
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో అసలు సిసిలైన పోరుకు సమయం అసన్నమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్దులు భారత్-పాకిస్తాన్(India-Pakistan) అమీతెల్చుకోనున్నాయి. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ఐసీసీ ఈవెంట్‌లలో పాక్‌పై తమ అధిపత్యాన్ని కొనసాగించాలని భారత్ భావిస్తోంది. మరోవైపు పాకిస్తాన్ మాత్రం 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఫలితాన్ని పునరావృతం చేయాలని పట్టుదలతో ఉంది. ట్రోఫీ-2017 ఫైనల్లో మాత్రం పాక్ చేతిలో టీమిండియా ఓటమి చవిచూసింది.
ఓవరాల్‌గా ఐసీసీ టోర్నీల్లో పాక్‌పై భారత్‌కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఐసీసీ ఈవెంట్లలో ఇరు జట్లు ముఖాముఖి 21 మ్యాచ్‌ల్లో తలపడగా.. 16 మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించగా, పాక్ కేవలం ఐదింట మాత్రమే గెలుపొందింది. ఇక ఈ బ్లాక్ బ్లాస్టర్ మ్యాచ్ నేపథ్యంలో పాకిస్తాన్ స్టార్ పేసర్ హరీస్ రౌఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్‌తో జరిగే మ్యాచ్ గురించి ఎక్కువగా ఆలోచించడం లేదని రౌఫ్ తెలిపాడు.
"భారత్‌తో మ్యాచ్ సందర్బంగా మాపై ఎలాంటి ఒత్తడి లేడు. ఆటగాళ్లందరూ రిలాక్స్‌గా ఉన్నారు. ఇది సాధారణ మ్యాచ్ మాత్రమే. పాకిస్తాన్-భారత్ మ్యాచ్ అన్ని క్రికెట్ మ్యాచ్‌లనే జరుగుతుంది" అని జియో న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రౌఫ్ పేర్కొన్నాడు. ఇక ఈ మెగా టోర్నీని భారత్ అద్భుతమైన విజయంతో ఆరంభించింది. గురువారం దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో టీమిండియా గెలుపొందింది. పాక్ మాత్రం కివీస్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో ఓటమి చవిచూసింది.
తుది జట్లు(అంచనా)
భారత్: శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి
పాకిస్తాన్: ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్
చదవండి: IPL 2025: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గుడ్‌న్యూస్..
Comments
Please login to add a commentAdd a comment