helped
-
జగనన్న గొప్ప మనసు.. అనకాపల్లిలో అనారోగ్య బాధితులకు సాయం (ఫొటోలు)
-
ధోని వల్లే ఇలా మారాల్సి వచ్చింది..!
-
చిన్నారికి సీఎం జగన్ సాయం
-
AP: సచివాలయ ఉద్యోగుల ఔదార్యం
మండపేట(కోనసీమ జిల్లా): వయసు తక్కువగా ఉండటంతో పింఛన్ ఆగిపోయిన మహిళ దీనస్థితిని చూసి చలించిపోయి ఏడాదిన్నరగా ప్రతి నెల రూ.2,000 చొప్పున తమ జీతం నుంచి సాయం అందిస్తూ ఔదార్యాన్ని చాటుకున్నారు కోనసీమ జిల్లా మండపేటలోని 3వ వార్డు సచివాలయ ఉద్యోగులు. తాజాగా, ఆమెకు రూ.2,500 పింఛన్ మంజూరు కాగా, గురువారం అందించారు. గతంలో నిర్వహించిన వెరిఫికేషన్‌లో మండపేటకి చెందిన పి.రాజమ్మకు వయసు తక్కువగా ఉండటంతో పింఛన్ ఆగిపోయింది. చదవండి: స్ఫూర్తి సముదాయం.. ఒకేచోట అన్ని భవనాలు పునరుద్ధరించేందుకు సచివాలయ అడ్మిన్ సెక్రటరీ జి.శ్రీసత్యహరిత పలు ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. కాకినాడ డీఆర్డీఏ అధికారుల వద్దకు పంపినా సాంకేతిక కారణాలు అడ్డంకిగా మారాయి. నిరుపేద అయిన రాజమ్మ దీనస్థితిని చూసి చలించిపోయిన హరిత, మహిళా కానిస్టేబుల్ విజయలక్ష్మి, వెల్ఫేర్ సెక్రటరీ గణేష్ ప్రతి నెల తమ జీతం నుంచి రూ.2,000 మొత్తాన్ని ఏడాదిన్నరగా ఆమెకు అందజేస్తూ వచ్చారు. సాంకేతిక లోపాలు సరిజేసేందుకు ప్రభుత్వం వెసులుబాటు ఇవ్వడంతో ఆగస్ట్ నుంచి రాజమ్మకు కొత్త పింఛన్ మంజూరైంది. తనకు ఇంతకాలం సాయం అందించి ఆదుకోవడంతోపాటు పింఛను మంజూరు చేయించిన సచివాలయ ఉద్యోగులకు రాజమ్మ కృతజ్ఞతలు తెలిపింది. -
చిన్నారికి ఎమ్మెల్యే కోటంరెడ్డి చేయూత
నెల్లూరు రూరల్(నెల్లూరు జిల్లా): హార్ట్‌లో హోల్‌తో బాధపడుతున్న చిన్నారికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చేయూతనందించారు. బాలికకు ఆపరేషన్ విజయవంతమైంది. మంగళవారం చిన్నారితో పాటు తల్లిదండ్రులు నెల్లూరులోని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి చేరుకుని కోటంరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. శ్రీధర్‌రెడ్డి రూరల్ పరిధిలోని ఉప్పుటూరు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. చదవండి: బాగున్నావా అవ్వా..! ఈ సమయంలో గిరిజన కుటుంబానికి చెందిన పొట్లూరి స్నేహ అనే చిన్నారికి గుండె సమస్య ఉన్నట్లుగా ఆయన దృష్టికి వెళ్లింది. చిన్నారి తల్లిదండ్రులు తమ బాధను ఆయనకు చెప్పారు. స్పందించిన ఎమ్మెల్యే కారు ఏర్పాటు చేసి వారితోపాటు తన ప్రతినిధిని తిరుపతిలోని పెద్ద ఆస్పత్రికి పంపారు. చిన్నారి ఆపరేషన్ విషయమై అక్కడి వైద్యులతో కోటంరెడ్డి స్వయంగా మాట్లాడారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద స్నేహకు ఆపరేషన్ చేయగా విజయవంతమైంది. దీంతో చిన్నారి తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు. తన వద్దకు వచ్చిన స్నేహతో ఎమ్మెల్యే ఎంతో ఆప్యాయంగా మాట్లాడి దుస్తులు అందజేశారు. ఆ కుటుంబానికి తనవంతు సహకారం ఎల్లప్పుడు ఉంటుందని భరోసా ఇచ్చారు. -
ఇంటింటికీ రిక్వెస్ట్; ఆఫీసుకు పంపండి
ఈ ఏడాదిన్నరలో ఎంతోమంది మహిళలు.. కేవలం ఇంటిని చూసుకోవడం కోసం ఉద్యోగాలు మానేయవలసి వచ్చింది! వాళ్లను మళ్లీ ఉద్యోగాలలోకి రప్పించడం కోసం బెంగళూరు ‘లీన్ఇన్’ కంపెనీలో నెట్వర్క్ లీడర్‌గా పని చేస్తున్న స్ఫూర్తి అనే యువతి ఇంటింటికీ వెళ్లి వారి కుటుంబ సభ్యులకు ఒప్పించి ఆ ఉద్యోగినులను మళ్లీ ఆఫీసులకు రప్పిస్తోంది. ఇల్లు చేదోడుగా ఉంటే స్త్రీ ఆ ఇంటికి ఎంత చేయూతగా ఉంటుందో కొన్ని కుటుంబాలను ఉదాహరణగా చూపిస్తోంది. ఆమె చేస్తున్న ఈ ప్రయత్నంతో.. చీకటి పడగానే ఒకటొకటిగా ఇళ్లలోని లైట్లు వెలిగిన విధంగా తిరిగి ఉద్యోగాలలో చేరుతున్న మహిళల చిరునవ్వుతో కుటుంబాలు కాంతిమంతం అవుతున్నాయి. ఫేస్బుక్ సీవోవో కూడా స్ఫూర్తి చేస్తున్న ప్రయత్నానికి ముగ్ధురాలై ఆమె గురించి తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభినందనగా స్ఫూర్తిదాయకమైన పోస్ట్ పెట్టారు. షెరిల్ శాండ్‌బర్గ్ (51) వాషింగ్టన్లో ఉంటారు. ‘ఫేస్బుక్’ సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆమె. ఇక స్ఫూర్తి బెంగళూరులో ఉంటుంది. అక్కడి ‘లీన్ఇన్’ కంపెనీలో స్ఫూర్తి నెట్వర్క్ లీడర్. మహిళలకు మద్దతుగా ఉండి, వారిని వారి లక్ష్యాలకు నడిపించే లాభాపేక్ష లేని సంస్థ లీన్ఇన్. శాండ్బర్గే స్వయంగా ఈ సంస్థను ఎనిమిదేళ్ల క్రితం ప్రారంభించారు. దాదాపు అన్ని దేశాల్లోనూ లీన్ఇన్ ఉంది. అయితే బెంగళూరులోని లీన్ఇన్లో మాత్రమే స్ఫూర్తి వంటి అమ్మాయి ఉంది! ఇలా చెప్పడంలో అతిశయోక్తి ఏమీ లేదు. ఉద్యోగినులకు ఇంటి పనిలో ఏమాత్రం సహాయం లభించకపోగా, వారు గడప దాటితే గృహ భ్రమణం ఆగిపోయే పరిస్థితి అన్ని దేశాలలో ఉన్నప్పటికీ.. మనదేశంలో మరికాస్త ఎక్కువ అనిపించేలా గత ఏడాదిన్నరగా అనేక మంది మహిళలు కుటుంబం కోసం ఉద్యోగాలు మాని ఇంటికే పరిమితం అవవలసి వచ్చింది. స్ఫూర్తి వారందరినీ తిరిగి ఆఫీసులకు మళ్లించారు! అందుకే ఆమె శాండ్‌బర్గ్ దృష్టిలో పడ్డారు. స్ఫూర్తితో పాటు మహిళా ఉద్యోగులు కొందరు చిరునవ్వులు చిందిస్తూ ఉన్న ఫొటోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. స్ఫూర్తి ప్రయత్నాన్ని ప్రశంసించారు. నిజానికి ఇది స్ఫూర్తికి.. కంపెనీ అప్పగించిన బాధ్యత కాదు. ఆమెకై ఆమె చొరవ తీసుకుని ఇల్లిల్లూ తిరిగి సాధించిన ఘనత. అవును ఘనతే. బడి మానిన పిల్లల్ని తిరిగి బళ్లో చేర్పించడం వంటిదే.. ఉద్యోగం మానిన మహిళల్ని తిరిగి ఆఫీస్‌కి రప్పించడం! ఇంట్లో అనుకూలత లేకనే కదా ఆడపిల్లలు చదువు మానినా, గృహిణులు ఉద్యోగం మానినా. స్ఫూర్తి ఏం చేసిందంటే.. చక్కగా చదువుతోంది కదా ఎంత కష్టమైనా గాని పిల్లను బడి మాన్పించకండి అని తల్లిదండ్రులకు టీచర్లు చెప్పే విధంగానే.. ‘‘ఇంటిపనిలో మీరూ ఓ చెయ్యేస్తే ఆమెకు ఉద్యోగం మానే పరిస్థితి రాదు కదా..’’ అని కుటుంబ సభ్యులకు నచ్చ చెబుతోంది. స్ఫూర్తి మాట్లాడ్డం మృదువుగా, ఒప్పించేలా ఉంటుంది. లీన్ఇన్లో పనిచేసేవాళ్లంతా ఇదే విధంగా ఉంటారు. లీన్ఇన్లో ప్రధానంగా వాళ్లు చేస్తుండే పని ఆలోచన–ఆచరణ. మహిళలకు మద్దతుగా ఉండటం కోసం, మహిళల్ని వాళ్ల లక్ష్యాలకు దగ్గరగా చేర్చడం కోసం, మహిళల్ని సాధికార సాయుధులుగా మలచడం కోసం వర్తమాన సామాజిక అనుకూలతలు, ప్రతికూలతలను అనుసరించి ఒక ప్రణాళికను ఆలోచిస్తారు. ఆలోచనను ఆచరణలో పెడతారు. లాక్డౌన్లో ఉద్యోగినులకు ఇటు ఇంటిపనీ, అటు ఆఫీస్ పనీ ఎక్కువైంది. ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఉద్యోగాలు మానేయడం మొదలుపెట్టారు! ఇంటికి ఆర్థికం గా నష్టం. సమాజానికి అభివృద్ధి పరంగా నష్టం. ఈ సంగతిని త్వరగా కనిపెట్టి, త్వరగా చక్కదిద్దడానికి కార్యోన్ముఖం అయింది స్ఫూర్తి. ఈ ఏడాదిన్నరలో బెంగళూరులో ఉద్యోగం మానేసిన వారు వందల్లో ఉన్నారని ఒక సర్వే ద్వారా తెలుసుకున్న స్ఫూర్తి వాళ్లను తిరిగి ఉద్యోగాలకు చేర్చడానికి ఒక నెట్‌వర్క్‌ను సిద్ధం చేసి వాళ్ల ఇళ్లకు పంపించింది. ఉద్యోగం మానిన వారిలో స్ఫూర్తి కో–వర్కర్స్ కూడా ఉన్నారు! వాళ్ల బాధ్యతను తను తీసుకుంది స్ఫూర్తి. వాళ్లంతా ఇప్పుడు ఉద్యోగాల్లోకి వచ్చేశారు. వెళ్లిన చోట స్ఫూర్తి చెప్పిన మాట ఒకటే. ‘‘చూడండి.. మీరు తనకు ఇంటి పనిలో సహాయం చేస్తుంటే.. ఆఫీస్ పనిని ఆమె సునాయాసంగా చేయగలదు. ఏ ఇల్లయినా ఒక ఉద్యోగాన్ని అనవసరంగా ఎందుకు కోల్పోవాలి?’’ అని ఇంటిల్లిపాదినీ ఒప్పించింది. అలాగే పనిని షేర్ చేసుకునే నమూనా ఇళ్లు ఎంత ఆనందంగా గడుపుతున్నాయో ఉదాహరణలు ఇచ్చింది. ‘‘థ్యాంక్యూ స్ఫూర్తీ.. ఇలాంటి క్లిష్ట సమయంలో మనం ఎలా ఉండాలో చూపించావు’ అనే మాటతో ఇన్‌స్టాగ్రామ్‌లో శాండ్‌బర్గ్ తన అభినందన పోస్ట్‌ను ముగించారు. ఫేస్బుక్ సీవోవో తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోలో స్ఫూర్తి (ఎడమ నుంచి రెండు) -
మరోసారి వార్తల్లో మిజోరం ఎమ్మెల్యే
ఐజ్వాల్ : మిజోరాం శాసనసభ్యుడు డాక్టర్ జెడ్ఆర్ థియామ్ సంగ (62) మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రజాప్రతినిధిగానే గాకుండా, ఒక వైద్యుడిగా కూడా మెడలో స్టెత్ తో ఎపుడూ సిద్ధంగా ఉండే ఆయన మరోసారి డాక్టర్ అవతారమెత్తారు. ఛాంపై జిల్లాలోని భూకంపం సంభవించిన ప్రాంతాల పర్యటన సందర్భంగా ఒక గర్భిణీ ప్రాణాలను కాపాడిన వైనం ప్రశంసలందుకుంటోంది. ఇటీవలి భూకంపాల నష్టాలను అంచనా వేయడంతోపాటు, కరోనా పరిస్థితిని తెలుసుకునేందుకు మయన్మార్ సరిహద్దుకు సమీపంలోని తన నియోజకవర్గం, ఛాంపై నార్త్‌ను ఆయన సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా మారుమూల ఎన్‌గూర్ గ్రామానికి చెందిన లాల్‌మంగైహ్సంగి (38)కు పురిటి నొప్పులు ప్రారంభమైనాయి. మరోవైపు ఆరోగ్య సమస్యల కారణంగా చంపై ఆసుపత్రి వైద్య అధికారి సెలవులో ఉన్నారు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె పరిస్థితి విషమంగా మారింది. దీంతో విషయం తెలుసుకున్న గైనకాలజీ స్పెషలిస్టు అయిన ఎమ్మెల్యే వెంటనే ఒక వైద్యుడిగా రంగంలో దిగారు. అత్యవసరంగా సిజేరియన్ చేసి తల్లీబిడ్డలను కాపాడారు. అవసరమైన వారికి సహాయం చేయడం, పేద ప్రజలకు సహాయం చేయడం తన ముఖ్యమైన కర్తవ్యంగా భావించానని థియామ్ సాంగ్ తెలిపారు. అందుకే తాను ఎమ్మెల్యేగా ఎన్నికైందని చెప్పారు. 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐజాల్‌కు ప్రయాణించే స్థితిలో లేపోవడంతో తానే ఆపరేషన్ నిర్వహించినట్టు తెలిపారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ బాగానే ఉన్నారని చెప్పారు. కాగా గతనెలలో భారతదేశం-మయన్మార్ సరిహద్దు కాపలా సిబ్బందికి వైద్యం సాయం అందించేందుకు వాగు దాటి 7 కిలోమీటర్లు నడిచి వార్తలో నిలిచారు. 2018 ఎన్నికలలో మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్) టికెట్‌పై పోటీ చేసి సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే టిటి జోతన్‌సంగను ఓడించారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ బోర్డు వైస్ చైర్మన్ కూడా ఉన్నారు. -
పెద్ద మనసు చాటుకున్న వెటోరి
ఢాకా: న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, బంగ్లాదేశ్ స్పిన్ బౌలింగ్ కోచ్ డేనియల్ వెటోరి పెద్ద మనసు చాటుకున్నాడు. తన జీతంలో కొంత భాగాన్ని కరోనాతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న బోర్డు సిబ్బందికి ఇవ్వాల్సిందిగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును (బీసీబీ) కోరాడు. ఈ విషయాన్ని బీసీబీ సీఈవో నిజాముద్దీన్ ప్రకటించారు. అయితే ఎంత మొత్తాన్ని వెటోరి విరాళంగా ప్రకటించాడో మాత్రం ఆయన గోప్యంగా ఉంచారు. టి20 ప్రపంచకప్ ముగిసేవరకు బంగ్లాదేశ్ కోచింగ్ బృందంలో ఉండనున్న 41 ఏళ్ల వెటోరికి బంగ్లాదేశ్ బోర్డు మొత్తం 2,50,000 డాలర్లు (రూ. కోటీ 88 లక్షలు) చెల్లించనుంది. -
ఢిల్లీ జర్నలిస్టులకు తెలంగాణ సర్కార్ సాయం
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని తెలుగు జర్నలిస్టులకు సాయంగా తెలంగాణ ప్రభుత్వం రూ. 12 లక్షలు మంజూరు చేసింది. కొందరు జర్నలిస్టులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో జర్నలిస్టులు, వారి ప్రైమరీ కాంటాక్టుల పరీక్షలు, చికిత్సల కోసం ఈ నిధులు వెచ్చించనున్నట్టు తెలంగాణ భవన్ ఒక ప్రకటనలో తెలిపింది. జర్నలిస్టుల క్షేమంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆరా తీశారని, వారికి సాయంగా అన్ని చర్యలూ తీసుకోవాల ని, నిధులు విడుదల చేయాలని ఐ అండ్ పీఆర్ విభాగంతో చర్చించారని తెలిపింది. కాగా, తెలంగాణ మీడియా అకాడమీ తరపున చికిత్స పొందుతున్న జర్నలిస్టులకు రూ. 20 వేల చొప్పున వారి ఖాతాల్లో జమ చేయనున్నట్టు అకాడమీ చైర్మన్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ తెలిపారు. అలాగే, మంగళవారం 31మంది జర్నలిస్టులకు కేంద్ర హోంశాఖ సహాయ మం త్రి జి.కిషన్‌రెడ్డి అపోలో ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించేందుకు వ్యక్తిగతంగా సాయం చేశారు. బుధవారం కూడా అపోలోలో మరికొందరికి పరీక్షలు నిర్వహించనున్నారు. ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు బాధితులకు చికిత్స అందించేందుకు అపోలో, ఆర్ఎంఎల్ ఆసుపత్రి వర్గాలతో స్వయంగా మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం, వెంకయ్యనాయుడు, కిషన్‌రెడ్డిలకు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఢిల్లీ కమిటీ కృతజ్ఞతలు తెలిపింది. ఢిల్లీలోని ఏపీ జర్నలిస్టులపై వైఎస్ జగన్ ఆరా ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొందరు ఏపీ జర్నలిస్టులకు కరోనా సోకిన నేపథ్యంలో వారి గురించి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరా తీశారు. అవసరమైన సాయాన్ని ఎప్పటికçప్పుడు అందించాలని సీఎం ఆదేశించినట్లు ఏపీ ప్రభు త్వ సమాచార విభాగం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఢిల్లీలో జర్నలిస్టుల పరిస్థితిని ఎప్పటికప్పుడు ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ అభయ్ త్రిపాఠి, రెసిడెంట్ కమిషనర్ భావనా సక్సేనా, స్పెషల్ కమిషనర్ రమణారెడ్డి పర్యవేక్షిస్తున్నారన్నారు. -
మంత్రి కేటీఆర్ చొరవతో పేద దంపతులకు చేయూత
నేరేడ్మెట్ (హైదరాబాద్): లాక్డౌన్ నేపథ్యంలో బిజీగా ఉన్నప్పటికీ ట్విట్టర్లో వివిధ సమస్యలు, ప్రజల ఇబ్బందులపై వస్తున్న మేసేజ్‌లకు వెంటనే స్పందిస్తూ పరిష్కారానికి చొరవ చూపుతున్నారు రాష్ట్ర మంత్రి కేటీఆర్. ఇందులో భాగంగా అనారోగ్యంతో బాధపడుతున్న తమ కొడుకుకు మందులు కొనుగోలు చేయలేక ఇబ్బంది పడుతున్నామని..ఆదుకోవాలని ఓ పేద దంపతులు ట్విట్టర్లో పంపిన మేసేజ్‌కు కేటీఆర్ స్పందించారు. వివరాల్లోకి వెళితే..వినాయకనగర్‌లో నివాసం ఉంటున్న శ్రావణి, ప్రవీణ్‌లకు ముగ్గురు సంతానం. ప్రవీణ్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆమె కూలి పనులు చేస్తుంది. ముగ్గురు సంతానంలో పెద్ద కొడుకు ప్రణీత్(8) కొంతకాలం క్రితం నీటిసంపులో పడి బ్రెయిన్, ఊపిరితిత్తులు దెబ్బతిని, అంగవైకల్యంతో బాధపడుతున్నాడు. వైద్యులు సూచించిన ప్రకారం తల్లిదండ్రులు మందులు వాడుతూ వస్తున్నారు. ఇటీవల మందులు అయిపోయాయి. ఈ క్రమంలో లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. తల్లిదండ్రులు ఇంటికే పరిమితమయ్యారు. పని లేకపోవడంతో కొడుకుకు మందులు, నిత్యావసర సరుకులు కొనడానికి చేతిలో డబ్బులు లేని దయనీయ పరిస్థితి. దాంతో తమ సమస్యను తెలిసిన వారి ద్వారా వారం రోజుల క్రితం మంత్రి కేటీఆర్‌కు పేద దంపతులు ట్వీట్ చేయించారు. ఈ ట్వీట్‌కు స్పందించిన కేటీఆర్ వెంటనే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని, మేడ్చల్ జిల్లా కలెక్టర్‌కు సూచించారు. కలెక్టర్ మల్కాజిగిరి తహసీల్దార్ బి.గీతకు సమాచారం ఇచ్చారు. తహసీల్దార్ గీత ఆ పేద దంపతులను శనివారం నేరేడ్మెట్లోని తన కార్యాలయానికి పిలిపించారు. కావాల్సిన నిత్యావసర సరుకులను తహసీల్దార్, ప్రణీత్‌కు అవసరమైన మందులను నేరేడ్మెట్ ఆఫీసర్స్ కాలనీకి చెందిన గోపు రమణారెడ్డి అందజేశారు. తమ సమస్యపై స్పందించిన కేటీఆర్‌తోపాటు కలెక్టర్, తహసీల్దార్, రమణారెడ్డిలకు పేద దంపతులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. -
లండన్‌లోని తెలంగాణ విద్యార్థులకు కవిత సాయం
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ కారణంగా లండన్‌లో చిక్కుకుపోయిన తెలంగాణ విద్యార్థులకు మాజీ ఎంపీ కల్వకుం ట్ల కవిత బాసటగా నిలిచా రు. నిజామాబాద్, కరీంనగ ర్, వరంగల్ జిల్లాలకు చెందిన ఆరుగురు విద్యార్థు లు ఈ ఏడాది జనవరిలో మాంచెస్టర్‌లోని యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ లాంక్షైర్లో ఎంబీఏ కోర్సులో చేరారు. లాక్‌డౌన్‌తో విమానాలు రద్దు కావడంతో వారు అక్కడే చిక్కుకుపోగా, అక్కడి ప్రభుత్వపరంగా కూడా వారికి ఎలాంటి సాయమూ అందలేదు. దీంతో వారు తమ పరిస్థితిని వివరిస్తూ సాయం చేయాలని ట్విట్టర్ ద్వారా మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల ఇబ్బందులను తెలుసుకున్న కవిత.. వారిని ఆదుకోవాలని తెలంగాణ జాగృతి యూకే అధ్యక్షుడు సుమన్ బల్మూరిని ఆదేశించారు. ఆ విద్యార్థులను సంప్రదించిన సుమన్.. వారికి 3 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేశారు. బ్రిటన్‌లో పరిస్థితులు చక్కబడేవరకూ వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. -
‘పరిధి’ని చెరిపి.. ప్రాణాలు నిలిపారు
వీరఘట్టం: విజయనగరం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగితే పక్కనే ఉన్న శ్రీకాకుళం జిల్లా పోలీసులు సరైన సమయానికి స్పందించి బాధితులను ఆస్పత్రికి తరలించి వారి ప్రాణాలు కాపాడిన వైనమిది... గరుగుబిల్లి మండలం చిలకాం జంక్షన్ వద్ద గురువారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో ఓ కారు బోల్తా పడింది. ఛత్తీస్‌గఢ్ నుంచి శ్రీకాకుళానికి ఏడుగురు కారులో వస్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన చల్లపల్లి రవివర్మ, తవుడు, ఈశ్వరమ్మతో పాటు.. చిన్నారులు నిషాంతవర్మ, గౌరీవర్మలు గాయపడ్డారు. మిగిలిన వారికి కూడా దెబ్బలు తగిలాయి. క్షతగాత్రుల్లో ఒకరు 100కు కాల్ చేసి ప్రమాదంపై వివరించారు. ప్రమాదం జరిగిన ప్రాంతం విజయనగరం జిల్లా సరిహద్దులో ఉంది. ఆ స్థలం నుంచి శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం పోలీస్‌స్టేషన్ 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ కాల్ ద్వారా సమాచారం అందుకున్న వీరఘట్టం పోలీసులు తమ పరిధి కాకున్నా చొరవ తీసుకుని హుటాహుటిన ప్రమాద స్థలానికి బయల్దేరారు. వీరఘట్టం ఎస్ఐ జి.భాస్కరరావు, హెచ్‌సీ టి.పోలయ్య తదితరులు 108 సాయంతో బాధితులను సకాలంలో పార్వతీపురం సామాజిక ఆస్పత్రికి తరలించారు. ఐదుగురికి పార్వతీపురంలోనే వైద్య సేవలు అందించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వైజాగ్ తరలించారు. సమయానికి వైద్యం అందడంతో వారందరూ కోలుకుంటున్నారు. మా డ్యూటీ మేం చేశాం..: ప్రమాదం జరిగిన స్థలం మాకు 11 కి.మీ. దూరంలో ఉంది. ఇదే స్థలం విజయనగరం జిల్లా గరుగుబిల్లి పోలీస్‌స్టేషన్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. అందుకే వారు వచ్చేసరికి ఆలస్యమవుతుందని గ్రహించి వెంటనే మా డ్యూటీ మేం చేశాం. క్షతగాత్రులను పార్వతీపురం తరలించి వైద్యం అందించాం. – జి.భాస్కరరావు, ఎస్ఐ, వీరఘట్టం -
హీరోను తెగ పొగిడేస్తున్న హీరోయిన్
హైదరాబాద్ : భలే భలే మగాడివోయ్ చిత్రం ఇచ్చిన కిక్‌తో మాంచి ఊపు మీదున్న టాలీవుడ్ హీరో నానిని పొగడ్తలతో ముంచేస్తోంది హీరోయిన్ మెహరీన్. అతనితో కలిసి నటించడం తన అదృష్టమని పొంగిపోతోంది. నాని హీరోగా వస్తున్న 'కృష్ణగాడి వీర ప్రేమ గాథ' తో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న మెహరీన్... నానితో వర్క్ చేయడం చాలా అద్భుతమైన అనుభవాన్ని మిగిల్చిందంటోంది. సెట్స్ లో తొలిరోజు తనకు నాని చాలా హెల్ప్ చేశాడని మురిసిపోతోంది ఈ పంజాబీ భామ. ఈ సినిమాలో తమ ఇద్దరి మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చాలా అద్భుతంగా పండిందని తెలిపింది. నాని నుండి తాను చాలా నేర్చుకున్నానని చెబుతోంది. నానీ హీరోగా వచ్చిన 'ఎవడే సుబ్రహ్మణ్యం, , భలే భలే మగాడివోయ్ లాంటి సినిమాలు చూశాననీ అద్భుతంగా ఉన్నాయంటూ కొనియాడింది. ఆ సినిమాలు చూసిన తరువాత అతనిపై గౌరవం మరింత పెరిగిందని మెహరీన్ ప్రశంసించింది. మరీ ముఖ్యంగా ఈగ సినిమాలోని అతని నటనకు ఫిదా అయిపోయానంటోంది. పనిలో పనిగా దర్శకుడు హను రాఘవపూడిపైన అమ్మడు పొగడ్తలు కురిపించింది. హను విజన్ ఉన్న దర్శకుడని వ్యాఖ్యానించింది. తాను అనుకున్న అవుట్ పుట్ వచ్చేదాకా రాజీ పడకుండా వర్క్ చేయడం అతని ప్రత్యేకత అని చెప్పుకొచ్చింది. రెండు రోజుల పరిశీలన తరువాత తనను ఈ పాత్రకు ఎంపిక చేయడం తన అదృష్టమని పేర్కొంది. ఈ సినిమాలో తాను మహాలక్షి పాత్రలో లంగా వోణీ గెటప్‌లో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తానని చెప్పింది. ఈ అమ్మడు ఇప్పటికే తెలుగు లో రెండు తమిళంలో ఒక ప్రాజెక్టులకు సైన్ చేసి జోరుమీద ఉంది. కాగా అనంతపురం బ్యాక్ డ్రాప్ లో రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ మూవీలో నాని... నందమూరి బాలకృష్ణ అభిమానిగా కనిపిస్తాడట. ఇప్పటికే విడుదలైన మూవీ టీజర్ మంచి మార్కులు కొట్టేసింది. త్వరలోనే ఆడియో విడుదలకు రెడీ అవుతున్న ఈ సినిమాను ఫిబ్రవరి 5న విడుదల చేయాడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.