రాజమ్మకు పింఛన్ అందజేస్తున్న హరిత, విజయలక్ష్మి, గణేష్
మండపేట(కోనసీమ జిల్లా): వయసు తక్కువగా ఉండటంతో పింఛన్ ఆగిపోయిన మహిళ దీనస్థితిని చూసి చలించిపోయి ఏడాదిన్నరగా ప్రతి నెల రూ.2,000 చొప్పున తమ జీతం నుంచి సాయం అందిస్తూ ఔదార్యాన్ని చాటుకున్నారు కోనసీమ జిల్లా మండపేటలోని 3వ వార్డు సచివాలయ ఉద్యోగులు. తాజాగా, ఆమెకు రూ.2,500 పింఛన్ మంజూరు కాగా, గురువారం అందించారు. గతంలో నిర్వహించిన వెరిఫికేషన్‌లో మండపేటకి చెందిన పి.రాజమ్మకు వయసు తక్కువగా ఉండటంతో పింఛన్ ఆగిపోయింది.
చదవండి: స్ఫూర్తి సముదాయం.. ఒకేచోట అన్ని భవనాలు
పునరుద్ధరించేందుకు సచివాలయ అడ్మిన్ సెక్రటరీ జి.శ్రీసత్యహరిత పలు ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. కాకినాడ డీఆర్‌డీఏ అధికారుల వద్దకు పంపినా సాంకేతిక కారణాలు అడ్డంకిగా మారాయి. నిరుపేద అయిన రాజమ్మ దీనస్థితిని చూసి చలించిపోయిన హరిత, మహిళా కానిస్టేబుల్ విజయలక్ష్మి, వెల్ఫేర్ సెక్రటరీ గణేష్ ప్రతి నెల తమ జీతం నుంచి రూ.2,000 మొత్తాన్ని ఏడాదిన్నరగా ఆమెకు అందజేస్తూ వచ్చారు. సాంకేతిక లోపాలు సరిజేసేందుకు ప్రభుత్వం వెసులుబాటు ఇవ్వడంతో ఆగస్ట్ నుంచి రాజమ్మకు కొత్త పింఛన్ మంజూరైంది. తనకు ఇంతకాలం సాయం అందించి ఆదుకోవడంతోపాటు పింఛను మంజూరు చేయించిన సచివాలయ ఉద్యోగులకు రాజమ్మ కృతజ్ఞతలు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment