బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ చిక్కుల్లో పడ్డాడు. బంగ్లా క్రికెట్ బోర్డు(బీసీబీ) నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించి అనవసరంగా కష్టాలు కొని తెచ్చుకున్నాడు. విషయంలోకి వెళితే.. ఇటీవలే ఈ స్టార్ ఆల్‌రౌండర్ ఒక బెట్టింగ్ వెబ్‌సైట్‌తో కాంట్రాక్ట్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ విషయాన్ని షకీబ్.. ''బెట్ విన్నర్ న్యూస్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నా'' అంటూ ఫేస్‌బుక్ వేదికగా ఫోటోను షేర్ చేశాడు. తన కాంట్రాక్ట్ ఒప్పందం విషయమై షకీబ్ బీసీబీకి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. ఇదే ఇప్పుడతన్ని కష్టాల్లోకి నెట్టింది.
షకీబ్ మమ్మల్ని సంప్రదించకుండా ఒక బెట్టింగ్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నాడని.. బెట్టింగ్ అనేది ఒక అనైతిక చర్య అని.. బెట్టింగ్‌తో సంబంధమున్న ఏ కంపెనీతోనూ ఆటగాళ్లు ఒప్పందం కుదుర్చుకోరాదని నిబంధనల్లో ఉందని బీసీబీ అధ్యక్షుడు నజ్‌ముల్ హసన్ పేర్కొన్నాడు. షకీబ్ ఒప్పంద విషయమై బోర్డు మీటింగ్ అనంతరం అధ్యక్షుడు నజ్‌ముల్ హసన్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించాడు.
''గురువారం జరిగిన మీటింగ్‌లో షకీబ్ తాజాగా ఒప్పందం కుదుర్చుకున్న స్పాన్సర్‌షిప్ గురించి ప్రస్తావనకు వచ్చింది. అతను ఒక బెట్టింగ్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొని నిబంధన ఉల్లఘించాడు. ఒప్పంద విషయమై బోర్డుకు కనీస సమాచారం ఇవ్వకుండా సొంత నిర్ణయం తీసుకున్నాడు. దీనిపై వివరణ కోరుతూ షకీబ్‌కు నోటీసులు పంపించాం. ఒకవేళ షకీబ్ ఒప్పందం కుదుర్చుకున్న సంస్థకు బెట్టింగ్ మాఫియాతో సంబంధముందని తెలిస్తే ఉపేక్షించబోయేది లేదు.
దీనిపై ఇన్‌వెస్టిగేషన్(విచారణ) ప్రారంభించబోతున్నాం. మా అనుమతి తీసుకోకుండా ఒప్పందం కుదుర్చుకున్న షకీబ్‌పై ఎలాంటి చర్యలు ఉంటాయనేది విచారణ అనంతరమే తెలుస్తోంది. కానీ షకీబ్ చేసింది బీసీబీ బోర్డుకు విరుద్దంగా ఉంది. బెట్టింగ్ అనే అంశానికి (బీసీబీ-లా) పూర్తి వ్యతిరేకం'' అంటూ చెప్పుకొచ్చాడు.
కాగా ఎన్ని వివాదాలు ఉన్నా షకీబ్ అల్ హసన్ ప్రస్తుత తరంలో ఉన్న గొప్ప ఆల్‌రౌండర్లలో ఒకడు. మైదానం వెలుపల.. బయట ఎంతో అగ్రెసివ్‌గా కనిపించే షకీబ్ ఆల్‌రౌండర్‌గా లెక్కలేనన్ని రికార్డులు తన సొంతం. బంగ్లాదేశ్ క్రికెటర్లలో ఫేస్‌బుక్‌లో ఎక్కువ మంది ఫాలోయర్లు ఉన్న ఆటగాడు షకీబ్ అల్ హసన్. దాదాపు 15.6 మంది మిలియన్ ఫాలోవర్స్ అతని సొంతం. టి20లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో షకీబ్ అల్ హషన్ నెంబర్ వన్‌లో ఉన్నాడు. 99 టి20ల్లో 121 వికెట్లతో టాప్‌లో కొనసాగుతున్నాడు.
ఇక టి20 వరల్డ్‌కప్‌లోనూ అత్యధిక వికెట్లు షకీబ్(41 వికెట్లు) పేరిటే ఉండడం విశేషం. ఐసీసీ ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్ విభాగంలో షకీబ్ అల్ హసన్ ఎక్కువకాలం పాటు నెంబర్‌వన్‌గా కొనసాగాడు. ప్రస్తుతం ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్ విభాగంలో నెంబర్-2లో ఉన్నాడు షకీబ్. బంగ్లాదేశ్ తరపున షకీబ్ 63 టెస్టులు, 221 వన్డేలు, 99 టి20 మ్యాచ్‌లు ఆడాడు. మూడు ఫార్మాట్లు కలిపి బ్యాటింగ్‌లో 12వేలకు పైగా పరుగులు.. బౌలింగ్‌లో 621 వికెట్లు పడగొట్టాడు.
చదవండి: NZ vs NED: కివీస్‌కు ముచ్చెమటలు పట్టించిన డచ్ బ్యాటర్..
Senior RP Singh: భారత్‌ను కాదని ఇంగ్లండ్‌కు ఆడనున్న మాజీ క్రికెటర్ కుమారుడు
Comments
Please login to add a commentAdd a comment