suffering
-
ధారపర్తిని దగా చేసిందెవరు..?
శృంగవరపుకోట: అభంశుభం తెలియని గిరిజన తల్లుల గర్భశోకం..ఎవరి పాపం. తీవ్రమైన జ్వరాలు, వంటిపై దద్దుర్లుతో ఆస్పత్రి పాలైన చిన్నారుల తల్లుల శోకానికి, పాపానికి కారణం ఎవరన్న విషయమై వైద్యాధికారులు ఇంతవరకూ చెప్పలేదు. ఎస్.కోట మండలంలోని ధారపర్తి పంచాయతీ గిరిశిఖర గ్రామాల్లోని చిన్నారులు ఇటీవల తీవ్రజ్వరం, దద్దుర్లుతో ప్రాణాపాయ స్థితిలో స్థానిక ఏరియా ఆస్పత్రిలో చేరారు. ఏరియా ఆస్పత్రి వైద్యులు పరిస్థితిని చక్కదిద్దినా, డబ్ల్యూహెచ్ఓ సపోర్టింగ్ టీమ్ సభ్యుడు చెనగపాడు గ్రామంలో పర్యటించి ఇచ్చిన రిపోర్టుతో తీగలాగితే డొంక కదిలినట్లు, వైద్యసిబ్బంది కట్టు కథ బయటికొచ్చింది. పిల్లల్లో తట్టు, పొంగు వ్యాధుల నివారణకు ఇచ్చే ఎంఆర్ వ్యాక్సిన్ సకాలంలో ఇవ్వక పోవడం వల్లనే జ్వరాలు, దద్దుర్లు వచ్చాయని, ఇవి తట్టు లక్షణాలేనన్న నిజం బయటకు వచ్చింది. దీంతో గత వారం రోజులుగా వైద్యారోగ్యశాఖ అధికారులు, క్షేత్రసిబ్బంది కొండపైకి పరుగులు తీస్తూ, ఈ వ్యవహారం నుంచి బయట పడేందుకు మల్లగుల్లాలు పడుతున్నారు. ఎంసీపీ కార్డులు మాయం చేసి, ఎంఆర్ వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా కనిపించిన వారందరికీ వ్యాక్సిన్లు వేస్తున్నారు. ఇంతవరకూ వైరాలజీ ల్యాబ్ రిపోర్టులు ఏం చెప్పాయో తేల్చలేదు. దారపర్తి ఘటనపై విచారణకు ఆదేశించలేదు. దారపర్తిలో జ్వరాలకు కారకులైన క్షేత్రస్థాయి సిబ్బందిపై ఇంతవరకూ చర్యలు తీసుకోలేదు. ఇంతవరకూ 18మంది చిన్నారులు జ్వరం, దద్దుర్లతో ఎస్.కోట ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందారు. మరో 14మంది చిన్నారుల శాంపిల్స్ వైరాలజీ ల్యాబ్‌కు పంపారు. కాగా శాంపిల్ రిపోర్టులు బయట పెట్టలేదు. మరో 12మంది చిన్నారులు జ్వరాలు తదితర సమస్యలతో చికిత్స తీసుకున్నారు. చర్యల కోసం డిమాండ్ పిల్లలకు వ్యాక్సిన్ వేయకుండా వారి ప్రాణాలతో చెలగాటం అడుతున్న క్షేత్రస్థాయి వైద్యసిబ్బందిపై కలెక్టర్ తక్షణం చర్యలు తీసుకోవాలని ఏపీ గిరిజన సంఘ నేతలు డిమాండ్ చేశారు. అంతరించిందనుకున్న తట్టు వ్యాధి వైద్యసిబ్బంది నిర్లక్ష్యంతో తిరిగి పురుడు పోసుకోవడం ప్రభుత్వానికే సిగ్గు చేటని మండిపడ్డారు. గతంలో చిన్నారులు చనిపోతే కనీస విచారణ లేకుండా జిల్లా అధికారులు చేతులు తుడిచేసుకున్నారని ధ్వజమెత్తారు. వైద్యాధికారులు వదిలేసినా, తాము ఈ విషయాన్ని వదిలిపెట్టబోమన్నారు. ఈ వ్యవహారంలో జిల్లా అధికారుల నుంచి ఫీల్డ్‌స్టాఫ్ వరకూ అందరూ భాగస్వాములేనని మండిపడ్డారు. -
మాట వినకుంటే ఉద్యోగం ఫట్
ఏలూరు టౌన్: ఏలూరు సర్వజన ఆస్పత్రి (జీజీహెచ్) అరాచకాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. ఏళ్ల తరబడి కాంట్రాక్టుల పేరుతో పాతుకుపోయిన వ్యక్తులు రాజకీయ నేతల అండదండలతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాము చెప్పిందే వేదంగా పనిచేస్తేనే ఉద్యోగంలో ఉంటారంటూ హుకుం జారీ చేస్తూ.. ఏ ప్రజాప్రతినిధి, అధికారీ తమను ఏం చేయలేరంటూ సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ముఖ్యంగా శానిటేషన్, సెక్యూరిటీ విభాగాల్లో దారుణాలు జరుగుతున్నాయని, తమ కుటుంబాల పోషణ, ఉపాధి కోసం భరించాల్సి వస్తోందంటూ మహిళా సిబ్బంది ఆవేదన చెందుతున్నారు. కుటుంబ పోషణ కోసం కాంట్రాక్ట్ సిబ్బందిగా చేరితే శారీరక, మానసిక వేధింపులు భరించలేకపోతున్నామంటూ ఘొల్లుమంటున్నారు. సిబ్బంది అంతా కాంట్రాక్టర్ చేతుల్లో ఉంటారనీ.. తమ పరిధిలోకి రారంటూ అధికారులు చేతులు దులుపుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేసుల్లో పురోగతి కరువు ఏలూరు నగరానికి చెందిన ఓ దళిత మహిళ ఏలూరు జీజీహెచ్‌లో శానిటేషన్ సిబ్బందిగా చేరింది. కొన్నిరోజులు సాఫీగానే ఉండగా.. కాంట్రాక్ట్ విభాగంలోని కీలక వ్యక్తి, మరికొందరు కన్ను ఆమెపై పడింది. ఆమెను వేధింపులకు గురిచేయటం ప్రా రంభించారు. తమ మాట వినకుంటే రాత్రి డ్యూ టీలు వేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. పిలిస్తే రావాల్సిందేనంటూ వేధించటంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు రాజకీయ ఒత్తిళ్లతో కేసును పురోగతి లేకుండా వదిలేశారు. ఇదే తరహాలో మరో ఇద్దరు మహిళలు కేసులు పెట్టేందుకు సిద్ధపడగా.. తమను ఎవరూ ఏమీ చేయలేరనీ, కేసులు పెట్టినా తమను టచ్ చేసేవారు లేరంటూ సదరు వ్యక్తులు బెదిరించారు. కుటుంబ పోషణకు ఈ పనిలో చేరామని, బయట తెలిస్తే పరువుపోతుందంటూ బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహస్య విచారణ చేయించాలిఏలూరు జీజీహెచ్‌లో కాంట్రాక్ట్ వర్కర్‌గా పనిచేసే ఒక దళిత మహిళపై ఆస్పత్రిలో కాంట్రాక్టర్ తరఫున పర్యవేక్షణ చేస్తున్న వ్యక్తులు వేధింపులకు పాల్పడ్డారు. ఇదే తరహాలో మరో మహిళను వేధించటంతో వారు పోలీస్‌స్టేషన్‌లో కేసులు పెట్టారు. పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇది జరిగి ఏడాదిన్నర గడిచినా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై ఇప్పటికీ చర్యలు లేవని బాధితులు ఆరోపిస్తున్నారు. జీజీ హెచ్లో చాలా కాలంగా పనిచేస్తున్న దళిత సి బ్బందిని సైతం వేధింపులకు గురిచేస్తూ వారిపై తప్పుడు ఆరోపణలు చేయించి ఉద్యోగాల్లో లే కుండా చేస్తున్నారని, అతడిపై రహస్య పోలీస్ వి చారణ చేయిస్తేనే మరిన్ని కీచక పర్వాలు వెలుగులోకి వస్తాయని బాధితులు అంటున్నారు. మాట వినకుంటే ఉద్యోగం ఫట్ జీజీహెచ్‌లో శానిటేషన్, సెక్యూరిటీ విభాగాల్లో పలువురు పేద మహిళలు పనిచేస్తున్నారు. ప్రభుత్వం ఓ ప్రైవేట్ ఏజెన్సీకి ఈ బాధ్యతను అప్పగించింది. శానిటేషన్‌లో 120 మంది వరకు మహిళలు ఉన్నారు. సెక్యూరిటీ విభాగంలో 56 మంది సిబ్బంది పనిచేస్తుండగా, వారిలో 30 మంది వరకు మహిళలు ఉన్నారు. ఒక్కో సిబ్బందికి వేతనం రూ.16 వేల వరకూ ఉండగా కటింగ్‌లు పోను రూ.13 వేల వరకు చేతికి అందుతుంది. రెండు, మూడు రోజులు అనారోగ్యంతో విధులకు హాజరుకాకుంటే ఉద్యోగం నిలుపుకునేందుకు వేలల్లో సమరి్పంచుకోవాల్సి వస్తుందని బాధితులు ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్ తరఫున పర్యవేక్షణ చేస్తున్న వ్యక్తులకు నచ్చితే రాత్రి డ్యూటీలు ఉండవని, టైమ్‌కు డ్యూటీకి రాకున్నా పర్వాలేదని, లేకుంటే జీతం కట్.. ఉద్యోగం ఊడటం ఖాయమని పలువురు ఆవేదన చెందుతున్నారు. -
AP: వరద బీభత్సం.. సింగ్‌నగర్‌లో హృదయ విదారక ఘటన
సాక్షి, విజయవాడ: సింగ్‌నగర్‌లో వరద బీభత్సం సృష్టించడంతో ప్రజల కష్టాలు హృదయ విదారకంగా మారాయి. వరద దాటే ప్రయత్నం చేస్తూ మహిళ మృతి చెందింది. గంగానమ్మ ఆలయం ఎదురుగా మసీదు రోడ్డులో ఈ ఘటన జరిగింది. నీటిలో నుంచి దాటుతుండగా మహిళ గుండెపోటుతో మరణించింది. తరలించలేక మృతదేహాన్ని కారుపైనే పెట్టి వదిలేశారు స్థానికులు. మొత్తం జలమయం కావడంతో జనజీవనం స్తంభించింది.కాగా, మున్నేరుకు భారీగా వరద పోటెత్తింది. హైదరాబాద్-విజయవాడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కీసర-ఐతవరం మధ్య రహదారిపై వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఏపీలో నాలుగు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయ్యింది. ఏలూరు, కృష్ణా, బాపట్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యింది. తీరం వెంబడి 45-55 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరికాలు జారీ చేసింది. -
ఎంత ప్రయత్నించినా.. నిద్ర పట్టడంలేదు!
విజయ్ ఒక ప్రముఖ ఎమ్మెన్సీలో సాఫ్ట్వేర్ ఉద్యోగి. మరో సాఫ్ట్వేర్ ఉద్యోగిని పెళ్లిచేసుకున్నాడు. జీవితంలోనూ, ఉద్యోగంలోనూ త్వరత్వరగా ప్రమోషన్లు అందుకున్నాడు. కానీ గత మూడు నెలలుగా రాత్రిళ్లు నిద్రపట్టక నానా ఇబ్బందులు పడుతున్నాడు. సాధారణంగా ఏడు నుంచి తొమ్మిది గంటల నిద్ర అవసరం.కానీ విజయ్‌కు త్వరగా మెలకువ వస్తుంది. ఆ తర్వాత అస్సలు నిద్ర పట్టదు. ఉదయం చాలా అలసిపోయినట్లు అనిపిస్తుంది. చిన్న చిన్న విషయాలకే చిరాకు వస్తుంది. ఏ పనిౖ పెనా శ్రద్ధ నిలవడంలేదు. నిరంతరం నిద్ర గురించిన ఆలోచనలే. పనిలో ఎక్కువ తప్పులు జరుగుతున్నాయి. దాంతో ఆఫీసులో రెడ్ స్లిప్ వచ్చింది.ఏం చేయాలో అర్థంకాక, స్లీపింగ్ పిల్స్ వాడటం ఇష్టంలేక కౌన్సెలింగ్‌కి వెళ్లాడు. ఫస్ట్ సెషన్లోనే అతను నిద్రలేమి (ఇన్ సోమ్నియా)తో బాధపడుతున్నట్టు తేలింది. ముగ్గురిలో ఒకరు ఇలాంటి రుగ్మతతో బాధపడుతున్నారు. వెంటనే డాక్టర్‌ను సంప్రదించి థైరాయిడ్ లాంటి సమస్యలు ఉన్నాయేమో చెక్ చేయించుకోమని సూచించారు.ఎలాంటి శారీరక కారణాలు లేవని పరీక్షల్లో తేలింది. ఆ తర్వాత రెండు వారాలపాటు ఏ సమయంలో నిద్రపోతున్నాడో, ఏ సమయంలో మేల్కొంటున్నాడో డైరీ రాయమని సూచించారు. విజయ్ భార్యతో మాట్లాడి స్లీప్ ఆప్నియా లేదా రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్ వంటివి లేవని నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత రిలాక్సేషన్ టెక్నిక్స్, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ద్వారా విజయ్ కొద్దివారాల్లో తన నిద్రలేమిని అధిగమించగలిగాడు.నిద్రలేమికి కారణాలు..- దీర్ఘకాలిక నిద్రలేమికి రకరకాల కారణాలున్నాయి. ఒత్తిడి, పని, పాఠశాల, ఆరోగ్యం, డబ్బు లేదా కుటుంబం గురించిన ఆందోళనలు రాత్రిపూట మన మనస్సును చురుకుగా ఉంచుతాయి, నిద్రను కష్టతరం చేస్తాయి. - షిఫ్ట్ లను తరచుగా మార్చడం లేదా వివిధ టైమ్ జోన్లలో ప్రయాణించడం వల్లా శరీరంలోని గడియారానికి (సర్కేడియన్ రిథమ్స్) భంగం కలుగుతుంది- ఒక్కోరోజు ఒక్కో సమయంలో పడుకోవడం, మేల్కోవడం, మంచంపై ఉన్నప్పుడు తినడం, టీవీ చూడటం, పనిచేయడం, స్మార్ట్ ఫోన్ ఉపయోగించడం లాంటివి నిద్రను డిస్టర్బ్ చేస్తాయి. - యాంగ్జయిటీ, డిప్రెషన్, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ వంటి మానసిక రుగ్మతలు..- మధుమేహం, ఉబ్బసం, గుండె జబ్బుల వల్ల లేదా వాటికి వాడుతున్న మందులు..- స్లీప్ ఆప్నియా, రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్ వంటి స్లీప్ డిజార్డర్స్..- రాత్రిళ్లు నికోటిన్, ఆల్కహాల్, కెఫీన్ ఉన్న పదార్థాలు, పానీయాలను తీసుకోవడమూ నిద్రలేమికి కారణమవుతాయి.మంచి అలవాట్లతో మంచి నిద్ర..మంచి అలవాట్లు నిద్రలేమిని నివారించడంలో సహాయపడతాయి.- వారాంతాలు సహా ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం, మేల్కోవడం చేయాలి. - రోజూ వ్యాయామం చేయడం వల్ల మంచి నిద్ర వస్తుంది.- పగలు అస్సలు నిద్రపోవద్దు, లేదా పరిమితం చేసుకోవాలి. - కెఫీన్, ఆల్కహాల్, నికోటిన్లను పరిమితం చేయాలి.. వీలైతే పూర్తిగా మానేయాలి. - నిద్రవేళకు ముందు భారీగా తినొద్దు, తాగొద్దు. - పడకగదిని కేవలం నిద్ర కోసమే ఉపయోగించాలి. - గోరువెచ్చని నీటితో స్నానం, చదవడం లేదా శ్రావ్యమైన సంగీతం వినడం ద్వారా నిద్రకు కావాల్సిన వాతావరణాన్ని సృష్టించుకోవాలి. - ఇవన్నీ చేసినా నిద్ర పట్టనప్పుడు సైకాలజిస్ట్‌ను కలవడం తప్పనిసరి. - నిద్రకు దూరంచేసే నెగెటివ్ ఆలోచనలు, చర్యలను సీబీటీ ద్వారా నియంత్రించవచ్చు. ఇది స్లీపింగ్ పిల్స్ కంటే ప్రభావవంతంగా ఉంటుంది. - లైట్ థెరపీ, స్టిములస్ కంట్రోల్ థెరపీ లాంటివి శరీరాన్ని, మనసును మంచి నిద్రకు సిద్ధం చేస్తాయి. - ప్రోగ్రెసివ్ రిలాక్సేషన్ టెక్నిక్, బయోఫీడ్ బ్యాక్, బ్రీతింగ్ టెక్నిక్స్ లాంటివి కూడా నిద్రవేళల్లో ఆందోళనను తగ్గించడానికి ఉపయోగపడతాయి.ఎవరి నిద్ర వారిదే..నిద్ర అలవాట్లు, అవసరాలు ఒక్కో వ్యక్తికి ఒక్కో విధంగా ఉంటాయి. అందువల్ల తక్కువ నిద్రపోయేవాళ్లందరికీ నిద్రలేమి ఉన్నట్లు కాదు. నిపుణులు అనేక రకాల నిద్ర లక్షణాలను సాధారణంగా పరిగణిస్తారు. - త్వరగా పడుకొని, త్వరగా లేచేవారిని ఎర్లీబర్డ్స్ అంటారు. - గుడ్లగూబల్లా రాత్రంతా మేలుకుని, ఆలస్యంగా పడుకుని, ఆలస్యంగా లేచేవారిని గుడ్లగూబలనే అంటారు. - ఇతరుల కంటే తక్కువ నిద్ర అవసరమైన వారిని షార్ట్ స్లీపర్స్ అంటారు. - పోలీసు, సైన్యం లాంటి విభాగాల్లో ఉండేవారు ఎప్పుడంటే అప్పుడు మేల్కొనేలా ఉంటారు. వారిని లైట్ స్లీపర్స్ అంటారు.– సైకాలజిస్ట్ విశేష్ -
గతుకుల రోడ్డుపై.. బతుకు బండి!
వందల సంఖ్యలో బస్సులు.. లక్షల మంది ప్రయాణికులు.. వారిని సకాలంలో క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు ఆర్టీసీ ఉద్యోగులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా పనిలో నిమగ్నమవుతున్నారు. పని భారాన్ని భరిస్తూ ఆర్టీసీ ఆర్థికాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు.ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మహాలక్ష్మీ’ పథకంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారి సంఖ్య విపరీతంగా పెరిగింది. దీంతో ఉద్యోగులపై తీవ్ర పనిఒత్తిడి పడింది. వీటన్నింటినీ తట్టుకుని నిబద్ధతతో విధులు నిర్వహిస్తున్నా.. వారి బతుకు బండి సురక్షితంగా సాగడంలేదు. ఒకవైపు తీవ్ర పనిఒత్తిడి, డబుల్ డ్యూటీలు.. మరోవైపు అనారోగ్య సమస్యలు, అధికారుల వేధింపులు, ఇలా అనేక సమస్యలతో ఆర్టీసీ ఉద్యోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక కథనం..ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్–1, నిజామాబాద్–2, ఆర్మూర్, బోధన్, కామారెడ్డి, బాన్సువాడ డిపోలు ఉన్నాయి. వీటి పరిధిలో 2400కు పైగా మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిత్యం లక్షా 90వేల మంది ప్రయాణించేవారు. కాగా.. మహాలక్ష్మి పథకం ప్రవేశ పెట్టిన అనంతరం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య రెండు లక్షల 90 వేలకు చేరింది.పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణికుల సామర్థ్యం 50 మంది వరకు ఉంటుంది. గతంలో సామర్థ్యానికి మించి అదనంగా 10 నుంచి 20 మంది వరకు ప్రయాణం చేసేవారు. ప్రస్తుతం పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌లలో 80 నుంచి 100 మంది వరకు ప్రయాణం చేస్తున్నారు. ఏ బస్సు చూసినా ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. దీంతో బస్సుల్లో ప్రయాణించడానికి వయస్సు పైబడినవారు, చిన్న పిల్లలు అవస్థలు పడుతున్నారు.నిజామాబాద్ బస్టాండ్‌లో ప్రయాణికుల కిటకిట8 గంటల డ్యూటీ లేదు..డ్రైవర్లు, కండక్టర్లకు గతంలో 8 గంటల డ్యూటీ ఉండేది. కానీ ఇప్పుడు పని గంటల నిబంధన లేదు. సుదూర ప్రాంతాలకు వెళ్లిన డ్రైవర్లు, కండక్టర్లు డేడ్యూటీ చేస్తారు. కానీ ఉదయం వెళ్లిన వారు అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులతో తిరిగి వచ్చే సరికి రాత్రి అవుతోంది. నిజామాబాద్ – హైదరాబాద్ మధ్య అప్ అండ్ డౌన్ 360 కిలోమీటర్లు అవుతుండగా.. నిజామాబాద్ – వరంగల్ మధ్య అప్ అండ్ డౌన్ 460 కిలోమీటర్లు పడుతుంది.దీంతో పాటు వారికి టార్గెట్ ఒత్తిడి కూడా ఉంటుంది. దీంతో కార్మికులకు పనిభారం పెరుగుతోంది. ఇలా డ్రైవర్లు, కండక్టర్లు నిత్యం 10 నుంచి 12 గంటల పాటు పని చేస్తున్నారు. దీంతో నిద్ర కరువై అనారోగ్యాల భారిన పడుతున్నారు. నిద్రలేమి కారణంగా కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. యూనియన్లు లేకపోవడంతో డిపోలోని అధికారులు సిబ్బందికి ఇష్టారాజ్యంగా డ్యూటీలు వేయడంతో పనిఒత్తిడి పెరుగుతోంది.ప్రశ్నిస్తున్న అధికారులు..ఆర్టీసీ బస్సులకు డైవర్లు కేఎంపీఎల్ తీసుకురాకపోతే కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. రూట్లో వెళ్లే బస్సులు కేఎంపీఎల్ ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నారు. డైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చి కేఏంపీఎల్ వచ్చేటట్లు చూడాలని సూచనలు చేస్తున్నారు. కండక్టర్లకు మహాలక్ష్మి పథకంతో పాటు టిక్కెట్లకు టార్గెట్ నిర్దేశిస్తున్నట్లు ఆరీ్టసీలో చర్చ జరుగుతోంది. దీంతో టార్గెట్ కాకపోతే తాము ఏం చేయగలమని కండక్టర్లు వాపోతున్నారు.రెండు డ్యూటీలు చేస్తేనే స్పెషల్ ఆఫ్..ఆర్టీసీ ఉద్యోగులు లీవ్‌లు తీసుకోవాలంటే కూడా ఇబ్బందులు తప్పడం లేదు. కండక్టర్, డ్రైవర్లకు డే డ్యూటీ, నైట్ డ్యూటీ, స్పెషల్ డ్యూటీ ఉంటుంది. రోజంతా పనిచేస్తేనే మరుసటి రోజు స్పెషల్ ఆఫ్ ఇస్తున్నారు. అలాగే అనార్యోగం పాలైన సిబ్బంది సంబంధిత డాక్టర్ల నుంచి మెడికల్ సర్టిఫికెట్ తీసుకురావాల్సి ఉంటుంది. ఇతర సెలవులు కావాలంటే అధికారుల అనుమతి తప్పకుండా తీసుకోవాల్సిందే. -
విచారణ జరిపించాలి..
డాక్టర్ కావాలని ఎంతో కష్టపడి చదివి ‘నీట్’ పరీక్షకు హాజరైన లక్షలాది విద్యార్థుల ఆశలపై ఆ పరీక్షల ఫలితాలు నీళ్లు చల్లాయి. ఎన్నడూ లేనివిధంగా 67 మందికి 720 మార్కులకు 720 రావడం, అలా వచ్చినవారిలో పలువురు ఒకే పరీక్షా కేంద్రంలో పరీక్ష రాయడం విద్యార్థులనే కాక, వారి తల్లి తండ్రులనూ నిరుత్తరులను చేసింది.దీనికి తోడు నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వందలాదిమందికి పరీక్షానిర్వహణ సంస్థ ఎన్టీఏ గ్రేస్ మార్కులను ఇవ్వడం కూడా విమర్శలకు దారితీసింది. ప్రజల ఆందోళనల నేపథ్యంలో చివరికి గ్రేస్ మార్కులను ఎన్టీఏ ఉపసంహరించుకుంది. కాని, పరీక్షల నిర్వహణలో మాత్రం ఎటువంటి అవకతవకలూ జరగలేదని అనడమే విడ్డూరంగా ఉంది.ప్రతిసారీ విద్యార్థులతో ‘పరీక్షా పే’ చర్చా కార్యక్రమాన్ని నిర్వహించే ప్రధాని... కీలకమైన నీట్ పరీక్షపై ఆరోపణలు, అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నప్పటికీ మాట్లాడకపోవడం విద్యార్థుల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి అర్థమవుతుంది. నీట్ పరీక్ష మాత్రమే కాక దేశంలోని ఎన్నో పోటీ పరీక్షలను ఎన్టీఏ నిర్వహిస్తోంది. తాజాగా బయటపడ్డ వివాదస్పద అంశాల కారణంగా దానిపై విద్యార్థులు నమ్మకం కోల్పోయే పరిస్థితి వచ్చింది.ప్రతిసారీ ఉత్తరాది రాష్ట్రాల విద్యార్థులకు ఎక్కువగా ర్యాంక్‌లు రావడం, దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులకు తక్కువ ర్యాంకులు రావడంపై దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు అనేక అనుమానాలు కల్గుతున్నాయి.ఈ మొత్తం వ్యవహారంపై కేంద్రం సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించి అవకతవకలు ఉన్నవని తేలితే బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అక్రమంగా లబ్ధిపొందిన వారిపైనా చర్యలు తీసుకోవాలి. నీట్లో జరిగిన అక్రమాల కారణంగా కష్టపడి చదివిన విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి. – గడ్డం శ్యామ్, పీడీఎస్‌యూ తెలంగాణ ఉపాధ్యక్షుడు -
దృష్టిని బట్టి.. సృష్టి!
ఉత్తర భారత దేశానికి చెందిన ఒక ప్రొఫెసర్ స్వామివారి దర్శనార్థం తిరుపతి వెళ్ళాడు. తనతో పాటు సహాయకుడిగా పరిశోధక విద్యార్థిని కూడా వెంట తీసుకు వచ్చాడు. తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి అలిపిరి గుండా తిరుమలకు కాలినడకన వెళ్ళాలనేది ప్రొఫెసర్ గారి ఆలోచన. అలిపిరికి వెళ్ళి ఎత్తైన శేషాచల శిఖరాన్ని చూశారు. సముద్రమట్టానికి 2800 అడుగుల ఎత్తులో ఉన్న ఏడుకొండల్ని చూసి భక్తి భావంతో దణ్ణం పెట్టుకున్నారు. పాదాల మండపం వద్ద శ్రీవారి లోహ పాదాలను నెత్తిన పెట్టుకుని ప్రదక్షిణ చేస్తూ ఉండగా పరిశోధక విద్యార్థి చిన్నగా ప్రొఫెసర్ని ఇలా అడిగాడు.‘‘దేవుడు నిజంగా ఉన్నాడంటారా?’’ అని. ప్రొఫెసర్ నవ్వి ‘‘దారిలో కనిపిస్తాడు పద!’’ అని చెప్పి కాలినడకకు పురమాయించాడు.అలిపిరినుంచి ఆనంద నిలయుని సన్నిధికి దారి తీసే ఆ పడికట్ల దోవలో ప్రకృతి అందాలను వీక్షిస్తూ నడక ప్రారంభించారు. తలయేరు గుండు, గాలి గోపురం, ఏడవ మైలు ప్రసన్నాంజనేయ స్వామి, అక్కగార్ల గుడి, అవ్వాచారి కోన... దాటి మోకాలి మెట్టు చేరారు. తిరుమల కొండ ‘ఆదిశేషుని అంశ’ అని భక్త జన విశ్వాసం. అందుకే చెప్పులు లేకుండా కొండ ఎక్కుతారు భక్తులు. ఈ కొండను పాదాలతో నడిచి అపవిత్రం చేయకూడదని శ్రీరామానుజులు, హథీరాంజీ బావాజీ మోకాళ్ళ మీద నడిచారని చెబుతారు. అప్పటినుంచి అది మోకాలి మెట్టు అయ్యిందని కూడా తెలుసుకున్నారు. అక్కడ మెట్లు నిలువుగా మోకాలి ఎత్తు ఉండటం వల్ల మోకాళ్ళు పట్టుకు΄ోసాగాయి పరిశోధక విద్యార్థికి. మోకాళ్ళ నొప్పులు ఎక్కువైన ఆ విద్యార్ధి గట్టిగా ‘‘దేవుడు కనిపిస్తున్నాడు!’’ అని చె΄్పాడు.చిన్న నవ్వు నవ్విన ప్రొఫెసర్, ‘‘అనుకున్నది అనుకున్నట్లు ఎవరికీ జరగదు. అలా జరిగితే ఎవ్వరూ చెప్పిన మాట వినరు. తలచినట్లే అన్నీ జరిగితే... మనిషి దేవుడి ఉనికినే ప్రశ్నిస్తాడు. కష్టాలు, కన్నీళ్లు లేకుంటే తనంత గొప్పవాడు లేడని విర్రవీగుతాడు. అహాన్ని తలకి ఎక్కించుకున్నవాడు తనే దేవుడని చెప్పి ఊరేగుతాడు. జీవితం కష్టసుఖాల మయం కాబట్టే, మనిషి ఆ అతీత శక్తిని ఆరాధిస్తున్నాడు! అందుకే అలిపిరి వద్ద నేల మీద నడిచేటప్పుడు నీకు దేవుడి ఉనికి ప్రశ్నార్థకమయ్యింది. మోకాలిమెట్టు దగ్గరికి వచ్చేసరికి దేవుడు ఉన్నాడని అనిపించింది’’ అని చెప్పి గబగబా మెట్లు ఎక్కసాగాడు.‘దృష్టిని బట్టి సృష్టి’ అని తెలుసుకున్న విద్యార్థి గోవింద నామస్మరణ చేస్తూ ప్రొఫెసర్ వెనుకనే నడవసాగాడు. – ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
ర్యాంకుల కోసం ప్రణాలు పణం.. విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి!
"1, 2, 3.. పదిలోపు ర్యాంకులు మా విద్యార్థులవే.. పరీక్షలు ఏవైనా మెరుగైన ర్యాంకులు మా విద్యా సంస్థలదే.. అని కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలలు ఊదరగొడితే.. 'మా అబ్బాయికి మొదటి ర్యాంకు వచ్చింది.. మా అమ్మాయికి రెండో ర్యాంకు వచ్చింది..' అంటూ తల్లిదండ్రులు గొప్పగా చెప్పుకొంటారు.. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఈ మధ్యలో విద్యార్థులు ఎంతటి ఒత్తిడి అనుభవిస్తున్నారు.. ఎలా చదువుకుంటున్నారు.. అని మాత్రం ఎవరూ పట్టించుకోరు.. ఈ క్రమంలో ఏదైనా జరగరానిది జరిగితే మాత్రం ఒకరిపై ఒకరు నెట్టుకొంటూ విద్యాసంస్థలు చేతులు దులుపుకొంటే.. తల్లిదండ్రులు కడుపు కోతతో జీవితాలను నెట్టుకొస్తున్నారు.. మొత్తంగా తల్లిదండ్రుల అత్యాశ.. విద్యాసంస్థల ధనదాహం.. ప్రభుత్వ పట్టింపులేని తనం వల్ల విద్యార్థులు నరకయాతన అనుభవిస్తున్నారు.." - మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్ ర్యాంకుల కోసం విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థులపై తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తున్నారు. సమయం.. సందర్భం లేకుండా ఎప్పుడూ ప్రిపరేషన్ అంటూ పుస్తకాలతో కుస్తీ పట్టిస్తున్నారు. రోజువారి సాధారణ తరగతులే కాకుండా ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతుల పేరిట విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వీటిని కొందరు విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటూ మెరుగైన ఫలితాలు సాధిస్తే.. మరికొందరు మాత్రం తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఈ క్రమంలో సోమవారం మహబూబ్‌నగర్‌లోని మైనార్టీ గురుకులంలో ఓ విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇందుకు తీవ్రమైన ఒత్తిడే కారణం అన్న ఆరోపణలు వచ్చాయి. అయితే ఇన్నాళ్లు ప్రైవేట్‌లో చోటుచేసుకున్న పై సంఘటనలు ఇప్పుడిప్పుడే ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న విద్యా సంస్థలకు విస్తరిస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. - గత వారం రోజుల క్రితం క్రిష్టియన్‌పల్లి సమీపంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో సెలవు దినాలు, ఆదివారాల్లోనూ తరగతులు నిర్వహిస్తూ.. పరీక్షలు పెడుతున్నారని, దీంతో తాము ఇబ్బందులు పడుతున్నామని పాఠశాల విద్యార్థులే స్వయంగా డీఈఓకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే స్పందించిన ఆయన ఎంఈఓతో విచారణ జరిపించారు. స్పెషల్ క్లాస్‌లు, పరీక్షల నిర్వహణ నిజమే అని తేలడంతో పాఠశాలను హెచ్చరించారు. పాఠశాల స్థాయి నుంచే.. ఇంటర్మీడియట్ తర్వాత విద్యార్థులు ఐఐటీ, నీట్లో సీట్లు సాధించాలన్న ఉద్దేశంతో చాలా ప్రైవేట్ పాఠశాలల్లో 8వ తరగతి నుంచే మెటీరియల్స్ పంపిణీ చేస్తున్నారు. ఇందుకోసం తల్లిదండ్రుల నుంచి అదనంగా రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారు. సాధారణ తరగతులు పూర్తయిన వెంటనే స్పెషల్ క్లాస్‌ల పేరిట ఐఐటీ, నీట్ కోసం శిక్షణ ఇస్తున్నారు. దీంతో విద్యార్థులు వార్షిక పరీక్షల సిలబస్‌పై దృష్టి సారించాలా.. లేక ఐఐటీ, నీట్ వంటి వాటిపై దృష్టిపెట్టాలా అన్న అంశాలతో గందరగోళానానికి గురవుతున్నారు. ఇవి చదవండి: సైబర్ వలలో సాఫ్ట్వేర్ ఉద్యోగి.. మెసేజ్ క్లిక్ చేయగానే బిగ్ షాక్! -
విపరీతమైన తలనొప్పి అనడంతో స్కాన్ చేసి చూడగా..విస్తుపోయిన వైద్యులు!
కొన్ని ఘటనలు చాలా ఆశ్చర్యకరంగా అంతు చిక్కని మిస్టరీల్లా ఉంటాయి. ఏదైన వస్తువులను చిన్నపిల్లలు అయితే తెలియక మింగడం లేదా చెవుల్లోనూ, ముక్కులోనూ పెట్టుకోవడం జరుగుతుంది. అదే పెద్ద వాళ్ల శరీరాల్లో అలాంటి చిన్న వస్తువులు కనిపిస్తే ఇదేలా సాధ్యం అనిపిస్తుంది. ఇక్కడొక వ్యక్తి విషయంలో అలానే జరిగింది. స్కాన్ చేసి చూసిన వైద్యులు కూడా విస్తుపోయారు వియత్నాంకు చెందిన ఓ వ్యక్తి విపరీతమైన తలనొప్పితో గత ఐదు నెలలుగా బాధపడుతున్నాడు. పలు వైద్య పరీక్షలు నిర్వహించి అతడు టెన్షన్‌కి సంబంధించిన న్యూమోసెఫాలస్తో బాధపడుతున్నట్లు నిర్ధారించారు డాక్టర్లు. ఈ అరుదైన న్యూరోలాజికల్ పరిస్థితి కాస్త ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు పేర్కొన్నారు. నివారించేందుకు చికిత్సలో భాగంగా రోగి శరీర స్థితి గురించి క్షుణ్ణంగా స్టడీ చేస్తున్నారు. ఆ క్రమంలోనే సిటీస్కాన్లు నిర్వహించగా బ్రెయిన్లో ఉన్న ఆ వస్తువుని చూసి ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు వైద్యులు. రెండు చాప్‌స్టిక్‌లు అతని మెదడులో ఇరుక్కుని ఉన్నట్లు గుర్తించారు. అసలు అవి మెదడు వరకు ఎలా చేరాయనేది వైద్యులకు ఓ మిస్టరీలా అనిపించింది. ఆ పేషెంట్‌కి కూడా ఈ విషయం చెప్పగా.. ఐదు నెలల క్రితం జరిగిన ఘటనను గుర్తు తెచ్చుకుంటూ..ఓ రోజు రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడూ జరిగిన గొడవలో ముఖంపై ఏదో వస్తువుతో గుచ్చినట్లు గుర్తు.. కానీ అది జరిగే చాలారోజులు అయ్యిందని చెప్పాడు. ఐతే అప్పుడు తనకు ఎలాంటి సమస్య, ఇబ్బంది గానీ అనిపించలేదని చెప్పుకొచ్చాడు ఆ వ్యక్తి. దీంతో వైద్యులు పేపెంట్ ముక్కుని పరిశీలించగా..చాప్‌స్టిక్ గుచ్చిన గుర్తులు కనిపించడంతో ముక్కు ద్వారానే ఈ చాప్‌స్టిక్‌లు మెదడులోకి వెళ్లాయని నిర్థారణకు వచ్చారు. అదృష్టవశాత్తు ఆ పేషెంట్‌కి ఎండోస్కోపిక్ శస్త్ర చికిత్స ద్వారా వైద్యులు ఆ చాప్ స్టిక్‌లను విజయవంతంగా తొలగించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. దయచేసి మీపై ఏదైనా దాడి జరిగినప్పుడూ పెద్ద దెబ్బలేం తగలలేదని నిర్లక్ష్యం చెయ్యొద్దని సూచిస్తున్నారు వైద్యులు. (చదవండి: ఎక్స్ట్రీమ్ వెయిట్ లాస్ స్టార్ జస్ట్ 40 ఏళ్లకే నూరేళ్లు.. బరువు తగ్గడం ఇంత ప్రమాదమా?) -
బాధను భరించలేక.. యువతి విషాద నిర్ణయం!
సాక్షి, ఆదిలాబాద్: సారంగపూర్ మండలంలోని పొట్య గ్రామానికి చెందిన అలుగొండ వైష్ణవి(17) తలనొప్పి బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుందని సారంగాపూర్ ఎస్సై కృష్ణసాగర్రెడ్డి తెలిపారు. కొన్నేళ్లుగా సమస్యతో బాధపడుతోంది. చికిత్స చేయించుకున్నా నయం కాకపోవడం, ఖరీదైన చికిత్స చేయించుకునే స్థోమత లేకపోవడంతో శనివారం ఇంట్లో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వైష్ణవి తండ్రి దత్తన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
చిన్నారి క్యాన్సర్ పెళ్లి కూతురు.. కథ వింటే కన్నీరాగదు!
క్యాన్సర్‌తో బాధపడుతున్న 11 ఏళ్ల బాలిక తాను చనిపోవడానికి ముందు తన పెళ్లి కల గురించి తల్లిదండ్రులకు తెలిపింది. ఆ మాట వినగానే తల్లిదండ్రులకు దు:ఖం తన్నుకొచ్చింది. అయితే వారు కుమార్తె చివరి కోరికను నెరవేరుస్తూ ఆమెకు అత్యంత ఘనంగా వివాహం జరిపించారు. ఈ ఘటన అమెరికాలోని నార్త్ కరొలినాలో జరిగింది. న్యూయార్క్ పోస్ట్ అందించిన సమాచారం ప్రకారం క్యాన్సర్ బాధిత బాలిక ఎమ్మా ఎడ్వర్డ్స్(11)కు డానియల్ మార్షల్ క్రిస్టోఫర్ ‘డీజే’ విలియమ్స్ జూనియర్‌తో వివాహం జరిగింది. ఎమ్మా.. లుకేమియా తోనూ బాధితురాలు. పెళ్లయిన 12వ రోజు ఆ బాలిక మృతి చెందింది. ఎమ్మా తల్లిదండ్రులకు తమ కుమార్తె లిమ్ఫోల్బా స్టిక్ లుకేమియా బాధితురాలని గత 2022లో తెలిసింది. ఇది క్యాన్సర్ మాదిరిగానే రక్తాన్ని, ఎముకలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి చిన్నారులకు సోకితే ఈ ప్రభావం అత్యధికంగా ఉంటుంది. అయితే తమ కుమార్తె క్యాన్సర్‌ను జయిస్తుందని తల్లిదండ్రులు భావించారు. అయితే వారి ఆశ అడియాశగానే మిలిగింది. వైద్య పరీక్షలో ఆమెకు క్యాన్సర్ ముదిరిపోయిందని, ఇక కొద్ది రోజుల మాత్రమే ఆమె బతికి ఉంటుందని వైద్యులు ఆ తల్లిదండ్రులకు తెలిపారు. అదే సమయంలో ఆ చిన్నారి తన పెళ్లి కల గురించి తల్లిదండ్రులకు తెలిపింది. తాను ‘డీజే’ను వివాహం చేసుకోవాలనుకుంటున్నానని చెప్పింది. దీంతో ఎమ్మా తల్లి ‘డీజే’ తల్లిదండ్రులతో మాట్లాడి, వారిద్దరి పెళ్లికి ఏర్పాట్లు చేసింది. పెళ్లి మాటలు మాట్లాడుకున్న రెండు రోజులకే ఎమ్మా, డీజేలకు ఘనంగా వివాహం జరిగింది. ఒక రోజు ఆ చిన్నారి ఉన్నట్టుంది స్పృహతప్పి పడిపోయింది. తల్లిదండ్రులు వెంటనే బాధిత చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆమె కాలి ఎముకలకు కూడా క్యాన్సర్ వ్యాపించిందని వైద్యులు తెలిపారు. ఆ చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఇది కూడా చదవండి: ఎయిర్‌క్రాఫ్ట్ నడుపుతూ 11 ఏళ్ల చిన్నారి.. పక్కనే మద్యం తాగుతూ తండ్రి.. మరుక్షణంలో.. -
ట్రాఫిక్‌తో ఏటా బెంగళూరుకు రూ.20 వేల కోట్ల నష్టం
బెంగళూరు: తీవ్రమైన ట్రాఫిక్ సమస్యల కారణంగా బెంగళూరు నగరం ఏటా రూ.20 వేల కోట్ల మేర నష్టపోతోందని ఓ అధ్యయనంలో తేలింది. ‘నగర ఉత్పాదకత, ఆర్థిక వృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఫలితంగా ఉత్పాదకత గణనీయంగా తగ్గి, చిన్న, మధ్య తరహా సంస్థల రవాణా అవసరాలు ఆలస్యమవుతున్నాయి. ఇందుకు కాలుష్య సమస్య కూడా తోడవుతోంది’అని ఆ అధ్యయనం తెలిపింది.చాలా ఏళ్లుగా బెంగళూరు నగరం తీవ్ర ట్రాఫిక్ సమస్యతో సతమతమవుతోంది. నగర ప్రణాళిక, మౌలిక సదుపాయాలు సరిగ్గానే ఉన్నప్పటికీ నష్టాలను చవిచూస్తోందని ట్రాఫిక్ నిపుణుడొకరు చేపట్టిన ఈ అధ్యయనం పేర్కొంది. ట్రాఫిక్ జామ్ సమస్య కారణంగా ఎక్కువగా నష్టపోయేది బెంగళూరుకు ఆర్థిక దన్నుగా నిలుస్తున్న ఐటీ రంగమేనని తేల్చింది. ఉద్యోగులు తమ విలువైన సమయాన్ని ట్రాఫిక్ సమస్యలతోనే గడుపుతున్నారని కూడా వివరించింది. ట్రాఫిక్ సంబంధ కారణంగా ఒక్క ఐటీ రంగమే సుమారు రూ.7 వేల కోట్ల మేర ఏటా నష్టపోతోందని తెలిపింది. పౌరులు కూడా నాణ్యమైన జీవితాన్ని గడపలేకపోతున్నారని పేర్కొంది. అధ్యయనంలో భాగంగా రోడ్ ప్లానింగ్, ఫ్లై ఓవర్లు, ట్రాఫిక్ నిర్వహణ, మౌలిక సదుపా యాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు నిపుణులు పలు సూచనలు చేశారు. ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచడం, కొన్ని ప్రాంతాల్లో ప్రయాణించేందుకు ఎక్కువ చార్జీలు వసూలు చేయడం(కంజెషన్ ప్రైసింగ్), కార్‌పూలింగ్ వంటివి ఇందులో ఉన్నాయి. కెమెరాలు, సెన్సార్ వ్యవస్థలను నెలకొల్పి, ఎక్కువ మంది ట్రాఫిక్ సిబ్బందిని నియమించి నిబంధనలను అమలు చేయడం, మెట్రోలు, ప్రభుత్వ బస్సు సర్వీసులు నడిపేందుకు భూగర్భమార్గాల ఏర్పాటు కూడా ఇందులో ఉన్నాయి. ప్రభుత్వం, పౌర సంస్థలు, పౌరులు కలిసి కట్టుగా పనిచేసి రహదారులపై భారం తగ్గించొచ్చని తెలిపింది. -
Pensions: ప్రతినెలా ఇదే తంతు.. సర్వర్ మొరాయింపు
కీసర(మేడ్చల్ జిల్లా): ఆసరా పింఛన్ల పంపిణీ ప్రహాసనంగా మారింది. పింఛన్ల సోమ్ము తీసుకునేందుకు వృద్ధులకు ఆగచాట్లు తప్పడం లేదు. సర్వర్లు మొరాయించడంతో వేలిముద్రలు తీసుకోవడం ఆలస్యం అవుతుండటంతో వృద్ధులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. దీంతో పింఛను పంపిణీ కేంద్రాల వద్ద లబ్ధిదారులు బారులుతీరుతున్నారు. ఒక్కోసారి రోజుల తరబడి తిరగాల్సి వస్తోందని లబ్ధిదారులు వాపోతున్నారు. ప్రతినెలా ఇదే తంతు నడుస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలో నిలబడాల్సి వస్తోందని వాపోతున్నారు. రోజంతా పింఛన్ కేంద్రం వద్ద ఉన్నా పింఛన్ డబ్బులు తీసుకుంటామన్న నమ్మకం లేదని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. తిప్పలు తప్పాలంటే నేరుగా ఖాతాలోకి వేయాలి రెండు, మూడు రోజులుగా పింఛన్ల కోసం తిరుగుతున్నా సర్వర్ సమస్యతో డబ్బులు తీసుకోలేకపోతున్నానని ఎస్వీనగర్‌కు చెందిన మోహన్‌రావు వాపోయారు. మరికొందరు ఉదయం 7 గంటలకు టిఫిన్ తీసుకొని వచ్చి పింఛన్ల డబ్బుల కోసం మధ్యాహ్నం వరకు అక్కడే ఉంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ తిప్పలు తప్పాలంటే తమకు బ్యాంకు ఖాతాల్లో జమ చేసేలా చూడాలని ఉన్నతాధికారులను లబ్ధిదారులు కోరుతున్నారు. జిహెచ్ఎంసీ పరిధిలో చాలా ప్రాంతాల్లో ఫించన్ డబ్బులను నేరుగా లబ్ధిదారుల ఖాతాలో వేస్తున్నారని మున్సిపాలిటీల్లోనూ ఇది అమలు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైన సంబంధిత అధికారులు స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు. -
ప్లీజ్.. దాతలు సహకరించండి
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని కూకట్‌పల్లికి చెందిన ధర్మేంద్ర మౌలి అనే నాలుగేళ్ల బాలుడు అరుదైన ‘టీ సెల్ లింపోబ్లాస్టిక్ ట్యుకేమియా’ అనే బ్లడ్ కేన్సర్‌తో బాధపడుతున్నాడు. ఈ వ్యాధి నుంచి బయటపడాలంటే బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీ చేయాలని వైద్యులు సూచించారని తండ్రి వీర నాగేంద్ర తెలిపారు. ఒక సూపర్ మార్కెట్లో చిన్న ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్న తాను బాబు చికిత్స కోసం ఉన్న డబ్బులన్నీ వెచ్చించానని, ప్రస్తుతం సర్జరీ చేయడానికి రూ.20 లక్షలు ఖర్చవుతాయని అన్నారు. చదవండి: సేవ చేయాల్సి వస్తుందని.. గొంతునులిమి తండ్రిని హత్య చేసిన కొడుకు ప్రస్తుతం జరగుతున్న చికిత్సకు నగరంలోని ఓ స్వచ్ఛంద సంస్థ సహకారం అందిస్తుందని, కానీ సర్జరీకి అవసరమైన డబ్బుల కోసం దాతల సాయం కావాలని కోరారు. బతుకుదెరువు కోసం పదేళ్ల క్రితం కాకినాడ నుంచి నగరానికి వచ్చానని, తాను సంపాదించిన డబ్బులతో తన బాబుకు చికిత్స అందించే అవకాశం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సహకారం అందించాలనుకునే దాతలు తన మొబైల్ నంబర్ 9642842896లో సంప్రదించాని బాలుడి తండ్రి కోరాడు. -
చిన్నారికి ఎమ్మెల్యే కోటంరెడ్డి చేయూత
నెల్లూరు రూరల్(నెల్లూరు జిల్లా): హార్ట్‌లో హోల్‌తో బాధపడుతున్న చిన్నారికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చేయూతనందించారు. బాలికకు ఆపరేషన్ విజయవంతమైంది. మంగళవారం చిన్నారితో పాటు తల్లిదండ్రులు నెల్లూరులోని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి చేరుకుని కోటంరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. శ్రీధర్‌రెడ్డి రూరల్ పరిధిలోని ఉప్పుటూరు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. చదవండి: బాగున్నావా అవ్వా..! ఈ సమయంలో గిరిజన కుటుంబానికి చెందిన పొట్లూరి స్నేహ అనే చిన్నారికి గుండె సమస్య ఉన్నట్లుగా ఆయన దృష్టికి వెళ్లింది. చిన్నారి తల్లిదండ్రులు తమ బాధను ఆయనకు చెప్పారు. స్పందించిన ఎమ్మెల్యే కారు ఏర్పాటు చేసి వారితోపాటు తన ప్రతినిధిని తిరుపతిలోని పెద్ద ఆస్పత్రికి పంపారు. చిన్నారి ఆపరేషన్ విషయమై అక్కడి వైద్యులతో కోటంరెడ్డి స్వయంగా మాట్లాడారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద స్నేహకు ఆపరేషన్ చేయగా విజయవంతమైంది. దీంతో చిన్నారి తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు. తన వద్దకు వచ్చిన స్నేహతో ఎమ్మెల్యే ఎంతో ఆప్యాయంగా మాట్లాడి దుస్తులు అందజేశారు. ఆ కుటుంబానికి తనవంతు సహకారం ఎల్లప్పుడు ఉంటుందని భరోసా ఇచ్చారు. -
అరుదైన వ్యాధితో బాధపడుతున్న ప్రముఖ నటుడు
ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. చాలాకాలంగా 'ఓనోమేటోమానియా’వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పారు. ఇది ఒక మానసిక వ్యాధి అని చెప్పొచ్చు. దీని కారణంగా కొన్ని పదాలు కానీ, సంభాషణలు కానీ మళ్లీ మళ్లీ చెప్పడం చేస్తుంటారు. ప్రస్తుతం ఈ అరుదైన వ్యాధితో సావాసం చేస్తున్నానని అన్నారు 71ఏళ్ల నసీరుద్దీన్ షా. గతంలో ఎన్నో అద్భుతమైన పాత్రలతో మెప్పించిన నసీరుద్దీన్ షా ఇటీవలె గెహ్రిహాన్ మూవీలో నటించారు. ఇందులో దీపికా పదుకొణె తండ్రిలా కనిపించారు. వీటితో పాటు ‘కౌన్‌బనేగా శిఖర్వతి’ వెబ్‌సిరీస్‌లోనూ నటించిన సంగతి తెలిసిందే. -
చెల్లిని మోసుకుంటూ వాగు దాటిన అన్న
చెన్నూర్ రూరల్: సరైన దారిలేక.. వర్షాకాలం లో వాగులు దాటలేక గ్రామీణ ప్రాంత ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ సమస్యతో ఒక్కోసారి ప్రాణాలూ కోల్పోతున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం నారాయణపూర్‌కు చెందిన నిట్టూరి ప్రవళికకు శనివారం ఫిట్స్ వచ్చాయి. ఆమెను ఆస్పత్రికి తరలించేందుకు కుటుంబసభ్యులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఇంటి నుంచి స్కూటీపై తీసుకొచ్చినా.. గ్రామ సమీపంలోని సుబ్బరాంపల్లి వాగుపై వంతెన లేక దాటడం కష్టంగా మారింది. అప్పటికే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించగా.. వాగు అవతలి ఒడ్డు వరకు వచ్చింది. ప్రవళికను ఆమె అన్న ప్రభాకర్ మోసుకుంటూ వాగు దాటి అంబులెన్స్ ఎక్కించాడు. చెన్నూర్ ప్రభుత్వ ఆసు పత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. -
27 ఏళ్లుగా పనిచేస్తున్నా జీతం రూ.22 వేలే..
సాక్షి, హైదరాబాద్: శాశ్వత ఉద్యోగులతో సమానంగా అన్ని విధులు, బాధ్యతలు నిర్వహిస్తున్నా నెలకు జీతం, డీఏ కలిపి రూ.22 వేలు మాత్రమే వస్తోందంటూ అటవీశాఖ టైమ్‌స్కేల్ ఉద్యోగులు వాపోతున్నారు. 1994 నుంచి ఒప్పంద పద్ధతిలో, 2009 నుంచి శాంక్షన్డ్ పోస్టుల్లో పనిచేస్తున్నా, ఇంక్రిమెంట్లు, హెచ్ఆర్ఏ తదితరాలేవీ వీరికి చెల్లించడం లేదు. ఉద్యోగులు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు, ఆఫీస్ సబార్డినేట్లు, డ్రైవర్లు ఇలా మొత్తం 88 మంది వివిధ కేటగిరీల్లో పనిచేస్తున్నా రు. వీరిలో 19 మందిని 2017లో క్రమబద్దీకరించడంతో వారికి శాశ్వత ఉద్యోగులకు చెల్లించాల్సి నవన్నీ చెల్లిస్తున్నారు. మిగతా వారికి అన్ని అలవెన్స్‌ల చెల్లింపు, క్రమబద్దీకరణకు సంబంధించి 2017లోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వీరి సర్వీసులను క్రమబద్ధీకరించవచ్చునని ఆర్థికశాఖ కూడా మూడేళ్ల క్రితమే ఆమోదం తెలిపింది. అయినా ఇప్పటికీ దానికి మోక్షం లభించలేదు. వీరిలో నలుగురు మరణించగా వారి కుటుంబాలకు ఎలాంటి పరిహారం అందలేదు. ఆరుగురు పదవీ విరమణ చేసినా రిటైర్మెంట్ ప్రయోజనాలు అందలేదు. మరో ఏడాదిలో 16 మంది అటెండర్లు, వాచ్మెన్లు రిటైర్ కానున్నారు. వీరికి సెలవుల వర్తింపు లేకపోవడంతో పాటు యూనిఫామ్ వంటి అలవెన్స్‌లూ వర్తించవు. తమకు న్యాయం చేయాలంటూ మంత్రులకుఅధికారులకు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించారు. అయినా ఇప్పటివరకు ఎలాంటి కదలిక లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. వీరు విధుల్లో చేరినప్పుడు బీట్ ఆఫీసర్ పోస్ట్‌కు కనీస విద్యార్హత పదోతరగతి కాగా, 2014 తర్వాత దానిని ఇంటర్‌కు మార్చడంతో వీరికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ఇంటర్ విద్యార్హత ఉన్న 19 మంది ఉద్యోగాలు అప్పట్లో రెగ్యులరైజ్ అయ్యాయి. తమకూ మినహాయింపులిచ్చి ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని వారు కోరుతున్నారు. -
రిమ్స్‌లో కాన్పు కష్టాలు
ఆదిలాబాద్ టౌన్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో అనస్తీషియా వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ప్రసవం కోసం చేరిన గర్భిణులు పురుటి నొప్పులతో అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం రిమ్స్ ఆస్పత్రిలోని ప్రసూతి వార్డులో 58 మంది గర్భిణులు ఉన్నారు. శుక్రవారం అనస్తీషియా (మత్తు) వైద్యులు విధులకు హాజరు కాకపోవడంతో ప్రసవాలు నిలిచిపోయాయి. అత్యవసరంగా ఏడుగురికి కాన్పులు జరగాల్సి ఉన్నా వైద్యులు స్పందించలేదు. దీంతో ముగ్గురిని వారి కుటుంబ సభ్యులు ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా మరో నలుగురు గర్భిణులు నొప్పులతో అవస్థలు పడుతూ ఆస్పత్రిలోనే ఉండిపోయారు. కాగా, దీనిపై ఆస్పత్రి ఇన్చార్జి డైరెక్టర్ కరుణాకర్‌ను సంప్రదించగా, ముగ్గురు మత్తు వైద్యులకు గాను ఇద్దరు అనారోగ్య కారణాలవల్ల సెలవులో ఉన్నారని, మరో వైద్యురాలు నైట్ డ్యూటీలో ఉన్నారని తెలిపారు. పెద్ద ప్రాణానికి ఏమవుతుందో: షౌకత్ మాది నార్నూర్ మండల కేంద్రం. గర్భిణి అయిన నా భార్య హసీనాకు కడుపు నొప్పి రావడంతో గురువారం రిమ్స్‌కు తీసుకొచ్చాను. ఆస్పత్రిలో స్కానింగ్ చేయించాము. కడుపులోనే పిండం చనిపోయిందని వైద్యులు చెప్పారు. చనిపోయిన పిండాన్ని డాక్టర్లు ఆపరేషన్ చేసి ఇంకా బయటకు తీయలేదు. ఎప్పుడు ఆపరేషన్ చేస్తారని అడిగితే మత్తు డాక్టర్ ఎప్పుడు వస్తే అప్పుడే అని వైద్య సిబ్బంది చెబుతున్నారు. దీంతో పెద్ద ప్రాణానికి ఏమవుతుందోనని ఆందోళనగా ఉంది. -
పల్లెల్లో పట్నం పేదల పాట్లు!
సాక్షి, హైదరాబాద్: పట్టణాల నుంచి గ్రామాలకు చేరుకున్న వారంతా నీళ్లు పడక జ్వరాల పాలవుతున్నారు. చాలామంది కూలీలు, చిరుద్యోగులు, చిన్న వ్యాపారులు పట్టణాల్లో సరైన ఉపాధి లేక, ఇంటి అద్దెలు కట్టలేక సొంత ఊళ్లో కలో, గంజో తాగి బతుకుదామని గ్రామాలకు చేరుకున్నారు. అయితే, వారిని అకాల వర్షాలు, వాతావరణంలో మార్పులతో జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి వంటి సమస్యలు చుట్టుముడుతున్నాయి. దీంతో అది కరోనా అనే ఆం దోళన చెందుతున్నారు. నీళ్లు పడకపోవడంతో సమస్యలు: పట్నాల్లో ఉన్నప్పుడు సురక్షితమైన నీరు అందుబాటులో ఉండడంతోపాటు మినరల్, ఫిల్టర్ వాటర్ వాడి న జనం పల్లెలకు వెళ్లిన తర్వాత అందుబాటులో ఉన్న నీటికి వెంటనే అలవాటు పడలేకపోతున్నారు. దీంతో గొంతు నొప్పి, జలుబు, జ్వరాలు పీడిస్తున్నాయి. గతంలో పండగకో, పబ్బానికో ఊళ్లకు వెళ్లినా మహా అయితే రెండు, మూడు రోజుల కంటే ఎక్కువగా ఉండేవారు కాదు. ఆ పరిస్థితికి భిన్నంగా ఇప్పుడు ఏకంగా నెలలు తరబడి ఉండాల్సి వస్తోంది. దీంతో అక్కడి వాతావరణం పడక అనారోగ్యం పాలవుతున్నారు. బయటకు చెప్పుకోలేక..: జ్వరం, గొంతునొప్పి లాంటి సమస్యలకు డాక్టర్ల సలహా ప్రకారం ఇంట్లోనే మందులు తీసుకుంటున్నవారు పక్కింటివారికి కూడా తెలియకుండా జాగ్రత్తపడుతున్నారు. జ్వరమొచ్చిందని తెలిస్తే ఎక్కడ వెలివేసినట్టు చూస్తారో లేక ఊళ్లో నుంచి వెళ్లిపొమ్మంటారేమోనన్న భయంతో ఇంటి నుంచి బయటకు రాకుండా గడుపుతున్నారు. కరోనా టెస్టులు చేయించుకోడానికి భయపడుతున్నారు. ‘గత పదేళ్లుగా హైదరాబాద్‌లోనే ఉంటున్నా. రోజూ లేబర్ అడ్డాల వద్ద దాదాపు 20 నుంచి 25 మంది ఉంటాం. అయితే కరోనా తగ్గుతుందేమోనని మూడు నెలలు ఎదురుచూసి ఈ మధ్యే మా సొంత ఊరికి వచ్చాం. తీరా ఇక్కడికి వచ్చినంక నీళ్లు, వాతావరణం పడక జ్వరం వచ్చింది. బయటకు ఎళ్లలేక, ఇంట్లనే ఉంటూ మందులు మింగుతున్న’ – మహబూబ్ నగర్‌కు చెందిన మాసన్న మినరల్ వాటర్ మేలు.. పల్లెలకు వెళ్లినప్పుడు కొద్ది రోజులపాటు మినరల్ వాటర్ వాడటం మేలు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. జ్వరం, గొంతు నొప్పి లాంటి లక్షణాలుంటే అశ్రద్ధ చేయకుండా కరోనా పరీక్ష చేయించుకోవాలి. – డాక్టర్ కిరణ్ మాదల, ప్రభుత్వ వైద్య కళాశాల, నిజామాబాద్ -
ఆపదలో ఆశల దీపం..
ఏడాదిన్నర వయసు.. ఆ పిల్ల మాట్లాడినా, అరిచినా, నవ్వినా, కాస్త నడిచినా ముచ్చటపడిపోవాల్సిందే. రోజంతా ఎంత కష్టపడినా ఆ బుజ్జాయి ముఖం చూస్తే చాలు తండ్రి ప్రాణానికి హాయి. దినమంతా ఎంత బాధగా గడిచినా ఆ చిన్నారి నవ్వు చూస్తే ఆ తల్లి మనసుకు స్వాంతన. అలాంటిది ఆ పాప ఇప్పుడు నవ్వలేకపోతోంది. నోరారా అమ్మా అని సరదాగా పిలవలేకపోతుంది. తోటి పిల్లలతో ఆడుకోలేకపోతోంది. అన్నింటికీ మించి ఆస్పత్రి మంచంపై చావుతో పోరాడలేకపోతోంది. కిడ్నీ ట్యూమర్‌తో బాధ పడుతున్న కుమార్తెను బతికించుకోవడానికి తల్లిదండ్రులు తోటివారి సాయం కోరుతున్నా రు. ఆర్థిక స్థోమత సరిపోవడం లేదని, ఆదుకోవాలని అర్థిస్తున్నారు. ఇచ్ఛాపురం రూరల్ (శ్రీకాకుళం జిల్లా): ఇచ్ఛాపురం మండలం కొళిగాం గ్రామానికి చెందిన యామన గోపాలకృష్ణ, చిట్టిపాప దంపతులు స్థానికంగా ఉపాధి లేకపోవడంతో కొన్నాళ్ల కింద ట బతుకు తెరువు కోసం హైదరాబాద్ వెళ్లిపోయారు. అక్కడే ఒక ఇల్లు అద్దెకు తీసుకుని బతుకుతున్నారు. దు స్తులు కుట్టే పని చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకువస్తున్నారు. ఈ దంపతులకు కోమలి, నోమశ్రీలు సంతానం. ఇద్దరు పిల్లలే లోకంగా ఆ దంపతులు ఉన్నంతలోనే సు ఖంగా రోజులు గడిపేస్తున్నారు. కానీ ఆ కాస్త ఆనందం కూడా వారిని నిలవలేదు. ఇరవై నెలల ముద్దుల చిన్నారి నోమశ్రీ అనారోగ్యం బారిన పడింది. విపరీతమైన జ్వరం, నీరసం రావడంతో రెండు నెలల పాటు ఆస్పత్రులన్నీ తిప్పారు. కొన్ని రోజులు జ్వరం తగ్గడం, మళ్లీ రావడంతో కేవలం ఆ వైద్యానికే రూ.లక్షల్లో ఖర్చయిపోయింది. చివరకు హైదరాబాద్‌లోనే ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లి చూపించగా పాప కిడ్నీ ట్యూమర్‌తో బాధపడుతోందని, వెంటనే వైద్యం చేయాలంటూ పిడుగులాంటి వార్త చెప్పడంతో తల్లిదండ్రులు హతాశుతులయ్యారు. అసలే వలస కుటుంబం, ఆపై సుమారు రూ.12లక్షల నుంచి రూ.15 లక్షల వరకు వైద్యానికి ఖర్చువుతుందంటూ వైద్యులు చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. స్థోమతకు మించిన సొమ్ము సర్దలేక సతమతమవు తున్నారు. విషయాన్ని తెలుసుకున్న శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పూండికి చెందిన ‘యువతరం సంస్థ’ అధ్యక్షుడు చింత మురళీ ముందుకు వచ్చి తమ సంస్థ ద్వారా కొంత ఆర్థిక సాయాన్ని అందించారని బాలిక తండ్రి గోపాలకృష్ణ తెలిపాడు. ప్రస్తుతం నెలన్నర రోజుల నుంచి ఆస్పత్రిలో పాపకు చికిత్స చేయిస్తున్నారు. ఏళ్ల తరబడి చికిత్స ఖర్చు తలకుమించిన భారం కావడంతో ఆ తల్లిదండ్రులు దాతల సాయం కోరుతున్నారు. మ నసున్న వారు స్పందించి తమ పాపకు ప్రాణభిక్ష పెట్టాల ని వేడుకుంటున్నారు. సాయం చేయాలనుకునే వారు సంప్రదించాల్సిన నంబర్లు గూగుల్ పే : 8985403107 ఫోన్ పే : 6303285103 ఆంధ్రాబ్యాంకు(తెలంగాణ): అకౌంట్ నంబర్ః 032710100178007 ఐఎఫ్ఎస్సీ కోడ్ః ఏఎన్080000327 -
స్వదేశానికి రప్పించాలని వేడుకోలు
-
కువైట్‌లో తెలుగువారి ఆర్తనాదాలు..
సాక్షి, నిజామాబాద్: బతుకు తెరువు కోసం కువైట్ వెళ్లిన తెలుగు రాష్ట్రాల వాసులు నరకయాతన అనుభవిస్తున్నారు. వారితో పాటు తమిళనాడు, బీహార్ వాసులు కూడా కరోనా ప్రభావంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని నిజామాబాద్, కామారెడ్డి, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల వాసులు ఐదు నెలలుగా జీతాలు లేక కువైట్‌లో కష్టాలు పడుతున్నారు. కరోనా నేపథ్యంలో రూముల్లోంచి బయటకు వెళ్లలేని దుస్థితి ఏర్పడింది. వసతులు లేక విలవిల్లాడుతున్నారు. కనీసం భోజనం, నీళ్లు ఇప్పించాలని ఆర్తనాదాలు చేస్తున్నారు. భారత్‌కు రప్పించాలని సెల్పీ వీడియోలు ద్వారా వేడుకుంటున్నారు. అక్కడ కంపెనీలు పట్టించుకోవడం లేదని ఆవేదన వెలిబుచ్చుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి స్వదేశానికి రప్పించాలని వేడుకుంటున్నారు. -
మర్కటాలకు మహాకష్టం
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: రాష్ట్రంలోనే అత్యధిక అటవీ ప్రాంతం కలిగి ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లాక్డౌన్ కారణంగా జనసంచారం తగ్గి వివిధ రకాల వన్యప్రాణుల పరిస్థితి మెరుగుపడగా, కోతులు మాత్రం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. చిరుతలు, ఎలుగుబంట్లు, దుప్పులు, జింకలు, అడవి దున్నలు, అడవి పందులు, కుందేళ్లు ప్రధాన రహదారుల సమీపంలో సైతం స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. వీటి పరిస్థితి ఇలా ఉంటే.. కోతు లు ఆహారం దొరక్క విలవిల్లాడుతున్నాయి. జిల్లాలో కోతులు అత్యధికంగా కొత్తగూడెం–మణుగూరు ప్రధాన రహదారి పక్కన మొండికుంట అటవీ ప్రాంతంలో, కొత్తగూడెం–ఇల్లెందు ప్రధాన రహదారి పక్కన, సారపాక అటవీ ప్రాంతంలో, పాల్వంచ–దమ్మపేట రహదారి పక్కన ములకలపల్లి అటవీ ప్రాంతంలో, కిన్నెరసాని డ్యామ్ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తుంటాయి. ఆయా ప్రాంతాల్లో ప్రయాణించేవారిలో అధికశాతం మంది కోతులకు నిత్యం ఆహార పదార్థాలను పెట్టేవారు. ఇలా జిల్లాలో సుమారు 20 వేల వరకు కోతులు వాహనదారులు అందించే పండ్లు, ఇతర ఆహార పదార్థాలపై ఆధారపడేవి. లాక్‌డౌన్‌తో జన సంచారం లేక కోతులు ఆహారం కోసం అలమటిస్తున్నాయి. కాగా.. ఈ ఏడాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అడవుల్లో అడవి మామిడి, ఇతర ఫలాలు ఆశించిన రీతిలో కాయలేదు. వాతావరణం అనుకూలించకపోవడంతో రైతుల మామిడి తోటల్లోనూ కాయలు అనుకున్నంతగా కాయలేదు. తునికి కాయలు కూడా అంతంతమాత్రంగానే లభిస్తున్నాయి. దీంతో ఆహారం కోసం కోతులు వివిధ రహదారులపై రోజూ ఎదురుచూస్తున్నాయి. కొన్ని చోట్ల జనావాసాల్లోకి వచ్చి అందిన తిండి ఎత్తుకెళుతున్నాయి. అడపాదడపా కొందరు జంతుప్రేమికులు ఆహారం అందిస్తున్నప్పటికీ అది పరిమితమే కావడంతో రోడ్లవెంబడి మర్కటాలు దీనంగా తిరుగుతున్నాయి. ఎవరైనా వస్తారేమో.. ఏదైనా ఇస్తారేమో అని ఆశగా చూస్తున్నాయి. వేసవి వల్ల అటవీ ప్రాంతాల్లో చిన్న చిన్న కుంటలు సైతం ఎండిపోవడంతో దాహార్తి తీర్చుకునేందుకు కూడా వీలులేకుండా పోయింది. ఆదుకుంటున్న జంతు ప్రేమికులు ఆహారం దొరక్క అవస్థలు పడుతున్న వానరాలను అడపాదడపా జంతు ప్రేమికులు ఆదుకుంటున్నారు. జంతువులను ఆదుకోవాలంటూ సోషల్ మీడియా ద్వారా పలువురు పిలుపునిస్తున్న నేపథ్యంలో స్థానికంగా ఉండే కొందరు అప్పుడప్పుడు కోతులకు కూరగాయలు, తినుబండారాలు, పండ్ల వంటి ఆహార పదార్థాలను అందిస్తున్నారు. కాగా.. కోతులు వేల సంఖ్యలో ఉండడం వల్ల జంతు ప్రేమికులు అందించే ఆహారం వాటికి ఏమాత్రం సరిపోవడంలేదు. దీంతో అర్ధాకలితోనే వానరాలు అలమటిస్తున్నాయి. అడవుల్లో తిండి దొరక్క కోతుల గుంపులు సమీపంలోని జనావాసాల్లోకి వచ్చి తినే పదార్థాలు ఎత్తుకుపోవడం, స్థానికులపై దాడి చేయడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో వానరాలకు ఆహారాన్ని అందించి ఆదుకోవాలని పలువురు జంతు ప్రేమికులు కోరుతున్నారు. -
ఎడారి దేశాల్లో వలసజీవి దిగాలు
సాక్షి, నెట్వర్క్ : కరోనా సృష్టించిన కల్లోలంతో వలసజీవులు అల్లాడిపోతున్నారు. ఎడారి దేశాల్లో అందివచ్చిన అవకాశాలతో ఉపాధి పొందుతున్న వారి కలలు కల్లలయ్యాయి. భవిష్యత్తుపై ఆశలు తడారిపోతున్నాయి. గల్ఫ్ దేశాలన్నింటా లాక్డౌన్ అమలవుతోంది. పనుల్లేవు. వేతనాల్లేవు. కంపెనీలే ఇంత కడుపు నింపుతున్నాయి. కొన్ని కంపెనీలు.. లాక్డౌన్ కంటే ముందు నుంచే వేతనాలివ్వలేదు. భవిష్యత్తు ఎలా ఉంటుంది?, ఉపాధి ఏమవుతుందోనని 20 రోజులుగా క్యాంపుల్లోనే ఉంటున్న కార్మికులు మానసిక వేదనకు గురవుతున్నారు. అందరిదీ ఒకేమాట.. స్వదేశీ బాట గల్ఫ్ దేశాల్లో మ్యాన్‌పవర్‌ను సరఫరా చేసే చిన్న కంపెనీలను యజమానులు ‘కరోనా’నెపంతో మూసివేస్తున్నారు. కార్మికుల వీసాలను రెన్యూవల్ చేయడం లేదు. ఈ నేపథ్యంలో కార్మికులు స్వదేశానికి వచ్చేయాలనే ఆలోచనతో ఉన్నారు. వీసా గడువున్న వారూ అదే యోచనతో ఉన్నారు. లాక్డౌన్ ఎత్తివేశాక మ్యాన్‌పవర్ కంపెనీలు కార్యకలాపాలను కొనసాగించినా కార్మికులు ఎక్కువ శాతం మంది అక్కడ ఉండడానికి ఇష్టపడట్లేదు. కరోనా మళ్లీ విజృంభిస్తుందేమోనని, స్వగ్రామంలో ఏదో ఒక పనిచేసుకోవడం మంచిదని భావిస్తున్నారు. పలువురు కార్మికులు స్వచ్ఛంద సంస్థలకు ఫోన్లుచేసి.. ‘విమానాలు ఎప్పటి నుంచి నడుస్తాయి?, అసలు మేం ఇండియాకు వెళ్తామా’ అని వాకబు చేస్తున్నారు. పరిస్థితులు సర్దుకుంటాయని వారు కార్మికుల్లో మనోధైర్యం నింపుతున్నారు. ఇక, గల్ఫ్‌లో మన కార్మికులే కాక వివిధ ఆఫీసుల్లో, సంస్థల్లో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉద్యోగులు, ఆర్థికంగా స్థిరపడిన కాంట్రాక్టర్లు కూడా స్వస్థలాలకు వచ్చేయడానికే మొగ్గుచూపుతున్నారు. ఇప్పటి వరకు సంపాదించుకున్నది చాలని, ఇక