జమైకా వేదికగా వెస్టిండీస్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతుంది. ఈ మ్యాచ్‌లో తొలుత వెస్టిండీస్ ఆధిక్యం సాధించినట్లు కనిపించింది. అనంతరం బంగ్లా బౌలర్లు రెచ్చిపోవడం.. బ్యాటర్లు ఓ మోస్తరుగా రాణించడంతో మ్యాచ్‌పై వెస్టిండీస్ పట్టు కోల్పోయింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 211 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది.
ఆ జట్టు సెకెండ్ ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. మహ్మదుల్ హసన్ జాయ్ (0), షద్మాన్ ఇస్లాం (46), షహదత్ హొసేన్ దీపు (28), మెహిది హసన్ మిరాజ్ (42), లిటన్ దాస్ (25) ఔట్ కాగా.. జాకెర్ అలీ (29), తైజుల్ ఇస్లాం (9) క్రీజ్‌లో ఉన్నారు. విండీస్ బౌలర్లలో షమార్ జోసఫ్ 2, అల్జరీ జోసఫ్, జేడన్ సీల్స్, జస్టిన్ గ్రీవ్స్ తలో వికెట్ పడగొట్టారు.
అంతకుముందు వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే ఆలౌటైంది. నహిద్ రాణా (5/61) దెబ్బకు విండీస్ బ్యాటింగ్ లైనప్ కకావికలమైంది. హసన్ మహమూద్ 2, తస్కిన్ అహ్మద్, తైజుల్ ఇస్లాం, మెహిది హసన్ తలో వికెట్ దక్కించుకున్నారు. విండీస్ ఇన్నింగ్స్‌లో కీసీ కార్తీ (40), క్రెయిగ్ బ్రాత్‌వైట్ (39), మికైల్ లూయిస్ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 164 పరుగులకు ఆలౌటైంది. జేడన్ సీల్స్ అద్భుతమైన స్పెల్‌తో (15.5-10-5-4) బంగ్లా బ్యాటర్లను కట్టడి చేశాడు. షమార్ జోసఫ్ 3, కీమర్ రోచ్ 2, అల్జరీ జోసఫ్ ఓ వికెట్ పడగొట్టారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో షద్మాన్ ఇస్లాం (64) టాప్ స్కోరర్‌గా నిలువగా.. మెహిది హసన్ (36), షహాదత్ హొసేన్ (22), తైజుల్ ఇస్లాం (16) రెండంకెల స్కోర్లు చేశారు. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ తొలి మ్యాచ్‌లో 201 పరుగుల తేడాతో గెలుపొందింది.
Comments
Please login to add a commentAdd a comment