
సాక్షి, విజయవాడ: జమీన్ రైతు పత్రిక ఎడిటర్ డోలేంద్ర ప్రసాద్‌పై కోటంరెడ్డి దాడి చేసిన ఘటనకు తాను ప్రత్యక్ష సాక్షినని ప్రొఫెసర్ వసుంధర అన్నారు. డోలేంద్రపై దాడి చేసిన అనంతరం తనను, మరో మహిళను కోటంరెడ్డి కారులో ఎత్తుకెళ్లాడని తెలిపారు.
సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, మోసానికి, కపటానికి ప్యాంటు, షర్టు వేసి చేతిలో బీరు బాటిల్ పెడితే అతడే కోటంరెడ్డి అని.. కోటంరెడ్డి పైకి మాత్రం వేదాలు వల్లిస్తాడంటూ మండిపడ్డారు.
‘‘కోటంరెడ్డి సోదరులు నియోజకవర్గంలో అనేక దందాలకు, అరాచకాలకు పాల్పడ్డారు. ఎంపీడీఓ సరళపై దాడికి పాల్పడి, ఆ దాడి నేనే చేయించానని కోటంరెడ్డి ఫోన్ చేసి మరీ ఆమెకు చెప్పారు. తిరుమల నాయుడు సహా అనేక మందిపై దాడులు జరిపారు. కోటంరెడ్డి లాంటి నీచుడికి ఓటు వేయొద్దు’’ అని వసుంధర పేర్కొన్నారు.
‘‘రియల్ ఎస్టేట్ దగ్గర నుంచి దుకాణాల వరకూ మామూళ్లు వసూలు చేశారు. మహిళల జీవితాలను నాశనం చేశారు. దాడులు, దౌర్జన్యాలకు పాల్పడ్డారు. నెల్లూరు రూరల్ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డికి అభివృద్ధి చేసిన ట్రాక్ రికార్డు ఉంది. నెల్లూరు రూరల్ ప్రజలంతా ఆదాలకు ఓటు వేయాలి’ అని వసుంధర విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment