
యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షుడు డేవిడ్ ససోలి మంగళవారం కన్నుమూశారు. 65 ఏళ్ల ససోలి.. రోగ నిరోధక శక్తి క్షీణించడంతో గత కొంతకాలంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి ఆయన కన్నుమూశారు. ససోలి గతేడాది సెప్టెంబర్ నుంచి న్యూమోనియా సంబంధిత జబ్బు కారణంగా ఇటలీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరిన విషయం తెలిసిందే.
ఇటాలియన్ జర్నలిస్ట్‌గా కెరియర్ ప్రారంభించిన ససోలి ఆ తర్వాత టెలివిజన్ యాంకర్‌గా జాతీయ స్థాయిలో పేరు సంపాదించారు. 2009లో యూరోపియన్ యూనియన్ పార్లమెంట్‌లో సభ్యుడిగా, 2019లో స్పీకర్‌గా సేవలందించారు. డేవిడ్ ససోలి మరణంపై పలువురు ప్రముఖులు నివాళి అర్పిస్తున్నారు. తర్వాతి పార్లమెంట్ అధ్యక్షుడి కోసం వచ్చే వారం ఓటింగ్ నిర్వహించనున్నట్లు సమాచారం.
(చదవండి: నిందితుడికి బెయిల్.. అతన్ని రాత్రి గృహనిర్బంధం చేయాల్సిందే!)
(చదవండి: కెమెరామెన్ అమ్మతో చిట్టితల్లి.. ఏం చెప్పిందో వింటే ఫిదా అవుతారు)
Comments
Please login to add a commentAdd a comment