parlament
-
ఈయూలో చేరిక అంశం వాయిదా
టిబిలిసీ: యురోపియన్ యూనియన్(ఈయూ)లో జార్జియా చేరే అంశాన్ని నాలుగేళ్లపాటు వాయిదా వేస్తున్నట్లు ప్రధాని ప్రకటించడంతో.. దేశంలో ఆగ్రహం వెల్లువెత్తింది. ప్రతిపక్షాలు పార్లమెంటును బహిష్కరించాయి. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనగా వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేపట్టారు. ఈయూ, జార్జియన్ జెండాలను ప్రదర్శిస్తూ పార్లమెంట్ వెలుపల ర్యాలీ నిర్వహించారు. రాజధాని టిబిలిసీ ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు శుక్రవారం నిరసనకారులపై బాష్పవాయువు, జలఫిరంగులను ప్రయోగించారు. కూటమి సిఫార్సులను నెరవేర్చాలనే షరతుతో ఈయూ 2023 డిసెంబరులో జార్జియాకు అభ్యర్థి హోదాను ఇచ్చింది. అయితే ఈ ఏడాది ప్రారంభంలో ‘విదేశీ ప్రభావ’చట్టాన్ని ఆమోదించిన తరువాత దాని విలీనాన్ని నిలిపివేసింది. ఆర్థిక మద్దతును కూడా తగ్గించింది. ఈ నేపథ్యంలో జార్జియాలో అక్టోబర్ 26న ఎన్నికలు జరిగాయి. వీటిని యురోపియన్ యూనియన్‌లో చేరాలన్న దేశ ఆకాంక్షలకు రెఫరెండంగా భావించారు. అధికార జార్జియన్ డ్రీమ్ పార్టీనే ఎన్నికల్లో విజయం సాధించింది. అయితే జార్జియాను తన అదీనంలోనే ఉంచుకోవాలనే రష్యా ప్రభావంతో ఓటింగ్‌లో రిగ్గింగ్ జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. డబ్బు ప్రవాహం, డబుల్ ఓటింగ్, హింసాత్మక వాతావరణంలో ఓటింగ్ జరిగిందని యూరోపియన్ ఎన్నికల పరిశీలకులు సైతం తెలిపారు. అంతకుముందు, జార్జియన్ పార్లమెంటరీ ఎన్నికలు నిష్పాక్షికంగా జరగలేదని యురోపియన్ పార్లమెంటు గత నెలలో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దీనికి అధికార జార్జియన్ డ్రీమ్ పార్టీదే పూర్తి బాధ్యతని తెలిపింది. ఏడాదిలోగా పార్లమెంటరీ ఓటింగ్‌ను పునఃసమీక్షించాలని, జార్జియాపై ఆంక్షలు విధించాలని, ప్రభుత్వంతో అధికారిక సంబంధాలను పరిమితం చేయాలని సభ్యులు ఈయూకు పిలుపునిచ్చారు. ఈయూ ఆరోపణలను జార్జియా ఖండించింది. ఇది బ్లాక్మెయిల్ రాజకీయాలని, జార్జియాను శాసించే అధికారం ఎవ్వరికీ ఇవ్వబోమని ప్రధాని ప్రకటించారు. అంతేకాదు.. యురోపియన్ యూనియన్ దిశగా మా పంథాను కొనసాగిస్తామని తెలిపారు. అయితే 2028 చివరివరకు చర్చలను ఎజెండాలో ఉంచబోమని ప్రధాని కొబాఖిడ్జే గురువారం చెప్పారు. ఈయూ నుంచి ఎలాంటి బడ్జెట్ గ్రాంట్లను తీసుకోబోమని తెలిపారు. ప్రధాని ప్రకటన తర్వాత వేలాది మంది నిరసనకారులు వీధుల్లోకి వచ్చారు. టిబిలిసీలోని పార్లమెంటు భవనం ఎదుట ర్యాలీ నిర్వహించారు. ఇతర నగరాల్లోనూ ప్రదర్శనలు నిర్వహించారు. జార్జియన్ డ్రీమ్పార్టీ నిరంకుశంగా మారి మాస్కో వైపు మొగ్గు చూపుతోందని విమర్శకులు అంటున్నారు. అధ్యక్షుడు సలోమ్ జౌరాబిచి్వలి అధికారిక ఫలితాలను తిరస్కరించారు. పార్లమెంటు చట్టబద్ధతను గుర్తించడానికి నిరాకరించారు. వచ్చే నెలలో అధ్యక్షుడి ఆరేళ్ల పదవీకాలం ముగియనుంది.. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేతలతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగిస్తూ.. ఎన్నికలను దేశాన్ని ఐరోపా నుంచి, రష్యా వైపు తీసుకెళ్లేందుకు జరిగిన ‘తిరుగుబాటు’గా అభివరి్ణంచారు. దేశ భవిష్యత్తుపై పాలకపక్షం యుద్ధం చేస్తోందని ఆరోపించారు. -
కాంగ్రెస్ బ్లాక్ పేపర్.. దిష్టిచుక్కగా అభివర్ణించిన ప్రధాని మోదీ
ఢిల్లీ: కాంగ్రెస్ విడుదల చేసిన 'బ్లాక్ పేపర్'ను ప్రధాని మోదీ దిష్టిచుక్కగా అభివర్ణించారు. తమ ప్రభుత్వంపై చెడుచూపు పడకుండా చూస్తుందని అన్నారు. ప్రతిపక్షాల ఇటువంటి చర్యను కేంద్ర ప్రభుత్వం కూడా స్వాగతించిందని అన్నారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే 'బ్లాక్ పేపర్' విడుదల చేసిన తర్వాత కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్ర మోడీ విరుచుకుపడ్డారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రం నేడు 'శ్వేతపత్రం'ను విడుదల చేయనుంది. ఇందుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ 'బ్లాక్ పేపర్'ను విడుదల చేసింది. కేంద్రం ఆర్థిక వ్యవస్థపై విఫలమైందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, రైతుల కష్టాలు వంటి కేంద్రం వైఫల్యాలను 'బ్లాక్ పేపర్' లో పేర్కొన్నామని కాంగ్రెస్ ప్రకటించింది. కాంగ్రెస్ బ్లాక్ పేపర్ విడుదల చేసిన సందర్భంగా విలేకరుల సమావేశంలో ఖర్గే మాట్లాడుతూ.. "ప్రభుత్వానికి వ్యతిరేకంగా బ్లాక్ పేపర్ విడుదల చేస్తున్నాం. ఎందుకంటే పార్లమెంట్లో మాట్లాడినప్పుడల్లా కేంద్రం విజయాల గురించే మాట్లాడుతారు. కానీ సొంత వైఫల్యాల గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. ఆ వైఫల్యాల్ని మాట్లాడటానికి కూడా మమ్మల్ని అనుమతించరు. దేశంలో నిరుద్యోగం అతిపెద్ద సమస్య.. కానీ కేంద్రం ఎప్పుడూ మాట్లాడలేదు.” అని మల్లికార్జున ఖర్గే అన్నారు. ఇదీ చదవండి: మన్మోహన్ సింగ్‌పై ప్రధాని మోదీ ప్రసంశలు -
పార్లమెంట్లో అలజడి ఘటన దురదృష్టకరం: మోదీ
ఢిల్లీ: పార్లమెంటు అలజడి ఘటన అత్యంత దురదృష్టకరమని ప్రధాని మోదీ అన్నారు. ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అవసరమైన చర్యలు తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఘటన తీవ్రతను తక్కువ అంచనా వేయవద్దని మోదీ అన్నారు. "పార్లమెంట్లో జరిగిన ఘటన తీవ్రతను ఏమాత్రం తక్కువ అంచనా వేయకూడదు. అందుకే స్పీకర్ అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు" అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దర్యాప్తు సంస్థలు సమగ్రంగా విచారణ జరుపుతున్నాయి. "దీని వెనుక ఉన్న అంశాలు, ప్రణాళికలు ఏమిటో అర్థం చేసుకోవడం, పరిష్కారాన్ని కనుగొనడం కూడా అంతే ముఖ్యం. పరిష్కారాల కోసం అన్వేషించాలి. ప్రతి ఒక్కరూ అలాంటి విషయాలపై వివాదాలు లేదా ప్రతిఘటనలకు దూరంగా ఉండాలి" అని ప్రధాని మోదీ కోరారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా డిసెంబర్ 13న జీరో అవర్ సమయంలో ఇద్దరు యువకులు సాగర్ శర్మ, మనోరంజన్ పబ్లిక్ గ్యాలరీ నుండి లోక్‌సభ ఛాంబర్లోకి దూకారు. స్మోక్ క్యానిస్టర్లతో పసుపు పొగను విడుదల చేశారు. పార్లమెంట్ భవనంలో నినాదాలు చేశారు. అదే సమయంలో పార్లమెంట్ ఆవరణలో మరో ఇద్దరు అమోల్ షిండే, నీలం దేవి రంగు పొగను విడుదల చేశారు. ఈ కేసులో మొత్తంగా ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఏడు రోజుల కస్టడీలో ఉన్నారు. పోలీసుల వారిని దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాన సూత్రధారి లలిత్ ఝా నిందితుల ఫోన్లను దహనం చేసిన ప్రదేశాన్ని పోలీసులు గుర్తించారు. నిందితుల వెనక విదేశీ, ఉగ్రవాదులు హస్తం ఉందా?అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి: పార్లమెంట్ అలజడి కేసులో వెలుగులోకి కీలక అంశాలు -
Parliament: గ్యాస్ క్యానిస్టర్లు అంటే ఏంటి? ఎక్కడైనా వాడొచ్చా?
ఢిల్లీ: లోక్‌సభ లోపలికి ఆగంతకులు ప్రవేశించి బుధవారం గందరగోళం సృష్టించారు. సందర్శకుల గ్యాలరీ నుంచి ఒక్కసారిగా సభలోకి దూకి టియర్ గ్యాస్ వదిలారు. దీంతో ఎంపీలంతా భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు. నిందితులను పట్టుకుని సిబ్బందికి అప్పగించారు. పార్లమెంట్‌పై దాడి జరిగి 22 ఏళ్లు పూర్తయిన వేళ ఈ ఘటన జరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే.. నిందితులు బూట్లలో గ్యాస్ క్యానిస్టర్లను దాచుకుని వెంట తెచ్చుకున్నారు. అసలు ఏంటి ఈ గ్యాస్ క్యానిస్టర్లు? ఎక్కడ ఉపయోగిస్తారు? Sansad breaking. Two people with tear gas canisters jumped into Lok Sabha well and opened it. House adjourned. #LokSabha pic.twitter.com/UrFZ7xE8pB — sansadflix (@sansadflix) December 13, 2023 గ్యాస్ క్యానిస్టర్ల అంటే..? గ్యాస్ క్యానిస్టర్లను స్మోక్ బాంబులు, పొగ డబ్బాలు అని కూడా పిలుస్తుంటారు. వీటిని బహిరంగంగా ఉపయోగించేందుకు చట్టబద్ధత ఉంది. సినిమాలు, ఫొటోషూట్లలో పొగ తెరలను సృష్టించడానికి, మిలిటరీ విభాగాల్లోనూ వీటిని ఉపయోగిస్తుంటారు. శత్రువుల కళ్లను పొగతో ఏమార్చడానికి వాడుతారు. క్రీడలలో ముఖ్యంగా ఫుట్‌బాల్‌లో అభిమానులు తమ క్లబ్‌ల రంగులను ప్రదర్శించడానికి పొగ డబ్బాలను ఉపయోగిస్తారు. గ్రనైడ్లతో కూడిన క్యానిస్టర్లను సైనిక ఆపరేషన్లలో వాడతారు. దట్టమైన పొగ తెరలను సృష్టించడం ద్వారా దళాల కదలికలు అస్పష్టంగా మారుతాయి. తద్వారా శత్రువుల కంటపడకుండా కీలక ఆపరేషన్లను కొనసాగించడంలో దోహదం చేస్తాయి. గగనతల దాడులు, భద్రతా దళాలు దిగడం, తరలింపు కేంద్రాలను లక్ష్యంగా చేసుకునేందుకు వీటిని ఉపయోగిస్తుంటారు. నిందితుల వివరాలు.. లోక్‌సభలో టియర్ గ్యాస్ ప్రయోగానికి సంబంధించి నిందితులను సాగర్ శర్మ, మనోరంజన్, అమోల్ షిండే, నీలం దేవి కౌర్, లలిత్ ఝా, విక్కీ శర్మలుగా గుర్తించారు. కాగా, దర్యాప్తులో భాగంగా సాగర్ శర్మ స్వస్థలం ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నో కాగా.. మనో రంజన్ కర్ణాటకలోని మైసూర్. అమోల్ షిండే స్వస్థలం మహారాష్ట్రలోని లాతూర్ కాగా.. నీలం దేవి కౌర్ స్వస్థలం హర్యాణాలోని హిస్సార్. ఈ కుట్ర వెనుక మరో కీలక సూత్రదారి ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దర్యాప్తు చేపట్టారు. "Main conspirator someone else" in Parliament security breach: Police sources Read @ANI Story | https://t.co/A1Tn7NerpO#ParliamentSecurityBreach #India #Delhi pic.twitter.com/qSRwgdGVPB — ANI Digital (@ani_digital) December 14, 2023 ఇదీ చదవండి: Parliament Issue: నా కొడుకు చేసింది తప్పే.. ఉరి తీయండి -
ఉమ్మడి నల్గోండ జిల్లాలో పార్లమెంట్ స్థానాల్లో పోటి పై మొదలైన రాజకీయ చర్చ!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి జిల్లాలో పార్లమెంట్ స్థానాల్లో పోటీపై రాజకీయవర్గాల్లో చర్చ జోరందుకుంది. మరో మూడు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు ఉండటంతో మూడు ప్రధాన పార్టీల్లో ఎంపీ టికెట్ల కోసం ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించడంతో ఆ పార్టీ నుంచి ఆశావహులు ఎక్కువగా ఉన్నారు. సీనియర్ నేతలతో పాటు ముఖ్య నేతలు కూడా ఎంపీ టికెట్‌పై దృష్టి పెట్టారు. ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడంతో ఎంపీ టికెట్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ముఖ్యుల నుంచి హామీ పొందిన నేతలు కూడా టికెట్ ఆశిస్తున్నారు. మనసులో మాట బయటపెట్టిన జానారెడ్డి నాగార్జునసాగర్ ఎన్నికల బరి నుంచి తప్పుకొని, తన కుమారుడికి టికెట్ ఇప్పించుకున్న పార్టీ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే తన మనసులో మాట బయట పెట్టారు. పార్టీ ఆదేశిస్తే తాను లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేస్తానని పేర్కొన్నారు. రాజకీయాల నుంచే తప్పుకుంటానని చెప్పిన ఆయన ఈ మాట చెప్పడం చర్చనీయాంశంగా మారింది. మూడు రోజుల క్రితం.. సీఎం రేవంత్‌రెడ్డి తన ఇంటికి వచ్చి వెళ్లిన తరువాత కూడా జానారెడ్డి ఇదే మాట చెప్పారు. దీంతో ఈసారి ఆయన పోటీలో ఉంటారన్న చర్చ సాగుతోంది. ఆయన పెద్ద కుమారుడు కుందూరు రఘువీర్‌రెడ్డి కూడా ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. ఈ ఇద్దరిలో ఎవరు బరిలో ఉంటారన్నది చర్చనీయాంశంగా మారింది. పటేల్ రమేష్‌రెడ్డికి హామీ.. సూర్యాపేట అసెంబ్లీ టికెట్‌ను సీనియర్ నేత రాంరెడ్డి దామోదర్‌రెడ్డికి ఇచ్చిన సమయంలో అక్కడి నుంచి టికెట్ ఆశించిన పటేల్ రమేష్‌రెడ్డికి అధిష్టానం స్పష్టమైన హామీ ఇచ్చింది. నల్లగొండ లేదా భువనగిరి ఎంపీ టికెట్ ఇస్తామని కేసీ వేణుగోపాల్ కూడా ఆయనకు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రమేష్‌రెడ్డికి ఎంపీ టికెట్ కాకుండా రాష్ట్ర ప్రభుత్వంలోనే ఏదైనా పదవి ఇస్తారన్న చర్చ సాగుతోంది. బీఆర్ఎస్ నుంచి ఇద్దరు ఆశావహులు నల్లగొండ ఎంపీ స్థానానికి బీఆర్ఎస్ నుంచి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తనయుడు గుత్తా అమిత్‌రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన మునుగోడు టికెట్ ఆశించారు. అయితే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేకే టికెట్ కేటాయించడంతో అమిత్‌కు లోక్‌సభ టికెట్ ఇస్తారన్న చర్చ సాగింది. మరోవైపు వ్యాపారవేత్త నరేందర్‌రెడ్డి కూడా అప్పట్లో నల్లగొండ ఎంపీ టికెట్ ఆశించారు. జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో మాజీ సీఎం కేసీఆర్ ప్రచార సభల్లోనూ ఆయన పాల్గొన్నారు. కమలం దళం నుంచి ప్రసాద్ బీజేపీ నుంచి నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి బండారు ప్రసాద్‌కు గతంలోనే పార్టీ హామీ ఇచ్చిందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట నుంచి పోటీ చేసి ఓడిపోయిన సంకినేని వెంకటేశ్వర్రావుతోపాటు ఒకరిద్దరు నేతల పేర్లు కూడా పార్టీ ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. భువనగిరి స్థానంపై యువనేతల దృష్టి భువనగిరి ఎంపీ టికెట్ రేసులో సీఎం రేవంత్‌రెడ్డి అనుచరుడు, టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నారు. రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నీ తానై తుంగతుర్తిలో మందుల సామేల్ గెలుపు కోసం పనిచేశారు. తాను ఎంపీగా పోటీ చేస్తానన్న విషయాన్ని కూడా మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయనకు ఎంపీ టికెట్ ఇస్తారన్న చర్చ సాగుతోంది. అయితే, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సతీమణి కోమటిరెడ్డి లక్ష్మిని పోటీలో దింపుతారనే చర్చ కూడా సాగుతోంది. మరోవైపు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి కుమార్తె కీర్తిరెడ్డి కోసం టికెట్ అడుగుతున్నట్లు తెలిసింది. ఇక బీఆర్ఎస్ నుంచి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డిని బరిలో నిలుపుతారనే చర్చ సాగుతుండగా, బీసీకి ఇవ్వాల్సి వస్తే జనగామకు చెందిన మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, బూడిద భిక్షమయ్యగౌడ్ పేర్లు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఇక బీజేపీ నుంచి ఆ పార్టీ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్‌రావు, మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ పోటీకి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. -
చరిత్ర తెలియక ఊరకే తిరగరాస్తున్నారు
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ)బిల్లు, జమ్మూకశ్మీర్ రిజర్వేషన్(సవరణ)బిల్లులపై చర్చ సందర్భంగా మాజీ ప్రధాని నెహ్రూపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపణలు గుప్పించడాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘ జమ్మూకశ్మీర్‌లోకి పూర్తిగా భారత బలగాలు వెళ్లేలోపే కాల్పుల విరమణకు నెహ్రూ ఆదేశాలిచ్చారు. అనవసరంగా కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళ్లారు. నెహ్రూ చారిత్రక తప్పిదాల కారణంగానే కశ్మీర్ సమస్య అపరిష్కృతంగా తయారై అక్కడి ప్రజలు కష్టాలపాలయ్యారు’’ అని సోమవారం రాజ్యసభలో ఆరోపణలుచేయడం తెల్సిందే. దీనిపై మంగళవారం రాహుల్ పార్లమెంట్ ప్రాంగణంలో ఘాటుగా స్పందించారు. ‘‘ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఈ దేశం కోసం తన జీవితం మొత్తాన్నీ ధారపోశారు. స్వాత్రంత్య్ర పోరాటంలో చాలా సంవత్సరాలు జైలు జీవితం గడిపారు. ఇంకా ఇలాంటి చరిత్ర అంతా అమిత్ షాకు తెలీదనుకుంటా. అందుకే పదేపదే చరిత్రను తిరగరాస్తున్నారు. ఇదంతా అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే. కుల గణన వంటి సమస్యల సంగతేంటి? అసలు ప్రజాధనం ఎవరి చేతుల్లోకి వెళ్తోంది?. ఈ అంశాలను బీజేపీ అస్సలు చర్చకు స్వీకరించదు. భయంతో పారిపోతోంది. బీసీలను పట్టించుకోవట్లేదు’ అని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ఓబీసీల ప్రాధాన్యం పెరగాలి గిరిజన వ్యక్తిని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా, ఓబీసీ నేతను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా బీజేపీ ప్రకటించిందికదా ? అన్న మీడియా ప్రశ్నకు రాహుల్ బదులిచ్చారు. ‘‘మేం కూడా ఛత్తీస్‌గఢ్‌లో ఓబీసీ నేతను ముఖ్యమంత్రిని చేశాం. వాళ్లు కూడా మధ్యప్రదేశ్‌లో ఓబీసీ నేతను సీఎంగానే చేశారు. బీసీలకు ఒకే ఒక్క కీలక పదవి ఇస్తే సరిపోదు. ఇక్కడ పదవి ముఖ్యం కాదు. మరింత మంది ఓబీసీలకు ప్రాధాన్యత దక్కాలి. వారి ప్రాతినిధ్యం మరింత పెరగాలి. మోదీ సర్కార్ ప్రధానాంశాలను పక్కనబెట్టి ప్రజల దృష్టికి మరల్చుతోంది’’ అని రాహుల్ ఆరోపించారు. -
యుద్ధాన్ని ఎందుకు విరమించారు?
ఈ నెల 6న పార్లమెంట్లో ఆమోదం పొందిన రెండు బిల్లులను ప్రవేశపెట్టిన సందర్భంలోకేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ... ‘జమ్మూ–కశ్మీర్ శాసనసభలో పీఓకేకు 24 స్థానాలూ, కశ్మీరీ నిర్వాసితులకు 2, పీఓకే నిర్వాసి తులకు ఒకటి కేటాయించాం. తొలి ప్రధాని నెహ్రూ తప్పులు కశ్మీర్ ఉగ్ర–వేర్పాటువాదా లకూ, పీఓకే పుట్టుకకూ కారణం. మన సైన్యం పాక్ సేనను తరుముతూ 3 రోజుల్లో కశ్మీర్‌ను స్వాధీనం చేసుకోనుండగా యుద్ధం విరమించారు. అనవసరంగా, హడావిడిగా కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితి (ఐరాస)కి చేర్చారు. 70 ఏళ్ళుగా హక్కులు పోయి అన్యాయానికి గురైన కశ్మీరీలకు న్యాయం చేకూర్చడమే ఈ బిల్లుల ఉద్దేశం’ అన్నారు. దీంతో అనుపమ్ ఖేర్ లాంటి వలస కశ్మీరీ పండితులు, వైదికవాదులు కశ్మీరీ ప్రజాప్రతినిధులు కాగలరు. ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమా ప్రయోజనమూ నెరవేరగలదు. అమిత్ షా మాట్లాడిన మాటల్లో ఒక్కటీ నిజం కాదు. నిజానికి నెహ్రూ వల్లనే కశ్మీర్ఇండియాలో కలిసింది. దాన్ని ఇండియాలో కలి పేందుకు షేక్ అబ్దుల్లాను ఒప్పించారు. నెహ్రూ మంత్రివర్గ నిర్ణయం ప్రకారం హోం మంత్రి పటేల్ విన్నపానికి 566 సంస్థానాల్లో 563 ఇండియాలో కలిశాయి. జమ్ము–కశ్మీర్, హైదరాబాద్, జునాగఢ్ మిగిలాయి. పాక్ సరిహద్దు జమ్మూ– కశ్మీర్, సముద్ర సరిహద్దులోని జునాగఢ్‌లను పాక్‌కు ఇచ్చి, దేశం మధ్యలోనున్న హైదరాబాద్‌ను ఇండియాలో కలపాలని పటేల్ ప్రతిపా దించారు. తన చిరకాల వాంఛకు విరుద్ధమైన ఈ ప్రతిపాదనను నెహ్రూ ఆమోదించలేదు. కశ్మీర్ యుద్ధ విరమణ సమయంలో మన సైన్యం పూంఛ్, రాజౌరీ ప్రాంతాలను రక్షిస్తూ ఉంది. విరమణ ప్రకటించకుంటే ఈ ప్రాంతాలు పాక్ అధీనమయ్యేవి.పఠాన్ లష్కర్ల గిరిజన చొరబాటు పేరుతో పాక్ సైన్యానికి భారత సేనకు మధ్య యుద్ధం జరిగింది. పాక్ ముందుగానే పాత రోడ్లను బాగు చేసి, కొత్త రోడ్లను నిర్మించి సైన్యాల తరలింపు నకు ఏర్పాట్లు చేసుకోవడం వల్ల వేలాది సైని కులు కశ్మీర్లోకి ప్రవేశించారు. భారతీయ సైన్యం చేరడానికి సరైన రవాణా మార్గం లేక తక్కువ సైనికులే చేరారు. నానాటికీ పెరిగిన పాక్ సైన్యం మొత్తం కశ్మీర్‌ను ఆక్రమించే పరిస్థితి దాపురించింది. ఈలోపు ఇండియాను ప్రతివాదిని చేస్తూ పాక్ ఐరాసకు పోవచ్చు. 1947 డిసెంబర్ 8న నెహ్రూ చాకచక్యంగా ఈ అవకాశాన్ని కాల్పుల విరమణ ప్రకటించి అడ్డుకున్నారు. ఆ తర్వాత ఐరాసకు కశ్మీర్ సమ స్యను తీసుకెళ్లారు. నెహ్రూ అనుమానించినట్లే అమెరికా పక్షపాతి అయిన ఐరాస భారత్‌కు న్యాయం చేయలేదు. – సంగిరెడ్డి హనుమంత రెడ్డి, ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి -
కేంద్రంలో మళ్లీ ఎన్డీయే ప్రభంజనం
న్యూఢిల్లీ: దేశంలో రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలో అధికార ఎన్డీయే మరోసారి ఘన విజయం సాధిస్తుందని జాతీయ వార్తా సంస్థ ‘టైమ్స్ నౌ’ తాజా సర్వేలో వెల్లడయ్యింది. మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు గాను బీజేపీ కూటమి ఏకంగా 307 స్థానాలు గెలుచుకుంటుందని తెలియజేసింది. మెజార్టీ మార్కును సులువుగా అధిగమించి, కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తేల్చిచెప్పింది. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని విపక్ష ‘ఇండియా’ కూటమి 175 స్థానాలకే పరిమితం అవుతుందని వివరించింది. ఇతరులు 61 సీట్లలో విజయం సాధించే అవకాశం ఉందని పేర్కొంది. ఇక 25 లోక్‌సభ స్థానాలున్న ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాదాపు క్లీన్ స్వీప్ చేస్తుందని టైమ్స్ నౌ సర్వే ఉద్ఘాటించింది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయిన తర్వాత ఈ సర్వే జరిగింది. సర్వే ఫలితాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ 24 నుంచి 25 స్థానాల్లో జయకేతనం ఎగురవేస్తుంది. గత ఎన్నికల్లో 22 సీట్లు గెలుచుకున్న వైఎస్సార్సీపీ ఈసారి దాదాపు మొత్తం సీట్లను కైవసం చేసుకుంటుంది. అంతేకాదు 51.10 శాతం ఓట్లు దక్కించుకుంటుంది. ప్రతిపక్ష టీడీపీకి ఒక స్థానం లభించే అవకాశం ఉంది. ఆ పారీ్టకి 36.40 శాతం ఓట్లు లభిస్తాయి. జనసేన పార్టీ కనీసం ఒక్క స్థానంలోనూ గెలిచే పరిస్థితి లేదు. కేవలం 10.10 శాతం ఓట్లు సాధించనుంది. బీజేపీకి కనాకష్టంగా 1.30 శాతం ఓట్లు పడతాయని అంచనా. ఇతరులు 1.10 శాతం ఓట్లు సాధించనున్నారు. -
ఏలియన్ అవశేషాల పరిశోధనలో సంచలన విషయాలు
మెక్సికో సిటీ: మెక్సికో పార్లమెంట్లో మానవేతర అవశేషాల(ఏలియన్)ను ప్రదర్శించిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా వైద్యుల పరిశోధనలో వీటిపై ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఈ ఏలియన్లు భూమిపై జీవించి ఉన్నవేనని పరిశోధనల్లో తేలింది. అంతేకాకుండా ఓ ఆడ ఏలియన్ కడుపులో గుడ్లు కూడా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. దాదాపు వెయ్యి ఏళ్ల క్రితంనాటి అవశేషాలుగా కార్బన్ డేటింగ్ విధానంలో కనుగొన్నారు. మెక్సికో శాస్త్రవేత్తలు గ్రహాంతర శవాలపై ప్రయోగశాలలో విస్తృతమైన అధ్యయనాలు నిర్వహించారు. సోమవారం నూర్ క్లినిక్‌లో నౌకాదళానికి చెందిన ఫోరెన్సిక్ వైద్యుడు జోస్ డి జీసస్ జల్సే బెనితేజ్ పరీక్షలు పూర్తి చేశారు. ఈ ఏలియన్ల పుర్రెలు అతికించినట్లు ఎలాంటి ఆధారాలు కనిపించలేదని చెప్పారు. భూమిపై ఏ ఇతర జంతువుతో పోలి లేవని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఒకదాని కడుపులో గుడ్లు ఉన్నట్లు కనుగొన్నారు. ఆ రెండు అవశేషాలు ఒకే అస్థిపంజరానికి చెందినవని మెక్సికన్ జర్నలిస్ట్ ధీర్ఘకాల UFO ఔత్సాహికుడు జైమ్ మౌసన్ పేర్కొన్నారు. ఒక్కోదాని చేతికి మూడు వేళ్లు ఉన్నట్లు వెల్లడించారు. Mexico's Congress just unveiled two dead aliens estimated to be around 1,000 years old. What do you think? pic.twitter.com/Zr7z4FKenS — Kage Spatz (@KageSpatz) September 13, 2023 నేషనల్ అటానమస్ యూనివర్శిటీ ఆఫ్ మెక్సికోలోని శాస్త్రవేత్తలు ఆ అవశేషాలపై కార్బన్ డేటింగ్ విధానంలో పరిశోధనలు చేశారు. అవి 1000 ఏళ్లనాటివని తేలినట్లు తమ పరిశోధనలో తేలినట్లు వెల్లడించారు. భూమిపై ఒకప్పుడు జీవం ఉన్న, జీవ సంబంధమైన, గర్భధారణ కలిగి ఉన్నాయని తమ పరిశోధనలో తేలినట్లు పరిశోధకులు తెలిపారు. ఇదీ చదవండి: ఏలియన్ అవశేషాలు.. నాసా స్పందన ఇది -
పార్లమెంట్ కొత్త భవనంలోనే ప్రత్యేక సమావేశాలు
ఢిల్లీ: కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దిగ్విజయంగా నూతన పార్లమెంట్‌ను నిర్మించిన విషయం తెలిసిందే. మే 28న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం కూడా ఘనంగా నిర్వహించారు. అయితే.. నూతన పార్లమెంట్లో మొదటి సమావేశాలను వచ్చే ఏడాది ఎన్నిక కానున్న కొత్త ప్రభుత్వమే నిర్వహిస్తుందని అందరూ ఊహించారు. కానీ కేంద్రం ఈ నెల 18-22 వరకు ప్రత్యేక సమావేశాలను కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనంలోనే నిర్వహిస్తామని స్పష్టం చేసింది. కొత్త పార్లమెంట్లో నిర్వహించనున్న మొదటి సమావేశాల్లోనే కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దేశంలో ప్రస్తుతం తెరమీదకు వచ్చిన జమిలీ ఎన్నికలు, ఇండియా పేరు మార్పు వంటి బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ బిల్లులు ఆమోదం పొందితే నూతన పార్లమెంట్ మొదటి సమావేశంలోనే దేశ చరిత్రలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టినట్లవుతుందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్రం ప్రత్యేక సమావేశాలకు పిలుపునిచ్చింది. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు ఐదు రోజుల పాటు సమావేశాలు నిర్వహించనున్నామని స్పష్టం చేసింది. ఈ సెషన్ అజెండాను మాత్రం ఇప్పటివరకు స్పష్టం చేయలేదు. ఈ సమావేశాల అజెండా ఏంటో తెలపాలని కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ ఇప్పటికే ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఇదీ చదవండి: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలెందుకు?.. ప్రధాని మోదీకి సోనియా గాంధీ లేఖ -
పార్లమెంట్లో ‘మోదీ చాలీసా’ వద్దు
ఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మోదీ చాలీసాను తాము కోరుకోవడం లేదని, ప్రజా సమస్యలను లేవనెత్తుతామని, వాటి పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తామని ప్రతిపక్ష కాంగ్రెస్ ఎంపీలు స్పష్టం చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేత సోనియా గాంధీ నేతృత్వంలో మంగళవారం కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యూహ కమిటీ సమావేశమైంది. పార్టీ ఎంపీలు హాజరయ్యారు. ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ప్రత్యేక సమావేశాల అజెండాపై ప్రతిపక్షాలతో ప్రభుత్వం చర్చించడం ఆనవాయితీగా వస్తోందని, ఈసారి ప్రభుత్వం ఆ పని చేయలేదని, విపక్షాలను విశ్వాసంలోకి తీసుకోలేదని కాంగ్రెస్ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ ఆక్షేపించారు. ఇదీ చదవండి: దేశం పేరు మారితే ఆ వెబ్సైట్లకు కష్టాలు -
జమిలి లాభనష్టాలపై కేంద్రం వివరణ
ఢిల్లీ: ఒకే దేశం-ఒకే ఎన్నిక విధానరూపకల్పనకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వం కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జమిలీ ఎన్నికలపై లాభనష్టాలను పేర్కొంటూ గత పార్లమెంట్ సెషన్లో కేంద్ర న్యాయ శాఖ మంత్రి విడుదల చేసిన రిపోర్టు తాజాగా తెరమీదకు వచ్చింది. పార్లమెంట్లో కిరోడీ లాల్ మీనా అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘావాల్ సమాధానం ఇది.. సవాళ్లు.. ►జమిలి ఎన్నికలకు రాజ్యాంగంలోని ఐదు ఆర్టికల్స్‌లో సవరణలు అవసరమని న్యాయ శాఖా మంత్రి తెలిపారు. 1) పార్లమెంటు సభల వ్యవధిపై ఆర్టికల్ 83, 2) లోక్‌సభను రాష్ట్రపతి రద్దు చేయడంపై ఆర్టికల్ 85, 3) రాష్ట్ర శాసనసభల వ్యవధిపై ఆర్టికల్ 172, 4) రాష్ట్రాల శాసనసభలను రద్దు చేయడంపై ఆర్టికల్ 174 5) రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలనపై ఆర్టికల్ 356 ► ఇది కాకుండా జమిలీ ఎన్నికల నిర్వహణకు దేశం సమాఖ్య నిర్మాణాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ఏకాభిప్రాయాన్ని పొందడం తప్పనిసరి అని అర్జున్ మేఘావాల్ తెలిపారు. ► అదనపు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు, ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (EVMలు/VVPATలు) అవసరమవుతాయి. వీటి ఖర్చు వేల కోట్ల వరకు ఉంటుంది. ► EVM మెషీన్ జీవితకాలం కేవలం 15 సంవత్సరాలు మాత్రమే అని పరిగణనలోకి తీసుకుంటే.. ఈ యంత్రాన్ని దాని జీవిత కాలంలో మూడు లేదా నాలుగు సార్లు ఉపయోగించవచ్చు. ప్రతి 15 సంవత్సరాలకు దాని స్థానంలో మరోటి బర్తీ చేయాలంటే ఒకేసారి భారీ వ్యయం అవుతుందని అర్జున్ మేఘావాల్ చెప్పారు. ► ఇదీగాక అదనపు పోలింగ్ సిబ్బంది, భద్రతా బలగాలు కూడా అవసరమవుతాయని ఆయన స్పష్టం చేశారు. లాభాలు.. ► జమిలీ ఎన్నికల వల్ల ఒకరకంగా ప్రభుత్వ వ్యయం భారీగా తగ్గుతుందని న్యాయ శాఖ మంత్రి అర్జున్ మేఘావాల్ తెలిపారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు ప్రచార ఖర్చులు భారీగా ఆదా అవుతాయని పేర్కొన్నారు. ► జాతీయ, రాష్ట్ర ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల వల్ల ఎలక్షన్ ప్రవర్తనా నియమావళి అమలులో ఉంటుంది. ఇది అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ► దక్షిణాఫ్రికాలో జమిలీ ఎన్నికలే జరుగుతాయి. ప్రతి ఐదేళ్లకు ఒకేసారి జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఎన్నికలు జరుగుతాయి. రెండేళ్లకు ఒకసారి మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తారు. ► యూకేలోనూ ఎన్నికలు స్థిరమైన కాలవ్యవధుల్లో జరుగుతున్నాయి. పార్లమెంట్ చట్టం 2011 ప్రకారం నిర్ణీత కాలవ్యవధి ప్రకారమే స్థిరంగా నిర్వహిస్తారు. ► స్వీడన్లో కూడా జమిలీ తీరు ఎన్నికలే నిర్వహిస్తారు. నాలుగేళ్లకు ఒకసారి సెప్టెంబర్ రెండవ ఆదివారం ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తారు. ఇదీ చదవండి: ఉదయనిధి ‘సనాతన ధర్మం’ వ్యాఖ్యల దుమారం.. స్టాలిన్ ఏమన్నారంటే.. -
పార్లమెంట్ ప్రత్యేక సెషన్ ఎందుకంటే..?
ఢిల్లీ:జమిలి ఎన్నికల అంశంపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు. ప్రస్తుతం కమిటీ మాత్రమే ఏర్పాటు చేశామని తెలిపారు. కమిటీ అందించిన రిపోర్టుపై చర్చలు ఉంటాయి. పార్లమెంట్ పరిపక్వమైనది, ఆందోళన పడవద్దు అని చెప్పారు. పార్లమెంట్ ప్రత్యేక సెషన్ ఎజండాపై కూడా 3-4 రోజుల్లో తెలుపుతామని ఆయన చెప్పారు. భారత్ ప్రజాస్వామ్యానికి తల్లివంటిది అని ఆయన వ్యాఖ్యానించారు. #WATCH | On 'One nation, One election', Union Parliamentary Affairs Minsiter Pralhad Joshi says "Right now, a committee has been constituted. A report of the committee will come out which be discussed. The Parliament is mature, and discussions will take place, there is no need to… pic.twitter.com/iITyAacPBq — ANI (@ANI) September 1, 2023 జమిలి ఎన్నికల నిర్వహణకు సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి కేంద్రం కమిటీని నియమింటిన విషయం తెలిసిందే. అటు.. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సెషన్‌ను జరపనున్నట్లు ప్రకటించింది. దీంతో జమిలీ ఎన్నికలను కేంద్రం నిర్వహించడానికి సిద్ధమైందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నాయకులు కేంద్రం నిర్ణయాన్ని ప్రశ్నిస్తున్నారు. VIDEO | "How can the government take unilateral decisions without consultation with political parties and Parliament?" says CPI general secretary D Raja on reports of the central government forming a committee to explore the possibility of 'one nation one election'. pic.twitter.com/RXjYuI19Xx — Press Trust of India (@PTI_News) September 1, 2023 'ఇతర పార్టీల అభిప్రాయాలను సంప్రదించకుండానే ఏ విధంగా జమిలి ఎన్నికలపై ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారు?. అందరి అభిప్రాయాలు తీసుకుని, చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలి' కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని సీపీఐ జనరల్ సెక్రటరీ డీ రాజ విమర్శించారు. నిష్పాక్షికమైన ఎన్నికలు కావాలని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ తెలిపారు. ఈ అంశాన్ని దృష్టి మళ్లించడానికే జమిలి ఎన్నికలను తెరమీదకు తెస్తున్నారు. VIDEO | "The country is already one, is anyone questioning that? We demand fair election, not 'one nation one election'. This funda of 'one nation one election' is being brought to divert the attention from our demand of fair election," says Shiv Sena (UBT) leader @rautsanjay61… pic.twitter.com/9phqvFiqCv — Press Trust of India (@PTI_News) September 1, 2023 ఇదీ చదవండి: జమిలి ఎన్నికలపై కేంద్రం కీలక ప్రకటన.. కమిటీ ఏర్పాటు.. -
అంత ఈజీ కాదు..!
ఎస్.రాజమహేంద్రారెడ్డి : వచ్చే ఏడాది నుంచి దేశాన్ని ఓ ఐదేళ్లపాటు ఎవరు పరిపాలించబోతున్నారు? ఇప్పటికిప్పుడైతే ‘ఎన్డీయేనే.. ఇంకెవరు?’ అనే సమాధానమే వస్తుంది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే లేదా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ వరుసగా మూడోదఫా అధికార పీఠాన్ని దక్కించుకోవడం ఖాయమనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. ప్రతిపక్షాలన్నీ ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో జరిగిన 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే ఆడుతూ పాడుతూ అందలం ఎక్కింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఇదే పునరావృతం అవుతుందా? అంటే అంత నమ్మకంగా చెప్పడానికి లేదు. బీజేపీని వ్యతిరేకించే ప్రతిపక్ష పార్టీలన్నీ కాంగ్రెస్ సారథ్యంలో ‘ఇండియా’ కూటమిగా జతకట్టడంతో రసవత్తరమైన పోరుకు తెరలేచింది. గట్టి పోటీనిచ్చి ఎన్డీయేకు, ముఖ్యంగా బీజేపీకి చుక్కలు చూపించాలని ‘ఇండియా’ కూటమిలోని పార్టీలన్నీ ఉవి్వళ్లూరుతున్నాయి. మొత్తం మీద ఎన్డీయేకు ఈసారి సునాయాసంగా నెగ్గడం సులభం కాకపోవచ్చు! 2014 నుంచి మోదీ యుగం ఆరంభం ఇండియా కూటమిలోని పార్టీలన్నీ ముంబైలో గురువారం నుంచి సమావేశమై తమ కార్యాచరణ ఖరారు చేసుకోనున్నాయి. రెండు రోజులపాటు జరిగే ఈ కీలక సమావేశంలో ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరనేది చూచాయగా తెలిసే అవకాశం ఉంది. భేషజాలకు పోకుండా కలిసికట్టుగా పోరాడితే తమ అవకాశాలు ఎలా ఉంటాయో కూడా కూటమిలోని పార్టీలన్నీ బేరీజు వేసుకోనున్నాయి. గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో(2014, 2019) కూటమిలోని భాగస్వామ్య పార్టీలకు వచ్చిన మొత్తం ఓట్ల శాతాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఎన్డీయే కూటమికి వచ్చిన ఓట్ల శాతానికి కొంచెం దగ్గర్లోనే ఉన్నట్టు కనిపిస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే(38 పార్టీల కూటమి)కి 45 శాతం ఓట్లు వస్తే, ఇండియా కూటమి(26 పార్టీలు)కి 38 శాతం ఓట్లు లభించాయి. రెండు కూటముల మధ్య వ్యత్యాసం 7 శాతంగా కనిపిస్తోంది. రెండు కూటముల్లోని పార్టీలకు గత ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ నిర్ధారణకు రావొచ్చు. ప్రతిపక్షాలు కూటమిగా ఏర్పడి వచ్చే ఎన్నికల్లో పోటీ పడతాయి కాబట్టి ఓట్ల శాతంలో గణనీయమైన పెరుగుదల ఉంటుందనేది పరిశీలకుల అంచనా. ఎన్డీయే 2019 ఎన్నికల్లో 45 శాతం ఓట్లతో 341 సీట్లు గెల్చుకుంది. అంతకుముందు 2014లో ఎన్డీయే 39 శాతం ఓట్లతో 353 సీట్లు సాధించింది. 2014లో ఓట్ల శాతం తక్కువైనా ఎక్కువ సీట్లు గెల్చుకోవడం గమనార్హం. 1984 లోక్‌సభ ఎన్నికల తర్వాత ఒక కూటమి ఇన్ని సీట్లు సాధించడం కూడా ఇదే మొదటిసారి. సరిగ్గా ఇక్కడే మోదీ యుగం ఆరంభమైంది. మోదీ యుగం ఆరంభం కాకముందు 2009లో ఎన్డీయే 27 శాతం ఓట్లతో కేవలం 148 సీట్లు గెల్చుకోగలిగింది. ప్రస్తుతం ఇండియా కూటమిగా ఏర్పడ్డ పార్టీలకు 2009 ఎన్నికలు ఒక రకంగా స్వర్ణయుగమని చెప్పొచ్చు. ఈ పార్టీలకు 2009లో 40 శాతం ఓట్లు రాగా, 347 సీట్లు దక్కాయి. అయితే, 2014 ఎన్నికల్లో ఈ కూటమి పార్టీల ఓట్ల శాతం 42 శాతానికి పెరిగినా 161 సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2019 ఎన్నికలు వచ్చేసరికి ఇండియా కూటమి ఓట్ల శాతం(38 శాతం), సీట్ల సంఖ్య(158) గణనీయంగా పడిపోయాయి. కాంగ్రెస్ నష్టం బీజేపీకి లాభం గత ఎన్నికల్లో రెండు కూటముల మధ్య ఓట్ల వ్యత్యాసాన్ని పరిగణనలోకి తీసుకుంటే పోటాపోటీగానే కనిపిస్తున్నప్పటికీ, గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో(2014, 2019) బీజేపీ ఆధిక్యం ప్రస్ఫుటంగా వెల్లడవుతుంది. ఎన్డీయేలోని మిగతా భాగస్వామ్య పక్షాలపై బీజేపీ లేదా నరేంద్ర మోదీ ఆధిపత్యాన్ని రుజువు చేస్తుంది. గత ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 37 శాతం ఓట్లు సాధించింది. ఇదే ఎన్నికల్లో ఇండియా కూటమి సాధించిన ఓట్ల శాతాన్ని బీజేపీ ఒక్కటే సాధించడం విశేషం. రెండు కూటముల్లో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ల రాజకీయ ప్రయాణాన్ని పరిశీలిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. రానురాను కాంగ్రెస్ పరిస్థితి దిగజారుతుండగా, బీజేపీ ఆ మేరకు పుంజుకుంటోంది. ముక్కుసూటిగా చెప్పాలంటే కాంగ్రెస్ నష్టం బీజేపీకి లాభంగా మారుతోంది. గణాంకాలు పరిశీలిస్తే 1991 లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ సొంతంగా ఏనాడూ 30 శాతం ఓట్ల మార్కును అందుకోలేకపోయింది. బీజేపీకి 1991 ఎన్నికల్లో 20 శాతం ఓట్లు రావడం గమనార్హం. 1991, 2019 ఎన్నికల ఫలితాలను చూస్తే బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఓ సారూప్యత ఉంది. 1991లో కాంగ్రెస్‌కు 36 శాతం ఓట్లు, బీజేపీకి 20 శాతం ఓట్లు వచ్చాయి. 2019లో ఇది తిరగబడింది. 2019లో కాంగ్రెస్‌కు 20 శాతం, బీజేపీకి 37 శాతం ఓట్లు వచ్చాయి. ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే కాంగ్రెస్ కోల్పోయిన ఓట్లు బీజేపీ ఖాతాలో చేరడం. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌లు 189 స్థానాల్లో ముఖాముఖి పోటీపడ్డాయి. ఇందులో బీజేపీ ఏకంగా 166 సీట్లు గెల్చుకుంది. అంటే నేరుగా కాంగ్రెస్‌తో తలపడ్డ స్థానాల్లో బీజేపీ 88 శాతం సీట్లు గెల్చుకుందన్నమాట. అయితే, కాంగ్రెసేతర పార్టీలతో నేరుగా తలపడ్డ స్థానాల్లో బీజేపీ 47 శాతం సీట్లు మాత్రమే గెల్చుకోగలిగింది. ఐదేళ్ల తర్వాత 2019లో బీజేపీ కాంగ్రెస్‌పైనా, కాంగ్రెసేతర పార్టీలపైనా తన గెలుపు శాతాన్ని పెంచుకుంది. బీజేపీతో నేరుగా తలపడిన ప్రతిసారీ కాంగ్రెస్ చతికిలపడుతోందని ఈ గణాంకాలు చెబుతున్నాయి. ఇండియా కూటమిలోని ఇతర పార్టీల మాదిరి కాంగ్రెస్ ఉనికి దేశవ్యాప్తంగా ఉంది. అయినప్పటికీ గత ఎన్నికల్లో కాంగ్రెస్ 20 శాతం ఓట్లతో 52 సీట్లు మాత్రమే గెల్చుకుంది. వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమిని విజయపథాన నడిపించాలంటే కాంగ్రెస్ సొంతంగా తన ఓట్ల శాతాన్ని భారీగా పెంచుకోవాలి. అదే గనుక జరిగితే బీజేపీతో నేరుగా తలపడి దాదాపు 200 స్థానాల్లో తన ప్రభావాన్ని చూపించగలుగుతుంది. ఇది బీజేపీకి తీవ్ర నష్టం కలిగించవచ్చు. కొసమెరుపు ప్రస్తుతం ఎన్డీయే పరిస్థితి బ్రహా్మండంగా ఎదురులేని విధంగా ఉన్నప్పటికీ, కాంగ్రెస్ ఏమాత్రం పుంజుకున్నా, కూటమిలోని ప్రాంతీయ పార్టీలు తమ తమ రాష్ట్రాల్లో పట్టు బిగించినా స్వల్ప ఓట్ల శాతం తేడా కూడా బీజేపీని నిలువరించే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆకర్షణ శక్తి ఎన్డీయేకు బలమైతే, ఐకమత్యంతో పోరాడడమే ఇండియా కూటమికి లాభిస్తుంది. గెలుపోటములు దైవాధీనం కాదు.. ఓటరాధీనం! -
ఆంగ్లో ఇండియన్ అంటే ఎవరు? వీరి ప్రాధాన్యత ఏమిటి?
దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని లోక్‌సభ, అసెంబ్లీలలో ఆంగ్లో-ఇండియన్ కమ్యూనిటీ ప్రాతినిధ్యం ఉండేది. లోక్‌సభకు ఆంగ్లో ఇండియన్ ప్రతినిధులను రాష్ట్రపతి స్వయంగా ఎన్నుకునేవారు. సభలో ఈ సంఘానికి రెండు సీట్లు రిజర్వ్ చేసేవారు. పార్లమెంట్లో అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఉంటుంది. దేశంలో ఆంగ్లో-ఇండియన్ కమ్యూనిటీ చరిత్ర గురించి తెలుసుకుందాం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 366 (2)లో ఆంగ్లో ఇండియన్ ప్రస్తావన కనిపిస్తుంది. ఆంగ్లో-ఇండియన్ అంటే భారతదేశంలో నివసిస్తూ, వారి తండ్రి లేదా అతని తండ్రితరపు పూర్వీకులు యూరోపియన్ సంతతికి చెందినవారై ఉండాలి. చరిత్రను పరిశీలిస్తే భారతదేశంలో ఆంగ్లో-ఇండియన్ల రాక బ్రిటీష్ వారు భారతదేశంలో రైల్వే ట్రాక్‌లు,టెలిఫోన్ లైన్లు వేసినప్పుడు ప్రారంభమైంది. ఈ పనుల కోసం యూరప్ నుండి జనం భారతదేశానికి తరలి వచ్చారు. తర్వాత ఇండియాలో ఇక్కడి యువతులనే వివాహం చేసుకుని ఇక్కడే స్థిరపడ్డాడు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 331 ప్రకారం.. భారతదేశంలోని ఆంగ్లో-ఇండియన్ల సంఘం ప్రతినిధులను దేశంలోని పార్లమెంటు, రాష్ట్రాలలోని అసెంబ్లీలకు నామినేట్ చేసేవారు.ఈ సంఘానికి సొంత నియోజకవర్గం అంటూ లేదు. ఈ హక్కును తొలిసారిగా ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ నుంచి ఫ్రాంక్ ఆంథోనీ అందుకున్నారు. లోక్‌సభలో మొత్తం 545 స్థానాలు ఉన్నాయి. వీటికి 543 మంది ఎంపీలు ఎన్నికవుతారు. ఈ ఎంపీలలో ఆంగ్లో-ఇండియన్ కమ్యూనిటీకి చెందినవారు ఎవరూ లేకపోతే రాజ్యాంగంలోని ఆర్టికల్ 331 ప్రకారం, రాష్ట్రపతి ఆంగ్లో ఇండియన్ సంఘానికి చెందిన ఇద్దరు ప్రతినిధులను లోక్‌సభకు నామినేట్ చేసేవారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం సభకు నామినేట్ అయిన ఆంగ్లో-ఇండియన్ 6 నెలల్లోపు ఏదైనా పార్టీ సభ్యత్వం తీసుకోవచ్చు. సభ్యత్వం తీసుకున్న తర్వాత వారు ఆ పార్టీ విప్‌కు కట్టుబడి ఉండాలి. దీనితో పాటు పార్టీ నియమనిబంధనల ప్రకానం నడుచుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా చదవండి: సిక్కుల తలపాగా రహస్యం ఏమిటి? ఎందుకు ధరిస్తారు? రాష్ట్రాలలో ఏ ఆంగ్లో ఇండియన్లు అసెంబ్లీ ఎన్నికలలో గెలవని పక్షంలో గవర్నర్ ఆంగ్లో-ఇండియన్‌ను ఎన్నుకుని అసెంబ్లీకి పంపే హక్కు కలిగి ఉంటారు. ఇలా ఎన్నికైనవారు ప్రజల నుంచి ఎన్నుకోనివారై, రాష్ట్రపతి లేదా గవర్నర్ ద్వారా నామినేట్ అయితే వారికి రాష్ట్రపతి ఎన్నికలలో ఓటు వేసే హక్కు వారికి ఉండదు. 2012 రాష్ట్రపతి ఎన్నికలలో ఓటు వేసిన ఏకైక ఆంగ్లో-ఇండియన్ డెరెక్ ఓ బ్రియన్. ఈయన తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఎంపీగా ఎంపికయ్యారు. ఆదరణ పొందిన కీలర్ సోదరులు పలువురు ఆంగ్లో-ఇండియన్లు మనదేశంలో ఆదరణ పొందారు. వారిలో కీలర్ సోదరులు ప్రముఖంగా కనిపిస్తారు. వీరిద్దరూ లక్నోలో పుట్టారు. ఎయిర్ ఫీల్డ్ మార్షల్ డెంజిల్ కీలర్, వింగ్ కమాండర్ ట్రెవర్ కీలర్ భారత వైమానిక దళంలో పని చేశారు. వీరు ప్రదర్శించిన ధైర్యసాహసాల కారణంగా 1965 ఇండో-పాక్ యుద్ధంలో వీరిద్దరికీ వీర చక్ర అవార్డు లభించింది. లక్నోలో చదువుకున్న ఫ్లైట్ లెఫ్టినెంట్ ఆల్ఫ్రెడ్ కుక్ కూడా 1965 ఇండో-పాక్ యుద్ధంలో వీర చక్ర అవార్డును అందుకున్నారు. పీటర్ ఫాంథమ్ పలుమార్లు ఉత్తరప్రదేశ్ శాసనసభ సభ్యునిగా ఉన్నారు. మోడీ ప్రభుత్వ నిర్ణయంతో.. మోడీ ప్రభుత్వం తన రెండవ టర్మ్ సమయంలో, ఆంగ్లో ఇండియన్ల ఎంపిక విషయంలో కఠిన నిర్ణయం తీసుకుంది. 2019 సంవత్సరంలో పార్లమెంటులో ఆంగ్లో-ఇండియన్ల ప్రాతినిధ్యాన్ని రద్దు చేసింది. ప్రతి పదేళ్ల తర్వాత పార్లమెంటులో రిజర్వేషన్లకు సంబంధించి సమీక్ష జరుగుతుంది. ఈ సమీక్షలో ఈ రెండు రిజర్వ్డ్ సీట్లలో రిజర్వేషన్ ఉంచాలా వద్దా అనేది నిర్ణయిస్తారు. వారి రిజర్వేషన్ వ్యవధి 2020, జనవరి 25తో ముగిసింది. రాజ్యాంగంలో 126వ సవరణ సమయంలో జరిగిన సమీక్ష సందర్భంగా ఈ రిజర్వేషన్‌ను కొనసాగించకూడదని మోదీ మంత్రివర్గం నిర్ణయించింది. దీంతో జార్జ్ బేకర్, రిచర్డ్ హే.. ఆంగ్లో-ఇండియన్ కమ్యూనిటీ నుండి పార్లమెంటుకు ఎంపికైన చివరి ఎంపీలుగా నిలిచారు. ఇది కూడా చదవండి: ఆమె మన దేశపు రాకుమారి.. పాక్ ప్రభుత్వంలో పనిచేస్తూ.. -
'కేంద్రానికి కొమ్ముకాస్తున్నారు'.. సొంత పార్టీ నేతపై జేడీయూ అసహనం!
