శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో తాజాగా నిర్వహించిన ఓ సర్వే ఫలితాలు విస్తుగొలిపేలా ఉన్నాయి. కశ్మీర్ వయోజనుల్లో సుమారు సగం మంది తీవ్రమైన మానసిక ఒత్తిడి సమస్యను ఎదుర్కొంటున్నారు. మెడిసిన్స్ సాన్స్ ఫ్రాంటియర్స్(ఎమ్ఎస్ఎఫ్) నిర్వహించిన ఈ సర్వేలో అక్కడ ప్రతి ఇద్దరు వయోజనుల్లో ఒకరు తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నారని తేలింది.
రోజు వందలాది మంది ప్రజలు మానసిక సమస్యలతో కశ్మీర్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని కశ్మీర్ యూనివర్సిటీ సైకాలజీ డిపార్ట్మెంట్తో కలిసి ఎమ్ఎస్ఎఫ్ నిర్వహించిన ఈ సర్వే నివేదికలో వెల్లడించారు. 1.8 మిలియన్ల కశ్మీర్ వయోజనులు మానసిక ఒత్తిడిలో మగ్గుతున్నట్లు తెలిపారు. ఆ ప్రాంతంలోని ఘర్షణ పూరితమైన వాతావరణం వీరిలో మానసిక సమస్యలకు ప్రధాన కారణంగా తెలిపారు. యువతలో సైతం జ్ఞాపక శక్తిని కోల్పోవటం, తలనొప్పి, ఒంటరిగా ఉండాలనే కోరిక లాంటి లక్షణాలు మానసిక ఒత్తిడి మూలంగా కలుగుతున్నాయని సైకియాట్రిస్ట్ అర్షిద్ హుస్సేన్ తెలిపారు.
మానసిక ఒత్తిడిలో కశ్మీర్!
Published Sun, Jun 12 2016 10:38 AM | Last Updated on Mon, Sep 4 2017 2:20 AM
Advertisement