WI Vs BAN: విండీస్‌తో తొలి టెస్ట్‌.. వెనుకంజలో బంగ్లాదేశ్‌ | WI Vs BAN 1st Test Day 3: Bangladesh Trail By 181 Runs, Check Score And Other Details Inside | Sakshi
Sakshi News home page

WI Vs BAN 1st Test: విండీస్‌తో తొలి టెస్ట్‌.. వెనుకంజలో బంగ్లాదేశ్‌

Published Mon, Nov 25 2024 9:28 AM | Last Updated on Mon, Nov 25 2024 11:01 AM

WI VS BAN 1st Test Day 3 Stumps: Bangladesh Trail By 181 Runs

విండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్‌ వెనుకంజలో ఉంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో మొమినుల్‌ హక్‌ (50), జాకెర్‌ అలీ (53) అర్ద సెంచరీలతో రాణించగా.. మహ్మదుల్‌ హసన్‌ జాయ్‌ 5, జాకిర్‌ హసన్‌ 15, షహాదత్‌ హొసేన్‌ 18, లిటన్‌ దాస్‌ 40, మెహిది హసన్‌ మిరాజ్‌ 23, తైజుల్‌ ఇస్లాం 25, హసన్‌ మహమూద్‌ 8 పరుగులు చేశారు. తస్కిన్‌ అహ్మద్‌ 11, షొరీఫుల్‌ ఇస్లాం 5 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. 

విండీస్‌ బౌలర్లలో అల్జరీ జోసఫ్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. జస్టిన్‌ గ్రీవ్స్‌, జేడన్‌ సీల్స్‌ తలో రెండు వికెట్లు.. కీమర్‌ రోచ్‌, షమార్‌ జోసఫ్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

అంతకుముందు వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 450 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. జస్టిన్‌ గ్రీవ్స్‌ అజేయ శతకంతో (115) కదంతొక్కగా.. ఓపెనర్‌ మికైల్‌ లూయిస్‌  మూడు పరుగుల తేడాతో.. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అలిక్‌ అథనాజ్‌ 10 పరుగుల తేడాతో సెంచరీలను చేజార్చుకున్నారు. ఆఖర్లో కీమర్‌ రోచ్‌ బంగ్లా బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. రోచ్‌ 144 బంతులు ఎదుర్కొని 47 పరుగులు చేశాడు.

విండీస్‌ ఇన్నింగ్స్‌లో కవెమ్‌ హాడ్జ్‌ (25), జాషువ డసిల్వ (14), జడెన్‌ సీల్స్‌ (18), షమార్‌ జోసఫ్‌ (11 నాటౌట్‌) రెండంకెల స్కోర్లు చేశారు. కెప్టెన్‌ బ్రాత్‌వైట్‌ (4), అల్జరీ జోసఫ్‌ (4) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకు పరిమితం కాగా.. కీసి కార్తీ డకౌటయ్యాడు. బంగ్లా బౌలర్లలో హసన్‌ మహమూద్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. తస్కిన్‌ అహ్మద్‌, మెహిది హసన్‌ మీరాజ్‌ తలో రెండు.. తైజుల్‌ ఇస్లాం ఓ వికెట్‌ దక్కించుకున్నారు.

కాగా, రెండు టెస్ట్‌లు, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌ల కోసం బంగ్లాదేశ్‌ జట్టు వెస్టిండీస్‌లో పర్యటిస్తుంది. సిరీస్‌లో భాగంగా ప్రస్తుతం తొలి టెస్ట్‌ జరుగుతుంది.

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement