పించలేదు. ఒకే ఫార్ములా.. ఇటీవల కాలంలో టీడీపీ నేతలు నిర్వహించే సభల్లో ఒకే ఫార్ములా పాటిస్తున్నారు. టీడీపీ సభలకు జనస్పందన లేకపోవడంతో జనం ఎక్కువగా కన్పించేందుకు వారు ఇరుకు రోడ్లపై సభలు నిర్వహిస్తున్నారు. సహజంగా సభ జరిగే ప్రాంతం వై జంక్షన్లో రెండువైపులా కన్పించేలా వాహనం ఉంచి ప్రసంగాలు చేస్తారు. కానీ టీడీపీ సభలు జరిగే ప్రదేశం జంక్షన్ ఉన్న ప్రాంతాన్ని కాదని ఇరుకురోడ్లపై ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 40 అడుగుల రోడ్డులో రహదారికి ఇరువైపులా పది అడుగులు కుదించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. రెండువైపులా ఇరవై అడుగులు కుదించడంతో ఇరవై అడుగులు మాత్రమే ఉండేలా చేస్తున్నారు. అక్కడ వెయ్యి మంది జనం పోగైతే చాలు వేలాది మంది ఉన్నట్లుగా చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు. డ్రోన్ కెమెరాతో షూట్ చేసి వేలాది మంది ఉన్నట్లు భ్రమలు కల్పించే ఫార్ములాను అమలు చేస్తున్నారు. గతంలో కందుకూరులో చంద్రబాబు సభ ఇదే రీతిలో చేపట్టడంతో అక్కడ జరిగిన తొక్కిసలాటలో 10 మందికి పైగా మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఇదే ఫార్ములా యువగళంలో కూడా అమలు చేసి సభలు నిర్వహించారు. సీనియర్ నేతలకు అవమానాలు లోకేశ్ పాదయాత్రలో టీడీపీ సీనియర్ నేతలకు ఘోర అవమానాలు ఎదురయ్యాయి. ఆత్మకూరులో నాలుగేళ్లపాటు పార్టీ ఇన్చార్జిని కూడా నియమించని దుస్థితి ఉంది. ఈ క్రమంలో ఆత్మకూరుకు వైఎస్సార్సీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి(వెంకటగిరి) కోసం పాకులాడాల్సి వచ్చింది. పార్టీ సీనియర్ నేతలంతా ఆత్మకూరులో యువగళం వ్యవహారాలు చూడాలని ఆనంను కోరడంతో ఆయన కొన్ని డిమాండ్లు విధించారు. పాదయాత్ర జరిగే సమయంలో టీడీపీ సీనియర్‌నేత గూటూరు కన్నబాబు కన్పించకూడదని తెగేసి చెప్పడంతో ఆనం కోసం కన్నబాబును దూరంగా పెట్టాల్సి వచ్చింది. ఆత్మకూరులో కష్టకాలంలో కూడా పార్టీని నమ్ముకుని వెన్నంటి ఉన్న కన్నబాబును ఆనం మూలాన బలిచేయాల్సి వచ్చింది. పాదయాత్ర జరిగే సమయంలో ఆయన్ను విదేశీ పర్యటన పేరుతో పంపాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు లోకేశ్‌ను కలిసే అవకాశం లేకుండా చేశారు. కాగా నెల్లూరురూరల్ నియోజకవర్గంలో అదే సీన్ జరిగింది. వైఎస్సార్సీపీ బహిష్కృత ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కోసం ఆ పార్టీ జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్‌ను పక్కనపెట్టారు. గత నాలుగేళ్లలో టీడీపీ నేతలను ముప్పతిప్పలు పెట్టిన కోటంరెడ్డి కోసం అబ్దుల్ అజీజ్‌ను బలి చేశారు. ద్వితీయశ్రేణి నేతలు సైతం కోటంరెడ్డి రాకతో లోలోన కుమిలిపోతున్నారు. పసలేని ఆరోపణలు జిల్లాలో లోకేశ్ పాదయాత్రలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై చేసిన పసలేని అడ్డుగోలు ఆరోపణలు ఆయన్ని నవ్వులపాలు చేశాయి. అవినీతి, అక్రమాలకు పాల్పడి వైఎస్సార్సీపీ నుంచి సస్పెండ్ అయిన ఆ ముగ్గురు ఎమ్మెల్యేలను పక్కన పెట్టుకుని అవినీతి జరిగిందని చెప్పడంపై అందరినీ ఆశ్చర్యపరిచింది. లోకేశ్ పసలేని ఆరోపణలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు సవాల్ విసిరినా టీడీపీ నేతలు మారుమాట్లాడక పోవడం గమనార్హం. ఒక్కొక్కరికీ ఒక్కో చేదు అనుభవం ► నెల్లూరు సిటీ నియోజకవర్గంలో కూడా మాజీ మంత్రి నారాయణ కోసం కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డికి ఉద్వాసన పలికారు. గత నాలుగేళ్లుగా టీడీపీ నగర నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న కోటంరెడ్డిని కాదని మాజీ మంత్రికి బాధ్యతలు అప్పగించడంతో విమర్శలు వెల్లువెత్తాయి. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కూడా ఈ దఫా నేను ఎమ్మెల్యే అభ్యర్థినని కోటంరెడ్డి బహిరంగంగా ప్రకటించుకోగా ఆ కలను చినబాబు కలగానే మిగిల్చాడు. ► కోవూరు నియోజకవర్గంలో సీనియర్ నేతలను సైతం టీడీపీ పెద్దలు కరివేపాకులా వాడుకుంటున్నారు. దశాబ్దాల కాలంగా ఆ పార్టీని నమ్ముకున్న పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డికి ప్రతి దఫా సీటు ఇస్తామంటూ ఆశపెడుతూ అన్యాయం చేస్తున్నారు. యువగళంలో కూడా పెళ్లకూరుకు సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ఆయన గర్రుగా ఉన్నారు. ► కావలి నియోజకవర్గంలో సీనియర్ నేతలకు చుక్కలు చూపించారు. బీద రవిచంద్ర మాలేపాటి సుబ్బానాయుడుని తెరపైకి తెచ్చి చేతిచమురు వదిలింపజేయగా, ప్రస్తుతం దగుమాటి వెంకటకృష్ణారెడ్డిని తెరపైకి తెచ్చారు. అనంతరం అందరికీ మస్కాకొట్టి బీద రవిచంద్ర యువగళంలో తన సతీమణిని రంగంలోకి దింపడంతో టికెట్ ఆశించే నేతలకు దిమ్మదిరిగి మైండ్‌బ్లాక్ అయిందని అందరూ చర్చించుకున్నారు. ► ఉదయగిరిలో టికెట్ నీదేనంటూ పార్టీకి ఫండ్ తీసుకుని ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్‌ను చినబాబు ఎంకరేజ్ చేశారు. దీంతో టికెట్ ఆశించిన కాకర్ల సేవా కార్యక్రమాల పేరుతో ఉదయగిరిలో మకాం వేశారు. తీరా యువగళంలో కాకర్లను దూరం పెట్టారు. పాదయాత్రలో ఆయన నీడ కూడా పడకుండా పంపించేశారు. అలాగే పార్టీలో సీనియర్‌నేతగా ఉన్న కంభం విజయరామిరెడ్డికి అవమానం జరిగింది. కొండాపురంలో జరిగిన సభలో కంభంకు మైకు ఇవ్వకుండా దింపేశారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, దగుమాటి వెంకటకృష్ణారెడ్డిలకు మైకు ఇచ్చి మాట్లాడించిన చినబాబు కంభం విజయరామిరెడ్డికి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకపోవడం గమనార్హం. -
కోటంరెడ్డి సభను అడ్డుకునేందుకే వచ్చారు : అంబటి
-
అసెంబ్లీకి అందుకే వచ్చావా?.. కోటంరెడ్డిపై మంత్రి అంబటి ఫైర్
సాక్షి, అమరావతి: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తీరుపై అసెంబ్లీలో మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. కోటంరెడ్డి సభను అడ్డుకునేందుకే వచ్చారంటూ దుయ్యబట్టారు. శ్రీధర్‌రెడ్డిపై టీడీపీకి ఇప్పుడు ప్రేమ వచ్చిందా?. కోటంరెడ్డి నమ్మకద్రోహి.. చంద్రబాబు, టీడీపీ కోసం ఆయన పని చేస్తున్నారని అంబటి నిప్పులు చెరిగారు. ‘‘శ్రీధర్‌రెడ్డి.. టీడీపీతో చేతులు కలిపారు. దురుద్దేశ్యంతోనే కోటంరెడ్డి ఆందోళన చేస్తున్నాడు. నైతిక విలువలేని వ్యక్తి శ్రీధర్‌రెడ్డి. చంద్రబాబు మెప్పుకోసం కోటంరెడ్డి మాట్లాడుతున్నాడు. నమ్మకద్రోహం చేసినవారికి పుట్టగతులు లేకుండా పోతాయి’’ అంటూ మంత్రి అంబటి నిప్పులు చెరిగారు. ఎలా ప్రస్తావించాలో తెలుసుకోవాలి: మంత్రి బుగ్గన వ్యక్తిగత అంశాలకు సభలో చోటులేదని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. ‘‘ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే సంబంధింత మంత్రులు, అధికారులకు వినతిపత్రం ఇస్తే పరిష్కరిస్తాం. ఎక్కడ ఏ వేదిక మీద ఎలా ప్రస్తావించాలో తెలుసుకోవాలి’’ అంటూ మంత్రి బుగ్గన హితవు పలికారు. -
కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నాటి నేరాలే.. నేటి కేసులు
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి రాజకీయ పబ్బం గడుపుకొనేందుకు కొత్త డ్రామాకు తెర లేపాడు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం తన అనుచరగణంతో అరాచకాలకు పాల్పడ్డాడు. లెక్కకు మించి నేరాలు చేశాడు. అతనిపై కేసులు పెట్టేందుకు బాధితులు సాహసం చేయలేకపోయారు. పోలీసులకు సాక్షం చెప్పేందుకు ధైర్యం చేయలేకపోయారు. నేరుగా ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఆ కమిషన్ ఆదేశాలతో పోలీసులు కేసులు నమోదు చేస్తే ప్రభుత్వం కక్ష సాధిస్తుందని ఆగమాగం చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నేరాలు చేసింది ఆయన. నెపం ప్రభుత్వంపై నెట్టేందుకు రాజకీయ రంగు పులుముతూ ఆగమాగం చేస్తున్నాడు. ఎమ్మెల్యేననే అధికారంతో తన మందీమార్బలాన్ని అడ్డం పెట్టుకుని మదమెత్తిన మత్తగజంలా అరాచకాలు సృష్టించానని ఇటీవల పచ్చమీడియాలో ఒప్పుకున్నాడు. కోటంరెడ్డి అప్పటి నేరాలపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఆదేశాల మేరకు కేసులు నమోదు కావడంతో ప్రభుత్వ పెద్దలు తనపై కక్ష సాధిస్తున్నారంటూ తాను నంగనాచినంటూ రాజకీయంగా లబ్ధిపొందాలని ప్రయత్నిస్తున్నాడు. నేరం చేసిన వాడు ఎవరైనా చట్టానికి అతీతులు కారు. గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి కూడా నిందితుడే అని పోలీసుల విచారణలో నిగ్గు తేల్చారు. దీంతో తనను అరెస్ట్ చేయడం ఖాయమని తెలిసి ముందుగానే.. అస్కార్ అవార్డు గ్రహీతల నటనకు మించి నంగి రాజకీయాలు చేస్తున్నాడు. టీడీపీకి చెందిన దళితనేతపై హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్‌ను కూడా రాజకీయంగా వాడుకోవడంపై దళిత సంఘాలు భగ్గుమంటున్నాయి. అసలేం ఏం జరిగింది.. గతేడాది అక్టోబర్ 17న టీడీపీకి చెందిన ముస్లిం నేత అల్లాభక్షు నెల్లూరురూరల్ ఎమ్మెల్యేపై సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టారంటూ అయన అనుచరులు ద్వారా దాడి చేయించారు. ఆ సమయంలో అతనికి అండగా ఉన్నాడన్న కారణంతో అదే పార్టీకి చెందిన దళిత నేత మాతంగి కృష్ణను టార్గెట్ చేసి అక్టోబర్ 18వ తేదీన కోటంరెడ్డి సోదరుల ప్రోత్సాహంతో దాదాపు 11 మంది ఆయన అనుచరులు దళిత నేతను కారులో ఎక్కించుకుని విచక్షణా రహితంగా దాడి చేశారు ముందురోజే అతని బైక్‌ను తగులబెట్టారు. ఆయా ఘటనలపై అప్పట్లో హత్యాయత్నం, అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే పాత్ర ఉందని తెలియడంతో పోలీసులు సమగ్ర విచారణ చేపట్టారు. ఈ లోపు నిందితులపై చర్యలు చేపట్టలేదని దళితనేత మాతంగి కృష్ణ ఎస్సీ,ఎస్టీ కమిషన్‌ను కలిసి ఫిర్యాదు చేయడంతో వారి ఆదేశాల మేరకు పోలీసులు చర్యలు వేగవంతం చేశారు. అందులో భాగంగానే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించేలా చేశారు. మిగిలిన నిందితులను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ముస్లింల గొంతునొక్కుతూ.. నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల గొంతుకనై ప్రశ్నిస్తానంటూ చెప్పుకునే ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి రెండు రోజుల క్రితం ముస్లింలకు అన్యాయం జరిగిందంటూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ముస్లింలపై తన అనుచరులతో దాడులు చేయించినప్పుడు వారు గుర్తుకు రాలేదా అని మండిపడుతున్నారు. టీడీపీకి చెందిన అల్లాభక్షుపై దాడికి ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఇద్దరు జర్నలిస్టులు, పలువురు నేతలపై దాడులు చేయించిన ఘటనలు ఉన్నాయి. ఇదేనా దళితుల ప్రేమ దళితులంటే తనకు ఎంతో ప్రేమ ఉందని సమావేశాల్లో ఊదరగొడుతున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి దళిత నేతపై పాశవికంగా దాడులు చేయించడమేనా దళిత ప్రేమంటే? అంటూ నగరంలోని దళితులు ప్రశ్నిస్తున్నారు. అధికార మదమెక్కి చేసిన అన్యాయాలు, అక్రమాలను ప్రశ్నిస్తే వారిని టార్గెట్ చేసి దాడులు చేయించాడు. రౌడీ మూకలను ప్రోత్సహించి దాడులు చేయించేవాడు. ఏకంగా టీడీపీకి చెందిన విద్యార్థి నేతపై కూడా హత్యాయత్నం చేయించాడు. ఈ రౌడీ రాజకీయాన్ని సింహపురికి పరిచయం చేసిన ఎమ్మెల్యే దళితనేతపై దాడి కేసులో నిందితులను అరెస్ట్ చేస్తే అదేదో రాజకీయ కుట్ర అంటూ మీడియా ముందుకు రావడంపై ప్రజలు మండి పడుతున్నారు. ప్రధానంగా దళితలపై కపట ప్రేమ నటించే దానికి ఈ ఘటనే ఉదాహరణ అంటూ విమర్శిస్తున్నారు. -
కోటంరెడ్డికి ఊహించని షాక్..!
సాక్షి, నెల్లూరు: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి మరో షాక్ తగిలింది. కోటంరెడ్డిపై టీడీపీ దళిత నేత మాతంగి కృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. శ్రీధర్‌రెడ్డిని పార్టీలోకి రానిచ్చే ప్రసక్తే లేదంటూ సంచలన కామెంట్స్ చేశారు. కాగా, మాతంగి కృష్ణ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. నన్ను హత్య చేయించడానికే కోటంరెడ్డి ప్రయత్నించాడు. 25 మంది అనుచరులను నాపైకి దాడికి పంపాడు. ఈ ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశాను. అసలు సూత్రధారి కోటంరెడ్డిని కూడా అరెస్ట్ చేయాలి. కోటంరెడ్డిని పార్టీలోకి రానిచ్చే ప్రసక్తే లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే.. నెల్లూరులో నాలుగు నెలల క్రితం మాతంగి కృష్ణపై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనపై వేదాయపాళెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అప్పట్లో సాక్ష్యాలు లభ్యం కాలేదు. తాజాగా పలువురు ప్రత్యక్ష సాక్షులు ముందుకొచ్చి సాక్ష్యం చెప్పడంతో గత రాత్రి తాటి వెంకటేశ్వర రావు, మన్నేపల్లి రఘు, జావెద్ అనే ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇంకా ఏడుగురు నిందితులను అరెస్ట్ చేయాల్సి ఉందని, వారిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని డీఎస్పీ శ్రీనివాసులు రెడ్డి తెలియజేశారు. -
కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి టీడీపీలో నో చాన్స్..! అజీజ్ ప్లాన్‌తో ఎమ్మెల్యేకు షాక్?
కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి టీడీపీలో ఎంట్రీకి దారులు మూసుకుపోతున్నాయి. ఆ పార్టీ నేతలు కోటంరెడ్డి రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కోటంరెడ్డి ఎపిసోడ్ ప్రారంభమైనప్పటి నుంచి నెల్లూరు రూరల్ నియోజకవర్గ నేతలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. రాబోయే ఎన్నికల్లో తాను టీడీపీ తరఫున పోటీ చేస్తానని ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి తనకు తానుగా బహిరంగంగా ప్రకటించుకున్నారు. అయితే ఇప్పటికే టీడీపీ నెల్లూరు రూరల్ ఇన్చార్జిగా ఉన్న అబ్దుల్ అజీజ్ శ్రీధర్‌రెడ్డికి వ్యతిరేకంగా శ్రేణులను కూడగడుతున్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: టీడీపీ నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉంటానని ఊహల్లో తేలియాడిపోతున్న అజీజ్‌కు కోటంరెడ్డి ఎపిసోడ్‌తో గొంతులో వెలక్కాయ పడినట్లు అయింది. వైఎస్సార్సీపీలో రెండు దఫాలు ఎమ్మెల్యేగా ఎన్నికై చక్రం తిప్పిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తన రాజకీయాలతో గ్రాఫ్ కోల్పోయాడు. ఈ దఫా టికెట్ వచ్చే అవకాశాలు లేవని ముందుగానే పసిగట్టిన ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుతో రహస్యంగా టచ్‌లోకి వెళ్లి టికెట్ కన్ఫర్మ్ చేసుకున్నాడని సమాచారం. అధికార పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవడానికి అంతా సిద్ధం చేసుకున్నాక.. ఫోన్ ట్యాంపింగ్ హైడ్రామాతో రాజకీయ అలజడి సృష్టించారు. రానున్న ఎన్నికల్లో తాను టీడీపీ అభ్యరి్థగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని చెప్పడంతో టీడీపీలో ప్రకంపనలు మొదలయ్యాయి. టీడీపీ రూరల్ టికెట్ నాదే అనుకుంటూ ఇదే ఎమ్మెల్యే కోటంరెడ్డిపై, ప్రభుత్వం నోరుపారేసుకున్న అబ్దుల్ అజీజ్ షాక్‌కు గురయ్యాడు. అప్పటికప్పుడే పార్టీ పెద్దలతో కలిసి చంద్రబాబు వద్ద పంచాయితీ పెట్టాడు. చంద్రబాబు సైతం కోటంరెడ్డి రాకపై స్పష్టత ఇవ్వకపోవడంతో అజీజ్ మల్లగుల్లాలు పడుతున్నాడు. పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో పార్టీ కార్యాలయంలోనే సమావేశాలు నిర్వహించి అధిష్టానానికి అలి్టమేటం పంపిస్తున్నాడు. కోటంరెడ్డి మౌనం.. అజీజ్ అల్లరి నెల్లూరు రూరల్ టీడీపీ టికెట్ నాదేనంటూ బహిరంగంగానే ప్రకటించుకున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి అంతర్గత సమావేశాల్లోనూ ధీమాగా చెప్పుకుంటున్నాడు. అయితే మరో వైపు నెల్లూరు రూరల్ టీడీపీ ఇన్చార్జి, టికెట్ ఆశావహుడు అజీజ్ మాత్రం రచ్చరచ్చ చేస్తున్నాడు. కోటంరెడ్డి మాత్రం మౌనంగా తన ప్రయత్నాలు తాను చేసుకుంటూ పోతున్నాడు. సోదరుడు గిరిధర్‌రెడ్డితో వ్యాపార సంబంధాలు ఉన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ద్వారా కోటంరెడ్డి టికెట్ ప్రయత్నాలు చేస్తున్నాడు. మరోవైపు అజీజ్ కూడా చంద్రబాబు, లోకేశ్‌లతో జిల్లా పెద్దల ద్వారా మాట్లాడించారు. రాజకీయ వ్యూహాల్లో భాగంగా టీడీపీ అధిష్టాన పెద్దలు మాత్రం పైకి కోటంరెడ్డిని పారీ్టలోకి తీసుకునే అవకాశం లేదని చెబుతున్నారు. టీడీపీ అధిష్టాన పెద్దలపై నమ్మకం లేని అజీజ్ మాత్రం కోటంరెడ్డికి వ్యతిరేకంగా పార్టీ శ్రేణులను సమీకరించి సమావేశాలు పెడుతున్నాడు. నిప్పులు చెరిగిన తమ్ముళ్లు ఆదివారం జిల్లా టీడీపీ కార్యాలయంలో అబ్దుల్ అజీజ్ నేతృత్వంలో జరిగిన నెల్లూరు రూరల్ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డిపై ఆ పార్టీ శ్రేణులు నిప్పులు చెరిగాయి. మూడేన్నర ఏళ్ల కాలంగా పార్టీ నేతలను అష్టకష్టాలు పెట్టి, దాడులతో భయభ్రాంతులకు గురి చేసిన ఎమ్మెల్యేను పార్టీ లోకి తీసుకోవద్దని ముక్తకంఠంతో తీర్మానం చేశారు. ఒకరిద్దరిని కాదు ఎంతో మంది నేతలను రౌడీమూకలతో చితక్కొట్టించిన ఎమ్మెల్యేను ఎలా తీసుకుంటారని? నేతలు, కార్యకర్తలు మండి పడ్డారు. ఓ ముస్లిం మహిళ అయితే ఏకంగా మా శవాలపై వెళ్లి పారీ్టలోకి ఆహా్వనించడంటూ నేతలపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేసింది. టీడీపీకి చెందిన ఓ మైనార్టీ నేతను కొట్టించి వేధింపులకు గురి చేసిన విషయం అందరికీ తెలుసు. అలాంటి అరాచక వాదిని పార్టీ లోకి ఎలా తీసుకువస్తారని, ఆయనతో కలిసి ఎలా నడవాలని ఆ మహిళ తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేసింది. కార్యకర్తల అభీష్టానానికి వ్యతిరేకంగా కోటంరెడ్డికి పారీ్టలో రాచబాట వేస్తామంటే చూస్తూ ఊరుకోమని, అవసరమైతే చంద్రబాబు వద్దే పంచాయితీ తేల్చుకుంటామంటూ నేతలందరూ తీర్మానించారు. ఈ పరిస్థితులు చూస్తుంటే.. కోటంరెడ్డికి టీడీపీలోకి దారేది?.. అన్నట్లుగా ఉంది. -
అది ట్యాపింగ్ కాదు.. రికార్డింగ్ వాయిస్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తన ఫోన్‌ను ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందంటూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చేసిన ఆరోపణలను ఆయన స్నేహితుడు లంకా రామశివారెడ్డి కొట్టిపారేశారు. అది ఫోన్ ట్యాపింగ్ కాదని.. ఫోన్లో తాను రికార్డ్ చేసిన వాయిస్ మాత్రమేనని స్పష్టం చేశారు. రామశివారెడ్డి బుధవారం నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. ఇంత రాద్ధాంతం చేస్తాడనుకోలేదు.. ‘నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నా స్నేహితుడే. ఒకే కాలేజీలో చదువుకున్నాం. ఆ తర్వాత ఆయన రాజకీయాలు వైపు వెళ్లగా.. నేను కాంట్రాక్టర్‌గా మారాను. డిసెంబర్లో నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కోటంరెడ్డి ప్రభుత్వ అధికారుల మీద, ఆయనకు కలిగిన ఇబ్బందుల మీద సుదీర్ఘంగా మాట్లాడారు. అదే రోజు సాయంత్రం 7 నుంచి 8 గంటల మధ్య కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నాకు ఫోన్ చేశాడు. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశం విషయాలపై చర్చించుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం, అధికారుల విషయంలో తొందరపాటుగా మాట్లాడకుండా ఉంటే బాగుండేదని సలహా ఇచ్చాను. నియోజకవర్గ నిధులు, కాంట్రాక్టు పనులు, ఇతర పరిణామాలన్నీ సుదీర్ఘంగా చర్చించుకున్నాం. అవన్నీ కూడా నా ఫోన్లో ఆటోమేటిక్‌గా రికార్డయ్యాయి. నేను చెన్నై వెళ్లినప్పుడు.. కోటంరెడ్డితో ఫోన్లో మాట్లాడిన వాయిస్ రికార్డును నా స్నేహితుడికి పంపాను. అది యాదృచ్ఛికంగా జరిగిందే తప్ప.. కావాలని చేసింది కాదు. ఆ తర్వాత అది కాస్తా వైరల్ అయ్యింది. ఇంత పెద్ద వివాదం అవుతుందని ఊహించలేదు. కోటంరెడ్డి అనవసరంగా చిన్న విషయంపై ఇంత రాద్ధాంతం చేస్తాడని అనుకోలేదు. రెండు, మూడు రోజుల్లో సమసిపోతుందనుకున్నా. అందుకే ఇంతకాలం బయటకు రాలేదు. కానీ కోటంరెడ్డి కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేస్తానని చెప్పడంతో నాకు కొంత ఆందోళన కలిగింది. ప్రజలకు వాస్తవాలు తెలియాలనే ఇప్పుడు బయటకు వచ్చా. కోటంరెడ్డి కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేసినా ఫర్వాలేదు. నాది ఆండ్రాయిడ్ ఫోన్. ప్రతి ఫోన్ కాల్ రికార్డ్ అవుతుంది. గత 5 నెలలుగా నేను వాడుతున్న ఫోన్‌ను చెక్ చేసుకోండి. అన్ని కాల్స్ రికార్డ్ అయిన విషయం తెలుస్తుంది. ఎవరు వచ్చినా.. నా ఫోన్ ఇస్తా.. ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించి నిజాలు తెలుసుకోవచ్చు. నేను వాయిస్ రికార్డు పంపిన నా స్నేహితుడి పేరును విచారణ అధికారులకు చెబుతా. ఆయన పేరు ఇప్పుడు బహిరంగంగా చెప్పి.. ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు’ అని లంకా రామశివారెడ్డి వివరణ ఇచ్చారు. -
కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి భారీ ఝలక్
సాక్షి, నెల్లూరు: రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి భారీ ఝలక్ తగిలింది. నియోజకవర్గ కార్పొరేటర్లు వైఎస్సార్సీపీ ఎంపీ, పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి అయిన ఆదాల ప్రభాకర్‌రెడ్డికి మద్ధతు ప్రకటించారు. కార్పొరేటర్లతో పాటు ఎక్స్అఫిషియో మెంబర్లు మంగళవారం పార్టీ ఇన్‌ఛార్జి కార్యాలయానికి చేరుకుని.. తమ మద్ధతు అదాలకే అని పేర్కొన్నారు. అంతేకాదు మరో ఆరుగురు కార్పొరేటర్లు సైతం ఆదాల వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో.. కోటంరెడ్డి బలం ఇద్దరు కార్పొరేటర్లకు చేరుకున్నట్లయ్యింది. ఈ సందర్భంగా.. నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంఛార్జిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి నియమించటం శుభపరిణామని కార్పొరేటర్లు పేర్కొన్నారు. నెల్లూర్ రూరల్‌లో పార్టీ బలోపేతానికి కృషిచేస్తామని, ఆదాల ప్రభాకర్ రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపిస్తామని కార్పొరేటర్లు ఈ సందర్భంగా ప్రతినబూనారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ కీలక నేత ఆనం విజయకుమార్ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ రూరల్ ఇన్ఛార్జిగా నియమితులైన ఆదాలకి ఘన స్వాగతం పలికాం. తాజా పరిణామంతో.. పార్టీకి రూరల్ లో తిరుగులేని ప్రజాబలం ఉందని మరోసారి సంకేతం వచ్చింది. పార్టీ నిర్ణయాలకు కట్టుబడి కార్యకర్తలు కష్టపడి పనిచేస్తేనే శ్రీధర్ రెడ్డి గెలిచారు. గెలిచాక కష్టపడిన వారిని పక్కన పెట్టి పక్కపార్టీ వాళ్ళకి పదవులు ఇచ్చాడు. తన దగ్గర 12 సిమ్ లు ఉన్నాయని శ్రీధర్ రెడ్డి చెబుతున్నాడు. లిక్కర్, గంజాయి మాఫియా, హత్యలు చేసేవారు, అనైతిక కార్యక్రమాలు చేసే వారికే అన్ని సిమ్ లు ఉంటాయి . ఆదాలని ఇంచార్జ్ గా ప్రకటించగానే మంచి నిర్ణయం తీసుకున్నారని రూరల్ ప్రజలు సంతోషించారు. సర్పంచ్, ఎంపీపీ, ఎంపీటీసీలు అందరూ ఆదాల కి సంఘీభావం తెలుపుతున్నారు. కోటంరెడ్డి దగ్గర ఉన్న కొంతమంది కార్పొరేటర్లు కూడా ఆదాల వైపు వచ్చేస్తారు అని విజయ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కార్పొరేటర్లకు పూర్తి స్వేచ్ఛ: ఆదాల ప్రభాకర్ రెడ్డి కామెంట్స్ కార్పొరేటర్లకు ఇకపై పూర్తి స్వేచ్ఛ ఉంటుందని, ఎప్పుడైనా తనను కలవొచ్చని వైఎస్సార్సీపీ రూరల్ ఇన్‌ఛార్జి ఆదాల ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. కార్పొరేటర్లు మద్ధతు ప్రకటించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్టీ లైన్ దాటితే ఎవరినీ ఉపేక్షించం. మేము ఎవరినీ బతిమాలాడము. రౌడీయిజం.. బెదిరింపులు కనిపించవు. మీ పరిధిలో ఉన్న, మీ సమస్యలు అన్ని పరిష్కరించుకుందాం. మీకు ఎలాంటి భయం లేదు. అభివృద్ధి కోసం సీఎం తో చర్చించి నిధులు తీసుకొస్తా అని ఆదాల, కార్పొరేటర్లకు భరోసా ఇచ్చారు. -
ఛీ..ధర్‌రెడ్డి దరిద్రం వదిలింది
నెల్లూరు (సెంట్రల్): నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీకి, రూరల్ ప్రజలకు పట్టిన ఛీ.. ధర్‌రెడ్డి అనే దరిద్రం వదిలిపోయిందని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. నెల్లూరులోని ఆదాల ప్రభాకర్‌రెడ్డి నివాసంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పి.అనిల్‌కుమార్, మేకపాటి విక్రమ్‌రెడ్డితో కలిసి ఆదాల ప్రభాకర్‌రెడ్డి సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కాకాణి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ పెట్టిన రాజకీయ భిక్షతో గెలిచి అదే పార్టీపై నిందలు వేయడం సిగ్గు చేటుగా లేదా అన్నా రు. తెలుగుదేశం పార్టీకి అమ్ముడుపోయి ఆ పార్టీ అధినేత డైరెక్షన్లో శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోందన్నారు. ఒక ఎమ్మెల్యే పోయినంత మాత్రనా రూరల్‌లో మేమంతా వైఎస్సార్సీపీలో, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంట ఉంటామని ఈ రోజు ర్యాలీలో పాల్గొన్న ప్రజాభిమానమే నిదర్శమన్నారు. పార్టీ నుంచి దరిద్రం పోయిందనుకుంటామన్నారు. రాబోయే ఎన్నికల్లోనూ, ఆ తర్వాత వైఎస్సార్సీపీకి జిల్లా మొత్తం కంచుకోటగా ఉంటుందన్నారు. ఓటు బ్యాంకు చెదరదు పార్టీ నుంచి ఎవరు పోయినా వైఎస్సార్సీపీ ఓటు బ్యాంకు మాత్రం చెక్కు చెదరకుండా ఉందనే విషయం ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని రీజనల్ కో–ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిష్మాతో గెలిచామనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలన్నారు. ఆదాల ప్రభాకర్‌రెడ్డి రూరల్‌లోనే కాకుండా జిల్లాలో అందరికీ సుపరిచితుడన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కూడా తన రాజకీయ భవిష్యత్‌ను తేల్చుకోవాలన్నారు. రౌడీయిజం చేస్తే ఉక్కుపాదంతో అణిచేస్తా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎవరైనా రౌడీయిజం చేస్తూ వ్యాపారుల వద్ద, రియల్ ఎస్టేట్ వ్యాపారు ల వద్ద డబ్బులు వసూలు చేసే పద్ధతులు మానుకోవాలని ఎంపీ, నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆదాల ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించారు. ఈ రోజు నుంచి ఎక్కడైనా అటువంటి ఘటనలు జరిగినట్లు తమ దృష్టికి వస్తే ఉక్కుపాదంతో అణిచేస్తానని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ఆయా వ్యాపారాలు స్వేచ్ఛగా చేసుకోవచ్చని, ఎవరైనా ఇబ్బందులు పెడితే తమ దృష్టికి తీసుకుని రావాలన్నారు. వైఎస్సార్ సీపీకి మద్దతుగా నిలబడిన ప్రతి ఒక్క కార్పొరేటర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రూరల్ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని, ఎక్కడైనా సమస్య ఉందంటే తమ దృష్టికి తెస్తే తక్షణమే స్పందిస్తామన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైఎస్సార్సీపీకి కంచుకోటలాగా ఉందన్నారు. ఈ ర్యాలీనే ఉదాహరణ నెల్లూరురూరల్లో వైఎస్సార్సీపీ ఎంత బలంగా ఉందో స్వాగత ర్యాలీనే ఉదాహరణ అని నగర ఎమ్మెల్యే పి అనిల్‌కుమార్ అన్నారు. మాజీ డీసీసీబీ చైర్మన్ ఆనం విజయకుమార్‌రెడ్డి మాట్లాడుతూ రూరల్‌లో అందరం కష్టపడ్డాం కాబట్టే ఆయన గెలిచారని, ఈ రోజు పారీ్టపై విమర్శలు చేయడం ద్రోహం అన్నారు. కార్పొరేటర్ మొయిళ్ల గౌరీ మాట్లాడుతూ వైఎస్సార్సీపీలో సైనికుల మాదిరి పని చేస్తామని, తిరిగి ఆదాలను గెలిపించుకుంటామన్నారు. బొబ్బల శ్రీనివాస్ మాట్లాడుతూ తాము ఈ రోజు నుంచి బానిస సంకెళ్ల నుంచి విముక్తి పొందామన్నారు. రూరల్ ఎమ్మెల్యే వద్ద బానిస బతుకు బతికామన్నారు. ఆదాల ప్రభాకర్‌రెడ్డి వద్ద ఎంతో స్వేచ్ఛగా, హుందాగా ఉంటామన్నారు. -
కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై కిడ్నాప్ యత్నం కేసు
నెల్లూరు (క్రైమ్): తనతో పాటు పార్టీ మారలేదన్న అక్కసుతో ఓ కార్పొరేటర్‌ను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తన అనుచరులతో కలిసి కిడ్నాప్‌నకు యత్నించిన ఘటనపై కేసు నమోదైంది. పోలీసుల సమాచారం ప్రకారం.. శ్రీధర్‌రెడ్డి పడారుపల్లికి చెందిన నెల్లూరు నగరం 22వ డివిజన్ కార్పొరేటర్ మూలే విజయభాస్కర్ రెడ్డికి శుక్రవారం ఫోన్ చేసి వైఎస్సార్సీపీని వీడి తనతో రావాలని కోరారు. అందుకు విజయభాస్కర్ రెడ్డి నిరాకరించడంతో.. ఎమ్మెల్యే కోటంరెడ్డి తన అనుచరుడు మిద్దె మురళీకృష్ణ యాదవ్, కారు డ్రైవర్ అంకయ్యతో కలిసి కార్పొరేటర్ ఇంటికి వెళ్లి అంతు చూస్తానంటూ బెదిరించారు. కార్పొరేటర్‌ను బలవంతంగా కారులో ఎక్కించేందుకు యత్నించగా ఆయన ప్రతిఘటించారు. వారినుంచి తప్పించుకుని వేదాయపాలెం పోలీసుస్టేషన్‌కు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్పొరేటర్ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే, ఆయన అనుచరుడు, కారు డ్రైవర్‌పై కిడ్నాప్‌యత్నం కేసు నమోదు చేసినట్లు వేదాయపాలెం ఇన్స్పెక్టర్ కె.నరసింహారావు తెలిపారు. -
టీడీపీ పతనమైందని లోకేష్ ఒప్పుకున్నట్టేనా?
తెలుగుదేశం శాసనమండలి సభ్యుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ఒక వ్యాఖ్య చేస్తూ నెల్లూరు నుంచే వైస్సార్సీపీ పతనం ప్రారంభమైందని అన్నారు. ఇది వినడానికి టీడీపీ వారికి బాగానే ఉన్నట్లు అనిపిస్తున్నా.. అదే సూత్రం ఆ పార్టీకి వర్తింపచేస్తే టీడీపీ ఇప్పటికే పతనమైపోయిందని వారే ఒప్పుకున్నట్లు అవుతుంది. ఎందుకంటే ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీకి దూరం అయితే పతనం అయిపోతే టీడీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు మూడేళ్ల క్రితమే బయటకు వచ్చేశారు కదా!. మరి ఇప్పటికే పార్టీ పతనం అయిందని అంగీకరిస్తారా?. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినప్పటికీ వైఎస్సార్సీపీ, పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెక్కుచెదరలేదు. అదరలేదు.. బెదరలేదు. అలాంటిది ఇలాంటి ఉడత ఊపులకు ఉలిక్కిపడతారా!. నెల్లూరు రూరల్, వెంకటగిరి నియోజకవర్గాల శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డిలు అసమ్మతిగళం విప్పడం పార్టీకి కొద్దిగా చికాకే కావచ్చు. కానీ, పార్టీ అదినాయకత్వం వెంటనే సర్దుబాటు చర్యలు తీసుకుంది. శ్రీధర్ రెడ్డి బదులు నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర రెడ్డిని, రామనారాయణరెడ్డి స్థానంలో నేదురుమల్లి రాం కుమార్ రెడ్డిని నియోజకవర్గాల బాధ్యుయులుగా ప్రకటించింది. ఆదాల ప్రభాకర రెడ్డి ఒకప్పుడు తెలుగుదేశంలోనే ఉండేవారు. మంత్రి కూడా అయ్యారు. కానీ, అప్పట్లో టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో సరిపడక కాంగ్రెస్‌లోకి వచ్చారు. తదుపరి సోమిరెడ్డిని శాసనసభ ఎన్నికలలో ఓడించారు. విభజన సమయంలో కొంతకాలం టీడీపీలో ఉన్నా 2019లో వైఎస్సార్సీపీలో చేరి నెల్లూరు ఎంపీగా గెలుపొందారు. ఆయన మందీ మార్బలం ఉన్న నేతగా గుర్తింపు పొందారు. నెల్లూరు రూరల్‌లో ఆయన రంగంలోకి దిగడం వల్ల వైఎస్సార్సీపీ మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉంది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు అత్యంత విధేయుడనని తనకు తానే ప్రకటించుకునేవారు. తాను చనిపోతే సీఎం జగన్ వచ్చి పార్టీ జెండా కప్పాలన్నదే తన కోరిక అన్నంతవరకు కూడా వెళ్లేవారు. ఇలాంటి మాటలను బహిరంగసభలలో పెద్ద స్వరంతో చెప్పేవారు. తాను మధ్య తరగతి కుటుంబీకుడిని అయినా సీఎం జగన్ చేరదీసి తనకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారని, ఆ విశ్వాసాన్ని ఎన్నటికీ మరువబోనని చెప్పేవారు. అలాంటి కోటంరెడ్డి రెండోసారి శాసనసభకు ఎన్నికయ్యాక మంత్రి పదవిపై ఆశ పుట్టింది. అందులో తప్పు లేదు. కానీ, వివిధ కారణాల రీత్యా ఆయనకు పదవి లభించలేదు. అంతమాత్రాన ఆయన ఇలా అవిధేయుడుగా మారతారని ఎవరూ ఊహించలేదు. నిజానికి శ్రీధర్ రెడ్డి అప్పడప్పుడు సంకేతాలు ఇవ్వకపోలేదు. అమరావతి రైతుల పేరుతో కొందరు చేసిన పాదయాత్రకు సంఘీభావం ప్రకటించడం, పార్టీ కార్యక్రమాలుగా కాకుండా సొంతంగా తన పేరుతోనే నియోజకవర్గంలో ప్రోగ్రాంలు పెట్టుకోవడం వంటివి చేశారు. అప్పుడప్పుడు అధికారులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు కూడా చేశారు. టీడీపీ నేతలు గతంలో కోటంరెడ్డిపై దౌర్జ్యన్యకారుడని, బెట్టింగ్ రాయుడని పలు ఆరోపణలు చేయడం, వాటిన ఆయన ఖండించడం జరిగేవి. ఒక మహిళా అధికారి పట్ల దురుసుగా వ్యవహరించిన అభియోగంపై కేసు నమోదు అయింది. ఇవన్ని ఎలా ఉన్నా ఇటీవలి కాలంలో టీడీపీ నేతలు ఆయనపై విమర్శలు చేయకుండా ఉండటం కూడా గమనించాల్సిన అంశమే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ఏకంగా ఆనం రామనారాయణరెడ్డిని మెచ్చుకోవడం కూడా గుర్తు చేసుకోవాలి. ఈ నేపథ్యంలో వీరిద్దరిని తమ ట్రాప్‌లోకి తెచ్చుకోవడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగానే వ్యవహరించారు. ప్రముఖ విద్యా సంస్థల అధినేత, అమరావతి భూ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కుంటున్న నారాయణతో ఆపరేషన్ నిర్వహించారన్న సమాచారం బయటకు వస్తోంది. ఆయన వీరిద్దరిని తమ ట్రాప్‌లోకి తెచ్చుకోగలిగారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్‌తో పాటు ఆర్థికవనరులు సమకూర్చే బాధ్యత ఆయన తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇంత జరుగుతున్నా వైఎస్సార్సీపీ నాయకులు కోటంరెడ్డి విషయంలో పెద్దగా అనుమానించలేదని అనుకోవాలి. అలా భావించి ఉంటే ఇటీవలే ముఖ్యమంత్రి జగన్.. ఆయనను పిలిచి మందలించేవారు కారు. అప్పుడే కొత్త ఇన్ఛార్జీని నియమించేవారు. కోటంరెడ్డి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంటూ ఆరోపణలు చేయడం సహజంగానే ప్రతిపక్షానికి ఒక అస్త్రం దొరికినట్లయింది. విశేషం ఏమిటంటే ఫోన్ ట్యాపింగ్‌లో ఆరితేరిన చంద్రబాబు నాయుడు దీని గురించి మాట్లాడటం. ఆయన వద్ద ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన అధికారి అప్పట్లో ఇజ్రాయిల్ సాఫ్ట్వేర్ కొనుగోలు చేసి విపక్షంపై నిఘా పెట్టాలని ప్రయత్నించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ కేసులోనే ఆయన సస్పెండ్ కూడా అయి కేసును ఎదుర్కొంటున్నారు. కోటంరెడ్డి విషయంలో ప్రభుత్వ నిఘా విభాగం అధినేత అనవసరంగా తనకు వచ్చిన ఒక సమాచార రికార్డును శ్రీధర్ రెడ్డికి పంపినట్లు అనిపిస్తుంది. ముందస్తు జాగ్రత్తగా ఆ అధికారి చెప్పబోతే, పరిస్థితిని అర్ధం చేసుకున్న కోటంరెడ్డి అప్రమత్తమై అన్ని విషయాలు బహిర్గతం అయిపోతున్నాయని భావించి ఈ ఆరోపణ చేసినట్లుగా ఉంది. మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ ఈయన నారా లోకేష్‌తో ఎప్పటి నుంచో టచ్‌లో ఉన్నట్లు టీడీపీ నేతలే వెల్లడించారని చెప్పారు. అలాగే, చంద్రబాబుతో కూడా అన్నీ మాట్లాడుకునే ఈ ఆరోపణలు చేశారని అంటున్నారు. లేకుంటే టీడీపీ టిక్కెట్ వచ్చేస్తుందని ఎలా చెప్పగలుగుతారు?. ఇంతవరకు వైఎస్సార్సీపీని వీడలేదు.. టీడీపీలో చేరలేదు. అయినా, నియోజకవర్గంలో టీడీపీ పెత్తనం తనదే అయినట్లుగా అంటున్నారంటే ఆ పార్టీ ఎంత బలహీనంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదన్నది సర్వత్రా ఉన్న అభిప్రాయం. పోనీ, ఆయన అనుకున్నట్లు వస్తే సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డినో, లేక ఏ ఇతర సీనియర్ నేతనో కాదని కోటంరెడ్డికి మంత్రి పదవి ఇవ్వడానికి చంద్రబాబు ఒప్పుకున్నారా?. దీనిని ఆయన నమ్మగలరా?. అసలు సమస్య ఏమిటంటే ఈయన ప్రవర్తన తీరుతెన్నులు, ఇతర అంశాలపై పార్టీ నాయకత్వానికి ఎప్పటికప్పుడు నివేదికలు వస్తుంటాయి. వాటి ఆధారంగా 2024 ఎన్నికలలో టిక్కెట్ రాదన్న భావన ఈయనకు వచ్చి ఉండవచ్చు. గెలిచినా, ఓడినా రాజకీయాల్లో కొనసాగాలంటే ఏదో పార్టీ నుంచి పోటీచేయాలని నేతలు అనుకుంటారు. అందువల్లే కోటంరెడ్డి తన విధేయతను అవిధేయతగా మార్చుకుని ఉండవచ్చనిపిస్తుంది. అతిగా పొగిడే వారిని అంతగా నమ్మరాదనే లోకోక్తి కూడా ఉంది. అతి వినయం ధూర్త లక్షణం అంటారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గతంలో సీఎం జగన్‌ను అంతగా పొగిడింది తన పదవిపైన ఆశతోనే అన్న విషయం ఇప్పుడు స్పష్టమైంది. ఇలాంటి ఫిరాయింపుదారులు చరిత్రలో ఎంతో మంది కనిపిస్తారు. వారిలో అత్యధికులు రాజకీయంగా కనుమరుగైపోయిన ఘట్టాలే ఎక్కువ. - హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్. -
కోటంరెడ్డికి మాజీ మంత్రి అనిల్‌కుమార్ సవాల్
సాక్షి, నెల్లూరు జిల్లా: కోటంరెడ్డికి దమ్ముంటే 51 సెకన్ల ఆడియో బయట పెట్టాలని మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ సవాల్ విసిరారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీలోకి వెళ్తేందుకే కోటంరెడ్డి విమర్శలు అంటూ దుయ్యబట్టారు. ‘‘కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ జరగలేదు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని నువ్వు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా. ఫోన్ ట్యాపింగ్ జరగలేదని నేను నిరూపిస్తే.. నువ్వు రాజీనామా చేస్తావా?. 24 గంటల సమయం ఇస్తున్నా.. ఎప్పుడైనా రండి.. నేను రెడీ. ఆనం రామనారాయణ చచ్చిన పాము.. ఆయనకేంటి ప్రాణహాని’’ అని అంటూ అనిల్ నిప్పులు చెరిగారు. చదవండి: ఆ సందర్భాల్లో చంద్రబాబు ఇంగ్లీష్ స్పీచ్ విసుగు తెప్పించేదా? -
టీడీపీలో చేరే ఎమ్మెల్యేలు బావిలో దూకినట్టే: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, విజయవాడ: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపణలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఫోన్ ట్యాపింగ్ అంటూ అర్థంలేని ఆరోపణలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. చంద్రబాబు కుట్రలో భాగంగా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్నారని, టీడీపీకి వెళ్లాలనుకుంటే వెళ్లవచ్చు.. కాని ఇలాంటి ఆరోపణలు సమంజసం కాదంటూ మంత్రి హితవు పలికారు. సీఎం జగన్ పార్టీ పెట్టకపోతే ఎమ్మెల్యేలు అయ్యేవారా?. ఇలాంటి వారికి సీఎం జగన్ భయపడేవారు కాదు. టీడీపీలో చేరే ఎమ్మెల్యేలు బావిలో దూకినట్టే. ఇలాంటి వాళ్లు వెళ్లినా వచ్చే నష్టమేమీ లేదని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. చదవండి: కోటంరెడ్డి ఆరోపణలు.. పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్