కుటుంబాలకు దగ్గర ఉండాలని అనుకుంటున్నారు. ఒమన్, ఖతార్, కువైట్, సౌదీఅరేబియా, యూఏఈ, బహ్రెయిన్ దేశాల్లో తెలంగాణకు చెందిన వారు సుమారు 15లక్షల మంది ఉంటారని అంచనా. ఇందులో బ్లూకాలర్ (కార్మికులు) 13లక్షలు, వైట్‌కాలర్ (ఉద్యోగులు) 2లక్షల మంది వరకు ఉంటారని ప్రవాసిమిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షుడు స్వదేశ్ పరికిపండ్ల తెలిపారు. చదవండి: ఉద్యోగులను తొలగించొద్దు ఖతార్‌లోని లేబర్ క్యాంపు వద్ద కార్మికులు దుర్భరంగా ఖల్లివెల్లి కార్మికుల జీవనం గల్ఫ్ దేశాలకు విజిట్వీసాలపై వెళ్లి గడువు ముగిసినా అక్కడే ఉండిపోవడం, కంపెనీ వీసాలపై వెళ్లి మరో కంపెనీలో చేరడం, రెసిడెన్సీ పర్మిట్ ముగిసినా రెన్యూవల్ చేసుకోకుండా ఉండిపోయిన వారిని ఖల్లివెల్లి కార్మికులుగా గుర్తిస్తారు. ప్రస్తుతం కంపెనీ క్యాంపుల్లో ఉన్న కార్మికులకు భోజన సదుపాయాలను కంపెనీల యాజమాన్యాలు ఏర్పాటు చేస్తున్నాయి. అయితే, ఖల్లివెల్లి కార్మికులకు చేయడానికి పనిలేకుండా పోయింది. దీంతో చేతిలో డబ్బులేక ఆకలితో అల్లాడుతున్నారు. ఇంటి అద్దె కట్టలేని పరిస్థితుల్లో కొందరు కార్మికులు అద్దె గదులను ఖాళీచేసి పార్కుల్లో తలదాచుకుంటున్నారు. దాతలందించిన ఆహార పదార్థాలతో కడుపు నింపుకుంటున్నారు. యూఏఈ: వేతనాల్లో కోత ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న యూఏఈ కంపెనీలు.. కార్మికుల వేతనాల్లో కోతపెట్టాయి. వేతనాల రివిజన్‌కు ఆ దేశ ప్రభుత్వం కంపెనీల యాజమాన్యాలకు అనుమతినిచ్చింది. దీంతో కంపెనీలు 25 నుంచి 50 శాతం వరకు వేతనాల్లో కోత విధించాయి. కొన్ని కంపెనీలు ఆర్థిక ఇబ్బందులతో ఇప్పటికే ఆరు నెలలుగా కార్మికులకు వేతనాలు చెల్లించడం లేదు. ఒమన్: ఉద్యోగాలకు దెబ్బ కరోనా దెబ్బతో నష్టాలను మూటగట్టుకుంటున్న ఒమన్ కంపెనీల్లో విదేశీ కార్మికుల ఉద్యోగాలు ఊడుతున్నాయి. ఇక్కడి తొమ్మిది గవర్నెన్స్‌లో ఒక మస్కట్లోనే లాక్డౌన్ అమలవుతోంది. మిగతాచోట్ల లాక్డౌన్ లేకున్నా.. కంపెనీలు ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్నాయి. విదేశీ కార్మికులను తొలగించాలనే నిర్ణయం గతంలోనే జరిగింది. ఇప్పుడీ ప్రక్రియ ఊపందుకుంది. ఖతార్: ఇంటిపని కార్మికుల ఇక్కట్లు ఖతార్‌లో ఒక్క ప్రాంతంలోనే లాక్డౌన్ అమల్లో ఉంది. కానీ, వైరస్ వ్యాప్తి భయంతో యజమానులు పనిలోకి రానివ్వకపోవడంతో లాక్డౌన్ లేని ప్రాంతాల్లో కూడా ఇంటిపని కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఇటువంటి వారికి సహాయం అందించడానికి ఖతర్ ప్రభుత్వం హెల్ప్‌లైన్ సేవలకు శ్రీకారం చుట్టింది. వారికి భోజన సదుపాయం కల్పిస్తోంది. మిగతా కంపెనీల్లోని కార్మికులకు యాజమాన్యాలే భోజన వసతి కల్పిస్తున్నాయి. కువైట్: ‘సెలవుల వేతనం’కట్ కువైట్‌లోని కంపెనీల్లో పనిచేస్తున్న కార్మికులకు ఏడాది, రెండేళ్లకు ఒకసారి ఇచ్చే సెలవులకు సంబంధించి ప్రభుత్వం కొత్త ప్రతిపాదన చేసింది. గతంలో కార్మికులు సెలవుపై ఇంటికెళ్తే ఆ సెలవుల వేతనం చెల్లించేవారు. ఇప్పుడు కరోనా సంక్షోభంతో సెలవు రోజుల వేతనానికి కోతపెట్టింది. బహ్రెయిన్: ముందే వదిలించుకుంది! పర్యాటక రంగంపై ఆధారపడిన బహ్రెయిన్.. కరోనా వైరస్ వ్యాప్తికి ముందే రెస్టారెంట్లు, బార్లు, పబ్‌ల్లో పనిచేసే విదేశీ కార్మికులను స్వస్థలాలకు పంపించింది. సెలవులపై ఇంటికి వచ్చిన కార్మికులు.. తమ వీసా గడువు పొడిగిస్తారా లేక రద్దుచేస్తారా తెలియక గందరగోళపడుతున్నారు. సౌదీ: బతుకులు బందీ సౌదీఅరేబియాలో సంపూర్ణ లాక్డౌన్ అమలవుతోంది. ఇక్కడి విదేశీ కార్మికులు కరోనా సమాచారం, ఈ కారణంగా తలెత్తిన పరిస్థితుల గురించి సోషల్ మీడియాలో పోస్టు చేయడంపై ఆంక్షలున్నాయి. దీంతో ఇక్కడ కార్మికులు తమ వెతలను చెప్పుకునే వీల్లేకుండాపోయింది. భయంభయంగా రోజొక యుగంగా.. నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రానికి చెందిన ఆనందం గంగేశ్ కువైట్‌లో పదేళ్లుగా బల్దియా కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం లాక్‌డౌన్‌తో లేబర్ క్యాంపులో ఉంటున్నాడు. ఇక్కడ పరిస్థితులు బాగాలేకపోవడంతో ఇంటికి వెళ్లాలని ఉందని అంటున్నాడు. లాక్డౌన్ ఎత్తేసిన తరువాత ఇంటికి పంపిస్తారో లేదో తెలియడం లేదని, రోజూ ఓ యుగంలా గడుపుతున్నానని అంటున్నాడు. ఇంటిపై బెంగ పెట్టుకున్నాడు. ఆశలు ఆవిరి.. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామానికి చెందిన గోపి గతేడాది ఖతార్ వెళ్లాడు. అతనికి కొన్ని రోజులు సరిగా పని దొరకలేదు. తినడానికి, రూమ్ అద్దెకు ఇబ్బందులు ఎదురయ్యాయి. తెలంగాణ గల్ఫ్ సమితి సాయంతో రెండు నెలల క్రితం ఓ చిన్న కంపెనీలో ఉద్యోగం దొరికింది. అంతలోనే కరోనా వైరస్ వ్యాప్తితో పనులన్నీ ఆపేశారు. నెల రోజులుగా గదిలోనే ఉంటూ బిక్కుబిక్కుమంటున్నాడు. సంపాదించింది చాలనుకుంటున్నా.. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం మల్లారం గ్రామానికి చెందిన గడ్డం వెంకటరమణారెడ్డి 15ఏళ్లుగా దుబాయ్‌లో ఉంటూ ఏసీకి సంబంధించిన ప్రముఖ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. మంచి జీతమే.. అయితే, ప్రస్తుతం కరోనాతో నెలకొన్న పరిస్థితులతో ఆయన స్వదేశానికి రావాలనుకుంటున్నాడు. ఇప్పటి వరకు సంపాదించింది చాలని, కుటుంబసభ్యులతో ఉండాలనుకుంటున్నట్టు చెప్పాడు. చూడాలని ఉంది.. మాది జగిత్యాల జిల్లా పోరుమళ్ల గ్రామం. ఖతార్‌లో 8ఏళ్లుగా భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నా. మార్చిలో నా కుమార్తె పెళ్లి. అదే నెల 25న నేను ఇండియాకు వెళ్లాల్సి ఉండె. కానీ, విమానాల్లేక ఆగిపోయాను. పెళ్లి వాయిదా పడింది. మళ్లీ విమానాలు ఎప్పుడు నడుస్తాయో?. -
ఆ కుటుంబాన్ని వెంటాడుతున్న డెంగీ
మంచిర్యాల టౌన్: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీశ్రీనగర్‌కు చెందిన గుడిమల్ల రాజయ్య కుటుంబాన్ని డెంగీ భూతం ఇంకా వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే డెంగీ వల్ల రాజయ్య కొడుకు గుడిమల్ల రాజగట్టు, కోడలు సోనీ, మనవరాలు శ్రీవర్షిణి కేవలం పదిహేను రోజుల వ్యవధిలోనే మృత్యువాత పడ్డారు. కొద్ది రోజుల క్రితం రాజయ్య రక్తాన్ని వైద్య సిబ్బంది సేకరించి పరీక్షించగా డెంగీ పాజిటివ్‌గా రిపోర్టు రావడంతో వారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ప్రస్తుతం తనకు డెంగీ సోకిన విషయం కూడా తెలియని రాజయ్య.. తన నాలుగు రోజుల మనవడితోపాటు పెద్ద మనవడు శ్రీవికాస్ ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నాడు. ఇప్పటికే ఆందోళనలో ఉన్న గుడిమల్ల కుటుంబ సభ్యులు.. శ్రీవికాస్కు శుక్రవారం మధ్యాహ్నం కడుపు నొప్పి రావడంతో ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆ బాలుడు ఆరోగ్యంగానే ఉన్నా.. ఎప్పుడు ఏమవుతుందోనని కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురవుతున్నారు. చిన్నారికి తగ్గిన ప్లేట్లెట్స్ సోనీ డెంగీతో చనిపోవడానికి ఒక్కరోజు ముందు జన్మించిన చిన్నారి ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో పుట్టినరోజు నుంచే ఐసీయూలో ఉంచారు. నాలుగు రోజుల ఆ చిన్నారిని మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కాగా శుక్రవారం ఆ చిన్నారికి సైతం ప్లేట్లెట్స్ తగ్గిపోవడంతో వెంటనే ప్లేట్‌లెట్స్‌ను ఎక్కించాలని వైద్యులు సూచించారు. దీంతో వారు దాతల సహకారం కోరగా, రామకృష్ణాపూర్‌కు చెందిన సురేశ్ ప్లేట్లెట్స్ అందించడానికి ముందుకొచ్చాడు. రెడ్‌క్రాస్ సొసైటీ వారు సైతం సామాజిక బాధ్యతలో భాగంగా రూ. 12 వేల విలువైన ప్లేట్లెట్స్, ఎఫ్ఎఫ్పీలను ఉచితంగా అందించి, ఆ చిన్నారికి ఆసరాగా నిలిచారు. -
మంచం పట్టిన బూరాడపేట
విష జ్వరాలు పెదబూరాడపేట, చినబూరాడపేట గ్రామాలను పట్టి పీడిస్తున్నాయి. సుమారు మూడు వారాలుగా ఇదే పరిస్థితి ఆయా గ్రామాల్లో నెలకొంది. గ్రామస్తులు జ్వరాల బారిన పడి ఆస్పత్రుల పాలవుతున్నారు. ఇలా జ్వరాలు ప్రబలడానికి ఆయా గ్రామాల్లో తాగునీరే కారణమని వైద్యులు చెబుతున్నారు. సాక్షి, నెల్లిమర్ల రూరల్: విష జ్వరాలతో పెద బూరాడపేట, చిన బూరాడపేట వాసులు మంచం పట్టారు. వర్షాకాలం, తాగునీటి కాలుష్యం వెరసి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. రెండు గ్రామాల్లోను ప్రజలు జ్వరం, దగ్గు, విరేచనాలతో పాటు, కీళ్ల నొప్పులు, కాళ్ల వాపులతో ఆస్పత్రుల పాలవుతున్నారు. సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రత్యేకాధికారుల జాడ కాన రావడం లేదు. గడిచిన పది రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. ఫలితంగా ప్రజలు రోగాలతో అల్లాడుతున్నారు. జ్వర పీడితులు మండల కేంద్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు వాపోతున్నారు. రెండు గ్రామాల్లో ఒక్కో కుటుంబం నుంచి ఇద్దరు మంచం పట్టి ఉన్నారు. దీంతో స్థానికులు బిక్కుబిక్కు మంటున్నారు .గడిచిన ఇరవై రోజుల నుంచి ప్రధానంగా కీళ్ల నొప్పులు, కాలు వాపుల సమస్యలతో బాధ పడుతున్నారు. రెండు గ్రామాల్లోనూ సుమారు 70మందికి పైగా ఈ సమస్యతో బాధపడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. నీటి కాలుష్యం వల్ల ఈ సమస్య ఏర్పడిందని వైద్యులు చెబుతున్నారు. గ్రామంలో మంగళవారం ఓ ప్రైవేటు ఆస్పత్రి నిర్వాహకులు స్వచ్ఛంధంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రోగులకు తనిఖీలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు. గ్రామంలో పలువురు యువకులు వైద్యాధికారులకు సమాచారం ఇవ్వడంతో కొండవెలగాడ పీహెచ్సీ సిబ్బంది వెంటనే గ్రామాన్ని సందర్శించి జ్వర పీడితుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కలుషిత నీటితోనే.. కలుషిత నీటిని తాగడం వలనే ప్రజలు రోగాల బారిన పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. ట్యాంక్ నుంచి తాగునీటి సదుపాయం ఉన్నప్పటికీ ప్రజలు ఆ నీటిని వినియోగించడం లేదు. సమీపంలో పంట పొలాల్లో ఉన్న బావి నీటినే తాగేందుకు వినియోగిస్తున్నారు. ఆ నీరు పూర్తిగా కలుషితమని వైద్యులు చెబుతున్నారు. గ్రామంలో తాగునీటి పైపులైన్లు కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. గతంలో మురుగు నీటి కాలువల నుంచి తాగునీటి పైపు లైన్లను ఏర్పాటు చేయడంతో ఆ నీరు కూడా కలుషితంగా మారింది. వైద్యాధికారి ఏమన్నారంటే... ఈ సమస్యపై స్థానిక పీహెచ్సీ వైద్యాధికారి ప్రశాంత్ రాజ్‌ను వివరణ కోరగా గ్రామంలో ఇప్పటికే సర్వే చేశామని గడిచిన 15 రోజుల నుంచి తరుచూ వైద్య తనిఖీలను చేపడుతున్నామన్నారు. ప్రస్తుతం గ్రామంలో జ్వరాలు అదుపులో ఉన్నాయని చెప్పారు. ట్యాంక్ నుంచి వాటర్ సరఫరా అవుతున్నప్పటికీ ప్రజలు కలుషిత బావి నీటిని వినియోగిస్తున్నారన్నారు. ప్రజలకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నామని తెలిపారు. అలాగే ప్రతి రోజు వైద్య సిబ్బంది గ్రామాల్లో అందుబాటులో ఉంటారన్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రజలు కాచి చల్లార్చిన నీటిని తాగాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. -
కోరలు చాస్తున్న డెంగీ..!
సాక్షి, విజయనగరం ఫోర్ట్: డెంగీ వ్యాధి కోరలు చాస్తోంది. రోజురోజుకూ రోగుల సంఖ్య పెరుగుతోంది. వైరల్ జ్వరాల వ్యాప్తి కూడా అధికంగానే ఉంది. అయితే మలేరియా వ్యాధి వ్యాప్తి మాత్రం గణనీయంగా తగ్గింది. ముఖ్యంగా మలేరియా వ్యాధి అధికంగా వ్యాప్తి చెందే గిరిజన ప్రాంతంలో వ్యాప్తి తగ్గడం గమనార్హం. మలేరియా వ్యాధి వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం చేపట్టిన ముందుస్తు చర్యలు వల్ల ఈఏడాది మలేరియా వ్యాప్తి గణనీయంగా తగ్గింది. సీజనల్ వ్యాధులు వచ్చిందంటే చాలు గిరిజన ప్రాంత ప్రజలు మలేరియా బారిన పడి మృత్యువాత పడేవారు. అయితే డెంగీ రోగుల సంఖ్య మాత్రం రోజురోజుకూ పెరుగుతోంది. జనవరి నెల నుంచి ఆగస్టు 25వ తేదీ వరకు నమోదైన రోగుల వివరాలు.. వ్యాధిపేరు రోగుల సంఖ్య జ్వరాలు 2,30,527 మలేరియా 60 డెంగీ 97 టైపాయిడ్ 820 డయేరియా 17,382 స్వైన్‌ఫ్లూ 20 కిటకిటలాడుతున్న ఆస్పత్రులు.. డెంగీ జ్వరాలతో పాటు వైరల్ జ్వరాలు వ్యాప్తి అధికంగా ఉండడంతో ఆస్పత్రులు జ్వర పీడితులతో కిటకిటలాడుతున్నాయి. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలతో పాటు జిల్లాలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యారోగ్యశాఖ అధికారుల లెక్కల ప్రకారం ఈ ఏడాది జనవరి నెల నుంచి ఆగస్టు 25వ తేదీ నాటికి 2లక్షల 30 వేలకు పైగా జ్వరాల కేసులు నమోదయ్యాయి. ప్రైవేట్ఆస్పత్రుల్లో రెండు లక్షల వరకు జ్వరాల కేసులు నమోదయ్యాయి. దోమల నివారణ మందు పిచికారీ.. గిరిజన ప్రాంతంలో ముందుస్తుగానే ఈ ఏడాది దోమల నివారణ మందు పిచికారీ చేశారు. అదేవిధంగా డెంగీ వ్యాప్తి ప్రాంతాల్లో 8 వారాల పాటు మలాథియాన్ పిచికారీ చేస్తున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో చేరిన డెంగీ రోగులకు వైద్యసిబ్బంది మెరుగైన వైద్యసేవలందిస్తున్నారు. అలాగే వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వదలని డెంగీ జ్వరాలు.. మెంటాడ: మండలంలోని వానిజ, గుర్ల, తమ్మిరాజుపేట గ్రామాల్లో డెంగీ జ్వరాలు ప్రబలాయి. చల్లపేట గ్రామానికి చెందిన సిరిపురపు అప్పలకొండ (40) డెంగీ లక్షణాలతో జిల్లా కేంద్రాస్పత్రిలో చికిత్స పొందుతోంది. అప్పలకొండ తన భర్తతో కలిసి రాజమండ్రి పనుల కోసం వలస వెళ్లి ఇటీవల గ్రామానికి వచ్చింది. మొదట జ్వరం రావడంతో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ నెల 24న చికిత్స పొందింది. జ్వరం తగ్గకపోవడంతో కుటుంబ సభ్యులు చికిత్స కోసం ఆమెను గజపతినగం తీసుకెళ్లారు. ఫలితం లేకపోవడంతో జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆమెను పరీక్షించి డెంగీతో బాధపడుతున్నట్లు గుర్తించారు. దీంతో చల్లపేట వాసులు ఆందోళన చెందుతున్నారు. -
పేదింటికి పెద్ద కష్టం
సాక్షి, పాలకొండ రూరల్: అసలే మధ్య తరగతి కుటుంబం. అటుపై రెక్కాడితే గానీ డొక్కాడని వైనం. ఇలాంటి పరిస్థితుల్లో ఆ కుటుంబంపై విధి చిన్నచూపు చూసింది. అంది వస్తాడని అనుకున్న చిన్న కుమారుడిపై బోన్ కేన్సర్ రూపంలో పంజా విసిరింది. ఆడుతూ పాడుతూ ఉండాల్సిన వయసులో ఆ కుర్రాడిని మంచా నికి పరిమితం చేసింది. బిడ్డను రక్షించుకునేం దుకు తల్లిదండ్రులను అప్పులపాలు చేస్తోంది. పాలకొండ పట్టణం కోరాడ వీధి సమీ పంలో నివాసముంటున్న జోగ ఎర్రంనాయు డు, లక్ష్మి దంపతుల మూడో కుమారుడు గంగరాం స్థానిక పెదకాపువీధి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. చదువుల్లో, క్రీడల్లో రాణిస్తున్న గం గారంకు మూడు నెలల కిందట వెన్ను, భుజం భాగంలో తీవ్రమైన నొప్పి రావడంతో తల్లిదండ్రులు తమ బిడ్డను శ్రీకాకుళం తీసుకువెళ్లి వైద్యపరీక్షలు నిర్వహించారు. భుజం లో ఎముక చిట్లి ఉంటుందని వైద్యులు భా వించి అందుకు తగ్గట్టుగా మందులు అందించారు. అయినప్పటికీ వ్యాధి నయం కాలేదు. దీంతో పాటు బిడ్డ శరీరంలో స్వల్ప మార్పులు రావడం తల్లిదండ్రులు గమనించారు. మెరుగైన వైద్యం కోసం మహాత్మాగాంధీ కేన్స ర్ ఆస్పత్రిలో చేర్చారు. దాదాపు రూ.3 లక్షలు ఖర్చుచేయడంతో తమ కుమారుడికి బోన్ కేన్సర్ ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న గంగా రాం తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. అల్లారుముద్దుగా పెంచుకున్న చిన్నకొడుకును ప్రాణాంతక వ్యాధి రోజు రోజుకూ కబళిస్తుండడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే గంగారాం కీమోథెరపీ చేయించుకునే పరిస్థితికి చేరుకున్నాడు. ఒక్కో ఇంజెక్షన్ రూ.3,500, తనకు అందిస్తున్న మాత్రలు రూ.1600 ఖర్చు చేయడం ఆ తల్లిదండ్రులకు తల కు మించిన భారమైంది. ఆటో నడుపుకుని కుటుం బాన్ని పోషిస్తున్న బాధితుడు గంగారాం తండ్రి ఎర్రంనా యు డు అప్పు చేసి కుమారుడిని రక్షించుకోవడానికి ఆపసోపాలు పడుతున్నారు. కళ్ల ముందే కుంగిపోతున్న కుమారుడి దయనీయ స్థితికి ఆ తల్లి తల్లడిల్లిపోతోంది. దాదాపు రూ.10 లక్షలు ఉంటే గానీ మెరుగైన వైద్యం, ఆపరేషన్లు చేయలేమని విశాఖకు చెందిన పికానికి ఆస్పత్రి వైద్యులు స్పష్టం చేశారని తల్లిదండ్రులు చెబుతుతున్నారు. మనసున్న మారాజులు ముందుకు వచ్చి తమ బిడ్డ ప్రాణాలు కాపాడేందుకు సహకరిస్తారని ఆర్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పాలకొండ ప్రభుత్వ బాలికల కళాశాల యాజమాన్యం కొంతమేర ఆర్థిక సాయం అందించింది. ఈ కోవలోనే మానవతా దృక్పథంతో సహకరించాలని ఆ తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. తమ దయనీయమైన పరిస్థితిపై ఆరా తీసేందుకు 9346877720, 7729055065 నంబర్లకు ఫోన్ చేయాలని, చెమర్చిన కళ్లతో అభ్యర్థిస్తున్నారు. -
ప్రతి క్షణమూ పోరాటమే
డిప్రెషన్ గురించి ఇదివరకు మాట్లాడారు దీపికా పదుకోన్. డిప్రెషన్లో ఉన్నప్పుడు ప్రతి రోజూ పోరాటమే అన్నారామె. డిప్రెషన్, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అనే విషయం గురించి దీపికా పదుకోన్ ఇటీవలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘‘డిప్రెషన్లో ఉన్నప్పుడు నా పరిస్థితి ఎలా ఉందో వివరించమంటే ‘పోరాటం’ అని చెబుతాను. ప్రతిక్షణమూ పోరాటమే. ఎప్పుడూ అలసిపోయినట్టు అనిపించేది. అయితే ఈ మధ్యన చాలా మంది బాధపడతుండటాన్ని కూడా డిప్రెషన్ అని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అసలు డిప్రెషన్ అంటే ఏంటే అర్థం చేసుకోవాలి. నేను డిప్రెషన్లో ఉన్నప్పుడు ఆ విషయాన్ని బయటకు చెప్పినప్పుడు నాకు చాలా రిలీఫ్‌గా అనిపించింది. నన్ను కిందకు తొక్కేస్తున్న బరువంతా తీసినట్టు.. మనసంతా చాలా తేలికగా అనిపించింది. ‘డబ్బు, పేరు, కావాల్సినవి అన్నీ ఉన్నాయి కదా ఇంకెందుకు డిప్రెషన్’ అని కొందరు వాదిస్తారు. డిప్రెషన్ అనేది మానసిక సమస్య. మన చేతుల్లో, మన కంట్రోల్లో లేని విషయం అని తెలుసుకోవాలి’’ అన్నారు. ప్రస్తుతం దీపికా పదుకోన్ ‘చప్పాక్, 83’ సినిమాలతో బిజీగా ఉన్నారు. -
బాబోయ్ దొంగలు
సాక్షి,నాగర్‌కర్నూల్ క్రైం: ఉమ్మడి జిల్లాలో ఇటీవల చోటుచేసుకుంటున్న పలు దొంగతనాలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. కురుమూర్తి ఆలయం, అచ్చంపేట ఉమామహేశ్వరం, కొత్తకోట మండ లంలోని పలు ఆలయాల్లో చోటుచేసుకుంటున్న హుండీల చోరీలు, ఇళ్లల్లో చోరీలతో మరింత భ యానికి గురవుతున్నారు. వేసవి ఉక్కపోతకు ఇళ్లలో పడుకోలేక.. ఆరుబయట నిద్రపోదామంటే ఒకింత ఆందోళనతో ప్రజలు జంకే పరిస్థితి నెలకొంది. తాళం వేసిన ఇళ్లే టార్గెట్ వేసవికాలం కావడంతో చాలామటుకు గ్రామాలు, పట్టణాల్లో ఇళ్లకు తాళాలు వేసి ఆరుబయట, ఇంటి మిద్దెలపై నిద్రిస్తుంటారు. కానీ, దొంగలకు ఇదే మంచి అవకాశంగా మారుతుంది. తాళం వేసిన ఇళ్లనే వారు టార్గెట్ చేసి దొరికిన కాడికి దోచుకెళుతున్నారు. ఇళ్ల యజమానులు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కష్టపడి దాచుకున్న సొమ్మును దొంగలు దోచుకెళ్లే అవకాశం ఉంది. ఇదిలాఉండగా, పార్లమెంట్ ఎన్నికల బందోబస్తులో పోలీసులు క్షణం తీరిక లేకుండా విధులు నిర్వహిస్తున్నారు. ప్రజలు తమ వంతుగా దొంగతనాల నివారణ కోసం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ∙వేసవి సెలవుల్లో దూరప్రాంతాలకు వెళ్లే వారు తమ ఇంటి అడ్రస్, ఫోన్ నంబర్‌ను పోలీస్ అధికారులకు తెలియజేస్తే అలాంటి ప్రాంతాలలో పోలీసులు నిఘా పెడతారు. ∙విహారయాత్రలకు వెళ్లేవారు ఇళ్లలో నగదు, బంగారం, వెండి వస్తువులు, ఆభరణాలు ఉంచొద్దు. బ్యాంకు లాకర్లలో భద్రపర్చుకోవాలి. ∙పని నిమిత్తం ఎవరైనా ఇంటికి తాళం వేసి వె ళ్లాల్సి వస్తే పక్కింటి వారికి చెప్పి వెళ్లాలి. ఇళ్లు తా ళం వేసి ఉంటే దొంగతనం జరిగే ఆస్కారం ఉంది. ∙ఇంటి ఆవరణ, కాలనీ పరిసరాలు, షాపింగ్ కాంప్లెక్స్‌లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. ∙మేడపై నిద్రించే వారు మెడలో బంగారు, వెండి ఆభరణాలు వేసుకోవద్దు. ∙ఇళ్లలో ఉక్కబోత నుంచి ఉపశమనం కోసం కిటికీలు, తలుపులు తెరిచి నిద్రపోవద్దు. అలా ఉండడం వల్ల కిటికీ పక్కన ఉంచే షర్ట్స్, ప్యాంట్లలో నుంచి పర్సులు, నగదు, సెల్ఫోన్లు చోరీ అయ్యే అవకాశం ఉంది. ∙అపరిచితులను నమ్మొదు. బంగారానికి మెరుగు పెడతామని వచ్చే వారికి విలువైన వస్తువులు ఇచ్చి మోసపోవద్దు. ∙మహిళలు బంగారు ఆభరణాలు ధరించి బయటికి, శుభకార్యాలకు వెళ్లాల్సి వస్తే మెడచుట్టూ కొంగు కప్పుకోవాలి. లేదంటే బైక్‌లపై వచ్చి చోరీ చేసే ఆస్కారం ఉంది. ∙తమ ఇంటి సభ్యుల సౌకర్యార్థం ఇంటి తాళాన్ని పరిసరాల్లో, కిటికీల పక్కన పెట్టవద్దు. దొంగలు వాటిని గుర్తించి దొంగతనం చేసే అవకాశం ఉంది. ∙వేసవి కావడంతో తాళం వేసిన ఇంటి ముందు వాహనాలు నిలపొద్దు. చోరీకి గురయ్యే అవకాశం ఉంది. జనసంచారం కల్గిన పార్కింగ్‌లలో వాహనాలు ఉంచాలి. ∙ఊళ్లకు వెళ్లే వారు ఇళ్లలో ఓ గదిలో లైట్ వేసి ఉం చితే మంచిది. రాత్రి వేళలో లైట్ వెలుగుతూ ఉం టే ఇంట్లో ఎవరో ఉన్నారని దొంగలు ఊహిస్తారు. ∙ఇంటి డోర్లకు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకోవడం సురక్షితం. అలాగే, ఇంటి గేట్లకు సైరన్లను బిగించుకోవాలి. అపరిచితులు గేటు డోర్లను ముట్టుకుంటే శబ్దం వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలి. ∙ఇంటి పరసరాల్లో అపరిచిత వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. ఏదైనా సమాచారాన్ని అందించాలి అనుకుంటే 100 నంబర్‌కు డయల్ చేయాలి. -
పట్టిపీడిస్తున్న ఫ్లోరైడ్ రక్కసి
-
నడవలేని స్థితిలో జయసూర్య..!
సనత్ జయసూర్య... శ్రీలంక మాజీ కెప్టెన్‌గానే కాకుండా ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్న వ్యక్తిగా అందరికీ తెలుసు. ఒకానొక సమయంలో అంతర్జాతీయ క్రికెట్లో బౌలర్లకు చుక్కలు చూపించిన జయసూర్య ఇపుడు అనారోగ్యంతో ఎవరూ ఊహించని రీతిలో బాధపడుతున్నాడు. మోకాలి గాయం కారణంగా జయసూర్య నడవలేని స్థితిలో ఉన్నాడు. స్ట్రెచర్స్ లేనిదే జయసూర్య అడుగులు వేయలేని పరిస్థితిలో ఉన్నాడు. ఈ క్రమంలో చికిత్స నిమిత్తం జయసూర్య త్వరలో ఆస్ట్రేలియా వెళ్లనున్నాడు. మెల్బోర్న్లో ఆయన మోకాలికి ఆపరేషన్ చేయించుకోనున్నాడు. శస్త్రచికిత్స అనంతరం జయసూర్య కోలుకోవడానికి కనీసం నెలరోజుల సమయం పడుతుందని.. అప్పటి వరకు ఆయన డాక్టర్ల పర్యవేక్షణలో ఉండనున్నారు. శ్రీలంక క్రికెట్లో అత్యంత సక్సెస్ఫుల్ ఆటగాడైన జయసూర్య.. తన కెరీర్లో ఎన్నో విజయాలు అందుకున్నాడు. టెస్టుల్లో 6973 పరుగులు, 98 వికెట్లతో ఆల్ రౌండ్ ప్రదర్శన కనబర్చిన జయసూర్య వన్డేల్లో 13430 పరుగులు, 323 వికెట్లు పడగొట్టాడు. టీ20 ల్లో అతను 629 పరుగులు చేసి 19 వికెట్లు తీసుకున్నాడు. 1996లో శ్రీలంక వరల్డ్ కప్ గెలవడంలో జయసూర్య కీలక పాత్ర వహించాడు. శ్రీలంక క్రికెట్ బోర్డుకు జయసూర్య రెండుసార్లు సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా కొనసాగాడు. అయితే 2017 లో సౌతాఫ్రికా, భారత్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో లంక జట్టు పేలవమైన ప్రదర్శన కనబర్చడంతో జయసూర్య సెలెక్షన్ కమిటీ చైర్మన్ పదవికి గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. -
ఆశ.. నిరాశల మధ్య..
కష్టాలొస్తే... కన్నీళ్లొస్తాయి. ఆమెకు మాత్రం ఆ కన్నీళ్లే రక్తధారలవుతాయ్..స్వేదం.. రుధిర బిందువులుగా మారుతుంది. వైద్యులకే అంతుచిక్కని ఈ వింత వ్యాధితో ఆ యువతి నరక యాతన అనుభవిస్తోంది. తాత్కాలిక మందుల సేవనంతోనే జీవన పయనం సాగిస్తోంది. గాజుబొమ్మలా మారిన తన జీవన పయనం సాగేదెలా అంటూ దాతల సాయం కోసం వేయికళ్లతో ‘ఆశ’గా ఎదురుచూస్తోంది. ఇది ఒక వైపు.. మరోవైపు..ఆశ అక్క మేరీరత్నం ప్రభుత్వ నిధులతో ప్రారంభించిన పక్కా భవన నిర్మాణం నిధుల లేమితో అసంపూర్తిగా మిగిలిపోయింది. అక్కున చేర్చుకున్న బావ ఇటీవల బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇంటికే పరిమితమయ్యాడు. డిగ్రీ చదువుకోవల్సిన అనూష ఇదే బైక్ ప్రమాదంలో ఎడమ చేయి విరిగి చదువు మానేసి ఇంటి వద్దే ఉంటోంది. అక్క కొడుకు వీసా ప్రయత్నంలో మరో అక్క మేరీరత్నం ఎడమ కాలు విరిగిపోయింది. ఇంటర్ చదువుతున్న అక్క కొడుకు కుటుంబపోషణ కోసం ఆటో డ్రైవర్‌గా మారాడు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఆ కుటుంబాన్ని కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. మర్రిపూడి (రంగంపేట): మర్రిపూడి గ్రామానికి చెందిన గంధం ఆశ. జన్మనిచ్చిన తల్లిదండ్రులు కామరాజు, దయామణిలు ఐదేళ్ల క్రితం తనువులు చాలించారు. ఆదరించాల్సిన అన్నలిద్దరూ ఆ ఏడాదే ఊరువిడిచి వెళ్లిపోయారు. కనీసం ఎక్కడ ఉన్నారో తెలియని దుస్థితి. ముగ్గురు అక్కల్లో రెండో అక్క ఏడిద ఎలుసమ్మ మర్రిపూడిలో నివాసం ఉంటూ ఐదేళ్ల నుంచి చెల్లి ఆశ(22)ను ఆదరిస్తోంది. తన చెల్లికి అంతుచిక్కని రోగంతో అన్ని అవయవాల నుంచి స్వేద రక్తంలా కారుతుంటే ఆమె తిరగని ఆసుపత్రి అంటూ లేదు. మరోవైపు మూడో అక్క మేరీరత్నం కూడా దుబాయిలో పనిచేస్తూ కుటుంబపోషణకు సొమ్ములు పంపేది. ఆశ శరీరం నుంచి రక్తం కారుతుండడంతో ప్రస్తుతం రాయవెల్లూరులో వైద్య పరీక్షలు చేసి రోగాన్ని గుర్తించడానికి సుమారు రూ.15–20 లక్షల వ్యయమవుతుందని వైద్యులు చెబుతున్నారు. అంత ఖర్చు పెట్టే స్థోమత వారికి లేక తాడేపల్లిగూడేనికి చెందిన వైద్యులు పల్లా వెంకటేశ్వరరావు వద్ద ఉచితంగా ఇచ్చే హోమియో మందులు వాడుతూ, తాత్కాలిక ఉపశమనం పొందుతోంది. చెల్లి ఆశ బాధను చూడలేక దుబాయ్ నుంచి సుమారు పది నెలల క్రితం వచ్చిన మేరీరత్నం సుమారు రూ.ఐదు లక్షలు అప్పు చేసి, ప్రభుత్వ మిచ్చిన గృహ నిర్మాణ నిధులు రూ.38 వేలతో పక్కా భవనానికి శ్లాబ్ వేయించగలిగింది. ఆశ ఉండేందుకు వీలుగా గృహనిర్మాణం పూర్తి కావడానికి మరో రూ.రెండు లక్షలు అవసరం ఉంటుంది. మరోవైపు బావ నాగేశ్వరరావు, వీరి కుమార్తె అనూష ప్రమాదాల బారినపడి ఇంటికే పరిమితమై అర్ధాకలితో అలమటిస్తున్నారు. అక్క కొడుకు సుబ్రహ్మణ్యం ఆటో నడిపి తెచ్చే కాస్త సొమ్ముతో తొమ్మిది మంది కడుపు నింపుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దాతలు దయ చూపాలి.. చెల్లికి మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో శతవిధాలా శ్రమిస్తున్నా. మా అక్క ఎలుసమ్మ, బావ నాగేశ్వరరావులు ఆమెను ఆదరిస్తున్నారు. వాళ్లు కష్టాల్లో ఉన్నారు. వారికి భారం కాకుండా చెల్లిని అసంపూర్తిగా ఉన్న భవనంలోనే ఉంచి సపర్యలు చేస్తున్నారు. డబ్బు సంపాదనకు మళ్లీ దుబాయ్ వెళతాను. కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో వారం రోజుల పాటు ఉంచినా ఫలితం కానరాలేదు. కనీసం రూ.20 లక్షలు ఉంటే గాని, వైద్య పరీక్షలు చేయించలేం. దాతల సాయం తప్ప వేరే గత్యంతరం లేదు. – కాలు విరిగి మూల పడ్డ మూడో అక్క మేరీ రత్నం మంచానికి పరిమితమయ్యా.. చిన్నప్పటి నుంచి చదువుకోవాలని, అందరిలానే తిరగాలని, ఆరోగ్యంగా గడపాలని ఉన్నా, అంతు లేని అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యాను. మాకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణం మంజూరు చేస్తే, అక్క పిల్లల సహకారంతో కిరాణా వ్యాపారం చేయాలని ఉంది. దాతలు, అక్కలు దయ చూపితే మెరుగైన వైద్యసేవలు పొందాలని ఆశ పెంచుకున్నాను. – మంచానికే పరిమితమైన ఆశ ప్రతిపాదనలు పంపాం.. ఆశ గృహనిర్మాణానికి ప్రభుత్వ గృహ నిర్మాణ సంస్థ ద్వారా నిధులు విడుదలకు, మెరుగైన వైద్య సేవల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. నిధులు విడుదల చేయాల్సి ఉంది. – ఎం.కృష్ణమూర్తి, తహసీల్దార్, రంగంపేట దాతల సాయం కోసం ఎదురు చూస్తున్న ఆశ, ఆమె కుటుంబ సభ్యులు -
ఈ చిన్నారిని ఆదుకోరూ..
గార్ల: తమ చిన్నారి కాలేయ వ్యాధితో బాధపడుతోందని, లివర్ ప్లాంటేషన్ కోసం రూ.25 లక్షలు ఖర్చవుతాయని వైద్యులు చెప్పారని, ఆర్థిక సాయం చేసి తమ చిన్నారిని అదుకోవాలని మూడున్నరేళ్ల సౌజన్య తల్లిదండ్రులు అర్థిస్తున్నారు. మహబూబాబాద్ గార్ల మండలం రామాపురానికి చెందిన మేడేపల్లి సతీష్, మమత దంపతుల కుమార్తే సౌజన్య కాలేయ వ్యాధితో బాధపడుతోంది. అనేక ఆస్పత్రులలో చూపించి చాలా వరకు ఖర్చు పెట్టారు. అయినా వ్యాధి నయం కాలేదు. క్షౌర వృత్తితో రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో సతీష్ చాలా చోట్ల అప్పులు చేశాడు. అయినా వ్యాధి నయంకాక మరింత ముదిరింది. ఈ క్రమంలో హైదరాబాద్ కేర్ ఆస్పత్రిలో చూపించగా రెండు నెలల వ్యవధితో లివర్ ప్లాంటేషన్ ఆపరేషన్ చెయ్యాలని సుమారు రూ.25 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నరవుతున్నారు. ఆర్థిక సాయం కోసం ఇటీవల మంత్రి కేటీఆర్ ను కలవగా హామీ ఇచ్చారని, అయితే అది కార్యరూపం దాల్చలేదని చిన్నారి తల్లిదండ్రలు వాపోయారు. దాతలు సాయం చేసి తమ బిడ్డకు ప్రాణబిక్ష పెట్టాలని వారు వేడుకుంటున్నారు. -
వెలి చిచ్చు
తణుకు: ఇరువర్గాల మధ్య తలెత్తిన పొలం తగాదా రెండు కుటుంబాల్లో చిచ్చు రేపింది. టీడీపీ నాయకుల ఒత్తిళ్లతో పోలీసులు కేసులు నమోదు చేశారు. రెండేళ్లుగా రెండు కుటుం బాలను గ్రామస్తులు వెలి వేశారు. దీంతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోగా, మరో కుటుంబం భయంతో కాలం వెళ్లదీస్తోంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ వ్యవహారం టీడీపీ నేతలు తలదూర్చడంతో జటిలమైంది. వివరాలిలా ఉన్నాయి.. తణుకు మండలం మహాలక్షి్మచెరువు గ్రామానికి చెందిన గూడూరి కొండయ్య, గూడూరి శ్రీనివాస్‌లు అన్మదమ్ములు. మూడు దశాబ్దాలుగా ఈ గ్రామంలో కొద్దిపాటి పొలాన్ని సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో 2015లో పొలం పంచుకునే విషయంలో వివాదం తలెత్తింది. గ్రామ పెద్దలు రాజీ చేసేందుకు యత్నించారు. అయితే శ్రీనివాస్‌కు చెందాలి్సన పొలాన్ని ఆయన భార్య సత్యవతి పేరున రాయాలని ఆమె కుటుంబ సభ్యులతోపాటు గ్రామ పెద్దలు ఒత్తిడి తెచ్చారు. దీనికి కొండయ్య, శ్రీనివాస్ నిరాకరించడంతో అదేరోజు రాత్రి గ్రామానికి చెందిన పది మంది వ్యక్తులు కొండయ్య, సూర్యావతి దంపతులపై దాడి చేసి విచక్షణారహితంగా కొట్టారు. దీనిపై కొండయ్య దంపతులు తణుకు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామస్తులపై ఫిర్యాదు చేసినందుకు గాను కొండయ్య, శ్రీనివాస్ కుటుంబాలను గ్రామ పెద్దలు వెలివేశారు. అనంతరం శ్రీనివాస్ భార్య సత్యవతి పుట్టింటికి వెళ్లిపోయింది. టీడీపీ నాయకుల హస్తం కొండయ్య, శ్రీనివాస్ కుటుంబాలను వెలి వేయడంలో తెలుగుదేశం పార్టీ నాయకుల హస్తం ఉందని బాధితులు ఆవేదన చెందుతున్నారు. ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సహకారంతో గ్రామ సర్పంచ్ భర్త, మండల టీడీపీ అధ్యక్షుడు పితాని మోహనరావు కేసు ఉపసంహరించుకోవాలని పలుమార్లు తమపై ఒత్తిడి తీసుకువచ్చారని కన్నీటì æపర్యంతమయ్యారు. ఇదిలా ఉండగా కొండయ్య దంపతులు పెట్టిన కేసుకు ప్రతిగా కొండయ్య తండ్రి చినవీరన్నతో గ్రామ పెద్దలు మరో కేసు పెట్టించారు. చినవీరన్న భార్యపై కొండయ్య, శ్రీనివాస్ దాడి చేసి ఆమె మెడలోని మంగళసూత్రం తెంచుకుపోయారని కేసు బనాయించారు. ఈ కేసు విషయమై పిలిచేందుకు కానిస్టేబుల్ ఇంటికి రావడంతో మనస్తాపం చెందిన కొండయ్య పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. బాధితుడిని ఆçస్పత్రిలో చేర్చి చికిత్స చేయించిన అనంతరం అతనిపై ఆత్మహత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేసి 15 రోజులపాటు రిమాండ్‌కు తరలించారు. అలాగే శ్రీనివాస్ భార్య సత్యవతితో కూడా గ్రామపెద్దలు కట్నం వేధింపుల కేసు పెట్టించారు. అయితే కొండయ్య దంపతులు గ్రామ పెద్దలపై పెట్టిన కేసును కొట్టేయడంతో గతేడాది నవంబర్ 22న కోర్టులో మరోసారి ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన కోళ్ల ఏడుకొండలు, పాల ఏడుకొండలు, పాలా శ్రీను, కండిబోయిన సత్తిబాబు, కండిబోయిన ఏడుకొండలు, కండిబోయిన దానయ్య, కండిబోయిన శివ, కండిబోయిన బాలాజీ, కండిబోయిన వీరన్న, పాలా శ్రీనివాసుపై కొండయ్య దంపతులు ఫిర్యాదు చేశారు. శ్రీనివాస్ ఆత్మహత్య వెలి వేసినప్పటి నుంచి కొండయ్య, శ్రీనివాస్ కుటుంబాలు పలు ఇబ్బందులు పడుతున్నాయి. గ్రామంలోని దుకాణాల్లో కిరాణా సరుకులు కూడా ఇవ్వకపోగా ఈ కుటుంబాలతో ఎవరూ మాట్లడకూడదని మైక్ ద్వారా కూడా ప్రచారం చేయించారు. ఈ నేపథ్యంలో మనస్తాపం చెందిన శ్రీనివాస్ ఈ ఏడాది మార్చి 25న పురుగు మందు తాగాడు. బాధితుడిని 108లో తరలించడానికి కూడా గ్రామస్తులు అడ్డుకున్నారు. ఎట్టకేలకు తణుకు ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరుసటి రోజు శ్రీనివాస్ మృతి చెందాడు. మృతదేహాన్ని చూసేందుకు, కనీసం కుటుంబ సభ్యులను పలకరిం చేందుకు సైతం ఎవరినీ రాకుండా పెద్దలు అడ్డుకున్నారు. ప్రస్తుతం గ్రామంలో ఉంటున్న కొండయ్య దంపతుల పరిస్థితి దుర్భరంగా మారింది. ఇటీవల కేబుల్ కనెక్షన్ తొలగించడంతో విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో తిరిగి పునరుద్ధరించారు. మరోవైపు విద్యుత్ కనెక్షన్ కూడా తొలగించేందుకు విద్యుత్‌శాఖ సిబ్బంది ప్రయత్నించారు. పొలంలో పనులు చేసే కూలీలను కూడా అడ్డుకుంటున్నారని వీరు ఆవేదన చెందుతున్నారు. రూ.లక్ష జరిమానా చెల్లించి తప్పు ఒప్పుకోవాలని తమపై పెద్దలు ఒత్తిడి చేస్తున్నారని బాధితులు ఆవేదన చెందుతున్నారు. గ్రామ పెద్దలే కారణం మా కుటుంబాలకు జరి గింది అన్యాయమని గ్రా మమంతా తెలిసినా ఎవ్వరూ మాకు న్యా యం చేయడం లేదు. గ్రామ పెద్దల కారణంగానే నా సోదరుడు శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నాడు. నేను కూడా ఆత్మహత్యకు యత్నించాను. పోలీసులకు కూడా మాకు జరిగింది అన్యాయమని తెలుసు. టీడీపీ నాయకుల ఒత్తిళ్లతో వారు ఏమీ చేయలేకపోతున్నారు. – గూడూరి కొండయ్య, బాధితుడు, మహాలక్షి్మచెరువు రెండేళ్లుగా వెలిలోనే.. మాపై దాడి చేసిన గ్రామ పెద్దలు తిరిగి మాపై అక్రమ కేసులు బనాయించి గ్రామంలో వెలి వేశారు. రెండేళ్లుగా వెలిలోనే బతుకుతున్నాం. పెద్దల మాట వినలేదని, వీరి తీర్పునకు కట్టుబడలేదని మమ్మల్ని వెలి వేశారు. మానవ హక్కుల కమిషన్‌కు మొర పెట్టుకున్నా న్యాయం జరగడం లేదు. – గూడూరి సూర్యావతి, బాధితురాలు, మహాలక్షి్మచెరువు -
మృత్యువుతో పోరాటం
బోన్‌మేరో వ్యాధితో బాధపడుతున్న చిన్నారి సాయం కోసం తల్లిదండ్రుల ఎదురుచూపు కంబాలచెరువు : ఆ చిన్నారికి వచ్చిన రోగానికి కొద్ది రోజుల్లో చికిత్స చేయకపోతే పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదం ఉంది. వైద్యం చేయించేందుకు ఆ పాప తల్లిదండ్రుల చేతిలో చిల్లిగవ్వ లేదు. ఏం చేయాలో పాలుపోని స్థితిలో వారు కొట్టుమిట్టాడుతున్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంతో దాతల సాయం అర్థించారు. రాజానగరం మండలం నందరాడ గ్రామానికి చెందిన మరుకుర్తి దుర్గారావు వికలాంగుడు. ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్న అతడికి భార్య లోవకుమారి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరిలో ఒక పాప ఆనందిని సురక్షకు అనారోగ్యం సోకింది. స్థానిక వైద్యులకు చూపించారు. వారు పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లమని సూచించడంతో లవ్ అండ్ కేర్ సొసైటీ అధ్యక్షుడు అవ్వారు జయరాజు, శాంతిల సాయంతో వైద్యులకు చూపించారు. తమిళనాడులోని క్రిస్టియన్ మెడికల్ కళాశాల ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అక్కడి వైద్యులు ఆమెకు బోల్మేరో వ్యాధి సోకినట్టు నిర్థారించారు. దీనికి సుమారు రూ.40 లక్షల వరకూ ఖర్చవుతుందని చెప్పారు. ఏం చేయాలో తెలియని ఆ చిన్నారి తల్లిదంద్రులు తిరిగి ఇంటికి వచ్చేశారు. వీరి పరిస్థితి తెలిసిన రాజానగరంలోని కృషి ఇంగ్లిష్ మీడియం స్కూలు విద్యార్థులు కొంత ఆర్థిక సాయం అందజేశారు. ప్రస్తుతం ఆమె జీఎస్ఎల్ ఆసుపత్రిలో చికిత్సపొందుతోంది. రోజుకు రూ.8 వేలు ఖర్చవుతుందని, కొద్ది రోజుల్లో చికిత్స చేయకపోతే పాప దక్కదని వైద్యులు చెప్పారని ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. దాతలు ముందుకు వచ్చి తమ కుమార్తెను కాపాడాలని అభ్యర్థిస్తున్నారు. దాతలు ఎస్బీహెచ్ అకౌంట్ నంబర్ 62398326449కు ఆర్థిక సాయం అందించాలని, లేదా 9849684252 ద్వారా గానీ సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. -
చేతుల్లో చిల్లిగవ్వలేక జనం విల విల
-
‘బొబ్బర’తో బెంబేలు
మధిర: మిరపతోటల్లో ఇటీవల బొబ్బర తెగులు తీవ్రంగా వ్యాపిస్తోంది. జెమినీ వైరస్ ఆశించి పంట ఎదుగుదలను చంపేస్తోంది. ఆకులపై బొబ్బలు ఏర్పడి, పత్రాలన్నీ పసుపు రంగులోకి మారుతున్నాయి. తెల్లదోమ ఆశించడంవల్లే ఈ విధంగా జరుగుతోందని రైతులు వాపోతున్నారు. దీని నివారణ కోసం రైతులు క్రిమి సంహారక మందుల పిచికారీకి ఇప్పటికే ఎకరానికి రూ.20వేలకు పైగా ఖర్చుపెట్టారు. దీనికి తోడు మిరపతోటకు వివిధ రకాల చీడపీడలు, దోమ ఆశిస్తుండడంతో మిరపతోటల ఎదుగుదల లోపిస్తోంది. జోరుగా వర్షం కురుస్తున్నప్పటికీ ఈ బొబ్బరరోగం నివారణకు పురుగుమందులను పిచికారీ చేయాల్సి వస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. మధిర మండల పరిధిలోని నిదానపురం గ్రామంలో మిరప తోటల్లో ఈ తెగుళ్ల పీడ తీవ్రంగా ఉంది. పలు గ్రామాల్లో జెమినీ వైరస్ వ్యాపిస్తోంది. పంట వాడిపోయినట్లు మారిపోతుండడంతో వేలాది రూపాయల పెట్టుబడి పెట్టిన రైతులు దిగాలు చెందుతున్నారు. ఆశలు ఆవిరి.. l ఖరీఫ్‌లో ఎన్నో ఆశలతో మిర్చి పంట వేసిన రైతులు ఇప్పుడు తెగుళ్లతో బెంబేలెత్తుతున్నారు. l బొబ్బర తెగులుతో ఆకులన్నీ రోజుల వ్యవధిలోనే రంగు మారి పాలిపోతుంటే గుండెధైర్యం కోల్పోతున్నారు. l పచ్చగా నిగనిగలాడాల్సిన తోట..పాలిపోతోంది. l ఈ తెగుళ్ల నివారణకు ఇంకా పురుగులమందు పిచికారీ భారం పడే అవకాశాలు ఉన్నాయి. l బొబ్బర తెగుâýæ్ల పంటలను వ్యవసాయాధికారులు పరిశీలించాలని రైతులు కోరుతున్నారు. l బోర్లు, బావులను అద్దెకు తీసుకొని, జనరేటర్లు, డీజిలింజన్ల ద్వారా మొన్నటిదాకా తడులు కట్టారు. l ఇప్పుడు తెగుâýæ్లతో పంట చేతికందకుంటే.. నష్టపోతామని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలి.. ఖరీఫ్‌లో ఎకరం భూమిని కౌలుకు తీసుకొని మిర్చిపంట వేశా. బొబ్బర రోగం వచ్చి ఆకులన్నీ ముడుచుకుపోతున్నాయి. పసుపు రంగులోకి మారుతున్నాయి. కౌలు రైతులకు బ్యాంకుల ద్వారా ప్రభుత్వమే రుణాలు మంజూరు చేయాలి. ఈ సారి పెట్టుబడి ఎకరానికి రూ.2లక్షలకుపైగా అవుతుందేమోనని భయపడుతున్నాం. ప్రైవేట్ వ్యాపారులు దోచుకుంటున్నారు. –తిప్పారెడ్డి శ్రీనివాసరెడ్డి, మిరప రైతు, నిదానపురం -
‘బొబ్బర’తో బెంబేలు
మధిర: మిరపతోటల్లో ఇటీవల బొబ్బర తెగులు తీవ్రంగా వ్యాపిస్తోంది. జెమినీ వైరస్ ఆశించి పంట ఎదుగుదలను చంపేస్తోంది. ఆకులపై బొబ్బలు ఏర్పడి, పత్రాలన్నీ పసుపు రంగులోకి మారుతున్నాయి. తెల్లదోమ ఆశించడంవల్లే ఈ విధంగా జరుగుతోందని రైతులు వాపోతున్నారు. దీని నివారణ కోసం రైతులు క్రిమి సంహారక మందుల పిచికారీకి ఇప్పటికే ఎకరానికి రూ.20వేలకు పైగా ఖర్చుపెట్టారు. దీనికి తోడు మిరపతోటకు వివిధ రకాల చీడపీడలు, దోమ ఆశిస్తుండడంతో మిరపతోటల ఎదుగుదల లోపిస్తోంది. జోరుగా వర్షం కురుస్తున్నప్పటికీ ఈ బొబ్బరరోగం నివారణకు పురుగుమందులను పిచికారీ చేయాల్సి వస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. మధిర మండల పరిధిలోని నిదానపురం గ్రామంలో మిరప తోటల్లో ఈ తెగుళ్ల పీడ తీవ్రంగా ఉంది. పలు గ్రామాల్లో జెమినీ వైరస్ వ్యాపిస్తోంది. పంట వాడిపోయినట్లు మారిపోతుండడంతో వేలాది రూపాయల పెట్టుబడి పెట్టిన రైతులు దిగాలు చెందుతున్నారు. ఆశలు ఆవిరి.. l ఖరీఫ్‌లో ఎన్నో ఆశలతో మిర్చి పంట వేసిన రైతులు ఇప్పుడు తెగుళ్లతో బెంబేలెత్తుతున్నారు. l బొబ్బర తెగులుతో ఆకులన్నీ రోజుల వ్యవధిలోనే రంగు మారి పాలిపోతుంటే గుండెధైర్యం కోల్పోతున్నారు. l పచ్చగా నిగనిగలాడాల్సిన తోట..పాలిపోతోంది. l ఈ తెగుళ్ల నివారణకు ఇంకా పురుగులమందు పిచికారీ భారం పడే అవకాశాలు ఉన్నాయి. l బొబ్బర తెగుâýæ్ల పంటలను వ్యవసాయాధికారులు పరిశీలించాలని రైతులు కోరుతున్నారు. l బోర్లు, బావులను అద్దెకు తీసుకొని, జనరేటర్లు, డీజిలింజన్ల ద్వారా మొన్నటిదాకా తడులు కట్టారు. l ఇప్పుడు తెగుâýæ్లతో పంట చేతికందకుంటే.. నష్టపోతామని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలి.. ఖరీఫ్‌లో ఎకరం భూమిని కౌలుకు తీసుకొని మిర్చిపంట వేశా. బొబ్బర రోగం వచ్చి ఆకులన్నీ ముడుచుకుపోతున్నాయి. పసుపు రంగులోకి మారుతున్నాయి. కౌలు రైతులకు బ్యాంకుల ద్వారా ప్రభుత్వమే రుణాలు మంజూరు చేయాలి. ఈ సారి పెట్టుబడి ఎకరానికి రూ.2లక్షలకుపైగా అవుతుందేమోనని భయపడుతున్నాం. ప్రైవేట్ వ్యాపారులు దోచుకుంటున్నారు. –తిప్పారెడ్డి శ్రీనివాసరెడ్డి, మిరప రైతు, నిదానపురం -
వరద బాధితులను ఆదుకోవాలి
సీపీఎం జిల్లా కార్యదర్శి సారంపల్లి వాసుదేవరెడ్డి న్యూశాయంపేట : నగరంలో వరద ఉధృతి తగ్గినప్పటికీ లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలో వర్షపు నీరు చేరి ప్రజలు అవస్థలు పడుతున్నారని వీరిని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి సారంపల్లి వాసుదేవరెడ్డి పేర్కొన్నారు. వేలాది గుడిసెలు వరదలో కొట్టుకుపోయి అనేకమంది పేదలు నిరాశ్రయులయ్యారన్నారు. పునరావాస కేంద్రాలను మరో వారం రోజుల పాటు కొనసాగించి భోజన వసతులు కల్పించాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రతి కుటుంబానికి నెలకు సరిపడా నిత్యావసర వస్తువులు, రూ.పది వేలు ఆర్థికసాయం అందించాలని కోరారు. అలాగే అంటువ్యాధులు వ్యాపిం చకుండా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. -
విషజ్వరాలతో విలవిల
మంచంపట్టిన కొండకిందిగూడెం – 100కు చేరిన జ్వరపీడితుల సంఖ్య – నలుగురి పరిస్థితి విషమం – హైదరాబాద్, సూర్యాపేట ఆస్పత్రులకు తరలింపు – పారిశుద్ధ్య లోపంతోనే రోగాల బారిన పడుతున్నామని గ్రామస్తుల ఆవేదన – పీహెచ్సీ ఆధ్వర్యంలో వైద్యశిబిరం ఏర్పాటు కేతేపల్లి: కేతేపల్లి మండలం కొండకిందిగూడెలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 100 మంది గ్రామస్తులు మంచం పట్టారు. గ్రామంలో సుమారు 350 కుటుంబాల్లో 1500 వరకు జనాభా ఉన్నారు. వారం రోజులుగా ఒకొక్కరిగా జ్వరాల బారిన పడుతూ, జ్వరాలు కాస్త ముదిరి ఒకరొ నుంచి మరొకరికి సోకి గ్రామం మొత్తం విస్తరించిపోయింది. ప్రతి ఇంట్లో ఒకరి నుంచి ఇద్దరు జ్వరపీడితులున్నారు. మాజీ సర్పంచ్ కోట్ల రాములు, రాచకొండ సుగుణమ్మ, కేశబోయిన సతీష్, నర్సింగ్ సతీష్, బండారు శ్రీరాములు, కోట్ల లింటమ్మ, కోట్ల నాగయ్య, తెట్టి నాగులు, అల్లి వీరస్వామి, దొతం నాగయ్య, వంగూరి మార్తమ్మ, అల్లి అంజి మరో ఇరవై ఐదు కుటుంబాల వ్యక్తులు విషజ్వరాల బారిన పడి బాధపడుతున్నారు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లోప్రైవేట్ వైద్యులను ఆశ్రయిస్తున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో సూర్యాపేట, హైదరాబాద్‌లలోని ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. అస్తవ్యస్తంగా పారిశుద్ధ్యం గ్రామంలోడ్రెయినేజీ సక్రమంగా లేకపోవటంతో పాకరిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. కాల్వల్లో పేరుకపోయిన మురుగును తొలగించక పోవటం వల్ల ఈగలు, దోమల వ్యాప్తి పెరగటంతో పాటు దుర్వాసన వస్తోందని గ్రామస్తులు వాపోతున్నారు. ఏళ్ల తరబడి నుంచి తాగునీటి ట్యాంకును శుభ్రం చేయక పోవటంతో తాగునీరు కలుషితపై వాధ్యుల భారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జ్వరపీడితులకు వైద్యపరీక్షలు విష జ్వరాలతో బాధపడుతున్న కొండకిందిగూడెం ప్రజలకు గురువారం కేతేపల్లి ప్రాథమిక కేంద్రం ఆద్వర్యంలో వైద్య పరీక్షలు నిరహించారు. గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించి 288 మందికి పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. తీవ్ర అస్వస్థకు లోనయిన వారికి అక్కడే సెలైన్ ఎక్కించి, ఇంజక్షన్లు చేశారు. జ్వరంతో బాధపడుతున్న 68 మంది నుంచి రక్త నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. నిల్వ చేసిన నీటిని తాగటం వల్లనే సీజనల్‌గా విషజ్వరాలు వస్తున్నాయని మండల వైద్యాధికారి లక్ష్మికాంత్ తెలిపారు. కాచి వడబోసిన నీటిని తాగటంతో పాటు, దోమలు వృద్ధి చెందకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. రక్త నమూనాల రిపోర్టులు వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పారు. వైద్యశిబిరంలో సర్పంచ్ డి.సాయిరెడ్డి, నకిరేకల్ ఎసీపీహెచ్‌వో చరణ్‌దాస్, సీహెచ్ఓ సందర్‌నాయక్, వైద్యసిబ్బంది జగదీష్‌రెడ్డి, దయామణి, రుక్మారెడ్డి, రాజమ్మ, అనిత, అంగన్వాడీ, ఆశకార్యకర్తలు పాల్గొన్నారు. -
పాపం పసివాడు..
-
మానసిక ఒత్తిడిలో కశ్మీర్!
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో తాజాగా నిర్వహించిన ఓ సర్వే ఫలితాలు విస్తుగొలిపేలా ఉన్నాయి. కశ్మీర్ వయోజనుల్లో సుమారు సగం మంది తీవ్రమైన మానసిక ఒత్తిడి సమస్యను ఎదుర్కొంటున్నారు. మెడిసిన్స్ సాన్స్ ఫ్రాంటియర్స్(ఎమ్ఎస్ఎఫ్) నిర్వహించిన ఈ సర్వేలో అక్కడ ప్రతి ఇద్దరు వయోజనుల్లో ఒకరు తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నారని తేలింది. రోజు వందలాది మంది ప్రజలు మానసిక సమస్యలతో కశ్మీర్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని కశ్మీర్ యూనివర్సిటీ సైకాలజీ డిపార్ట్మెంట్తో కలిసి ఎమ్ఎస్ఎఫ్ నిర్వహించిన ఈ సర్వే నివేదికలో వెల్లడించారు. 1.8 మిలియన్ల కశ్మీర్ వయోజనులు మానసిక ఒత్తిడిలో మగ్గుతున్నట్లు తెలిపారు. ఆ ప్రాంతంలోని ఘర్షణ పూరితమైన వాతావరణం వీరిలో మానసిక సమస్యలకు ప్రధాన కారణంగా తెలిపారు. యువతలో సైతం జ్ఞాపక శక్తిని కోల్పోవటం, తలనొప్పి, ఒంటరిగా ఉండాలనే కోరిక లాంటి లక్షణాలు మానసిక ఒత్తిడి మూలంగా కలుగుతున్నాయని సైకియాట్రిస్ట్ అర్షిద్ హుస్సేన్ తెలిపారు. -
కల్తీకి బానిసైన మద్యం ప్రియులు
-
క్యాన్సర్ వచ్చిన టైంలో కమల్ అండగా ఉన్నాడు
-
నాకూతురిని బతికించండి !
-
అప్లాస్టిక్ ఎనీమియాతో బాధపడుతున్న అంజలి
-
బాబోయ్.. చీమలు.. కాపాడండి..
కొత్తూరు: క్రమశిక్షణకు మారుపేరనే గోప్పేమోగానీ చీమలతో మనుషులు అనుభవించే బాధలు అన్నీ ఇన్నీకావు. ఆ బాధలు భరించరానివైనప్పుడు.. ఇదిగో వ్యవహారం ఇలా ఫిర్యాదుల వరకూ వెళుతుంది. గ్రామంపై చీమల దండ్లు దాడిచేశాయని, వాటిబారి నుంచి తక్షణమే తమను ఆదుకోవాలని ఉన్నతాధికారులను ఆశ్రయించారు శ్రీకాకుళం జిల్లాలోని కొత్తూరు మండలం పులివెందులపాటి గ్రామస్తులు. మూకుమ్మడిగా సోమవారం ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్న గ్రామస్తులు.. గ్రామంలో చీమల విహారం పెరిగిపోయిందని, ఆహార పదార్థాలపై దాడిచేసి ఒక్క ముక్కా మిగల్చకుండా ఎత్తుకెళుతున్నాయని ఎంపీడీవో వెంకటరామన్ కు ఫిర్యాదు చేశారు. గమాక్సిన్, పాల్డాల్ వంటి పురుగుల మందులు వాడినప్పటికీ ఫలితం లేకుండాపోయిందని, వెంటనే తమ సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు. స్పందించిన ఎంపీడీఓ.. మండల వైద్యాధికారి కృష్ణమోహన్‌ను పిలిపించి సమస్యపై చర్చించారు. ఎలాగైనాసరే చీమల బెడద వదిలిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో కొద్దిగా శాంతించిన గ్రామస్తులు తిరిగి ఇళ్లకు వెళ్లిపోయారు. -
టి.సుబ్బరామిరెడ్డికి అస్వస్థత
అనంతపురం: కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి (టీఎస్ఆర్) శుక్రవారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయన్ని కదిరి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. టీఎస్ఆర్ వెన్నునొప్పితో బాధపడుతున్నారు. అలానే అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ చేపట్టిన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. అయితే వెన్నునొప్పి మరింత తీవ్రం కావడంతో ఆయన్ని ప్రత్యేక అంబులెన్స్‌లో కదిరి తరలించారు. -
అన్నం పెట్టదు.. అట్లకాడతో కాల్చేది
చిట్టి తల్లికి ఎంతకష్టమొచ్చిందో.. ఐదేళ్ల వయసు. అల్లారు ముద్దుగా సాగాల్సిన బాల్యం. అయితే విధి ఆ పాపపై విషం చిమ్మింది. మూడేళ్ల క్రితం తల్లి తనువుచాలించింది. ప్రేమ పంచాల్సిన సవతితల్లి మానసికంగా.. శారీరకంగా వేధించింది. ఆ బాధలను మంగళవారం మేజిస్ట్రేట్ ముందు చెమ్మగిల్లిన కళ్లతో చెప్పుకుంది చిన్నారి. శరీరంపై ఒక్కొక్క గాయం మిగిల్చిన చేదు జ్ఞాపకాలను గుర్తుతెచ్చుకుంటూ చివురుటాకులా వణికిపోయింది. ఒంగోలు టౌన్ : ‘అన్నం సరిగా పెట్టదు.. అడిగితే కొట్టేది.. సంక్రాంతి పండుగ రోజు అట్లకాడతో చెయ్యి కాల్చింది. ఒకసారి తలపై కర్రతో కొడితే రక్తమొచ్చింది. బుగ్గ మీద కర్రతో కొడితే ఎర్రగా కందిపోయింది. నేను ఇంటికి వెళ్లను.. ఇక్కడే ఉంటాను.’ అని ఒంగోలు నగరంలోని శ్రీనగర్‌కాలనీకి చెందిన ఐదేళ్ల చిన్నారి మహేశ్వరి చెమ్మగిల్లిన కళ్లతో చెప్పిన మాటలివి. సవతి తల్లి చిత్ర హింసలకు గురవుతున్న చిన్నారి గురించి పత్రికల్లో వచ్చిన కథనాలను చూసి చలించిపోయిన జిల్లా జువైనల్ జస్టిస్ బోర్డు ప్రిన్సిపల్ మేజిస్ట్రేట్ జె.శ్రావణ్‌కుమార్ మంగళవారం సాయంత్రం స్వయంగా స్థానిక బాలసదన్‌కు వెళ్లి ఆ చిన్నారితో మాట్లాడారు. చిన్నారి శరీరంపై ఉన్న గాయాల గురించి ఒకటొకటిగా అడిగారు. ఆ గాయాల తాలూకు చేదు జ్ఞాపకాలను చిన్నారి అమాయకంగా చెబుతుంటే మేజిస్ట్రేట్ చలించిపోయారు. ఒంగోలు డీఎస్పీ శ్రీనివాసరావుకు ఫోన్‌చేసి వెంటనే బాలసదన్‌కు రావాలని చెప్పారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సంఘటనను సుమోటోగా స్వీకరించి చిన్నారి తండ్రి, సవతి తల్లిని అరెస్టు చేయాలని ఆదేశించారు. మేజిస్ట్రేట్ వెంట చైల్డ్‌లైన్ (1098) ప్రతినిధి బీవీ సాగర్, మహిళా శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డెరైక్టర్ కె.లీలావతి, ఐసీడీఎస్ డీసీపీవో ఎన్.జ్యోతి సుప్రియ తదితరులు ఉన్నారు. -
చచ్చిపోతున్నాం!తొలగించండి!
-
ఓ.. వంచితా...
కష్టసుఖాల్లో తోడుంటానని చెప్పాడు. ప్రేమిస్తున్నానన్నాడు. నువ్వు లేనిదే నేను లేనన్నాడు. పాపం.. అమాయకురాలు ఆ మాటలు నమ్మింది. తనూ ప్రేమించింది. అతడిని పెళ్లి చేసుకుంది. అప్పటికి కాని తెలిసిరాలేదు. చెప్పిన మాటలు వేరు... చేసేది వేరని... నిత్యం ఆ మహిళను అనుమానించేవాడు. తీవ్రంగా హింసించేవాడు. అయినా, కొన్నాళ్లపాటు అన్నింటినీ మౌనంగా భరించింది. చివరకు తట్టుకోలేక పోయింది. అతని కబంధ హస్తాల నుంచి బయటపడాలనుకుంది. అంతే.. రెలైక్కి ఉత్తరప్రదేశ్ చేరింది. అక్కడి భాష తెలియక.. నా అన్నవారు లేక కష్టాలు పడింది. చివరకు ఆమె పరిస్థితిని గమనించిన అక్కడి పోలీసులు, జిల్లా మెజిస్ట్రేట్ (కలెక్టర్) చేరదీసి సొంత జిల్లా అయిన మహబూబ్‌నగర్‌కు పంపేందుకు రైలు ఎక్కించారు. పాలమూరు : పాలమూరు జిల్లాలోని బాదేపల్లికి చెందిన జయమ్మ అనే వివాహిత భర్త పెట్టే బాధలు తట్టుకోలేక దూరంగా వెళ్లిపోవాలని నిశ్చయించుకుంది. ఆ మేరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రెలైక్కి అక్కడి బులంద్ షహెర్ జిల్లాకు చేరుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రైల్వేస్టేషన్లో కొద్ది రోజులుగా సంచరిస్తూ ఉండడంతో స్థానికులు గుర్తించారు. ఆ రాష్ట్రంలోని సికింద్రాబాద్ పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో అక్కడి పోలీసులు ఆమెను శనివారం పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లి విచారించారు. ఆమె మాట్లాడిన భాష వారికి అర్ధం కాలేదు. ఆమె తెలుగులో మాట్లాడుతున్న విషయాన్ని గమనించిన పోలీసులు బులంద్ షహెర్ మెజిస్ట్రేట్ (జిల్లా కలెక్టర్)కు తెలుగు భాష వస్తుందని ఆమె వద్దకు తీసుకువెళ్లారు. దీంతో సదరు జయమ్మను అక్కడి మెజిస్ట్రేట్ బి.చంద్రకళ తన వద్దనే ఉంచుకుంది. కొద్దిరోజుల పాటు తిండిలేక ఇబ్బందిగా ఉన్న జయమ్మకు ఊరట కల్పించి ఆ తర్వాత ఆమె వ్యక్తిగత విషయాలు రాబట్టడంతో తనది పాలమూరు జిల్లాలోని బాదేపల్లి అని, రమేశ్ అనే వ్యక్తిని ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నానని, కుటుంబీకులు *లక్ష కట్నం కూడా ఇచ్చారని చెప్పుకొచ్చింది. ఒకేసారి పూర్తి వివరాలు చెప్పనప్పటికీ.. విడతల వారిగా అక్కడి మెజిస్ట్రేట్ వద్ద తన వ్యక్తిగత విషయాలను వెలిబుచ్చినట్లు సమచారం. తనను ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ తన భర్త హింసిస్తుండేవాడని, అనుమానించి ఇబ్బందులకు గురిచేసే వాడని, విడాకులు ఇవ్వాలని తనను విపరీతంగా వేధిస్తున్న కారణంగా బాధలు తట్టుకోలేక ఇల్లువదిలి వచ్చానని, తనకు ఓ బిడ్డ పుట్టి చనిపోయిందని కూడా అక్కడి మెజిస్ట్రేట్ వద్డ ఆవేదన వెలిబుచ్చింది. ఈ విషయంపై బులంద్ షహెర్ మెజిస్ట్రేట్ బి.చంద్రకళ ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడుతూ పాలమూరు జిల్లాకు చెందిన జయమ్మ పరిస్థితి చూస్తే తనను కలిచి వేసిందన్నారు. శనివారం నుంచి తన నివాసంలో ఉంచుకొని ఆమె ఆరోగ్యం కుదుట పడిన తర్వాత బట్టలు ఇప్పించి, ఖర్చులకోసం డబ్బులు కూడా ఇచ్చి మహబూబ్‌నగర్ జిల్లాకు పంపానన్నారు. బులంద్ షహెర్కు చెందిన ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు, ఓ ప్రభుత్వ అధికారిని వెంట ఇచ్చి పంపుతున్నానని, వారి వెంట జయమ్మ ఎదుర్కొన్న ఇబ్బందులను తెలియపరుస్తూ.. ఆమెను ఆదుకోవాలని కోరుతూ పాలమూరు జిల్లా కలెక్టర్‌కు లేఖ పంపానని ఆమె వెల్లడించారు. వారు బుధవారం ఉత్తరప్రదేశ్ నుంచి సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరారని, గురువారం జిల్లాకు చేరుకునే అవకాశం ఉందని చంద్రకళ వెల్లడించారు. బులంద్ షహెర్ మెజిస్ట్రేట్ తెలంగాణ వాసే..! ఊరుగాని ఊర్లో అవస్తలు పడుతున్న జయమ్మను ఆదుకున్న బులంద్ షహెర్కు చెందిన మెజిస్ట్రేట్ (కలెక్టర్) తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆడపడుచు. కరీనంగర్ జిల్లాకు చెందిన రామగుండ వాసి. ఆమె తల్లిదండ్రులు రైసు మిల్లు వ్యాపారం చేసుకునే వారు. చంద్రకళ భర్త అదే జిల్లాలో ఇరిగేషన్ శాఖలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఒక ఆడపడుచు ఆవేదనను మరో మహిళ అర్థం చేసుకుంటున్న నానుడిని బులంద్ షహెర్ మెజిస్ట్రేట్ చంద్రకళ రుజువు చేశారు. -
విశాఖలో వాహనదారుల అగచాట్లు
-
మరోసారి గోదావరి ఉగ్రరూపం