Corendon Airlines Adultonly Zone: టర్కిష్-డచ్ కొరెండన్ ఎయిర్‌లైన్స్ వినూత్న నిర్ణయం తీసుకుంది. తన విమానాల సర్వీసుల్లో "పెద్దలకు మాత్రమే" విభాగాన్ని ఎయిర్‌లైన్ ప్రారంభించడం వార్తల్లో నిలిచింది. అసలు అడల్ట్స్ ఓన్లీ జోన్ అర్థం ఏమిటి, ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది ఈ కథనంలో తెలుసుకుందాం.
పిల్లల గోల లేకుండా ప్రశాంతంగా..
ది హిల్ రిపోర్ట్ ప్రకారం విమానంలో ప్రయాణించే ప్రయాణికులకు చిన్న పిల్లల గొడవ లేకుండా ఉండేందుకు, ప్రశాంతంగా ప్రయాణాన్ని కొనసాగించేందుకు ఈ స్పెషల్ జోన్‌ను లాంచ్ చేసినట్టు కొరండెన్ ఎయిర్‌లైన్స్ తెలిపింది. "పెద్దలకు మాత్రమే" జోన్ అనేది నిశ్శబ్ద వాతావరణంలో పని చేయాలనుకునే వ్యాపార ప్రయాణీకులకు బాగా ఉపయోగపడుతుందని, అలాగే తమ పిల్లలు ఏడుస్తున్నప్పుడు తోటి ప్రయాణీకులనుంచి వచ్చే విమర్శలు, మాటలునుంచి పిల్లలు గల పేరెంట్స్‌కు కూడా ఆందోళన తగ్గుతుందని చెప్పింది. 16, అంతకంటే ఎక్కువ వయస్సు ప్రయాణీకుల సౌలభ్యంకోసం ఈ జోన్‌ను ప్లాన్ చేస్తోంది. ఈ పథకం కింద, ఎయిర్‌లైన్ ఉపయోగించే ఎయిర్‌బస్ A350లలో కొన్ని సీట్లు రిజర్వ్ చేస్తారు. డచ్ కరేబియన్ ద్వీపం అయిన ఆమ్‌స్టర్‌డామ్, కురాకో మధ్య విమానాల్లో ఈ జోన్‌లు నవంబర్‌లో లాంచ్ చేయనుంది.
అదనపు వాత తప్పదు మరి!
విమానంలో ముందు భాగం "పెద్దలకు మాత్రమే" జోన్‌లను ఏర్పాటు చేస్తారు ఇందులో తొమ్మిది అదనపు-పెద్ద సీట్లు అదనపు లెగ్‌రూమ్ , 93 స్టాండర్డ్ సీట్లతో ఉంటాయి. వాల్స్, కర్టెన్ల ద్వారా జోన్ భౌతికంగా మిగిలిన విమానం నుండి వేరు చేస్తామని, ప్రశాంతంగా, రిలాక్స్డ్ వాతావరణాన్ని కల్పించడమే దీని ఉద్దేశమని పేర్కొంది. అయితే వన్‌వేలో ఈ సీట్లకు అదనంగా 45 యూరోలు (రూ4,050), అదనపు పెద్ద సీట్లకు అదనంగా 100 యూరోలు (రూ.8,926) చెల్లించాల్సి ఉంటుంది. నెదర్లాండ్స్‌లో ఇలాంటి జోన్‌ను తీసుకొచ్చిన తొలి విమానయాన సంస్థగా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment