ఇంగ్లండ్‌తో టి20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి జోరు మీదున్న బంగ్లాదేశ్ ఐర్లాండ్‌తో సిరీస్‌లోనూ తమ హవా కొనసాగిస్తుంది. తాజాగా శనివారం ఐర్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో 183 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. తమ వన్డే క్రికెట్‌లో పరుగుల పరంగా బంగ్లాదేశ్ అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది.
339 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ బంగ్లా బౌలర్ల దాటికి 30.5 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటైంది. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో జార్జ్ డాక్రెల్ 45 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఎబాదత్ హొసెన్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. నసూమ్ అహ్మద్ మూడు, తస్కిన్ అహ్మద్ రెండు, షకీబ్ ఒక వికెట్ పడగొట్టాడు.
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ షకీబ్ అల్ హసన్(89 బంతుల్లో 93), తౌహిద్ హృదోయ్ (85 బంతుల్లో 92) మెరుపులు మెరిపించగా.. ముష్పికర్ రహీమ్ 44 పరుగులు చేశాడు. దీంతో బంగ్లా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. ఐర్లాండ్ బౌలర్లలో హ్యూమ్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. కర్టిస్ కాంపెర్, ఆండీ మెక్‌బ్రిన్, మార్క్ అడైర్ తలా ఒక వికెట్ తీశారు. ఈ విజయంతో బంగ్లా మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉంది. ఇరుజట్ల మధ్య రెండో వన్డే మార్చి 20న జరగనుంది. త్రౌహిద్ హృదోయ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment