European
-
దిక్కులు చూస్తున్న ఫ్రాన్స్!
యూరప్ దేశాల్లో జర్మనీ తర్వాత రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా వెలిగిపోతున్న ఫ్రాన్స్ సంక్షోభం నుంచి సంక్షోభానికి ప్రయాణిస్తున్నది. దేశాన్ని చుట్టుముట్టిన అనిశ్చితి పోవాలంటే ఎన్నికలొక్కటే మార్గమని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానియెల్ మేక్రాన్ ఆర్నెలల క్రితం భావించి పార్లమెంటు రద్దుచేశారు. కానీ మొన్న జూలైలో నిర్వహించిన ఎన్నికల్లో ఎవరికీ మెజారిటీ రాకపోవటంతో సమస్య మొదటికొచ్చింది. దిక్కుతోచని స్థితిలో రెండు నెలల అనంతరం మైకేల్ బార్నియర్‌ను ప్రధాని పీఠంపై కూర్చోబెట్టారు. కానీ అది మూడునెలల ముచ్చటైంది. ఆరు దశాబ్దాల చరిత్రలో అవిశ్వాస తీర్మానం ద్వారా పతనమైన తొలి ప్రభుత్వం బార్నియర్ దే. అతి తక్కువ కాలం ప్రధానిగా పనిచేసిన అప్రదిష్ట కూడా ఆయనదే. ఫ్రాన్స్ పెద్ద ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. ఉద్యోగాల కోత, పరిశ్రమల మూత రివాజుగా మారాయి. అసలే పడిపోయిన నిజ వేతనాలతో, నిరుద్యోగ బెడదతో బతుకులు ఎలా నెట్టుకు రావాలో తెలియక పౌరులు కొట్టుమిట్టాడుతున్నారు.ప్రజల కొనుగోలు శక్తి క్షీణించటంతో రెస్టరెంట్లు, చిన్నా పెద్దా దుకాణాలు మూసేస్తున్నారు. ఈ దశలో పులి మీద పుట్రలా ప్రభుత్వ వ్యయాన్ని అదుపుచేసే పేరిట బార్నియర్ భారీ కోతలకు దిగారు. ఇది ప్రతిఘటనకు దారితీసింది. పబ్లిక్ రంగ సంస్థల సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇప్పటికే సమ్మెకు పిలుపునిచ్చారు. కరోనా మహమ్మారి విరుచుకుపడక ముందు యూరప్ దేశాల్లో అగ్రగాములుగా వెలిగిన జర్మనీ, ఫ్రాన్స్‌లు రెండూ 2021నుంచి ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. ఆర్థిక స్వస్థతకు తీసుకున్న చర్యలు ఫలించ బోతున్నాయన్న సంకేతాలున్న తరుణంలోనే రష్యా–ఉక్రెయిన్ యుద్ధం వచ్చిపడి ఆర్థిక వ్యవస్థలను మరింత దెబ్బతీసింది. జర్మనీ కొంతవరకూ దీన్ని తట్టుకోగలిగినా ఇంధన సంక్షోభంతో, భారీ వడ్డీ రేట్లతో ఫ్రాన్స్ కుదేలవుతోంది. ఒకపక్క ఊపిరాడనీయని రుణ భారం, మరోపక్క ద్రవ్యలోటు ఆ దేశాన్ని పీడిస్తున్నాయి. లాక్డౌన్ సమయంలో సజావుగా నడిచేందుకు, ఉద్యోగులకు వేతనాలు చెల్లించేందుకూ పరిశ్రమలకు ప్రభుత్వం ఉదారంగా పంచిన 15,000 కోట్ల యూరోలు ఆవిరైపోయాయి. సరిగదా... ఇంధన ఆధారిత సంస్థలు ఉత్పత్తిని తగ్గించి వేలాదిమందిని తొలగించబోతున్నామని గత నెలలో ప్రకటించాయి. నెక్సిటీ వంటి భారీ నిర్మాణరంగ సంస్థ సైతం తడిసి మోపెడవుతున్న వడ్డీ రేట్ల కారణంగా కొత్త పెట్టుబడులకు వెళ్లటం లేదని తెలిపింది. పర్యవసానంగా వేలాదిమంది ఉద్యోగాలు కోల్పోక తప్పని స్థితి ఏర్పడింది. ప్రభుత్వ రుణాలు కనీవినీ ఎరుగని రీతిలో 3 లక్షల 20 వేల కోట్ల యూరోలకు చేరాయి. ఇది దేశ జీడీపీ కన్నా 112 శాతం అధికం. గ్రీస్, స్పెయిన్ వంటి దేశాలను మించి ప్రభుత్వ లోటు 6.1 శాతం చేరుకుంది. సంపన్నులకూ, కార్పొరేట్ సంస్థలకూ ఇచ్చిన పన్ను రాయితీల వల్ల కాస్తయినా ప్రయోజనం లేకపోగా, వచ్చే ఏడాది కనీసం 6,000 కోట్ల యూరోలు పొదుపు చేయటానికి తాత్కాలికంగా పన్నులు పెంచుతామని మొన్న అక్టోబర్‌లో ప్రతిపాదించగానే అంతంత మాత్రంగా నడుస్తున్న సంస్థలు అంతెత్తున లేచాయి. కొత్త పెట్టుబడులకు ఆస్కారమే లేని స్థితిలో ఈ పన్నుల మోతేమిటని ప్రశ్నించాయి.ఫ్రెంచి పౌరులు గర్వపడే పారిస్‌లోని 860 యేళ్లనాటి పురాతన భవంతి నోటర్‌డామ్ కేథడ్రిల్కు 2019లో నిప్పంటుకుని చాలా భాగం ధ్వంసమైనప్పుడు సంక్షోభంలో కూరుకుపోయిన వర్తమాన ఆర్థిక స్థితికి అది అద్దం పడుతోందని అనేకులు వ్యాఖ్యానించారు. అయిదేళ్లలో దాన్ని పునర్నిర్మించి అద్భుతంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చిన మేక్రాన్ జయప్రదంగా ఆ పని పూర్తిచేయగలిగారు. కానీ ఆర్థికవ్యవస్థ మాత్రం ఆయనకు చుక్కలు చూపిస్తోంది. మామూలుగా అయితే శనివారం 50మంది ప్రపంచాధినేతలు, కాబోయే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వగైరాల సమక్షంలో ఆ భవంతి ప్రారంభం కాబోయే వేళ మేక్రాన్ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యేవారు. కానీ తాజా రాజకీయ సంక్షోభం ఎదుర్కొనటం ఎలాగో తెలియక ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.577మంది సభ్యులుండే దిగువసభ ‘అసెంబ్లీ నేషనల్’లో ప్రభుత్వం ఏర్పాటుచేసే పక్షానికి కనీసం 289 స్థానాలు కావాలి. కానీ వామపక్ష న్యూ పాపులర్ ఫ్రంట్‌కు 182, మేక్రాన్‌కు చెందిన ఎన్సెంబుల్కు 168 ఉన్నాయి. తీవ్ర మితవాద పక్షం నేషనల్ ర్యాలీ (ఆర్ఎన్)కి 143 సీట్లున్నాయి. వామపక్ష ఫ్రంట్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని బలపరచటం ద్వారా ఆర్ఎన్ ఇప్పుడు బార్నియర్ ప్రభుత్వ పతనానికి కారణమైంది. తన బడ్జెట్ పార్లమెంటులో నెగ్గే స్థితి లేదని తెలిసి రాజ్యాంగంలోని అధికరణ ఉపయోగించి బార్నియర్ దాన్ని అమల్లోకి తెచ్చారు.పర్యవసానంగా అవిశ్వాస తీర్మానం ఎదుర్కొనక తప్పదని అర్థమైనా ఆయన ఈ మార్గం ఎంచుకున్నారు. రాజ్యాంగ నిబంధన ప్రకారం ఏడాది గడిస్తే తప్ప... అంటే వచ్చే ఏడాది జూలై వరకూ మళ్లీ ఎన్నికలు జరపకూడదు. కనుక అప్పటివరకూ ఫ్రాన్స్‌కు ఆపద్ధర్మ ప్రభుత్వమే గతి. ఈలోగా తన వైఫల్యాలను అంగీకరించి మేక్రాన్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సిరావొచ్చు. ఫలితంగా దేశానికి మరిన్ని ఇక్కట్లు తప్పవు. అంతంతమాత్రంగా ఉన్న తమ బతుకులు ఆర్ఎన్ నిర్ణయంవల్ల మరింత అధోగతికి చేరాయని జనం అనుకుంటే అధ్యక్ష ఎన్నికల్లో ఆ పదవి దక్కించుకోవాలని తాపత్రయ పడుతున్న ఆర్ఎన్ అధినాయకురాలు మెరిన్ లీ పెన్ ఆశలు అడుగంటినట్టే. ఫ్రాన్స్ సంక్షోభం మరింత వికటిస్తే అది మొత్తం యూరప్ దేశాల ఆర్థికవ్యవస్థలను అనిశ్చితిలో పడేస్తుంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతోసహా అన్ని సంక్షోభాలూ ఆగితేనే ఈ ప్రమాదం నుంచి గట్టెక్కడం యూరప్‌కు సాధ్యమవుతుంది. -
హరికృష్ణ, విదిత్ జట్టుకు టైటిల్
బెల్గ్రేడ్ (సెర్బియా): ప్రతిష్టాత్మక యూరోపియన్ చెస్ క్లబ్ కప్ (యూసీసీసీ) టీమ్ టోర్నమెంట్ ఓపెన్ విభాగంలో చెక్ రిపబ్లిక్కు చెందిన నోవీ బోర్ చెస్ క్లబ్ జట్టు విజేతగా నిలిచింది. 68 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ టోర్నీలో నోవీ బోర్ క్లబ్ జట్టు టైటిల్ నెగ్గడం ఇది మూడోసారి. 2013లో, 2022లోనూ ఈ జట్టుకు టైటిల్ లభించింది. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో మొత్తం 84 జట్లు పోటీపడ్డాయి. నిర్ణీత ఏడు రౌండ్ల తర్వాత నోవీ బోర్ క్లబ్ 13 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఆరు మ్యాచ్‌ల్లో నెగ్గిన నోవీ బోర్ జట్టు ఒక మ్యాచ్ ను ‘డ్రా’ చేసుకొని టోర్నీని అజేయంగా ముగించింది. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్, చెక్ రిపబ్లిక్లో స్థిరపడ్డ పెంటేల హరికృష్ణ, భారత గ్రాండ్‌మాస్టర్, మహారాష్ట్ర ప్లేయర్ విదిత్ సంతోష్ గుజరాతి నోవీ బోర్ జట్టుకు టైటిల్ దక్కడంలో కీలకపాత్ర పోషించారు. హరికృష్ణ 6 గేమ్‌లు ఆడి 3.5 పాయింట్లు సాధించగా... విదిత్ కూడా 6 గేమ్‌లు ఆడి 4 పాయింట్లు సంపాదించాడు. విన్సెంట్ కెమెర్ (జర్మనీ), డేవిడ్ నవారా (చెక్ రిపబ్లిక్), డేవిడ్ ఆంటోన్ గిజారో (స్పెయిన్), థాయ్ డాయ్ వాన్ ఎన్గుయెన్ (చెక్ రిపబ్లిక్), నీల్స్ గ్రాండెలియస్ (స్వీడన్), మాటెజ్ బార్టెల్ (పోలాండ్) విజేత జట్టులో ఇతర సభ్యులుగా ఉన్నారు. భారత నంబర్‌వన్, ప్రపంచ నాలుగో ర్యాంకర్ ఇరిగేశి అర్జున్ సభ్యుడిగా ఉన్న అల్కాలాయిడ్ క్లబ్ (నార్త్ మెసెడోనియా) 12 పాయింట్లతో రన్నరప్‌గా నిలిచింది. అర్జున్ 7 గేమ్‌లు ఆడి 5.5 పాయింట్లు స్కోరు చేశాడు. 11 పాయింట్లతో వాడోస్ చెస్ క్లబ్ (రొమేనియా) మూడో స్థానాన్ని దక్కించుకుంది. మహిళల విభాగంలో ప్రపంచ జూనియర్ చాంపియన్, భారత స్టార్ దివ్య దేశ్‌ముఖ్ సభ్యురాలిగా ఉన్న గరుడ అజ్కా బీఎస్కే క్లబ్ జట్టు 11 పాయింట్లతో రన్నరప్‌గా నిలిచింది. -
అగ్రరాజ్యాలు కళ్లు తెరుస్తాయా?
తెగేదాకా లాగితే ఏమవుతుందో అమెరికాతోపాటు యూరప్ దేశాలు తెలుసుకోవాల్సిన సందర్భమిది. బుధవారం రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉత్తర కొరియాను సందర్శించి ఆ దేశంతో సైనిక ఒడంబడిక కుదుర్చుకున్నారు. ఆ మర్నాడు వియత్నాం వెళ్లి డజను ఒప్పందాలు చేసుకున్నారు. అందులో అణు పరిశోధనలకు సంబంధించిన అంశం కూడా ఉంది. వియత్నాంతో రక్షణ, భద్రత సహా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకోవటం తమ లక్ష్యమని కూడా పుతిన్ చెప్పారు. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ యుద్ధం ప్రారంభించిన నాటినుంచీ దాన్ని ఆంక్షల చట్రంలో బిగించి ఏకాకిని చేయాలని అమెరికా, యూరప్ దేశాలు తలపోశాయి. ఉత్తర కొరియా ఏనాటినుంచో అలాంటి ఆంక్షల మధ్యే మనుగడ సాగిస్తోంది. ఇరాన్ సరేసరి. ఇలా ఏకాకుల్ని చేయాలన్న దేశాలన్నీ ఏకమవుతున్నాయని, అది ప్రమాద సంకేతమని అమెరికా, పాశ్చాత్య దేశాలు గ్రహిస్తున్న దాఖలా లేదు. ఆసియా–పసిఫిక్ ప్రాంతానికి సరికొత్త భద్రతా వ్యవస్థ ఏర్పడాలన్నదే తన ధ్యేయమని పుతిన్ అనటంలోని ఉద్దేశమేమిటో తెలుస్తూనే ఉంది. ఉత్తర కొరియా ఆవిర్భావానికీ, దాని మనుగడకూ నాటి సోవియెట్ యూనియనే కారణం. జపాన్ వలస పాలనతో సర్వస్వం కోల్పోయి శిథిలావస్థకు చేరుకున్న కొరియా భూభాగంలోకి రెండో ప్రపంచ యుద్ధం ముగింపు దశలో సోవియెట్ సైనిక దళాలు అడుగుపెట్టాయి. ఆ వెంటనే అమెరికా సైతం అప్పటికింకా సోవియెట్ సైన్యం అడుగుపెట్టని దక్షిణ ప్రాంతానికి తన సైన్యాన్ని తరలించింది. పర్యవసానంగా ఆ దేశం ఉత్తర, దక్షిణ కొరియాలుగా విడిపోయింది. సోవియెట్ స్ఫూర్తితో సోషలిస్టు వ్యవస్థ ఏర్పడిందని మొదట్లో ఉత్తర కొరియా ప్రకటించినా అక్కడ అనువంశిక పాలనే నడుస్తోంది. ఆ దేశం గురించి పాశ్చాత్య మీడియా ప్రచారం చేసే వదంతులే తప్ప అక్కడ ఎలాంటి వ్యవస్థలున్నాయో, అవి ఏం సాధించాయో తెలుసుకునే మార్గం లేదు. ఇటు పెట్టుబడిదారీ వ్యవస్థ వేళ్లూనుకున్న దక్షిణ కొరియా, అమెరికా అండదండలతో బహుముఖ అభివృద్ధి సాధించింది. సోవియెట్ యూనియన్ కుప్పకూలి రష్యా ఏర్పడ్డాక ఉత్తర కొరియాతో ఆ దేశానికున్న సంబంధాలు క్రమేపీ కొడిగట్టాయి. ప్రచ్ఛన్న యుద్ధ దశ అంతమైందని, ఇక ప్రపంచం నిశ్చింతగా ఉండొచ్చని అందరూ అనుకున్నారు. అమెరికా, పాశ్చాత్య దేశాలు పేరాశకు పోనట్టయితే ఆ ఆశ సాకారమయ్యేది. అది లేకపోబట్టే ప్రపంచం మళ్లీ గతంలోకి తిరోగమిస్తున్న వైనం కనబడుతోంది. అనునిత్యం సమస్యలతో సతమతమయ్యే ఆ పరిస్థితులు తిరిగి తలెత్తటం ఖాయమన్న అంచనాలు వస్తున్నాయి.కొన్నేళ్లక్రితం వరకూ ఉత్తర కొరియాపై కారాలు మిరియాలు నూరుతున్న పాశ్చాత్య దేశాలను రష్యా పెద్దగా పట్టించుకునేది కాదు. పొరుగునున్న చైనానుంచే ఆ దేశానికి సమస్త సహకారం లభించేది. 1994లో తనకున్న ఒక అణు రియాక్టర్నూ మూసేయడానికి ఉత్తర కొరియా అంగీకరించింది. అందుకు బదులుగా అమెరికా నుంచి రెండు విద్యుదుత్పాదన అణు రియాక్టర్లు స్వీకరించటానికి సిద్ధపడింది. కానీ 2002లో జార్జి డబ్ల్యూ బుష్ అధికారంలోకొచ్చాక ఆ ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దుచేశారు. ఈ పరిణామాల సమయంలోకూడా రష్యా మౌనంగానే ఉంది. శత్రువు శత్రువు తన మిత్రుడని ఎంచి ఇప్పుడు అదే రష్యా తాజాగా ఉత్తర కొరియాతో సైనిక ఒప్పందం కుదుర్చుకుంది. తన నేతృత్వంలోని వార్సా కూటమిని రద్దుచేసుకుని, నాటోలో చేరడానికి రష్యా సిద్ధపడినప్పుడు తిరస్కరించింది నాటోయే. తూర్పు దిశగా విస్తరించే ఉద్దేశం తమకు లేదని, దాని సరిహద్దు దేశాలకు నాటో సభ్యత్వం ఇవ్వబోమని హామీ ఇచ్చిన ఆ సంస్థ అందుకు విరుద్ధంగా ప్రవర్తించింది. పొరుగునున్న చిన్న దేశాలపై పెత్తనం చలాయించాలన్న యావ రష్యాకుంటే దాన్ని ఎలా దారికి తేవాలో ఆ దేశాలు నిర్ణయించుకుంటాయి. కానీ వాటితో అంటకాగి రష్యాను చికాకు పర్చటమే ధ్యేయంగా గత రెండు దశాబ్దాలుగా అమెరికా, పాశ్చాత్య దేశాలు ప్రవర్తించాయి. ఈమధ్య ఇటలీలో జీ–7 సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శాంతియుతంగా, చర్చలద్వారా ఉక్రెయిన్ సమస్యకు పరిష్కారం అన్వేషించాలని సూచించారు. కానీ వినేదెవరు? విశ్వసనీయతగల అంతర్జాతీయ సంస్థల మధ్యవర్తిత్వంలో రష్యా, ఉక్రెయిన్ల మధ్య చర్చలు జరిగితే, ఒప్పందం కుదిరితే అది ఆ రెండు దేశాలకూ మాత్రమే కాదు, ప్రపంచానికి కూడా మంచి కబురవుతుంది. ప్రపంచం ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం అంచుల్లో ఉంది. అమెరికా, దాని ప్రత్యర్థులు రష్యా, చైనాలు ప్రధాన అణ్వస్త్ర దేశాలు. అమెరికా వద్ద దాదాపు 1,700 అణ్వస్త్రాలున్నాయి. అందులో కనీసం సగం నిమిషాల్లో ప్రయోగించేందుకు వీలుగా నిరంతర సంసిద్ధతలో ఉంటాయంటారు. అమెరికాపై ఒక్క అణ్వస్త్రం ప్రయోగించినా క్షణాల్లో యూరప్, ఆసియా దేశాల్లోని దాని స్థావరాలనుంచి పెద్ద సంఖ్యలో అణ్వస్త్రాలు దూసుకెళ్లి శత్రు దేశాలను బూడిద చేస్తాయి. రష్యా, చైనాలపై దాడి జరిగినా ఇదే పరిస్థితి. చిత్రమేమంటే ఒకప్పుడు అణ్వాయుధాలపై బహిరంగ చర్చ జరిగేది. అది ఉద్రిక్తతల నివారణకు తోడ్పడేది. 80వ దశకంలో మధ్యతరహా అణ్వాయుధాల మోహరింపు యత్నాలు జరిగినప్పుడు అమెరికా, యూరప్ దేశాల్లో భారీయెత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఫలితంగా అప్పటి అమెరికా అధ్యక్షుడు రీగన్, నాటి సోవియెట్ అధ్యక్షుడు గోర్బచెవ్ వాటి నిషేధానికి సంసిద్ధులయ్యారు. కానీ సాధారణ ప్రజలకు సైతం యుద్ధోన్మాదం అంటించారు. ఈ పరిస్థితులు మారాలి. అగ్రరాజ్యాలు వివేకంతో మెలిగి శాంతి నెలకొనేందుకు చిత్తశుద్ధితో కృషిచేయాలి. -
ఇజ్రాయెల్‌పై కొత్త ఒత్తిళ్లు
పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తిస్తూ కొత్తగా నార్వే, స్పెయిన్, ఐర్లాండ్ ప్రకటన చేయడం ఇజ్రాయెల్ మీద ఒత్తిడిని పెంచింది. ప్రస్తుతం రఫా మీద భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ ఇప్పటివరకూ సుమారు 36,000 మంది పాలస్తీనియన్ల మరణానికి కారణమైంది. అంతర్జాతీయ నేర న్యాయస్థానం ప్రాసిక్యూటర్ కరీం ఖాన్ ఏకంగా గాజా నేరాలపై విచారణ కోసం నెతన్యాహూకు అరెస్టు వారెంట్లు జారీ చేయవలసిందిగా కోర్టుకు ప్రతిసాదించారు. నిరుడు అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్ల దాడిలో సుమారు 1200 మంది యూదులు మృతి చెందడానికి ప్రతీకారంగా తమ ఆత్మ రక్షణ కోసం హమాస్‌ను పూర్తిగా నిర్మూలించటం తమ లక్ష్యమనీ, తమను నిందించవలసింది లేదనీ ఇజ్రాయెల్ వాదిస్తున్నది. దీన్ని ప్రపంచం నిరాకరిస్తున్నది.పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తిస్తున్నట్లు మూడు యూరోపియన్ రాజ్యాలు ఈ నెల 22న ప్రకటించటంతో ఇజ్రాయెల్‌కు కొత్త చిక్కులు మొదలవుతున్నాయి. అమెరికా ఒత్తిళ్లను సైతం తోసిపుచ్చి నార్వే, స్పెయిన్, ఐర్లండ్‌లు ఈ ప్రకటన చేయటం గమనార్హం. పైగా వీటిలో నార్వే, స్పెయిన్ నాటో సభ్య దేశాలు. పాలస్తీనాను ప్రపంచంలో ఇప్పటికే 143 దేశాలు గుర్తించినందున ఆ జాబితాలో ఈ మూడు కూడా చేరటం వల్ల సాధారణంగానైతే విశేషం ఉండదు. కానీ ఇజ్రాయెల్ సైన్యం గాజాలో గత ఆరు మాసాలుగా సాగిస్తున్న మారణహోమం పట్ల ప్రపంచ వ్యాప్తమైన తీవ్ర నిరసనల మధ్య సైతం అమెరికన్ ప్రభుత్వం ఇజ్రాయెల్‌కు అడుగడుగునా మద్దతునిస్తున్న స్థితిలో, ఈ మూడు దేశాల ప్రకటనకు తగిన ప్రాముఖ్యత ఏర్పడుతున్నది. వీరి నిర్ణయంతో ఇజ్రాయెల్‌పై కలిగిన ఒత్తిడికి రుజువు కొద్ది గంటలలోనే కనిపించింది. నార్వే, ఐర్లండ్, స్పెయిన్‌ల నుంచి తమ రాయబారులను నెతన్యాహూ ప్రభుత్వం వెనక్కి రప్పించింది. తమ రాజధాని టెల్ అవీవ్‌లో గల ఆ మూడు దేశాల రాయబారులను పిలిపించి నిరసనను తెలియజేసింది. వారు పాలస్తీనియన్ల తీవ్రవాదాన్ని సమర్థిస్తున్నారనీ, తమకు గల ఆత్మ రక్షణ హక్కును గుర్తించటం లేదనీ, సమస్య పరిష్కారానికి ఆటంకాలు సృష్టిస్తున్నారనీ వ్యాఖ్యానించింది. అదే సమయంలో, గాజాపై తమ యుద్ధం యథావిధిగా కొనసాగగలదని స్పష్టం చేసింది. దీనిని బట్టి, మూడు యూరోపియన్ దేశాల ప్రకటన ఇజ్రాయెల్‌పై ఏవిధంగా ప్రత్యేకమైన ఒత్తిడిని సృష్టించిందో గ్రహించవచ్చు. ఈ విధమైన తీవ్ర ఒత్తిడి ఇది మూడవది కావటం మరొక గమనించదగ్గ పరిణామం. గతవారం ద హేగ్ లోని అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు) ప్రాసిక్యూటర్ కరీం ఖాన్, గాజా నేరాలపై విచారణ కోసం నెతన్యాహూకు అరెస్టు వారెంట్లు జారీ చేయవలసిందిగా కోర్టుకు ప్రతిసాదించారు. అది ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంచలనమైంది. ఇజ్రాయెల్ అయితే భూమ్యాకాశాలను ఏకం చేయటం మొదలుపెట్టింది. అమెరికన్ బైడెన్ ప్రభుత్వమైతే కోర్టును ఖండించటమే గాక, ఆ న్యాయమూర్తులపై ఆంక్షలు విధించగలమనే స్థాయికి వెళ్ళింది. విశేషమేమిటంటే, స్వయంగా నాటో సభ్య దేశాలైన ఫ్రాన్స్, బెల్జియం మొదలైనవి కరీం ఖాన్ ప్రతిపాదనలను బలపరిచాయి. ఇందులో మరో విశేషం ఉన్నది. ఈ నాటో రాజ్యాలు ఒకవైపు అమెరికాతో పాటు ఇజ్రాయెల్‌కు ఆయుధ సరఫరా చేస్తున్నాయి. మరొకవైపు ఐక్యరాజ్య సమితిలో, భద్రతా సమితిలో ఇజ్రాయెల్‌కు అనుకూలంగా అమెరికా ఓటు వేస్తున్నా అవి మాత్రం ఓటు వేయటం లేదు. పైగా ఇప్పుడు కరీం ఖాన్ చర్యను సమర్థిస్తున్నాయి. ఇది ఒక స్థాయిలో పరస్పర విరుద్ధమైన వైఖరి. కానీ వారనేది, ఇజ్రాయెల్ ఆత్మరక్షణ చేసుకోవలసిందే గానీ అంతర్జాతీయ నియమ నిబంధనలను ఉల్లంఘించకూడదని!మొత్తానికి క్రిమినల్ కోర్టు పరిణామం ఇజ్రాయెల్‌పై ఇటీవలనే ఏర్పడిన మరొక ఒత్తిడి. ప్రాసిక్యూషన్ వారంట్ల జారీ ముగ్గురు హమాస్ అగ్ర నేతలకు కూడా జరగాలని కరీం ఖాన్ సిఫారసు చేశారు. దానిని హమాస్ కూడా ఖండించింది. కానీ ఇజ్రాయెల్ స్పందనలు విపరీత స్థాయిలో ఉన్నాయి. అమెరికాతో పాటు ఆ శిబిరానికి చెందిన కొన్ని దేశాలు అందుకు తోడయ్యాయి. ఇంతకూ కరీం ఖాన్ ప్రతిపాదనను చివరికి కోర్టు ఆమోదిస్తుందా, మార్పులు చేస్తుందా, తిరస్కరిస్తుందా తెలియదు. ఒకవేళ ఆమోదిస్తే పరిస్థితి ఏమిటన్నది ప్రశ్న. హమాస్ నేతలు అజ్ఞాతంలో ఉన్నందున వారి అరెస్టు సాధ్యం కాదు. నెతన్యాహూ ఇజ్రాయెల్‌లో ఉన్నంతకాలం ఆయన అరెస్టూ వీలుకాదు. ఇందులో మరొక మెలిక ఉంది. కోర్టులో సభ్యత్వం గల దేశాలకు వెళ్లినట్టయితే మాత్రమే వారంట్లు వర్తిస్తాయి. ఆ యా ప్రభుత్వాలు వారిని అరెస్టు చేయక తప్పదు. ప్రస్తుతం ఆ సభ్య దేశాల సంఖ్య 124. వాటిలో అమెరికా, రష్యా, చైనా, ఇండియా వంటివి లేవు. సభ్య దేశాలలో అమెరికా లేదు గాని యూరోపియన్ యూనియన్‌లోని మొత్తం 27 దేశాలకూ సభ్యత్వం ఉంది. ఇది నెతన్యాహూకే గాక అమెరికాకు కూడా చాలా చిక్కులు తెచ్చి పెట్టే స్థితి. నెతన్యాహూకు వారంట్లు జారీ కావచ్చుననే చర్చ ఇప్పటికే వారం రోజులుగా సాగుతున్నది. దానితో, ఏమి చేయాలంటూ అమెరికా, యూరోప్ ఇప్పటికే తలలు పట్టుకుంటున్నాయి. కొందరు అటు, కొందరు ఇటుగా చీలిపోయారు. వారికి సంకట పరిస్థితి ఏమంటే, ప్రపంచ వ్యవహారాలన్నీ నియమ నిబంధనల ప్రకారం సాగాలని పట్టుదలగా వాదించేది వారే. అటువంటప్పుడు, తామే ఒప్పందంపై సంతకాలు చేసిన అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు వారంట్లను ఎట్లా తిరస్కరించగలరు? ఈ స్థితి నెతన్యాహూను గత పదిరోజులుగా భయపెడుతున్నది. ఆయనపై తీవ్రమైన ఒత్తిడిని సృష్టించిన మూడవ పరిణామం అంతర్జాతీయ న్యాయస్థానం గత జనవరిలో చెప్పిన వ్యతిరేక తీర్పు. గాజాలో ఇజ్రాయెల్ అమాయక పౌరుల సామూహిక హననానికి, విధ్వంసానికి పాల్పడుతున్నదనీ, వేలాదిమంది స్త్రీ పురుషులు, పిల్లలు, వృద్ధులు, రోగులు ప్రాణాలు కోల్పోయారనీ, ప్రజలకు ఆహార పానీయాలు, మందులు సైతం అందకుండా నిర్బంధాలు విధిస్తున్నారనీ దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఆ న్యాయస్థానంలో కేసు వేసింది. అప్పుడు కూడా ఇజ్రాయెల్ నానా హంగామా సృష్టించింది. అయినా కోర్టు ఇజ్రాయెల్‌కు వ్యతిరేక తీర్పునిచ్చింది. అయినప్పటికీ ఇజ్రాయెల్ మారణకాండ ఆగలేదు. దక్షిణాఫ్రికా ఆరోపణలు నిజమైనట్లు అనేక స్వతంత్ర సంస్థల నివేదికలే గాక, సాక్షాత్తూ ఐక్యరాజ్య సమితి, ప్రపంచ ఆహార సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థ, మానవ హక్కుల సంస్థల నివేదికలు కూడా ధ్రువీకరించాయి. అయినప్పటికీ, నిరుడు అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్ల దాడిలో సుమారు 1200 మంది యూదులు మృతి చెందడానికి ప్రతీకారంగా తమ ఆత్మ రక్షణ కోసం హమాస్‌ను పూర్తిగా నిర్మూలించటం తమ లక్ష్యమనీ, ఆ క్రమంలోనే ఇప్పటికి దాదాపు 35,000 పాలస్తీనియన్లు మరణించారనీ, అందులో తమను నిందించవలసింది లేదనీ ఇజ్రాయెల్ వాదిస్తున్నది. ఈ వాదనలను అత్యధిక ప్రపంచం నిరాకరిస్తున్నది.ఇక్కడ రెండు సమస్యలున్నాయి. మొదటిది, ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు. రెండవది, మౌలికంగా పాలస్తీనా సమస్య దశాబ్దాల పాటు పరిష్కారం కాకుండా పెచ్చరిల్లుతుండటం. ఇటీవల ఇంత జరుగుతున్నా అమెరికన్లు ఇజ్రాయెల్‌కు వేలకు వేల కోట్ల డాలర్ల ఆయుధాలు సరఫరా చేస్తూ, ఆర్థికసాయం కూడా పంపుతున్నారు. ఐక్యరాజ్య సమితిలో ఇజ్రాయెల్‌కు అనుకూలంగా ఓటు వేస్తూ, భద్రతా సమితిలో వీటోను ఉపయోగిస్తున్నారు. పాలస్తీనా రాజ్యం ఏర్పాటును వ్యతిరేకిస్తూ, అటువంటి ఒప్పందం అంటూ జరిగితే అది ఇజ్రాయెల్, పాలస్తీనియన్ల మధ్య చర్చల ద్వారా జరగవలసిందే తప్ప బయటి జోక్యంతో కాదని విచిత్రమైన వాదన చేస్తున్నారు. మరొకవైపు ఇజ్రాయెల్ మాత్రం పాలస్తీనా ప్రసక్తే లేదనీ, తామే ఆ భూభాగాలను నియంత్రించగలమనీ అంటున్నది. గాజా బయట వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో యూదు సెటిలర్లు క్రమక్రమంగా పెరిగిపోతూ అక్కడి పాలస్తీనియన్లను నిర్మూలిస్తున్నారు. అయినప్పటికీ అమెరికా ఈ విధమైన వైఖరి తీసుకోవటానికి ఏకైక కారణం వారి సామ్రాజ్యవాద ప్రయోజనాలు. మొదటి నుంచి ఇప్పటి వరకూ అంతే. కనుకనే తాము స్వయంగా నిర్వహించిన క్యాంప్ డేవిడ్, ఓస్లో ఒప్పందాల ప్రకారం గానీ, ఐక్యరాజ్యసమితి తీర్మానాల ప్రకారం గానీ పాలస్తీనా దేశాన్ని ఏర్పడనివ్వటం లేదు. వారిని ధిక్కరించి ఇప్పుడు నార్వే, స్పెయిన్, ఐర్లండ్‌లతో కలిపి (ఇండియా సహా) 146 ప్రపంచ దేశాలు స్వతంత్ర పాలస్తీనాను గుర్తిస్తున్నాయి.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకులు -
నేను డిఫరెంట్
ఆజంగఢ్: తాను భిన్నమైన వ్యక్తినని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘‘సాధారణంగా రాజకీయ నాయకులు హామీలిచి్చ, వాటిని అమలు చేయకుండా తప్పించుకుంటూ ఉంటారు. నేను మాత్రం అలా కాదు’’ అని స్పష్టం చేశారు. ‘మోదీ భిన్నమైన (డిఫరెంట్) మట్టితో రూపొందాడు’ అన్నారు. గతంలో అధికారం చెలాయించిన ప్రభుత్వాలు ఎన్నో హామీలిచ్చాయని, కానీ వాటిని నిలబెట్టుకోలేదని విమర్శించారు. పథకాలను ప్రకటించి, వాటిని అమలు చేయకుండా ప్రజల కళ్లకు గంతలు కట్టాయన్నారు. 30–35 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వాలు చేసిన ప్రకటనలు, ఇచ్చిన హామీలను తాను సమీక్షించానని, అవి పెద్దగా అమల్లోకి రాలేదని తేలిందని వెల్లడించారు. ఎన్నికల ముందు హామీలు ఇవ్వడం, శంకుస్థాపనలు చేయడం, ఎన్నికల తర్వాత హామీలిచి్చన నాయకులు, ఆ శిలాఫలకాలు కనిపించకుండాపోవడం గతంలో ఒక తంతుగా ఉండేదన్నారు. ఈ విషయంలో తాను విభిన్నమైన వ్యక్తినని మోదీ వ్యాఖ్యానించారు. ఆయన ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని అజమ్‌గఢ్‌లో పర్యటించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు సంబంధించి రూ.42,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. ఢిల్లీ, కడప, హుబ్బళ్లి, బెలగావి, కొల్హాపూర్ తదితర విమానాశ్రయాల్లో కొత్త టెరి్మనల్ భవనాలకు వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. అభివృద్ధి విషయంలో యూపీ కొత్త శిఖరాలకు చేరుకుంటోందని, దాంతో విషం లాంటి బుజ్జగింపు రాజకీయాలు బలహీనపడుతున్నాయని చెప్పారు. బుజ్జగింపు, బంధుప్రీతి రాజకీయాల్లో చాలా ప్రమాదకరమన్నారు. ప్రాజెక్టులకు ఎన్నికలతో సంబంధం లేదు తాను ప్రారంభించిన, శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులకు రానున్న లోక్‌సభ ఎన్నికలతో సంబంధముందని ఎవరూ భావించొద్దని మోదీ అన్నారు. 2019 ఎన్నికల వేళ తానెన్నో ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశానని, అవి చాలావరకు పూర్తయ్యాయని గుర్తుచేశారు. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ స్వప్నాన్ని సాకారం చేసుకోవడానికి కృషి చేస్తున్నానని తెలిపారు. అవినీతిని పరమావధిగా భావించే కుటుంబ పారీ్టలు అధికారంలో ఉంటే అభివృద్ధి జరిగేది కాదన్నారు. ఈఎఫ్టీఏ ఒప్పందంపై హర్షం యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (ఈఎఫ్టీఏ)తో వాణిజ్య ఒప్పందంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ అసోసియేషన్‌లో సభ్యదేశాలైన ఐస్‌ల్యాండ్, లీచ్టెన్స్టీన్ నార్వే, స్విట్జర్లాండ్‌తో భారత్ కలిసి పని చేస్తుందని ప్రధాని అన్నారు. లోక్‌పాల్ ప్రమాణస్వీకారం లోక్‌పాల్ చైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ మాణిక్‌రావ్ ఖని్వల్కర్ (66) ఆదివారం బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తదితరులు పాల్గొన్నారు. -
ఈఎఫ్‌టీఏతో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
న్యూఢిల్లీ: యూరప్‌లోని నాలుగు దేశాల కూటమి యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (ఈఎఫ్టీఏ)తో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కుదుర్చుకుంది. దీని ప్రకారం వచ్చే 15 ఏళ్లలో 100 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు దేశంలోకి రానున్నాయి. తద్వారా పది లక్షల పైచిలుకు ఉద్యోగాల కల్పన జరగనుంది. అలాగే, దశల వారీగా పలు ఉత్పత్తులపై సుంకాల తొలగింపు, కొన్నింటిపై మినహాయింపు నిబంధనల కారణంగా స్విస్ వాచీలు, చాక్లెట్లు మొదలైనవి భారత్ కొంత చౌకగా లభించగలవు. లక్ష్యాల ఆధారిత పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనకు కట్టుబడి ఉండేలా ఒక ఎఫ్‌టీఏకి చట్టబద్ధత కల్పించడం చరిత్రలో ఇదే తొలిసారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇది అమల్లోకి రావడానికి దాదాపు ఏడాది సమయం పడుతుంది. ఈఎఫ్టీఏ కూటమిలో స్విట్జర్లాండ్, నార్వే, ఐస్‌ల్యాండ్, లీచ్టెన్స్టెయిన్ దేశాలు ఉన్నాయి. ఒప్పందం ప్రకారం చాలా మటుకు భారతీయ పారిశ్రామిక ఉత్పత్తులకు ఈఎఫ్టీఏ దేశాల్లో సుంకాలు ఉండవు. పలు ప్రాసెస్డ్ వ్యవసాయోత్పత్తుల మీద సుంకాలపై మినహాయింపులు లభిస్తాయి. ప్రతిగా దాదాపు 82.7 శాతం ఈఎఫ్టీఏ ఉత్పత్తుల కేటగిరీలపై భారత్ సుంకాలపరమైన ప్రయోజనాలు కలి్పంచనుంది. అలాగే, ఇరు పక్షాల సరీ్వసు రంగాల్లోనూ పరస్పర ప్రయోజనకర పరిణామాలు ఉండనున్నాయి. ఒక సంపన్న దేశాల కూటమితో ఎఫ్‌టీఏ కుదుర్చుకోవడం కీలక మైలురాయి కాగలదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ వ్యాఖ్యానించారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో భారత్–ఈఎఫ్టీఏ మధ్య 18.65 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం నమోదైంది. -
ముంచెత్తుతున్న మాంద్యం
ఒకవైపు యుద్ధాలు. మరోవైపు పర్యావరణ మార్పులు. కారణాలేమైతేనేం... ప్రపంచాన్ని క్రమంగా మాంద్యం మేఘాలు కమ్ముకుంటున్నాయి. జపాన్ ఇటీవలే ఆర్థిక మాంద్యపు ఛాయల్లోకి జారుకుంది. ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో మూడు నుంచి నాలుగో స్థానానికి దిగజారింది. బ్రిటన్ కూడా సాంకేతికంగా మాంద్యంలోకి జారుకుంది. అయితే ఇది ట్రైలర్ మాత్రమేనని ఆర్థికవేత్తలంటున్నారు. పదుల సంఖ్యలో దేశాలు ఆర్థిక ఒడిదొడుకులతో విపరీతంగా సతమతమవుతూ మాంద్యం దిశగా సాగుతున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే కనీసం మరో 18 దేశాలు ఈ జాబితాలోకి చేరడం కలవరపరుస్తోంది... ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం వరుసగా రెండు త్రైమాసికాల్లో దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో తగ్గుదల నమోదైతే సాంకేతికంగా దాన్ని మాంద్యం కిందే పరిగణిస్తారు. 2023 డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికానికి జపాన్, బ్రిటన్ రెండూ ఈ మాంద్యం బారిన పడ్డాయి. ఇవి అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలు కావడంతో ఈ పరిణామం సర్వత్రా చర్చనీయంగా మారింది. కానీ ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల చాలా దేశాల్లో మాంద్యం ఛాయలు ప్రస్ఫుటమవున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఇప్పటికే మాంద్యం బారిన పడ్డవి కొన్ని కాగా మరికొన్ని అతి త్వరలో ఆ ముప్పు దిశగా సాగుతున్నాయని హెచ్చరిస్తున్నారు. జపాన్, బ్రిటన్‌తో పాటు ఐర్లండ్, ఫిన్లండ్ కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సర నాలుగో త్రైమాసికంలో సాంకేతిక ఆర్థిక మాంద్యం బారిన పడ్డాయి. ఐర్లండ్ జీడీపీ మూడో త్రైమాసికంలో 0.7 శాతం తగ్గగా నాలుగో త్రైమాసికంలో ఇప్పటికే ఏకంగా 1.9 శాతం తగ్గుదల నమోదు చేసింది! ఫిన్లండ్ జీడీపీలో వరుసగా 0.4, 0.9 శాతం తగ్గుదల నమోదైంది. నిజానికి చాలా దేశాల్లో ఈ పరిస్థితి నెలకొని ఉందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. చాలా దేశాల నాలుగో త్రైమాసిక జీడీపీ గణాంకాలు ఇంకా రావాల్సి ఉంది. అవి వెల్లడయ్యాక సాంకేతిక మాంద్యం జాబితాలోని దేశాల సంఖ్య బాగా పెరిగేలా కన్పిస్తోంది. అయితే కనీసం మరో 10 దేశాలు జూలై–సెపె్టంబర్ త్రైమాసికంలో జీడీపీ తగ్గుదలను చవిచూశాయి. ఈ జాబితాలో కెనడా, న్యూజిలాండ్‌తో పాటు డెన్మార్క్, లగ్జెంబర్గ్, మాల్డోవా, ఎస్టోనియా, ఈక్వెడార్, బహ్రయిన్, ఐస్లాండ్, దక్షిణాఫ్రికా ఉన్నాయి. వీటిలో డెన్మార్క్, లగ్జెంబర్గ్, మాల్డోవా, ఎస్టోనియా మూడో త్రైమాసికంలోనే ఆర్థిక మాంద్యం నమోదు చేశాయి! ఇవేగాక తాజాగా నాలుగో త్రైమాసిక ఫలితాలు విడుదలైన మరో 9 దేశాల్లో కూడా జీడీపీ తగ్గుదల నమోదైంది. వీటిలో ఆరు దేశాల్లో ఇటీవలి కాలంలో జీడీపీ తగ్గుదల నమోదవడం ఇదే తొలిసారి! జీడీపీ తగ్గుదల జాబితాలో జర్మనీ వంటి ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ కూడా ఉండటం యూరప్‌ను మరింత కలవరపెడుతోంది. ఇది మొత్తం యూరప్ ఆర్థిక వ్యవస్థనే ప్రభావితం చేయడం ఖాయమన్న అంచనాలు వెలువడుతున్నాయి. నాలుగో త్రైమాసికంలో యూరో జోన్ జీడీపీ వృద్ధి సున్నాగా నమోదవడం వాటికి మరింత బలం చేకూరుస్తోంది. ఫ్రాన్స్ కూడా మాంద్యం బాట పడుతున్న సంకేతాలు ఇప్పటికే వెలువడుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ భారత్‌పై ప్రభావమెంత...? ఆర్థిక వృద్ధి విషయంలో భారత్‌కు ప్రస్తుతానికి పెద్ద సమస్యేమీ లేదు. మూడో త్రైమాసికంలో 6.5 శాతం జీడీపీ వృద్ధి రేటు నమోదైంది. నాలుగో త్రైమాసిక అంచనా 6 శాతంగా ఉంది. కాకపోతే ప్రపంచీకరణ యుగంలో ప్రపంచవ్యాప్త పరిణామాలు భారత్‌పైనా కచి్చతంగా ప్రభావం చూపనున్నాయి. పైగా మన మొత్తం ఎగుమతుల్లో 10 శాతం వాటా మాంద్యం జాబితాలోని ఆరు పెద్ద దేశాలదే! వీటిలో బ్రిటన్‌కు 11 బిలియన్ డాలర్లు, జర్మనీకి 10 బిలియన్ డాలర్ల మేరకు మన ఎగుమతులున్నాయి. సేవలు, ఐటీ రంగంలో అతి పెద్ద ఎగుమతిదారుల్లో భారత్ ఒకటన్నది తెలిసిందే. ఇక మాంద్యం కారణంగా ఆయా దేశాల్లో నమోదయ్యే ధరల పెరుగుదల మన దిగుమతులపైనా ప్రభావం చూపనుంది. మన దిగుమతుల్లో మాంద్యం బారిన పడ్డ జపాన్, ఆ ముప్పున్న జర్మనీ వాటా చెరో 17 బిలియన్ డాలర్లు! -
విదేశాలకు మన అత్తరు
యురోపియన్, అమెరికన్ పెర్ఫ్యూమ్స్ మన దేశీయ అత్తర్ల తయారీపైన తీవ్ర ప్రభావం చూపాయి. మనదైన కళారూపం కనుమరుగవుతోందని గమనించిన క్రతి, వరుణ్ టాండన్ లు అనే అన్నాచెల్లెళ్లు మన దేశీయ సాంస్కృతిక పరిమళ ద్రవ్యాల తయారీని సంరక్షించాలని పూనుకున్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన జి20 సమ్మిట్‌లో వీరి బ్రాండ్ అఫీషియల్ కానుకల జాబితాలో చేరింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కనౌజ్ నగరంలో చాలా కుటుంబాలు అత్తరు తయారీ కళను తరాలుగా కొనసాగిస్తున్నాయి. అయితే, ఈ సంప్రదాయ పద్ధతుల అత్తరు వాడకాలు విదేశీ బ్రాండ్ పర్ఫ్యూమ్లతో తగ్గిపోయాయి. కనౌజ్లో ఉంటున్న క్రతి, వరుణ్ టాండన్‌లు మనసుల్లో ఈ నిజం ఎప్పుడూ భారంగా కదలాడుతుండేది. తమ ఆలోచనలను కార్యరూపంలో పెట్టడానికి, చేస్తున్న కృషిని ఈ సోదర ద్వయం ఇలా మన ముందుంచుతున్నారు. ‘‘మా చిన్ననాటి నుంచీ ఈ కళను చూస్తూ పెరిగాం. ఈ ప్రత్యేకమైన సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడం, ప్రోత్సహించడం పట్ల మా ఆలోచనలు, చర్చలు మా ఇంట్లో ఎప్పుడూ ఉండేవి. కోవిడ్ మహమ్మారి మన దేశీయ పరిమళ ద్రవ్యాలపైన కోలుకోలేనంత దెబ్బ వేసింది. దీంతో మా ఆలోచనలను అమల్లో పెట్టాలని రెండేళ్ల క్రితం ‘బూంద్’ పేరుతో పరిమళ ద్రవ్యాల కంపెనీ ప్రారంభించాం. మనదైన సాంస్కృతిక కళపై చిన్న డాక్యుమెంటరీ రూపొందించి, ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాం. దీంతో ఆర్డర్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది’ అని వివరిస్తుంది క్రతి. చేస్తున్న ఉద్యోగాలు వదిలి... జర్మనీలోని కార్పొరేట్ కంపెనీలో పని చేసే క్రతి అక్కడి నుండి స్వదేశానికి చేరుకుంది. ముంబైలో చిత్రనిర్మాణ రంగంలో ఉన్న వరుణ్ కూడా స్వస్థలానికి చేరుకున్నాడు. ‘మేం మొదట ఈ బ్రాండ్‌ను ఏర్పాటు చేయాలనుకోలేదు. అత్తరు తయారీ కళాకారులకు జీవనోపాధి కల్పించాలనుకున్నాం. వీరు ఆదాయవనరుల కోసం అన్వేషిస్తే ఏదైనా పని దొరుకుతుంది. కానీ, మనదైన కళ కనుమరుగవుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని బ్రాండ్ తీసుకొచ్చాం. ఒకేరోజులో 100 ఆర్డర్లు వచ్చాయి. ఏడాదలో యాభై శాతం వృద్ధి వచ్చింది. ఆ తర్వాత నెలవారీ ఆర్డర్లు వెయ్యికి మించిపోయాయి. సెలబ్రిటీలు విక్కీ కౌశల్, కత్రినా కైఫ్‌లతో సహా బాలీవుడ్ వివాహాలలో మా అత్తరు పరిమళాలు వెదజల్లింది. ముఖ్యంగా ఢిల్లీలో నిర్వహించిన జి 20 సమ్మిట్‌లో 2023కి అధికారిక కానుకల భాగస్వామ్యంలో బూంద్ బ్రాండ్ ఒకటిగా ఎంపికయ్యింది. జి20 సమ్మిట్‌లో పాల్గొనడం, మా చిన్న వ్యాపారానికి గొప్ప ముందడుగుగా పనిచేసింది’అని వివరిస్తారు వరుణ్. ఒక ఆలోచనను అమలులో పెట్టడంతో వారి కుటుంబాన్నే కాదు మరికొన్ని కుటుంబాలకు ఆదాయ వనరుగా మారింది. మన దేశీయ వారసత్వ కళ ముందు తరాలకు మరింత పరిమళాలతో పరిచయం అవుతోంది. కుటుంబ సభ్యులు కూడా... కనౌజ్ పరిమళ ద్రవ్యాల కళాకారులు అత్తర్లను తయారుచేయడానికి ‘డెగ్–భాష్కా’ పద్ధతిని ఉపయోగిస్తారు. సంప్రదాయ ప్రక్రియలో సుగంధవ్య్రాల ముడిపదార్థాలను ఉపయోగించి, మట్టి పాత్రలలో తయారుచేస్తారు. మార్కెట్లోని ఇతర బ్రాండ్స్ ధరలతో పోల్చితే తక్కువ, సువాసనల ఉపయోగాలు ఎక్కువ. పెరుగుతున్న డిమాండ్‌ను బట్టి ధరలలో మార్పు ఉంటుంది. యుఎస్, యూరోప్, ఆస్ట్రేలియా, సింగపూర్ దేశాలకు 20 వేల కంటే ఎక్కువ ఆర్డర్లు పంపించాం. ఈకామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో విక్రయించడమే కాకుండా, ముంబై, జైపూర్లలో రిటైల్ స్పేస్‌లోకి కూడా ప్రవేశించాం. మా నాన్న రచనలు చేస్తుంటారు. తన అందమైన కవిత్వాన్ని ఈ అత్తరు పరిమళాలతో జోడిస్తాడు. దీంతో సువాసనలకు మరింత అకర్షణ తోడైంది. ఇప్పుడు మా బ్రాండ్‌కి 12 మంది కళాకారులతో పాటు మా కుటుంబసభ్యులు కూడా కొత్త పరిమళాలను తయారుచేసేందుకు కృషి చేస్తున్నారు’ అని వివరిస్తున్నారు ఈ సోదర సోదరీ ద్వయం. -
యూరప్ ఎకనమిక్ అవుట్‌లుక్ అధ్వాన్నం
ఫ్రాంక్ఫర్ట్: యూరోపియన్ యూనియన్ ఈ సంవత్సరం, వచ్చే ఏడాది ఆర్థిక వృద్ధి అంచనాను తగ్గించింది. తీవ్ర ద్రవ్యోల్బణంతో వినియోగదారులు వ్యయాలకు సుముఖత చూపడం లేదని, అధిక వడ్డీ రేట్లు పెట్టుబడికి అవసరమైన రుణాన్ని పరిమితం చేస్తున్నాయని యూరోపియన్ కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. సంబంధిత వర్గాల కథనం ప్రకారం, ఈయూ ప్రాంతంలో మాంద్యం భయాలు పెరిగిపోయాయి. ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలోకి తీసుకురావాలనే లక్ష్యంతో వడ్డీరేట్లు మరింత పెంచాలా? వద్దా? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. తాజా ప్రకటన ప్రకారం, 2023లో యూరో కరెన్సీ వినియోగిస్తున్న 20 దేశాల వృద్ధి రేటు క్రితం అంచనా 1.1 శాతం నుంచి 0.8 శాతానికి తగ్గించడం జరిగింది. వచ్చే ఏడాది విషయంలో ఈ రేటు అంచనా 1.6 శాతం నుంచి 1.3 శాతానికి తగ్గింది. 27 దేశాల ఈయూ విషయంలో ఈ రేటును 2023కు సంబంధించి 1 శాతం నుంచి 0.8 శాతానికి, 2024లో 1.7 శాతం నుంచి 1.4 శాతానికి తగ్గించడం జరిగింది. రష్యా–యుక్రేయిన్ మధ్య ఉద్రిక్తతలు, రష్యా నుంచి క్రూడ్ దిగుమతులపై ఆంక్షలు యూరోపియన్ యూనియన్‌లో తీవ్ర ద్రవ్యోల్బణానికి దారితీస్తోంది. -
విమానంలో "పెద్దలకు మాత్రమే" జోన్ : కారణం, ధర తెలిస్తే షాకవుతారు
Corendon Airlines Adultonly Zone: టర్కిష్-డచ్ కొరెండన్ ఎయిర్‌లైన్స్ వినూత్న నిర్ణయం తీసుకుంది. తన విమానాల సర్వీసుల్లో "పెద్దలకు మాత్రమే" విభాగాన్ని ఎయిర్‌లైన్ ప్రారంభించడం వార్తల్లో నిలిచింది. అసలు అడల్ట్స్ ఓన్లీ జోన్ అర్థం ఏమిటి, ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది ఈ కథనంలో తెలుసుకుందాం. పిల్లల గోల లేకుండా ప్రశాంతంగా.. ది హిల్ రిపోర్ట్ ప్రకారం విమానంలో ప్రయాణించే ప్రయాణికులకు చిన్న పిల్లల గొడవ లేకుండా ఉండేందుకు, ప్రశాంతంగా ప్రయాణాన్ని కొనసాగించేందుకు ఈ స్పెషల్ జోన్‌ను లాంచ్ చేసినట్టు కొరండెన్ ఎయిర్‌లైన్స్ తెలిపింది. "పెద్దలకు మాత్రమే" జోన్ అనేది నిశ్శబ్ద వాతావరణంలో పని చేయాలనుకునే వ్యాపార ప్రయాణీకులకు బాగా ఉపయోగపడుతుందని, అలాగే తమ పిల్లలు ఏడుస్తున్నప్పుడు తోటి ప్రయాణీకులనుంచి వచ్చే విమర్శలు, మాటలునుంచి పిల్లలు గల పేరెంట్స్‌కు కూడా ఆందోళన తగ్గుతుందని చెప్పింది. 16, అంతకంటే ఎక్కువ వయస్సు ప్రయాణీకుల సౌలభ్యంకోసం ఈ జోన్‌ను ప్లాన్ చేస్తోంది. ఈ పథకం కింద, ఎయిర్‌లైన్ ఉపయోగించే ఎయిర్‌బస్ A350లలో కొన్ని సీట్లు రిజర్వ్ చేస్తారు. డచ్ కరేబియన్ ద్వీపం అయిన ఆమ్స్టర్డామ్, కురాకో మధ్య విమానాల్లో ఈ జోన్లు నవంబర్‌లో లాంచ్ చేయనుంది. అదనపు వాత తప్పదు మరి! విమానంలో ముందు భాగం "పెద్దలకు మాత్రమే" జోన్లను ఏర్పాటు చేస్తారు ఇందులో తొమ్మిది అదనపు-పెద్ద సీట్లు అదనపు లెగ్‌రూమ్ , 93 స్టాండర్డ్ సీట్లతో ఉంటాయి. వాల్స్, కర్టెన్ల ద్వారా జోన్ భౌతికంగా మిగిలిన విమానం నుండి వేరు చేస్తామని, ప్రశాంతంగా, రిలాక్స్డ్ వాతావరణాన్ని కల్పించడమే దీని ఉద్దేశమని పేర్కొంది. అయితే వన్‌వేలో ఈ సీట్లకు అదనంగా 45 యూరోలు (రూ4,050), అదనపు పెద్ద సీట్లకు అదనంగా 100 యూరోలు (రూ.8,926) చెల్లించాల్సి ఉంటుంది. నెదర్లాండ్స్‌లో ఇలాంటి జోన్‌ను తీసుకొచ్చిన తొలి విమానయాన సంస్థగా నిలిచింది. -
యాంటీబయోటిక్స్ కూడా పనిచేయవా?
గుండెల నిండా హాయిగా గాలి పీల్చుకోవాలంటే భయం. మాస్కు లేకుండా ఇల్లు కదలాలంటే భయం, భయం శరీరాన్ని, మెదడుని ఆక్రమించిన కలుషిత గాలి ఇప్పుడు వ్యాధుల నుంచి బయటపడేసే సంజీవిని లాంటి యాంటీబయోటిక్స్ రెసిస్టెన్స్‌పై ప్రభావం చూపిస్తోంది. వాయు కాలుష్యంతో యాంటీబయోటిక్స్ పని చేయడం లేదని, ప్రపంచవ్యాప్తంగా ఈ కేసుల సంఖ్య పెరిగిపోతోందని తాజా అధ్యయనం హెచ్చరించింది. ఢిల్లీకి చెందిన సమత వయసు 40 సంవత్సరాలు. ఒకరోజు హఠాత్తుగా శ్వాస తీసుకోవడం కష్టమైంది. ఆస్తమా అటాక్ అయింది. ఇంట్లో ఎవరికీ లేని ఆస్తమా ఎందుకొచ్చిందా అని ఆందోళనతో ఉంటే మందులు పని చెయ్యకపోవడంతో కుటుంబ సభ్యులు బెంబేలెత్తిపోయారు. చివరికి ఆస్పత్రిలో చేరితే వైద్యులు అతి కష్టమ్మీద ఆమె ప్రాణాలు కాపాడగలిగారు. దీనికంతటికీ కారణం వాయు కాలుష్యం. వాహనాలు, పరిశ్రమలు వెదజల్లే కాలుష్యం గాల్లో కలిసిపోయి మనుషుల ఊపిరితిత్తులు, గుండె, మెదడుకి పాకుతోంది. వాయు కాలుష్యంతో శ్వాసకోశ సమస్యలు, గుండె వ్యాధులు, కేన్సర్, చివరికి ఆయుఃప్రమాణాలు క్షీణిస్తాయనే మనకి తెలుసు. ఇలాంటి ప్రాణాంతక వ్యాధులకు సంజీవనిలా ఉపయోగపడే యాంటీబయోటిక్స్ పని చేయకుండా వాయుకాలుష్యం చేస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇది పెరిగిపోతే భవిష్యత్‌లో మనుషుల ప్రాణాలు ప్రమాదంలో పడతాయన్న ఆందోళనలున్నాయి. కలుషిత గాలితో వచ్చే అనర్థాల్లో తాజాగా యాంటీబయోటిక్ నిరోధకత పెరిగిపోవడం ప్రమాద ఘంటికలు మోగిస్తోందని లాన్సెట్ హెల్త్ జర్నల్ అధ్యయనాన్ని ప్రచురించింది. చైనా, యూకేకు చెందిన శాస్త్రవేత్తలు వాయు కాలుష్యం ప్రభావాలపై వివిధ సంస్థలు సేకరించిన గణాంకాల ఆధారంగా యాంటీబయోటిక్స్ పనిచేయకపోవడం అతి పెద్ద పెనుముప్పుగా మారనుందని హెచ్చరించారు. 2000 నుంచి 2018 మధ్య కాలంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూరోపియన్ ఎని్వరాన్‌మెంట్ ఏజెన్సీ, వరల్డ్ బ్యాంక్ సహా 116 దేశాల డేటాను సేకరించి అధ్యయనం చేశారు. ► గాల్లోని సూక్ష్మాతి సూక్ష్మ ధూళి కణాలు పీఎం 2.5 వల్ల యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ పెరిగిపోతోంది. గాలిలో కాలుష్యం 10శాతం పెరిగితే యాంటీబయోటిక్‌ను నిరోధించే సామర్థ్యం 1.1% పెరుగుతోంది ► ప్రపంచవ్యాప్తంగా 703 కోట్ల మంది ప్రజలు పీఎం 2.5 దు్రష్పభావాలను ఎదుర్కొంటున్నారు. ► గాల్లో పీఎం 2.5 ధూళి కణాలు మనుషుల వెంట్రుక కంటే 30 రెట్లు చిన్న కణాలతో ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా యాంటీబయోటిక్ నిరోధకతను ఇవి ఎంత ప్రభావితం చూపిస్తున్నాయన్నది అర్థం చేసుకోవడం దుర్లభంగా మారింది. ► యాంటీబయోటిక్స్ పనిచెయ్యకపోవడానికి ప్రధాన కారణం వాటిని మితి మీరి వాడడం అయినప్పటికీ వాయు కాలుష్యమూ మనుషుల శరీరంలో యాంటీబయోటిక్ నిరోధక బ్యాక్టీరియాను పెంచుతోంది. ► ఆస్పత్రులు, వ్యవసాయ క్షేత్రాలు, వ్యర్థాల శుద్ధి ప్లాంట్లు వంటి వాటి నుంచి యాంటీబయోటిక్‌లు పని చెయ్యకుండా చేసే కలుషిత గాలి ఎక్కువగా వెలువడుతున్నట్టు అధ్యయనం వివరించింది. ప్రాణం పోసే యాంటీబయోటిక్ ప్రాణమెలా తీస్తుంది? యాంటీబయోటిక్స్‌ని మితి మీరి వాడకం వల్ల శరీరంలో సహజసిద్ధమైన రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటోంది. దీనివల్ల సూపర్ బగ్స్ ఏర్పడి మంచి బ్యాక్టీరియాను తినేస్తున్నాయి. ఫలితంగా వ్యాధులు సోకినప్పుడు మందులు వేసుకున్నా పని చేయకుండా పోతున్నాయి. యాంటీబయోటిక్స్ పని చెయ్యకపోవడం వల్ల ప్రస్తుతం ఏడాదికి లక్ష మంది మరణిస్తున్నారు. 2050 నాటికి ఈ కారణంతో ప్రపంచ దేశాల్లో అత్యధికమరణాలు సంభవించే ముప్పు ఉంది. -
క్రికెట్ చరిత్రలోనే అద్భుతమైన క్యాచ్.. ఇప్పటి వరకు చూసి ఉండరు! వీడియో వైరల్
యూరోపియన్ క్రికెట్ టీ10 లీగ్‌లో భాగంగా శుక్రవారం సీవైఎంస్, డ్రీక్స్ హార్న్స్ మధ్య జరిగిన క్వాలిఫైయర్ 1 మ్యాచ్ థ్రిల్లర్‌ను తలిపించింది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్‌లో సీవైఎంస్పై 3 వికెట్ల తేడాతో డ్రీక్స్ హార్న్స్ విజయం సాధించింది. తద్వారా యూరోపియన్ క్రికెట్ టీ10 లీగ్ ఫైనల్లో డ్రీక్స్ హార్న్స్ అడుగుపెట్టింది. 126 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన డ్రీక్స్.. 9.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వారెవ్వా.. సూపర్ క్యాచ్ ఇక ఈ మ్యాచ్‌లో సీవైఎంస్ ఆటగాళ్లు జాసన్ వాన్ డెర్ మెర్వ్, జాకబ్ ముల్డర్ అద్భుతమైన విన్యాసంతో అందరిని ఆశ్చర్యపరిచాడు. బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న వీరిద్దరూ ఓ సంచలన క్యాచ్‌తో మెరిశారు. డ్రీక్స్ హార్న్స్ ఇన్నింగ్స్ 4 ఓవర్ వేసిన ఆడామ్ కెన్నడీ బౌలింగ్‌లో నబీ డిప్ మిడ్ వికెట్ దిశగా భారీ షాట్‌కు ప్రయత్నించాడు. షాట్ కూడా సరిగ్గా కనక్ట్ కావడంతో అంతా సిక్స్ అని భావించారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న వాన్ డెర్ మెర్వ్ జంప్ చేస్తూ సింగిల్ హ్యాండ్‌తో క్యాచ్ అందుకునే ప్రయత్నం చేశాడు. అయితే బౌండరీ రోప్‌కు దగ్గరగా ఉండటంతో బంతిని వాన్ డెర్ మెర్వ్ గాల్లోకి విసిరాడు. ఈ క్రమంలో జాకబ్ ముల్డర్ పరిగెత్తూ కుంటూ వచ్చి క్యాచ్‌ను అందుకున్నాడు. ఈ క్యాచ్‌ను చూసిన డ్రీక్స్ హార్న్స్ బ్యాటర్ బిత్తరిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్రికెట్ చరిత్రలోనే అద్భుతమైన క్యాచ్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చదవండి: IPL 2023: తొలి మ్యాచ్‌కు ముందు సీఎస్కేకు బిగ్ షాక్.. కీలక బౌలర్ దూరం! Is this one of the best team catches ever? Just when you thought you'd seen it all, Jason van der Merve and Jacob Mulder produce magic on the boundary! 😱🙌🏏@CIYMSCC #EuropeanCricket #ECL23 #StrongerTogether pic.twitter.com/G1Pj8imaE8 — European Cricket (@EuropeanCricket) March 24, 2023 -
‘చకచకా చేయి’..యూరప్‌లోనూ యూపీఐ చెల్లింపులు
న్యూఢిల్లీ: యూరప్‌కు వెళ్లే వారు అక్కడ కూడా యూపీఐతో చెల్లింపులు చేసే రోజు అతి త్వరలో సాకారం కానుంది. ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (ఎన్ఐపీఎల్) యూరప్‌కు చెందిన చెల్లింపుల సేవల సంస్థ ‘వరల్డ్‌లైన్’తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. యూరప్ వ్యాప్తంగా భారత చెల్లింపులను ఆమోదించడం ఈ ఒప్పందంలో భాగమని ఎన్ఐపీఎల్ ప్రకటించింది. యూరప్ లో భారతీయులు.. వరల్డ్లైన్కు చెందిన క్యూఆర్ కోడ్ ఆధారిత మర్చంట్స్ పీవోఎస్ల వద్ద యూపీఐతో చెల్లింపులు చేయడానికి వీలవుతుంది. అలాగే, రూపే డెబిట్ లేదా క్రెడిట్ కార్డులతోనూ యూరోప్‌లో చెల్లింపులు చేసుకోవచ్చు. ప్రస్తుతం భారతీయులు అంతర్జాతీయ కార్డ్ నెట్‌వర్క్‌ల ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. బెల్జియం, నెదర్లాండ్స్, లగ్జెంబర్గ్, స్విట్జర్లాండ్ మార్కెట్లను లక్ష్యంగా చేసుకోనున్నట్టు ఎన్ఐపీఎల్ తెలిపింది. వరల్డ్‌లైన్ క్యూఆర్ ద్వారా యూరప్‌లోని మరిన్ని దేశాల్లోకి యూపీఐని విస్తరించనున్నట్టు తెలిపింది. జీ20 దేశాలకు యూపీఐ, ఆధార్! కాగా, ప్రపంచవ్యాప్తంగా అందరికీ డిజిటల్ సేవలు అందించేందుకు వీలుగా.. జీ 20 దేశాలు యూపీఐ, ఆధార్ వంటి ప్లాట్‌ఫామ్‌లను ఏర్పాటు చేసి, అమలు చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వ పారిశ్రామిక ప్రోత్సాహక విభాగం కార్యదర్శి అనురాగ్ జైన్ అభిప్రాయపడ్డారు. విజ్ఞానం, ఆవిష్కరణ, స్థిరత్వం అన్నవి నూతనతరం ఆర్థిక వృద్ధి చోదకాలుగా పేర్కొన్నారు. భారత్ ఓపెన్ సోర్స్ ప్లాట్ ఫామ్‌లు అయిన కోవిన్, ఆధార్, యూపీఐ ఇంటర్ఫేస్ తదితర వాటిని సృష్టించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో జైన్ మాట్లాడుతూ. ఈ తరహా ఓపెన్ సోర్స్ (మార్పులకు వీలైన), పలు వ్యవస్థల మధ్య పనిచేసే ప్లాట్‌ఫామ్‌లను ఏర్పాటు చేయడంపై జీ20 దేశాలు దృష్టి సారించాలని సూచించారు. -
కష్టకాలంలో ఉక్రెయిన్‌కు భారీ సాయం, కానీ ఓ షరతు!
