
ఢాకా: న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, బంగ్లాదేశ్ స్పిన్ బౌలింగ్ కోచ్ డేనియల్ వెటోరి పెద్ద మనసు చాటుకున్నాడు. తన జీతంలో కొంత భాగాన్ని కరోనాతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న బోర్డు సిబ్బందికి ఇవ్వాల్సిందిగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును (బీసీబీ) కోరాడు. ఈ విషయాన్ని బీసీబీ సీఈవో నిజాముద్దీన్ ప్రకటించారు. అయితే ఎంత మొత్తాన్ని వెటోరి విరాళంగా ప్రకటించాడో మాత్రం ఆయన గోప్యంగా ఉంచారు. టి20 ప్రపంచకప్ ముగిసేవరకు బంగ్లాదేశ్ కోచింగ్ బృందంలో ఉండనున్న 41 ఏళ్ల వెటోరికి బంగ్లాదేశ్ బోర్డు మొత్తం 2,50,000 డాలర్లు (రూ. కోటీ 88 లక్షలు) చెల్లించనుంది.
Comments
Please login to add a commentAdd a comment