పార్లమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్ హరివంశ నారాయణ్ సింగ్ హాజరవడాన్ని జేడీయూ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ తప్పుబట్టారు. ఉపరాష్ట్రపతి గైర్హాజరైన కార్యక్రమానికి డిప్యూటి ఛైర్మన్ వెళ్లడంపై విచారం వ్యక్తం చేశారు. 'జర్నలిజం కోటాలో డిప్యూటీ ఛైర్మన్ పదవికి హరివంశ నారాయణ్ సింగ్ పేరును జేడీయూనే ప్రతిపాదించింది. అలాంటప్పుడు ప్రతిపక్షాలకు అండగా ఉండకుండా.. కేంద్రానికి కొమ్ముకాస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికిది చీకటి రోజు' అని నీరజ్ కుమార్ దుయ్యబట్టారు. పార్లమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జేడీయూతో సహా 20 ప్రతిపక్ష పార్టీలు బహిష్కరించాయి. అయితే హరివంశ నారాయణ్ సింగ్ జేడీయూకు చెందిన నేత. జర్నలిస్టుల కోటాలో భాగంగా రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్ కు జేడీయూనే అప్పట్లో ప్రతిపాదించింది. దీంతో తమ సొంత పార్టీ బహిష్కరించిన కార్యక్రమానికి.. డిప్యూటి ఛైర్మన్ హోదాలో హరివంశ నారాయణ్ సింగ్ హాజరవడాన్ని ఆ పార్టీ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ తప్పుబట్టారు. హరివంశ నారాయణ్ సింగ్ 2018లో రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్ పదవి చేపట్టారు. డిప్యూటి ఛైర్మన్‌గా కాంగ్రెస్‌కు చెందని మూడో వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు. వచ్చే ఏడాది పదవి విరమణ చేయనున్నారు. ఇదీ చదవండి:కొత్త పార్లమెంట్ భవనంపై లాలు యాదవ్ పార్టీ వివాదాస్పద ట్వీట్ -
పార్లమెంట్ భవనంపై ఆర్జేడీ వివాదాస్పద ట్వీట్.. మండిపడ్డ ఓవైసీ
పార్లమెంట్ ప్రారంభోత్సవ వేళ.. రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) చేసిన ట్వీట్‌పై మజ్లిస్ ఇత్తెహదుల్ ముస్లీమీన్ (ఎమ్ఐఎమ్)నేత అసదుద్దీన్ ఓవైసీ విరుచుకుపడ్డారు. పార్లమెంట్ భవనాన్ని శవపేటికతో పోల్చడాన్ని తప్పుబట్టారు. ఈ రకమైన పోలికలు అవసరమా అని ప్రశ్నించారు. ప్రధాని కాకుండా స్పీకర్ ఓం బిర్లా చేతుల మీదుగానే ప్రారంభోత్సవం జరిగుంటే బావుండేదని అభిప్రాయపడ్డారు. 'ఆర్జేడీకి నిర్దిష్టమైన అభిప్రాయమే ఉండదు. సెక్యులరిజమ్ గురించి మాట్లాడుతుంది.. బీజేపీతో స్నేహం చేసి బయటికి వచ్చిన నితీష్ కుమార్‌ను ముఖ్యమంత్రిని చేస్తుంది. పాత పార్లమెంట్‌కు కనీసం అగ్నిమాపక శాఖ నుంచి అనుమతులు కూడా లేవు. అలాంటప్పుడు కొత్త పార్లమెంట్‌ను సమాదితో ఎందుకు పోల్చుతారు. ఈ రకమైన పోలికలు అవసరమా' అని ఆర్జేడీపై ఓవైసీ ఫైరయ్యారు. పీఎం ప్రధాని నరేంద్ర మోదీ తప్ప ఇంకా ఎవరూ ఈ పని చేయలేరన్నట్లు ప్రవర్తిస్తారని ఓవైసీ విమర్శించారు. 2014కు ముందు దేశంలో ఏం జరగనట్లు.. ప్రస్తుతం మాత్రమే అంతా జరుగుతున్నట్లు ప్రధాని ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తారని ఆరోపించారు. ఆర్జేడీ వివాదాస్పద ట్వీట్: పార్లమెంట్ ప్రారంభోత్సవ వేళ.. బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత లాలు యాదవ్ పార్టీ రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) చేసిన ట్వీట్ పెను వివాదాని దారితీసింది. కొత్త పార్లమెంట్ భవనాన్ని శవపేటికతో పోలుస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది ఆర్జేడీ. ఈ భవనం శవపేటిక మాదిరిగా సమాధి చేసిన ప్రజాస్వామ్యానికి ప్రాతినిధ్యం వహిస్తుందని, దీన్ని దేశం అంగీకరించదంటూ ఆర్జేడీ పార్టీ బీజేపీని విమర్శిస్తూ ట్వీట్ చేసింది. ఇదీ చదవండి:పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం.. ఇది నిజంగా అప్రతిష్ట: రాహుల్ -
లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ
న్యూఢిల్లీ: వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బిజు జనతా దళ్ (బీజేడీ) ఒంటరి పోరాటం చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. గురువారం ప్రధాని మోదీని కలిసి మంతనాలు జరిపారు. బీజేపీకి, కాంగ్రెస్‌కి సమానదూరం పాటిస్తానని తర్వాత మీడియాతో పట్నాయక్ చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడం కోసం బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తాను చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా నవీన్ పట్నాయక్‌ను కలుసుకున్న మర్నాడే ఒంటరిగానే ఎన్నికల బరిలో దిగుతామని తేల్చి చెప్పడం విశేషం. నితీశ్ భువనేశ్వర్‌కు వచ్చి తనను మర్యాదపూర్వకంగానే కలుసుకున్నారని పట్నాయక్ చెప్పారు. 2000 సంవత్సరం నుంచి ఒడిశాలో అధికారంలో ఉన్న నవీన్ పట్నాయక్ అప్పట్నుంచి బీజేపీ, కాంగ్రెస్ మధ్య వచ్చే వివాదాస్పద అంశాల్లో తటస్థ వైఖరి అవలంబిస్తూ వస్తున్నారు. -
బ్రెజిల్ ఆర్మీ చీఫ్‌పై వేటు
బ్రసిలియా: జనవరి 8వ తేదీన బ్రెజిల్ పార్లమెంట్, అధ్యక్ష భవనం, సుప్రీంకోర్టుపై జరిగిన దాడుల నేపథ్యంలో బ్రెజిల్ ఆర్మీ చీఫ్ జనరల్ జులియో సీజర్ డి అర్రుడాపై వేటు పడింది. ఆయన స్థానంలో ఆగ్నేయ మిలటరీ కమాండ్ హెడ్ జనరల్ టామ్స్ మిగుయెల్ రిబిరో పయివా శనివారం నియమితులయ్యారు. మాజీ అధ్యక్షుడు బొల్సొనారో మద్దతుదారులుగా భావిస్తున్న వారు పాల్పడిన దాడికి సైనిక బలగాల్లో కొందరు అనుకూలంగా ఉన్నట్లు చేసిన వ్యాఖ్యలే జనరల్ జులియో కొంపముంచాయని భావిస్తున్నారు. అధ్యక్షుడు లులా డిసిల్వా ఈ పరిణామంపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. -
పార్లమెంట్ సమావేశాలకు తెర
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు షె డ్యూల్ కంటే ఆరు రోజుల ముందే శుక్రవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ నెల 7న సమావేశాలు ప్రారంభమయ్యాయి. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 29న ముగియాల్సి ఉంది. సరిహద్దులో భారత్–చైనా ఘర్షణపై పార్లమెంట్ చర్చించాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు ఉభయ సభలను కొద్దిరోజులుగా స్తంభింపజేస్తున్నాయి. దీంతో సభలను తరచూ వాయిదా వేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం శీతాకాల సమావేశాలను షెడ్యూల్ కంటే ముందే ముగించినట్లు తెలుస్తోంది. క్రిస్మస్, న్యూ ఇయర్ దృష్ట్యా ఇందుకు అన్ని పార్టీల సభాపక్ష నేతలు అంగీకరించారని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. శుక్రవారం చివరి రోజు పార్లమెంట్‌కు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, పీయూష్ గోయల్, కాంగ్రెస్ ఎంపీలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ తదితరులు హాజరయ్యారు. వరుసగా ఎనిమిదోసారి.. పార్లమెంట్ సమావేశాలు షెడ్యూల్ కంటే ముందే ముగియడం ఇది వరుసగా ఎనిమిదోసారి! 17వ లోక్‌సభలో అత్యంత తక్కువ కాలం జరిగిన భేటీల్లో ఇది కూడా ఒకటని సమాచారం. -
జవాన్ల శౌర్యాన్ని తక్కువ చేసి మాట్లాడొద్దు : కేంద్రమంత్రి జై శంకర్
-
యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షుడి కన్నుమూత
యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షుడు డేవిడ్ ససోలి మంగళవారం కన్నుమూశారు. 65 ఏళ్ల ససోలి.. రోగ నిరోధక శక్తి క్షీణించడంతో గత కొంతకాలంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి ఆయన కన్నుమూశారు. ససోలి గతేడాది సెప్టెంబర్ నుంచి న్యూమోనియా సంబంధిత జబ్బు కారణంగా ఇటలీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరిన విషయం తెలిసిందే. ఇటాలియన్ జర్నలిస్ట్‌గా కెరియర్ ప్రారంభించిన ససోలి ఆ తర్వాత టెలివిజన్ యాంకర్‌గా జాతీయ స్థాయిలో పేరు సంపాదించారు. 2009లో యూరోపియన్ యూనియన్ పార్లమెంట్లో సభ్యుడిగా, 2019లో స్పీకర్‌గా సేవలందించారు. డేవిడ్ ససోలి మరణంపై పలువురు ప్రముఖులు నివాళి అర్పిస్తున్నారు. తర్వాతి పార్లమెంట్ అధ్యక్షుడి కోసం వచ్చే వారం ఓటింగ్ నిర్వహించనున్నట్లు సమాచారం. (చదవండి: నిందితుడికి బెయిల్.. అతన్ని రాత్రి గృహనిర్బంధం చేయాల్సిందే!) (చదవండి: కెమెరామెన్ అమ్మతో చిట్టితల్లి.. ఏం చెప్పిందో వింటే ఫిదా అవుతారు) -
చట్టాలు ఉపసంహరించాకే ఇళ్లకు
న్యూఢిల్లీ/ఘజియాబాద్/పాల్ఘర్: మూడు సాగు చట్టాలను పార్లమెంటులో రద్దు చేసే దాకా రైతులు ఉద్యమ వేదికలను వదిలి వెళ్లే ప్రసక్తే లేదని రైతు సంఘాల సమాఖ్య.. సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) శుక్రవారం స్పష్టంచేసింది. ఎంఎస్పీకి చట్టబద్ధత డిమాండ్‌ను ప్రభుత్వం నెరవేర్చాల్సి ఉందని తెలిపింది. సాగు చట్టాల రద్దు నిర్ణయంపై ఎస్కేఎం హర్షం వ్యక్తంచేసింది. అయితే, చట్టాలు రద్దయ్యేదాకా ఉద్యమవేదికలను వదిలే ప్రసక్తే లేదని, రైతులు ఎవరూ ఇళ్లకు వెళ్లబోరని ఎస్కేఎం కోర్ కమిటీ సభ్యుడు దర్శన్ పాల్ అన్నారు. శని, ఆదివారాల్లో జరిపే ఎస్కేఎం కోర్ కమిటీ సమావేశాల్లో రైతు ఉద్యమం భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయాలు తీసుకోనున్నారు. చట్టాలను రద్దుచేస్తే ఏడాదికాలంగా జరుగుతున్న రైతుల ఉద్యమానికి చరిత్రాత్మక విజయం దక్కినట్లేనని ఎస్కేఎం తెలిపింది. చేతల్లో చూపండి: తికాయత్ సాగు చట్టాలను పార్లమెంటులో రద్దు చేశాక రైతుల ఉద్యమాన్ని విరమిస్తామని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ తికాయత్ స్పష్టంచేశారు. రద్దు చేస్తామని మాటల్లోనే కాదు.. చేతల్లోనూ చూపి చట్టాలను వెంటనే రద్దుచేయాలన్నారు. ‘ చట్టాలను పార్లమెంట్లో రద్దుచేసేదాకా రైతులు ఎవ్వరూ సంబరాలు చేసుకోకండి. రైతుల ఆందోళన ఇప్పటికిప్పుడే ఆగిపోదు. పార్లమెంట్లో ఈ చట్టాలను రద్దుచేసే రోజు దాకా వేచి చూస్తాం. పంటకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)తోపాటు ఇతర ప్రధాన సమస్యలపైనా రైతు సంఘాలతో మోదీ సర్కార్ చర్చలు జరపాల్సిందే’ అని తికాయత్ హిందీలో ట్వీట్‌చేశారు. ‘ చట్టాలు రద్దయ్యేదాకా రైతులు ఉద్యమ వేదికల నుంచి ఇళ్లకు వెనుతిరిగేదే లేదు. పంటలకు కనీస మద్దతు ధర లభించట్లేదు. ఈ సమస్య దేశం మొత్తాన్నీ పట్టి పీడిస్తోంది’ అనిæ అన్నారు. -
గల్ఫ్ కార్మికులకు అన్యాయం... పత్తాలేని కొత్త సర్క్యులర్
ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల గల్ఫ్ కార్మికుల కష్టాలు ఇంకా తీరలేదు. వేతనాలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన తాజా సర్క్యులర్‌ను క్షేత్రస్థాయికి చేరలేదు. దీంతో వలస జీవులు ఇంకా శ్రమ దోపిడికి గురవుతూనే ఉన్నారు. వేతనాలు తగ్గిస్తూ ఆరు అరబ్ గల్ఫ్ దేశాలకు వెళ్లే కార్మికులకు కనీస వేతనాలను (మినిమం రెఫరల్ వేజెస్) ను 30 నుండి 50 శాతం తగ్గిస్తూ భారత ప్రభుత్వం 2020 సెప్టెంబర్ లో రెండు సర్క్యులర్లను జారీ చేసింది. అయితే ఈ రెండు సర్క్యులర్లను రద్దు చేయాలని, పాత వేతనాలను కొనసాగించాలని కార్మికులు, గల్ఫ్ సంఘాలు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజకీయ పార్టీలు కూడా కేంద్రంపై ఒత్తిడి పెంచాయి. గల్ఫ్ కార్మికులకు కనీస వేతనాలను తగ్గించడాన్ని సవాల్ చేస్తూ ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు మంద భీంరెడ్డి తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. పాత జీతమే ఇవ్వాలంటూ.. నలువైపుల నుంచి పెరుగుతున్న ఒత్తిడి, కోర్టు కేసుల నేపథ్యంలో పాత వేతనాల కొనసాగింపు డిమాండును కేంద్రం ఎట్టకేలకు అంగీకరించింది. ఈ మేరకు జులై 22, 29 తేదీలలో రాజ్య సభలో విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ ప్రకటించారు. కనీస వేతనాలను తగ్గిస్తూ సెప్టెంబర్ లో జారీ చేసిన సర్క్యులర్లను ఉపసంహరించుకుంటున్నట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు పాత వేతనాలను కొనసాగించాలని నిర్ణయిస్తూ... జులై 15న ఉత్తర్వులను జారీ చేశారు. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది జులై 28న తెలంగాణ హైకోర్టుకు తెలిపారు. సమస్య పరిష్కారం అయినందున మంద భీంరెడ్డి వేసిన 'పిల్' ను ముగిస్తూ హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. జరగని న్యాయం పాత వేతనాలే కొనసాగించాలంటూ కేంద్రం జారీ చేసిన సర్క్యులర్ కనీసం ఇ-మైగ్రేట్ పోర్టల్, విదేశాంగ మంత్రిత్వ శాఖ వెబ్ సైట్, గల్ఫ్ దేశాలలోని ఇండియన్ ఎంబసీ వెబ్ సైట్లో కూడా కనిపించడం లేదు. ప్రభుత్వ ఆదేశాలు లిఖిత పూర్వకంగా కనిపించకపోవడం కార్మికులకు శాపంగా మారగా కంపెనీలకు వరమైంది. గతంలో వేతనాలు తగ్గిస్తూ ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్‌నే చూపెడుడుతూ తక్కువ జీతం చెల్లిస్తూ శ్రమ దోపిడి చేస్తున్నాయి. ఎంబసీకి విజ్ఞప్తి పాత వేతనాలను కొనసాగించే ఆ సర్క్యులర్ని ఇ-మైగ్రేట్ పోర్టల్, విదేశాంగ మంత్రిత్వ శాఖ వెబ్ సైట్, గల్ఫ్ దేశాలలోని ఇండియన్ ఎంబసీ వెబ్ సైట్ లలో అందుబాటులో ఉంచలేదని, వెంటనే ఈ సర్క్యులర్ ప్రజలు అందుబాటులో ఉంచాలని ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ అధ్యక్షులు మంద భీంరెడ్డి కేంద్ర విదేశాంగ మంత్రి ఇ-మెయిల్ ద్వారా విజ్ఞప్తి చేశారు. -
పోలవరం ప్రాజెక్ట్: సవరించిన అంచనాలను ఆమోదించాలి
సాక్షి, తూర్పు గోదావరి: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సోమ, మంగళ వారాల్లో పార్లమెంట్లో ప్రత్యేక చర్చ జరిగే అవకాశం ఉందని వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత ప్రభుత్వం వైఖరి వల్లే సవరించిన అంచనాల ఆమోదానికి ఆలస్యమైందని ఆయన విమర్శించారు. లక్షలాది క్యూసెక్కుల గోదావరి జలాలు సముద్రం పాలవడం బాధగా ఉందన్నారు. సత్వరం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి కావాల్సి ఉందని, సవరించిన అంచనాలను వెంటనే ఆమోదించాలని ఎంపీ భరత్ కోరారు. -
పార్లమెంట్ లో జలగళం
-
జులై 19 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
-
సెంట్రల్ విస్టా నిర్మాణం నిలిపివేయాలన్న పిటిషన్ కొట్టివేసిన సుప్రీం కోర్టు
-
ఆందోళన ఆపండి.. రైతులకు ప్రధాని మోదీ విజ్ఞప్తి
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగిస్తున్న ఆందోళనను ఇకనైనా విరమించాలని రైతులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. కొత్త సాగు చట్టాలకు ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. ఆందోళనలో భాగస్వాములైన సిక్కు రైతులను దూషిస్తూ వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని హితవు పలికారు. మన రైతులను మనమే కించపర్చుకోవడం దేశానికి ఏమాత్రం మంచి చేయదని పేర్కొన్నారు. కొత్త చట్టాలను కొందరు రాజకీయ అంశంగా మార్చేశారని విమర్శించారు. రైతుల ఆందోళన వెనుక ఉన్న అసలైన కారణాలపై ప్రతిపక్షాలు మౌనం వహిస్తున్నాయని మండిపడ్డారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు ప్రధాని మోదీ సోమవారం రాజ్యసభలో సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎఫ్‌డీఐకి (విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి) మరో నిర్వచనం ఇచ్చారు. విదేశీ విధ్వంసకర సిద్ధాంతం(ఫారిన్ డిస్ట్రక్టివ్ ఐడియాలజీ) అనే కొత్త ఎఫ్‌డీఐ దేశంలో ఆవిర్భవించిందని అన్నారు. ఈ సిద్ధాంతం నుంచి దేశాన్ని రక్షించుకొనేందుకు అప్రమత్తంగా ఉండాలన్నారు. మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే.. వారంతా ఆందోళన్ జీవులు ‘‘దేశంలో ఆందోళన్ జీవి అనే కొత్త జాతి పుట్టుకొచ్చింది. నిష్ణాతులైన నిరసనకారులు ప్రతి ఆందోళనలో కనిపిస్తున్నారు. వారంతా ఆందోళనల నుంచి లాభం పొందాలనుకునే పరాన్నజీవులు. దేశంలో ఎప్పుడూ ఏదో ఒక అలజడి లేకపోతే వారు బతకలేరు. రైతుల ఆందోళనలో పాల్గొంటున్న సిక్కులను ఖలిస్తాన్ ఉగ్రవాదులు అని సంబోధించడం తగదు. సిక్కుల సేవలు దేశానికి గర్వకారణం. పంజాబ్‌లో ఏం జరిగిందో మనం మర్చిపోకూడదు. దేశ విభజన వల్ల పంజాబ్ తీవ్రంగా నష్టపోయింది. 1984లో జరిగిన అల్లర్లలో సిక్కులు బాధితులయ్యారు. సంస్కరణలతో తోడ్పాటు కొత్త వ్యవసాయ చట్టాల వల్ల కనీస మద్దతు ధరకు(ఎంఎస్పీ), మండీ వ్యవస్థకు ఎలాంటి విఘాతం కలుగదు. ఈ చట్టాలతో మండీలు మరింత ఆధునికంగా మారుతాయి. కనీస మద్దతు ధర భవిష్యత్తులోనూ కచ్చితంగా కొనసాగుతుందని నేను హామీ ఇస్తున్నా. దేశంలో 80 కోట్ల మందికి రేషన్ సరుకులు ఎప్పటిలాగే అందుతాయి. దయచేసి తప్పుడు ప్రచారం సాగించకండి. కొత్త వ్యవసాయ చట్టాలతో వారు తమ పంటలను దేశంలో ఎక్కడైనా విక్రయించుకొనే స్వేచ్ఛ లభిస్తుంది. తద్వారా మంచి ధర పొందుతారు. పంటల సేకరణ విధానంలో సంస్కరణలు అవసరమని గతంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ చెప్పారు. రైతన్నలు కొత్త చట్టాలను అర్థం చేసుకోవాలి. రైతులు ఆందోళన ఆపేయాలి. చర్చల కోసం అన్ని ద్వారాలు తెరుద్దాం. చర్చల కోసం మిమ్మల్ని మరోసారి ఈ సభ నుంచే ఆహ్వానిస్తున్నా. కొత్త సాగు చట్టాలకు ప్రతిపక్షాలు, ప్రభుత్వం, ఆందోళనకారులు ఒక అవకాశం ఇవ్వాలి. రైతులకు మేలు చేస్తాయో లేదో చూడాలి. లోపాలుంటే తొలగించడానికి సిద్ధం. కశ్మీర్లో స్థానిక ఎన్నికలను విజయవంతంగా నిర్వహించారని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించడం సంతోషకరం. దీన్ని కాంగ్రెస్ నాయకులు ‘జి–23 సలహా’గా చూడొద్దు’’ అని ప్రధాని మోదీ కోరారు. తేదీ, సమయం మీరే నిర్ణయించండి: సంయుక్త కిసాన్ మోర్చా కొత్త వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వంతో తదుపరి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని సంయుక్త కిసాన్ మోర్చా సీనియర్ సభ్యుడు శివ్‌కుమార్ కక్కా సోమవారం ప్రకటించారు. చర్చల తేదీ, సమయాన్ని మీరే నిర్ణయించండి అని కేంద్రాన్ని కోరారు. దేశంలో ఆందోళన జీవి అనే కొత్త జాతి పుట్టుకొచ్చిందన్న ప్రధానమంత్రి మోదీ వ్యాఖ్యలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల ఆందోళనకు ముఖ్యమైన పాత్ర ఉందని గుర్తుచేశారు. ప్రభుత్వంతో చర్చలను తాము ఎప్పుడూ నిరాకరించలేదని చెప్పారు. ప్రభుత్వం పిలిచినప్పుడల్లా తాము వెళ్లామని, కేంద్ర మంత్రులతో చర్చించామని వెల్లడించారు. ‘‘కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) కొనసాగుతుందని ప్రభుత్వం ఇప్పటికే వందల సార్లు చెప్పింది. అలాంటప్పుడు దానికి చట్టబద్ధత కల్పించడానికి అభ్యంతరం ఏమిటి?’’ అని రైతు సంఘం నేత అభిమన్యు కోహర్ ప్రశ్నించారు. చర్చలకు ప్రభుత్వం నుంచి అధికారికంగా ఆహ్వానం రావాల్సి ఉందన్నారు. ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించకుండా ప్రభుత్వం ఈ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తోందని భారతీయ కిసాన్ యూనియన్ (ఏక్తా ఉగ్రహన్) పంజాబ్ ప్రధాన కార్యదర్శి సుఖ్‌దేవ్ సింగ్ విమర్శించారు. ఆకలితో వ్యాపారమా? దేశంలో ఆకలితో వ్యాపారం సాగించాలనుకుంటే సహించబోమని భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిధి రాకేశ్ తికాయత్ హెచ్చరించారు. కనీస మద్దతు ధరకు(ఎంఎస్పీ) ప్రభుత్వం చట్టబద్ధత కల్పించి తీరాల్సిందేనని తేల్చిచెప్పారు. ఎంఎస్పీపై ప్రధాని మోదీ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు. రైతులు ఆందోళన విరమించాలన్న ప్రధానమంత్రి వినతిపై రాకేశ్ తికాయత్ సోమవారం ప్రతిస్పందించారు. ‘‘దేశంలో ఆకలితో వ్యాపారం చేయాలనుకుంటే అంగీకరించే ప్రసక్తే లేదు. ఆకలి పెరిగితే పంటల ధరలు పెరుగుతాయి. ఆకలితో వ్యాపారం చేయాలనుకుంటున్న వారిని దేశం నుంచి తరిమికొట్టాలి’’ అని అన్నారు. ఎంఎస్పీ ఉండదని రైతులు కూడా చెప్పడం లేదని, దానికి చట్టబద్ధత కావాలని మాత్రమే ఆశిస్తున్నారని గుర్తుచేశారు. మూడు సాగు చట్టాలను రద్దు చేసి, ఎంఎస్పీ కోసం కొత్త చట్టం చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని సూచించారు. రైతుల పోరాటం రాజకీయ ప్రేరేపితం అన్న మోదీ వ్యాఖ్యలను తికాయత్ తప్పుపట్టారు. రైతుల్లో కులం, మతం ఆధారంగా చీలిక తెచ్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని దుయ్యబట్టారు. సింఘు వద్ద తాత్కాలిక స్కూల్ ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘు వద్ద రైతుల పిల్లల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక పాఠశాల దాదాపు 15 రోజుల తర్వాత పునఃప్రారంభమైంది. పంజాబ్‌లోని ఆనంద్ సాహిబ్‌కు చెందిన రైతులు ఈ పాఠశాలను డిసెంబర్లో ఏర్పాటు చేశారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్న రైతుల పిల్లలు చదువుకునేందుకు ఈ స్కూల్‌ను ఒక టెంట్లో నెలకొల్పారు. జనవరి 24న ఈ స్కూల్‌ను మూసివేశారు. ఫిబ్రవరి 5న మళ్లీ తెరిచారు. 1 నుంచి 7వ తరగతి వరకు బోధిస్తున్నారు. -
పార్లమెంటులో బడ్జెట్(2021-2022) సమావేశాలు
-
10న పార్లమెంటు కొత్త భవనానికి భూమి పూజ
న్యూఢిల్లీ: కొత్త పార్లమెంటు భవనానికి ఈ నెల 10న ప్రధాని మోదీ చేతుల మీదుగా భూమి పూజ జరగనుంది. రూ.971 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఈ కొత్త భవనం నిర్మాణం 2022 నాటికి పూర్తి అయ్యే అవకాశాలున్నాయని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా శనివారం తెలిపారు. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు నిర్వహిస్తున్న ప్రజాస్వామ్య దేవాలయం వందేళ్లు పూర్తి చేసుకుందని, ఆత్మనిర్భర్‌లో భాగంగా మనమే కొత్త భవనాన్ని నిర్మించుకోవడం దేశానికి గర్వకారణమని బిర్లా అన్నారు. కోవిడ్ నిబంధనల మ«ధ్య డిసెంబర్ 10 మధ్యాహ్నం ఒంటిగంటకి భూమి పూజ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించామని కొందరు స్వయంగా హాజరైతే, మరికొందరు ఆన్లైన్ ద్వారా తిలకిస్తారని బిర్లా చెప్పారు. 2022లో జరిగే దేశ 75వ స్వాతంత్య్ర దిన వేడుకల నాటికి కొత్త భవనంలోనే పార్లమెంటు సమావేశాలు జరుగుతాయని బిర్లా ఆశాభావం వ్యక్తం చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించే ఈ భవనాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేస్తూ పేపర్‌లెస్ కార్యాలయాలను నిర్మించనున్నారు. భవిష్యత్‌లో పార్లమెంటు నియోజకవర్గాలను పెంచే ఉద్దేశం ఉన్న కేంద్రం అందుకు అనుగుణంగా లోక్‌సభ కార్యక్రమాలు నిర్వహించే హాలుని 888 మంది సభ్యులు కూర్చోవడానికి వీలుగా, రాజ్యసభ సమావేశ మందిరాన్ని 384 సీట్ల సామర్థ్యంతో నిర్మించనున్నారు. లోక్‌సభలో 1,224 మంది (ఉభయ సభలు సమావేశమైనప్పుడు) కూర్చునేందుకు వీలుగా సామర్థ్యాన్ని పెంచుకునే అవకాశముంటుంది. ఈ భవన నిర్మాణంలో 2 వేల మంది ప్రత్యక్షంగా 9 వేల మంది పరోక్షంగా పాల్గొననున్నారు. 64.500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించే ఈ భవనం బయట నుంచి చూడడానికి ప్రస్తుతమున్న పార్లమెంటు మాదిరిగానే ఉంటుందని బిర్లా వివరించారు. -
పార్లమెంట్ స్పీకర్‌పై దాడి..
యెరెవాన్: వివాదాస్పదమైన నాగోర్నో-కరాబాఖ్ ప్రాంతంపై ఆధిపత్యం కోసం గత కొద్ది రోజులుగా అజర్బైజాన్, ఆర్మేనియా మధ్య భీకర పోరాటం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య కొనసాగుతన్న సైనిక ఘర్షణకు స్వస్తి పలికేందుకు గాను ఆర్మేనియా ప్రధాని నికోల్ పషిన్యన్ అజర్బైజాన్, రష్యాలతో శాంతి ఒప్పందాన్ని ప్రకటించాడు. దాంతో ఆగ్రహించిన నిరసనకారులు ఆర్మేనియన్ పార్లమెంటుపై దాడి చేసి స్పీకర్ అరరత్ మిర్జోయన్‌ను గాయపర్చారు. రష్యన్ వార్తా సంస్థ ప్రకారం.. యెరెవాన్ నగరంలోని ఆర్మేనియన్ పార్లమెంట్ బయట మంగళవారం తెల్లవారుజామున నిర్వహించిన నిరసనలలో పాల్గొన్న ఆందోళనకారుల చేతిలో స్పీకర్ మిర్జోయన్ గాయపడినట్లు తెలిపింది. ఈ విషయాన్ని ప్రధాని నికోల్ పషిన్యన్ తన ఫేస్బుక్ అకౌంట్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. దాడిలో తీవ్రంగా గాయపడటంతో మిర్జోయన్‌కు ఆపరేషన్ జరిగినట్లు వెల్లడించారు. ఆయన ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదన్నారు. ప్రధాని శాంతి ఒప్పందం ప్రకటించడంతో నిరసనకారులు యెరెవాన్ వీధుల్లో హింసాయుత చర్యలకు దిగారు. ఇందుకు సంబంధించిన వీడియోలను కొందటు ట్విట్టర్లో షేర్ చేశారు. ఇక పార్లమెంట్‌పై దాడి చేసిన నిరసనకారులందరికి శిక్ష పడుతుందని పషిన్యన్ మరో ప్రకటనలో తెలిపారు. (చదవండి: ప్రధాని సతీమణి సైన్యంలో శిక్షణ) శాంతి ఒప్పందం దేని గురించి నాగోర్నో-కరాబాఖ్ ప్రాంతంలో తలెత్తిన సైనిక ఘర్షణకు స్వస్తి పకలడానికి ఆర్మేనియా శాంతి ఒప్పందంతో ముందుకు వచ్చింది. దీన్ని కీలక పరిణామంగా పేర్కొన్నది. ఇక వీలైనంత త్వరగా యుద్ధాన్ని ముగించడానికి శాంతి ఒప్పందానికి అంగీకరించానని నాగోర్నో-కరాబాఖ్ ప్రాంత నాయకుడు అరైక్ హరుతున్యన్ ఫేస్బుక్ లైవ్‌లో తెలిపారు. ఇక తాజా ఒప్పందం ప్రకారం.. అజర్బైజాన్ ఇటీవలి పోరాటంలో ఆక్రమించిన భూభాగం దాని అధీనంలోనే ఉంటుంది. ఇక వచ్చే నెలలో ఆర్మేనియా అదనపు భూభాగాన్ని ఆక్రమిస్తుందని తెలిపింది. అంతేకాక నాగోర్నో-కరాబాఖ్లను ఆర్మేనియాతో అనుసంధానించే రహదారికి కాపలాగా రష్యన్ భద్రతా దళాలను ఉంచారని ఆర్టీ.కామ్ నివేదించింది.(చదవండి: అజర్‌బైజాన్‌పై ఆర్మేనియా క్షిపణి దాడులు!) సెప్టెంబర్ 27 న, నాగోర్నో-కరాబాఖ్ ప్రాంతంపై పట్టు కోసం ఆర్మేనియా, అజ్ర్బైజాన్ మధ్య తాజా వివాదం చెలరేగింది. నాగోర్నో-కరాబాఖ్ అజర్బైజాన్ పరిధిలోకి వస్తోంది. కాని దక్షిణ కాకసస్ పొరుగుదేశాల మధ్య తలెత్తిన యుద్ధం ముగిసినప్పటి నుంచి అంటే 1994 నుంచి ఈ ప్రాంతం ఆర్మేనియన్ దళాల నియంత్రణలో ఉంది. -
కరోనా సమయంలోనూ దక్షిణకొరియాలో పార్లమెంట్ ఎన్నికలు
సియోల్: కరోనా విజృంభిస్తున్న సమయంలోనూ విజయవంతంగా పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించి దక్షిణ కొరియా చరిత్ర సృష్టించింది. పోలింగ్ సమయంలో కరోనా వ్యాప్తి చెందకుండా అధికారులు పూర్తి జాగ్రత్తలు తీసుకున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 14 వేల పోలింగ్ బూత్‌లను క్రిమిరహితం చేశారు. ఓటర్లు పోలింగ్ బూత్‌ల వద్ద పరస్పరం 3 అడుగుల దూరం పాటించారు. బూత్‌లోకి వెళ్లేమందే ఓటర్ల టెంపరేచర్లను పరీక్షించి, జ్వరం ఉన్నవారిని లోపలికి అనుమతించలేదు. బూత్‌లోకి వెళ్లాక చేతులను శానిటైజ్ చేసుకుని, అధికారులు ఇచ్చిన గ్లవ్స్ వేసుకుని ఓటేశారు. నిజానికి 300 మంది సభ్యుల నేషనల్ అసెంబ్లీకి ఎన్నికలు బుధవారం జరగాల్సి ఉంది. అయితే, అక్కడ ముందుగానే ఓటేసే అవకాశం ఉంది. దాంతో శుక్ర, శనివారాల్లోనే పోలింగ్ నిర్వహించారు. -
శ్రీలంక పార్లమెంటు రద్దు
కొలంబో: శ్రీలంక అధ్యక్షుడు గొతబయ రాజపక్స ఆ దేశ పార్లమెంటును రద్దు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. మరో ఆరు నెలలు మిగిలి ఉండగానే రద్దు చేయడం గమనార్హం. మార్చి 12 నుంచి 19లోపు అభ్యర్థులు నామినేషన్ వేసుకోవచ్చని, ఏప్రిల్ 25న ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. మే 14వ తేదీన కొత్త పార్లమెంటు సమావేశమవుతుందని పేర్కొన్నారు. శ్రీలంక పార్లమెంటును రద్దు చేయడానికి కనీసం నాలుగున్నరేళ్ల పాలన సాగాల్సి ఉంటుంది. -
నేడు రాజ్యసభ ముందుకు పౌరసత్వ బిల్లు
-
నేడు రాజ్యసభకు పౌరసత్వ బిల్లు
న్యూఢిల్లీ: సుదీర్ఘమైన చర్చలు, తీవ్ర నిరసనలు, వాదోపవాదాలు, సవరణలకు డిమాండ్ల మధ్య పౌరసత్వ సవరణ బిల్లుకి 311–80 ఓట్ల తేడాతో లోక్‌సభ ఆమోద ముద్ర వేసింది కానీ, పెద్దల సభలో ఏం జరుగబోతోందన్న ఉత్కంఠ నెలకొంది. పొరుగు దేశాల్లో ఉన్న ముస్లిమేతరులకు భారత్ పౌరసత్వాన్నిచ్చే పౌరసత్వ సవరణ బిల్లు (సీఏబీ) బుధవారం ఎగువ సభలో ప్రవేశపెడుతున్నట్టు రాజ్యసభ వర్గాలు వెల్లడించాయి. ఈ బిల్లుపై చర్చకు 6 గంటలు కేటాయించినట్టు తెలుస్తోంది. బిల్లుపై సందేహాలు తీర్చాలి: ఉద్ధవ్ ఠాక్రే హిందూత్వ పార్టీ శివసేన జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని లోక్‌సభలో బిల్లుకి మద్దతు తెలిపినప్పటికీ మంగళవారం యూ టర్న్ తీసుకుంది. బిల్లుపై నెలకొన్న సందేహాలను తీర్చనట్లయితే రాజ్యసభలో మద్దతివ్వబోమని పార్టీ అ«ధినేత ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. బీజేపీ తమకు మద్దతు పలికేవారిని దేశభక్తులని, వ్యతిరేకించే వారందరినీ దేశద్రోహులని ముద్ర వేస్తోందని ధ్వజమెత్తారు. ఠాక్రే వ్యాఖ్యల్ని స్వాగతించిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ పౌరసత్వ సవరణ బిల్లు పాసయితే రాజ్యాంగంపైన దాడి జరిగినట్లేనని వ్యాఖ్యానించారు. మరోవైపు జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ), పౌరసత్వ సవరణ బిల్లుతో ఈశాన్య రాష్ట్రాల్లోని ముస్లింలలో తీవ్ర అభద్రత నెలకొంటుందని జేడీ(యూ) ఆందోళన వ్యక్తం చేసింది. ఆ పార్టీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్ ఈ బిల్లుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముస్లింల పట్ల ఈ బిల్లు వివక్ష చూపుతోందన్నారు. అయినప్పటికీ రాజ్యసభలో ఈ బిల్లుకు మద్దతివ్వాలని జేడీ(యూ) నిర్ణయించింది. బీజేపీ అంచనాలివి రాజ్యసభలో అధికార బీజేపీకి మెజారిటీ లేకపోవడంతో మిత్రపక్షాలు, ప్రాంతీయ పార్టీల మద్దతుతోనే బిల్లును గట్టెక్కించడానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యూహాలు పన్నుతున్నారు. బిల్లుకు అనుకూలంగా కనీసం 124–130 ఓట్లు వస్తాయని బీజేపీ ధీమాగా ఉంది. విపక్షాల బలం 90–93కి పరిమితమైపోతుందని అంచనా వేస్తోంది. ఇన్నాళ్లూ ఎన్టీయే ప్రభుత్వం పెట్టిన ప్రతీ బిల్లుకి టీఆర్ఎస్ మద్దతు ఇస్తూ వచ్చింది. కానీ ఈ సారి మైనారిటీ ముస్లింల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నదని పేర్కొంటూ ఈ బిల్లుకి లోక్‌సభలోనూ టీఆర్ఎస్ మద్దతివ్వలేదు. ఈశాన్య రాష్ట్రాల బంద్ సక్సెస్ ముస్లిం మైనారిటీల ప్రయోజనాలను కాలరాసేలా ఉందంటూ పౌరసత్వ సవరణ బిల్లుకి వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాల్లో మంగళవారం చేపట్టిన బంద్ సక్సెస్ అయింది. లెఫ్ట్ పార్టీలు, ఇతర ప్రజాస్వామ్య సంస్థలు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జరిగిన బంద్‌తో అసోంలో జనజీవనం స్తంభించింది. పెద్దల సభలో ఎవరు ఎటు వైపు ? మొత్తం సభ్యుల సంఖ్య: 245 ప్రస్తుతం ఉన్న సభ్యులు: 240 మేజిక్ ఫిగర్: 121 బిల్లుకి అనుకూలం 115 బీజేపీ (83), ఏఐఏడీఎంకే (11), జేడీయూ (6), శిరోమణి అకాలీదళ్ (3), స్వతంత్ర, నామినేటెడ్ అభ్యర్థులు (7), ఒక్కో సభ్యుడు ఉన్న చిన్న పార్టీలు (5) ఎన్డీయేతర పక్షాలు బిల్లుకి అనుకూలం 11 బీజేడీ (7), వైసీపీ (2), టీడీపీ (2), మొత్తం: 115 + 11 = 126 బిల్లుకి వ్యతిరేకం 95 కాంగ్రెస్ (46), తృణమూల్ కాంగ్రెస్ (13), సమాజ్‌వాదీ పార్టీ (9), లెఫ్ట్ పార్టీలు (6), టీఆర్ఎస్ (6), ఎన్సీపీ (4), బీఎస్పీ (4), ఆర్జేడీ (4), ఆప్ (3), మొత్తం: 95 ►ఇవి కాకుండా ముగ్గురు సభ్యులున్న శివసేన, ఒక్కో సభ్యుడున్న చిన్న పార్టీల మద్దతుతో విపక్షాల సంఖ్య 100 వరకు చేరుకోవచ్చునని ఓ అంచనా అమిత్ షాపై ఆంక్షలు విధించాలి పౌరసత్వ సవరణ బిల్లును యూఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ (యూఎస్సీఐఆర్ఎఫ్) తప్పు పట్టింది. ఈ బిల్లు తప్పుడు మార్గంలో వెళుతూ అత్యంత ప్రమాదకరంగా మారిందని వ్యాఖ్యానించింది. భారత లౌకికతత్వాన్ని ఈ బిల్లు దెబ్బ తీస్తోందని, సమాన హక్కుల్ని కాలరాస్తోందని పేర్కొంది. మత ప్రాతిపదికన చట్టం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న హోం మంత్రి అమిత్, ఇతర నాయకులపై ఆంక్షలు విధించే అంశాన్ని పరిగణించాలని యూఎస్సీఐఆర్ఎఫ్ అమెరికా ప్రభుత్వ యంత్రాంగానికి సూచించింది. ఎదురుదాడికి దిగిన భారత్ అమెరికా కమిషన్‌పై భారత్ మంగళవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. పౌరసత్వ సవరణ బిల్లుపై కనీస అవగాహన లేకుండా ఆ కమిషన్ సూచనలు చేస్తోందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ అన్నారు. ఈ అంశంలో ఆ సంస్థ ఈర్ష్య, పక్షపాతంతో వ్యవహరిస్తోందని ఎదురు దాడికి దిగారు. ఆంక్షలు విధించాలంటూ సిఫార్సులు చేయడం అత్యంత విచారకరమన్న రవీష్ కుమార్ భారత్‌లో చట్టాలపై వ్యాఖ్యలు చేసే హక్కు ఆ సంస్థకు లేదని అన్నారు. గోద్రా ఘర్షణల సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీకి టూరిస్ట్ వీసా నిరాకరణకు యూఎస్సీఐఆర్ఎఫ్ మద్దతునిచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. -
ఏపీలో 2,068 గ్రామాలకు మొబైల్ ఫోన్ సేవలు లేవు..
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో తూర్పు కనుమలు విస్తరించి ఉన్న 9 జిల్లాల్లో దాదాపు 2,068 గ్రామాలకు మొబైల్ ఫోన్ సర్వీస్ లను అందుబాటులో లేవని కమ్యూనికేషన్లశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గురువారం రాజ్యసభలో వెల్లడించారు. వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. భౌగోళికంగా అనుకూలతలు లేని మారుమూల ప్రాంతాల్లో, అక్కడక్కడ విసిరేసినట్లు ఉండి, వాణిజ్యపరమైన కార్యకలాపాలకు అనువుగా లేని కారణంగానే మొబైల్ ఫోన్ సర్వీస్ లను విస్తరించలేకపోయినట్లు మంత్రి చెప్పారు. వామపక్ష తీవ్రవాదాన్ని ఎదుర్కొనే వ్యూహంలో భాగంగా టెలికమ్ సరీ్వసు ప్రొవైడర్లతో కలిసి ఆయా గ్రామాలకు మొబైల్ ఫోన్ సర్వీస్ లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఇందుకు అనుగుణంగా 346 మొబైల్ టవర్స్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వివరించారు. తూర్పు కనుమలు విస్తరించి ఉన్న 9 జిల్లాల్లో 8,963 గ్రామాలు ఉండగా అందులో 5,967 గ్రామాలకు బీఎస్ఎన్ఎల్ మొబైల్ ఫోన్ సర్వీసులను అందిస్తోందని వివరించారు. 25 శాతం రిజర్వేషన్ అమలు చేయాల్సిందే విద్యా హక్కు చట్టం (ఆరీ్టఈ) కింద ప్రతి విద్యా సంస్థలో బలహీన వర్గాల విద్యార్థుల కోసం 25 శాతం రిజర్వేషన్ కచ్చితంగా అమలు చేసి తీరాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియల్ నిషాంక్ స్పష్టం చేశారు. విజయసాయి రెడ్డి అడిగిన మరో ప్రశ్నకు ఆయన జవాబిస్తూ, విద్యా సంస్థలపై పాలనా నియంత్రణ రాష్ట్రాల చేతుల్లో ఉందని చెప్పారు. 6–14 ఏళ్ల లోపు బాలబాలికలకు ప్రాథమిక విద్యను హక్కుగా మారుస్తూ 2009లో ఆర్టీఈ చట్టం వచి్చందని అన్నారు. ఆర్టీఈ చట్టం అన్ని ప్రైవేట్, ఎయిడెడ్, అన్ఎయిడెడ్ స్కూళ్లకు కూడా వర్తిస్తుందని పేర్కొన్నారు. దీని ప్రకారం ప్రతి విద్యా సంస్థ బలహీన వర్గాల పిల్లలకు విధిగా అడ్మిషన్ కలి్పంచాల్సి ఉంటుందన్నారు. ప్రైవేట్, అన్ఎయిడెడ్ స్కూళ్లలో ఆర్టీఈ చట్టం అమలు జరుతున్న తీరుపై మధింపు చేయవలసిందిగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను 2016లోనే కేంద్ర మానవవనరుల మంత్రిత్వ శాఖ కోరినట్లు చెప్పారు. యూజీసీ–ఏఐసీటీఈ విలీనంపై నిర్ణయం తీసుకోలేదు యూనియన్ పబ్లిక్ సరీ్వస్ కమిషన్ (యూజీసీ) అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) విలీనంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియల్ స్పష్టం చేశారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు రాజ్యసభలో మంత్రి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. జాతీయ పర్యావరణ విధానం రూపొందించాలి కాలుష్య నివారణకు అనేక పరిష్కారాలు ఉన్నప్పటికీ వాటిని అమలు చేయడంలేదని, ఇవి అమలయ్యేందుకు వీలుగా జాతీయ పర్యావరణ విధానాన్ని రూపొందించాలని వైఎస్సార్సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్రాన్ని కోరారు. వాయు కాలుష్యం, వాతావరణ మార్పులపై లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. వాయు కాలుష్యాన్ని సమగ్రంగా ఎదుర్కొన్న జపాన్, చైనా వంటి దేశాల ఉదంతాలను పరిశీలించాలని సూచించారు. కనుచూపు స్థాయిలోనే డ్రోన్లు ఎగరాలి.. దేశంలో పౌరుల డ్రోన్ల వినియోగం కనుచూపు స్థాయి వరకే పరిమితమని, ఆ మేరకు పౌర విమానశాఖ డైరెక్టర్ జనరల్ నిబంధనలు ఉన్నాయని కేంద్ర మంత్రి హర్దీప్సింగ్ పురి పేర్కొన్నారు. డ్రోన్ల విచ్చలవిడి వినియోగాన్ని నియంత్రిస్తూనే, సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాల్లో రక్షణపరమైన చర్యలకు వినియోగంపై జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్ కొన్ని మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. వైఎస్సార్ సీపీ ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, శ్రీధర్ కోటగిరి, బెల్లాన చంద్రశేఖర్ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి బదులిచ్చారు. నర్సీపట్నం–తుని రహదారిని భారతమాల ప్రాజెక్టులో చేర్చండి అనకాపల్లి, అరకు పార్లమెంటు నియోజకవర్గాలను కలిపే ప్రధాన రాష్ట్ర రహదారి అయిన నర్సీపట్నం–తుని (42కి.మీ) రహదారిని భారతమాల ప్రాజెక్టులో చేర్చాల్సిందిగా ఎంపీ వెంకట సత్యవతి లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పది మండలాలకు చెందిన ప్రజలు తుని రైల్వే స్టేషన్‌కు ఇదే రహదారిలో ప్రయాణిస్తారని, అలాగే గిరిజన, వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్‌కు తరలించడానికి కూడా ఈ రహదారిని ఉపయోగిస్తుంటారని వివరించారు. ఎయిరిండియాలో వాటా విక్రయాల గురించి తెలియజేయండి నెల్లూరు(సెంట్రల్): ఎయిరిండియాలో వాటా విక్రయాల గురించి తెలపాలని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి గురువారం లోక్‌సభలో కేంద్రాన్ని ప్రశ్నించారు. పౌర విమానయానశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి సమాధానమిస్తూ ఎయిరిండియాలో వాటా విక్రయ నిర్ణయం గతంలోనే జరిగిందన్నారు. 2018 మార్చి 28న ఈ మేరకు బిడ్లను కూడా ఆహా్వనించారని గుర్తు చేశారు. గత ఏడాది మే 31 వరకు ఎటువంటి బిడ్లు దాఖలు కాలేదని ఆయన స్పష్టం చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ ప్రక్రియ తిరిగి ప్రారంభమైందన్నారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి ఎయిరిండియాకు రూ.58,222.92 కోట్ల అప్పు ఉందని తెలిపారు. విమాన ప్రమాదాల నివారణకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని ఎంపీ ఆదాల అడిగిన ప్రశ్నకు విమాన తయారీ సంస్థల సూచనల మేరకు విమానాలకు అన్ని పరీక్షలు నిర్వహించి నడుపుతున్నట్లు మంత్రి బదులిచ్చారు. -
ధిక్కరించిన ధీరవనితలు!
పార్లమెంట్‌కు ఎన్నికవడమంటే మాటలా.. అంగబలం, అర్థబలం కనీస అర్హత. లేదంటే పెద్దనాయకుల ఆశీర్వాదం, అండ అయినా ఉండాలి. ఇవేమీ లేకుండా ఎన్నికల రణంలోకి అడుగుపెట్టిన ఈ సామాన్య మహిళలకు అడుగడుగునా వేధింపులు, దాడులు, సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలతో అడ్డంకులు ఎదురయ్యాయి. అయితే తమను అవేవీ అడ్డుకోలేవని రుజువు చేస్తూ ఆకాశమంత విజయాల్ని అందుకున్న నారీమణులకు భారత చట్టసభ సాదరంగా ఆహ్వానం పలుకుతోంది. వీరి విజయం సాధించిన వైనం గొప్పది. చారిత్రకమైంది. బ్యాంకు ఉద్యోగి కావాలనుకుని.. చంద్రాణి ముర్ము (ఒడిశా, బీజేడీ) ఈనెల 16వ తేదీన 26వ బర్త్‌డే జరుపుకోనున్న ఒడిశాకు చెందిన చంద్రాణి ముర్ము 17వ లోక్‌సభలో పిన్నవయస్కురాలైన సభ్యురాలు. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి బ్యాంకు ఉద్యోగం కోసం పోటీ పరీక్షలకు ప్రిపేరవుతోన్న చంద్రాణికి అనూహ్యంగా కియోంజా లోక్‌సభ టికెట్ వచ్చింది. విజయం అంత తేలికగా వరించలేదామెను. సోషల్ మీడియాలో మార్ఫింగ్ చేసిన ఫొటోలు ఆమెను మానసిక వేదనకు గురి చేశాయి. ‘నేనొక సాధారణ మహిళను. నన్ను నిజంగా జనం ఆమోదిస్తారా అని చాలా సంకోచించాను. కానీ, ప్రజలకు నచ్చిన గుణమేదో నన్ను మున్ముందుకు సాగేలా చేసింది’అంటూ ఎన్నికల్లోకి అడుగుపెట్టిన క్షణాలను గుర్తుచేసుకున్నారు చంద్రాణి. ఈమె తాత హరిహర్ సోరెన్ గతంలో కాంగ్రెస్ ఎంపీ. మార్క్సిస్టుల కోటలో పాగా వేశారు రమ్యా హరిదాస్ (కేరళ, కాంగ్రెస్) విద్య, ఆరోగ్యంలాంటి ఎన్నో రంగాల్లో తనదైన స్థానాన్ని నిలబెట్టుకుంటోన్న కేరళ నుంచి 17వ లోక్‌సభకు ఎన్నికైన ఏకైక సభ్యురాలు రమ్యా హరిదాస్(32). సంగీతంలో డిగ్రీ చేసిన రమ్య సామాజిక స్పృహ,జానపద గానంతో ప్రజల హృదయాలను కొల్లగొట్టారు. ఐదు దశాబ్దాల తరువాత మార్క్సిస్టుల కంచుకోటలో పాగా వేశారు. రెండుసార్లు ఎంపీ అయిన పీకే బిజూని 1.58 లక్షల ఓట్ల తేడాతో మట్టి కరిపించారు. ఈమె తల్లిదండ్రులు నిరుపేదలు. ఈమెలోని ప్రతిభను గుర్తించిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ మిగతా వారిని కాదని టికెట్ ఇచ్చారు. దీంతో స్థానిక నేతల నుంచి సహాయనిరాకరణ ఎదురైంది. కమ్యూనిస్టులు బురదచల్లే యత్నం చేశారు. రాళ్లతో దాడి చేయించారు. అయినా, తట్టుకుని నిలబడి గెలుపు సాధించారు. జానపద గీతంతో జనం మనసు గెలిచారు ప్రమీలా బిసోయీ (ఒడిశా, బీజేడీ) 2019 లోక్‌సభ ఎన్నికల్లో పరిమళించిన మరో మహిళా కుసుమం ప్రమీలా బిసోయీ! ఐసీడీఎస్ హెల్పర్‌గా ఉన్న ప్రమీలకు ఎంపీ టికెట్ ఇస్తామంటూ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఆహ్వానించినా చార్జీలకు డబ్బుల్లేక తిరస్కరించారు. ఇది తెలిసిన సీఎం స్వయంగా కారు పంపి ప్రమీలను భువనేశ్వర్‌కు రప్పించారు. అత్యంత సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ప్రమీల ‘రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. ఆ ప్రయత్నం కూడా చేయలేదు’అన్నారు. భారీ ఉపన్యాసాలకు బదులు తనకు తెలిసిన విద్య జానపదగీతాలను ఆలపించి ప్రజల మనసులను గెలిచారు. నిరుపేదల వలసలను నివారించేందుకు తమ ప్రాంతంలో చిన్న పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తానంటున్నారీమె. నా విజయం అందరికీ స్ఫూర్తి నుస్రత్ జహా (పశ్చిమబెంగాల్, టీఎంసీ) పశ్చిమబెంగాల్ ఉత్తర పరగణా జిల్లాలోని బాసిర్ హాట్ నుంచి టీఎంసీ తరఫున పోటీకి దిగి భారీ మెజారిటీతో విజయం సాధించి లోక్‌సభలో అడుగుపెట్టనున్నారు నటి నుస్రత్ జహా. పేద పిల్లల షెల్టర్ హోంల కోసం ఎన్జీవోతో కలిసి పనిచేశారు. ‘నేను సొంత ఇల్లు కొనుక్కోవడానికి ముందు పిల్లల కోసం షెల్టర్ హోం కట్టిస్తా’అని ప్రకటించారు నుస్రత్. పాశ్చాత్య దుస్తుల్లో పార్లమెంట్ ఎదుట ఆమె నిలబడి ఉన్నట్లుగా మార్ఫింగ్ చేసిన ఫొటోలను రాజకీయ విరోధులు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసినా ఆమె జంకలేదు. ‘నేను ఎవరిని అనేది ధరించిన దుస్తులను బట్టి తెలియదు. నాపైన వచ్చిన తప్పుడు ప్రచారాలను పక్కన పెట్టి నేను విజయం సాధించాను. మిగతా వారికి స్ఫూర్తిగా నిలిచాను’అంటున్నారు నుస్రత్. హరియాణా నుంచి ఏకైక మహిళ సునితా దుగ్గల్ (హరియాణా, బీజేపీ) పురుషాధిపత్యానికి మారుపేరుగా నిలిచే ఖాప్ పంచాయితీ పునాదులున్న హరియాణా నుంచి ఒక మహిళ చట్టసభలకు ఎన్నికవడం నిజంగా విశేషమే. హరియాణా నుంచి పార్లమెంట్‌కు ఎన్నికైన ఏకైక మహిళ సునితా దుగ్గల్. ఎంపీగా ఎన్నికవడానికి ఆమె ఎన్నో అవరోధాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ప్రభుత్వాధికారుల కుటుంబం నుంచి రావడం వల్ల సునితా దుగ్గల్ వాటిని ఎదుర్కోగలిగారు. మాజీ రెవెన్యూ అధికారి అయిన సునితా 2014లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. దేశంలోనే స్త్రీ, పురుష నిష్పత్తి అతి తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో హరియాణా ఒకటి. బీజేపీ ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నంతో హరియాణాలో లింగ నిష్పత్తి చాలా వరకు మెరుగైందని తెలిపారు దుగ్గల్. -
పార్లమెంట్లో ఫస్ట్‌డే
అందరికీ స్కూల్, కాలేజీ, ఆఫీస్... ఇలా అన్నింటికీ ఫస్ట్‌డే గుర్తుండే ఉంటుంది. చిన్న టెన్షన్, చాలా ఉత్సాహంతో మొదటిరోజు గడుస్తుంది. ప్రస్తుతం పార్లమెంట్లో తొలిసారి అడుగుపెడుతున్నారు నటి సుమలత. ఎంపీగా తొలిరోజును జ్ఞాపకంగా ఓ ఫొటో తీసుకొని ‘‘ప్రజాస్వామ్యానికి దేవాలయం అయినటువంటి పార్లమెంట్లో మొదటిరోజు. ఇది చాలా సుదీర్ఘమైన ప్రయాణం. ఈ అవకాశాన్ని అదృష్ణంగానూ, గౌరవంగానూ భావిస్తున్నాను’’ అని క్యాప్షన్ పెట్టారామె. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా ప్రాంతం నుంచి సుమలత ఎంపీగా ఎన్నికయిన సంగతి తెలిసిందే. -
20 నుంచి రాజ్యసభ సమావేశాలు
న్యూఢిల్లీ: రాజ్యసభ సమావేశాలు ఈ నెల 20 నుంచి జూలై 26 వరకు నిర్వహించనున్నట్లు రాజ్యసభ సెక్రటరీ జనరల్ దేశ్ దీపక్ ప్రకటనలో వెల్లడించారు. ఇక లోక్‌సభ సమావేశాలు ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్నాయి. 17, 18 తేదీల్లో కొత్తగా ఎంపికైన ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. 19వ తేదీన స్పీకర్‌ను ఎన్నుకుంటారు. 20వ తేదీన ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ప్రసంగించనున్నారు. ఈ సమావేశాల్లోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. -
కొదమసింహాల్లా పోరాడుతాం: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టారు. పార్లమెంటులోని సెంట్రల్‌హాలులో శనివారం జరిగిన సమావేశంలో కాంగ్రెస్ నేతలు ఆమెను కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ(సీపీపీ) నేతగా ఎన్నుకున్నారు. తొలుత సోనియాగాంధీ పేరును మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్సింగ్ ప్రతిపాదించగా, మిగతా కాంగ్రెస్ ఎంపీలు, ముఖ్య నేతలు చేతులు పైకెత్తి తమ అంగీకారం తెలియజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ లోక్‌సభ పక్షనేతను ఎంపికచేసే బాధ్యతను పార్టీ సోనియాకు అప్పగించింది. బాధ్యతలు స్వీకరించిన అనంతరం సోనియాగాంధీ మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమితో కాంగ్రెస్ శ్రేణులు దిగులుపడొద్దని సూచించారు. పార్లమెంటులో సమర్థవంతమైన ప్రతిపక్ష పాత్ర పోషించాలనీ, రాజ్యసభలో ఒకేరకమైన భావజాలం ఉన్న రాజకీయ పార్టీలతో కలిసి ముందుకు సాగాలని కాంగ్రెస్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తాం.. ‘ఈ సంక్షోభ సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురవుతున్న పలు సవాళ్లను మనం గుర్తించాలి. ఇటీవల సమావేశమైన సీడబ్ల్యూసీ పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించింది. పార్టీని పటిష్టం చేయడానికి తీసుకోవాల్సిననిర్ణయాలపై చర్చించాం. యూపీఏ ప్రభుత్వం గతంలో తీసుకొచ్చిన చరిత్రాత్మక చట్టాలను గత ఐదేళ్ల కాలంలో ఎన్డీయే ప్రభుత్వం రద్దుచేయకుండా అడ్డుకోగలిగాం. సంస్కరణలు, కీలక అంశాల విషయంలో నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించాం. ప్రభుత్వం చేసే విభజన, తిరోగమన రాజకీయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తాం’ అని సోనియా స్పష్టం చేశారు. రాహుల్‌పై ప్రశంసలు.. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌గాంధీ అద్భుతంగా పోరాడారని సోనియా కితాబిచ్చారు. ‘కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆయన కోట్లాది మంది ఓటర్లతో పాటు ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త ప్రేమను, గౌరవాన్ని చూరగొన్నారు. రైతులు, చిరువ్యాపారులు, యువత, మహిళలు, సమాజంలోని బలహీనవర్గాల పట్ల మోదీ ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరించడాన్ని ధైర్యంగా నిలదీశారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో అవిశ్రాంతంగా, ధైర్యంగా దూసుకుపోయిన రాహుల్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. లోక్‌సభలో 44 మంది, రాజ్యసభలో 55 మంది ఎంపీల బలం మాత్రమే ఉన్నప్పటికీ రాహుల్ నాయకత్వంతో కాంగ్రెస్ ప్రభుత్వ తప్పులను వెలుగులోకి తీసుకొచ్చింది. నేనిక్కడ మాట్లాడుతున్నప్పుడు కూడా రాహుల్ పార్టీ అధ్యక్ష పదవికి చేసిన రాజీనామాను వెనక్కి తీసుకోవాలని దేశవ్యాప్తంగా విజ్ఞప్తులు వస్తున్నాయి. రాహుల్ నాయకత్వంలోనే కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది’ అని తెలిపారు. రాజ్యసభలో కాంగ్రెస్ బలం తగ్గనున్న నేపథ్యంలో భావసారూప్య పార్టీలతో కలిసి ముందుకెళ్లాలని సోనియా పునరుద్ఘాటించారు. మరోవైపు సీపీపీ నేతగా సోనియా ఎంపికపై రాహుల్ స్పందిస్తూ..‘పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నికైన సోనియాకు శుభాకాంక్షలు. ఆమె నాయకత్వంలో కాంగ్రెస్ భారత రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేస్తుందని ఆశిస్తున్నా’ అని ట్వీట్ చేశారు. బీజేపీని ఇష్టానుసారం వ్యవహరించనివ్వం: రాహుల్: లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన 52 మంది కాంగ్రెస్ ఎంపీలు రాజ్యాంగాన్ని, రాజ్యాంగబద్ధమైన సంస్థలను కాపాడేందుకు కొదమసింహాల గుంపులా పోరాడుతారని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వాన్ని పార్లమెంటులో తమ ఇష్టానుసారం వ్యవహరించనివ్వబోమని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ‘బ్రిటిష్ హయాంలో ఉన్నట్టు ఈ ఎన్నికల్లో ఏ రాజ్యాంగబద్ధమైన సంస్థ కూడా సహకరించకపోయినా కాంగ్రెస్ పోరాడి గెలిచింది. ఇప్పుడు మళ్లీ పోరాడుతాం. మనమంతా కులం, మతం, రంగు, జాతి, రాష్ట్రం అనే భేదభావం లేకుండా రాజ్యాంగ పరిరక్షణకు, దేశంలోని ప్రతీఒక్కరి హక్కుల కోసం పోరాడుతున్నామని గుర్తుంచుకోవాలి. ఎన్నికల సందర్భంగా బీజేపీ విద్వేషం, ఆగ్రహాన్ని కాంగ్రెస్ ప్రేమ, ఆప్యాయతతో అడ్డుకుంది. అందుకే ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ ముక్తభారత్ అని కలవరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ లేకపోతే తమకు అడ్డుకునేవారే ఉండరని భావిస్తున్నారు’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈసారి పార్లమెంటులో మరింత తక్కువ సమయం లభించే అవకాశముందనీ, కాబట్టి ప్రజావాణిని గట్టిగా వినిపించాలని సూచించారు. ఈ ఎన్నికల్లో కొందరు పాతముఖాలు (మల్లికార్జున ఖర్గే, సునీల్ కుమార్ జాఖడ్, జ్యోతిరాదిత్య సింధియా) ఇక్కడుంటే బాగుండేదని విచారం వ్యక్తం చేశారు. అధ్యక్ష పదవి రేసులో నలుగురు.. సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తాను ఉండబోనని రాహుల్ ప్రకటించిన నేపథ్యంలో కొత్త అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు చేపడతారన్న విషయమై రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ పదవిలో గాంధీయేతర నేతను నియమించి, ఆయనకు సాయంగా సీనియర్ నేతలతో ఓ కమిటీని నియమించవచ్చని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చసాగుతోంది. కేరళ పీసీసీ మాజీ చీఫ్, 7 సార్లు లోక్‌సభ సభ్యుడిగా గెలుపొందిన కొడికుణ్ణల్ సురేశ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో తొలిస్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. బెంగాల్లో టీఎంసీ, బీజేపీ హవాను తట్టుకుని ఐదోసారి ఎంపీగా గెలిచిన అధిర్ రంజన్ చౌదరి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనోజ్ తివారీ, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ పేర్లు వినిపిస్తున్నాయి. జూన్ 17 నుంచి లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సోనియా వీలైనంత త్వరగా ఈ నియామకం చేపట్టే అవకాశముందని భావిస్తున్నారు. -
‘సైకిల్ అంటే నాకు ఫ్యాషన్ కాదు.. పాషన్’
గాంధీనగర్ : గురువారం రాత్రి 7 గంటలకు ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్ ఎదుట ఏర్పాటు చేసిన వేదికపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మోదీతో ప్రమాణం చేయించనున్నారు. అనంతరం పలువురు నేతలు కూడా కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోదీతో పాటు ప్రమాణ స్వీకారం చేయబోయే వారి పేర్లను ఇప్పటికే ప్రకటించారు. వీరిలో గుజరాత్‌కు చెందిన మన్సుక్ లాల్ మాండవ్య కూడా ఉన్నారు. మోదీ కాబినేట్‌లో మన్సుక్ మరోసారి మంత్రి పదవి చేపట్టనున్నారు. ఈ సందర్భంగా మన్సుక్ మాట్లాడుతూ.. ‘నరంద్రే మోదీ, అమిత్ షా నా మీద ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు. మరోసారి వారి ప్రభుత్వంలో నన్ను భాగం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వారిద్దరికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అన్నారు. గత ఐదేళ్లలో మన్సుక్ సైకిల్ మీదనే పార్లమెంట్‌కు వెళ్లారు. దాంతో విలేకరులు ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా సైకిల్ మీదనే వెళ్తారా అని ప్రశ్నించారు. అందుకు ఆయన బుదులిస్తూ.. ‘సైకిల్ మీద ప్రయాణించడాన్ని నేను పాషన్‌గా భావిస్తాను. సైకిల్ వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని జరగదు. సైకిల్ వాడకం వల్ల కాలుష్యం తగ్గడమే కాక ఇంధనం కూడా ఆదా అవుతుంది. పైగా ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఐదేళ్ల నుంచి పార్లమెంట్‌కు సైకిల్ మీదనే వెళ్లాను. ఇప్పుడు కూడా అలానే చేస్తాను’ అని చెప్పుకొచ్చారు. -
కొత్త ఎంపీలకు హోటల్ బస ఉండదు
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడనున్న వేళ లోక్‌సభ సెక్రటేరియట్ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా పార్లమెంటుకు ఎన్నికైన సభ్యులకు ఇకపై హోటళ్లలో తాత్కాలిక బసను కల్పించబోమని తెలిపింది. వెస్ట్రన్ కోర్టు, దానికి అనుబంధంగా నిర్మించిన నూతన భవనంతో పాటు స్టేట్ భవన్స్‌లో బసను ఏర్పాటుచేస్తామని చెప్పింది. ‘కొత్త ఎంపీలకు హోటళ్లలో బస కల్పించే సంప్రదాయానికి ముగింపు పలికాం’ అని లోక్‌సభ ప్రధాన కార్యదర్శి స్నేహలత శ్రీవాస్తవ ఢిల్లీలో మీడియాతో చెప్పారు. గతంలో హోటల్ బసల కారణంగా ప్రభుత్వ ఖజానాపై అనవసరమైన భారం పడుతోందన్న విమర్శలు గతంలో వచ్చాయి. 2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా 300 మందికిపైగా ఎంపీలు కొత్తగా ఎన్నికయ్యారు. అయితే అప్పటివరకూ ఎంపీలుగా కొనసాగిన నేతలు అధికారిక నివాసాలను ఖాళీ చేయకపోవడంతో, నూతన ఎంపీలకు లోక్‌సభ కార్యాలయం హోటళ్లలో బసను ఏర్పాటుచేసింది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై రూ.30 కోట్ల భారం పడింది. దీంతో విమర్శలు ఎదురుకావడంతో వెస్ట్రన్ కోర్టులో 88 బ్లాకులున్న భవనాన్ని నిర్మించారు. -
11 సార్లు ఎన్నికైన ఏకైక జననేత...
మొదటిసారి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయిన వాళ్లు మళ్లీ ఆ పదవి పొందాలని ఆశించడం సహజమే. అయితే, అందరికీ అది సాధ్యం కాదు. వాజపేయి, అడ్వాణీ, ఇంద్రజిత్ గుప్తా, సుమిత్రా మçహాజన్ వంటి వారు కొందరు అనేక సార్లు ఎంపీలుగా గెలిచినా మెజారిటీ ఎంపీలకు రెండో అవకాశం దక్కలేదని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 1951 నుంచి ఇంత వరకు జరిగిన ఎన్నికల్ని పరిశీలిస్తే... 60 శాతం ఎంపీలు అంటే ప్రతి ఐదుగురిలో ముగ్గురు రెండోసారి ఎంపీ కాలేకపోయారు. ఇంత వరకు జరిగిన 16 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 4,843 మంది ఎంపీలుగా (నామినేట్ ఎంపీలు 22 మంది కాకుండా) ఎన్నికయ్యారు. వీరిలో 2,840 మంది రెండోసారి ఎంపీలుగా ఎన్నిక కాలేదు. మిగిలిన 2003 మందిలో 50 శాతం మంది మూడోసారి ఎన్నికకాలేదు. అంటే వీరు రెండు సార్లు మాత్రమే గెలిచారు. మొత్తం ఎంపీల్లో 999 మంది రెండుసార్లు, 502 మంది మూడుసార్లు, 249 మంది నాలుగు సార్లు, 134 మంది ఐదు సార్లు గెలిచారు. ఒకసారికి మించి లోక్‌సభకు ఎన్నిక కాని వాళ్ల సంగతి ఇలా ఉంటే, కొందరు అనేకసార్లు పార్లమెంటుకు ఎన్నికయి రికార్డు సృష్టించారు. ఇంద్రజిత్ గుప్తా 11 సార్లు ఎన్నికయి దేశంలో ఆ ఘనత సాధించిన ఏకైక వ్యక్తిగా చరిత్ర నెలకొల్పారు. ఆ తర్వాత అటల్ బిహారీ వాజపేయి, సోమనాథ్ చటర్జీ, పీఎం సయీద్‌లు పదేసి సార్లు ఎంపీలయ్యారు. వీరు కాక తొమ్మిది మంది నాయకులు 9 సార్లు, పద్దెనిమిది మంది ఎనిమిది సార్లు, 34 మంది ఏడుసార్లు, 54 మంది 6 సార్లు,134 మంది ఐదు సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఇక నామినేటెడ్ ఎంపీల విషయానికి వస్తే ఇంత వరకు మొత్తం 22 మంది లోక్‌సభకు నామినేట్ కాగా వారిలో చాలా మంది కేవలం ఒకసారే నామినేట్ అయ్యారు. అయితే, ఆంగ్లో ఇండియన్ ఫ్రాంక్ అంటోనీ ఏకంగా 8సార్లు నామినేట్ అయి రికార్డు సృష్టించారు. ఏఈటీ బారో ఏడు సార్లు ఆంగ్లో ఇండియన్ సభ్యునిగా పార్లమెంటుకు నామినేట్ అయ్యారు. -
ఒక్కసారే చాన్స్!
పార్లమెంటులో ప్రతిష్టాత్మకమైన పదవి స్పీకర్ పదవి. పార్లమెంటు మొత్తానికీ స్పీకర్ అత్యున్నతాధికారి. అధికారంలో ఉన్న పార్టీ అభీష్టానికి అనుగుణంగా సీనియర్ లోక్‌సభ సభ్యులను స్పీకర్ పదవికి ఎంపిక చేస్తారు. గత పదహారు లోక్‌సభల్లో ఒక్కరు మినహా మిగిలినవారెవ్వరినీ రెండోసారి స్పీకర్ పదవి వరించిన పరిస్థితి మన దేశంలో లేదు. గత రెండు దశాబ్దాల్లో అయితే స్పీకర్ గా ఉన్న ఏ ఒక్కరూ లోక్‌సభకు తిరిగి ఎన్నికవలేదు. గత 16 లోక్‌సభల్లో ఒకసారి స్పీకర్‌గా పనిచేసిన వారిలో కేవలం 10 మంది మాత్రమే తిరిగి లోక్‌సభకి ఎన్నికయ్యారు. మొత్తం 16 లోక్‌సభల్లో నీలం సంజీవరెడ్డిని మాత్రమే రెండు సార్లు స్పీకర్ పదవి వరించింది. ఒకసారి స్పీకర్‌గా పనిచేసినవారిలో తిరిగిపోటీ చేసిన కొందరు ఎన్నికల్లో ఓడిపోవడం, కొందరు అసలు పోటీయే చేయకపోవడం, మరికొందరికి పార్టీ తిరిగి సీటు ఇవ్వకపోవడం దీనికి కారణమని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. 2014లో పార్టీలకతీతంగా ఏకగ్రీవంగా స్పీకర్ పదవికి ఎంపికైన ప్రస్తుత స్పీకర్ సుమిత్రా మహాజన్ కి సీటు కేటాయించలేదు. ఇండోర్ నుంచి ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయకపోవడంతో తాను అసలు పోటీయే చేయనని సుమిత్రా మహాజన్ తాజాగా ప్రకటించారు. 67 ఏళ్ళ లోక్‌సభ చరిత్రలో సుమిత్రా మహాజన్ లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికైన ద్వితీయ మహిళ. సుమిత్రా మహాజన్‌కన్నా ముందున్న స్పీకర్ మీరా కుమార్ తొలి మహిళా స్పీకరే కాకుండా తొలి దళిత మహిళా స్పీకర్‌గా కూడా రికార్డుకెక్కారు. మీరా కుమార్ కన్నా ముందు తొలి కమ్యూనిస్టు దిగ్గజం అయిన సోమనాథ్ ఛటర్జీ సీపీఎం నుంచి లోక్‌సభ స్పీకర్ పదవిని అలంకరించారు. అయితే ఛటర్జీ కష్టాలు కూడా అదే లోక్‌సభలో ప్రారంభం అయ్యాయి. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉండగా వామపక్ష పార్టీలన్నీ ప్రభుత్వాన్ని పడగొట్టాలని నిర్ణయించినప్పుడు స్పీకర్‌గా రాజీనామా చేసి, లోక్‌సభ సభ్యుడిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని ఆదేశించింది. అయితే సోమనాథ్ ఛటర్జీ మార్క్సిస్టు పార్టీ నిర్ణయాన్ని తోసిపుచ్చి స్పీకర్ పదవి హుందాతనాన్ని కాపాడారు. అంతేకాకుండా తాను ఆపై ఎన్నికల్లో పోటీ చేయనని కూడా స్పష్టం చేశారు. పార్టీ బహిష్కరణ తరువాత కమ్యూనిస్టు దిగ్గజం ఛటర్జీ రాజకీయ ప్రస్థానాన్ని అర్థంతరంగా ముగించాల్సి వచ్చింది. శివసేన వ్యవస్థాపకుల్లో ఒకరు, శివసేన అధినాయకుడు బాల్ థాకరే అతి సన్నిహితుడూ అయిన మనోహర్ జోషీ సోమనాథ్ ఛటర్జీకన్నా ముందు లోక్‌సభ స్పీకర్‌గా ఉన్నారు. స్పీకర్ పదవిని చేపట్టడానికన్నా ముందు మనోహర్ జోషీ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1999 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి మనోహర్‌జోషీ గెలిచారు. అయితే జీఎంసీ బాలయోగి హెలికాప్టర్ ప్రమాదంలో హఠాత్తుగా మరణించడంతో మనోహర్ జోషీని స్పీకర్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జోషీ అసెంబ్లీలో సుదీర్ఘ అనుభవం కలిగిన వ్యక్తే కాకుండా శివసేన సీనియర్ నాయకుడు కూడా కావడంతో ఆయనను స్పీకర్ పదవి వరించింది. ఆ తరువాత 2004 ఎన్నికల్లో జోషీ ఓడిపోవడంతో ఆయన తిరిగి లోక్‌సభలో అడుగుపెట్టలేదు. భారత చట్టసభల తొలి స్పీకర్ జీఎస్. మాల్వంకర్ 1952లో ఎన్నికయ్యారు. 1956లో ఆయన మరణించారు. ఇక ఎమర్జెన్సీ అనంతరం జరిగిన 1977 ఎన్నికల తరువాత తొలి లోక్‌సభకు కేఎస్.హెగ్డే స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఈయన కూడా తిరిగి రెండోసారి లోక్‌సభకు ఎన్నిక కాలేదు. -
ప్రధానిని కలసిన టీఆర్ఎస్ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: టీఆర్ఎస్ ఎంపీలు సోమవారం పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. పార్టీ లోక్‌సభాపక్ష నేత జితేందర్‌రెడ్డి, బి.వినోద్‌కుమార్, సంతోష్, బూర నరసయ్యగౌడ్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, సీతారాం నాయక్, జి.నగేశ్, బీబీ పాటిల్, బి.లింగయ్య యాదవ్, బండ ప్రకాశ్, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి తదితరులు సమావేశమై ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు నిర్మాణానికి స్థలం కేటా యింపుపై వినతిపత్రాన్ని ఇచ్చారు. పార్లమెంటు లో టీఆర్ఎస్కు ఉన్న 17 మంది సంఖ్యా బలం ఆధారంగా పట్టణాభివృద్ధి శాఖ నిబంధనల మేరకు తమకు వెయ్యి చదరపు గజాల స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని ఆర్పీ రోడ్డులో స్థలాన్ని కేటాయించాలని ప్రధానిని కోరారు. ముందుగా ఢిల్లీలోని సాకేత్, వసంత్ విహార్, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ మార్గ్ ప్రాం త్రాలను టీఆర్ఎస్ ఎంపీలు పార్టీ ఆఫీసు నిర్మాణం కోసం పరిశీలించారు. ఇటీవల ఢిల్లీ పర్యటన ముగించుకొని వెళ్లే ముందు సీఎం కేసీఆర్ కూడా ఆయా ప్రాంతాల మ్యాపులను పరిశీలించి తెలంగాణ భవన్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. చివరికి అన్ని అనుకూలతలను పరిశీలించిన అనంతరం రాజేంద్ర ప్రసాద్ రోడ్ ను ఎంపిక చేసుకున్నారు. నాకు ఒక్క స్వీటు కూడా ఇవ్వలేదు.. తనను కలసిన టీఆర్ఎస్ ఎంపీలతో ప్రధాని మోదీ సరదా సంభాషణ సాగించారు. తెలం గాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజా రిటీతో గెలిచినా తనకు ఒక్క స్వీటు తినిపించలేదన్నారు. మంత్రులు, ఎంపీలకు స్వీట్లు తినిపిం చి నాకు మాత్రం ఇవ్వరా? అని మోదీ సరదాగా అన్నట్టు తెలిసింది. దీనికి స్పందించిన టీఆర్ఎస్ ఎంపీలు.. పుల్లారెడ్డి స్వీట్స్ నుంచి ప్రత్యేకంగా బెల్లం, కాజుతో చేసిన స్వీట్లు స్వయంగా తీసుకొచ్చి ఇస్తామని చెప్పారు. -
జీరో అవర్
తలాక్ బాధితుల్ని ఉద్ధరించడానికి బిల్లే అవసరం లేదు. మహిళలకు ఇన్నని సీట్లిచ్చేస్తే.. మగ పార్లమెంటేరియన్ల ఆడగొంతు డబ్బింగ్‌లతో పని లేకుండా మహిళల సమస్యల్ని మహిళలే పరిష్కరించుకునే ‘ఫిమేల్ వాయిస్ ఆఫ్ ఎమర్జెన్సీ’ మాత్రమే చట్టసభల్లో వినిపిస్తుంది. ఏది తక్షణ అవసరమో తెలియకున్నా నష్టం లేదు. ఏది తక్షణ అనవసరమో పాలకులకు తెలియాలి! జీరో అవర్‌ను లంచ్ అవర్ తర్వాత పెట్టుకుంటే ఏమైనా ఉపయోగం ఉంటుందేమో! ఆకలితో ఆలోచించలేరు కదా. ఆకలిగా ఉన్నప్పుడు మాట్లాడలేం. వినలేం. శుక్రవారం పార్లమెంటులో లంచ్ అవర్‌కు ముందు జీరో అవర్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి మాట్లాడే అవకాశం కేరళ కన్నూర్ ఎంపీ శ్రీమతి టీచర్‌కు లభించింది. మాట్లాడే అవకాశం మాత్రమే అది. ప్రశ్నించే అవకాశం కాదు. ప్రశ్నించడానికి జీరో అవర్ కంటే ముందు క్వొశ్చన్ అవర్ ఉంటుంది. ఆ అవర్‌లో మాట్లాడ్డం ఉండదు. ప్రశ్నించడం, ప్రశ్నకు సమాధానం వినడం ఉంటుంది. డిసెంబర్ 11న శీతాకాల సమావేశాలు మొదలయ్యాక క్వొశ్చన్ అవర్‌లో ఇంతవరకు ఎవరూ మహిళా బిల్లు ఏమైందని ప్రశ్నించలేదు. జనవరి 8న సమావేశాలు ముగుస్తాయి. ఆలోపు ఎవరైనా ప్రశ్నించినా, ఎవరు లేచి సమాధానం చెబుతారు? ప్రధానమంత్రా, పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టరా, న్యాయశాఖ మంత్రా? మహిళా రిజర్వేషన్ బిల్లుపై వెయ్యడానికి చాలా ప్రశ్నలే ఉన్నాయి. ఒక క్వొశ్చన్ అవర్ సరిపోదు. ఎన్ని రోజులు సమావేశాలు జరిగితే అన్ని రోజుల క్వొశ్చన్ అవర్లూ కావాలి. ఎనిమిదేళ్ల క్రితమే రాజ్యసభలో పాస్ అయిన బిల్లు, లోక్‌సభ టేబుల్ మీదకు ఎందుకు రావడం లేదు? పార్లమెంటులో మెజారిటీ ఉండి కూడా బీజేపీ ఈ ఐదేళ్లలో బిల్లు మాటే ఎందుకు ఎత్తలేదు? ఈ పార్లమెంటు సమావేశాలలో మొత్తం 46 బిల్లులు టేబుల్ మీదకు వచ్చాయి. వాటిల్లో తలాక్ బిల్లు ఉంది కానీ, మహిళా రిజర్వేషన్ బిల్లు లేదు! తలాక్ బాధితుల్ని ఉద్ధరించడానికి బిల్లే అవసరం లేదు. మహిళలకు ఇన్నని సీట్లిచ్చేస్తే.. మహిళలే తమ సమస్యల్ని చక్కగా డీల్ చేసుకోగలరు. ఏది తక్షణ అవసరమో తెలియకున్నా నష్టం లేదు. ఏది తక్షణ అనవసరమో పాలకులకు తెలిసి ఉండాలి. జీరో అవర్‌లో మాట్లాడేందుకు శ్రీమతి టీచర్‌కు (ఆమె పేరు అదే) ఐదు నిముషాల సమయం ఇచ్చారు. మహిళా బిల్లును వెంటనే సభలో ప్రవేశపెట్టి, డిస్కషన్‌కి పెట్టండని ఆమె విజ్ఞప్తి చేశారు. మిగతా ఎంపీలు కూడా ఆమెను సపోర్ట్ చేశారు. ఆ సపోర్ట్ చేసినవాళ్లలో పాలకపక్షం అయిన ఎన్డీయేవాళ్లు కానీ, ప్రతిపక్షమైన యూపీయే వాళ్లు గానీ లేరు! ఐదు నిముషాలు ముగిశాయి. జీరో అవరూ ముగిసింది. అంతా లంచ్‌కి వెళ్లిపోయారు. శ్రీమతి టీచర్ పార్లమెంటులో రిజర్వేషన్ బిల్లు గురించి అడగడానికి ముందురోజు సాయంత్రం లోక్‌సభ సభ్యులందరికీ ఫోన్లు వెళ్లాయి. కొందరు రాజ్యసభ సభ్యులకు కూడా. అవన్నీ దేశప్రజల నుంచి వెళ్లిన ఫోన్లు! రైతులు, గృహిణులు, ఉద్యోగినులు, విద్యార్థులు, లైంగికదాడి బాధితులు, సఫాయీ పని మాని పునర్వృత్తి పొందినవారు, మీడియా మహిళలు, బ్యాంకర్లు, వివిధ రంగాలలో శిక్షణ లో ఉన్నవారు, పరిశోధకులు, సామాజిక కార్యకర్తలు, ఇంటిపనివారు, వ్యాపార ప్రకటన సంస్థల నిపుణులు, పారిశ్రామికవేత్తలు చేసిన ఫోన్లు. బెంగళూరులోని ‘శక్తి’అనే సంస్థ ‘కాల్ యువర్ ఎంపీ’ అంటూ వీళ్లందరితో ఎంపీలకు ఫోన్ చేయించింది. అందరి చేతా ఆ సంస్థ అడిగించిన ప్రశ్న ఒకటే. ‘మహిళా రిజర్వేషన్ బిల్లుకు మీరు మద్దతు ఇస్తారా?’ అని. ‘ఎస్’ అని 127 మంది ఎంపీలు సమాధానం ఇచ్చారు. మిగతావాళ్లు రెస్పాండ్ కాలేదు. మొత్తం 373 మంది ఎంపీలకు ఈ ఫోన్లు వెళ్లాయి. ఫోన్ చేసినవారు 500 మంది. ఫోన్ కాల్కి సమాధానం ఇచ్చినవాళ్లలో రాజ్యసభ బీజేపీ ఎంపీ సహస్రబుద్ధే కూడా ఉన్నారు. ‘‘బిల్లుకు మేము అనుకూలం అని బీజేపీ ఎప్పుడో స్పష్టంగా చెప్పింది. కానీ కొన్ని పార్టీలు కోటాలో మళ్లీ కోటా అడుగుతున్నాయి. ఏకాభిప్రాయం కుదరక ఆలస్యం అవుతోంది. ఈ పార్లమెంటు సమావేశాల్లో బిల్లు టేబుల్ మీదకు వస్తుందో లేదో నేను చెప్పలేను. ఎందుకంటే నాకు తెలియదు’’ అని చెప్పారు సహస్రబుద్ధే! తక్కినవాళ్ల సమాధానాలు కూడా ఇలాగే ఉన్నాయి. బిల్లుకు సపోర్ట్ చేస్తామన్నారే కానీ, బిల్లును టేబుల్‌పైకి రప్పించే ఎఫర్ట్ చేస్తామని ఎవరూ చెప్పలేదు! బీజేపీ ఎంపీ సహస్రబుద్ధే ఈ విషయంలో ఏమీ చెయ్యలేకపోవచ్చు. బీజేపీ పీఎం నరేంద్ర మోదీ బుద్ధిశాలే కదా. పైగా స్త్రీమూర్తుల శక్తి సామర్థ్యాలపై ఎన్నో సందర్భాలలో ఆయన తన మాటల్లో అపారమైన విశ్వాసాన్ని ప్రదర్శించారు. ‘స్త్రీలు.. అభివృద్ధి గురించి కాదు, స్త్రీల నాయకత్వంలో జరిగే అభివృద్ధి గురించి ఆలోచించే సమయం ఆసన్నమైంది’ అన్నారు. ‘స్త్రీలకు సాధికారతను ఇచ్చేందుకు పురుషులెవరు?’ అని ప్రశ్నించారు. ‘మిమ్మల్ని మీరు సమర్థంగా తీర్చిదిద్దుకోండి. సాంకేతిక అంశాల్లో సాధికారత సాధించుకోండి’ అని సలహా ఇచ్చారు. ‘‘క్షమ, ఓపిక లాంటివి స్త్రీలకు సహజ గుణాలు. భర్త, పిల్లల కోసం వారెంతో త్యాగం చేస్తారు’’ అని ప్రశంసించారు. ఇన్ని అని, ఇన్ని చెప్పిన మనిషి ఐదేళ్లు పూర్తవుతున్నా బిల్లు గురించి పార్లమెంటు లోపల గానీ, బయట గానీ మాట్లాడలేదు. ఇల్లు, వాకిలి శుభ్రంగా ఉంచుకోడానికి ముప్పైమూడు శాతం రిజర్వేషన్లు ఎందుకని ఆయన అనుకున్నట్లుంది! రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు హమీద్ అన్సారీ, ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ మహిళా రిజర్వేషన్ల గురించి మాట్లాడారు కానీ, పార్లమెంటు లోపల ఎప్పుడూ మాట్లాడలేదు. తొలిసారి 1996లో మహిళా బిల్లు పార్లమెంటుకు వచ్చింది. ఇరవై రెండేళ్లు గడిచాయి. దేవెగౌడ, ఐ.కె.గుజ్రాల్, అటల్ బిహారీ వాజ్‌పేయి, మన్మోహన్ సింగ్, ఇప్పుడు నరేంద్ర మోదీ.. ఐదుగురు ప్రధాన మంత్రులు మారారు. వారిలో ఇద్దరు ఐ.కె.గుజ్రాల్, వాజ్‌పేయి కాలధర్మం చెందారు. ఇప్పటికింకా బిల్లు సగం ఉడికిన అన్నంగానే ఉండిపోయింది. న్యూ ఇయర్లోకి వస్తున్నాం. తర్వాత న్యూ గవర్నమెంట్లోకీ వచ్చేస్తాం. ఇంకో వారమే ప్రస్తుత శీతాకాల సమావేశాలు. ఈ వారంలో రోజుల్లో దేనికి ఏదన్నది ఫిక్స్ అయిపోయింది. మహిళా బిల్లుకు చోటు లేదు. లేకపోయినా ఇవ్వొచ్చు. ఏకాభిప్రాయం అవసరం లేకుండా పేటెంటు బిల్లును, పోటా బిల్లును తెచ్చినవాళ్లు మనవాళ్లు! మహిళా బిల్లును తేలేరా? ఆ బిల్లును పక్కన పడేసి మోదీ తెచ్చిన తలాక్ బిల్లు సుప్రీంకోర్టు ఇచ్చిన శబరిమల తీర్పులా ఉంది. దర్శనం కోసం వచ్చే మహిళల్ని అడ్డుకోవద్దని సూచిస్తే సరిపోయేది. అడ్డుకోడానికి వీల్లేదని ఆదేశించడమే అలజడికి కారణం అయింది. తలాక్ చెల్లదనే బిల్లు కూడా అంతే. మహిళలకు చట్టపరమైన భద్రత ఉన్నప్పుడు మహిళల్లోంచి మళ్లీ ముస్లిం మహిళను ప్రత్యేకం చేసి ప్రత్యేక భద్రత కల్పించే తొందర ఏమిటి? ఇదెలా ఉందంటే.. ముప్పై మూడు శాతంలోంచి మళ్లీ కొంత శాతం వేరుగా తీసి రిజర్వేషన్లు ఇవ్వాలని కొన్ని పార్టీలు మహిళా బిల్లుకు అడ్డుపడుతున్నాయి కదా.. అలా ఉంది! -
మూడో రోజూ సేమ్ సీన్
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్షాల నిరసనలు కొనసాగుతున్నాయి. రఫేల్ విమానాల కొనుగోలు, రామ మందిరం నిర్మాణం, కావేరీ నది జలాల విషయంలో ఆందోళనలు చేశారు. గురువారం మూడో రోజు సమావేశాలు ప్రారంభం కాగానే.. 17 ఏళ్ల కింద పార్లమెంటులో జరిగిన ఉగ్ర దాడిలో మరణించిన వారికి రాజ్యసభ సభ్యులు నివాళులు అర్పించారు. ఆ వెంటనే కావేరీ జలాల సమస్యపై అన్నా డీఎంకే, డీఎంకే సభ్యులు ప్లకార్డులు పట్టుకుని, నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకొచ్చా రు. తమిళనాడు ప్రయోజనాలు కాపాడాలంటూ నినాదాలు చేశారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు సభ్యులను వారివారి స్థానాల్లోకి వెళ్లి కూర్చోవాలని ఎంత కోరినా వారు. వినిపించు కోలేదు. సభా కార్యకలాపాలను సజావుగా సాగని వ్వాలని విజ్ఞప్తి చేశారు. ‘పార్లమెంటును కాపాడేం దుకు 9 మంది ప్రాణత్యాగం చేశారు. ఇలా చేశారంటే మన వ్యవస్థ గురించి తప్పుడు సమాచారం వెళు తుంది’అని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. సభ్యులు ఎంతకూ వినకపోవడంతో తప్పని పరిస్థితు ల్లో శుక్రవారానికి చైర్మన్ రాజ్యసభను వాయిదా వేశారు. లోక్‌సభలోనూ ఇదే స్థితి.. లోక్‌సభ ప్రారంభం కాగానే 2001లో పార్లమెంటుపై జరిగిన ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి సభ్యులు నివాళులర్పించారు. ఆ వెంటనే ప్రశ్నోత్తరాలు ప్రారంభమయ్యాయి. ఈ సమయంలో ప్రతిపక్ష సభ్యులు పలు అంశాలపై ఆందోళనలు చేపట్టారు. ప్రశ్నోత్తరాలు జరుగుతున్న సమయంలో రెండుసార్లు సభను వాయిదావేశారు. కాంగ్రెస్, శివసేన, అన్నా డీఎంకే, డీఎంకే సభ్యులు ఆందోళనలను విరమించుకోకపోవడంతో జీరో అవర్ సమయంలో స్పీకర్ లోక్‌సభను శుక్రవారానికి వాయిదా వేసింది. రామమందిరాన్ని వెంటనే నిర్మించాలని శివసేన సభ్యులు ఆందోళన చేపట్టారు. ‘బీజేపీకి పూర్తి మెజారిటీ వచ్చింది. బీజేపీ, శివసేనల మధ్య పొత్తు కుదరడానికి ప్రధాన అంశమైన హిందూత్వాన్ని ఆ పార్టీ మరిచిపోయింది’ అని పార్టీ నేత అడ్సల్ అన్నారు. -
అమరులకు వైఎస్సార్ సీపీ నేతల ఘన నివాళి
సాక్షి, న్యూ ఢిల్లీ : 2001 డిసెంబర్ 13న పార్లమెంట్‌పై జరిగిన తీవ్రవాదుల దాడిలో అమరులైన వారికి వైఎస్సార్ సీపీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. ఈ గురువారం తీవ్రవాదుల దాడిలో అమరులైన వారి సంస్మరణార్థం పార్లమెంట్ ఆవరణలో ఏర్పాటైన కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు అమరులకు ఘనంగా నివాళులర్పించి, అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, మాజీ ఎంపీలు పాల్గొన్నారు. 17 సంవత్సరాల క్రితం ఇదే రోజున తీవ్రవాదులు పార్లమెంట్ భవనంపై దాడికి తెగబడ్డారు. వీరిని నిలువరించే ప్రయంత్నంలో పలువురు భద్రతా సిబ్బంది సైతం తమ ప్రాణాలు కోల్పోయారు. -
రాజధానిలో రైతు రణం
న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: పాలకులకు తమ గళం బలంగా వినిపించేందుకు అనేక రాష్ట్రాల నుంచి వేలాదిగా అన్నదాతలు ఢిల్లీకి చేరుకున్నారు. రుణ విముక్తి, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలనే డిమాండ్లతో వామపక్ష పార్టీల మద్దతుతో వీరు చేపట్టిన రెండు రోజుల ఆందోళన ప్రారంభమైంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాలకు చెందిన రైతులు గురువారం చేరుకున్నారు. వీరంతా నేడు పార్లమెంట్ వైపుగా ర్యాలీగా సాగనున్నారు. రైతుల కపాలాలతో ర్యాలీకి.. వామపక్ష పార్టీలు, సంఘాలతో ఏర్పాటైన ఆల్ ఇండియా కిసాన్ సంఘర్‡్ష కోఆర్డినేషన్ కమిటీ(ఏఐకేసీసీ) బ్యానర్ కింద వివిధ రాష్ట్రాలకు చెందిన రైతులు ఢిల్లీకి వచ్చారు. వీరిలో నేషనల్ సౌత్ ఇండియన్ రివర్ ఇంటర్ లింకింగ్ అగ్రికల్చరిస్ట్స్ అసోసియేషన్‌కు చెందిన 1,200 మంది రైతుల బృందముంది. వీరు ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కపాలాలను తెచ్చారు. రామ్‌లీలా మైదాన్‌లో జరిగిన సమావేశంలో ప్రముఖ జర్నలిస్టు పాలగుమ్మి సాయినాధ్ మాట్లాడుతూ.. ‘దేశవ్యాప్తంగా 600 జిల్లాల్లో వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది. ఫసల్ బీమా యోజన పెద్ద కంపెనీలకు వరంగా మారింది’అని అన్నారు. రుణమాఫీ చేస్తామని చెప్పిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రైతులను మోసం చేశాడని ఏపీ నుంచి వచ్చిన రైతు ప్రతినిధి వీరారెడ్డి, రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధి కొండల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు యోగేంద్ర యాదవ్, మేథాపాట్కర్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో మకాం వేసిన రైతులు..వారు ధరించిన ఎర్ర టోపీలు, ఎర్ర జెండాలతో రామ్‌లీలా మైదాన్ ఎరుపు రంగును సంతరించుకుంది. ‘అయోధ్య వద్దు, రుణ మాఫీ కావాలి’ అంటూ వారు చేస్తున్న నినాదాలతో ప్రాంగణం మారుమోగింది. బంగ్లా సాహిబ్, శీశ్‌గంజ్ సాహిబ్, రాకాబ్‌గంజ్, బాప్ సాహిబ్, మంజు కా తిలా గురుద్వారాల నిర్వాహకులు రైతులకు బస కల్పించేందుకు ముందుకువచ్చారు. అంబేడ్కర్ స్టేడియంలో బస చేసిన సుమారు 6,500 మంది రైతులకు రొట్టెలు పంపిణీ చేసినట్లు ఢిల్లీ వర్సిటీ ప్రొఫెసర్ ఆభా దేవ్ తెలిపారు. -
బీజేపీ ప్రణాళికాబద్ధంగా దెబ్బతీస్తోంది
ఇండోర్: పార్లమెంటు, కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ), రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) వంటి సంస్థల ప్రతిష్టను మోదీ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా దెబ్బతీస్తోందని మాజీ ప్రధాని, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ తెలిపారు. తద్వారా ఓ క్రమపద్ధతిలో, వ్యూహాత్మకంగా భారత ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపర్చేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. మోదీ హయాంలో అవినీతి విలయతాండవం చేస్తోందని ధ్వజమెత్తారు. మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బుధవారం నాడిక్కడ నిర్వహించిన మీడియా సమావేశంలో మన్మోహన్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రం, ఆర్బీఐ మధ్య సహకారంపై ‘దేశంలో పార్లమెంటు, సీబీఐ వంటి సంస్థల ప్రతిష్టను మోదీ ప్రభుత్వం దిజారుస్తోంది. జాగ్రత్తగా, వ్యూహాత్మకంగా వీటిని దెబ్బతీస్తోంది. తద్వారా దేశంలోని ప్రజాస్వామ్యాన్ని బలహీనపర్చేందుకు యత్నిస్తోంది. ప్రస్తుతం దేశంలో సమన్యాయంపై దాడి జరుగుతోంది. ఈ పరిస్థితి ఇప్పుడు మారకుంటే చరిత్ర ఈ తరాన్ని ఎన్నటికీ క్షమించదు. మోదీ ప్రభుత్వం ఆర్బీఐ, సీబీఐ వంటి సంస్థలపై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తోంది. ఇది దేశ ప్రజాస్వా మ్యానికి, చట్టాలకు ప్రమాదకరం. ఇక కేంద్ర ఆర్థికశాఖ, ఆర్బీఐల మధ్య సంబంధాలు ఎన్నడూలేనంతగా దిగజారాయి’ అని అన్నారు. దుర్భాషలు ప్రధాని హోదాకు తగదు పెద్ద నోట్ల రద్దు, వస్తుసేవల పన్ను (జీఎస్టీ)పై విలేకరులు అడిగిన ప్రశ్నకు మన్మోహన్ స్పందిస్తూ.. ‘‘పెద్ద నోట్ల రద్దు అన్నది ‘వ్యవ స్థాగత లూటీ–చట్టబద్ధమైన దోపిడీ’గా తయారైంది. ఈ నిర్ణయంతో దేశంలోని అసంఘటిత రంగానికి తీవ్రనష్టం వాటిల్లింది. నోట్ల రద్దు లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైంది. ఇలాంటి ఆర్థిక దుస్థితిని కల్పించిన ప్రభుత్వాన్ని వదిలించుకోవాలా? వద్దా? అన్నది ప్రజలే నిర్ణయించుకోవాలి. తన రాజకీయ ప్రత్యర్థులపై మోదీ దుర్భాషలకు దిగుతున్నారు. ఓ ప్రధానికి ఇలాంటి భాష ఎన్నటికీ శోభనివ్వదు’’ అని వెల్లడించారు. నాది రిమోట్ కంట్రోల్ సర్కార్ కాదు తనది రిమోట్ కంట్రోల్ ప్రభుత్వమని 2014 ఎన్నికల సందర్భంగా బీజేపీ చేసిన విమర్శలకు సమాధానమిస్తూ.. ‘అది ఎంతమాత్రం నిజం కాదు. మా పార్టీ (కాంగ్రెస్), ప్రభుత్వం ఒకేతాటిపై ఉన్నాయి. మామధ్య ఎలాంటి అభిప్రాయభేదాలు అప్పట్లో లేవు. యూపీఏ హయాంలో అవినీతి జరిగిందని మీడియాను, దేశ ప్రజలను బీజేపీ తప్పుదోవ పట్టించింది. ఈ విషయంలో ప్రజలకు మేం సరిగ్గా జవాబు ఇవ్వలేకపోయాం’ అని పేర్కొన్నారు. మరోవైపు, ఈ ఆరోపణల్ని బీజేపీ ఖండించింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ పదేళ్ల పాలనలో సీబీఐ వంటి కేంద్ర సంస్థలపై ప్రభుత్వం తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చేదని బీజేపీ అధికార ప్రతినిధి గోపాల్‌కృష్ణ అగర్వాల్ పేర్కొన్నారు. -
లంక పయనమెటు?
శ్రీలంకలో రాజకీయ సంక్షోభం ఊహించని మలుపు తిరిగింది. రెండేళ్ల ముందుగానే పార్లమెంట్ రద్దు కావడంతో వచ్చే జనవరి 5న మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. 225 మంది సభ్యుల పార్లమెంట్‌ను రద్దుచేయడంతో పాటు ఎన్నికల నిర్వహణకు అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తీసుకున్న నిర్ణయాన్ని అంతర్జాతీయ సమాజం తప్పుపట్టింది. ఈ నెల 14న విశ్వాస పరీక్ష నిర్వహించేందుకు స్పీకర్ కె.జయసూర్య చేస్తున్న ప్రయత్నాలకు బ్రేక్ పడింది. రాజపక్సే మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి రావడం భారత్‌కు కూడా రుచించడంలేదు. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన భారత్‌తో సంబంధాలకు తక్కువ ప్రాధాన్యమిచ్చి చైనాతో సన్నిహితంగా మెలిగారు. రాజపక్స మళ్లీ అధికారంలోకి వస్తే శ్రీలంకలో చైనా ఆధిపత్యం పెరుగుతుందని భారత్ ఆందోళనగా ఉంది. అస్థిరత మొదలైందిలా.. గత నెల 27న ప్రధాని విక్రమ సింఘేను అధ్యక్షుడు సిరిసేన అకస్మాత్తుగా పదవి నుంచి తొలగించి, మాజీ అధ్యక్షుడు మహిందా రాజపక్సను కొత్త ప్రధానిగా నియమించడంతో శ్రీలంక రాజకీయాల్లో అస్థిరత ఏర్పడింది. అధికారం కోసం విక్రమసింఘే, రాజపక్సల మధ్య కొనసాగుతున్న పోరుపై అనేక దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఎవరి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడాలనేదానిపై పార్లమెంట్లో ఓటింగ్‌కు అనుమతించాలంటూ సిరిసేనపై అమెరికా, ఐరాస, ఐరోపా దేశాల సంఘం (ఈయూ) ఒత్తిడి పెంచాయి. ఫిరాయింపులను ప్రోత్సహించి, తన పార్టీకి తగినంత బలాన్ని కూడగట్టేందుకే సిరిసేన పార్లమెంట్‌ను తొలుత సస్పెండ్ చేశారని భావించారు. పార్టీ మారేందుకు తమకు లక్షలాది డాలర్లు ఎరగా చూపారని కొందరు సభ్యులు పేర్కొన్నారు. తాను ప్రధానిగా నియమించిన రాజపక్స మెజారిటీని నిరూపించుకునే అవకాశాలులేవని తేలడంతో సిరిసేన పార్లమెంట్ రద్దుకు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. సంకీర్ణంలో లుకలుకలు... 2015లో సిరిసేన నాయకత్వంలోని శ్రీలంక ఫ్రీడం పార్టీ, విక్రమసింఘే ఆధ్వర్యంలోని యునైటెడ్ నేషనల్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ప్రభుత్వ పనితీరు, ఆర్థిక విధానాలు, ఓడరేవులను భారత్‌కు లీజుకిచ్చిన విషయంలో రెండు పార్టీల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. కొలంబోలోని ‘ఈస్ట్ కంటెనర్ టెర్మినల్’ను అభివృద్ధి చేసే బాధ్యతను భారత్‌కు అప్పగించాలని విక్రమ్‌సింఘే భావించగా, సిరిసేన ఆ ప్రతిపాదనని వ్యతిరేకించారు. రాజపక్స అధికారంలో ఉండగా మూడోసారి అధ్యక్షుడయ్యేందుకు(గతంలో రెండుసార్లు) వీలుగా రాజ్యాంగానికి 18వ సవరణ తీసుకువచ్చారు. దానిస్థానంలో రెండుసార్లకే అధికారం పరిమితం చేస్తూ సిరిసేన–విక్రమసింఘే ప్రభుత్వం 19వ సవరణ చేసింది. ఈ తాజా సవరణతో మళ్లీ అధ్యక్షుడయ్యే అవకాశం లేకపోవడంతో మహిందా రాజపక్స ప్రధాని పదవిపై కన్నేశారు. అదే సమయంలో విక్రమసింఘే, సిరిసేనల మధ్య ఏర్పడిన విభేదాలు ఆయనకు కలిసొచ్చాయి. పార్లమెంట్ రద్దుపై కోర్టుకెళ్తాం: యూఎన్‌పీ కొలంబో: శ్రీలంక పార్లమెంట్‌ను రద్దు చేస్తూ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తీసుకున్న నిర్ణయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు పదవీచ్యుత ప్రధాని విక్రమసింఘే నేతృత్వంలోని యునైటెడ్ నేషనల్ పార్టీ(యూఎన్‌పీ) తెలిపింది. ‘నియంతృత్వ పోకడల నుంచి రాజ్యాంగాన్ని, చట్టాన్ని పరిరక్షించుకునేందుకు కోర్టు జోక్యాన్ని కోరనున్నాం. అధ్యక్షుడు సిరిసేన నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా కోర్టులు, పార్లమెంట్, ఎన్నికల బరిలోనూ పోరాడతాం’ అని యూఎన్పీకి చెందిన మంగళ సమరవీర శనివారం తెలిపారు. ప్రధాని పదవి నుంచి విక్రమ సింఘేను తప్పిస్తున్నట్లు అక్టోబర్ 26వ తేదీన ప్రకటించిన అధ్యక్షుడు సిరిసేన..కొద్ది రోజుల్లోనే మాజీ అధ్యక్షుడు రాజపక్సను ప్రధానిగా నియమిస్తూ వివాదాస్పద నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రధాని నివాసం ఎదుట ఆందోళనకు దిగిన విక్రమసింఘే మద్దతుదారులు విక్రమసింఘే, సిరిసేన, రాజపక్స -
శ్రీలంక పార్లమెంటు రద్దు
కొలంబో: శ్రీలంకలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం ముదురుతోంది. రణిల్ విక్రమసింఘేను శుక్రవారం ప్రధాని పదవి నుంచి దించేసిన ఆ దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, శనివారం శ్రీలంక పార్లమెంటును తాత్కాలికంగా రద్దు చేశారు. బలనిరూపణ కోసం అత్యవసరంగా పార్లమెంటును ఆదివారం సమావేశపరచాలని రణిల్ విక్రమసింఘే పార్లమెంటు స్పీకర్‌ను శనివారం కోరగా, అందుకు అవకాశం లేకుండా సిరిసేన నవంబరు 16 వరకు పార్లమెంటును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటులో జరిగే బలపరీక్షలో విక్రమసింఘేను ఓడించాలనే లక్ష్యంతోనే అధ్యక్షుడు ఈ చర్యకు దిగినట్లు తెలుస్తోంది. ప్రణాళిక ప్రకారం నవంబరు 5న బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావాల్సి ఉంది. పార్లమెంటును సమావేశపరచాలని విక్రమసింఘే కోరడంతోనే సిరిసేన సమావేశాల ప్రారంభ తేదీని మరో 10 రోజులు వెనక్కు జరిపి, అప్పటివరకు సభను రద్దు చేశారు. శ్రీలంక పార్లమెంటులోని మొత్తం స్థానాల సంఖ్య 225 కాగా, బలనిరూపణలో నెగ్గేందుకు కనీసం 113 మంది సభ్యుల మద్దతు అవసరం. సిరిసేన, కొత్త ప్రధాని మహిందా రాజపక్స పార్టీలు రెండూ కలిసినా వారి బలం 95 మాత్రమే. అటు విక్రమసింఘేకు చెందిన యూఎన్‌పీ (యునైటెడ్ నేషనల్ పార్టీ)కి సొంతంగానే 106 మంది సభ్యులున్నారు. మరికొన్ని చిన్నపార్టీల మద్దతు కూడా ఆయనకు ఉంది. ఈ నేపథ్యంలో నవంబరు 5న పార్లమెంటు సమావేశాలు ప్రారంభిస్తే విక్రమసింఘే సులభంగా బలపరీక్షలో నెగ్గి మళ్లీ అధికారంలోకి వస్తారని సిరిసేన భావించినందునే సమావేశాలను మరో 10 రోజులపాటు వాయిదా వేశారని సమాచారం. ఆలోపు సిరిసేన, రాజపక్సలు మరికొంత మంది సభ్యులను తమవైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారనీ, అందుకే సమావేశాల ప్రారంభ తేదీని నవంబరు 16కు మార్చారని తెలుస్తోంది. అయితే కొత్తగా ప్రధాని మారినందున రాజపక్స వార్షిక బడ్జెట్‌ను కాకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారనీ, ఆ బడ్జెట్ రూపకల్పనకు సమయం పడుతుంది కాబట్టే పార్లమెంటు సమావేశాలు పదిరోజులు ఆలస్యంగా ప్రారంభమవుతాయనేది రాజపక్స పార్టీ నేతల వాదన. సిరిసేన, విక్రమసింఘేల పార్టీలు సంయుక్తంగా మూడేళ్ల క్రితం అధికారం చేపట్టగా, విభేదాల నేపథ్యంలో తాజాగా సిరిసేన పార్టీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించింది. విక్రమసింఘేను పదవి నుంచి తప్పించిన సిరిసేన, మాజీ అధ్యక్షుడు మహిందా రాజపక్స చేత కొత్త ప్రధానిగా ప్రమాణంచేయించడం తెలిసిందే. కావాలనే సిరిసేన దేశంలో కృత్రిమ రాజకీయ సంక్షోభం సృష్టిస్తున్నారనీ, పార్లమెంటును సమావేశపరిస్తే ఆ వెంటనే ఈ సంక్షోభం సమసిపోతుందని విక్రమసింఘే అన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ రాజపక్స, సిరిసేనల పార్టీలు కలిసి విక్రమసింఘేపై అవిశ్వాస తీర్మానం పెట్టగా, అప్పటి బలనిరూపణలోనూ విక్రమసింఘే గెలిచారు. రాజ్యాంగం ప్రకారం నడుచుకోండి.. శ్రీలంకలోని పార్టీలు ఆ దేశ రాజ్యాంగం ప్రకారం నడచుకోవాలనీ, అనవసరంగా హింస, అనిశ్చితిని రేకెత్తించవద్దని పలు దేశాలు కోరాయి. ‘హింసకు దిగకుండా రాజ్యాంగం ప్రకారం నడచుకోవాలని శ్రీలంకలోని పార్టీలను మేం కోరుతున్నాం’ అని అమెరికా విదేశాంగ విభాగం ఓ ప్రకటనలో తెలిపింది. ‘యూరోపియన్ కూటమి రాయబారితోపాటు ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, రొమేనియా, యూకేల రాయబారులు కూడా శ్రీలంకలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. అన్ని పార్టీలూ రాజ్యాంగాన్ని అనుసరించాలి తప్ప హింసను ప్రేరేపించవద్దు’ అని యూరోపియన్ కూటమి ఓ ప్రకటనలో పేర్కొంది. శ్రీలంకలోని బ్రిటిష్ హై కమిషన్ శుక్రవారం ఇలాంటి ఓ ప్రకటన చేసింది. భారత్‌కు ఆందోళనకరమే రాజపక్స శ్రీలంక నూతన ప్రధానమంత్రి గా బాధ్యతలు స్వీకరించడం పొరుగున ఉన్న భారతదేశానికి ఆందోళనకరమేనని చెప్పాలి. చైనా అనుకూలుడిగా పేరు సంపాదించిన ∙రాజపక్స గతంలో అధ్యక్షుడిగా ఉండగా చైనాతో రాసుకుపూసుకు తిరగడం, శ్రీలంకలోని హంబన్‌టోటా పోర్టును చైనాకు దీర్ఘకాలం లీజుకివ్వడం, చైనా ప్రాజెక్టులను అనుమతించడం, చైనా జలాంతర్గాములను తమ సముద్ర జలాల్లో నిలపడానికి అనుమతించడం వంటివి భారత్‌కు కలవరం కలిగించాయి. రాజపక్స తిరిగి అధికారంలోకి వస్తారని భారత్ ఊహిస్తూనే ఉంది. రాజపక్స పునరాగమనంతో శ్రీలంకపై చైనా తన పట్టును మరింత బిగిస్తుందనీ, అది తన భద్రతకు ముప్పుగా మారడమేకాక దక్షిణాసియాలో తన పలుకుబడిని దెబ్బ తీస్తుందని భారత్ ఆందోళన చెందుతోంది. ఆకస్మిక నిర్ణయానికి 3 కారణాలు రాజ్యాంగ విరుద్ధమంటున్న రాజకీయ నిపుణులు శ్రీలంక ప్రధానిగా రణిల్ విక్రమసింఘేను తొలగించి, మహిందా రాజపక్సను అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన నియమించడం వెనుక ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి. వాటిలో మొదటిది విక్రమసింఘే ఢిల్లీలో చేసిన ప్రకటన. గతనెల 20న విక్రమసింఘే ఢిల్లీ వచ్చి ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఆ తర్వాత ఓ ప్రకటన విడుదల చేస్తూ సిరిసేనపై ఆరోపణలు గుప్పించారు. శ్రీలంకలో భారత్ చేపడుతున్న ప్రాజెక్టులు ఆలస్యం కావడానికి సిరిసేననే కారణమని ఆ ప్రకటనలో చెప్పారు. ఇక రెండవ కారణం కోర్టుల్లో నియామకాల కోసం సిరిసేన పంపిన సిఫారసులను విక్రమసింఘే తిరస్కరించడం. శ్రీలంక సుప్రీంకోర్టు, అప్పీల్ కోర్టుల్లో ఖాళీల భర్తీ కోసం ఇద్దరి పేర్లను సిరిసేన సూచించగా, దేశ రాజ్యాంగ మండలి తిరస్కరించింది. దీంతో సిరిసేన ఆగ్రహానికి గురయ్యారు. ఇక మూడో కారణం అధ్యక్షుడిపై జరిగిన హత్యాయత్నాన్ని పోలీసులు, ప్రభుత్వం తీవ్రంగా పరిగణించకపోవడం. సిరిసేన దేశాధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక గతంలో ఓ సారి ఆయనపై హత్యాయత్నం జరిగింది. ఈ కుట్రకు సంబంధించి ఎలాంటి ఆధారాలూ లభించలేదని శుక్రవారమే పోలీసులు ప్రకటించారు. దీంతో తనపై హత్యాయత్నం కేసును పోలీసులు తేలిగ్గా తీసుకున్నారనీ, దీని వెనుక విక్రమసింఘే ఉన్నారని సిరిసేన భావించారు. ప్రధానంగా ఈ మూడు కారణాలతోనే సిరిసేన పార్టీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించి, రాజపక్సతో చేతులు కలిపి ఆయనను ప్రధానిని చేసినట్లు తెలుస్తోంది. 2015లో సిరిసేన నాయకత్వంలోని శ్రీలంక ఫ్రీడం పార్టీ, విక్రమసింఘే అధ్యక్షుడిగా ఉన్న యునైటెడ్ నేషనల్ పార్టీలు కలిసి శ్రీలంకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా, కొంతకాలంగా వివిధ అంశాల్లో వీరిరువురి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతోపాటు ఈ ఏడాది ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికల్లో రాజపక్స నేతృత్వంలోని పార్టీ ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికలను మూడేళ్ల ప్రభుత్వ పాలనపై ప్రజా తీర్పులా చూశారు. ఆ తర్వాత ఇరు పార్టీలు, నాయకుల మధ్య విభేదాలు మరింత ఎక్కువై చివరకు ప్రధానిని మార్చే పరిస్థితికి దారితీసింది. అయితే ప్రధానిని మారుస్తూ సిరిసేన తీసుకున్న నిర్ణయం మాత్రం కచ్చితంగా రాజ్యాంగ విరుద్ధమేనని నిపుణులు పేర్కొంటున్నారు. -
రాఫెల్‌పై విపక్షాల ధర్నా
న్యూఢిల్లీ/రాయ్‌పూర్: రాఫెల్ ఒప్పందంపై ప్రభుత్వం సమాధానం ఇవ్వాలంటూ యూపీఏ చైర్పర్సన్ సోనియా నాయకత్వంలో విపక్ష ఎంపీలు పార్లమెంటు ముందు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ వివాదంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో కాంగ్రెస్ నేతలు ఆజాద్, ఆంటోనీ, ఇతర కాంగ్రెస్ ముఖ్యులు, తృణమూల్, సీపీఐ, ఆప్ సహా పలు పార్టీల ఎంపీలు పాల్గొన్నారు. అటు రాజ్యసభలోనూ కాంగ్రెస్ ఎంపీలు సభా కార్యక్రమాలు ఆటంకం కలిగించారు. ‘ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్ ఇది. రాఫెల్ ఒప్పందంపై ప్రభుత్వం జేపీసీని ఏర్పాటుచేయాలి’ అని నినదించారు. రాఫెల్ ఒప్పందం చర్చల దశలోనే ముగిసిపోతుందని కాంగ్రెస్ ఎంపీ సునీల్ జాఖడ్ అభిప్రాయపడ్డారు. భోపాల్ గ్యాస్ ఉదంతం తర్వాత ఇది అతిపెద్ద మధ్యవర్తిత్వ కేసుగా మిగిలిపోతుందని వ్యాఖ్యానించారు. తనకు చాన్సిస్తే ఇంతకన్నా గొప్పగా రాఫెల్ ఒప్పందాన్ని సిద్ధం చేస్తానన్నారు. అతిపెద్ద కుంభకోణం భారత రక్షణ రంగ చరిత్రలో రాఫెల్ కుంభకోణం అతిపెద్దదని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే బాధ్యుడని ఆయన ఆరోపించారు. ‘మోదీ ఫ్రాన్స్‌కు వెళ్లి, పాత ఒప్పందాన్ని రద్దుచేశారు. భారీ మొత్తంతో కొత్త ఒప్పందం చేసుకున్నారు. ఈ విషయం రక్షణ మంత్రి, కేబినెట్ మంత్రులకు కూడా తెలియదు’ అని చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఆరోపించారు. -
కోర్టులు లక్ష్మణరేఖను దాటవు: సుప్రీం
న్యూఢిల్లీ: ‘న్యాయస్థానాలకు లక్ష్మణ రేఖ ఉంది. దానిని అధిగమించజాలవు. చట్టాలపై తీర్పులు ఇవ్వడం వరకే వాటి బాధ్యత. చట్టాలు చేసే అధికారం పార్లమెంట్‌దే’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్న వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవాలంటూ దాఖలైన పిటిషన్లపై కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఫౌండేషన్ తరఫు లాయరు దినేశ్ ద్వివేది వాదిస్తూ.. ‘నేరారోపణలు ఉన్నవారు రాజకీయాల్లోకి ప్రవేశించకుండా అడ్డుకునేలా పార్లమెంట్ చట్టం చేయడం అసాధ్యం. అందుకే సుప్రీం జోక్యం చేసుకోవాలి’ అని కోరారు. ‘చట్ట సభల సభ్యులపై ఉన్న కేసుల విచారణను సత్వరం చేపట్టేలా చర్యలు తీసుకోగలం. అంతేకానీ, చట్టసభల పరిధిలోని కొన్ని అంశాలపై చట్టాలు చేయాలని ఎన్నికల సంఘాన్ని, పార్లమెంట్‌ను కోరలేమని కోర్టు పేర్కొంది. ఒక వ్యక్తిపై ఆరోపణలు రుజువయ్యే దాకా అతడు నిర్దోషేనని, అలాంటప్పుడు అతడిని పోటీ చేయకుండా అడ్డుకోలేమన్నారు. -
లేటు.. అనే మాటే లేదు!
సాక్షి, హైదరాబాద్ : గోల్డెన్ అవర్.. 60 నిమిషాలు.. రోడ్డుపై తీవ్ర గాయాలపాలై ప్రాణాలతో పోరాడుతున్న క్షతగాత్రులకు అమూల్యమైన సమయం. ఆ వ్యక్తిని గంటలోపు ఆస్పత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తే బతికే అవకాశాలు చాలా ఎక్కువ. మెదడు భద్రంగా ఉండి.. శరీరంలో ఇతర అవయవాలకు తీవ్ర గాయాలైనా 60 నిమిషాల్లో చికిత్స చేస్తే ప్రాణాలతో బయటపడే అవకాశం ఉంది. ఇలా ప్రమాదాల్లో గాయపడిన వారికి సత్వర చికిత్స కోసం ‘మోటారు వాహనాల చట్టం సవరణ బిల్లు–2016’ను కేంద్రం రూపొందించింది. బిల్లు చట్టమై అమల్లోకి వస్తే ప్రాణ నష్టం భారీగా తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే లోక్‌సభలో ఆమోదం పొందిన బిల్లుపై ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో చర్చ జరిగే అవకాశం ఉంది. ఏటా 1.5 లక్షల మంది మృతి దేశంలో ఉగ్రవాదం, వ్యాధులు, ప్రకృతి వైపరీత్యాల కంటే రోడ్డు ప్రమాదాల వల్లే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. 2015లో కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలో ఏటా 1.5 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. చాలా ప్రమాదాల్లో వైద్యం ఆలస్యం కావడం వల్లే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్డు ప్రమాద మృతుల్లో అత్యధికం యువతే కావడం ఆందోళనకరం. దేశానికి ఎంతో విలువైన మానవ వనరులు రోడ్డు ప్రమాదాల వల్ల అసువులు బాయడం దురదృష్టం. పెరుగుతున్న వాహనాలు దేశంలో ఏటేటా వాహనాలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో బైకులు, కార్లు, ఇతర వాహనాలు కలిపి ఇప్పటికే కోటి దాటాయి. మెరుగైన రహదారులు, ఆధునిక వాహనాలు పెరుగుతున్న దరిమిలా రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కొత్త చట్టం అమలుతో రోడ్డు ప్రమాద మరణాల సంఖ్య తగ్గనుంది. 2004లోనే గుర్తించిన వైఎస్ 2004లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అత్యవసర వైద్య చికిత్స కోసం ప్రవేశపెట్టిన 108 పథకం విజయవంతమైంది. రాష్ట్రం, పార్టీలకు అతీతంగా దేశమంతటా దీన్ని అమలు చేయడం ప్రారంభించారు. వైఎస్ స్వతహాగా వైద్యుడు కావడంతో ‘గోల్డెన్ అవర్’ప్రాధాన్యం ఆనాడే గుర్తించగలిగారు. ఈ చట్టం అమల్లోకి వస్తే.. 108 అంబులెన్సుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కొత్త చట్టం ఏం చెబుతోంది? ‘మోటారు వాహన చట్టం సవరణ బిల్లు– 2016’49వ క్లాజులో ‘గోల్డెన్ అవర్’ను ప్రస్తావించారు. చట్టం ప్రకారం.. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఏ ఆస్పత్రిలోనైనా ఉచితంగా చికిత్స అందించాలి. రోడ్డు ప్రమాదాల్లో మరణిం చిన వారికి ప్రస్తుత మోటారు వాహన చట్టం ప్రకారం రూ.25 వేల నష్టపరిహారం ప్రభుత్వం చెల్లిస్తోంది. కొత్త చట్టంతో పరిహారాన్ని రూ.2 లక్షలకు పెంచనున్నారు. ‘గోల్డెన్ అవర్’పదం వినియోగం మనదేశంలో తక్కువేగానీ.. అమెరికా, యూరోప్ లాంటి పాశ్చాత్య దేశాల ప్రభుత్వాలు దీనికి ప్రాధాన్యం ఇస్తాయి. అక్కడ రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని సత్వరం ఆస్పత్రికి తరలించేందుకు ఎయిర్ అంబులెన్సులు అందుబాటులో ఉంటాయి. మన వద్ద 108 సర్వీసులొచ్చాక రోడ్డు ప్రమాద మృతుల సంఖ్య తగ్గింది. మరణాలు తగ్గుతాయి రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారి విషయంలో గోల్డెన్ అవర్ ఎంతో కీలకం. మొదటి 60 నిమిషాల్లో క్షతగాత్రులను ఆస్పత్రికి తీసుకొస్తే రక్తస్రావం ఆపొచ్చు. బీపీని సాధారణ స్థితికి తీసుకురావొచ్చు. గాయాల వల్ల శరీరంలోకి ఇన్ఫెక్షన్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. దీని ప్రాధాన్యాన్ని కేంద్రం గుర్తించడం హర్షణీయం. -డాక్టర్ శ్రీనివాస్, ఎంబీబీఎస్, ఎంఎస్ (ఆర్థో), హుజూరాబాద్ ఏరియా ఆస్పత్రి -
జేసీ దివాకర్ రెడ్డి అలక, రాజీ నామా డ్రామా
-
‘అంతా ఆల్రైట్.. సమయం వచ్చినప్పుడు చెబుతా’
సాక్షి, అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అలక, రాజీ నామా డ్రామాకు తెరపడినట్లయింది. సోమవారం ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబును అమరావతిలో కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సూచన మేరకు సీఎంఓ అధికారులను కలిశానని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ‘ప్రస్తుతం అంతా ఆల్రైట్, రాజీనామాపై సమయం వచ్చినప్పుడు చెబుతాను. ఈ దేశంలో ఎవరి మీద అలగలేం. అలిగితే ప్రయోజనం ఉండదు. పార్లమెంట్‌కు వెళ్లకపోవడానికి నేను అలగడం లాంటిది ఏమి లేదు’ అంటూ పార్లమెంట్‌కు వెళతానంటూ జేసీ హింట్ ఇచ్చారు. కానీ ముఖ్యమంత్రితో ఏం మాట్లాడారో చెప్పడానికి ఆయన నిరాకరించారు. రాజకీయ వాతావరణం బాగాలేదు అన్న మాటకు కట్టుబడి ఉన్నానన్నారు. నరేంద్ర మోదీ ప్రధానిగా ఉన్నంత కాలం పోరాటం చేయాల్సిందేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చెయ్యలేదు కానీ ఇప్పుడు చేస్తానంటే ఎవరూ నమ్ముతారని ఎద్దేవా చేశారు. ప్రజలు సంతోషం కోసమే తన పోరాటమని జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాగా అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా తాను పార్లమెంట్‌కు వెళ్లనని జేసీ పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి జేసీతో మాట్లాడి సర్దిచెప్పారు. అనంతరం జేసీ ఢిల్లీ వెళ్లారు. -
‘అప్పుడు పులి.. ఇప్పుడు పిల్లి’
సాక్షి, హైదరాబాద్ : 15 ఏళ్ల తర్వాత కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే టీఆర్ఎస్ ఎంపీలు మాట్లాడలేక పారిపోయారని కాంగ్రెస్ శాసన మండలి నేత షబ్బిర్ అలీ ఎద్దేవా చేశారు. బీజేపీకి టీఆర్ఎస్ బి టీమ్‌గా మారిందని ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ హక్కుల గురించి టీఆర్ఎస్ పార్లమెంట్లో ఎందుకు పోరాటం చేయడం లేదని ప్రశ్నించారు. ఆ పార్టీ రహస్య ఎజెండా ఏంటో, కేంద్రం వద్ద ఎందుకు లాలూచీ పడుతుందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలుగు తల్లిని ముక్కలు చేశారన్న ప్రధాన మంత్రి మాటలను టీఆర్ఎస్ ఎంపీలు ఖండించకపోవడం సిగ్గుచేటన్నారు. అవిశ్వాస తీర్మాన సమయంలో పార్లమెంట్లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదని ఆరోపించారు. ఏపీ గురించి కాకపోయినా కనీసం తెలంగాణ హక్కుల గురించి మాట్లాడితే పోయేది ఏముందని ప్రశ్నించారు. టీఆర్ఎస్కు పది సీట్లు కూడా రావు కేసీఆర్ ప్రభుత్వంలోకి వచ్చి నాలుగేళ్లయినా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని షబ్బిర్ అలీ ఆరోపించారు. 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం,గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు హామీలను కేంద్రం నుంచి రాబట్టడంలో విఫలమయ్యారన్నారు. ప్రజల్లో టీఆర్ఎస్పై వ్యతిరేకత పెరిగిందని, రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి పది సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. డి. శ్రీనివాస్ కాంగ్రెస్‌లో పులిలా బతికారని ఇప్పుడు పిల్లికన్నా హీనమయ్యారని ఎద్దేవా చేశారు. ఎంపీ కవితకు నిజామాబాద్ లో తిరిగే పరిస్థితులు లేవని షబ్బిర్ అలీ వ్యాఖ్యానించారు. -
‘ఆ మాటలను వెంటనే వాపసు తీసుకోవాలి’
సాక్షి, హైదరాబాద్ : పార్లమెంట్లో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ అమరవీరులను అవమానించేలా ఉన్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆరోపించారు. రాష్ర్ట విభజన అనైతికం అనే వ్యాఖ్యలు వెంటనే వాపసు తీసుకోని, వివరన ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్లో మోదీ స్పీచ్ 2019 ఎన్నికల స్పీచ్‌లా ఉందని ఎద్దేవా చేశారు. దేశంలో ఉన్న అనేక సమస్యలు, 2014లో మోదీ ఇచ్చిన హామీ అంశాలు ప్రస్తావించలేదని ఆరోపించారు. రెండు కోట్ల ఉద్యోగాలు, బుల్లెట్ ట్రైన్ గురించి మోదీ మాట్లడం మరిచారని విమర్శించారు. రాహుల్ గాంధీ పరిణితి చెందిన రాజకీయాలు చేస్తారన్నారు. నిజాలను పార్లమెంట్ వేదికగా ప్రజలముందు ఉంచిన నాయకుడు రాహుల్ గాంధీ అని కొనియాడారు. విభజన హామీలను సాధించడంలో చంద్రబాబు, కేసీఆర్ విఫలం అయ్యారని విమర్శించారు. -
రాజ్యసభకు కొత్తగా నలుగురు
న్యూఢిల్లీ/భువనేశ్వర్: ఇటీవల ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ నామినేటెడ్ స్థానాలు భర్తీ అయ్యాయి. ఆరెస్సెస్ సిద్ధాంతకర్త రాకేశ్ సిన్హా, లోక్‌సభ మాజీ సభ్యుడు రామ్ సకల్, సంప్రదాయ నృత్యకారిణి సోనాల్ మాన్సింగ్, శిల్పి రఘునాథ్ మహాపాత్రోలు రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ప్రభుత్వ సలహా మేరకు రాష్ట్రపతి కోవింద్ వీరిని ఎగువ సభకు నామినేట్ చేసినట్లు ప్రధాని కార్యాలయం(పీఎంవో) ప్రకటించింది. ఇటీవలే పదవీకాలం ముగిసిన క్రీడాకారుడు సచిన్, నటి రేఖ, న్యాయవాది పరాశరణ్, సామాజిక కార్యకర్త అను ఆగాల స్థానంలో వీరిని ఎంపికచేశారు. వీరి పదవీకాలం 2024లో ముగుస్తుంది. రామ్ సకల్: యూపీలోని రాబర్ట్స్‌గంజ్ నియోజక వర్గం నుంచి 3సార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఎంపీగా రామ్ సకల్ దళితులు, రైతులు, కార్మికుల సంక్షేమం కోసం పోరాడారని పీఎంవో కొనియాడింది. రాకేశ్ సిన్హా: ఆరెస్సెస్ సిద్ధాంతకర్త అయిన సిన్హా ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న మేధో సంస్థ ‘ఇండియా పాలసీ ఫౌండేషన్’ని స్థాపించారు. ఢిల్లీ వర్సిటీ అనుబంధ కళాశాల మోతీలాల్ నెహ్రూ కాలేజ్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ (ఐసీఎస్ఎస్ఆర్)లో సభ్యుడిగా కొనసాగుతున్నారు. రఘునాథ్ మహాపాత్రో: 1959 నుంచి శిల్పకళలో విశేష కృషి చేస్తూ అంతర్జాతీయంగా పేరుప్రఖ్యాతులు సంపాదించారు. పూరీజగన్నాథ ఆలయ సుందరీకరణలో పాలుపంచుకున్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లోని ఆరు అడుగుల సూర్య భగవానుడి రాతి శిల్పం ఈయన సృష్టే. పద్మశ్రీ, పద్మ భూషణ్ పురస్కారాలు లభించాయి. సోనాల్ మాన్సింగ్: ఆరు దశాబ్దాలుగా భరతనాట్యం, ఒడిస్సీ కళారూపాల్లో సేవలందిస్తున్నారు. వక్త, సామాజిక కార్యకర్త కూడా అయిన ఈమె పద్మ విభూషణ్ పురస్కారం పొందారు. -
‘చట్టసభల్లోకి వెళ్తెనే బీసీలకు న్యాయం’
సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయ అధికారంతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని హైకోర్టు రిటైర్డ్ జడ్జి, జాతీయ బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య అన్నారు. చట్టసభల్లోకి వెళితేనే సమన్యాయం జరుగుతుందని పేర్కొనారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన ఓబీసీ జాతీయ జాయింట్ కమిటీ సమావేశంలో 27 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. జస్టిస్ ఈశ్వరయ్యను జాతీయ ఓబీసీ యాక్షన్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ.. జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సామాజిక, రాజకీయ, ఆర్థిక న్యాయం, సమానత్వం రావాలంటే పార్లమెంట్, అసెంబ్లీలో కూడా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఓబీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, క్రిమీలేయర్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఓటర్ల గణన శాస్త్రీయంగా జరగలేదని, పంచాయతీ రాజ్ ఎన్నికలవరకల్లా సమగ్ర కుటుంబ సర్వేను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఓబీసీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు యాక్షన్ కమిటీ కృషిచేస్తుందని పేర్కొన్నారు. యాక్షన్ కమిటీకి తోడుగా మండల స్థాయివరకూ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీ, పార్లమెంట్, కోర్టుల్లో ప్రజాస్వామ్యం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటును అమ్ముకోకుండా, ప్రలోభాలకు లొంగకుండా బీసీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. -
జపాన్ ఎగువసభలో గంజాయి మొక్కలు!
టోక్యో: జపాన్‌లోని ఎగువసభ భవనం ఆవరణలో గంజాయి మొక్కలు కనిపించటంతో కలకలం చెలరేగింది. గురువారం ఓ సందర్శకుడు నాలుగు గంజాయి మొక్కలను గమనించి, అధికారులకు సమాచారం అందించాడు. ఈ ఘటనపై టోక్యో మెట్రోపాలిటన్ గవర్నమెంట్‌కు ఫిర్యాదు చేసినట్లు ఎగువసభ భవనం నిర్వహణాధికారి తెలిపారు. మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్న జపాన్ గంజాయి వాడారన్న కారణంతో గతంలో పలువురు సుమో రెజ్లర్లను, కళాకారుల్ని, విద్యార్థుల్ని అరెస్ట్ చేసింది. -
మెరుపులు.. మరకలు..
‘అచ్ఛేదిన్’(మంచి రోజులు) వచ్చేశాయా? ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ (అందరినీ కలుపుకొని అందరి అభ్యుదయం కోసం) అనే నినాదం అమలు జరుగుతోందా? నరేంద్రమోదీ ఉపన్యాస కేసరేనా, కార్యశూరుడు కూడానా? అంతకు ముందు సమాజం ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? ప్రజల బతుకులు బాగుపడినాయా? ‘న ఖావూంగా, న ఖానేదూంగా’(తిననూ, తిననివ్వనూ) అంటూ మోదీ ఎన్నికల ప్రచారంలో చేసిన భీకర ప్రతిజ్ఞ మాటలకే పరిమితమైనదా? చేతలలో ఏమైనా కనిపించిందా? శాంతిభద్రతలు మెరుగైనాయా, క్షీణిం చాయా? నల్లధనం ప్రభావం తగ్గిపోయిందా? అన్నట్టు, స్విస్ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనం వాపసు తీసుకొని వచ్చి ప్రతి పౌరుడి ఖాతాలో రూ. 15 లక్షల వంతున జమచేశారా? ఇటువంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకోవలసిన సందర్భం ఇది. మోదీ ప్రధానిగా 2014 మే 26న బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎన్నికల ప్రణాళికలో చేసిన వాగ్దానాలలో ఎన్ని నెరవేర్చగలిగారో, ఎన్ని అమలు చేయలేకపోయారో సమీక్షించుకోవలసిన సమయం. ఎన్నికల సంవత్సరంలో ప్రవేశించారు కనుక మోదీ వాగ్దానం చేసినట్టు ప్రజ లకు నివేదించడానికి సాఫల్యవైఫల్యాల పట్టికను సిద్ధం చేసుకోవాలి. మోదీ సాధించిన విజయాలు ఏమిటి? ఆయనకు ఎదురైన అపజయాలు ఏమిటి? ప్రయత్నించి విఫలమైనవి ఎన్ని? అసలు ప్రయత్నం కూడా చేయని శుష్కవాగ్దానాలు ఎన్ని? సమీక్షాసమయం నాలుగేళ్ళ ఎన్డీఏ పాలనపైన కొన్ని రోజులుగా వార్తాపత్రికలలో, టీవీ న్యూస్ చానళ్ళలో చర్చ జరుగుతోంది. అద్భుతమైన విజయాలంటూ ఆకాశానికి ఎత్తేవారూ, దారుణమైన వైఫల్యాలు అంటూ తీసిపారేసేవారూ కనిపించారు. సహేతుకంగా, బాధ్యతాయుతంగా వక్రీకరించని వాస్తవాలు మాత్రమే మాట్లాడేవారి సంఖ్య తక్కువ. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా దేశం నాలుగు చెరగులా అత్యంత ప్రభావవంతమైన ప్రచారం చేసి లోక్‌సభ ఎన్నికలలో ఘనవిజయం సాధించిన తర్వాత మోదీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత చెప్పుకోదగిన అంశాలలో ప్రధానమైనది సుస్థిర ప్రభుత్వం, పారదర్శక పరిపాలన అందించడం. అవినీతి ఆరోపణలు లేకుండా కేంద్ర ప్రభు త్వం నిలబడటం కూడా విశేషమే. 2004 నుంచి 2009 వరకూ మన్మోహన్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వంపైన కూడా చెప్పుకోవలసిన అవినీతి ఆరోపణలు లేవు. 2009–2014లో కుంభకోణాలు ఒకదాని వెంట ఒకటి వెలుగులోకి వచ్చి యూపీఏ–2ని భ్రష్టుపట్టించి బీజేపీ విజయానికి సోపానాలైనాయి. ఆర్థికంగా అద్భుతాలు సాధించకపోయినా మోదీ హయాంలో ప్రగతి కుంటుబడలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ పెరుగుదల 7.5 శాతం. అత్యంత వేగంగా ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న దేశంగా భారత్ ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. ఇంతవరకు ఏ ప్రధానీ పర్యటించనన్ని దేశాలను మోదీ నాలుగేళ్ళలో చుట్టివచ్చారు. విదేశాలలో స్థిరబడిన భారతీయులను ఉద్దేశించి (న్యూయార్క్ స్క్వేర్ వగైరాలు) ప్రసంగించడం ద్వారా కొత్తరకం దౌత్యనీతిని ఆరంభిం చారు. అంతర్జాతీయరంగంలో భారత్ ప్రతిష్ఠ పెరిగిందని బీజేపీ నాయకులు చెబుతున్నారు. అంతర్జాతీయ వేదికపైన మోదీ ఆత్మవిశ్వాసంతో వ్యవహరించడం, అగ్రశ్రేణి ప్రపంచ నాయకులకు సమఉజ్జీగా కనిపించడం, వారిని ఆలింగనం చేసుకోవడం చూస్తున్నాం. అయితే, క్షేత్రంలో మాత్రం గుణాత్మకమైన మార్పులు కనిపించడం లేదు. చైనాతో సంబంధాలు వృద్ధి చెందకపోగా క్షీణించాయి. చైనాకు ఒక్క భారత్‌తోనే సరిహద్దు వివాదాలు ఉన్నాయి. రష్యా, వియత్నాం, తదితర దేశాలతో సమస్యలు పరిష్కరించుకున్నది. భారత్‌తో విరోధం కొనసాగిస్తున్న పాకిస్తాన్‌కు అన్నివేళలా సైనికంగా, ఆర్థికంగా, దౌత్యపరంగా అండగా నిలబడుతోంది. భారత్, పాక్‌ల మధ్య విభేదాలను పరిష్కరించడానికి అవసరమైన శక్తి, మధ్యవర్తిత్వం నెరపగలిగిన పెద్దరికం ఉన్నప్పటికీ రెండు దేశాల మధ్యా పగల కుంపటిని రగిలిస్తున్నదే కానీ ఆర్పివేసే ప్రయత్నం చేయడంలేదు. కశ్మీర్లోకి ఉగ్రవాదులను పంపుతున్న పాకిస్తాన్‌పైన సర్జికల్ స్ట్రయిక్స్ (మెరుపుదాడులు) నిర్వహించామని మోదీ ప్రభుత్వం అట్టహాసంగా ప్రకటనలు చేసింది. పాక్ మాత్రం అటువంటి దాడులేవీ జరగలేదని స్పష్టంగా ప్రకటించింది. మొత్తంమీద పాకిస్తాన్‌కు చైనా దగ్గరైనకొద్దీ ఇండియా అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లతో రక్షణ సంబంధాలు విస్తరించుకుంటున్నది. చైనాతో సఖ్యత ఉంటే ప్రాక్, పశ్చిమ దేశాలతో అంతటి వ్యూహాత్మక స్నేహం ఇండియాకు అక్కర ఉండదు. పొరుగున ఉన్న చైనాతోనూ, పాకిస్తాన్‌తోనూ సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు మోదీ తలపెట్టిన గట్టి చర్య అంటూ ఏదీ లేదు. వాజపేయిలాగా విశేషమైన చొరవ, రాజనీతిజ్ఞత మోదీ ప్రదర్శించలేకపోయారు. బంగ్లాదేశ్‌తో సంబంధాలు మెరుగుపడినట్టు భావించవచ్చు. శుక్రవారం కోల్‌కతా శాంతినికేతన్లో సమావేశమైన బంగ్లా ప్రధాని హసీనా, మోదీ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీల మధ్య కని పించిన స్నేహపూరిత వాతావరణమే అందుకు నిదర్శనం. నేపాల్, శ్రీలంకలపైన చైనా ప్రభావాన్ని తగ్గించడంలో మోదీ చెప్పుకోదగిన విజయం సాధించలేకపోయారు. కానీ నెహ్రూ తర్వాత విదేశీ వ్యవహారాలలో అత్యంత ఆసక్తి, చొరవ ప్రదర్శించిన ప్రధానిగా మోదీ చరిత్రలో నిలిచిపోతారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత పలు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలూ జరిగాయి. చాలా రాష్ట్రాలలో బీజేపీ గెలుపొందింది. స్పష్టమైన మెజారిటీ రాని రాష్ట్రాలలోనూ ప్రభుత్వాలు ఏర్పాటు చేసి పాగా వేసింది. కర్ణాటకలో సైతం అతిపెద్ద పార్టీగా అవతరించింది. సర్వేలు ఏమంటున్నాయి? ప్రస్తుతం దేశప్రజల నాడి ఎట్లా ఉన్నదో కనుక్కోవడానికి టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్‌లోని తొమ్మిది సంస్థలు కలసి మెగా టైమ్స్ ఆన్లైన్ సర్వే చేశాయి. జనహృదయం ఏమంటున్నదో తెలుసుకునేందుకు లోక్‌నీతి–సీఎస్డీఎస్ సర్వే జరిపింది. రెండు సర్వేల ఫలితాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. అది వేరే విషయం. టైమ్స్ గ్రూప్ సర్వేక్షకులు ప్రశ్నించినవారిలో 73 శాతం మందికి పైగా ఎన్డీఏని 2019లోనూ గెలిపిస్తామని చెప్పారు. మోదీని 71.9 శాతం మంది ఆమోదిస్తున్నారనీ, రాహుల్ నాయకత్వాన్ని కేవలం 11.93 శాతం మంది అపేక్షిస్తున్నారనీ తేల్చింది. లోక్‌నీతి–సీఎస్డీఎస్ సర్వే ప్రకారం మోదీకి ఆమోదం రేటు 39 శాతానికి పడిపోయింది. 47 శాతం మంది మోదీని నిర్ద్వం ద్వంగా వ్యతిరేకిస్తున్నారు. 2014లో కేవలం 16 శాతం మంది రాహుల్‌గాంధీని ప్రధానిగా చూడాలని కోరుకుంటే ఇప్పుడు అటువంటివారి శాతం 24కి పెరిగింది. కాంగ్రెస్‌కు మద్దతు పెరిగింది. మోదీ ప్రాబల్యం తగ్గుతోందని రాజ కీయ ప్రవీణులందరూ అంగీకరిస్తున్నారు. కానీ ఇప్పటికీ ఎక్కువ జనాకర్షణశక్తి కలిగిన నాయకుడు మోదీ అన్న విషయం కూడా నిజమే. కర్ణాటక ఎన్నికలలో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించడానికి మోదీ ప్రచారమే కారణం. మోదీతో, బీజేపీతో సైద్ధాంతిక విభేదాలు కలిగినవారు సైతం కాదనలేని వాస్తవం ఇది. ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రప్రథమంగా పార్లమెంటు భవనంలో అడుగుపెడుతున్న సమయంలో మెట్లకు మోదీ ప్రణమిల్లారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల గౌరవం చాటుకున్నారు. కానీ ప్రజాస్వామ్య సంస్థలను బలోపేతం చేయడానికి ఆయన చేసింది ఏమీ లేదు. నాలుగేళ్ళ కిందట లోక్‌పాల్ చట్టం చేసినప్పటికీ ఇంతవరకూ లోక్‌పాల్‌ను నియమించలేదు. పార్లమెంటు సమావేశాలలో ప్రతిష్టంభనను పరిష్కరించే అవకాశం ఉన్నా అటువంటి ప్రయత్నమే చేయలేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో అధికార పార్టీలు ఫిరాయింపులను ప్రోత్సహించినా, అలాంటివారికి మంత్రిపదవులు కట్టిపెట్టినా, తెలంగాణ ఎంఎల్ఏని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తరఫున టీడీపీ శాసనసభ్యుడు నగదు చెల్లించి కొనుగోలు చేస్తూ పట్టుబడినా, తెలంగాణ ఎంఎల్ఏతో చంద్రబాబు మొబైల్లో మాట్లాడుతూ దొరికిపోయినా ప్రధాని మిన్నకున్నారే కానీ ఆక్షేపించలేదు. ఈ విషయాలు తనకు సంబంధం లేనివి అన్నట్టు వ్యవహరిం చారు. ముగ్గురు వైఎస్ఆర్సీపీ ఎంపీలు పార్టీ ఫిరాయించారనీ తెలుపుతూ, వారిపైన అనర్హత వేటు వేయాలని అర్థిస్తూ దాఖలు చేసిన అర్జీలు దాదాపు నాలుగేళ్ళుగా సభాపతి సుమిత్రామహాజన్ వద్దనే మగ్గుతున్నాయి. సీబీఐ, ఈడీ వంటి సంస్థలను యూపీఏ ప్రభుత్వం దుర్విని యోగం చేసినట్టే ఎన్డీఏ సర్కార్ కూడా చేస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. గవర్నర్ల వ్యవస్థను స్వప్రయోజనాలకోసం వాడుకోవడానికి సంకోచించరని చెప్పడానికి తాజా ఉదాహరణ కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటుకై మొదటి అవకాశం బీజేపీ నాయకుడు యడ్యూరప్పకు ఇవ్వడం, భంగపడటం. అంతకు ముందు గోవా, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్‌లోనూ మెజారిటీ లేకపోయినా కూటముల సహాయంతో ప్రభుత్వాలు జయప్రదంగా ఏర్పాటు చేయడం. ఉన్నత న్యాయస్థానాలకు న్యాయమూర్తుల నియామకంపైన సుప్రీంకోర్టు కొలేజీయం సిఫార్సులను ఆమోదించకుండా అడ్డుతగలడం. గోరక్షకుల అరాచకాలను అరికట్టకపోవడం. ప్రముఖ జర్నలిస్టు గౌరీలంకేశ్నూ, ఇతర పౌరహక్కుల నాయకులనూ హత్య చేసిన సందర్భాలలోనూ మోదీ మౌనంగా ఉండటం దారుణం. వైఫల్యాలు అనేకం సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో మోదీ చేసిన వాగ్దానాలలో చాలా వరకూ నెరవేరకుండానే మిగిలిపోయాయి. ఉద్యోగ కల్పనలో విఫలమైనారు. ధరలు అదుపు చేయలేకపోయారు. పెట్రోలు, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. అవినీతి నిర్మూలనలోనూ చేసింది ఏమీ లేదు. బ్యాంకులకు వేలకోట్లు కుచ్చు టోపీ పెట్టి విదేశాలకు ఉడాయించిన మాల్యాలనూ, నీరవ్మోదీలనూ, లలిత్మోదీలనూ మోదీ ప్రభుత్వం అసమర్థతకు సాక్షులుగా చూపించవచ్చు. నిర్మలా సీతారామన్‌ను రక్షణ మంత్రి చేయడం ప్రశంసనీయమే. అంతమాత్రాన మహిళా సాధికారతకు చేయవలసిందంతా చేసినట్టు కాదు. యూపీఏ హయాంలో 2010 లోనే రాజ్యసభ ఆమోద ముద్ర వేసిన మహిళారిజర్వేషన్ బిల్లును లోక్‌సభలో మెజారిటీ ఉండి కూడా బీజేపీ ప్రవేశపెట్టలేదు. బీజేపీ పూనుకొని ఉంటే కాంగ్రెస్ కూడా సహకరించేది. బిల్లు చట్టమై 2019 ఎన్నికలలోనే చట్టసభలలో 33 శాతం స్థానాలను మహిళలకు ప్రత్యేకించే అవకాశం ఉండేది. అరాచకశక్తులపైన ఉక్కుపాదం మోపడంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం విఫలమైంది. కూటమి రాజకీయాలకు దేశ ప్రజలు అలవాటు పడ్డారు. ఏదో ఒక జాతీయ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే పర్వాలేదు. యూపీఏ సర్కార్ పదేళ్ళు అధికారంలో ఉంది. ఎన్డీఏ ప్రభుత్వాలను వాజపేయి ఆరేళ్ళకు పైగా నడిపించారు. మోదీ అయిదేళ్ళు పూర్తి చేయబోతున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లతో ప్రమేయం లేకుండా ఫెడరల్ ఫ్రంట్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు ప్రస్తుతానికి పగటి కల. రెండు సర్వేలలో ఒక్కటి కూడా ప్రాంతీయ పార్టీలకు 150 స్థానాల కంటే మించి వస్తాయని చెప్పలేదు. ఒకే రాష్ట్రంలో రెండు ప్రాంతీయ పార్టీల మధ్య పోటీ ఉంటుంది. స్వయంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలం ప్రాంతీయ పార్టీలకు ఉండదు. బీజేపీని నిరోధించేందుకు కాంగ్రెస్ మద్దతుతో మమతా బెనర్జీనో, కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్)నో గద్దెమీద కూర్చోబెట్టినా అది మూణ్ణాళ్ళ ముచ్చటే. ఈ సంగతి కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన చరణ్ సింగ్, చంద్రశేఖర్, దేవెగౌడ, గుజ్రాల్, బీజేపీ సహకారంతో ప్రధాని పదవిని సాధించిన వీపీ సింగ్ నిరూపిం చారు. బీజేపీని ఎట్లాగైనా ఓడించాలనే సంకల్పంతో సిద్ధాం తపరమైన వైరుధ్యాలను పక్కనపెట్టి అత్యవసర కూటమి ఏర్పాటు చేయడం అనర్థదాయకం. బీజేపీ భావజాలానికీ, ఆ పార్టీ వెనుక ఉండి నడిపిస్తున్న సంస్థల కార్యాచరణకూ ప్రత్యామ్నాయంగా నిర్మాణాత్మకమైన భావజాలంతో, పటిష్ఠమైన కార్యాచరణ ప్రణాళికతో కాంగ్రెస్ సహా భావసారూప్యం కలిగిన ప్రతిపక్షాలన్నీ సమైక్యంగా అడుగులేస్తే అర్థవంతంగా ఉంటుంది. ఈ పని ఎన్నికలకు ముందే జరిగితే ఓటర్లకు స్పష్టత ఉంటుంది. అప్పుడైనా, ‘సాఫ్ నియత్, సహీ వికాస్’ (స్వచ్ఛమైన సంకల్పం, నిజమైన అభివృద్ధి) అన్న నినాదంతో రంగంలో దిగుతున్న బీజేపీని ఓడించడం సాధ్యమా? ఈ ప్రశ్నకు సమాధానం బీజేపీ, ప్రతిపక్షాలు వచ్చే ఏడాదిలో వ్యవహరించే తీరుపై ఆధారపడి ఉంటుంది. కె. రామచంద్రమూర్తి -
బీజేపీ ఒకరోజు దీక్ష విజయవంతం
న్యూఢిల్లీ: మలి దశ పార్లమెంట్ బడ్జెట్ కార్యకలాపాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడానికి నిరసనగా అధికార బీజేపీ ఎంపీలంతా దేశవ్యాప్తంగా గురువారం ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ప్రధాని మోదీ తన రోజూవారీ కార్యకలాపాలకు అంతరాయం కలగకుండానే దీక్షలో పాల్గొన్నారు. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా త్వరలో ఎన్నికలు జరగనున్న కర్ణాటకలోని ధార్వాడ్‌లో సీఎం అభ్యర్థి బీఎస్ యడ్యూరప్పతో కలసి పాల్గొన్నారు. డిఫెన్స్ ఎక్స్‌పోకు హాజరైన రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా దీక్ష పాటించారు. కేంద్ర మంత్రులు హర్షవర్ధన్, సురేశ్ ప్రభు, ఎంపీలు మీనాక్షి లేఖి, ప్రవేశ్ వర్మ, ఉదిత్ రాజ్, మనోజ్ తివారీ తదితరులు ఢిల్లీలోని తమతమ నియోజకవర్గాల్లోనే దీక్ష పాటించారు. సాయంత్రం 5 గంటలకు కార్యక్రమం ముగిసింది. -
నిరసనల మధ్యే బిల్లులు ఆమోదం
న్యూఢిల్లీ: వరుసగా తొమ్మిదో రోజు కూడా ప్రతిపక్షాల ఆందోళనలు కొనసాగడంతో ఎలాంటి కార్యకలాపాలు జరగకుండానే పార్లమెంటు ఉభయసభలు శుక్రవారానికి వాయిదాపడ్డాయి. అయితే విపక్షాల నిరసనల మధ్యే లోక్‌సభలో ఎలాంటి చర్చ లేకుండానే మూజువాణి ఓటుతో రెండు బిల్లుల్ని ఆమోదించారు. ఇక రాజ్యసభలో ఆర్థిక బిల్లు, వినిమయ బిల్లుల్ని చర్చకు చేపట్టాలని ప్రయత్నించినా.. ప్రతిపక్షాల గందరగోళంతో సభ ముందుకు సాగలేదు. బ్యాంకింగ్ కుంభకోణంపై ఓటింగ్‌తో కూడిన చర్చకు కాంగ్రెస్, తృణమూల్ సహా ఇతర పార్టీలు పట్టుబట్టగా, ఏపీ ప్రత్యేక హోదాపై వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీలు ఆందోళన కొనసాగించాయి. రిజర్వేషన్ల కోటా పెంచాలంటూ టీఆర్ఎస్, కావేరీ నదీ జలాల నిర్వహణ బోర్డు ఏర్పాటు కోసం అన్నాడీఎంకేలు వెల్‌లోకి వెళ్లి నిరసన తెలిపాయి. నిరసనల మధ్యే లోక్‌సభలో గ్రాట్యుటీ చెల్లింపుల(సవరణ) బిల్లు, ప్రత్యేక పరిహార(సవరణ) బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పార్టీల నిరసనల హోరు మధ్య చర్చ జరిగే అవకాశం లేనందున మూజువాణి ఓటుతో బిల్లులు ఆమోదం పొందినట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. అంతకుముందు ఉదయం గ్రాట్యుటీ చెల్లింపుల బిల్లును కార్మిక శాఖ మంత్రి సంతోశ్ గంగ్వార్ ప్రవేశపెడుతూ.. ఈ బిల్లు ముఖ్యంగా మహిళలతో పాటు ఉద్యోగులందరికీ చాలా ప్రయోజనకరమని పేర్కొన్నారు. ప్రసూతీ సెలవుల్ని కూడా ఉద్యోగి సర్వీసు కాలంలో భాగంగానే ఈ బిల్లు పరిగణిస్తుంది. గ్రాట్యుటీ అవసరమైనప్పుడల్లా చట్ట సవరణ చేయాల్సిన అవసరం లేకుండా కేంద్ర ప్రభుత్వానికి అధికారం కల్పిస్తూ బిల్లును రూపొందించారు. ఈ బిల్లు అమల్లోకి వస్తే 5 ఏళ్లు అంతకంటే ఎక్కువ కాలం ఒక సంస్థలో పనిచేసి రిటైరయ్యే లేదా వైదొలిగే వారు పొందే గ్రాట్యుటీపై రూ.20లక్షల వరకు పన్ను ఉండదు. ప్రస్తుతం రూ.10 లక్షల వరకు గ్రాట్యుటీపై పన్ను మినహాయింపు ఉంది. ఇక ప్రత్యేక పరిహారం(సవరణ) బిల్లు ప్రకారం... అవతలి వ్యక్తి వ్యాపార ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే, నష్ట పరిహారాన్ని కోరే హక్కు కక్షిదారుకు ఉంటుంది. కాగా, విపక్షాల నిరసనలు పెరగడంతో సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. అనంతరం సమావేశమైనా అదే పరిస్థితి ఉండడంతో స్పీకర్ సభను శుక్రవారానికి వాయిదా వేశారు. మూడుసార్లు వాయిదా ఇక రాజ్యసభ ఉదయం 11 గంటలకు సమావేశం కాగానే ప్రతిపక్షాలు తమ నిరసనను కొనసాగించాయి. దీంతో మధ్యాహ్నం 2 గంటలకు, అనంతరం మరో గంటపాటు వాయిదాపడింది. మధ్యాహ్నం 3 గంటలకు సభ భేటీ కాగానే డిప్యూటీ చైర్మన్ కురియన్ మాట్లాడుతూ.. ఆర్థిక బిల్లు, వినిమయ బిల్లు ఆమోదానికి సహకరించాలని ప్రతిపక్షాల్ని కోరారు. విపక్షాలు ఆందోళన కొనసాగించడంతో సభను మర్నాటికి వాయిదా వేశారు. ఆర్థిక బిల్లుపై చర్చ జరగకపోవడానికి ఆందోళన చేస్తున్న సభ్యులదే బాధ్యతని పేర్కొన్నారు. సభ వాయిదాకు ముందు శనగలపై కస్టమ్స్ పన్ను పెంపు నోటిఫికేషన్ ఆమోదం కోసం మంత్రి జైట్లీ తీర్మానం ప్రవేశపెట్టారు. -
వెనుకబడిన జిల్లాలకు బాసటగా..
న్యూఢిల్లీ: అత్యంత వెనకబడ్డ జిల్లాల అభివృద్ధికి పాటుపడటం సామాజిక న్యాయం దిశగా అడుగులు వేయడమేనని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆ క్రమంలో దేశంలోని 115 వెనకబడ్డ జిల్లాల అభివృద్ధి కోసం చట్ట సభ్యులు కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాజకీయాలే సర్వస్వంగా భావించే ఒకప్పటి పరిస్థితి ఇప్పుడు లేదని, ప్రజలకు సాయపడేందుకు వచ్చామా? లేదా అన్నదే ముఖ్యమన్నారు. శనివారం పార్లమెంటు సెంట్రల్ హాలులో నిర్వహించిన ‘వియ్ ఫర్ డెవలప్మెంట్’ సదస్సులో కేంద్ర మంత్రులు, ఎంపీలు, రాష్ట్రాలకు చెందిన శాసన సభ్యుల్ని ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ‘పిల్లలంతా స్కూళ్లకు వెళ్లినప్పుడు అన్ని ఇళ్లకు విద్యుత్ సరఫరా ఉన్నపుడు మాత్రమే సామాజిక న్యాయం దిశగా అడుగులు వేసినట్లుగా భావించాలి. అభివృద్ధిలో వెనకబాటుకు నిధులు లేదా వనరుల కొరతో కారణం కాదు.. పాలనా లోపాల వల్లే ఆ పరిస్థితి కొనసాగుతోంది. అభివృద్ధికి కావాల్సినవి సుపరిపాలన, సమర్థవంతంగా పథకాల అమలు, అంకితభావంతో కార్యక్రమాల్ని నిర్వహించడమే’ అని మోదీ పేర్కొన్నారు. ‘ఒక ఇంట్లో లేక ఊరిలో విద్యుత్ ఉండి పక్కింట్లో, గ్రామంలో లేకపోతే వారూ కరెంటు పొందేలా చూడాలని సామాజిక న్యాయం మనకు బోధిస్తుంది’ అని చెప్పారు. ‘మీరు అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా... ప్రజలకు సాయం చేసేందుకు వచ్చారా? లేదా? అన్నదే అసలు సంగతి. ఎన్ని ఆందోళనలు చేశారు... ఎన్ని సార్లు మీరు జైలు కెళ్లారు? అనేవి 20 ఏళ్లక్రితం ప్రాముఖ్యంగా ఉండేవి. ఇప్పుడు పరిస్థితి మారింది’ అని చెప్పారు. తమ ప్రాంతాల్లో అభివృద్ధి లక్ష్యాల్ని పూర్తి చేసే దిశగా చట్టసభ్యులు పనిచేయాలని మోదీ కోరారు. మళ్లీ మళ్లీ చట్టసభలకు ఎన్నికయ్యే వారిని రాజకీయాలకు అతీతంగా ఓటర్లు చూస్తారని చెప్పారు. ఏడాది కష్టపడితే మెరుగైన ఫలితాలు దేశంలోని వెనకబడ్డ 115 జిల్లాల్లో అభివృద్ధి సాధించినప్పుడే సామాజిక న్యాయం దిశగా అడుగులు వేసినట్లని ప్రధాని పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతో చట్టసభ్యులు నిజాయతీగా ఒక ఏడాది పనిచేస్తే.. గొప్ప మార్పు సాధించవచ్చని, మానవ అభివృద్ధి సూచీలో భారత్ పైకి ఎగబాకుతుందని చెప్పారు. సులువుగా ఫలితాలు రాబట్టేందుకే ప్రభుత్వాలు మొగ్గుచూపుతాయని, అందుకే అభివృద్ధి చెందిన జిల్లాల్లో మరింత మెరుగైన ప్రదర్శన ఉంటే.. వెనకబడిన జిల్లాలు మరింత దిగజారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే వాటిని వెనకబడ్డ జిల్లాలుగా కాకుండా అభివృద్ధిని ఆకాంక్షించే జిల్లాలుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని చెప్పారు. ఈ 115 జిల్లాలకు కలెక్టర్లుగా యువ ఐఏఎస్‌లను నియమించాలని మోదీ కోరారు. ‘ఆ జిల్లాల అధికారులతో సమావేశమైనప్పుడు.. వారిలో 80 శాతం 40 ఏళ్లు పైబడ్డ వారే ఉండడం చూసి ఆశ్చర్యపోయాను. మామూలుగా జిల్లా కలెక్టర్ వయసు 27–30 మధ్యలో ఉంటుంది’ అని అన్నారు. సుపరిపాలనతోనే అభివృద్ధి అందుబాటులో ఉన్న వనరులు, శ్రమ శక్తిని వాడుకుని అంకితభావంతో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని మోదీ అన్నారు. సుపరిపాలన ప్రాముఖ్యత గురించి చెపుతూ.. పేద ప్రాంతాల్లో గ్రామీణ ఉపాధి హామీ పథకం సరిగా అమలు కాలేదని, ధనిక ప్రాంతాల్లో సమర్థంగా అమలైందని.. సుపరిపాలన వల్లే అది సాధ్యమైనట్లు గుర్తించానని ప్రధాని చెప్పారు. పార్లమెంటు సెంట్రల్ హాలులోనే జవహర్ లాల్ నెహ్రూ, బీఆర్ అంబేడ్కర్, సర్దార్ పటేల్ తదితరులు రాజ్యాంగాన్ని సిద్ధం చేశారన్న విషయాన్ని మోదీ గుర్తు చేసుకుంటూ.. అదే హాలులో చట్ట సభ్యులు దేశాభివృద్ధి కోసం సంఘీభావంగా హాజరుకావడాన్ని ఆయన ప్రశంసించారు. వివిధ పార్టీలకు చెందిన పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యులు అభివృద్ధి అంశంపై కలిసి కూర్చోవడం రాష్ట్రాల సమాఖ్య స్ఫూర్తికి సజీవ నిదర్శనమని పేర్కొన్నారు. చట్ట సభ్యులు రాష్ట్ర యంత్రాగానికి చేయూతగా ఉండాలని ఆకాంక్షించారు. -
ఒక దేశం.. ఒకే నీతి!
సాక్షి, న్యూఢిల్లీ: జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాలని.. ‘ఒక దేశం, ఒకే నీతి’ఉండాలని పేర్కొంటూ టీఆర్ఎస్ ఎంపీలు బుధవారం కూడా పార్లమెంటులో ఆందోళన చేశారు. బుధవారం ఉదయం లోక్‌సభ సమావేశం కాగానే.. టీఆర్ఎస్ సభ్యులు జితేందర్‌రెడ్డి, వినోద్‌కుమార్, కవిత, సీతారాం నాయక్, బూర నర్సయ్యగౌడ్, నగేశ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, సీహెచ్ మల్లారెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పసునూరి దయాకర్, బాల్క సుమన్ తదితరులు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. ఇదే సమయంలో వివిధ అంశాలపై ఇతర పార్టీల సభ్యులు కూడా ఆందోళన చేపట్టడంతో.. గందరగోళం నెలకొని సభ వాయిదా పడింది. దాంతో టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటు ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి కొద్దిసేపు ధర్నా చేశారు. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు కూడా ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఇక మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి సభ ప్రారంభమైనా.. టీఆర్ఎస్, వైఎస్సార్‌కాంగ్రెస్, టీడీపీ, ఏఐఏడీఎంకే, శివసేన, కాంగ్రెస్ తదితర పార్టీల సభ్యులు వివిధ అంశాలపై ఆందోళన చేపట్టారు. దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను గురువారానికి వాయిదా వేశారు. కాగా ఆందోళన సందర్భంగా టీఆర్ఎస్ ఎంపీలు మీడియాతో మాట్లాడారు. సామాజిక, ఆర్థిక స్థితిగతుల ఆధారంగా రాష్ట్రాల్లోని ప్రజల అవసరాలు అక్కడి ప్రభుత్వాలకు మాత్రమే తెలుస్తాయని.. అందువల్ల రిజర్వేషన్ల అధికారం రాష్ట్రాలకే ఇవ్వాలని కేకే పేర్కొన్నారు. ‘‘విద్య, ఉద్యోగాల్లో జనాభా ఆధారంగా వారి కి రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వమైనా చేయాలి. లేదా రాష్ట్ర ప్రభుత్వాలకైనా ఆ బాధ్యత ఇవ్వాలి. అత్యవసరం అనుకుంటే రిజర్వేషన్లు పెంచుకోవచ్చని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. దానికి అనుగుణంగా రాష్ట్రంలోని స్థితిగతుల ఆధారంగా రిజర్వేషన్లు పెంచుకొనే అధికారం రాష్ట్రాలకు ఇవ్వాలి..’’అని డిమాండ్ చేశారు. అన్ని రాష్ట్రాలకు ఒకే నీతి ఉండాలి.. రిజర్వేషన్ల చట్టం సెక్షన్ 16(4)కు సవరణలు చేసి జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచుకొనే అవకాశం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాలని టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత జితేందర్‌రెడ్డి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ‘‘దేశంలో ఒక రాష్ట్రానికి ఒక నీతి మరో రాష్ట్రానికి మరో నీతి ఉండకూడదు. సమాఖ్య భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు ఒకే చట్టం ఉండాలి. తమిళనాడులో 69 శాతం, మహారాష్ట్రలో 52 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. అదే మాదిరిగా ఇతర రాష్ట్రాల్లోనూ జనాభా ప్రకారం విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెంచుకొనే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించాలి..’’అని కోరారు. ఇదే విషయమై తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాలు తీర్మానాలు చేసి కేంద్రానికి పంపాయని, కానీ కేంద్రం స్పందించడం లేదని చెప్పారు. రిజర్వేషన్ల పెంపు అధికారాన్ని రాష్ట్రాలకు కల్పించాలన్న డిమాండ్‌తో కేంద్రం దిగి వచ్చే వరకు పోరాడుతామని పేర్కొన్నారు. రిజర్వేషన్ల పరిధిపై నియంత్రణేదీ లేదు రిజర్వేషన్ల పెంపు అధికారం రాష్ట్రాలకే ఉండాలన్నదే టీఆర్ఎస్ ప్రధాన డిమాండ్ అని ఎంపీ కవిత చెప్పారు. దాని కోసం రెండేళ్లుగా పోరాడుతున్నామన్నారు. సుప్రీంకోర్టు చెప్పిన 50 శాతం రిజర్వేషన్ల పరిధి రాజ్యాంగంలో ఎక్కడా లేదని ఆమె పేర్కొన్నారు. రిజర్వేషన్లు పెంచుకోవచ్చని ఉందికానీ ఎక్కడా ఇంత శాతమే రిజర్వేషన్లు ఉండాలని రాజ్యాంగంలో లేదని స్పష్టం చేశారు. కేవలం సుప్రీంకోర్టు ఆదేశాలను సాకుగా చూపుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను నియంత్రించాలని చూస్తోందని.. దీన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. -
రిజర్వేషన్ల అధికారం రాష్ట్రాలకే ఇవ్వాలి
సాక్షి, న్యూఢిల్లీ: రిజర్వేషన్ల అమలుపై పూర్తి అధికారాన్ని రాష్ట్రాలకు కట్టబెట్టేలా ఆర్టికల్ 16 (4)ను సవరించాలంటూ టీఆర్ఎస్ ఎంపీలు మంగళవారం పార్లమెంటులో ఆందోళన చేశారు. వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. అయితే అదే సమయంలో టీఆర్ఎస్తోపాటు వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ, ఏఐఏడీఎంకే, కాంగ్రెస్ పార్టీలు వివిధ అంశాలపై ఆందోళన చేయడంతో గందరగోళం నెలకొంది. దీంతో సభాపతి సుమిత్రా మహాజన్ కొద్దినిమిషాలకే సభను వాయిదా వేశారు. తిరిగి 12 గంటలకు సభ ప్రారంభమైనా ఆందోళనలతో సభాకార్యక్రమాలు స్తంభించాయి. చివరికి సభను బుధవారానికి వాయిదా వేశారు. గాంధీ విగ్రహం వద్ద ధర్నా.. అంతకుముందు ఉదయం 10.30 గంటలకు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఎంపీలు ధర్నా చేశారు. పార్టీ లోక్‌సభాపక్ష నేత జితేందర్‌రెడ్డి, ఎంపీలు వినోద్‌కుమార్, కవిత, బూర నర్సయ్యగౌడ్, బాల్క సుమన్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, నగేశ్, సీతారాం నాయక్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీహెచ్ మల్లారెడ్డి ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీలు మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో బీసీలు, ఎస్టీల రిజర్వేషన్లు పెంచేందుకు వీలుగా కేంద్రం సానుకూలంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాలు రిజర్వేషన్లను 50 శాతానికి మించి పెంచాలనుకున్నప్పుడు.. అందుకు దారితీసే పరిస్థితులను బేరీజు వేయాలన్న సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని ప్రస్తావించారు. ఆ దిశగానే బీసీలు, ఎస్టీల రిజర్వేషన్లపై అధ్యయనం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు కమిషన్లను ఏర్పాటు చేశారని చెప్పారు. ఎస్టీల రిజర్వేషన్‌ను 6 శాతం నుంచి 9.08 శాతానికి పెంచవచ్చని ఒక కమిషన్ సిఫారసు చేసిందని, బీసీ–ఈ కేటగిరీకి అదనంగా 6 శాతం రిజర్వేషన్లు కేటాయించవచ్చని మరో కమిషన్ సిఫారసు చేసిందని వివరించారు. తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. -
వారి ఆదాయ మార్గాలు చెప్పాలి
న్యూఢిల్లీ: ఎన్నికల విధానంలో సంస్కరణలకు బాటలు పరిచే కీలక ఆదేశాలను సుప్రీంకోర్టు జారీ చేసింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులతోపాటు వారి జీవిత భాగస్వాముల ఆస్తులతోపాటు ఆదాయ మార్గాలనూ వెల్లడించాలని కోర్టు తీర్పు వెలువరించింది. ఎన్నికైన ప్రజాప్రతినిధులు, వారి జీవిత భాగస్వాములు, వారిపై ఆధారపడిన ఇతరుల ఆస్తుల వివరాలను ఎప్పటికప్పుడు సేకరించటంతోపాటు ఆస్తులు అకస్మాత్తుగా పెరిగిందీ లేనిదీ పరిశీలించే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్రానికి సూచించింది. ఈ వ్యవస్థ అందజేసిన వివరాలపై ‘సంబంధిత శాసన వ్యవస్థలు’ పరిశీలించి సదరు పార్లమెంటు లేదా శాసనసభల సభ్యులు అర్హులో కాదో నిర్ణయిస్తాయని చెప్పింది. అభ్యర్ధుల ఆస్తుల వివరాలను తెలుసుకోవటం పౌరుల ప్రాథమిక హక్కని తెలిపింది. ఇందుకోసం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని సవరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని పేర్కొంది. దురదృష్టవశాత్తూ ఇటువంటి వాటిపై పార్లమెంట్ కానీ, ఎన్నికల సంఘం కానీ శ్రద్ధ పెట్టటం లేదని పేర్కొంది. పదవీ కాలంలో భారీగా ఆస్తులు పెంచుకునే ఎమ్మెల్యేలు, ఎంపీలపై నిఘా ఉంచే శాశ్వత వ్యవస్థను ఏర్పాటు చేయాలంటూ ‘లోక్ ప్రహరి’ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌పై శుక్రవారం జస్టిస్ జె.చలమేశ్వర్, జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్‌లతో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది. ఆస్తులను అకస్మాత్తుగా పెంచుకున్న ఒక ప్రజాప్రతినిధిపై విచారణ చేపట్టే వీలుండాలన్న పిటిషనర్ వాదనను ఈ సందర్భంగా న్యాయస్థానం తిరస్కరించింది. వ్యక్తులపై చేపట్టే ఇలాంటి దర్యాప్తు రాజకీయ కక్ష సాధింపుగా మారుతుందని వ్యాఖ్యానించింది. ఆస్తులు కూడబెట్టుకునేందుకే ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఎన్నిక కావాలనుకునే వారి కారణంగా రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇటువంటి వాటిని అడ్డుకోకుంటే ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదంలో పడుతుందనీ, మాఫియా పాలనకు ఊతమిచ్చినట్లవుతుందని తెలిపింది. -
తిరుపతి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు నడపాలి
సాక్షి, న్యూఢిల్లీ : తిరుపతిని అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చినా అక్కడి నుంచి విదేశాలకు విమానాలు తిరగడంలేదని వైఎస్సార్సీపీకి చెందిన కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన పార్లమెంట్లో మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమలకు దేశవిదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తుంటారని గుర్తుచేశారు. అంతే కాకుండా రాయలసీమ నుంచి ఉపాధి కోసం ఎంతో మంది గల్ఫ్ దేశాలకు వెళుతున్నారని పేర్కొన్నారు. సాక్షాత్తూ ప్రధానమంత్రి అంతర్జాతీయ వైమానిక సేవలను ప్రారంభించినా అవి అమల్లోకి రాలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తిరుపతి విమానాశ్రయం నుంచి విదేశాలకు ఎయిర్ ఇండియా విమానాలను నడపాలని డిమాండ్ చేశారు. అలాగే కడప ఎయిర్ పోర్టులో రన్‌వే విస్తరణ ఎప్పటిలోగా పూర్తవుతుందో తెలపాలని కోరారు. అత్యంత వెనుకబడిన ప్రాంతమైన కడప విమానాశ్రయ అభివృద్ది పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతి నుండి విదేశాలకు విమానాలు నడపండి -
కొనసాగిన ఆందోళనలు
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై ప్రధాని మోదీ చేసిన కుట్ర ఆరోపణల నేపథ్యంలో వరుసగా మూడో రోజు కూడా లోక్‌సభ, రాజ్యసభ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. ప్రారంభమైన కొద్ది నిమిషాలకే లోక్‌సభలో కాంగ్రెస్ సభ్యులు మోదీ క్షమాపణ చెప్పాలంటూ నినాదాలు ప్రారంభించారు. ఆ సమయంలో మోదీ సభలోనే ఉన్నారు. ఆందోళనలు తీవ్ర రూపం దాల్చటంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు. సభ తిరిగి జీరో అవర్‌తో ప్రారంభమయింది. నిరసన కొనసాగించిన కాంగ్రెస్ ఎంపీలు వెల్‌లోకి దూసుకువచ్చి నినాదాలు చేశారు. తమ నేత మల్లికార్జున ఖర్గేకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేయగా స్పీకర్ స్పందించలేదు. తర్వాత కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే లేచి.. మన్మోహన్‌కు వ్యతిరేకంగా ఓ ఎంపీ చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని కోరగా స్పీకర్ అంగీకరించలేదు. దీంతో కాంగ్రెస్ సభ్యులువాకౌట్ చేశారు. ప్రధాని క్షమాపణ చెప్పరు: మోదీ ఆరోపణలకు నిరసనగా రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యులు ఆందోళన కొనసాగించారు. బుధవారం సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్ సభ్యులు ప్రధాని క్షమాపణ చెప్పాలంటూ నినాదాలు ప్రారంభించారు. వెల్‌లోకి దూసుకొచ్చి గొడవ చేయటంతో చైర్మన్ వెంకయ్య నాయుడు స్పందించారు. సభ లోపల ఆరోపణలు చేయనందున ప్రధాని క్షమాపణలు చెప్పబోరని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సభ్యుల ఆందోళన తీవ్రతరం కావటంతో సభ గురువారానికి వాయిదా పడింది ► అటవీ చెట్ల జాబితా నుంచి వెదురును తొలగిస్తూ చేసిన చట్ట సవరణకు, దేశ భద్రత అవసరాల కోసం స్వాధీనం చేసుకునే స్థిరాస్తులకు ఇచ్చే పరిహారానికి సంబంధించిన స్థిరాస్తి బిల్లుల సవరణలకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. -
పార్లమెంట్లో ఆగని రభస
న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను ఉద్దేశించి ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్లో దుమారం కొనసాగుతోంది. మోదీ వ్యాఖ్యలకు నిరసనగా లోక్‌సభ, రాజ్యసభల్లో సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగింది. దీంతో వరుసగా రెండో రోజూ పార్లమెంట్ కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. సోమవారం ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు నినాదాలతో సభను హోరెత్తించారు. దీంతో సభ వాయిదా పడింది. సభ తిరిగి మొదలైన తర్వాత జీరో అవర్ ప్రారంభమవ్వగానే కాంగ్రెస్, వామపక్షాలు మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ వెల్‌లోకి దూసుకెళ్లాయి. ఈ ఆందోళనల మధ్యే ఐదు బిల్లుల్ని ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది. అనంతరం లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను మంగళవారానికి వాయిదా వేశారు. అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. మోదీ వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ సభ్యులు సభా కార్యక్రమాలు అడ్డుకున్నారు. వెల్‌లోకి దూసుకెళ్లేందుకు వారు ప్రయత్నించడంతో చైర్మన్ సభను మంగళవారానికి వాయిదా వేశారు. అనంతరం ప్రధాన ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ సభకు వచ్చి.. తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, యూపీ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్మౌర్యతో పాటు పార్టీ వైఖరికి నిరసనగా రాజీనామా చేసిన ఎంపీ నానా పటోలే రాజీనామాను కూడా లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదించారు. ప్రధానులకు మ్యూజియం: కేంద్రం దేశానికి విశిష్ట సేవలందించిన ప్రధానులందరికీ ఢిల్లీలోని తీన్‌మూర్తి ఎస్టేట్ సమీపంలో ఓ మ్యూజియంను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు కేంద్ర మంత్రి మహేశ్ శర్మ పార్లమెంటుకు తెలిపారు. దీనివల్ల ఆయా ప్రధానుల జీవనవిధానం, వారి కాలంనాటి పరిస్థితులు తెలుసుకోవచ్చన్నారు. -
పార్లమెంట్ చర్చిస్తుంటే మేం కల్పించుకోవద్దా?
న్యూఢిల్లీ: పార్లమెంట్ చర్చిస్తోందన్న కారణంతో తాము ఫలానా అంశం నుంచి దూరంగా ఉండలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. న్యాయ విచారణ ప్రక్రియలో కోర్టులు పార్లమెంట్ కమిటీల నివేదికలపై ఆధారపడొచ్చా లేక వాటిని ప్రస్తావించొచ్చా అన్న విషయంపై దాఖలైన రెండు పిటిషన్ల విచారణ సందర్భంగా అత్యున్నత ధర్మాసనం గురువారం ఈ విధంగా స్పందించింది. వివాదాస్పద హ్యూమన్ పాపిలోమా వైరస్(హెచ్‌పీవీ) టీకా పరీక్షలను నిర్వహించిన ఔషధ కంపెనీలను తప్పు పడుతూ పార్లమెంట్ స్థాయీ సంఘం 2014లో సమర్పించిన నివేదికను పిటిషన్‌దారులు ప్రస్తావించారు. ‘ న్యాయ సమీక్ష అధికారంలో ఎలాంటి మార్పు లేదు. పార్లమెంట్ చర్చిస్తోంది కదా అని మేం ఆ విషయం నుంచి దూరంగా ఉండలేం. పౌరుల హక్కుల పరిరక్షణకు ముందుకు సాగుతాం. పార్లమెంట్లో చర్చ జరుగుతోంది. కాబట్టి మమ్మల్ని కల్పించుకోవద్దంటే కుదరదు’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం పేర్కొంది. రాజ్యాంగంలోని నిబంధన 142 ప్రకారం తమకు కమిషన్లు ఏర్పాటు చేసి విచారణ జరిపించి, నివేదికలు కోరే హక్కు ఉందన్న సంగతిని బెంచ్ గుర్తుచేసింది. అంతకుముందు, ప్రభుత్వం తరఫున హాజరైన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ స్పందిస్తూ...పార్లమెంట్, పార్లమెంట్ కమిటీల ప్రత్యేకాధికారాలు, శాసన–న్యాయ వ్యవస్థల మధ్య అధికారాల విభజనను ప్రస్తావించారు. -
జపాన్ పార్లమెంట్ రద్దు
టోక్యో: జపాన్ పార్లమెంట్‌ను రద్దు చేస్తూ ఆ దేశ ప్రధాని షింజో అబే గురువారం ఆకస్మిక నిర్ణయం తీసుకున్నారు. ఉత్తర కొరియాతో యుద్ధ వాతావరణం, కొత్త పన్ను విధానం అమలు నేపథ్యంలో పార్లమెంట్‌పై పూర్తి పట్టుకోసం తాజా ఎన్నికలకు అబే పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పేరొందిన జపాన్‌లో అక్టోబర్ 22న ఎన్నికలు జరిగే అవకాశముంది. అబే అధికారిక నిర్ణయాన్ని స్పీకర్ చదివి వినిపించగానే పార్లమెంట్ దిగువ సభ సభ్యులు ఆమోదం తెలిపారు. ‘కఠిన పరీక్ష ఈ రోజే మొదలైంది, ప్రజల ప్రాణాల్ని కాపాడటం కోసమే ఈ ఎన్నిక. అంతర్జాతీయ సమాజంతో కలిసికట్టుగా సాగుతూ.. ఉత్తర కొరియా నుంచి ఎదురయ్యే ముప్పును ఎదుర్కోవాలి. మన పిల్లల భవిష్యత్తు కోసం మనమంతా పోరాడాల్సిన అవసరముంది’ అని అబే పేర్కొన్నారు. ఉత్తర కొరియా విషయంలో అనుసరిస్తున్న దృఢమైన విదేశీ విధానానికి దేశ ప్రజలు మద్దతు ప్రకటించాలని ఆయన కోరారు. ఈ ఎన్నికల్లో షింజో అబే ప్రధాన ప్రత్యర్థిగా టోక్యో గవర్నర్ యురికో కొయికేకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇటీవలే ‘పార్టీ ఆఫ్ హోప్’ పార్టీని స్థాపించిన ఆమె అబేకు గట్టి సవాలు విసురుతున్నారు. అయితే ప్రస్తుతం జపాన్‌లో ప్రతిపక్షం బలహీనంగా ఉన్నందున దాన్ని అవకాశంగా మలచుకునేందుకే పార్లమెంట్‌ను రద్దు చేశారని భావిస్తున్నారు. -
జర్మనీ చాన్స్‌లర్‌గా మెర్కెల్!
సాక్షి నాలెడ్జ్ సెంటర్: ఐరోపాలో అతిపెద్ద దేశమైన జర్మనీ పార్లమెంటులో దిగువ సభ బుందేస్టాగ్‌కు ఆదివారం ఎన్నికల పోలింగ్ ముగిసింది. ప్రస్తుత చాన్స్‌లర్ ఏంజిలా మెర్కెల్ (63) వరుసగా నాలుగోసారి అధికారం చేపడతారని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. అలాగే ఇస్లాంను, వలసలను వ్యతిరేకించే ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ (ఏఎఫ్‌డీ) పార్టీ తొలిసారిగా బుందేస్టాగ్‌లో అడుగుపెట్టనుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా పోటీచేసిన సోషల్ డెమొక్రాటిక్ పార్టీ(ఎస్పీడీ) ప్రస్తుత పాలక కూటమిలో భాగస్వామిగా ఉండటం విశేషం. జర్మనీలో రెండు ప్రధాన రాజకీయపక్షాలైన క్రిస్టియన్ డెమొక్రాటిక్ యూనియన్ (సీడీయూ), ఎస్పీడీ కలిసి ప్రభుత్వాన్ని నడిపితే దాన్ని ‘మహా సంకీర్ణం’ (గ్రాండ్ కొయెలేషన్) అని పిలుస్తారు. ప్రస్తుత మహాసంకీర్ణం సజావుగా నడవడం లేదనీ, భవిష్యత్తులో దీనిని కొనసాగించకూడదని భావించిన ఎస్డీపీ ఈ ఎన్నికల్లో అధికారం కోసం సొంతంగా పోటీపడింది. చాన్స్‌లర్ పదవికి ఎస్పీడీ అభ్యర్థిగా 61 ఏళ్ల మార్టిన్ షూల్జ్ రంగంలోకి దిగారు. ఐరోపా కూటమి పార్లమెంటు అధ్యక్షునిగాను 2012, 2014లో షూల్జ్ ఎన్నికయ్యారు. ప్రతి నాలుగేళ్లకు ఓసారి బుందేస్టాగ్‌కు ఎన్నికలు జరుగుతాయి. తాజా ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం మెర్కెల్ పార్టీకి 32.5–33.5 శాతం, ఎస్పీడీకి 20–21%, ఏఎఫ్‌డీకి 13–13.5% ఓట్లు వచ్చాయి. 2005లో తొలిసారిగా ఏంజిలా చాన్స్‌లర్ పదవి చేపట్టారు. ఆమె నాయకత్వంలోని క్రిస్టియన్ డెమొక్రాటిక్ యూనియన్(సీడీయూ)–క్రిస్టియన్ సోషల్ యూనియన్(సీఎస్‌యూ) కూటమి 2009, 2013 ఎన్నికల్లో ఆధిక్యం సాధించడంతో పన్నెండేళ్లుగా ఏంజిలానే చాన్స్‌లర్ పదవిలో కొనసాగుతున్నారు. ఈసారి గెలిస్తే 16 ఏళ్లు అధికారంలో ఉండి, హెల్ముల్ కోల్ రికార్డును మెర్కెల్ సమం చేస్తారు. రెండు ఓట్లు–దామాషా పద్ధతి! జర్మనీలో ఓటు హక్కు కలిగినవారు ఆరు కోట్ల పదిహేను లక్షలమంది ఉన్నారు. బుందేస్టాగ్‌లో మొత్తం 598 మంది సభ్యులుంటారు. అందులో సగం మంది సభ్యులను(299 మంది) అంతే సంఖ్యలో ఉండే నియోజకవర్గాల నుంచి ఎన్నుకుంటారు. మిగిలిన సగం సభ్యులను నైష్పత్తిక ప్రాతినిధ్య విధానం(దామాషా పద్ధతి) ద్వారా ఎంపిక చేస్తారు. పోలింగ్ రోజు ప్రతి ఓటరూ రెండు ఓట్లు వేస్తారు. ఒక ఓటు బుందేస్టాగ్‌లో తమ నియోజకవర్గ ప్రతినిధికి, రెండో ఓటు తమ కిష్టమైన రాజకీయ పార్టీకి వేసే హక్కు పౌరులకు ఉంది. మొదటి ఓటు ద్వారా 299 మంది బుందేస్టాగ్ సభ్యులు ఆయా నియోజకవర్గాల నుంచి ఎన్నికవుతారు. రెండో ఓటు ద్వారా మిగిలిన సగం మందిని దామాషా పద్ధతిలో ఎన్నుకుంటారు. కనీసం 5 శాతం ఓట్లు దక్కించుకున్న ప్రతి రాజకీయపక్షం అదే నిష్పత్తిలో సభ్యులను (299లో వాటా కింద) బుందేస్టాగ్ సభకు నామినేట్ చేసుకుంటుంది. 5% ఓట్లు కూడా రాని పార్టీకి ఈ పద్ధతిలో సభ్యులను పంపే అర్హత ఉండదు. -
ఐదులక్షల మందితో పార్లమెంటు ముట్టడిస్తాం
తిరువొత్తియూరు: రైతు సమస్యలపై కేంద్ర ప్రభుత్వం పరిష్కారం చేయని పక్షంలో నవంబర్ 20న ఐదు లక్షల మంది రైతులతో కలిసి పార్లమెంటు ముట్టడి చేయనున్నట్టు రైతు సంఘాల అధ్యక్షుడు అయ్యాకన్ను తెలిపారు. నదులను అనుసంధానించాలని, రైతుల డిమాండ్లను నెరవేర్చాలని జాతీయ దక్షిణ భారత నదుల సంధానం రైతుల సంఘం అధ్యక్షుడు అయ్యాకన్ను నేతృత్వంలో తమిళనాడు రైతులు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో తిరుచ్చిలో జరిగిన ఓ కార్యక్రమానికి శుక్రవారం హాజరైన అయ్యాకన్ను పత్రికల వారితో మాట్లాడుతూ 41 రోజులుగా నిరవధిక ఆందోళన చేస్తున్నామని రెండవ ఘట్టంగా రోజూ ఒక్కో విధానంలో జంతర్‌మంతర్ వద్ద ఆందోళన చేస్తున్నామని ఈ ఆందోళనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెవిన పడలేదని ఈ చర్య వలన దేశానికి వెన్నముకగా పిలవబడే రైతులు మోసపోయినట్టు తెలిపారు. ఈ కారణంగా తమిళనాడు రైతులు, ఉత్తర రాష్ట్రాలకు చెందిన రైతులతో కలిపి ఐదు లక్షల మందితో నవంబర్ 20వ తేదీన పార్లమెంటు శీతాకాల సమావేశం ప్రారంభం రోజున ముట్టడి చేయనున్నట్టు తెలిపారు. -
పార్లమెంట్లో ‘దంగల్’ ప్రదర్శన
న్యూఢిల్లీ: ఆమిర్‌ఖాన్ హీరోగా నిర్మించిన 'దంగల్' సినిమాను గురువారం లోక్‌సభలోని బాలయోగి ఆడిటోరియంలో ప్రదర్శించనున్నారు. పార్లమెంట్ సభ్యులకు ‘దంగల్’ సినిమా చూపించనున్నారు. బుధవారం లోక్‌సభలో స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈ విషయం తెలిపారు. తన అభ్యర్థన మేరకు ఎగువ, దిగువ సభ సభ్యులందరికీ మార్చి 23వ తేదీన ప్రదర్శించనున్నారని వివరించారు. వినోదంతో పాటు మహిళా సాధికారిత, హక్కులపై సభ్యులను మరింత జాగృతులను చేసేందుకు ఈ సినిమా ఉపయోగపడుతుందని తాను భావిస్తున్నానన్నారు. లోక్‌సభ సెక్రటేరియట్‌లోని సంక్షేమ విభాగం నేతృత్వంలో చేపట్టే ఈ కార్యక్రమానికి సభ్యులంతా తమ జీవిత భాగస్వాములతో కలసి రావాలని కోరారు. ఓ కుస్తీయోధుడు తన ఇద్దరు కుమార్తెలకు శిక్షణ ఇచ్చి వారిని విజయపథం వైపు ఎలా నడిపించారనేది ఈ సినిమా కథ. కాగా గత ఏడాది 'చాణక్య' సినిమాను ప్రదర్శించారు. -
వర్గీకరణ సాధించే వరకు పోరాటం
కాల్వశ్రీరాంపూర్: ఎస్సీ వర్గీకరణ సాధించే వరకు ఎమ్మార్పీఎస్ పోరాటం చేస్తుందని పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి బర్ల తిరుపతి అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం ఎమ్మార్పీఎస్ నాయకులు ర్యాలీ నిర్వహించారు. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని తిరుపతి డిమాండ్ చేశారు. జస్టిస్ రాంచందర్ రావు, ఉషామెహ్రా కమిషన్లు వర్గీకరణ అనుకూలంగా నివేదికలు సమర్పించినా ప్రభుత్వాలు స్పందించకపోవడం వర్గీకరణపై వారి చిత్తశుద్ధిని స్పష్టం చేస్తోందన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో నాయకులు పాల శంకర్, మల్లేశం, రామస్వామి, రాజయ్య, రాజేశం, రమేశ్, స్వామి, కృష్ణ, సురేశ్ తదితరులు పాల్గొన్నారు. -
పార్లమెంట్లో వర్గీకరణ బిల్లు పెట్టాలి
ఆరో రోజుకు ఎమ్మార్పీఎస్ దీక్షలు ముకరంపుర : కేంద్రం ఇచ్చిన హామీమేరకు ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి బొడ్డు రాములు డిమాండ్ చేశారు. వర్గీకరణ కోసం సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారానికి ఆరో రోజుకు చేరాయి. ఎస్సీ వర్గీకరణ ద్వారా మాదిగల్లోని 59 ఉపకులాలకు సమన్యాయం జరుగుతుందని, సీఎం కేసీఆర్ అఖిలపక్ష కమిటీని ఢిల్లీకి తీసుకెళ్లాలని కోరారు. దీక్షలో సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండ్ర శంకర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాదాసు థామస్, రాష్ట్ర సహాయ కార్యదర్శి మ్యాకల లక్ష్మణ్, జిల్లా నాయకులు వడ్లూరి శ్రీనివాస్, జిల్లా యువసేన అధ్యక్షుడు సుంకె సంపత్, కరీంనగర్ మండల అధ్యక్షుడు ఆరపెల్లి వెంకటేశ్, నాయకులు ద్యావ అంజన్న, సిరిసిల్ల నర్సన్న ఉన్నారు.