యుద్ధకాలంలో ఉక్రెయిన్‌కు భారీ ఆర్థిక సాయం ప్రకటన వెలువడింది. కానీ, ఈ సాయాన్ని షరతుల మేరకు అందిస్తున్నట్లు ప్రకటించింది ఈయూ. ఈ మేరకు ఈయూ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్, యుద్ధ సంక్షోభంలో ఉన్న ఉక్రెయిన్‌కి తొమ్మిది బిలియన్ యూరోల(రూ. 73 వేల కోట్లు) ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. యుద్ధంతో అట్టడుకుతున్న ఉక్రెయిన్‌కి రుణ రూపంలో ఈ సాయాన్ని అందచేయనున్నట్లు వెల్లడించారు. యుద్ధం ముగిసిన తదనంతరం ఈయూ సాయంతో ఉక్రెయిన్ను పునర్నిర్మించడం పై దృష్టి కేంద్రీకరించాలని చెప్పారామె. ఉక్రెయిన్ పునర్నిర్మాణ ప్రయత్నాలకు ఈయూ వ్యూత్మక నాయకత్వం వహించేందుకు ఉత్సుకతతో ఉన్నట్లు ఆమె తెలిపారు. మిగతా దేశాలు కూడా ఈ పునర్నిర్మాణ ప్రక్రియలో భాగం కావాలని ఆమె పిలుపునిచ్చారు. ఈయూ నిబంధనలకు లోబడే ఈ సాయం ఉంటుందని ఆమె తెలిపారు. ఉక్రెయిన్ యుద్ధం అనేది.. గత కొన్నిసంవత్సరాలుగా రక్షణ కోసం కేటాయిస్తున్న తక్కువ వ్యయం పై దృష్టి కేంద్రీకరించేలా చేసిందన్నారు. ఆయుధాల ఉత్పత్తి, జాయింట్ ప్రొక్యూర్మెంట్ను మరింత మెరుగ్గా సమన్వయం చేసేందుకు ఈ కూటమి ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అంతేకాదు యూరప్ కంపెనీలను ఆ మార్గంలో పయనించేలా ఆర్థిక పన్ను ప్రోత్సాహాకాలను అందిస్తామని చెప్పారు. ఇది ఈయూ స్వతంత్ర శక్తి సామర్థ్యాలను బలపరుస్తుందన్నారు. అలాగే ఇంధన సరఫరాలపై రష్యా పై ఆధారపడకుండా చౌకగా, వేగవంతంగా ఇంధనాన్ని పోందే దిశగా అడుగులు వేస్తోంది. అదీగాక ఇప్పటికే ఈయూ యూరోపియన్లను థర్మోస్టాట్లను తగ్గించాలని, లైట్లను ఆపివేయాలని, ప్రజారవాణ వినియోగించమని సూచించింది కూడా. (చదవండి: ‘సీ’దదీరుతూ....అండర్ వాటర్ ఎంటర్టైన్మెంట్) -
పుట్‌బాల్ ప్రపంచకప్‌కు పోర్చుగల్
లిస్బన్: తన కెరీర్లో లోటుగా ఉన్న ప్రపంచకప్ టైటిల్‌ను సాధించేందుకు పోర్చుగల్ కెప్టెన్, విఖ్యాత ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోకు మరో అవకాశం లభించింది. ఈ ఏడాది నవంబర్–డిసెంబర్లలో ఖతర్ వేదికగా జరగనున్న ప్రపంచకప్‌కు పోర్చుగల్ జట్టు అర్హత పొందింది. బుధవారం జరిగిన యూరోపియన్ జోన్ ప్లే ఆఫ్ ఫైనల్లో పోర్చుగల్ 2–0 గోల్స్ తేడాతో నార్త్ మెసెడోనియా జట్టును ఓడించి ప్రపంచకప్ బెర్త్ సొంతం చేసుకుంది. పోర్చుగల్ తరఫున బ్రూనో ఫెర్నాండెజ్ (32వ, 65వ ని.లో) రెండు గోల్స్ సాధించాడు. రొనాల్డోకిది వరుసగా ఐదో ప్రపంచకప్ కానుంది. మరో ప్లే ఆఫ్ ఫైనల్లో పోలాండ్ 2–0తో స్వీడన్‌ను ఓడించి ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. ఆఫ్రికా జోన్ నుంచి ఘనా, సెనెగల్, ట్యూనిషియా, మొరాకో, కామెరూన్ జట్లు కూడా ప్రపంచకప్ బెర్త్‌లు సంపాదించాయి. మొత్తం 32 జట్లు పాల్గొనే ఈ మెగా ఈవెంట్లో ఇప్పటివరకు 27 జట్లు అర్హత పొందాయి. జూన్ 14న జరిగే ఇంటర్ కాంటినెంటల్ ప్లే ఆఫ్ మ్యాచ్‌ల అనంతరం మిగిలిన ఐదు బెర్త్‌లు ఖరారవుతాయి. మిగిలిన ఐదు బెర్త్‌ల కోసం రేసులో ఉన్న జట్లతో కలిపి శుక్రవారం ప్రపంచకప్ ‘డ్రా’ను విడుదల చేయనున్నారు. -
ఉక్రెయిన్‌కి అమెరికా చేసిందేమీ లేదు... బైడెన్ గాలి తీసేసిన ఉక్రెయిన్ ఎంపీ
As Ukrainian feel reassured: యూరప్ పర్యటనలో భాగంగా అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్ పోలాండ్ పర్యటన చేసిన సంగతి తెలిసింది. ఈ మేరకు బైడెన్ పోలాండ్లోని ఉక్రెనియన్ అగ్ర నేతలతో భేటి అయ్యారు. ఆ సమావేశంలో ప్రస్తుతం ఉక్రెయిన్ రష్యా మధ్య సాగుతున్న యుద్ధం, తాజా పరిస్థితులపై బైడెన్ చర్చించారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ ఎంపీ ఇన్నా సోవ్‌సన్ జోబైడెన్ చేసిన ప్రసంగంపై విమర్శలు గుప్పించారు. అంతేకాదు ఒక ఉక్రెనియన్గా భరోసా కలిగించే ఒక్కమాట కూడా జోబైడెన్ నుంచి తాను వినలేదని అన్నారు. ప్రస్తుతం రష్యాతో జరుగుతున్న యుద్ధంలో యూరోపియన్ దేశానికి సహాయం చేయడానికి అమెరికా తగినంతగా ఏమి చేయలేదని ఆరోపించారు. ప్రస్తుతం మాకు పశ్చమ దేశాలే ఎక్కువ సహాయం చేస్తున్నయని అన్నారు. కానీ ఈ ప్రసంగంలో బైడెన్ పోలాండ్‌కి మద్దతుగా మాట్లాడినందుకు తనకు చాలా సంతోషంగా ఉందన్నారు ఉక్రెయిన్ ఎంపీ సోవ్‌సన్. అయినా దాడులు జరుగుతోంది కైవ్లోనూ, ఖార్కివ్‌లోనూ,.. వార్సాలో కాదంటూ ఘాటుగా కౌంటరిచ్చారు. ఈ మేరకు ఉక్రెయిన్ ఎంపీ ట్విట్టర్ వేదికగా జో బైడెన్ ప్రంసంగం పై విరుచుకుపడ్డాఈరు. ఇదిలా ఉండగా..ఆ ప్రసంగంలో బైడెన్ రష్యాన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను పరమ కసాయిగా పేర్కొన్నారు. అంతేకాదు అతను ఎక్కువ కాలం అధ్యక్షుడిగా సాగలేడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా పై ఉక్రెయిన్ సాగిస్తున్న ప్రతి ఘటనను సోవియట్‌కి వ్యతిరేకంగా స్వేచ్ఛ కోసం చేస్తున్న యుద్ధంగా అభివర్ణించారు. గతంలో రష్యా ఉక్రెయిన్ వివాదంపై బైడెన్ నాటో, జీ7 సమావేశల్లో పాల్గొన నాట భూభాగంలో ఒక్క అంగుళం మీదకు వెళ్లడం గురించి ఏ మాత్రం ఆలోచనే చేయోద్దు అని రష్యాను హెచ్చరించారు కూడా. I'll be blunt. I did not hear a single word from @POTUS that would make me, as #Ukrainian feel reassured that the West will help us more than doing right now (which is not enough). I am happy he reassured Poland, but the bombs are exploding in Kyiv, and Kharkiv, not in Warsaw — Inna Sovsun (@InnaSovsun) March 26, 2022 (చదవండి: పుతిన్‌పై బైడెన్ సంచలన వ్యాఖ్యలు.. రష్యా సూపర్ కౌంటర్) -
అదే గనుక పేలితే ఐరోపా అంతమే: జెలెన్ స్కీ
If There is an explosion, it is the end for everyone: ఉక్రెయిన్ పై రష్యా నిరవధికంగా పోరు సలుపుతూనే ఉంది. తొమ్మిది రోజులుగా సాగుతున్న ఈ భీకరమైన దాడిలో రష్యా కొన్ని ముఖ్యనగరాలను స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలో రష్యా జనవాసాలను, పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగింది. ఆ తర్వాత ఉక్రెయిన్‌లోని జపోరిజ్జియా అణుకర్మాగారం పై దాడి చేయడం మొదలు పెట్టింది. దీంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్ స్కీ వెంటనే ఒక వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో జెలెన్ స్కీ... చెర్నోబిల్ అనే పదం తెలిసిన ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి ఇది గనుక పేలితే ఐరోపా అంతం అవుతుందని రాష్ట్రపతి చెప్పారు. అంతేకాదు ఆ అణు కర్మాగారాన్ని తాము ఇంత వరకు సురక్షితంగా ఉంచాం. మేము ఈ యుద్ధంలో ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడలేదు. ఈ దాడి కారణంగా అది ఎప్పుడూ పేలుతుందో కూడా కచ్చితంగా చెప్పలేం. అయినా రష్యన్ ట్యాంకులు థర్మల్ ఇమేజర్లతో అమర్చబడి ఉన్నాయి. ఇది ప్రమాదవశాత్తు జరిగిన దాడి మాత్రం కాదు. ఈ దాడిని అణు టెర్రర్‌గా అభివర్ణించారు. కానీ మాకు దేనిపై కాల్పులు జరుపుతున్నాం అనే విషయం పై స్పష్టమైన అవగాహన ఉంది. చర్నోబిల్ గురించి ప్రస్తావిస్తూ..ఆ ప్రపంచ విపత్తు పర్యవసానాన్ని వందల వేలమంది ప్రజలు ఎదుర్కొన్నారు. పదివేల మంది ఆ ప్రదేశం నుంచి ఖాళీ చేయవలసి వచ్చింది. రష్యా దీన్ని పునరావృతం చేయాలనే దురాలోచన కలిగి ఉంది. యూరోపియన దేశాల నాయకులారా మేల్కొండి. జపోరిజ్జియా 15 బ్లాక్‌లు కలిగిన అతి పెద్ద ప్లాంట్. ఒక వేళ పేలుడు సంభవించినట్లయితే ఇది ఐరోపా వాసులందరకీ ముగింపే అనే విషయాన్ని గుర్తించండి. అని చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది. Терміново! pic.twitter.com/MuXfniddVT — Володимир Зеленський (@ZelenskyyUa) March 4, 2022 (చదవండి: భారీ విధ్వంసానికి రష్యా ప్లాన్.. ఆందోళనలో ఐరోపా దేశాలు..!) -
యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షుడి కన్నుమూత
యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షుడు డేవిడ్ ససోలి మంగళవారం కన్నుమూశారు. 65 ఏళ్ల ససోలి.. రోగ నిరోధక శక్తి క్షీణించడంతో గత కొంతకాలంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి ఆయన కన్నుమూశారు. ససోలి గతేడాది సెప్టెంబర్ నుంచి న్యూమోనియా సంబంధిత జబ్బు కారణంగా ఇటలీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరిన విషయం తెలిసిందే. ఇటాలియన్ జర్నలిస్ట్‌గా కెరియర్ ప్రారంభించిన ససోలి ఆ తర్వాత టెలివిజన్ యాంకర్‌గా జాతీయ స్థాయిలో పేరు సంపాదించారు. 2009లో యూరోపియన్ యూనియన్ పార్లమెంట్లో సభ్యుడిగా, 2019లో స్పీకర్‌గా సేవలందించారు. డేవిడ్ ససోలి మరణంపై పలువురు ప్రముఖులు నివాళి అర్పిస్తున్నారు. తర్వాతి పార్లమెంట్ అధ్యక్షుడి కోసం వచ్చే వారం ఓటింగ్ నిర్వహించనున్నట్లు సమాచారం. (చదవండి: నిందితుడికి బెయిల్.. అతన్ని రాత్రి గృహనిర్బంధం చేయాల్సిందే!) (చదవండి: కెమెరామెన్ అమ్మతో చిట్టితల్లి.. ఏం చెప్పిందో వింటే ఫిదా అవుతారు) -
ప్రెగ్నెన్సీ కోసం లద్దాఖ్‌కు విదేశీ యువతుల క్యూ
లడాఖ్: సంతానం కోసం విదేశాల నుంచి యువతులు లద్దాఖ్‌కు క్యూ కడుతున్నారంట. అదేంటి పిల్లల కోసం విదేశీ యువతులు ఇక్కడకు రావడమేంటని అనుకుంటున్నారా. అవును కేవలం గర్భం దాల్చడం కోసమే యురోపియన్ దేశాలకు చెందిన అమ్మాయిలంతా లద్దాఖ్‌కు వస్తున్నారంట. అయితే ఇందులో ఓ రహస్యం ఉంది. అదేంటంటే.. లద్దాఖ్‌లో ఆర్యన్ సంతానం నివసిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్యన్లు అంటేనే ఆరు అడుగుల ఆజానుబాహులు, నీలి కళ్లు కలిగి అందంగా ఉంటారు. దీంతో ఆర్యన్ సంతానాన్ని పొందడానికి యురోపియన్ అమ్మాయిలు లద్దాఖ్‌కు ప్రతి ఏటా వందల సంఖ్యలో క్యూ కడుతున్నారు. ఆరు అడగులా ఆజానుబాహులుగా కనిపించే ఆర్యన్ అబ్బాయిలతో జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల నుంచి ప్రతి ఏటా అమ్మాయిలు ఇక్కడికి వచ్చి శృంగారంలో పాల్గోని ఆర్యన్ సంతానం పొందుతున్నారు. సంతానం కోసమే ప్రత్యేకంగా విదేశీ యువతులు లద్దాఖ్‌కు వస్తుండటంతో ఆర్యన్ వాలీకి ‘ప్రెగ్నెన్సీ టూరిజం’ అని పేరు కూడా పెట్టారు. అయితే చరిత్ర ప్రకారం.. క్రీస్తుపూర్వం గ్రీకువీరుడు అలెగ్జాండర్ ఒక్కో రాజ్యాన్ని జయిస్తూ ఇండియాకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సింధూ లోయకు వచ్చిన అలెగ్జాండర్.. ఆ తర్వాత ఇండియాకు రాకుండానే వెనుదిరిగాడు. కానీ అతని వెంట వచ్చిన సైన్యంలో కొంత మంది సింధు లోయ వద్ద ఉండిపోయారంట. ఇక అప్పటి నుంచీ సింధూ లోయలో వద్ద నివసిస్తున్న వీళ్లనే ఇప్పుడు చివరి ఆర్యన్లుగా పిలుస్తున్నారు. లఢాక్‌లోని ఐదు గ్రామాల్లో చివరి ఆర్యన్లు నివసిస్తున్నారు. నియంత్రణ రేఖకు సమీపంలోనే ఈ గ్రామాలు ఉన్నాయి. -
11,500 పైకి నిఫ్టీ
చివరి గంటలో కొనుగోళ్ల జోరుతో బుధవారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉండటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ ఆరంభ లాభాలను కోల్పోయినా 3 పైసల లాభంతో 74.30 వద్ద ముగియడం.... కలసి వచ్చాయి. సెన్సెక్స్ 39,000 పాయింట్లపైకి, నిఫ్టీ 11,500 పాయింట్లపైకి ఎగబాకాయి. ఆగస్టు డెరివేటివ్స్ కాంట్రాక్టులు మరో నెలలో ముగియనుండటంతో సూచీలు హెచ్చుతగ్గులకు గురయ్యాయి. సెన్సెక్స్ 230 పాయింట్ల లాభంతో 39,074 పాయింట్ల వద్ద, నిఫ్టీ 77 పాయింట్లు ఎగసి 11,550 పాయింట్ల వద్ద ముగిశాయి. వరుసగా నాలుగో రోజూ మార్కెట్ ముందుకే దూసుకుపోయింది. మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా ఎనిమిదో రోజూ ఎగిశాయి. 2020 జనవరి తర్వాత ఈ సూచీలు వరుసగా ఇన్ని రోజులు లాభపడటం ఇదే మొదటిసారి. యూరప్ మార్కెట్ల జోష్..! సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లోనే మొదలయ్యాయి. కానీ ఆ తర్వాత నష్టాల్లోకి జారిపోయాయి. మధ్యాహ్నం ఒంటిగంట వరకూ లాభ. నష్టాల మధ్య దోబూచులాడాయి. జర్మనీ, ఫ్రా¯Œ ్సల్లో అదనంగా మరో ఉద్దీపన ప్యాకేజీ ఉండొచ్చన్న అంచనాలతో యూరప్ మార్కెట్లు లాభాల్లో మొదలయ్యాయి. ఈ ప్రభావంతో మన మార్కెట్లో చివరి గంటలో కొనుగోళ్లు జోరుగా సాగాయి. ఒక దశలో 79 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ మరో దశలో 268 పాయింట్లు ఎగసింది. రోజంతా 347 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ఆసియా, యూరప్ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. ♦ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్ 6 శాతం లాభంతో రూ.568 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. ♦రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ 2.6 శాతం లాభంతో రూ.2,137 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 230 పాయింట్ల లాభంలో దాదాపు సగం వాటా ఈ షేర్‌దే. ♦టూవీలర్లపై జీఎస్టీని తగ్గిస్తారన్న అంచనాలతో టూవీలర్ కంపెనీ ∙షేర్లు లాభపడ్డాయి. హీరో మోటొకార్ప్, టీవీఎస్ మోటార్, బజాజ్ ఆటో షేర్లు 2–6 శాతం రేంజ్లో పెరిగాయి. ♦టాటా మోటార్స్ షేర్ లాభాలు కొనసాగాయి. 8 శాతం లాభంతో రూ.137 వద్ద ముగిసింది. మూడేళ్లలో రుణ భారాన్ని పూర్తిగా తగ్గించుకుంటామని ఈ కంపెనీ మంగళవారం పేర్కొంది. ♦దాదాపు 200కు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు ఎగిశాయి. వాబ్కో ఇండియా, హీరో మోటోకార్ప్, ఆఫిల్ ఇండియా, అదానీ గ్యాస్, ఇమామి, తాన్లా తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ♦దాదాపు 400కు పైగా షేర్లు అప్పర్ సర్క్యూట్లను తాకాయి. డిష్ టీవీ, ఇండోస్టార్ క్యాపిటల్ ఫైనా¯Œ ్స, రెప్కో హోమ్ ఫైనా¯Œ ్స, వెల్స్ప¯Œ ఇండియా, సుబెక్స్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. 11,850కు నిఫ్టీ...! నిఫ్టీ 11,500 పాయింట్ల కీలక నిరోధాన్ని అధిగమించిన నేపథ్యంలో నేడు(గురువారం) ఆగస్టు సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనుండటంతో షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు జరగవచ్చని చార్ట్‌వ్యూఇండియాడాట్ ఇన్ ఎనలిస్ట్ మజ్హర్ మహ్మద్ అంచనా వేస్తున్నారు. నిఫ్టీ సమీప భవిష్యత్తులో 11,850కు చేరవచ్చన్నారు. కాగా దాదాపు అన్ని కీలక నిరోధాలను నిఫ్టీ అధిగమించిందని కొందరు టెక్నికల్ ఎనలిస్ట్‌లు అంటున్నారు. నిఫ్టీ 11,400 ఎగువన కొనసాగినంత కాలం ఇదే జోరు ఉంటుందని, ఈ స్థాయి కంటే దిగువకు వస్తే, తదుపరి మద్దతు 11.250 పాయింట్లని వారంటున్నారు. -
కరోనా : విదేశాల్లో చిక్కుకున్న వారికి ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా, లాక్డౌన్ నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులకు శుభవార్త. అమెరికా, యూరోపియన్ దేశాల్లోని భారతీయులను వందే భారత్ మిషన్ తరహాలో అంతర్జాతీయ విమానాల ద్వారా స్వదేశానికి తీసుకొచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని భారత విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. తద్వారా భారతీయులను దేశానికి తీసుకురావడంతోపాటు, ఇక్కడ ఉండిపోయిన విదేశీయులను వారి సొంత దేశాలకు పంపించే అవకాశం లభించనుంది. వందే భారత్ మిషన్ తరహాలో చార్టర్డ్ విమాన సేవలకు తమ కంపెనీలనూ అనుమతించాలంటూ అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సహా పలు దేశాల విమానయాన సంస్థల నుంచి అభ్యర్ధనలు వచ్చాయని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇవి పరిశీలనలో ఉన్నాయని చర్చలకనుగుణంగా త్వరలోనే తుది నిర్ణయాన్ని తీసుకుంటామని వెల్లడించింది. దీనిపై జూన్ 15న యుఎస్ రవాణా శాఖ, యుఎస్ ఎంబసీ ప్రతినిధులతో ఒక రౌండ్ చర్చలు జరిపామని చెప్పింది. అలాగే గల్ఫ్ దేశాల నుండి షెడ్యూల్ చేసిన విమానాలను తిరిగి ప్రారంభించాలన్న అభ్యర్థన కూడా పెండింగ్‌లో ఉందని తెలిపింది. విదేశాల్లో ఉన్నభారతీయులను స్వదేశానికి రప్పించేందుకు ప్రారంభించిన ఈ పథకం ద్వారా ఇపుడు మన దేశంలోని ఇతర దేశాల పౌరులను వారి వారి దేశాలకు తరలించనున్నామని మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాగా కోవిడ్-19 మహమ్మారి కారణంగా ప్రపంచం నలుమూలల చిక్కుకుపోయిన భారతీయ పౌరులను తరలించడానికి భారతదేశం వందే భారత్ మిషన్‌ను ప్రారంభించింది. అయితే భారత ప్రభుత్వం వివక్షా పూరితంగా వ్యవహరించి ఇరు దేశాల విమానయాన ఒప్పందాలను ఉల్లంఘించిందని ఆరోపించిన ఆమెరికా ఇటీవల వందే భారత్ మిషన్‌కు అభ్యంతరం తెలిపింది. తమ విమానయాన సంస్థలకు చెందిన చార్టర్డ్ విమానాల రాకపోకలను భారత్ అడ్డుకుంటున్నందు వల్లే ఎయిరిండియా చార్టర్డ్ విమానాల రాకపోకలపై జూలై 22 నుంచి నిషేధం అమలవుతుందని అమెరికా రవాణా విభాగం(డీఓటీ) ప్రకటించింది. అంతేకాదు చిక్కుకుపోయిన పౌరుల తరలింపు సమయంలో ఎయిరిండియా అక్రమంగా టికెట్లను అమ్ముకుంటోందని డీఓటీ ఆరోపించిన సంగతి తెలిసిందే. -
స్టీల్ ఉత్పత్తులపై యాంటీడంపింగ్ డ్యూటీ..?
విదేశాల నుంచి భారత్‌లోకి దిగుమతయ్యే స్టీల్ ఉత్పత్తులపై యాంటీడంపింగ్ డ్యూటీ విధించేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది. దేశీయ స్టీల్ ఉత్పత్తిదారులను ఆదుకునే చర్యల్లో భాగంగా యూరప్, జపాన్, అమెరికా, కొరియా దేశాల నుంచి దిగుమతి అవుతున్న స్టీల్ ఉత్పత్తులపై 5ఏళ్ల పాటు ఈ డ్యూటీని విధించనుంది. ఈ మేరకు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ దేశాల నుంచి దిగుమతయ్యే స్టీల్ ఉత్పత్తులపై టన్నుకు 222డాలర్ల నుంచి 334 డాలర్ల పరిధిలో యాంటీ డంపింగ్ డ్యూటీ విధించాలని కేంద్రానికి సిఫార్సు చేసింది. అలాగే నాణ్యత ఆధారంగా ఉత్పత్తులకు డ్యూటీ నుంచి మినహాయింపు ఇవ్వాలనే డిమాండ్‌ను తిరస్కరించింది. యూరప్, జపాన్, అమెరికా, కొరియా దేశాల నుంచి భారత్‌లోకి సగటు ధర కంటే తక్కువ విలువలో స్టీల్ ఉత్పత్తులు దిగుమతి అవుతుండటంతో యాంటీ డంపింగ్ డ్యూటీ విధించేందుకు వాణిజ్య శాఖ సిపార్సు చేసింది. తక్కువ ధరల్లో స్టీల్ ఉత్పత్తుల దిగుమతుల కారణంగా దేశీయ స్టీల్ పరిశ్రమ నష్టాలను ఎదుర్కోందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ (డీజీటీఆర్) నివేదికలో తెలిపింది. యాంటీ డంపింగ్ డ్యూటీ అంటే..? ఇతర దేశాల నుంచి ఏదైనా సరుకు లేదా వస్తువులను మన మార్కెట్ లో లభించే ధర కంటే తక్కువ ధరకు దిగుమతి చేస్తే వాటిపై విధించే టారిఫ్‌ను యాంటీ డంపింగ్ డ్యూటీ అంటారు. సాధారణంగా స్వదేశీ వ్యాపారాన్ని రక్షించేందుకు చాలా దేశాలు ఈ రకమైన టారీఫ్ విధిస్తుంటాయి. -
సంక్షోభంలోనూ పెట్టుబడులకు చాన్స్
సాక్షి, హైదరాబాద్: కరోనా సంక్షోభంలోనూ రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులకు అవకాశాలున్నట్లు తాము భావిస్తున్నామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి కేటీ రామారావు అన్నారు. ప్రస్తుత సంక్షోభం నేర్పిన పాఠాలతో పరిశ్రమలు, ప్రభుత్వాలు తమ ప్రాధాన్యతలను పునః సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా యూరోపియన్ బిజినెస్ గ్రూప్ (ఈబీజీ) ప్రతినిధులతో కేటీఆర్ సమావేశమయ్యారు. పలు దేశాల రాయబారులతో పాటు ప్రముఖ కంపెనీల ప్రతినిధులు కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఒకే దేశం లేదా ఒకే ప్రాంతంలో పూర్తిస్థాయిలో పెట్టుబడులు పెట్టే అంశంపై కంపెనీలు పునరాలోచనలో పడ్డాయని, ఈ నేపథ్యంలో భారత్‌కు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. విదేశీ పెట్టుబడులను రాష్ట్రానికి రప్పించేందుకు తెలంగాణ ప్రయత్నిస్తోందని కేటీఆర్ వెల్లడించారు. ఆయా దేశాల్లోని పెట్టుబడిదారులు, కంపెనీలతో ప్రత్యేక సమావేశాల ఏర్పాటుకు సహకరించాల్సిందిగా ఆ దేశాల రాయబారులను ఆయన కోరారు. ఫార్మా, లైఫ్‌సైన్సెస్, ఐటీ, డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్, టెక్స్టైల్ వంటి రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా ఉన్నందున పెట్టుబడి అవకాశాలను పరిశీలించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ప్రపంచ ప్రమాణాలు.. సులభతర వాణిజ్య విధానం (ఈఓడీబీ)లో తెలంగాణ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అగ్రస్థానంలో ఉం దని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈఓడీబీలో తెలంగాణ ప్రపంచంలోనే టాప్–20 జాబితాలో ఉండే అవకాశం ఉందని, విదేశీ పెట్టుబడిదారులు భారత్‌ను రాష్ట్రాల కోణాల్లో చూడాల్సి ఉందన్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా ఐదేళ్లలో 13వేల కంపెనీలకు అనుమతులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ, రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు కు ఉన్న అనుకూల అంశాలను వివరించారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలు ప్రపంచ ప్రమాణాలకు ఏమాత్రం తీసిపోవని, గత ఐదేళ్లుగా ఇక్కడి ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రపంచవ్యాప్తంగా వినిపించాల్సిన అవసరం ఉన్నదని కేటీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. -
వచ్చే ఏడాదిలో సిట్రోయెన్ ‘సీ5 ఎయిర్‌క్రాస్’..!
న్యూఢిల్లీ: యూరోపియన్ ఆటో దిగ్గజం గ్రూప్ పీఎస్ఏ.. వచ్చే ఏడాదిలో తన సిట్రోయెన్ బ్రాండ్ కార్లను ఇక్కడి మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా తొలుత ‘సీ5 ఎయిర్‌క్రాస్’ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్ (ఎస్యూవీ)ని విడుదలచేయనున్నట్లు వెల్లడించింది. కంపెనీ ప్రణాళిక ప్రకారం.. ఈ ఏడాదే ఎస్యూవీ విడుదల కావాల్సి ఉన్నా, తొలికారు విషయంలో రాజీలేకుండా ఉండటానికే మరింత సమయం తీసుకున్నట్లు సంస్థ భారత సీనియర్ వైస్ ప్రెసిడెంట్, సేల్స్ అండ్ మార్కెటింగ్ రోలాండ్ బౌచారా అన్నారు. -
చాంపియన్స్ లీగ్ విజేత లివర్‌పూల్
మాడ్రిడ్: మేటి యూరోపియన్ క్లబ్ జట్ల మధ్య జరిగే ప్రతిష్టాత్మక చాంపియన్స్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో లివర్‌పూల్ జట్టు చాంపియన్‌గా నిలిచింది. భారత కాలమానం ప్రకారం మాడ్రిడ్‌లో శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో లివర్‌పూల్ (ఇంగ్లండ్) 2–0 గోల్స్ తేడాతో టోటెన్హామ్ హాట్స్పర్ క్లబ్ (ఇంగ్లండ్) జట్టుపై గెలిచింది. లివర్‌పూల్ తరఫున మొహమ్మద్ సలా (2వ నిమిషంలో), డివోక్ ఒరిగి (87వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. విజేతగా నిలిచిన లివర్‌పూల్ జట్టుకు కోటీ 90 లక్షల యూరోలు (రూ. 147 కోట్లు) ప్రైజ్‌మనీగా లభించాయి. చాంపియన్స్ లీగ్ టైటిల్ నెగ్గడం లివర్పూల్కిది ఆరోసారి. గతంలో ఆ జట్టు 1977, 1978, 1981, 1984, 2005లలో విజేతగా నిలిచింది. -
పరిశోధనలకు అడ్డా... భారత్!!
కొత్త ఉత్పత్తులు, సేవలకు సంబంధించి పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ) కార్యకలాపాలకు కేంద్రంగా భారత్ ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే పలు అమెరికా, యూరప్ కంపెనీలు ఇక్కడ తమ ఆర్అండ్డీ కేంద్రాలు ఏర్పాటు చేసుకోగా.. తాజాగా ఆసియా కంపెనీలు కూడా భారత్‌వైపు చూస్తున్నాయి. ఏడాది వ్యవధిలో జపాన్, సింగపూర్ వంటి ఆసియా దేశాలకు చెందిన తొమ్మిది దిగ్గజ సంస్థలు భారత్‌లో క్యాప్టివ్ టెక్నాలజీ సెంటర్లను ప్రారంభించాయి. ఈ సంస్థలు ఎక్కువగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), డేటా అనలిటిక్స్ వంటి అధునాతన సాంకేతిక అంశాల్లో పరిశోధనలకు ప్రాధాన్యమిస్తున్నాయి. భారత్‌లో నిపుణుల లభ్యత పుష్కలంగా ఉండటంతో పాటు ఇక్కడి మెరుగైన స్టార్టప్ వ్యవస్థ, తక్కువ వ్యయాలు మొదలైనవి ఆయా సంస్థలను ఆకర్షిస్తున్నాయి.భారతీయ టాలెంట్‌ను ఉపయోగించుకుని అమెరికన్, యూరోపియన్ దేశాల సంస్థలు వృద్ధి చెందుతున్న విషయాన్ని ఆసియన్ కంపెనీలు క్రమంగా గుర్తిస్తున్నాయని, అందుకే భారత్ వైపు దృష్టి సారిస్తున్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అంతే కాకుండా.. భారత్ వంటి భారీ మార్కెట్లో పట్టు సాధించేందుకు స్థానికంగా తమ కార్యకలాపాలు ఉండటం మంచిదనే ఉద్దేశంలో అవి ఉన్నట్లు వివరించాయి. దేశీయంగా వెయ్యికి పైగా జీఐసీలు.. ఈ ఆర్అండ్డీ కేంద్రాలను గ్లోబల్ ఇన్‌హౌస్ సెంటర్లుగా (జీఐసీ) కూడా వ్యవహరిస్తుంటారు. ప్రస్తుతం భారత్‌లో దాదాపు 1,257 జీఐసీలు కార్యకలాపాలు నిర్వహిస్తుండగా, వీటిలో 976 సెంటర్లు పూర్తిగా ఆర్‌అండ్‌డీకి మాత్రమే పరిమితమైనవి ఉన్నాయి. ఈ జీఐసీల్లో సింహభాగం అమెరికా, కెనడా కంపెనీలవే కావడం గమనార్హం. మొత్తం జీఐసీల్లో 65 శాతం వాటా ఈ దేశాల సంస్థలదే కాగా.. యూరోపియన్ దేశాల కంపెనీలు ఆ తర్వాతి స్థానంలో ఉన్నాయి. ప్రస్తుతం మొత్తం జీఐసీల్లో ఆసియన్ కంపెనీల వాటా 7 శాతం మాత్రమే ఉందని, అయితే గడిచిన మూడు–నాలుగేళ్లుగా భారత్‌లో తమ ఆర్అండ్డీ కేంద్రాలు ఏర్పాటు చేసే ఆసియన్ కంపెనీల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోందని కన్సల్టెన్సీ సంస్థ జిన్నోవ్ వర్గాలు తెలిపాయి. సింగపూర్‌కి చెందిన ఈ–కామర్స్ కంపెనీ రెడ్‌మార్ట్, గోజెట్ ఎయిర్‌లైన్స్, డీబీఎస్ బ్యాంక్ మొదలైనవి ఇటీవలి కాలంలో భారత్‌లో తమ ఆర్అండ్డీ కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నాయని పేర్కొన్నాయి. అటు చైనా స్మార్ట్‌ఫోన్స్ తయారీ దిగ్గజం ఒప్పో భారత్‌లో జీఐసీ ఏర్పాటు చేస్తామంటూ ప్రకటించగా.. మరో స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ ఇటీవలే హైదరాబాద్‌లో తమ ఆర్అండ్డీ కేంద్రాన్ని ప్రారంభించింది. సాఫ్ట్వేర్ తదితర విభాగాలకు సంబంధించి భారత్‌లో పరిశోధన,అభివృద్ధి కార్యకలాపాల విస్తరణకు గణనీయంగా అవకాశాలు ఉన్నాయని, తమ హైదరాబాద్ ఆర్అండ్డీ సెంటర్ సామర్థ్యాన్ని మరింతగా పెంచుకోబోతున్నామని వన్‌ప్లస్ సీఈవో పీట్ లౌ చెప్పారు కూడా. ముప్పై పైగా జపాన్ సంస్థలు.. జపాన్‌కి చెందిన ముప్ఫై సంస్థలకు ఇప్పటికే భారత్‌లో ఆర్అండీ కేంద్రాలున్నాయి. అలాగే దక్షిణ కొరియా దిగ్గజాలు శాంసంగ్, మొబిస్ వంటివి కూడా ఏర్పాటు చేసుకున్నాయి. కొత్తగా జపాన్‌కి చెందిన ఇంటర్నెట్ సంస్థ రకుటెన్, నిస్సాన్ మోటార్ వంటివి ఈ జాబితాలో చేరాయి. డ్రైవర్ రహిత కార్లపై ఆర్అండ్డీ కోసం తిరువనంతపురంలో గ్లోబల్ డిజిటల్ హబ్‌ను ఏర్పాటు చేస్తామని నిస్సాన్ ఇటీవల తెలిపింది.2019 మార్చి నాటికి 550 మంది టెక్నాలజీ ప్రొఫెషనల్స్‌ను నియమించుకోనున్నట్లు వెల్లడించింది. మరోవైపు, రకుటెన్... తమ టెక్నాలజీ రీసెర్చ్‌లో సింహభాగం కార్యకలాపాలను భారత్ నుంచి నిర్వహించాలని భావిస్తోంది. వచ్చే ఏడాది, ఏడాదిన్నర వ్యవధిలో భారత్‌లో సిబ్బంది సంఖ్యను 900 పైచిలుకు స్థాయికి పెంచుకోవాలని యోచిస్తోంది. కొంగొత్త టెక్నాలజీలను ఆవిష్కరించేందుకు ఇక్కడి స్టార్టప్ సంస్థలతో జట్టు కట్టడంపై పలు ఆసియన్ సంస్థలు ఆసక్తిగా ఉన్నాయని, కుదిరితే స్టార్టప్స్‌ను కొనుగోలు చేయాలని కూడా భావిస్తున్నాయని పరిశ్రమవర్గాలు తెలిపాయి. -
యూకే వీసా మరింత ఖరీదు
లండన్: భారతీయులకు, యూరోపియన్ యూనియన్ (ఈయూ)లో సభ్యత్వం లేని దేశా లకు చెందిన పౌరులకు బ్రిటన్ వీసా మరింత ఖరీదు కానుంది. ఇమిగ్రేషన్ హెల్త్ సర్చార్జ్ను (ఐహెచ్ఎస్) బ్రిటన్ ప్రభుత్వం పెంచడంతో భారతీయులపై ఆర్థిక భారం భారీగా పడనుంది. బ్రిటన్‌లో నివాసమున్నప్పుడు వారి ఆరోగ్య సంరక్షణ కోసం నేషనల్ హెల్త్ సర్వీసు(ఎన్హెచ్ఎస్) పరిధిలోకి వచ్చేలా 2015 నుంచి బ్రిటన్ ప్రభుత్వం హెల్త్ సర్చార్జ్ను వసూలు చేస్తోంది. భారతీయ విద్యార్థులు, వృత్తి నిపుణులు, వారి కుటుంబ సభ్యులు వీసా కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడే సర్‌చార్జ్‌ని చెల్లించాల్సి ఉం టుంది. ఇప్పుడు ఈ సర్‌చార్జ్‌ని ప్రభుత్వం రెట్టింపు చేసింది. ఇన్నాళ్లూ ఈ సర్‌చార్జీ ఏడాదికి 200 పౌండ్లు(రూ.18వేలు) ఉంటే, ఇప్పుడు దానిని 400 పౌండ్లు (రూ.36వేలు) చేసింది. కొత్త చార్జీలు జనవరి 8 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ సర్‌చార్జీలను పెంచడమే కాదు, ఇంగ్లండ్‌కు వచ్చే విదేశీ విద్యార్థులకు అడ్డుకట్ట వేయడానికి పలు చర్యల్ని చేపట్టనుంది. కేవలం ప్రతిభ ఆధారంగానే విద్యార్థులు రావడానికి అనుమతులు మంజూరు చేస్తామని బ్రిటన్ హోంమంత్రి సాజిద్ జావేద్ వెల్లడించారు. ఈయూ నుంచి వచ్చే వారికి ఉద్యోగాలు కల్పిస్తే ఏడాదికి కనీసం 30వేల పౌండ్లు (రూ.27 లక్షలు) వేతనం ఇచ్చేలా ప్రతిపాదనలు ఉన్నాయని వెల్లడించారు. 30వేల పౌండ్లు వేతనం అన్నది చాలా ఎక్కువనీ, అలా చేస్తే నర్సుల వంటి ఉద్యోగాల కోసం ఈయూ మీదనే ఆధారపడ్డ వారికి చాలా నష్టం జరుగుతుందని నేషనల్ హెల్త్ సర్వీసు సహా పలు సంస్థల యజమానులు గగ్గోలు పెడుతున్నారు. లండన్ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రతిబంధకంగా మారతాయని లండన్ నగర మేయర్ సాదిక్ ఖాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈయూ నుంచి బ్రిటన్ బయటకు వచ్చే బ్రెగ్జిట్ రిఫరెండం ఆమోదం పొందిన దగ్గర్నుంచి బ్రిటన్‌కు వలస వచ్చే వారి సంఖ్య తగ్గిపోతూ వస్తోంది. 2014–15లో 3 లక్షల మందికి పైగా ఇతర దేశాల విద్యార్థులు, ఉద్యోగులు వలసవస్తే, గత ఏడాది వారి సంఖ్య 2 లక్షల 80వేలకు తగ్గిపోయింది. -
త్వరలో ఇంటికో జెట్ విమానం!
బెర్లిన్: ప్రతి ఇంటికీ బైక్, కారు మామూలైపోయిన ఈరోజుల్లో ప్రతి ఇంటికీ జెట్ విమానం నినాదంతో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఏఎస్) అడుగులు వేస్తోంది. ట్రాఫిక్ సమస్యలతో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వినియోగదారులకు ఉపశమనాన్ని కలిగించేందుకు త్వరలోనే మొట్టమొదటి వ్యక్తిగత జెట్ విమానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. కారును వాడినట్లుగానే ఈ కొత్త జెట్ ఫ్ల్లైట్ను వాడుకునేందుకు వీలుగా దీన్ని వర్టికల్ టేకాఫ్, ల్యాండింగ్ పద్ధతిలో రూపొందిస్తోంది. నలుగురు మ్యూనిచ్ ఇంజనీర్లు, డాక్టోరల్ విద్యార్థులు స్థాపించిన లిల్లుమ్ ఏవియేషన్ సంస్థ, వ్యక్తిగత వాహనాల మాదిరిగానే, వ్యక్తిగత విహంగాలను అభివృద్ధి చేస్తోంది. జర్మనీ ఆధారిత ఇంజనీర్లు ఈ వీటీవోఎల్ జెట్ విమానాన్ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఇంక్యుబేషన్ సెంటర్లో డిజైన్ చేసి అభివృద్ధి చేస్తున్నారు. ఎకో ఫ్రెండ్లీగా ఉండి, తక్కువ శబ్దంతో, హెలికాప్టర్లకన్నా సులభంగా ఎగిరే కొత్త తరహా జెట్ విమానాలను 2018 నాటికి అందుబాటులోకి తేనున్నారు. ఈ నూతన ఆవిష్కరణలో విమానాలను... హెలికాప్టర్ల మాదిరిగానే భూమినుంచి నిలువుగా టేకాఫ్ అవడంతో పాటు, నిలువుగా ల్యాండింగ్ అయ్యే వర్టికల్ ల్యాండింగ్ (వీటివోఎల్) విధానంతో రూపొందిస్తున్నారు. ఈ విమానాలు ల్యాండ్ అయ్యేందుకు ఓ చిన్నగది సైజు స్థలం ఉంటే సరిపోతుంది. వీటివోఎల్ జెట్ ఎగిరేందుకు దీనిలో ఎలక్ట్రిక్ మోటార్లను వినియోగిస్తున్నారు. గంటకు 400 కి.మీ. వేగంతో 500 కి.మీ. ఎత్తు వరకు ప్రయాణించవచ్చు. అయితే ధర ను మాత్రం సంస్థ ఇంకా వెల్లడించలేదు. లిల్లుమ్ ఏవియేషన్ ఈ జెట్ విమానాన్ని ప్రజలకు అందుబాటులోకి తెస్తే ఇక భవిష్యత్తులో వ్యక్తిగత ప్రయాణ విధానమే మారిపోయే అవకాశం కనిపిస్తోంది. -
'ప్రయివేట్ మెసేజ్ లను కూడా చూడొచ్చు...'
కంపెనీలకు తమ కార్మికుల ఆన్లైన్ ప్రైవేట్ మెజేస్ లను మానిటర్ చేసే హక్కును యూరోపియన్ న్యాయస్థానం కల్పించింది. ఓ ఇంజనీర్ తన వృత్తిపరమైన విషయాలను మాత్రమే సంభాషించాల్సిన యాహూ మెసెంజర్ లో తన సోదరుడు, కాబోయే భార్యతో మాట్లాడి, తర్వాత తొలగించడాన్ని యూరోపియన్ మానవ హక్కుల న్యాయస్థానం తప్పుపట్టింది. బొగ్డన్ మిహై బార్బులెస్కు తన ఖాతాదారుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు యాహూ మెసెంజర్ అవసరమని, తన ఖాతాను ఓపెన్ చేయమని యాజమాన్యాన్ని కోరాడు. దీంతో కంపెనీ అతనికి కొత్త ఖాతా ఓపెన్ చేసి ఇచ్చింది. అనంతరం 2007 లో తన ఛాట్స్ కొంతకాలంగా ఎవరో పర్యవేక్షిస్తున్నట్లు అతడు యాజమాన్యాన్ని కలిసి ఫిర్యాదు చేశాడు. అయితే కంపెనీ నిబంధనల ప్రకారం అతడి సేవలను కంపెనీకి మాత్రమే వినియోగించాల్సి ఉంది. దీంతో యాజమాన్యం అతని ఫిర్యాదును స్వీకరించకపోగా, అతడు చేసిన తప్పును ఎత్తి చూపింది. దీంతో కోర్టుకెక్కిన సదరు ఇంజనీర్ తన కాబోయే భార్యకు సహా ఇతరులకు పంపిన మెజేస్ లతో పాటు 45 పేజీల ట్రాన్స్ స్క్రిప్ట్ ను కోర్టు ముందుంచాడు. విషయాన్ని పరిశీలించిన స్ట్రాస్బోర్గ్ కోర్ట్ యాజమానివైపు నిలిచింది. ఉద్యోగి పని గంటల సమయంలో వృత్తి పరమైన పనులు పూర్తి చేశాడా లేదా అన్న విషయాన్ని గమనించే హక్కు యాజమాన్యానికి ఉంటుందని తీర్పునిచ్చింది. కార్మికుల పనిని పరిశీలించడంలో భాగంగా ప్రైవేట్ మెజేజ్ లను కూడా పర్యవేక్షించే అధికారం యాజమాన్యానికి ఉంటుందని కోర్టు.. తేల్చి చెప్పింది. కంపెనీ నిబంధనలను ఉల్లంఘించిన బార్బులెస్కు దావాను న్యాయమూర్తి కొట్టివేశారు. ఈ నిర్ణయం యూరోపిన్ దేశాలన్నింటికి వర్తిస్తుందని, ఉద్యోగి పని విషయంలో యాజమాన్యాలకు చాలా కఠినమైన నిబంధనలు ఉంటాయని, లండన్ సంస్థ లెవిస్ సిల్కిన్ ఉపాధి హెడ్ బ్లూమ్ బర్గ్, న్యాయవాది మైఖేల్ బర్డ్ లు చెప్పారు. అయితే ఈ కేసులో యాహూను స్వవిషయాలకు వినియోగించినట్లు ఉన్నా ఇది ఒక్క యాహూకే కాక ఏ ఇతర మెసేజింగ్ సర్వీసుల విషయంలోనైనా వర్తిస్తుందని వారు చెప్తున్నారు. -
సిరియన్ శరణార్థుల గోస
-
ఐరోపాలో ‘కత్తి’ గీతాలు
కత్తి చిత్ర గీతాలను ఐరోపాలో చిత్రీకరించనున్నారు. ఇళయదళపతి విజయ్ నాయకుడిగా, ప్రతినాయకుడిగా ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం కత్తి. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చెన్నై చిన్నది సమంత నాయకి. చిత్ర షూటింగ్ చెన్నైలో శరవేగంగా జరుగుతోంది. ఆగస్టు 10వ తేదీకంతా టాకీ పార్టు పూర్తి అవుతుందని యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి. రెండు పాటల చిత్రీకరణతో మొత్తం షూటింగ్ పూర్తి అవుతోంది. ఈ రెండు పాటలను ఐరోపా దేశాల్లో చిత్రీకరించాలని దర్శక నిర్మాతలు నిర్ణయించారు. దీంతో ఆగస్టు నెల చివరిలో విజయ్, సమంత, దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్తోపాటు చిత్ర యూనిట్ ఐరోపాకు పయనం కానుంది. ఈ రెండు పాటలను అక్కడి మూడు దేశాల్లో చిత్రీకరించడానికి ప్రణాళికను సిద్ధం చేశారు. అనిరుధ్ సంగీతాన్ని చిత్రం అందిస్తున్నా ఈచిత్రంపై అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి. కత్తి చిత్రాన్ని దీపావళికి విడుదల చెయ్యడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. -
అమ్మకానికి పౌరసత్వం..
డబ్బులకు కటకటలాడుతున్న కొన్ని కంట్రీలు నిధుల సమీకరణ కోసం కొత్త మార్గాలు అన్వేషిస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రస్తుతం అత్యంత చౌకగా తమ దేశ పౌరసత్వాన్ని ఇచ్చేస్తామంటున్నాయి. తమ పాస్‌పోర్టు తీసుకుంటే బోలెడన్ని ప్రయోజనాలు ఉంటాయంటూ ఊదరగొడుతున్నాయి. మన దగ్గర ఒక మోస్తరు సిటీలో కాస్త మెరుగైన ఇల్లు కొనుక్కోవాలంటే.. అరవై, డెబ్భై లక్షల పైచిలుకు అవుతోంది. దాదాపు అంతే మొత్తానికి కొన్ని కరీబియన్, యూరోపియన్ దేశాలు ఏకంగా పౌరసత్వాన్నే ఇచ్చేస్తున్నాయి. తాజాగా యూరోపియన్ దేశం మాల్టా .. ఇలాగే సుమారు రూ. 5.5 కోట్లు కట్టిన వారికి తమ దేశ పౌరసత్వం ఇచ్చేస్తామంటూ ప్రకటించడంతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇంత డబ్బు కట్టి మాల్టా పాస్‌పోర్టు తీసుకున్న వారికి .. యూరోపియన్ యూనియన్‌లో 27 దేశాల్లో ఎక్కడైనా నివసించేందుకు అధికారాలు లభిస్తాయట. ఆఖరికి యూరోపియన్ పార్లమెంటు సభ్యులు అయ్యేందుకు కూడా హక్కులు లభిస్తాయట. ఇంత కన్నా చౌక ఆప్షన్స్ కూడా ఉన్నాయి. 1. సుమారు 73,000 మంది జనాభా ఉండే డొమినికా కేవలం రూ. 60 లక్షలకు పౌరసత్వం ఇస్తోంది. దీనికోసం ఆ దేశానికి ప్రత్యేకంగా వెళ్లనక్కర్లేదు.. అక్కడే ఉండాలన్న నిబంధన కూడా ఉండదు. ఈ దేశం పాస్‌పోర్టు పొందిన వారు 50 దేశాలకు వీసా సమస్య లేకుండా వెళ్లొచ్చు. 2. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ది కూడా ఇదే ధోరణి. తమ దేశ చక్కెర మిల్లుల్లో రిటైరయిన ఉద్యోగుల నిధి కోసం దాదాపు రూ. 1.5 కోట్లు విరాళమిస్తే అక్కడి పౌరసత్వం ఇస్తామంటోంది. ఈ దేశ పాస్పోర్టుతో 139 దేశాలకు వీసాల్లేకుండా వెళ్లొచ్చు. 3. హంగరీలో రూ. 2 కోట్లతో ప్రత్యేక బాండు కొనుక్కుంటే నివసించేందుకు పర్మిట్ దొరుకుతుంది. 4. పోర్చుగల్‌లో రూ. 4 కోట్లు రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేస్తే రెసిడెన్సీ పర్మిట్ లభిస్తుంది. 5. ఇటీవల కొన్నాళ్ల కిందటి దాకా గ్రామీణ ప్రాంతాల్లో సుమారు రూ. 58 లక్షలతో ప్రాపర్టీ కొన్నా, సిటీల్లో రూ. 1.1 కోట్లు పెట్టి రియల్టీ కొన్నా లాత్వియా తమ దేశంలో అయిదేళ్లు నివసించేందుకు పర్మిట్ ఇచ్చేది. ప్రస్తుతం ఈ మొత్తాన్ని రూ. 2 కోట్ల పైచిలుకు పెంచేసింది. ఇలాగే, అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రియా తదితర దేశాలు కూడా తమ దేశంలో ఇన్వెస్ట్ చేస్తే పౌరసత్వం ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటాయి. కానీ, మిగతా చిన్నా, చితకా దేశాలతో పోలిస్తే వీటిలో నిబంధనలు, ఇన్వెస్ట్ చేయాల్సిన డబ్బు చాలా భారీ స్థాయిలో ఉంటుంది. -
నేరస్ధుల సంఖ్య తగ్గిపోతోందోచ్!
-
ఉపగ్రహాలు... ఉపద్రవాలు!
