బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్ష పదవికి నజ్ముల్ హసన్ రాజీనామా చేశాడు. కొత్త అధ్యక్షుడిగా మాజీ క్రికెటర్ ఫరూఖ్ అహ్మద్ ఎన్నికయ్యాడు. కొత్త అధ్యక్షుడు ఎన్నికైన విషయాన్ని బీసీబీ అంపైర్ల కమిటీ ప్యానెల్ చైర్మన్ ఇఫ్తికార్ అహ్మద్ ధృవీకరించాడు. దేశంలో విద్యార్థుల నిరసనల నేపథ్యంలో మాజీ అధ్యక్షుడు నజ్ముల్ హసన్ దేశం విడిచి వెళ్లిపోయినట్లు ఇఫ్తికార్ తెలిపాడు.
కొత్త అధ్యక్షుడు ఫరూఖ్ బంగ్లాదేశ్ తరఫున ఏడు వన్డేలు ఆడాడు. అలాగే 200-07, 2013-16 మధ్యలో రెండుసార్లు జాతీయ చీఫ్ సెలెక్టర్‌గా పని చేశాడు. కాగా, బంగ్లాదేశ్‌లో విద్యార్థుల నిరసనల నేపథ్యంలో మాజీ అధ్యక్షురాలు షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఆమె అనంతరం బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. బంగ్లాదేశ్‌లో రాజకీయ అనిశ్చితి కారణంగా టీ20 మహిళల వరల్డ్‌కప్ యూఏఈకి తరలిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment