గాంధీనగర్ : గురువారం రాత్రి 7 గంటలకు ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్ ఎదుట ఏర్పాటు చేసిన వేదికపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మోదీతో ప్రమాణం చేయించనున్నారు. అనంతరం పలువురు నేతలు కూడా కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోదీతో పాటు ప్రమాణ స్వీకారం చేయబోయే వారి పేర్లను ఇప్పటికే ప్రకటించారు. వీరిలో గుజరాత్‌కు చెందిన మన్సుక్ లాల్ మాండవ్య కూడా ఉన్నారు. మోదీ కాబినేట్‌లో మన్సుక్ మరోసారి మంత్రి పదవి చేపట్టనున్నారు.
ఈ సందర్భంగా మన్సుక్ మాట్లాడుతూ.. ‘నరంద్రే మోదీ, అమిత్ షా నా మీద ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు. మరోసారి వారి ప్రభుత్వంలో నన్ను భాగం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వారిద్దరికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అన్నారు. గత ఐదేళ్లలో మన్సుక్ సైకిల్ మీదనే పార్లమెంట్‌కు వెళ్లారు. దాంతో విలేకరులు ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా సైకిల్ మీదనే వెళ్తారా అని ప్రశ్నించారు. అందుకు ఆయన బుదులిస్తూ.. ‘సైకిల్ మీద ప్రయాణించడాన్ని నేను పాషన్‌గా భావిస్తాను. సైకిల్ వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని జరగదు. సైకిల్ వాడకం వల్ల కాలుష్యం తగ్గడమే కాక ఇంధనం కూడా ఆదా అవుతుంది. పైగా ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఐదేళ్ల నుంచి పార్లమెంట్‌కు సైకిల్ మీదనే వెళ్లాను. ఇప్పుడు కూడా అలానే చేస్తాను’ అని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment