
ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు శుభవార్త అందింది. కాలి మడమ గాయంతో బాధపడుతున్న ఆస్ట్రేలియా కెప్టెన్, ఎస్ఆర్‌హెచ్ సారథి ప్యాట్ కమ్మిన్స్(Pat Cummins).. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఆరంభసమయానికి పూర్తి ఫిట్‌నెస్ సాధించనున్నట్లు తెలుస్తోంది.
ఈ గాయం కారణంగానే కీలకమైన ఛాంపియన్స్ ట్రోఫీకి సైతం కమ్మిన్స్ దూరమయ్యాడు. అయితే త్వరలోనే తన ప్రాక్టీస్‌ను మొదలు పెట్టనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమ్మిన్స్ స్పష్టం చేశాడు.
"చీలమండ గాయం నుంచి కోలుకుంటున్నాను. ఇదేమి మరీ అంత పెద్ద గాయమేమి కాదు. నా గాయం గురించి బయట వినిపిస్తున్న వార్తలు ఏవీ నిజం కాదు. పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి ఆరు వారాల సమయం అవసరం లేదు. ఈ గాయం నుంచి కోలుకోవడానికి కాస్త విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు.
ఈ క్రమంలోనే ఛాంపియన్స్ ట్రోఫీకి దూరంగా ఉన్నాను. త్వరలోనే బౌలింగ్ ప్రాక్టీస్‌ను మొదలు పెడతాను. ఐపీఎల్ సమయానికి సిద్దంగా ఉంటాను. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్, తర్వాత జరిగే టెస్ట్ మ్యాచ్ లకు ఐపీఎల్ చాలా మంచి సన్నాహకంగా ఉంటుంది అని కమ్మిన్స్ పేర్కొన్నాడు. ఐపీఎల్ ముగిసిన వెంటనే ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికాతో వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో తలపడనుంది. ఈ డబ్ల్యూటీసీ ఫైనల్ పోరు లార్డ్స్ వేదికగా జూన్ 11 నుంచి ప్రారంభం కానుంది.
తొలి సీజన్‌లోనే అదుర్స్..
కాగా ఐపీఎల్-2024 మినీ వేలంలో కమ్మిన్స్‌ను రూ. 20.5 కోట్ల భారీ ధరకు సన్‌రైజర్స్ కొనుగోలు చేసింది. తన ధరకు తగ్గ న్యాయం కమ్మిన్స్ చేశాడు. గతేడాది సీజన్‌లో అతడి సారథ్యంలోని ఎస్‌ఆర్‌హెచ్ రన్నరప్‌గా నిలిచింది. కమ్మిన్స్ బ్యాటింగ్, బౌలింగ్ పరంగా రాణించాడు.
దీంతో ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు, ఫ్రాంచైజీ కమ్మిన్స్‌ను రూ.18 కోట్లకు ఎస్‌ఆర్‌హెచ్ రిటైన్ చేసుకుంది. ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. సన్‌రైజర్స్ తమ తొలి మ్యాచ్‌లో మార్చి 23న హైదరబాద్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో తలపడనుంది.
ఐపీఎల్-2025కు ఎస్‌ఆర్‌హెచ్ జట్టు: పాట్ కమిన్స్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డి, మహమ్మద్ షమీ, హర్షల్ పటేల్, ఇషాన్ కిషన్, రాహుల్ చాహర్, ఆడమ్ జంపా, అథర్వ తైదే, అభినవ్ మనోహర్, సిమర్జీత్ సింగ్, జీషన్ అన్సారీ, జయదేవ్ ఉనద్కత్, బ్రైడన్ కార్సే, కమిందు మెండిస్, అనికేత్ వర్మ, ఎషాన్ మలింగ, సచిన్ బేబీ
చదవండి: గిల్ సెంచరీ కోసం హాఫ్ సెంచరీని త్యాగం చేసిన రాహుల్.. అదే హార్దిక్ అయ్యుంటే..!
Comments
Please login to add a commentAdd a comment