విజ్ఞాన శాస్త్రం రెండువైపులా పదునున్న కత్తిలాంటిది. దాంతో ప్రమాదాలు, ప్రమోదాలూ సమంగా ఉంటాయి. దాన్ని విధ్వంసానికి ఉపయోగించాలో, వికాసానికి వినియోగించుకోవాలో తేల్చుకోవాల్సింది మనిషే. ఒక్కోసారి అసలు మన ఉద్దేశాలతో ప్రమేయం లేకుండా కూడా అది పెనుముప్పునకు కారణం కావొచ్చు. ఒకటి రెండు రోజుల్లో భూమ్మీద అమాంతం పడిపోనున్న ఉపగ్రహం చెబుతున్న పాఠమిదే. గురుత్వాకర్షణ క్షేత్రాలు ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నాయో అంచనా వేసిన... సాగరాల తీరుతెన్నులెలా ఉంటున్నాయో పసిగట్టి చెప్పిన ఉపగ్రహం ఇప్పుడు అన్ని నియంత్రణలనూ ధిక్కరించి కిందకు దూసుకొస్తున్నది. యూరోపియన్ అంతరిక్ష సంస్థ సరిగ్గా నాలుగేళ్ల క్రితం ప్రయోగించిన ఈ ఉపగ్రహం గత కొన్నాళ్ల నుంచి శాస్త్రవేత్తలను కలవరపెడుతోంది. అంతరిక్షంలో తిరుగాడుతున్న ఉపగ్రహం ఉన్నట్టుండి కనుమరుగెలా అయిందని వారంతా గందరగోళంలో పడిపోయారు. ఈ ధూర్త ఉపగ్రహం ఆచూకీ వారికి పెద్ద పజిల్‌గా మారిపోయింది. వారం క్రితం మాత్రమే అది భూమివైపుగా దూసుకొస్తున్నదని శాస్త్రవేత్తలు గ్రహించారు. అది ఎప్పుడు, ఎక్కడ పడుతుందన్న అంశంలో ఇంకా స్పష్టత రాలేదు. భూవాతావరణంలోకి ప్రవేశించాక మాత్రమే సమయాన్ని నిర్ధారించడం సాధ్యమవుతుంది. ఆదివారం లేదా సోమవారం అది కూలుతుందని తాత్కాలికంగా అంచనాకొచ్చారు. 1,100 కిలోల బరువున్న ఈ ఉపగ్రహంలో కొంత భాగం భూవాతావరణంలోకొచ్చిన వెంటనే ఆ రాపిడికి భగ్గున మండుతుందని చెబుతున్నారు. మండేది మండగా అది దాదాపు 45 శకలాలుగా విడివడుతుందట. ఈ శకలాలు ఒక్కోటి 90 కిలోలకుపైగా బరువు ఉండొచ్చని అంచనా. అయిదున్నర దశాబ్దాల క్రితం అంతరిక్షంపై ఆధిపత్యం సాధించడానికి రెండు అగ్రరాజ్యాలు అమెరికా, సోవియెట్ యూనియన్లు చేసిన ప్రయత్నం అంతకంతకు విస్తరించి ఇప్పటి ఈ స్థితికి చేరింది. 1957లో మొట్టమొదటి మానవ నిర్మిత ఉపగ్రహం స్పుత్నిక్-1ను సోవియెట్ యూనియన్ అంతరిక్షంలోకి పంపింది. అటు తర్వాత ఏకంగా చంద్రుడిపైకి మరో ఉపగ్రహం లూనా-2ను పంపి పరుగు పందెంలో తానే ముందున్నానని నిరూపించుకుంది. మరో పదేళ్లకు...అంటే 1969 జూలై 30న చంద్రమండలంలో అమెరికా మనుషులనే దింపింది. మన దేశం 1962లో భారత అంతరిక్ష పరిశోధనా సంఘాన్ని ప్రారంభించింది. ఇప్పుడు ఈ పోటీ మరింతగా పెరిగిపోయింది. ఒకర్ని మించి ఒకరు అంతరిక్ష విజయాలను సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉపగ్రహాల వల్ల ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిపోయింది. మనుషుల మధ్య దూరం తరిగిపోయింది. భూగోళంలో ఏమూలనున్నా ఒకరితో ఒకరు దృశ్యమాధ్యమం ద్వారా సంభాషించుకునేంతగా సాంకేతిక విజ్ఞానం విస్తరించింది. టీవీ ప్రసారాల దగ్గర నుంచి సెల్ఫోన్ల వరకూ... వాతావరణ స్థితిగతులు తెలుసుకోవడం నుంచి ప్రమాద హెచ్చరికల వ్యవస్థ వరకూ అన్నిటికీ అంతరిక్షంలో నిరంతరం తిరుగాడే ఉపగ్రహాలే ఆధారమవుతున్నాయి. ఇదంతా నాణేనికి ఒకపక్క మాత్రమే. ఆసక్తి అనాలో, అత్యుత్సాహం అనాలో... మొత్తానికి మనిషిలో పెరుగుతున్న తృష్ణ ముప్పునూ కొనితెస్తోంది. అంతరిక్షం క్రమేపీ పెద్ద చెత్త కుప్పగా మారుతోంది. అప్పుడప్పుడు దారితప్పి వచ్చే గ్రహ శకలాలను మించి ఆ చెత్త కుప్ప భయపెడుతోంది. ఎప్పుడు మిన్ను విరిగి మీద పడుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. మూడున్నర దశాబ్దాల క్రితం నేల రాలిన స్కైలాబ్ అంతరిక్ష నౌక మానవాళిని అప్పట్లో తీవ్రంగా కలవరపరిచింది. ఇంకేముంది... యుగాంతమే అనుకున్నారందరూ. అది సముద్రంలో పడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారుగానీ ఆ బాపతు ప్రమాదం అంతరించలేదు. సరిగదా ఇంతకింతా పెరిగింది. అప్పగించిన పనిని మానుకుని మొరాయించే ఉపగ్రహాలను శాస్త్రవేత్తలు మృత ఉపగ్రహాలుగా వ్యవహరిస్తారు. రెండేళ్ల క్రితం అమెరికా ప్రయోగించిన ఆర్స్ ఉపగ్రహం నేలపైకి దూసుకొచ్చినప్పుడు ప్రపంచ దేశాలన్నీ హడలెత్తాయి. ఎక్కడ ఎలాంటి ముప్పు కలిగిస్తుందోనని వణికిపోయాయి. కానీ, అదృష్టవశాత్తూ అది పసిఫిక్ మహా సముద్రం సమీపంలో కూలింది. గత ఏడాది రష్యా అంగారకుడిపైకి పంపిన ఫోబోస్గ్రంట్ ఉపగ్రహం మధ్యలోనే మొరాయించి వెనక్కు దూసుకొచ్చింది. అది కూడా పసిఫిక్ మహా సముద్రాన్నే నమ్ముకోవడంతో పెనుముప్పు తప్పింది. అంతరిక్షంలో తిరుగాడే ఒక ఉపగ్రహాన్ని చైనా 2007లో క్షిపణి ద్వారా ధ్వంసం చేసింది. అది అనుకోకుండా జరిగిందేనని ఆ దేశం సంజాయిషీ ఇచ్చుకున్నా ఫలితం మాత్రం తీవ్రంగానే ఉంది. ఆ ఉపగ్రహం తాలూకు శకలాలు ఇప్పుడు అంతరిక్షంలో గిరికీలు కొడుతున్నాయి. మన దేశంతో సహా ఎందరెందరి ఉపగ్రహాలకో ముప్పుగా పరిణమించాయి. 2009లో రష్యా ఉపగ్రహం దారితప్పి అమెరికా ఉపగ్రహాన్ని ఢీకొట్టి నుగ్గునుగ్గు చేసింది. అది కూడా భారీయెత్తున వ్యర్థాలను మిగిల్చింది. అసలు అంతరిక్షంలో చిన్నా పెద్దా శకలాల సంఖ్య దాదాపు 4 కోట్లుంటుందని అంచనా. ఇందులో నట్లు, బోల్టులు మొదలుకొని పెద్ద పెద్ద శకలాల వరకూ ఉంటాయి. ఈ పరిస్థితిని గమనించే ఇకపై ప్రయోగించే ఉపగ్రహాల న్నిటికీ ‘సేఫ్ మోడ్’ విధానం ఉండాలని, పనికిరావనుకున్నప్పుడు వాటిని సురక్షితంగా దించేందుకు ఇది అవసరమని ఐక్యరాజ్యసమితి తీర్మానించింది. కానీ, పట్టించుకునేదెవరు? ఇప్పుడు కూలిపోతున్న ఉపగ్రహంలో అలాంటి ఏర్పాటున్నా, అది కూడా పనిచేయడం మానేసింది. ఏడాదికి 40 టన్నుల అంతరిక్ష వ్యర్థాలు భూమ్మీద పడుతున్నాయని అంచనా. ఈ ఏడాదైతే ఆ బాపతు వ్యర్థాలు 100 టన్నుల వరకూ పడ్డాయని చెబుతున్నారు. ఉపగ్రహ నిర్మాణంలో ఉపయోగించే రసాయనాలు, లోహాలు, ఆ పరికరాల్లో ఉండే రేడియోధార్మిక పదార్థాలు ప్రజారోగ్యానికి ముప్పు కలిగిస్తున్నాయి. విజ్ఞాన శాస్త్ర ప్రగతి ‘పులి మీద స్వారీ’లా మారినప్పుడు ఇంతకన్నా మెరుగైన ఫలితాలు ఎలా వస్తాయి? -
రెండు రోజుల్లో భూమి పై పడనున్న ఉపగ్రహం
-
యూరప్ మహా సామ్రాజ్ఞి!
మర్కెల్‌కు ‘యూరో’ ఉమ్మడి కరెన్సీ మీద గానీ, యూరోపియన్ సంయుక్త రాష్ట్రాలనే పగటి కల మీద గానీ ఎలాంటి భ్రమలూ లేవు. జర్మనీ, జర్మనీ ప్రయోజనాలు మాత్రమే ఆమెకు సత్యం. జరగరానిది జరగక తప్పదని తెలిసి కూడా జరగరాదని ఆఖరు వరకు ఎదురు చూడటం, ఆపై నిరాశతో నిట్టూర్చడం మానవ నైజం. సెప్టెంబర్ 22న అదే జరిగింది. ‘ప్రతి ఒక్కరూ ద్వేషించాలని కోరుకునే మహిళ’ (‘టైం’ పత్రిక) వరుసగా మూడో మారు జర్మనీకి ఛాన్సలర్‌గా ఎన్నికయ్యారు. జర్మన్లు ఏంజెలా మర్కెల్‌కు ఘనంగా పట్టంగట్టారు. కానీ, జర్మనీ మినహా యూరప్ అంతటా విచారపడ్డవారే ఎక్కువ. మర్కెల్‌ను ‘యూరో నియంత’, ‘అభినవ హిట్లర్’ అని తిట్టిపోసేవారికి కొదవలేదు. యూరో సంక్షోభానికి విరుగుడుగా మర్కెల్ అమలు చేయిస్తున్న కఠోరమైన ప్రభుత్వ పొదుపు చర్యల ధాటికి సామాన్యులే కాదు యూరో అధినాయక ‘త్రయం’-యూరోపియన్ కమిషన్ (ఈసీ). యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు (ఈసీబీ), అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) సైతం ఆమె అంటేనే హడలెత్తిపోతున్నాయి. ‘పొదుపుల’ భారం పెరిగే కొద్దీ నిరుద్యోగం పెరగుతుందని, కొనుగోలుశక్తి పడిపోయి సంక్షోభం మరింత విషమిస్తుందని, కాబట్టి ఇప్పటికైనా కాస్త పొదుపు చర్యల్లో ‘మెతకదనం’ చూపాలని ‘త్రయం’ సైతం భావి స్తోంది. అందుకే ఎగ్జిట్ పోల్ ఫలితాలు మర్కె ల్ మితవాద కూటమికి పూర్తి ఆధిక్యతను కట్టబెడతాయన్న తొలి అంచాలను చూసి ఈయూఈసీ అధ్యక్షుడు గుంతర్ ఓటింగర్ ‘బాప్రే బాప్!’ అంటూ గుడ్లు తేలేశారు. కానీ, మర్కెల్ పూర్తి ఆధిక్యతకు ఐదు సీట్ల దూరంలో నిలిచిపోయారు. సోషల్ డెమోక్రాట్లతో, గ్రీన్ పార్టీతో కలిసి మర్కెల్ ‘మహా కూటమి’ ప్రభుత్వాన్ని ఏర్పరచాల్సి రావటం యూరప్‌కు శుభ సూచకమంటూ ఈయూ అధ్యక్షుడు మార్టిన్ షుల్జ ‘త్రయం’ అభిమ తాన్ని వెల్లడించారు. మర్కెల్‌కు ప్రధాన ప్రత్యర్థిగా తలపడ్డ ఎస్పీడీ 2005లో మర్కెల్తో ‘మహా కూటమి’ ప్రభుత్వం నిర్మించిన ఫలితంగా... 2009 కంటే ఘోరపరాజయం పాలైంది. అయినా మర్కెల్తో మళ్లీ సంకీర్ణానికి వెనుకాడకపోవడంలో ఆశ్చర్యం లేదు. ఈ ఎన్నికలు నిజానికి మర్కెల్ ఈయూ విధానంపై జనాభిప్రాయ సేకరణలాంటివి. ఎస్పీడీయే కాదు, గ్రీన్ పార్టీ సైతం మర్కెల్ ఈయూ విధానాన్ని సమర్థిస్తున్నవే. ఇతర ఈయూ దేశాలకు సం క్షోభ పరిష్కారంగా మర్కెల్ ఏమి శాసిస్తున్నారో వాటికి విరుద్ధమైన విధానాలను దేశంలో అవలంబిస్తున్నారు. 2007 సంక్షోభం మొదలైన వెంటనే ఆమె పొదుపర్లకు ఎలాంటి ముప్పు లేదని అభయహస్తం ఇచ్చారు. సైప్రస్‌లో అందుకు విరుద్ధంగా పొదుపర్ల డిపాజిట్లకు కత్తెర వేయించారు. ప్రభుత్వ వ్యయాల కోతలను శాసిస్తున్న మర్కెల్ 150 కోట్ల యూరోలను ఒక్క కార్ల పరిశ్రమకు ‘తుక్కు బోనస్’గా ఇచ్చారు. తద్వారా 5 లక్షలకు పైగా పాత కార్లను తుక్కు చేయించారు. ఆరు లక్షల కొత్త కార్లను ఒక్కొక్కదానికి 2,500 యూరోల సబ్సిడీని ప్రకటించి మరీ అమ్మించారు! సంక్షోభంలో కూడా జర్మనీది ఆర్థికంగా తిరుగులేని స్థానం. మిగతా యూరో జోన్ దేశాల ఎగుమతులన్నీ కలిసి జర్మనీ ఎగుమతుల్లో 42 శాతం మాత్రమే. భారీ ఎత్తున ఇతర యూరోపియన్ దేశాలతో వాణిజ్య మిగులు, భారీ విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉన్నా మర్కెల్ యూరో సంక్షోభం పరిష్కారానికి పైసా పైసా లెక్కబెట్టి మరీ దులపరిస్తా రు. యూరో సంక్షోభానికి పరిష్కారంగా చెబుతున్న యూరోపియన్ స్టెబిలిటీ మెకానిజంకు (యూరో శాశ్వత బెయిలవుట్ నిధి) జర్మనీ 27 శాతం నిధులను సమకూరుస్తోంది. కానీ జనాభాను లెక్కలోకి తీసుకొని చూస్తే అది చాలా తక్కువ. ఎనిమిది కోట్లకు పైగా జనా భా ఉన్న యూరప్‌లోని అత్యంత బలమైన దేశం జర్మనీ పౌరులు తలసరిన 265 యూరోలను ఈఎస్ఎమ్ నిధికి చెల్లిస్తుంటే, 53 లక్షల జనాభా ఉన్న లగ్జెంబర్గ తలసరిన 373 యూ రోలను చెల్లిస్తోంది. యూరో జోన్లో ఇస్తోనియా ఒక్కటే జర్మనీకన్నా తక్కువగా చెల్లిస్తున్నది. మర్కెల్‌కు ‘యూరో’ ఉమ్మడి కరెన్సీ మీద గానీ, యూరోపియన్ సంయుక్త రాష్ట్రాలనే పగటి కల మీదగానీ ఎలాంటి భ్రమలూ లేవు. ఆమెకు జర్మనీ, జర్మనీ ప్రయోజనాలు మాత్రమే సత్యం. అలా అని ఆమె ‘నియంతలా’ ఏ నిర్ణయాన్ని ఇతరులపై రుద్దరు. కాకపోతే, ముందు నుయ్యి వెనుక గొయ్యి పరిస్థితిని సృష్టించి ఏది కావాలో మీరే ‘ఎంచుకోమంటారు.’ గ్రీస్ విషయంలో ఆమె చేసిం దదే. గ్రీస్‌కు యూరో బహిష్కారమా? కఠోరమైన పొదుపు చర్యలతో బెయిలవుటా? తేల్చుకోమన్నారు. రెండోది ఎంచుకోకపోతే... ఆమె చెప్పకపోయినా జరిగేది అందరికీ తెలి సిందే. జర్మనీ యూరోకు గుడ్‌బై చేప్పేయటం. కాబట్టే గత మూడు నెలలుగా ‘త్రయం’ చేతులు ముడుచుకొని జర్మనీ ఎన్నికల కోసం వేచి చూస్తోంది. యూరో అధినాయక త్రయం సహా అంతా మర్కెల్ ఏర్పరచబోయో సంకీర్ణ ప్రభుత్వం కారణంగా ఆమె కాస్త ‘మెత్తబడతారని’ ఆశిస్తున్నారు. అదేమోగానీ ‘నుయ్యో గొయ్యో’ తేల్చుకోవాల్సింది సోషల్ డెమోక్రాట్లే. మర్కెల్‌ను వ్యతిరేకించి ఎన్నికలకు వెళి తే మర్కెల్‌కు తిరుగులేని ఆధిక్యత ఖాయం. కాబట్టి మర్కెల్ జర్మనీకి ఏది మేలనుకుంటే ఆదే చేస్తారు. అంతా మర్కెల్ చేతుల్లోనే ఉం ది. నేటి యూరప్‌కు మర్కెల్ ఒక శాపం... ఉన్న ఒకే ఒక్క ఆశ! - పిళ్లా వెంకటేశ్వరరావు -
వుడాకు శి‘రో’భారం
సాక్షి, విశాఖపట్నం : రో హౌసింగ్ ప్రాజెక్టు విశాఖ నగరాభివృద్ధి సంస్థ(వుడా)కు భారంగా మారింది. ఐదేళ్ల క్రితం నిర్మించిన రోహౌసింగ్ యూనిట్లు ఇప్పటికీ విక్రయానికి నోచుకోకపోవడంతో నిరుపయోగంగా ఉన్నాయి. ఆ ప్రాజెక్టు కోసం చేసిన రూ.18.5 కోట్ల ఖర్చు ప్రశ్నార్థంగా ఉంది. లాభాలు ఆర్జించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు తలపెడితే కొనుగోలుదారులు ఆసక్తి చూపకపోవడంతో అసలుకే ఎసరొచ్చే పరిస్థితి ఎదురైంది. వుడా అధికారులు రో హౌసింగ్ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. విశాఖ-భీమిలి బీచ్ రోడ్డుకు దగ్గరగా రుషికొండ వద్ద యూరోపియన్ నిర్మాణ నమూనాలో 2008లో నిర్మాణం చేపట్టారు. గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టుగా డూప్లెక్స్ పద్ధతిలో 65 యూనిట్లు నిర్మించారు. సుమారు రూ.18.5 కోట్లు ఖర్చు పెట్టారు. వీటిని నాలుగు కేటగిరీలుగా విభజించి అమ్మకానికి పెట్టా రు. కనీస ధరగా కేటగిరీ ఏలో ఉన్న యూనిట్లకు రూ.71 లక్షలు, కేటగిరీ బి యూనిట్లకు రూ.72లక్షలు, కేటగిరీ సీ యూనిట్లకు రూ.77 లక్షలు, కేటగిరీ డీ యూనిట్లకు రూ.82.50 లక్షలు ధర నిర్ణయించారు. యూనిట్లు సుందరంగా కనిపించడంతో కొనుగోలుదారులు పోటీ పడి వస్తారని బహిరంగ వేలం కోసం ఇప్పటికే పలు పర్యాయాలు ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించారు. ప్రజల నుంచి స్పందన రాలేదు. నగరానికి దూరంగా ఉండడం, అదే ధరకు సిటీలోనే ఫ్లాట్లు దొరకడంతో కొనుగోలుదారులు ఆసక్తి చూపలేదు. దీంతో ఏళ్ల తరబడి రో హౌసింగ్ యూనిట్లు వేలానికి నోచుకోకుండా మిగిలిపోయాయి. జూలై 10 నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరగా ఇప్పటివరకు 65 యూనిట్లకు కేవలం 45 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఈ లెక్కన బహిరంగ వేలంలో పోటీ పడే అవకాశం ఉండదు. దీంతో ఆశించిన ధర రాదు సరికదా కనీస రేటులో కూడా యూనిట్లు అన్నీ విక్రయానికి నోచుకునే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో రూ.18.5 కోట్ల పెట్టుబడి వుడాకు భారంగా పరిణమించింది. మరోవైపు నిర్మించిన హౌసింగ్ యూనిట్లు ఏళ్ల తరబడి విక్రయం కాకపోవడంతో నిర్వహణ లేక దయనీయంగా తయారయ్యాయి. నిర్మాణ నాణ్యతపై అనుమానాలు కూడా కమ్ముకుంటున్నాయి. అధికారుల అనాలోచిత నిర్ణయం, వుడా లాభాపేక్ష ధర ఫలితంగా రో హౌసింగ్ ప్రాజెక్టు ఆ సంస్థకు గుదిబండగా మారిందన్న విమర్శలున్నాయి.