వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్ జట్టు ఓటమి దిశగా పయనిస్తుంది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ గెలవాలంటే మరో 225 పరుగుల చేయాలి. చేతిలో మరో మూడు వికెట్లు మాత్రమే ఉన్నాయి. చివరి రోజు ఆట మిగిలి ఉంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 9 వికెట్ల నష్టానికి 450 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. జస్టిన్ గ్రీవ్స్ (115) అజేయ శతకంతో కదం తొక్కగా.. మికైల్ లూయిస్ (97), అలిక్ అథనాజ్ (90) తృటిలో సెంచరీలు చేజార్చుకున్నారు. బంగ్లా బౌలర్లలో హసన్ మహమూద్ 3, తస్కిన్ అహ్మద్, మెహిది హసన్ తలో 2, తైజుల్ ఇస్లాం ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం బంగ్లాదేశ్ 9 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. మొమినుల్ హక్ (50), జాకెర్ అలీ (53) అర్ద సెంచరీలతో రాణించారు. విండీస్ బౌలర్లలో అల్జరీ జోసఫ్ 3, జస్టిన్ గ్రీవ్స్, జేడెన్ సీల్స్ తలో 2, కీమర్ రోచ్, షమార్ జోసఫ్ చెరో వికెట్ పడగొట్టారు.
181 పరుగుల ఆధిక్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 152 పరుగులకు ఆలౌటైంది. తస్కిన్ అహ్మద్ (6/64) విండీస్‌ను దెబ్బకొట్టాడు. విండీస్ ఇన్నింగ్స్‌లో అలిక్ అథనాజ్ (42) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని వెస్టిండీస్ బంగ్లాదేశ్ ముందు 334 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
ఛేదనలో (నాలుగో రోజు ఆట ముగిసే) బంగ్లాదేశ్ 7 వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది. జాకెర్ అలీ (15), హసన్ మహమూద్ (0) క్రీజ్‌లో ఉన్నారు. కీమర్ రోచ్, జేడెన్ సీల్స్ తలో మూడు వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్‌ను దెబ్బతీశారు. షమార్ జోసఫ్‌కు ఓ వికెట్ దక్కింది.
కాగా, రెండు టెస్ట్‌లు, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌ల కోసం బంగ్లాదేశ్ జట్టు వెస్టిండీస్‌లో పర్యటిస్తుంది. సిరీస్‌లో భాగంగా ప్రస్తుతం తొలి టెస్ట్ జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment