బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ తన ఆల్‌టైమ్ ఫేవరెట్ వన్డే జట్టు వివరాలను వెల్లడించాడు. ఈ జట్టుకు సారధిగా ఎంఎస్ ధోనిని నియమించాడు. జట్టులో రెండో ఆల్‌రౌండర్‌గా తన ప్లేస్‌ను ఫిక్స్ చేసుకున్నాడు. తన ఫేవరెట్ జట్టులో వన్డే క్రికెట్‌లోని స్టార్లందరికీ చోటు కల్పించిన షకీబ్.. ఒక్క రోహిత్ శర్మను మాత్రం పక్కన పెట్టాడు. షకీబ్ తన ఆల్‌టైమ్ ఫేవరెట్ జట్టులోకి రోహిత్‌ను తీసుకోలేదు.
ఓపెనర్లుగా సచిన్ టెండూల్కర్, సయీద్ అన్వర్‌లకు అవకాశం ఇచ్చిన షకీబ్.. వన్‌డౌన్‌లో ఆశ్చర్యకరంగా క్రిస్ గేల్‌కు ఛాన్స్ ఇచ్చాడు. నాలుగో స్థానం కోసం విరాట్‌ను ఎంపిక చేసిన షకీబ్.. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా జాక్ కల్లిస్‌కు ఛాన్స్ ఇచ్చాడు. ఆరో స్థానం కోసం ధోని ఎంపిక చేసిన షకీబ్.. ఏడో స్థానంలో తనను తాను ప్రమోట్ చేసుకున్నాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా షేన్ వార్న్, ముత్తయ్య మురళీథరన్‌లను ఎంపిక చేసిన షకీబ్.. ఫాస్ట్ బౌలర్లుగా వసీం అక్రమ్, గ్లెన్ మెక్‌గ్రాత్‌లకు ఛాన్స్ ఇచ్చాడు.
కాగా, కెరీర్ పరంగా మంచి ఫామ్‌లో ఉన్న షకీబ్.. స్వదేశంలో జరిగిన ఓ వివాదంలో ఇరుక్కున్నాడు. షకీబ్‌పై బంగ్లాదేశ్‌లో మర్డర్ కేసు నమోదైంది. ఈ కేసులో షకీబ్ 28వ నిందితుడిగా ఉన్నాడు. షకీబ్ విషయంలో బాధితుడి తరఫు లాయర్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు నోటీసులు జారీ చేశారు. షకీబ్‌ను తక్షణమే జట్టు నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ విషయంలో బీసీబీ మాత్రం పట్టీపట్టనట్లు ఉంది.
షకీబ్‌పై నేరం రుజువైతే అప్పుడు చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. అప్పటివరకు అతను జట్టుతో కొనసాగుతాడని పేర్కొంది. షకీబ్ తాజాగా పాకిస్తాన్‌పై బంగ్లాదేశ్ సాధించిన చారిత్రక విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో అతను నాలుగు వికెట్లు తీసి పాక్‌ను దారుణంగా దెబ్బకొట్టాడు. షకీబ్‌పై ఎన్ని వివాదాలు ఉన్నా ఆట పరంగా అతను బంగ్లాదేశ్‌కు లభించిన ఆణిముత్యమనే చెప్పాలి.
Comments
Please login to add a commentAdd a comment