టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీని దురదృష్టం వెంటాడుతుంది. ఆసియా కప్‌లో మహ్మద్ షమీని ఆడించకుండా బీసీసీఐ పెద్ద తప్పు చేసింది. నిజానికి యూఏఈ పిచ్‌లు షమీ లాంటి బౌలర్లకు సరిగ్గా సరిపోతాయి. కొన్నాళ్లుగా అతన్ని టెస్టులకు, వన్డేలకు మత్రమే పరిమితం చేశారు. దీంతో షమీ ఈ ఏడాది ఒక్క టి20 మ్యాచ్ కూడా ఆడలేదు.
-సాక్షి, వెబ్‌డెస్క్
ప్రస్తుతం టీమిండియాలో బుమ్రా తర్వాత అనుభవం కలిగిన బౌలర్లలో షమీ ముందు వరుసలో ఉంటాడు. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టి20 ప్రపంచకప్‌కు షమీని స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపికచేయడం విమర్శలకు దారి తీసింది. ఒక నాణ్యమైన బౌలర్‌ను ఇలా స్టాండ్ బై ప్లేయర్‌గా ఉంచడం ఎంతవరకు సమంజసమని అభిమానులు మండిపడ్డారు. గాయాలతో జట్టుకు దూరమైన బుమ్రా, హర్షల్ పటేల్‌లు టి20 ప్రపంచకప్‌కు ఎంపికైనప్పటికి... ఎంతవరకు రాణిస్తారనేది ప్రశ్నార్థకమే.
అనుభవం దృష్యా బుమ్రా మంచి బౌలర్ కావొచ్చు.. కానీ గాయం తర్వాత తిరిగొస్తున్నాడు.. అతను ఎలా ఆడతాడనేది ఇప్పుడే చెప్పలేం. హర్షల్ పటేల్‌ది ఇదే పరిస్థితి. ఇలాంటి సమయంలో షమీని తుది జట్టులో చోటు ఇవ్వాల్సింది పోయి స్టాండ్ బై ప్లేయర్‌గా ఉంచడం ఏంటని క్రీడా పండితులు అభిప్రాయపడ్డారు. షమీ విషయంలో పరోక్షంగా బీసీసీఐని తప్పుబట్టారు.
ఇదిలా ఉంటే స్వదేశంలో ఆస్ట్రేలియాతో టి20 సిరీస్‌కు మహ్మద్ షమీని ఎంపిక చేశారు. ఇది మంచి పరిణామం అని అనుకునేలోపే కరోనా పాజిటివ్‌గా తేలడంతో షమీ టి20 సిరీస్‌కు దూరమయ్యాడు. ఒకవేళ షమీ జట్టులో ఉండి ఉండే ప్రధాన బౌలర్‌గా సేవలందించేవాడు. అతని బౌలింగ్‌ను బట్టి ఏ మేరకు ఫామ్‌లో ఉన్నాడు అనేది ఒక అంచనాకు వస్తుంది. కానీ షమీని కరోనా రూపంలో దురదృష్టం వెంటాడింది. అయితే షమీకి సౌతాఫ్రికాతో జరగనున్న టి20 సిరీస్‌తో మరో అవకాశం ఉంది. మరి షమీ ఆ సిరీస్‌లో ఆడతాడా లేక ఇంకేమైనా జరిగి సౌతాఫ్రికాతో సిరీస్‌కు దూరమవుతాడా అని అభిమానుల సందేహాం వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: కరోనా బారిన షమీ... ఆస్ట్రేలియాతో టి20 సిరీస్‌కు దూరం
Comments
Please login to add a commentAdd a comment