
చిన్నారితో ఆప్యాయంగా మాట్లాడుతున్న ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి
నెల్లూరు రూరల్(నెల్లూరు జిల్లా): హార్ట్‌లో హోల్‌తో బాధపడుతున్న చిన్నారికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చేయూతనందించారు. బాలికకు ఆపరేషన్ విజయవంతమైంది. మంగళవారం చిన్నారితో పాటు తల్లిదండ్రులు నెల్లూరులోని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి చేరుకుని కోటంరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. శ్రీధర్‌రెడ్డి రూరల్ పరిధిలోని ఉప్పుటూరు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు.
చదవండి: బాగున్నావా అవ్వా..!
ఈ సమయంలో గిరిజన కుటుంబానికి చెందిన పొట్లూరి స్నేహ అనే చిన్నారికి గుండె సమస్య ఉన్నట్లుగా ఆయన దృష్టికి వెళ్లింది. చిన్నారి తల్లిదండ్రులు తమ బాధను ఆయనకు చెప్పారు. స్పందించిన ఎమ్మెల్యే కారు ఏర్పాటు చేసి వారితోపాటు తన ప్రతినిధిని తిరుపతిలోని పెద్ద ఆస్పత్రికి పంపారు. చిన్నారి ఆపరేషన్ విషయమై అక్కడి వైద్యులతో కోటంరెడ్డి స్వయంగా మాట్లాడారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద స్నేహకు ఆపరేషన్ చేయగా విజయవంతమైంది. దీంతో చిన్నారి తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు. తన వద్దకు వచ్చిన స్నేహతో ఎమ్మెల్యే ఎంతో ఆప్యాయంగా మాట్లాడి దుస్తులు అందజేశారు. ఆ కుటుంబానికి తనవంతు సహకారం ఎల్లప్పుడు ఉంటుందని భరోసా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment