![MLA Anil Kumar Yadav Challenges To Kotamreddy Sridhar Reddy - Sakshi](/styles/webp/s3/article_images/2023/02/2/Anil-kumar-yadav.jpg.webp?itok=OSiS_dvB)
సాక్షి, నెల్లూరు జిల్లా: కోటంరెడ్డికి దమ్ముంటే 51 సెకన్ల ఆడియో బయట పెట్టాలని మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ సవాల్ విసిరారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీలోకి వెళ్తేందుకే కోటంరెడ్డి విమర్శలు అంటూ దుయ్యబట్టారు.
‘‘కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ జరగలేదు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని నువ్వు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా. ఫోన్ ట్యాపింగ్ జరగలేదని నేను నిరూపిస్తే.. నువ్వు రాజీనామా చేస్తావా?. 24 గంటల సమయం ఇస్తున్నా.. ఎప్పుడైనా రండి.. నేను రెడీ. ఆనం రామనారాయణ చచ్చిన పాము.. ఆయనకేంటి ప్రాణహాని’’ అని అంటూ అనిల్ నిప్పులు చెరిగారు.
చదవండి: ఆ సందర్భాల్లో చంద్రబాబు ఇంగ్లీష్ స్పీచ్ విసుగు తెప్పించేదా?
Comments
Please login to add a commentAdd a comment