adults
-
ఇలా బైడెన్‌కి మూడోసారి..! వృద్ధాప్యం కోవిడ్ సమస్యలను పెంచుతుందా?
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కోవిడ్ - 19 పాజిటివ్‌గా తేలిందని, ఆయన స్వల్ప లక్షణాలతో బాధ పడుతున్నారని వైట్ హౌస్ ప్రకటించింది.ఆయన గతంలో వ్యాక్సీన్ వేయించుకున్నారని, బూస్టర్ డోస్ కూడా తీసుకున్నారని అధ్యక్షుడి ప్రెస్ కార్యదర్శి కరీన్ జీన్ పియరీ చెప్పారు. బైడెన్‌కు గతంలోనూ రెండుసార్లు కోవిడ్ సోకింది. సరిగ్గా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో బైడెన్ కరోనా బారినపడటం పార్టీ నేతలను కలవరపాటుకి గురి చేసింది. ఆయన టీకాలు వేయించుకున్నారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆయన సెల్ఫ్ ఐసోలేషన్ కోసం తన డెలావేర్ బీచ్ హౌస్‌లో ఉన్నారని, అక్కడ నుంచి విధులు కొనసాగిస్తారని వైట్‌హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది. బైడెన్‌కి కరోనా రావడం ఇది మూడోసారి. అమెరికా అధ్యక్షుడు కేసును బట్టి వృద్ధులు కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండేల్సిందేనని తెలుస్తోంది. అదీగాక యూఎస్‌లోని పలు ప్రాంతాల్లో ముఖ్యంగా 65 అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వ్యక్తులలో కరోనే కేసులు పెరుగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వృద్ధులు కరోనా బారిన పడుకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందువల్ల వారికే ఈ వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువ తదితరాల గురించి తెలుసుకుందాం. వృద్ధులకే ఎందుకు..వృద్ధలు, చిన్నపిల్లల్లో బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉంటుంది. వృద్ధాప్య కారణంగా ఉండే వయసురీత్య సమస్యలు కూడా కోవిడ్ ప్రమాదాన్ని పెంచుతుంది. ముఖ్యంగా గుండె జబ్బులు, మధుమేహం, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి, ఊబకాయం, ఉన్నవారు ఆస్పత్రిలో చేరే ప్రమాదం ఉంది. వృద్ధులలో ఈ కింది లక్షణాలు కనిపిస్తే అప్రమత్తంగా ఉండాల్సిందే.జ్వరం లేదా చలిదగ్గుశ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిఅలసటకండరాలు లేదా శరీర నొప్పులుతలనొప్పిరుచి లేదా వాసన యొక్క కొత్త నష్టంగొంతు మంట ముక్కు కారటంవికారం లేదా వాంతులుఅతిసారంమరింత తీవ్రంగా ఉంటే..కోవిడ్-19 ఉన్న పెద్దలు కూడా డెలిరియం, వివరించలేని హైపోక్సియా వంటి విలక్షణమైన లక్షణాలు కనిపించొచ్చు. ముఖ్యంగా రక్తంలో ఆక్సిజన్ తక్కువ స్థాయిలు, వేగవంతమైన శ్వాస, మైకం, పెరిగిన హృదయ స్పందన రేటు, రక్తపోటు పడిపోవడం తదితరాలు.బూస్టర్లు ఎందుకు..బూస్టర్ మోతాదులను సాధారణంగా వారి రోగనిరోధక ప్రతిస్పందనను మెరుగుపరచడానికి వృద్ధులకు సిఫార్సు చేస్తారు. అంతేగాదు డబ్ల్యూహెచ్ఓ కూడా సాధారణంగా 65 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి, అంతర్లీన ఆరోగ్య పరిస్థితులు ఉంటే..వారి సంరక్షణార్థం ఈ బూస్టర్ షాట్లను సిఫార్సు చేస్తోంది.రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు లేదా వృద్ధులను రక్షించడంలో బూస్టర్ లేదా ముందుజాగ్రత్త మోతాదు సహాయపడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇది లక్షణాలు స్వల్పంగా ఉండేలా చేసి ఆసుపత్రిలో చేరే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. (చదవండి: వామ్మో ఎంత పొడుగు జుట్టు!..గిన్నిస్ రికార్డులకెక్కింది!) -
టీకాతో అకాల మరణాల ముప్పుపై.. వెలుగులోకి కీలకాంశాలు
ఢిల్లీ: కరోనా వాక్సినేషన్ యువకుల్లో అకాల మరణాలను పెంచబోదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వెల్లడించింది. కనీసం టీకా ఒక్క డోసు తీసుకున్నా.. అకాల మరణాలు సంభవించే ప్రమాదాన్ని తగ్గిస్తుందని పేర్కొంది. కరోనా టీకా తీసుకున్నవారిలో అకాల మరణాల ముప్పుకు సంబంధించి ఐసీఎమ్ఆర్ చేసిన ఓ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. టీకాతో అకాల మరణాలు ముప్పు అంశంపై ఐసీఎమ్ఆర్ అక్టోబరు 1, 2021 నుండి మార్చి 31, 2023 మధ్య అధ్యయనాన్ని చేపట్టింది. ఈ పరిశోధనలో దేశవ్యాప్తంగా 47 ఆసుపత్రుల్లో రోగులను పరిశీలించారు. ముఖ్యంగా 18-45 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులపై దృష్టి సారించారు. వారిలో ఎలాంటి ఆనారోగ్య లక్షణాలు కనిపించలేదని అధ్యయనంలో వెల్లడైంది. ఈ విశ్లేషణలో 729 కేసులను పరిశీలించారు. టీకా రెండు డోసులను తీసుకున్నవారికి అకాల మరణం సంభవించే ప్రమాదం చాలా తక్కువ అని అధ్యయనం స్పష్టం చేసింది. అయినప్పటికీ.. అకాల మరణ ప్రమాదాన్ని పెంచే అనేక అంశాలను అధ్యయనం గుర్తించింది. వీటిలో కోవిడ్-19 కారణంగా ఆస్పత్రిలో చేరిన రోగుల ఆరోగ్య చరిత్ర, ఆకస్మిక మరణానికి సంబంధించిన వ్యక్తి కుటుంబ ఆరోగ్య చరిత్ర ప్రభావితం చూపుతున్నట్లు వైద్యులు గుర్తించారు. మరణానికి ముందు 48 గంటలలోపు అతిగా మద్యం సేవించడం, డ్రగ్స్ వంటి పదార్ధాల వినియోగం, తీవ్రమైన శారీరక శ్రమలో పాల్గొనడం వంటివి అకాల మరణ ప్రమాదాన్ని పెంచుతున్నాయని గుర్తించారు. ఇదీ చదవండి: IndiGo Flight Viral Incident: ప్రయాణీకులు ఆరుగురే అని... దించేసి పోయారు! -
విమానంలో "పెద్దలకు మాత్రమే" జోన్ : కారణం, ధర తెలిస్తే షాకవుతారు
Corendon Airlines Adultonly Zone: టర్కిష్-డచ్ కొరెండన్ ఎయిర్‌లైన్స్ వినూత్న నిర్ణయం తీసుకుంది. తన విమానాల సర్వీసుల్లో "పెద్దలకు మాత్రమే" విభాగాన్ని ఎయిర్‌లైన్ ప్రారంభించడం వార్తల్లో నిలిచింది. అసలు అడల్ట్స్ ఓన్లీ జోన్ అర్థం ఏమిటి, ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది ఈ కథనంలో తెలుసుకుందాం. పిల్లల గోల లేకుండా ప్రశాంతంగా.. ది హిల్ రిపోర్ట్ ప్రకారం విమానంలో ప్రయాణించే ప్రయాణికులకు చిన్న పిల్లల గొడవ లేకుండా ఉండేందుకు, ప్రశాంతంగా ప్రయాణాన్ని కొనసాగించేందుకు ఈ స్పెషల్ జోన్‌ను లాంచ్ చేసినట్టు కొరండెన్ ఎయిర్‌లైన్స్ తెలిపింది. "పెద్దలకు మాత్రమే" జోన్ అనేది నిశ్శబ్ద వాతావరణంలో పని చేయాలనుకునే వ్యాపార ప్రయాణీకులకు బాగా ఉపయోగపడుతుందని, అలాగే తమ పిల్లలు ఏడుస్తున్నప్పుడు తోటి ప్రయాణీకులనుంచి వచ్చే విమర్శలు, మాటలునుంచి పిల్లలు గల పేరెంట్స్‌కు కూడా ఆందోళన తగ్గుతుందని చెప్పింది. 16, అంతకంటే ఎక్కువ వయస్సు ప్రయాణీకుల సౌలభ్యంకోసం ఈ జోన్‌ను ప్లాన్ చేస్తోంది. ఈ పథకం కింద, ఎయిర్‌లైన్ ఉపయోగించే ఎయిర్‌బస్ A350లలో కొన్ని సీట్లు రిజర్వ్ చేస్తారు. డచ్ కరేబియన్ ద్వీపం అయిన ఆమ్స్టర్డామ్, కురాకో మధ్య విమానాల్లో ఈ జోన్లు నవంబర్‌లో లాంచ్ చేయనుంది. అదనపు వాత తప్పదు మరి! విమానంలో ముందు భాగం "పెద్దలకు మాత్రమే" జోన్లను ఏర్పాటు చేస్తారు ఇందులో తొమ్మిది అదనపు-పెద్ద సీట్లు అదనపు లెగ్‌రూమ్ , 93 స్టాండర్డ్ సీట్లతో ఉంటాయి. వాల్స్, కర్టెన్ల ద్వారా జోన్ భౌతికంగా మిగిలిన విమానం నుండి వేరు చేస్తామని, ప్రశాంతంగా, రిలాక్స్డ్ వాతావరణాన్ని కల్పించడమే దీని ఉద్దేశమని పేర్కొంది. అయితే వన్‌వేలో ఈ సీట్లకు అదనంగా 45 యూరోలు (రూ4,050), అదనపు పెద్ద సీట్లకు అదనంగా 100 యూరోలు (రూ.8,926) చెల్లించాల్సి ఉంటుంది. నెదర్లాండ్స్‌లో ఇలాంటి జోన్‌ను తీసుకొచ్చిన తొలి విమానయాన సంస్థగా నిలిచింది. -
దంపతులుగా జీవిస్తుంటే... జోక్యమొద్దు: ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ: పరస్పర అంగీకారంతో ఒక్కటిగా జీవిస్తున్న అమ్మాయి, అబ్బాయి మధ్యలోకి మూడో వ్యక్తి జోక్యం తగదని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. వారి కుటుంబ సభ్యులు అయినా కూడా జోక్యం చేసుకోవద్దని పేర్కొంది. కుల, మతాలతో సంబంధం లేకుండా, ఒక్కటిగా బతికే జంటకు తగిన రక్షణ కల్పించాలని రాజ్యాంగం నిర్దేశిస్తోందని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తుషార్ రావు గేదెల అన్నారు. రక్షణ కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది, అధికార యంత్రాంగానిదేనన్నారు. ఉత్తరప్రదేశ్‌లో తండ్రి అభీష్టానికి విరుద్ధంగా తనకు నచ్చిన వ్యక్తితో కలిసి ఉంటున్న ఓ యువతి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. యూపీలో తన తండ్రి చాలా పరపతి గల వ్యక్తి అని, ప్రాణభయంతో తరచూ వేర్వేరు హోటళ్లకు మారుతూ కాలం వెళ్లదీస్తున్నామని, రక్షణ కల్పించేదాకా మా దంపతులకు మనశ్శాంతి ఉండదని ఆమె కోర్టుకు నివేదించారు. -
ప్రేమ జంట ఆత్మహత్య
అబ్దుల్లాపూర్‌మెట్: తమ పెళ్లికి పెద్దలు అంగీకరంచరేమోననే భయంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. పెద్దఅంబర్‌పేట ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో రమాదేవి పబ్లిక్ స్కూల్ వెనకాల రెండు మృతదేహాలు ఉన్నాయన్న సమాచారం మేరకు గురువారం రాత్రి 7 గంటల సమయంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ యువతి, యువకుడి మృతదేహాలను పరిశీలించారు. సంఘటనా స్థలంలో లభించిన టీఎస్ కాప్ అప్లికేషన్ పత్రాలు, బైక్, సెల్‌ఫోన్ ఇతర ఆధారాల సాయంతో వివరాలు సేకరించారు. మృతులిద్దరూ నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం పోలెపల్లికి చెందిన వారిగా గుర్తించారు. పోలెపల్లికి చెందిన వెంకటయ్య కుమారుడు సతీష్ బైక్ మెకానిక్. వీరి ఇంటి సమీపంలో ఉండే శంకర్ కూతురు శిరీష (23) కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించరేమోననే అనుమానంతో చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అబ్దుల్లాపూర్‌మెట్ శివారులోని ఔటర్ రింగ్‌రోడ్డు సమీపంలో పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండు రోజుల క్రితం ఈ సంఘటన జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. (చదవండి: పెళ్లై 40 రోజులు.. ఏమైందో ఏమో.. బయటకు వెళ్తున్నానని చెప్పి!) -
దైవ సన్నిధి
గొప్ప ప్రవక్త జార్జివర్‌వర్ ఒక ఆథ్యాత్మిక మహాసభలో ఆత్మవశంలో ప్రసంగిస్తున్నారు. ఇచ్చిన సమయం మించిపోయింది. కాని సందేశం ఆపడం లేదు. ఆయన్ని ఎలా ఆపాలో కూడా తెలియక పెద్దలు సతసతమవుతున్నారు. దాని తర్వాత మరో కార్యక్రమం ఉంది. అందుకే ఈ ఆరాటం అంతా. చివరికి ఒక పెద్ద మనిషి వేదిక మీద నుండి కిందికి దిగివచ్చాడు. వేదికకు ముందు జార్జివర్‌వర్ గారికి ఎదురుగా కూర్చున్నాడు. కూర్చున్నాడే గాని అటు ఇటూ స్థిమితం లేకుండా ఉన్నాడు. అతనిని చూస్తూనే సంపన్నుడు అని ఇట్టే తెలిసిపోతుంది. సమయం మించిపోతుందన్న ఆలోచనతో ఆ సంగతిని గుర్తు చేయడానికి తన చేతికి ఉన్న అత్యంత ఖరీదైన గడియారాన్ని అతడు జార్జి గారికి చూపించాడు. అది చూసి జార్జి ప్రవక్త అవాక్కయ్యాడు. శాంత హృదయంతో ప్రశాంతంగా తన దివ్య సందేశాన్ని ఆపివేశాడు. సభలో కొందరు పరిచారకులు అటు ఇటూ తిరుగుతూ వున్నారు. వారందరూ అక్కడ తమవంతు సహాయ సహకారాలు అందిస్తూ తమ కర్తవ్యాన్ని భక్తిశ్రద్ధతో నిర్వర్తిస్తున్నారు. జార్జివర్‌వర్ చిరునవ్వుతో ఒక పరిచారకుడిని దగ్గరకు రమ్మని పిలిచాడు. ‘‘చూడు బాబూ.. నా ఎదురుగా కూర్చున్న ఆ పెద్దాయన తన అత్యంత ఖరీదైన తన చేతిగడియారాన్ని ఈ మహాసభ సహాయార్థం ఇస్తాననే సంకేతంతో తన వాచ్ చూపిస్తున్నాడు. మీరు వెళ్లి ఆ గడియారాన్ని తెచ్చి హుండీలో వేయండి’’ అని ఆజ్ఞాపించాడు. అనుకోని ఈ ఆకస్మిక సంభవానికి పెద్దాయన తలదించుకొన్నాడు. అంతేకాదు, ఇలా తలదించుకొనే ఇలాంటి పని మరోసారి చేయను అని, చేయకూడదు అని తన హృదయంలో నిశ్చయించుకొన్నాడు. దైవ సన్నిధికి వెళ్లినప్పుడు పారవశ్యంతో కూర్చోవాలిగాని ఎన్ని గంటకు వచ్చాను, ఎన్ని గంటకు వెళ్లాలి అని ఆలోచించకూడదు. – బైరపోగు శామ్యూల్ బాబు -
చూపురేఖలు
కొత్త భావనలకు పాతవి ఎప్పుడూ సహాయ నిరాకరణగానే ఉంటాయి. ఆ మాత్రం ఒరిపిడి లేకుంటే మార్పు పరిపూర్ణం కాదు కూడా. కాలానికి తగ్గట్టు చూపూ ఉంటే బొట్టుందా, భుజాలపైకి కత్తిరించిన జుట్టుందా అని కళ్లు వెతుక్కోవు. మాధవ్ శింగరాజు మన దగ్గర సిటీ బస్సుల్లో స్త్రీలకు కేటాయించిన సీట్లకు పసుపు రంగు ఉంటుంది. సీట్ల రాడ్లకు, సీటు వెనుక భాగానికీ పూసి ఉండే ఆ పసుపు రంగును బట్టి అవి స్త్రీల సీట్లని తేలిగ్గా గుర్తించవచ్చు. అదొక్క గుర్తే కాదు. కిటికీ పైన ‘స్త్రీలు’ అని రాసి ఉంటుంది. అది మాత్రమే కాదు. స్త్రీ బొమ్మ కూడా గీసి ఉంటుంది. ఇన్ని ఉన్నా ఆ స్త్రీల సీట్లలో కూర్చునే ‘స్త్రీలు కాని వాళ్లు’ ఉండనే ఉంటారు. స్త్రీల సీట్లను పసుపురంగుతో సూచించడం, స్త్రీల చిత్రాన్ని గియ్యడం, ‘స్త్రీలకు మాత్రమే’ అని రాయడం ఏళ్లుగా ఒక పద్ధతిలా వస్తోంది. బస్సులు, రైళ్లలోనే కాదు.. స్త్రీలకు ప్రత్యేకం అని సూచించవలసిన ప్రతి చోటా ఏదో ఒక రంగు ‘అటువైపు వెళ్లకండి’ అని మగవాళ్లకు చెబుతూనే ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో పసుపు, ఇంకొన్ని ప్రాంతాల్లో పింక్. రంగైతే చదువులేని వాళ్లకు కూడా సూచనను వెంటనే అర్థం చేయిస్తుంది. (అదీ అర్థం కానివాళ్లకు స్త్రీ చిత్రం ఎలాగూ ఉంటుంది). అయితే ఈ రంగుల ఇండికేషన్ కూడా కొంతమందికి నచ్చడం లేదు. స్త్రీలకు పింక్ ఏమిటి? అసలు రంగేమిటి? అనే మాట వినిపిస్తోంది కొన్నాళ్లుగా. మన దగ్గరికింకా ఆ వాదన రాలేదు. వస్తే, పసుపు రంగేమిటి? స్త్రీలంటే పసుపూ కుంకుమలేనా ఏమిటి అనే అవకాశమైతే ఉంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో జెండర్ సైనేజ్‌లను తొలగించడం మొదలైంది. సైనేజ్లంటే.. ఇది ఆడవాళ్లకు, ఇది మగవాళ్లకు అని సూచించే స్త్రీ, పురుషుల సంకేత చిత్రాలు. మనం మరీ అంతగా.. లైంగికస్పృహ లేనంతగా.. మనుషులంతా ఒక్కటే అన్నంతగా ‘మానవీకరణ’ చెందలేదు. స్త్రీని మనం చూసే దృష్టి ఒకటి ఉంటుంది కదా, అలా చూడ్డానికే అలవాటు పడి ఉన్నాం. దృష్టి అంటే నేత్రదృష్టి కాదు. మనోదృష్టి. అమ్మ బొమ్మ గియ్యమంటే పిల్లలు గుండ్రంగా ఒక సర్కిల్ గీసి, రెండు కళ్లు, రెండు చెవులు, ముక్కు వేసి, చక్కగా పాపిట తీసి, నుదుటి మధ్యలో బొట్టు పెట్టేస్తారు. చెవులకు రింగులు పెడతారు. నార్త్ పిల్లలైతే అమ్మ తల చుట్టూ చీర కొంగు కప్పుతారు. పెద్దవాళ్లమంతా కూడా పిల్లలుగా ఉండి ఎదిగినవాళ్లమే కాబట్టి భారతీయ స్త్రీమూర్తి అనగానే మన ఊహల్లోకి మొదట వచ్చే స్త్రీ రూపురేఖలు అమ్మవే. బొట్టు, తలచుట్టూ కొంగు. అందుకే స్త్రీలకు విడిగా కేటాయించిన సీట్ల దగ్గర, కౌంటర్ల దగ్గర, కంపార్ట్మెంట్ల మీద ఇప్పటికీ మాతృమూర్తిని తలపించే చిత్రం మాత్రమే కనిపిస్తుంది. ఉద్యోగరీత్యా గానీ, ఒంటికి అనువుగా ఉండడం కోసం కానీ చీర కట్టు, బొట్టు మస్ట్ కాదనుకునే ఆధునిక మహిళాయుగంలోకి మనం వచ్చినప్పటికీ మనమింకా ‘భారతీయ స్త్రీమూర్తి’ దగ్గరే ఆగిపోయాం. అవును ఎందుకు ఆగిపోయాం?! రెండు నెలల క్రితం పశ్చిమ రైల్వే జనరల్ మేనేజర్ ఎ.కె.గుప్తా ముంబై లోకల్ ట్రైన్ల çపనితీరు పర్యవేక్షణల విధుల్లో ఉన్నప్పుడు ఆయనకీ ఇలాగే ఆగిపోయిన ఆలోచన ఏదో కలిగింది. ట్రైన్లతో పోటీ పడి మరీ మహిళలు ఉద్యోగాలకు పరుగులు పెడుతూ, విశ్వాంతరాళాలకు సైతం రాకెట్లా దూసుకెళుతున్న ఈ కాలంలో ఇంకా ఆ సేమ్ ఓల్డ్ ట్రెడిషనల్ స్త్రీ మూర్తి చిత్రాన్నే బోగీలపై గీయించడం ఏమిటి అనుకున్నారు. వెంటనే ఆ చిత్రాన్ని ఆధునిక మూర్తిగా రీడిజైన్ చేయించారు. ఒక యువతి ఫార్మల్ సూట్లో ఉంటుంది. ఆమె జుట్టు చక్కగా భుజాల మీదికి వదిలేసి ఉంటుంది. నుదుటిపై బొట్టు ఉండదు. మనిషి నాజూకుగా ఉంటుంది. నాగరికంగా చేతులు కట్టుకుని ఉంటుంది. పెదవులపై కనిపించీ కనిపించని నవ్వు ఉంటుంది. ఈ చిత్రాన్ని గుప్తా దగ్గర ఉండి మరీ చేయించారు. ఇప్పటివరకు పన్నెండు కోచ్‌లు ఉండే రెండు రైళ్లకు వాటిని వేయించారు. ఇంకో రెండు వారాల్లో మిగతా 108 లోకల్ ట్రైన్లలోనూ మహిళా కంపార్ట్మెంట్ల మీద, లోపల మహిళలు కూర్చునే చోట ఈ ఆధునిక యువతి చిత్రాన్ని పెయింట్ చేయడం పూర్తవుతుంది. ఈ ‘లోగో’ మార్పు గురించి పశ్చిమ రైల్వే మే 27 ఉదయాన్నే ఒక సర్ప్రైజింగ్ ట్వీట్ పెట్టింది. ‘కాలానుగుణంగా మారే ప్రయత్నంలో భాగంగా పశ్చిమ రైల్వే మహిళల కోచ్ మీద ఉండే మహిళా చిహ్నాన్ని ఆధునీకరిస్తోంది.’ అని ఆ ట్వీట్లో ఉంది. వెంటనే రియాక్షన్ మొదలైంది. ‘అమ్మలో ఆధునికం లేదనుకున్నార్రా మీరు..’ అని ఒకరెవరో.. ‘అమ్మ, నాన్న, ఒక తమిళమ్మాయి’ సినిమాలో బండ్ల గణేశ్‌లా ఊగిపోయారు. (‘ఆడపిల్లలంటే ఆటబొమ్మల్లా కనబడుతున్నార్రా మీకు..’ అనేది బండ్ల గణేశ్ డైలాగ్ ఆ సినిమాలో). గుడ్ థాట్ అని ఒకరు అన్నారు. అలాగే ఒక సూచన కూడా చేశారు. బొత్తిగా ఒక ఉమన్నే కాకుండా, ఎత్నిక్ వేర్, ఆఫీస్ వేర్ ఇలా రకరకాల దుస్తులలో ఉన్న గ్రూప్ ఆఫ్ మహిళల్ని సింబల్‌గా పెడితే బాగుంటుందన్నారు. సునాల్ బాత్రా అనే అమ్మాయి.. ‘వావ్! నిద్రలేవగానే ఒక అమేజింగ్ న్యూస్’ అని ఎగ్జయిట్ అయింది. ‘మోడర్నైజింగా! సిగ్గులేకపోతే సరి. భారతీయ సంప్రదాయాన్ని బ్యాక్‌వర్డ్‌నెస్ అంటున్నారా మీరు!’ అని ఇంకొకరు. ‘దిస్ ఈజ్ మియర్ టోకెనిజం’ అని ఇంకో కామెంట్. ‘టోకెనిజం’ అంటే ఏమీ చెయ్యకుండానే చేసినట్లు కనిపించే ప్రయత్నం చెయ్యడం. మొత్తం మీద ఈ బొమ్మమార్పు ఆలోచనను దాదాపుగా ఆడవాళ్లంతా ‘ఎక్స్లెంట్’ అన్నారు. మగవాళ్లంతా ‘టైమ్‌కి బండ్లు నడపడం మీద దృష్టి పెట్టండి’ అన్నారు. ‘మీ డ్యూటీ ఏదో అది సక్రమంగా చెయ్యండి. సామాజిక మార్పు గురించి మీకెందుకు అనడం’ ఇది. ఇంట్లో కూడా చూడండి. పిల్లలు ఉత్సాహంగా ఒక కొత్త సామాజికపరమైన ఆలోచనతో ఏదైనా బొమ్మను గీసుకొస్తే.. ‘ఈ తెలివితేటలు ఎంసెట్‌లో చూపించు’ అనేస్తాం. ఎంసెట్‌లో ర్యాంక్ సాధించడం ఒక్కటే మన ఇంట్లోంచి జరగవలసిన గొప్ప సామాజిక మార్పు అన్నట్లు! కొత్త భావనలకు పాతవి ఎప్పుడూ సహాయ నిరాకరణగానే ఉంటాయి. ఆ మాత్రం ఒరిపిడి లేకుంటే మార్పు పరిపూర్ణం కాదు కూడా. పెరిగి పెద్దవుతున్నా కూడా సీసా పాలకు ముఖాన్ని తిప్పేసుకుంటూ తల్లిపాలకు మాత్రమే చేతులు చాచడానికి అలవాటు పడ్డ మారాల బిడ్డలా.. స్త్రీ తలకొంగులో మాత్రమే సంప్రదాయాన్ని చూడ్డానికి అలవాటు పడిన జీవనాడులు.. స్త్రీ తలదించుకుని నడవడంలో, తలకొంగు కప్పుకుని మాట్లాడటంలో సంప్రదాయం లేదనీ, స్త్రీని గౌరవించి ఆమెకు ఇవ్వవలసిన స్పేస్‌ని ఆమెకు ఇవ్వడంలో మాత్రమే సంప్రదాయం ఉందనీ గ్రహింపునకు వచ్చేవరకు ఈ ఇనిషియల్ ఘర్షణ ఉండేదే. కాలానికి తగ్గట్టు చూపూ ఉంటే బొట్టుందా, భుజాలపైకి కత్తిరించిన జుట్టుందా అని కళ్లు వెతుక్కోవు. -
ప్రతి విశ్వాసిలో ఒక తప్పిపోయిన కుమారుడు...
పొద్దున నిద్రలేస్తూనే ‘ఈ రోజు నేను నా జీవితాన్ని పాడుచేసుకుంటాను’ అనుకొని మరీ తమ జీవితాన్ని పాడు చేసుకునే వారు బహుశా ఎవరూ ఉండరు. నిర్ణీతపథం నుండి తప్పిపోయేవాళ్లలో ఎక్కువమంది చాలా మంచి వాళ్ళు, తెలివైనవాళ్లు, అవకాశమొచ్చిఉంటే అత్యున్నతమైన స్థితికి చేరగలిగిన సామర్థ్యం ఉన్నవాళ్లే ఉంటారు. కాని ఎక్కడో, ఎప్పుడో తీసుకున్న ఒక చిన్న తప్పుడు నిర్ణయం, అనవసరమైన తొందరపాటుతనం, సందిగ్ధంలో ఉన్నపుడు ఎవరైనా పెద్దల్ని సంప్రదించాలన్న ఇంగితం లోపించడమే జీవితంలో ‘తప్పిపోవడానికి’ కారణాలవుతూంటాయి. యేసుప్రభువు చెప్పిన తప్పిపోయిన కుమారుని ఉపమానం లోని చిన్న కుమారుడు, తండ్రి ఆధీనంలో జీవించడం కన్నా, తన వంతు ఆస్తిని తీసేసుకొని వెళ్లిపోయి సుదూరదేశంలో ‘స్వేచ్ఛగా’ జీవించాలన్న తన బలమైన కోరిక వల్ల ‘తప్పిపోయాడు’. కాని అతడూహించుకున్న తండ్రి ఆధిపత్యం లేని దూరదేశపు స్వేచ్ఛాజీవితం, అతనికి దూరపుకొండల నునుపు జీవితమే అయ్యింది. తండ్రి దూరమవడంతోనే దుష్టసాంగత్యంలో దుర్వ్యసనాలు దగ్గరయ్యాయి. ఆస్తంతా కరిగి చిల్లిగవ్వ కూడా లేక ‘బతకడానికి’ చివరికి పందులు మేపవలసిన దుస్థితి దాపురించింది. కోరుకున్న ‘స్వేచ్ఛ’ అతనికి దొరికింది, కాని తండ్రి సాంగత్యంలో తనకుండిన ‘ఆధిక్యతలన్నీ’ అందుకు మూల్యంగా అతను కోల్పోయాడు. తండ్రిలేని, ఆయనతో పాటే ఉండే ఆంక్షలు, క్రమశిక్షణ లేని జీవితాన్ని కోరుకున్న అవివేకి అని అతన్ని అనాలా లేక అతనివి అతి తెలివి తేటలనాలా? (లూకా 15వ అధ్యాయం).చాలామంది అనుకొంటున్నట్టుగా యేసుప్రభువు ఈ ఉదంతాన్ని దేవుని ఎరుగని అన్యులకు చెప్పలేదు. దేవునితో పాటే జీవిస్తూ, దేవుని సహవాసపు అమూల్యత్వాన్ని గ్రహించక దేవునికి దూరం కావాలనుకునే, దూరమయ్యే ‘క్రైస్తవులకే’ ఆయన ఈ ఉదంతాన్ని చెప్పాడు. డబ్బుతో కొనగలిగే సుఖానుభవాలే గొప్ప అనుకున్నాడు కాని ఒక గొప్ప తండ్రికి కుమారుడుగా తనకు సహజంగా లభించిన డబ్బుతో వెలగట్టలేని ఎన్నో అత్యున్నతమైన ఆత్మీయ ఆశీర్వాదాలు ఎంత గొప్పవో గ్రహించలేకపోయాడు. తండ్రితో పాటే ఉంటూ ఆయన వారసుడుగా అన్నింటిపైనా ఆజమాయిషీ చేయడం చాలా చిన్న విషయమనుకున్నాడు. అయితే దిగజారి ఎంతో హీనమైన పందులు మేపే పని దొరికినా చాలని చివరికి సరిపెట్టుకున్నాడు. తప్పిపోయిన జీవితమంటే పరమ తండ్రి అయిన దేవదేవుని మార్గదర్శకత్వం, ఆజమాయిషీ లేని జీవితమని ఈ ఉపమానం చెబుతోంది. రోజుకు వెయ్యిసార్లు దేవుని పేరెత్తుతూ కూడా, నిజజీవితంలో మాత్రం దేవునికి దూరంగా జీవించేవారికి, పేరుకు మాత్రం దేవుని పిల్లలమని చెప్పుకొంటూ నేతిబీరకాయలాగా దేవుడు లేని పిల్లలుగా జీవించే వేషధారులకు, ఒక్క ఆదివారం ఉదయం మాత్రం కొద్దిసేపు చర్చిలో దేవుని తలచుకొని మిగిలిన సోమవారం నుండి శనివారం దాకా సమయమంతా దేవునికి దూరంగా జీవించడానికే ఇష్టపడే నామకార్ధపు క్రైస్తవానికి ఈ తప్పిన కుమారుడు నిలువెత్తు నిదర్శనం! అందుకే అపొస్తలుడైన యాకోబు తనపత్రికలో తప్పిపోయిన మన పొరుగువారిని తిరిగి దారి మళ్లించడం మన క్రైస్తవ ధర్మమని అది దైవరాజ్యనిర్మాణంలో ప్రాముఖ్యమని పేర్కొన్నాడు(5:19.20). చర్చి జీవితంలో సరిదిద్దడం (ఇౌటట్ఛఛ్టిజీౌ), పడిపోయిన వారిని తిరిగి లేపడం అత్యంత ప్రాముఖ్యమైన అంశాలు. తండ్రి ప్రేమ ఏమిటో యెరిగి కూడా దానికి దూరమై జీవితంలో పందులు మేపే స్థితిని కొనితెచ్చుకోవడమే తప్పిపోయిన కుమారుడు చేసిన తెలివి తక్కువ పని. అయితే అతను ‘బుద్ధి’ తెచ్చుకున్నపుడు మాత్రం తన స్థితికి తన స్నేహితులను నిందించలేదు. తనను తానే నిందించుకున్నాడు. ‘నేను పాపం చేశాను, నీకు యోగ్యుడనైన కుమారుణ్ణి కాను నేను’ అన్నాడతను. అంతే, తండ్రి అతని మీద మీద పడి, ఏడ్చి, ముద్దుపెట్టుకొని తనదంతా కుమారునికిచ్చాడు. ఈ ఉదంతం నేర్పేదొక్కటే! పశ్చాత్తా్తపం లేని నామకార్థపు జీవితంలో తండ్రితోపాటే ఉన్నా ఆయనవేవీ విశ్వాసివి కావు. కాని నిజమైన పశ్చాత్తా్తపంతో తిరిగొచ్చి తండ్రిని ఆశ్రయిస్తే తండ్రిదంతా కుమారునిదే! ఎందుకంటే తండ్రికి పశ్చాత్తా్తపపడ్డ కుమారుడే సర్వస్వమ్. – రెవ. డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
పెద్దలూ ఒళ్లువంచాల్సిందే..
లండన్ : దీర్ఘకాలం ఆరోగ్యంగా, చురుగ్గా ఉండాలంటే మధ్యవయస్కుల నుంచీ వృద్ధులూ ఓ మాదిరి కఠిన వ్యాయామాలు చేయాల్సిందేనని తాజా అథ్యయనం స్పష్టం చేసింది. రోజుకు పదివేల అడుగులు నడవడం కూడా సరిపోదని పెద్దలు దృఢంగా, బ్యాలెన్స్డ్గా ఉండాలంటే మరింత శ్రమించాల్సిందేనని పరిశోధకులు హెచ్చరించారు. పోల్ డ్యాన్స్, థైచీ, టెన్నిస్, క్రికెట్ వంటి ఆటలతో పాటు జిమ్‌లో బరువులు ఎత్తడం, భారీ బ్యాగ్‌లు మోయడం వంటి కఠిన వ్యాయామాలు చేపట్టాలని సూచించారు. పెద్దలు తమ శారీరక ఆరోగ్యానికి అవసరమైన స్ధాయిలో వ్యాయామం చేయడం లేదని పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్(పీహెచ్ఈ) పేర్కొంది. స్ర్తీ, పురుషులు వారానికి కనీసం 150 నిమిషాల పాటు వ్యాయామంతో పాటు రెండు సెషన్స్ స్ర్టెంథ్ ట్రైనింగ్ చేపట్టాలని ప్రభుత్వ మార్గదర్శకాలను పలువురు విస్మరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ తరహా వ్యాయామాలతో కండరాలు, ఎముకలు పటిష్టమై శరీరం మంచి సమతూకంతో ఉంటూ తరచూ పడిపోవడం, ఫ్రాక్చర్లు, వెన్ను నొప్పి, అకాల మరణం వంటి ముప్పులను నిరోధిస్తుందని పీహెచ్ఈ, ఛారిటీ ది సెంటర్ ఫర్ ఏజింగ్ బెటర్‌తో కలిసి నిర్వహించిన అథ్యయనంలో వెల్లడైంది. వేగంగా నడవడం వంటి ఏరోబిక్ ఎక్సర్‌సైజ్‌లతో పాటు ప్రతి ఒక్కరూ వారానికి రెండు సార్లు బరువులు ఎత్తడం వంటి కఠిన వ్యాయామాలు చేయాలని పీహెచ్ఈకి చెందిన డాక్టర్ అలిసన్ టెడ్స్టోన్ సూచించారు. ముఖ్యంగా మహిళలు గర్భం దాల్చినప్పుడు, మొనోపాజ్ దశలో, పురుషులు పదవీవిరమణ అనంతరం ఈ తరహా వ్యాయామాలు చేయడం ద్వారా తదుపరి దశల్లో వారు చురుకుగా ఉంటారని చెప్పారు. -
జపాన్ను వణికిస్తున్న ‘జనాభా’
టోక్యో : ఏ దేశాభివృద్ధికైనా కీలకం యువశక్తి. దేశ జనాభాలో యువతరం ఎంత ఎక్కువగా ఉంటే ఆర్ధికాభివృద్ధి అంత ఎక్కువగా ఉంటుంది. ప్రసుత్తం ఈ విషయమే జపాన్ దేశంలో తీవ్ర ఆందోళనలు కల్గిస్తోంది. ఎందుకంటే గత 30 ఏళ్లుగా జపాన్ దేశ జనాభాలో యువతరం క్రమంగా తగ్గుతూ వస్తోంది. జపాన్ అంతర్గ వ్యవహారాలు, సమాచార మంత్రిత్వ శాఖ 2018, ఏప్రిల్ 1న విడుదల చేసిన నివేదిక ప్రకారం గత ఏడాదితో పోల్చి చూస్తే ఈ ఏడాది యువతరం జనాభా 1,70,000 తగ్గింది. ఆందోళన కల్గించే మరో అంశం వృద్దుల జనాభా పెరగడం. ప్రస్తుతం జపాన్ దేశ జనాభా 12.6 కోట్లు. కాగా వారిలో యువతరం(12 నుంచి 14 సంవత్సరాలలోపు) జనాభా కేవలం 32 లక్షలు మాత్రమే. అదే అమెరికాలో 18.9 శాతం, చైనాలో 16.8 శాతం, భారత దేశంలో 30.8 శాతం యువతరం జనాభా ఉండగా జపాన్‌లో మాత్రం 12.3 శాతం యువతరం జనాభా ఉన్నది. రోజురోజుకు తగ్గిపోతున్న జనాభాను పెంచడం కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపట్టింది. ప్రజలను ఎక్కువ మంది పిల్లల్ని కనమని ప్రోత్సాహించడమే కాక నగదు ప్రోత్సాహకాలను కూడా అందిస్తోంది. ఈ చర్యల ఫలితంగా 2015 వరకూ 1.4 శాతంగా ఉన్న సంతానోత్పత్తి 2025 నాటికి 1.8 శాతానికి పెరుగుతుందని అంచనా. యువతరం - ఆర్థికాంశాలు రోజురోజుకు తగ్గిపోతున్న జనాభా వల్ల ప్రస్తుతం ఉన్న 12.6 కోట్ల జనాభా, 2060 నాటికి 8.67 కోట్లకు పడిపోనున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. యువతరం జనాభా తగ్గడమే కాక వృద్ధుల సంఖ్య పెరుగుతండటంతో దేశ ఆర్థికవ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొనున్నట్లు ప్రభుత్వ గణంకాలు వెల్లడిస్తున్నాయి. పనిచేసే వారు తగ్గినప్పుడు పన్నులు కట్టే వారి సంఖ్య కూడా తగ్గుతుంది. ఫలితంగా దేశ ఖజానాకు గండి పడుతుంది. పెరుగుతున్న వృద్ధులకు ఆరోగ్య సేవలు, పెన్షన్లు ఇవ్వడం ఇబ్బందిగా మారుతుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పటికీ వలసదారుల విషయంలో జపాన్ వైఖరి మాత్రం మారటంలేదు. ఎక్కువ మొత్తంలో వలసదారులకు అనుమతిచ్చి, జనాభాను పెంచే ప్రయత్నాలు మాత్రం చేయట్లేదు. అమెరికాలో మొత్తం జనాభాలో 7 శాతం విదేశీయుల సంతానం ఉండగా జపాన్‌లో మాత్రం వలసదారుల సతానం కేవలం 1.3 శాతం మాత్రమే. అంతేకాక తక్కువ జనాభా కారణంగా ఇక్కడ పనివారి కొరత కూడా తీవ్రంగా ఉంది. ఇందుకు లింగవివక్ష కూడా మరో కారణం. జపాన్‌లో స్త్రీ, పురుషలకు చెల్లిస్తున్న వేతానాల్లో 25 శాతం వ్యత్యాసం ఉంది. అంతేకాక పిల్లల సంరక్షణ, లైంగిక వేధింపులు, అసమానతలు వంటి అంశాల వల్ల ఇప్పటికి కొన్నిరకాల విధులు నిర్వహించడానికి జపాన్ మహిళలు ముందుకురావడం లేదు. మానవ వనరుల కొరతను తగ్గించుకోవాలంటే 2050 నాటికి జపాన్ తన దేశ జనాభాలో, మూడొంతులు యువతరం ఉండేలా జాగ్రత్త పడాలి. అంతేకాక వేతనాలు పెంచడం, పని ప్రదేశాల్లో మహిళలకు మెరుగైన సౌకర్యాల కల్పన, భద్రతను పెంచడమే కాక వలసదారులను ఎక్కువ మొత్తంలో అనుమతిస్తే పరిస్థితిలో మార్పు వస్తుందని ప్రభుత్వ నివేదిక పేర్కొంది. -
పెళ్లి చేసుకోకపోయినా కలిసుండొచ్చు
న్యూఢిల్లీ : యుక్త వయస్సు వచ్చిన వారికి వివాహంతో సంబంధం లేకుండా తమకు నచ్చిన వారితో జీవించే హక్కు ఉన్నదని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ప్రస్తుతం గృహహింస నిరోధక చట్టం 2005 కింద ‘లివ్ ఇన్ రిలేషన్షిప్స్’(సహజీవనాన్ని)ను శాసన సభ గుర్తించిందని తెలిపింది. చట్ట బద్దమైన వివాహ వయసు కంటే ముందే పెళ్లి చేసుకున్నారని కేరళకు చెందిన ఓ మేజర్ దంపతుల వివాహాన్ని కేరళ హైకోర్టు కొట్టివేసింది. దాంతో తనకు న్యాయం చేయాల్సిందిగా ఆ యువకుడు సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. ఈ విన్నపం విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు వివాహంతో సంబంధం లేకుండా యుక్త వయసుకు వచ్చిన వారు తమకు నచ్చిన వారితో జీవించే హక్కు ఉందని తీర్పు వెలువరించింది. అప్పీలు వివరాలు... కేరళకు చెందిన నందకుమార్ అనే వ్యక్తి తుషారా అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వివాహం నాటికి వీరిరువురు మేజర్లు అయినప్పటికి నందకుమార్‌కు మాత్రం 21 ఏళ్లు నిండలేదు. బాల్య వివాహ నిరోధక చట్టం ప్రకారం అమ్మాయికి 18 ఏళ్లు, అబ్బాయికి 21 ఏళ్లు నిండిన వారు మాత్రమే వివాహానికి అర్హులు. దీనిని ఆధారంగా చేసుకుని కేరళ హైకోర్టు నందకుమార్, తుషార్ల వివాహం చెల్లదని తీర్పునిచ్చింది. అంతేకాక తుషార్‌ను ఆమె తల్లిదండ్రులకు అప్పగించింది. కేరళ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ నందకుమార్ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. సుప్రీం కోర్టు ఈ అప్పీలును విచారించడానికి జస్టిస్ ఏ కే సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్ అధ్వర్యంలో ఒక బెంచ్‌ను ఏర్పాటు చేసింది. నందకుమార్, తుషార్ ఇద్దరు హిందూవులే కనుక హిందూ వివాహ చట్టం సెక్షన్ 12 ప్రకారం వీరి వివాహం చెల్లుబాటు అవుతుందని, అంతేకాక ఇద్దరు మేజర్లు అయిన కారణంగా వారికి కలిసి జీవించే హక్కుందని తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా ‘లవ్ జీహాద్’గా పేరు గాంచిన వైకోమ్‌కు చెందిన ‘హదియా’ కేసును ఉదహరించింది. కేరళ వైకోమ్‌కు చెందిన 24 ఏళ్ల హోమియో వైద్య విద్యార్థిని హదియా తాను ప్రేమించిన జహన్‌ను వివాహం చేసుకోవడానికి ఇస్లాం మతంలోకి మారింది. ఈ కేసు సందర్భంగా సుప్రీం కోర్టు ఇద్దరు యుక్త వయస్కుల వివాహ విషయంలో కోర్టు జోక్యం చెల్లదని తీర్పునిచ్చిన సంగతిని గుర్తు చేసింది. అందువల్ల నందకుమార్, తుషార్ల వివాహం చెల్లుతుందని, వారిరువురికి కలిసి జీవించే హక్కు ఉందని తీర్పు నిచ్చింది. నందకుమార్‌కి ఈ నెల 31 నాటికి 21 ఏళ్లు నిండుతాయి. -
పెద్దల మెదడు మొద్దుబారదు..
లండన్ : వృద్ధుల మెదడు మొద్దుబారుతుందని, యువకులతో పోలిస్తే వారి మెదడు కణాల్లో ఎదుగుదల మందగిస్తుందనే అంచనాలను తాజా అథ్యయనం పటాపంచలు చేసింది. యువకుల తరహాలోనే పెద్దవయసు వారి మెదడు కణాలూ వృద్ధి చెందుతాయని కొలంబియా యూనివర్సిటీ పరిశోధకుల అథ్యయనంలో తొలిసారిగా వెల్లడైంది. 79 సంవత్సరాల వయస్సున మహిళలు, పురుషుల మెదడు కణాలు 14 సంవత్సరాల వయసు వారి తరహాలోనే వ్యాప్తి చెందుతున్నాయని తమ పరిశోధనలో వెల్లడైనట్టు రీసెర్చర్లు తెలిపారు. పెద్దల మెదడులో కొత్త న్యూరాన్లు పెరగవని గతంలో పలు అథ్యయనాలు వెల్లడించాయి. అయితే జర్నల్ సెల్ స్టెమ్ సెల్లో ప్రచురితమైన నూతన అథ్యయనంలో మాత్రం ఇందుకు భిన్నమైన అంశాలు వెలుగుచూశాయి. తాజా అథ్యయన ఫలితాలు అల్జీమర్స్ వ్యాధుల వంటి పలు మానసిక, న్యూరలాజికల్ వ్యాధుల చికిత్సలో మెరుగైన పద్ధతుల ఆవిష్కరణకు దారితీస్తాయని చెబుతున్నారు. అంచనాలకు భిన్నంగా సీనియర్ సిటిజన్లు మెరుగైన జ్ఞాపకశక్తిని, సరైన భావోద్వేగ నియంత్రణలను కలిగి ఉంటారని తమ పరిశోధనలో వెల్లడైందని అథ్యయనానికి నేతృత్వం వహించిన కొలంబియా యూనివర్సిటీకి చెందిన న్యూరోబయాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మౌరా బోల్డ్రినీ తెలిపారు. పెద్దల మెదడులో కొత్తగా న్యూరాన్ల పెరుగుదల నిలిచిపోవడంతో వారిలో జ్ఞాపకశక్తి మందగిస్తుందని గతంలో శాస్త్రవేత్తలు భావించేవారు. అయితే యువత మాదిరే పెద్దల మెదడులోనూ వేలాది కొత్త న్యూరాన్లు పుట్టుకొస్తున్నాయని డాక్టర్ బోల్ర్డినీ చెప్పారు. -
‘అక్షరం’రాలే..!
వయోజనులకు అక్షరాలు నేర్పించే సాక్షరభారత్ కేంద్రాల మూసివేత తప్పదా? సంపూర్ణ అక్ష్యరాస్యత సాధన కోసం 2010 సెప్టెంబర్ 8న కేంద్రప్రభుత్వం ప్రారంభించిన సాక్షరభారత్ మిషన్ గడువు 2015తోనే ముగిసింది. నిర్దేశిత లక్ష్యం సాధించలేదనే కారణంతో గతరెండేళ్లలో మూడుసార్లు దీని కాలపరిమితిని పొడిగిస్తూ వచ్చింది. ఇప్పుడు మరో ఐదురోజులే గడువు ఉండడంతో సర్కారు నేటికీ ఎలాంటి స్పష్టతనివ్వలేదు. దీంతో ఈనెల 31 తర్వాత అభ్యసన కేంద్రాల భవిష్యత్ ఏమిటనే దానిపై సర్వత్రా ఆందోళన నెలకొంది. సిరిసిల్ల: వేలిముద్రవేసే వారికి అక్షరాలు నేర్పించి అక్షరాస్యులగా తీర్చిదిద్దడమే సాక్షర భారత్ లక్ష్యం. 2009 సెప్టెంబరు 8న ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ సాక్షర భారత్ పథకం ప్రారంభించారు. క్షేత్రస్థాయిలో 2010 సెప్టెంబర్ 8న అభ్యసన కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో గ్రామానికోటి చొప్పున 211 కేంద్రాలను నెలకొ ల్పారు. వీటి ద్వారా చదువుకున్న వయోజనులకు వి ద్యను నిరంతరం అందించడం, దినపత్రికలు, కథల పుస్తకాలు అందించి చదువు కొనసాగించడం ముఖ్య ఉద్దేశం. చదువురాని వారికి అక్షరాలు నేర్పించాలి. కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం, సాక్షర భారత్ గ్రామ కో ఆర్డినేటర్ల అలసత్వంతో కేంద్రాలు మొక్కుబడిగానే సాగుతున్నా యి. ప్రతీ గ్రామంలో ఇద్దరు కో ఆర్డినేటర్లను నియమించారు. వీరికి నెలకు రూ.2000 వేతనం చెల్లిస్తున్నారు. మండలస్థాయిలో కో ఆర్డినేటర్లకు రూ.6000 వేతనం అందిస్తున్నారు. అయితే, 15 నెలలుగా వేతనాలు అందక కో ఆర్డినేటర్లు ఇబ్బందులు పడుతున్నారు. కొనసాగింపుపై సందిగ్ధం..! సాక్షర భారత్ కొనసాగింపుపై సందిగ్ధం ఉంది. దీని స్థానంలో కొత్త పథకం ప్రారంభించాలనే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. వేతనాలు పెంచి సమర్ధవంతంగా పథకం నిర్వహించాలని భా విస్తున్నా.. ఎంత వేతనం ఇవ్వాలనే అంశంపై స్పష్టత లేదు. కొత్తజిల్లాలు ఏర్పాటైనా ఉమ్మడి జిల్లాలోనే నే టికీ ఈ పథకం నిర్వహణ సాగుతోంది. కొత్త మండలాల్లోనూ కేంద్రాల విభజన జరగలేదు. జెడ్పీ చైర్పర్సన్ అధ్యక్షతన, వయోజన విద్య డెప్యూటీ డైరెక్టర్ పర్యవేక్షణలో ఉండగా.. కొత్త జిల్లాలో పర్యవేక్షణ క రువైంది. వయోజనులు చదువుకునే సామాగ్రి కూడా సరఫరా కాలేదు. జిల్లాకు సూపర్వైజర్ రాంరెడ్డి వ్య వహరిస్తున్నా.. ఆయనఒక్కడే ఉండడంతో పనిఒత్తిడి పెరిగింది. జిల్లాలో ఆరు నెలలకోసారి ప్రారంభించా ల్సిన స్కీం(కొత్త బ్యాచ్)ల విషయంలోనూ నిర్లక్ష్యం చోటుచేసుకుంటోంది. నిజానికి జీతాలు సరిగా.. ఇవ్వకపోవడం.. పర్యవేక్షణ లోపంతో మొక్కు‘బడి’గా మారింది. కానీ చిత్తశుద్ధితో పనిచేస్తే.. క్షేత్రస్థాయిలో మంచిఫలితాలు రానున్నాయి. -
మానసిక ఒత్తిడిలో కశ్మీర్!
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో తాజాగా నిర్వహించిన ఓ సర్వే ఫలితాలు విస్తుగొలిపేలా ఉన్నాయి. కశ్మీర్ వయోజనుల్లో సుమారు సగం మంది తీవ్రమైన మానసిక ఒత్తిడి సమస్యను ఎదుర్కొంటున్నారు. మెడిసిన్స్ సాన్స్ ఫ్రాంటియర్స్(ఎమ్ఎస్ఎఫ్) నిర్వహించిన ఈ సర్వేలో అక్కడ ప్రతి ఇద్దరు వయోజనుల్లో ఒకరు తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నారని తేలింది. రోజు వందలాది మంది ప్రజలు మానసిక సమస్యలతో కశ్మీర్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని కశ్మీర్ యూనివర్సిటీ సైకాలజీ డిపార్ట్మెంట్తో కలిసి ఎమ్ఎస్ఎఫ్ నిర్వహించిన ఈ సర్వే నివేదికలో వెల్లడించారు. 1.8 మిలియన్ల కశ్మీర్ వయోజనులు మానసిక ఒత్తిడిలో మగ్గుతున్నట్లు తెలిపారు. ఆ ప్రాంతంలోని ఘర్షణ పూరితమైన వాతావరణం వీరిలో మానసిక సమస్యలకు ప్రధాన కారణంగా తెలిపారు. యువతలో సైతం జ్ఞాపక శక్తిని కోల్పోవటం, తలనొప్పి, ఒంటరిగా ఉండాలనే కోరిక లాంటి లక్షణాలు మానసిక ఒత్తిడి మూలంగా కలుగుతున్నాయని సైకియాట్రిస్ట్ అర్షిద్ హుస్సేన్ తెలిపారు. -
ఆ విషయంలో ముసలివాళ్లే మేలట..!
న్యూయార్క్: భావ వ్యక్తీకరణలో వయో వృద్ధులే మేలంటున్నారు పరిశోధకులు. యువత కన్నా.. అరవై ఏళ్ళ వయసు దాటినవారే బాధ, ఒంటరితనం వంటి అన్ని రకాల భావాలను వ్యక్త పరచడంలో సానుకూల స్పందన కలిగిఉంటున్నారని తాజా అధ్యయనాల్లో కనుగొన్నట్లు చెబుతున్నారు. భావోద్వేగాల విషయంలోనూ వృద్ధులే అత్యంత అనుకూలమైన, చురుకైన ప్రవర్తన కలిగి ఉంటున్నారని చెప్తున్నారు. యువతలో ఎమోషన్స్ ఎక్కువగా ఉంటున్నాయని, వృద్ధులు నిర్మలమైన అనుభూతులను, ప్రశాంతతను కలిగి ఉన్నట్లు అమెరికా మసాచెట్స్ ఆమ్హెస్గ్ విశ్వవిద్యాలయం ప్రధాన పరిశోధకుడు రెబెక్కా రెడీ ఓ నివేదికలో వెల్లడించారు. 60 నుంచి 90 ఏళ్ళ వయసువారితోపాటు, 18 నుంచి 32 ఏళ్ళ వారిలో అనుకూల, ప్రతికూల భావోద్వేగాలపై పరిశోధనలు జరిపిన అధ్యయనకారులు వివరాలను ఏజింగ్ అండ్ మెంటల్ హెల్త్ జర్నల్ లో ప్రచురించారు. పరిశోధనల్లో వృద్ధులు యువతకన్నా సంతోషంగా, ఆనందంగా ఉండటమే కాక, ఎంతో నిర్మలమైన మనసుతోనూ, సానుకూల భావోద్వేగాలను కలిగి ఉండటాన్ని గమనించినట్లు వెల్లడించారు. యువ, వృద్ధ బృందాల్లో అనేక లక్షణాల్లో పోలిక ఉన్నప్పటికీ విచారం, ఒంటరితనం, ప్రశాంతత వంటి వాటిలో మాత్రం విభేధాలను గమనించినట్లు చెప్తున్నారు. యువత.. సిగ్గు, విచారం, చికాకు, ఒంటరితనం వంటి వాటిని వ్యక్త పరచడంలో స్వీయ నిందను వెలిబుచ్చడం చూసి ఎంతో ఆశ్చర్యపోయినట్లు ప్రధాన పరిశోధకుడు రెడీ చెప్తున్నారు. ఇటువంటి విషయాల్లో వృద్ధులే సాపేక్ష స్వభావాన్ని కలిగి ఉండటాన్ని ఆయన ప్రశంసించారు. అమెరికాలోని వృద్ధుల్లో భావోద్వేగాలను తెలుసుకోవడం వల్ల వైద్య పరంగా గణనీయమైన ఫలితాలను అందించే అవకాశం ఉంటుందని పరిశోధక బృందం వెల్లడించింది. మానసిక వైద్యులకు, కేర్ టేకర్లకు, వర్కర్లకు వృద్ధుల సంరక్షణా బాధ్యతలు నిర్వహించడంలో వారి స్వభావ పరిశీలన ఎంతో అవసరమని, తమ పరిశోధన అందుకు సహాయపడుతుందని చెప్తున్నారు. -
సంగీతం వింటే ఫిట్స్ వచ్చే జబ్బు!
మెడి క్షనరీ నిజానికి సంగీతం అంటే పిల్లలూ, పెద్దలతో పాటు మూగజీవాలూ పరవశిస్తాయని అంటారు. కానీ ఈ జబ్బు ఉన్నవాళ్లు సంగీతం వినగానే ఫిట్స్ వచ్చి పడిపోతారు. ఇలా వచ్చే ఫిట్స్‌ను ‘మ్యూజిక్ ఇండ్యూస్డ్ సీజర్స్’ అని పిలుస్తారు. అలాగే ఫిట్స్ ఇలాంటివే మరికొన్ని చిత్రమైన కారణాలతోనూ రావచ్చు. కొందరికి వేడినీళ్లు ఒంటి మీద పడ్డా ఫిట్స్ రావచ్చు మరికొందరిలో టీవీ తెరపై కనిపించే వెలుగులు లేదా మానిటర్ నుంచి వచ్చే కాంతితోనూ రావచ్చు. వేడినీళ్లు తలమీద గుమ్మరించుకోవడం వల్ల వచ్చే ఫిట్స్‌ను ‘హాట్‌వాటర్ ఎపిలెప్సీ’ అంటారు. టీవీ నుంచి లేదా వీడియోగేమ్స్ ఆడేటప్పుడు కనిపించే కాంతి వల్ల వచ్చే ఫిట్స్‌ను ఫొటోసెన్సిటివ్ ఎపిలెప్సీ అంటారు. కొన్ని పెద్ద పెద్ద వేదికలపై కాంతిపుంజాలు కదిలేలా అమర్చే లైట్లు వెదజల్లే ఫ్లాష్ లైట్లతోనూ కొందరికి ఫిట్స్ రావచ్చు. చిన్నారులు, టీనేజీ పిల్లల్లో ఈ తరహా ఫిట్స్ ఎక్కువ. కొందరు బాణాసంచా వెలుగులను తట్టుకోలేక కూడా ఫిట్స్‌కు గురికావచ్చు. ఈ తరహా ఫిట్స్‌ను ఫొటోసెన్సిటివ్ ఎపిలెప్సీ అంటారు. ఇలాంటి అన్ని సందర్భాల్లోనూ న్యూరోఫిజీషియన్లు ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రామ్ (ఈఈజీ) అనే పరీక్ష నిర్వహించి, వ్యాధి నిర్ధారణ చేసి, తగిన చికిత్స అందిస్తారు. -
భక్తి శ్రద్ధలతో దీపావళి వేడుకలు
బళ్లారి అర్బన్ : దీపావళి పర్వదినాన్ని నగరంలో బుధవారం నుంచి శుక్రవారం వరకు ఘనంగా జరుపుకున్నారు. నరక చతుర్దశి, లక్ష్మీపూజ, బలి పాడ్యమి వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ప్రతి అంగడి ముందు వాహనాలను ముస్తాబు చేశారు. కొబ్బరి ఆకులు, మామిడి పూల తోరణాలతో అలంకరించారు. మార్వాడీలు ఎక్కువగా నివసించే జైన్‌మార్కెట్ మారుతీకాలనీ, బెంగళూరు రోడ్డు, 2వ రైల్వేగేటు వద్ద, తేరుబజారు, బ్రూస్‌పేట్ వీధుల్లో దుకాణాల్లో విశేషంగా లక్ష్మీపూజలు నిర్వహించారు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా బాణసంచా పేల్చి సంబరాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా గురువారం రాత్రి స్థానిక బ్రూస్‌పేట్ సీఐ మాంతేష్, కాంగ్రెస్ నాయకుడు కాండ్ర సతీష్, హీరాలాల్ తదితరులు మార్వాడి దుకాణదారులతో కలిసి పూజలు చేశారు. హొస్పేటలో.. హొస్పేట : దీపావళి పండుగను నగర వాసులు గురువారం రాత్రి ఘనంగా జరుపుకున్నారు. లక్ష్మీదేవి అమ్మవారిని విశేషంగా అలంకరించి పూజలు చేశారు. చిన్నారులు, మహిళలు పెద్దలు కలిసి బాణసంచా పేల్చి సంబరాలను చేసుకున్నారు. శ్రీరామనగర్‌లో.. శ్రీరామనగర్ : పట్టణ ప్రజలు గురువారం దీపావళి పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. వ్యాపారులు తమ దుకాణాల్లో లక్ష్మిదేవి ప్రతిమ ఉంచి వ్యాపారం అభివృద్ధి చెందాలని కోరుతూ పూజలు చేశారు. దేవి ఫైనాన్స్ అధినేత, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు టీ.జయరామిరెడ్డి మాట్లాడుతూ ఈ దీపావళి సమస్త ప్రజలకు సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలను కలుగ జేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అలాగే చిలుకూరి రామకృష్ణ, కాంతారావు తమ వ్యాపార సంస్థల్లో పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా పంచాయతీ సభ్యులు పిల్లి కొండయ్య, తమ్మినీడి సత్యనారాయణ, కనకగిరి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చిలుకూరి అఖిల్, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
పెద్దలే కాదు.. పిల్లలు పొగరాయుళ్లే!
వాషింగ్టన్ : పిల్లలు.. ఏపాపం తెలియని చల్లని వారే అనేది మనకు తెలిసిన సత్యం. కానీ ప్రస్తుత తాజా గణంకాలు మాత్రం పిల్లలు పొగరాయుల్లే అని చెబుతున్నాయి. పెద్దలు పొగ త్రాగడం పరిపాటే అయినా. పిల్లలు పొగ త్రాగడానికి ఇష్టపడటం ఏమిటని అనుకుంటున్నారా. పెద్దలు ఇచ్చే అలసత్యమే పిల్లలు పొగ త్రాగే అలవాటుకు దారి తీస్తుందని తాజా విశ్లేషణలో తేలింది. భారతదేశంలో 30 శాతానికి పైగా పిల్లలు ప్రొగ త్రాగడానికి ఇష్ట పడతారని వెల్లడైంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికంగా వెనుకబడిన దేశాలు, ఇప్పుడే ఆర్థికంగా ఎదుగుతున్న దేశాలలో ఈ జాడలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బ్రెజిల్, రష్యా, ఇండియా, నైజీరియా, పాకిస్తాన్, చైనా దేశాలలో పిల్లలు ప్రక్కతోవ పట్టడం అనేది ఎక్కువగా ఉందని తేలింది. కొన్ని షాపుల్లో 5 నుంచి 6 ఏళ్ల పిల్లలకు కూడా పొగాకు విక్రయిస్తుండటం కూడా వారు దానివైపు మళ్లేందుకు దోహదం చేస్తుందని విశ్లేషణలో వెల్లడైంది. ఈ చర్యల నుంచి పిల్లలను దూరంగా ఉంచాలంటే తల్లి దండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవటంతో పాటు , మీడియాకు దీనిపై అవగాహన కల్పించాలని అవసరం ఉంది.