హీరోను తెగ పొగిడేస్తున్న హీరోయిన్ | Actor Nani helped debutante Mehreen be a 'notch higher' | Sakshi
Sakshi News home page

హీరోను తెగ పొగిడేస్తున్న హీరోయిన్

Published Mon, Jan 18 2016 3:27 PM | Last Updated on Fri, Aug 17 2018 2:34 PM

హీరోను తెగ పొగిడేస్తున్న హీరోయిన్ - Sakshi

హీరోను తెగ పొగిడేస్తున్న హీరోయిన్

హైదరాబాద్ :  భలే భలే మగాడివోయ్  చిత్రం ఇచ్చిన కిక్తో మాంచి ఊపు మీదున్న టాలీవుడ్ హీరో నానిని పొగడ్తలతో ముంచేస్తోంది  హీరోయిన్  మెహరీన్.  అతనితో కలిసి నటించడం తన అదృష్టమని పొంగిపోతోంది.   నాని హీరోగా వస్తున్న 'కృష్ణగాడి  వీర ప్రేమ గాథ' తో హీరోయిన్ గా  ఎంట్రీ ఇస్తున్న మెహరీన్...   నానితో వర్క్ చేయడం చాలా అద్భుతమైన అనుభవాన్ని మిగిల్చిందంటోంది.

సెట్స్ లో తొలిరోజు తనకు నాని  చాలా హెల్ప్  చేశాడని  మురిసిపోతోంది ఈ పంజాబీ భామ. ఈ సినిమాలో తమ ఇద్దరి మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చాలా  అద్భుతంగా పండిందని తెలిపింది.  నాని నుండి తాను చాలా నేర్చుకున్నానని చెబుతోంది.  నానీ హీరోగా వచ్చిన 'ఎవడే సుబ్రహ్మణ్యం, , భలే భలే మగాడివోయ్ లాంటి  సినిమాలు చూశాననీ  అద్భుతంగా ఉన్నాయంటూ కొనియాడింది.  ఆ సినిమాలు  చూసిన తరువాత అతనిపై గౌరవం మరింత పెరిగిందని  మెహరీన్ ప్రశంసించింది. మరీ  ముఖ్యంగా  ఈగ సినిమాలోని అతని నటనకు  ఫిదా అయిపోయానంటోంది.  

పనిలో పనిగా దర్శకుడు హను రాఘవపూడిపైన అమ్మడు పొగడ్తలు కురిపించింది.  హను  విజన్ ఉన్న దర్శకుడని వ్యాఖ్యానించింది.  తాను అనుకున్న అవుట్ పుట్ వచ్చేదాకా రాజీ పడకుండా వర్క్ చేయడం అతని ప్రత్యేకత అని చెప్పుకొచ్చింది.  రెండు రోజుల  పరిశీలన తరువాత  తనను ఈ పాత్రకు ఎంపిక చేయడం తన అదృష్టమని పేర్కొంది.  ఈ సినిమాలో తాను మహాలక్షి  పాత్రలో  లంగా వోణీ గెటప్లో చాలా  ఆకర్షణీయంగా  కనిపిస్తానని చెప్పింది. ఈ అమ్మడు ఇప్పటికే తెలుగు లో రెండు  తమిళంలో ఒక ప్రాజెక్టులకు సైన్ చేసి జోరుమీద ఉంది.

 కాగా  అనంతపురం బ్యాక్ డ్రాప్ లో  రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ మూవీలో నాని... నందమూరి బాలకృష్ణ అభిమానిగా  కనిపిస్తాడట.  ఇప్పటికే విడుదలైన మూవీ టీజర్ మంచి మార్కులు కొట్టేసింది. త్వరలోనే ఆడియో విడుదలకు రెడీ అవుతున్న  ఈ సినిమాను ఫిబ్రవరి 5న విడుదల చేయాడానికి  చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement