Swearing-in Ceremony
-
గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ రాజీనామా.. 12న ప్రమాణ స్వీకారం
గాంధీనగర్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ అఖండ విజయం సాధించి మరోసారి అధికారం చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఆయన మంత్రివర్గం శుక్రవారం రాజీనామా చేశారు. గాంధీనగర్‌లోని రాజ్‌భవన్‌కు చేరుకుని రాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్కు రాజీనామా పత్రాలను సమరించారు. సీఎం భూపేంద్ర పటేల్‌తో పాటు గుజరాత్ బీజేపీ చీఫ్ సీఆర్ పాటిల్, పార్టీ చీఫ్ విప్ పంకజ్ దేశాయ్‌లు హాజరయ్యారు. గురువారం వెలువడిన ఫలితాల్లో 182 స్థానాలకు గానూ బీజేపీ 156 సీట్లు గెలుపొంది రికార్డులు తిరగరాసింది. భూపేందర్ పటేల్ మళ్లీ ముఖ్యమంత్రి పదవి చేపడతారని ఎన్నికలకు ముందే ప్రకటించింది బీజేపీ. ఫలితాలు వెలువడిన క్రమంలో గురువారం బీజేపీ రాష్ట్ర చీఫ్ సైతం అదే విషయాన్ని వెల్లడించారు. ఈ క్రమంలో ఫార్మాలిటీ కోసం రాజీనామాలు చేశారు. మరోమారు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. డిసెంబర్ 12న ప్రమాణ స్వీకారం ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ‘ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఆయన మంత్రివర్గం రాజీనామాలను గవర్నర్ ఆమోదించారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు పటేల్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. గాంధీనగర్‌లోని కమలం పార్టీ ప్రధాన కార్యాలయంలో శనివారం ఉదయం 10 గంటలకు పార్టీ ఎమ్మెల్యేలు సమావేశమవుతారు. మధ్యాహ్నానికి పార్టీ శాసనసభాపక్ష నేత ఎన్నికపై గవర్నర్‌కు తెలియజేస్తాం. గవర్నర్ సూచనల మేరకు సీఎం, కేబినెట్ మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుంది.’ అని తెలిపారు పార్టీ చీఫ్ విఫ్ పంకజ్ దేశాయ్. మరోవైపు.. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం గాంధీనగర్‌లోని హెలిపాడ్ గ్రౌండ్లో సోమవారం ఉంటుందని పార్టీ చీఫ్ సీఆర్ పాటిల్ ప్రకటించారు. సీఎం ప్రమాణ స్వీకారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలు హాజరవుతారని చెప్పారు. ఇదీ చదవండి: Gujrat Polls 2022: మున్సిపాలిటీ సభ్యుడి నుంచి సీఎం స్థాయికిపాలిటీ సభ్యుడి నుంచి సీఎంగా -
బీహార్ సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణం
పాట్నా: బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జనతా దళ్(యునైటెడ్)కు చెందిన నితీశ్ కుమార్ ప్రమాణం చేశారు. బుధవారం మధ్యాహ్నాం రాజ్‌భవన్‌లో గవర్నర్ సమక్షంలో ఆయన బీహార్‌కు సీఎంగా ఎనిమిదో సారి బాధ్యతలు చేపట్టారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి గుడ్ బై చెబుతూ.. ఆయన తన రాజీనామాను గవర్నర్‌కు మంగళశారం సాయంత్రం సమర్పించారు. అయితే.. ఆ వెంటనే ఆర్జేడీ సహా విపక్షాల మద్దతుతో ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సీఎంగా నితీశ్ కుమార్, తేజస్వి యాదవ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. #WATCH Bihar CM Nitish Kumar and Deputy CM Tejashwi Yadav greet each other after the oath-taking ceremony, in Patna pic.twitter.com/fUlTz9nGHS — ANI (@ANI) August 10, 2022 ఈ ప్రమాణ కార్యక్రమానికి బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి, తేజస్వి యాదవ్ భార్య రాజశ్రీ తదితర ప్రముఖులు, ముఖ్యనేతలు హాజరయ్యారు. బుధవారం ఈ ఇద్దరు మాత్రమే ప్రమాణం చేయడం విశేషం. మిగతా కేబినెట్ కూర్పు తర్వాత ఉండే ఛాన్స్ ఉంది. Patna | RJD leader Tejashwi Yadav takes oath as Deputy CM of Bihar pic.twitter.com/mvhweGd1zt — ANI (@ANI) August 10, 2022 #WATCH | Bihar: CM-designate Nitish Kumar, RJD's Tejashwi Yadav and his wife Rajshri, former CM Rabri Devi and RJD leader Tej Pratap Yadav at the swearing-in ceremony at Raj Bhavan in Patna. pic.twitter.com/bdxHBNSiyh — ANI (@ANI) August 10, 2022 ఇదీ చదవండి: ఎన్డీయే నుంచి జేడీయూ నిష్క్రమణపై బీజేపీ స్పందన -
ప్రథమ పౌరురాలిగా ద్రౌపది ముర్ము (ఫొటోలు)
-
నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రధాని మోదీ, అమిత్ షా అభినందలు
రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకార కార్యక్రమం.. అప్డేట్స్ TIME: 3.00PM రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన ద్రౌపదికి ముర్ముకు దేశం నలుమూలల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. నూతన రాష్ట్రపతికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు. దేశానికి ఇదొక ఉద్వేగభరిత క్షణాలని హర్షం వ్యక్తం చేశారు. TIME: 2.30PM కొత్తగా ఎన్నికైన రాష్ట్రపతికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్లో భారత 15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన ద్రౌపది ముర్ముకు అభినందనలు తెలిపారు. ముర్ము తన పదవీకాలంలో దే శ గర్వాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని నమ్మకం ఉందన్నారు. నేడు చరిత్రలో నిలిచిపోయే రోజు అని అన్నారు. 11:35AM ► రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత.. ఆమె మొదటి గార్డ్ ఆఫ్ ఆనర్‌ను తనిఖీ చేశారు. #WATCH President Droupadi Murmu inspects her first Guard of Honour after taking the oath, at Rashtrapati Bhavan in Delhi pic.twitter.com/T47qfSWHBu — ANI (@ANI) July 25, 2022 11:00AM ►రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్న ద్రౌపది ముర్ము ► 10:48AM గుర్రపు కవాతు నడుమ అధికారిక వాహనంలో రాష్ట్రపతి భవన్‌కు బయలుదేరిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ► 10:47AM పార్లమెంట్ హాల్ నుంచి రాష్ట్రపతి భవన్‌కు బయలుదేరిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ► హాల్ నుంచి బయటకు వచ్చిన రాష్ట్రపతి ముర్ము. వెంట.. సీజే ఎన్వీ రమణ, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, స్పీకర్ ఓం బిర్లా. గౌరవ వందనం స్వీకరణ. ► 10:44 AM ముర్ము ప్రసంగం అనంతరం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రసంగించారు. అనంతరం ప్రధాని , కేంద్ర మంత్రులు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, ఇతర రాజకీయ ప్రముఖులకు అభివాదం చేశారు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ► 10:15AM రాష్ట్రపతి హోదాలో ముర్ము తొలి ప్రసంగం జాతినుద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగం దేశ ప్రజలకు కృతజ్ఞతలు నాపై మీరు చూపిన ప్రేమ, అభిమానం, నమ్మకం రాష్ట్రపతి బాధ్యతలు నిర్వర్తించడానికి ప్రోత్సహిస్తాయి దేశ ప్రజల విశ్వాసం నిలబెట్టేందుకు కృషి చేస్తా మా గ్రామం పదో తరగతి చదువుకున్న మొదటి బాలికను నేను: ముర్ము భారత్ ప్రగతి పథంలో నడుస్తోంది. ఇంకా వేగంగా అభివృద్ది చెందాలని ఆశిస్తున్నా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ► 10:12AM భారత రాష్ట్రపతిగా ముర్ము ప్రమాణం భారత దేశ 15వ రాష్ట్రపతిగా ప్రమాణం చేశారు ద్రౌపది ముర్ము. ప్రమాణం చేయించారు భారత దేశ అత్యున్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ. అనంతరం పదవీ పత్రాలపై ఆమె సంతకాలు చేశారు. ► 10:08AM పార్లమెంట్‌కు చేరిన కోవింద్, ముర్ము పార్లమెంట్‌కు చేరుకున్న రామ్‌నాథ్ కోవింద్, ద్రౌపది ముర్ము. వెంట సుప్రీం కోర్టు సీజే ఎన్వీ రమణ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ముర్ముకు త్రివిధ దళాల గన్ సెల్యూట్. ► 10:00AM పార్లమెంట్ సెంట్రల్ హాల్లో 15వ రాష్ట్రపతిగా సీజే ఎన్వీ రమణ సమక్షంలో ప్రమాణం చేయనున్న ద్రౌపది ముర్ము. ► పార్లమెంట్‌కు బయలుదేరిన రామ్‌నాథ్ కోవింద్, ద్రౌపది ముర్ము. ► రాష్ట్రపతి ఫోర్‌కోర్టులో గౌరవ వందనం స్వీకరించిన రామ్‌నాథ్ కోవింద్, ద్రౌపది ముర్ము. ► రాజ్‌ఘాట్‌లో జాతిపిత మహాత్మాగాంధీకి ద్రౌపది ముర్ము నివాళులు. #DroupadiMurmu at Rajghat before taking oath as President NDTV's Sunil Prabhu reports pic.twitter.com/jsrQ30X4Sw — NDTV (@ndtv) July 25, 2022 ► ఉదయం 10గం.15ని. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో రాష్ట్రపతిగా ప్రమాణం చేయనున్న ద్రౌపది ముర్ము ► ప్రమాణం తర్వాత 21 గన్ సెల్యూట్ స్వీకరించనున్న ద్రౌపది ముర్ము. ► ఈ కార్యక్రమంలో పాల్గొననున్న ఉప రాష్ట్రపతి, ప్రధాని, స్పీకర్ తదితరులు పాల్గొననున్నారు. ► ప్రమాణం అనంతరం నూతన రాష్ట్రపతిగా ముర్ము ప్రసంగిస్తారు. ►భారత 15వ రాష్ట్రపతిగా గిరిజన ఆడబిడ్డ ద్రౌపది ముర్ము(64) ఇవాళ(సోమవారం) ప్రమాణం చేయనున్నారు. ► పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఉదయం 10.15 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. ► సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ద్రౌపది ముర్ముతో ప్రమాణం చేయించనున్నారు. ► తొలి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ 1950 జనవరి 26న ప్రమాణం చేశారు. అయితే.. 1977 తర్వాత జూలై 25వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తున్న పదో రాష్ట్రపతిగా ముర్ము చరిత్రలో నిలిచిపోనున్నారు. ► నీలం సంజీవరెడ్డి ఆరవ రాష్ట్రపతిగా 1977 సంవత్సరం జూలై 25న ప్రమాణం చేశారు. ► ప్రమాణ స్వీకారం, ప్రసంగం తర్వాత ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి భవన్‌కు చేరుకుంటారు. అక్కడ సైనిక సిబ్బంది ఆమెకు గౌరవ వందనం సమర్పిస్తారు. -
ఏపీ మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవంలో ఆసక్తికర దృశ్యాలు
సాక్షి, అమరావతి: సచివాలయం పక్కన ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై సోమవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పలు ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి. ► ఉదయం 11.31 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండగా తొలిసారి మంత్రి పదవి దక్కిన పీడిక రాజన్న దొర రెండు గంటలు ముందుగానే వేదిక వద్దకు చేరుకున్నారు. అప్పటికి ఇంకా సహచర ఎమ్మెల్యేలు ఎవరూ రాకపోవడంతో అధికారులు, విలేకరులతో కాసేపు ముచ్చటించారు. ► తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం సంతకం చేయకుండా రావటాన్ని గమనించిన ముఖ్యమంత్రి జగన్ సైగ చేయడంతో సంతకం చేసి సీఎం, గవర్నర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ► బొత్స సత్యనారాయణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తనవద్ద ఉన్న పెన్నుతో సంతకం చేస్తుండగా ప్రొటోకాల్ అధికారులు తమ పెన్నుతో సంతకం చేయాలని కోరారు. ► మొత్తం 25 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయగా 9మంది మంత్రులు సీఎంకు పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. వీరిలో బూడి ముత్యాలనాయుడు, గుడివాడ అమర్నాథ్, జోగి రమేష్, కె.నారాయణస్వామి, కేవీ ఉషశ్రీ చరణ్, ఆర్కే రోజా, సీదిరి అప్పలరాజు, తానేటి వనిత, విడదల రజని ఉన్నారు. ► ఆరేకే రోజా ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం కాళ్లకు నమస్కరించడమే కాకుండా చేతిపై ముద్దు పెట్టి తన అభిమానాన్ని చాటుకున్నారు. ► దాడిశెట్టి రాజా, గుడివాడ అమర్నాథ్, జోగి రమేష్, కొట్టు సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజన్న దొర, రోజా, సీదిరి అప్పలరాజు, తానేటి వనిత, విడదల రజని ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో కార్యకర్తలు ఈలలతో హుషారెత్తించారు. ► ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల్లో పలువురిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భుజం తట్టి అభినందించారు. -
ఏపీ నూతన కేబినెట్ ప్రమాణ స్వీకారానికి ముహుర్తం ఖరారు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ నూతన కేబినెట్ ప్రమాణ స్వీకారానికి ముహుర్తం ఖరారైంది. ఏప్రిల్ 11న ఉదయం 11 గంటల 31 నిమిషాలకు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం గవర్నర్, సీఎం జగన్‌తో కలిసి పాత, కొత్త మంత్రులు తేనీటి విందు కార్యక్రమంలో పాల్గొంటారు. ఇదిలా ఉండగా, ఏపీ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. గతంలోనే గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ని కలిసి చర్చించిన సంగతి తెలిసిందే. చదవండి: (పాత, కొత్త మంత్రులతో సీఎం జగన్ తేనీటి విందు) -
యోగి ప్రమాణ స్వీకారానికి ‘కశ్మీర్ ఫైల్స్’ టీం
అసెంబ్లీ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించడమే కాదు.. ఉత్తర ప్రదేశ్‌కు రెండో దఫా ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టబోతున్నారు యోగి ఆదిత్యానాథ్. మార్చి 25 శుక్రవారం సాయంత్రం 4 గంటలకు లక్నోలోని వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం జరగనుంది. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ చీఫ్ గెస్ట్‌గా హాజరు కాబోతున్నారు. మోదీతో పాటు హోం మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, మరికొందరు బీజేపీ కీలక నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్టేజ్‌పై ప్రధాని మోదీ, నడ్డా, రాజ్‌నాథ్ సింగ్, యోగి ఫొటోలతో భారీ బ్యానర్‌ను ఏర్పాటు చేయనున్నారు. రాజకీయ ప్రముఖులతో పాటు వ్యాపార, సినీ, క్రీడా ప్రముఖులు సైతం యోగి ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్నట్లు సమాచారం. బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, కంగనా రనౌత్, బోనీ కపూర్లకు ఆహ్వానం అందాయి. అంతేకాదు.. తాజాగా భారీ హిట్ సాధించిన ది కశ్మీర్ ఫైల్స్ చిత్ర యూనిట్‌కు ప్రత్యేక ఆహ్వానం పంపింది యూపీ బీజేపీ యూనిట్. నటుడు అనుపమ్ ఖేర్‌తోపాటు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రికి ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా ఈ చిత్రం 200 కోట్ల రూపాయల క్లబ్‌లోకి అడుగుపెట్టింది కూడా. #TheKashmirFiles crosses ₹ 200 cr mark 🔥🔥🔥... Also crosses *lifetime biz* of #Sooryavanshi... Becomes HIGHEST GROSSING *HINDI* FILM [pandemic era]... [Week 2] Fri 19.15 cr, Sat 24.80 cr, Sun 26.20 cr, Mon 12.40 cr, Tue 10.25 cr, Wed 10.03 cr. Total: ₹ 200.13 cr. #India biz. pic.twitter.com/snBVBMcIpm — taran adarsh (@taran_adarsh) March 24, 2022 స్టేడియంలో అదనంగా 20వేల కుర్చీలను వేయించారు. దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో బీజేపీ అభిమానగణం ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. యూపీలో దాదాపు 37 ఏళ్ల తర్వాత.. ఐదేళ్ల అధికారం పూర్తి చేసుకుని తిరిగి సీఎం పదవిని చేపడుతున్న ఘనత యోగి ఆదిత్యానాథ్‌కు దక్కింది. మొత్తం 403 సీట్లున్న యూపీ అసెంబ్లీలో 255 సీట్లు గెల్చుకుని, 41.29 శాతం ఓటింగ్ షేర్ దక్కించుకుంది బీజేపీ. -
పంజాబ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చరణ్‌జిత్ సింగ్ చన్నీ
చండీగఢ్: పంజాబ్ కొత్త ప్రభత్వం సోమవారం కొలువుదీరింది. నూతన ముఖ్యమంత్రిగా దళిత సిక్కు నాయకుడు చరణ్‌జిత్ సింగ్ చన్నీ ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబ్‌లో తొలి దళిత సీఎంగా చన్నీ రికార్డు సృష్టించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రమాణస్వీకారం అనంతరం చన్నీ కెప్టెన్ అమరీందర్‌ను కలవనున్నారు. (చదవండి: ఎవరీ చన్నీ? ) పంజాబ్‌లో దళిత వర్గానికి సీఎం పదవి దక్కడం ఇదే ప్రథమం. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చరణ్‌జిత్ సింగ్ చన్నీ 1972 ఏప్రిల్ 2న పంజాబ్‌లోని మక్రోనా కలాన్ గ్రామంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు అజ్మేర్ కౌర్, హర్సా సింగ్. దళితుల్లో రామదాసియా సిక్కు (చర్మకారులు) వర్గానికి చెందిన వారు. (చదవండి: Amarinder Singh: కెప్టెన్ కథ కంచికి చేరిందిలా!) చన్నీ చాంకౌర్ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.2015-16లె పంజాబ్ విధానసభలో విపక్షనేతగా ఉన్నారు. కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రభుత్వంలో సాంకేతిక విద్య, పారిశ్రామిక శిక్షణశాఖ బాధ్యతలు నిర్వహించారు. చదవండి: విందుకు అందని పిలుపు.. వివాదానికి ఆజ్యం పోసిన ప్రమోషన్ -
ప్రమాణ స్వీకారోత్సవం రద్దు చేసిన తాలిబన్లు
కాబూల్: కొత్తగా ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వ ప్రమాణ స్వీకారాన్ని తాలిబన్లు రద్దు చేశారు. వనరులు, నిధుల వృ«థా నివారణకే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. అమెరికాపై దాడులు జరిగిన 11 సెప్టెంబర్ నాడే అట్టహాసంగా తాత్కాలిక ప్రభుత్వ ప్రమాణస్వీకారోత్సవం నిర్వహించాలని తొలుత తాలిబన్లు భావించారు. ఇందుకోసం రష్యా, చైనా, ఖతార్, పాకిస్తాన్, ఇరాన్‌కు ఆహ్వానాలు కూడా పంపారు. కానీ అకస్మాత్తుగా ప్రమాణస్వీకారోత్సవ రద్దు నిర్ణయం ప్రకటించారు. ప్రమాణ స్వీకారోత్సవం లేకపోయినా ప్రభుత్వం ఏర్పడి పనిచేయడం ప్రారంభమైందని తాలిబన్ ప్రతినిధి ఇనాముల్లా సమంగని ప్రకటించారు. అయితే నిధుల వృథా నివారణ అనేది అసలు కారణం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తాలిబన్ మిత్రుల ఒత్తిడి వల్లనే ఈ ఉత్సవాన్ని రద్దు చేశారని రష్యా న్యూస్ ఏజెన్సీ టాస్ తెలిపింది. 11న ప్రమాణ స్వీకారోత్సవం జరపడం అమానవీయమని, దాన్ని నిలిపివేయమని తాలిబన్లకు సలహా ఇవ్వాలని యూఎస్, నాటో దేశాలు ఖతార్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయని పేర్కొంది. దీనివల్ల అఫ్గాన్‌లో తాలిబన్ల పాలనను ప్రపంచ దేశాలు గుర్తించడం మరింత కఠినతరమవుతుందని హెచ్చరించినట్లు తెలిసింది. -
ఇంటి ముందే టీడీపీ సర్పంచ్ ప్రమాణస్వీకారం
ఈపూరు(వినుకొండ): పంచాయతీ కార్యాలయంలో నిర్వహించాల్సిన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని.. టీడీపీకి చెందిన ఓ సర్పంచ్ తన ఇంటి ముందే వేడుకలా జరిపించుకున్నారు. పంచాయతీ కార్యదర్శి దగ్గరుండి మరీ జరిపించారు. గుంటూరు జిల్లా చిట్టాపురంలో జరిగిన ఈ ఘటన విమర్శలపాలైంది. చిట్టాపురం సర్పంచ్‌గా నందిగం నిర్మలాదేవి ఎన్నికయ్యారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం శనివారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరగాల్సి ఉంది. అయితే ఇందుకు విరుద్ధంగా పంచాయతీ కార్యదర్శి దిలీప్.. నిర్మలాదేవి ఇంటి ముందే టెంట్లు వేసి ఘనంగా జరిపించారు. దీనిపై కార్యదర్శిని ప్రశ్నించగా ఆయన నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని గ్రామస్తులు చెబుతున్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ విషయమై ఎంపీడీవో ప్రసాద్‌ను వివరణ కోరగా.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన పంచాయతీ కార్యదర్శిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. -
బైడెన్ కర్తవ్యాలు
మరికొన్ని గంటల్లో అమెరికా అధ్యక్ష పీఠాన్ని జో బైడెన్ అధిరోహించబోతున్నారు. సాధారణంగా ప్రమాణస్వీకారోత్సవంనాడు కాబోయే అధ్యక్షుడి ప్రాముఖ్యతలు, విధానాలు మీడియాలో ఎక్కు వగా ప్రస్తావనకొస్తాయి. కానీ నిష్క్రమిస్తున్న డోనాల్డ్ ట్రంప్ పుణ్యమా అని అందరి దృష్టీ ఇప్పుడు బైడెన్‌కు కల్పించే భద్రతపై పడింది. ఆయనకు ఎవరైనా హాని తలపెట్టే ప్రమాదం వుండొచ్చన్న సమాచారంతో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది. ఎవరి ఊహకూ అందనివిధంగా ఈనెల 6న కేపిటల్ భవంతిలో ట్రంప్ మద్దతు దారులు విధ్వంసం సృష్టించటం, అందుకు పోలీసు అధికారుల్లో కొందరు తోడ్పాటునీయటం వంటివి చూశాక ఈ చర్యలు అవసరమని మొదటే అనుకున్నారు. ప్రమాణస్వీకారాన్ని ఒక ప్రత్యేక సందర్భంగా పరిగణించి వాషింగ్టన్ డీసీలో నేషనల్ గార్డ్‌కు చెందిన బలగాలను వినియోగించటం సర్వసాధారణమే అయినా ఈసారి ఆ బలగాల సంఖ్య రెండున్నర రెట్లు అధికం. ఇప్పుడున్న పరిస్థి తుల్లో 15,000మంది అవసరం పడొచ్చని మొదట్లో అనుకున్నారు. అదే చాలా ఎక్కువనుకుంటే అదిప్పుడు 25,000కు పెరిగింది. సైన్యంనుంచి, వైమానిక దళంనుంచి ఎంపిక చేసిన కొందరిని ఈ కార్యక్రమం కోసం వినియోగించటం ఆనవాయితీ. ఎంపికలో అప్రమత్తంగా వుండాలని ఆ రెండు విభాగాలకూ చెప్పటంతోపాటు, వారు పంపిన జాబితా ఆధారంగా ప్రతి ఒక్కరి నేపథ్యాన్నీ ఈసారి జల్లెడపట్టారు. ఎవరికైనా తీవ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయేమోనని ఒకటికి రెండుసార్లు ఆరా తీశారు. బైడెన్‌ను తీవ్రంగా వ్యతిరేకించే మితవాద జాత్యహంకార బృందాల కార్యకలాపాలు ఫేస్బుక్, ట్విటర్, యూట్యూబ్వంటి సామాజిక మాధ్యమాల్లో నిలిచిపోయాయి. వారంతా నిఘాకు దొరకని టెలిగ్రామ్, సిగ్నల్వంటి మాధ్యమాల్లో చేరి కార్యకలాపాలు సాగిస్తున్నారని తెలియటంతో ఎఫ్‌బీఐ మరింత అప్రమత్తమైంది. జనం తీర్పును గౌరవించటం, పదవినుంచి హుందాగా నిష్క్ర మించటం అమెరికాలో ఇన్నాళ్లుగా వస్తున్న సంప్రదాయం. కొత్తగా బాధ్యతలు తీసుకోబోయే అధ్య క్షుడు వైట్‌హౌస్‌కు సతీసమేతంగా రావటం, వారిని ఆహ్వానించటం, ఆ తర్వాత వారితో కలిసి కేపిటల్ భవన సముదాయానికి వెళ్లటం, ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొని వెనుదిరగటం ఆనవా యితీ. కానీ ట్రంప్ ఇందుకు భిన్నమైన వారసత్వాన్ని మిగిల్చిపోతున్నారు. ప్రమాణస్వీకారోత్సవ సమయానికి వాషింగ్టన్ నుంచే వెళ్లిపోతున్నారు. వీటి సంగతలావుంచి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టింది మొదలు బైడెన్ చేయాల్సిన పనులు చాలావున్నాయి. కరోనా వైరస్ మహమ్మారితో తీవ్రంగా దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేం దుకు 1.9 లక్షల కోట్ల డాలర్ల ఉద్దేశించిన ఉద్దీపన ప్యాకేజీ సాధ్యమైనంత త్వరగా కాంగ్రెస్ ఆమోదం పొందేలా చూడటం, ఆ వ్యాధి నియంత్రణకు పకడ్బందీ చర్యలు ప్రారంభించటం, వాతావరణ మార్పుల విషయంలో కొత్త విధానాలను ప్రకటించటం, జాతి వైషమ్యాలను అరికట్టే కార్యాచరణకు పదునుపెట్టడం వగైరాలు అందులో కీలకమైనవి. చైనా, రష్యాల నుంచి సవాళ్లు ఎదుర్కొనాల్సి ఉంటుంది. అలాగే వలసలపై, మరీ ముఖ్యంగా కొన్ని ముస్లిం దేశాలనుంచి వచ్చేవారిపై విధించిన నిషేధాలను సమీక్షించి సరిదిద్దటం, ఆరోగ్య బీమా పరిధిని పెంచటం, నేర న్యాయవ్యవస్థ సంస్కర ణలు ఆయన సమీక్షించాల్సివుంది. మాస్క్‌లు ధరించటం తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాల్సి వుంది. వాతావరణ మార్పులకు సంబంధించి ఒబామా హయాంలో పారిస్ ఒడంబడికపై అమెరికా సంతకం చేయగా, ట్రంప్ దాన్నుంచి బయటికొస్తున్నట్టు నిరుడు ప్రకటించారు. అందులో చేరుతున్నట్టు లాంఛనంగా బైడెన్ ప్రకటించి, సభ్యత్వం కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థులు తీసుకున్న రుణాల చెల్లింపుపై విధించిన మారటోరియం గడువు గత నెలతో ముగిసి పోయింది. దాన్ని పొడిగించాల్సివుంది. తన కేబినెట్ అమెరికా వైవిధ్యతకు అద్దం పట్టేలా వుంటుం దని ఇప్పటికే బైడెన్ ప్రకటించారు. జాతి, రంగు, జెండర్ వంటి అంశాలను దృష్టిలో వుంచుకుని ఆయన కేబినెట్‌ను రూపొందిస్తున్నారు. కొన్ని కీలక పదవుల్లో వుండబోయేవారెవరో ఇప్పటికే ఆయన ప్రకటించారు. ఈ నియామకాలన్నిటినీ సెనేట్ ఓకే చేయాల్సివుంది. ఇన్నిటిపై నిర్ణయాలు తీసుకోవాల్సిన బైడెన్ ట్రంప్ అభిశంసన విషయంలో పట్టుదలగా వున్నారు. సెనేట్‌లో అందుకు సంబంధించిన తీర్మానంపై సాధ్యమైనంత త్వరగా చర్చ ముగిసి, అది ఆమోదం పొందాలని కోరు కుంటున్నారు. అయితే సెనేట్ రిపబ్లికన్ నాయకుడు మెక్ కానిల్ అంత తేలిగ్గా వదలరు. జాప్యం జరి గేలా చూస్తారు. చేయాల్సిన పనులు చాలావుండగా ఈ తీర్మానం బైడెన్‌కు ఎంతో కొంత ఆటంకంగా మారుతుందనే చెప్పాలి. అమెరికాలో ఇప్పుడున్న వైషమ్య వాతావరణం ట్రంప్ సృష్టి కాదు. సమాజంలో అప్పటికే వున్న పగుళ్లను ఆయన మరింత విస్తరించేలా చూశారు. వివిధ వర్గాల మధ్య వున్న అపోహలను పెంచారు. నివారణ చర్యలు మాట అటుంచి తన మాటలతో, చేతలతో వాటిని వున్నకొద్దీ పెంచుతూ పోయారు. పాశ్చాత్య సమాజం ప్రవచించే ప్రజాస్వామ్యంపై ప్రపంచం మొత్తం సంశయపడే స్థితిని కల్పించారు. గత పాలకులు చాలా విషయాల్లో నిర్లక్ష్యంగా వున్నారు. సంపద పెంచుకుంటూ పోవటం తప్ప, దాని పంపిణీలో వున్న అసమానతల్ని పట్టించుకోవడంలేదు. ఒకప్పుడు పారిశ్రామిక నగరాలుగా వర్థిల్లిన ప్రాంతాలు శిథిల నగరాలను తలపించాయి. పర్యవసానంగా ఏ వర్గాలు ఎలా నష్టపోయాయో ఆరా తీసి ఆదుకున్నవారు లేకపోయారు. ప్రపంచీకరణవల్ల నష్టపోయిన వర్గాలు ఎంత అసంతృప్తితో వున్నాయో గ్రహించలేకపోయారు. ట్రంప్ అభిశంసనకన్నా వీటిని సరిచేయటం అత్యవసరమని బైడెన్ గ్రహించాలి. లేనట్టయితే ట్రంప్ తరహాలోనో, ఆయన్ను మించిన విధానాల తోనో ఎవరో ఒకరు రంగప్రవేశం చేయటం ఖాయం. ఆ ప్రమాదాన్ని నివారించటం ముఖ్యం. -
యూఎస్‌లో రెండు బిగ్ ‘డే’లు.. అందులో ఒకటి నేడే!
యూఎస్‌లో రెండు బిగ్ ‘డే’లు ఉంటాయి. యేటా వచ్చే ఇండిపెండెన్స్ డే ఒకటి. నాలుగేళ్లకొకసారి వచ్చే ఇనాగురేషన్ డే ఇంకొకటి. జూలై 4 అమెరికా స్వాతంత్య్ర దినం. జనవరి 20 అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవ దినం. స్వాతంత్రానికి ఎంత ప్రాధాన్యం ఉందో ఆ దేశంలో స్వీకారానికి అంత ప్రాధాన్యం ఉంది. ఈరోజు ఆమెరికా ఇనాగురల్ డే. జో బైడెన్, కమలా హ్యారిస్ అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎవరున్నా లేకున్నా, ఎవరి పార్టీ ఏదైనా.. కొత్త అధ్యక్షుడి స్వీకారంలో పాత అధ్యక్షుడు ఉండటం సంప్రదాయం. అయితే డొనాల్డ్ ట్రంప్ ఇవాళ బైడెన్ వేడుకకు ‘స్కిప్’ కొడుతున్నారు. అంటే.. ఆయన హాజరు కావడం లేదు. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. బైడెన్ గెలవక ముందు నుంచే ఎడమొహం పెడమొహంగా ఉన్నారు ట్రంప్. బైడెన్ గెలిచాక ‘నీ గెలుపును గుర్తించను ఫో..’ అన్నట్లే ఉండిపోయారు. అలాగని అధ్యక్ష ప్రమాణ స్వీకారానికి వీపు చూపించిన అధ్యక్షులలో ట్రంపే మొదటి వారు కాదు. ఇంకొకాయన కూడా ఉన్నారు. ఆ వివరాలతో పాటు.. గత ‘ప్రెసిడెన్షియల్ ఇనాగురేషన్’లలో సంభవించిన కొన్ని ఆసక్తికరమైన ఘటనలు ఏమిటో చూద్దాం. బైడెన్‌కి ఎంతుందో ట్రంప్‌కీ అంతుంది! ట్రంప్ అమెరికన్లందరి మనిషి. బైడెన్ అమెరికన్లతో పాటు, అమెరికాలోని అన్ని దేశాల వారి మనిషి. అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌కు గట్టి పోటీ ఇచ్చారు ట్రంప్. చివరి ఫలితాల్లో ఓడిపోయారు. అది ఉండిపోయింది ట్రంప్ మనసులో. ట్రంప్ మనసులోనే కాదు.. ట్రంప్‌ని అభిమానించే వారందరి మనసుల్లో, జాతీయ భావన ఉన్న అమెరికన్లు అందరిలో ఆ బాధ, కోపం అలా ఉండిపోయాయి. ఎవరి మనసులో ఎలా ఉన్నా కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి పాత అధ్యకుడు హాజరవ్వాలి. పార్టీ వేరైనప్పటికీ హాజరు నుంచి మినహాయింపు ఉండదు. పద్ధతి అది. ట్రంప్ గురించి చెప్పేదేముంది. ‘ముందు అమెరికా. ఆ తర్వాతే పద్ధతి’ అనే మనిషి. అందుకే పద్ధతిని పక్కన పెట్టి, నికార్సయిన అమెరికన్‌గా వేడుకకు స్కిప్ కొడుతున్నారు. స్కిప్ కొట్టినందుకు రాజ్యాంగమేమీ తప్పు పట్టదు. ఒకవేళ రాజ్యంగంలో ఉన్నా ట్రంప్‌కు పట్టదు. ‘నాదే శాసనం. నేనే రాజ్యాంగం’ అన్నట్లు ఉన్నారు కదా ఈ నాలుగేళ్లూ! ఇప్పుడు ట్రంప్ స్కిప్ కొట్టినట్లు, శత్రుత్వ భావనతో కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి ఒకప్పుడు స్కిప్ కొట్టిన అధ్యక్షుడు జాన్ ఆడమ్స్. అమెరికా రెండవ అధ్యక్షుడు ఆయన. 1797 నుంచి 1801 వరకు ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన పార్టీ ‘ప్రో అడ్మినిస్ట్రేషన్’. యు.ఎస్.లో తొలి రాజకీయపార్టీ అది. దానికే ఇంకో పేరు ‘ఫెడరలిస్ట్’ పార్టీ. ఆయన తర్వాత అధ్యక్షులు అయినవారు థామస్ జెఫర్సన్. జెఫర్సన్ వరుసగా రెండు టర్మ్‌లు అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనది డెమొక్రాటిక్ రిపబ్లికన్ పార్టీ. జాన్ ఆడమ్స్ నుంచి థామస్ జెఫర్సన్‌కు అధికారం చేతులు మారేటప్పుడు ఆయన ప్రమాణ స్వీకారానికి జాన్ ఆడమ్స్ వెళ్లలేదు. ఆడమ్స్ వ్యక్తిగా జంటిల్మన్. రాజకీయవేత్తగా పగా ప్రతీకారాల మనిషి. జెఫర్సన్ కూడా అంతే. ఆడమ్స్ పవర్లో ఉన్నప్పుడు ఇద్దరికీ పడేది కాదు. ఒకర్నొకరు విమర్శించుకునేవారు. అసలు ఒకర్ని చూస్తే ఒకరికి మండిపోయేదని హ్యూస్టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ నాన్సీ బెక్ యంగ్ చెబుతుంటారు. ఆడమ్స్ నుంచి ట్రంప్ వరకు ఈ మధ్యలో పాత అధ్యక్షులు కొందరు కొత్త అధ్యక్షుల ప్రమాణ స్వీకారానికి వెళ్లలేకపోయినా అందుకు కారణం శత్రుత్వమైతే కాదు. ఈ పగలు, పట్టింపులను అలా ఉంచితే, అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకార మహోత్సవంలోని ప్రతి నిముషం చరిత్రలో రికార్డు అవుతూ ఉంటుంది. ఆ కొద్ది గంటల్లో విశేషాలు ఏమైనా జరిగితే చరిత్రలో వాటికి ప్రత్యేక స్థానం ఏర్పడుతుంది. ఇప్పుడంటే అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం వాషింగ్టన్ డీసీలోని ‘క్యాపిటల్’ బిల్డింగ్‌లో జరుగుతోంది. అమెరికా తొలి అధ్యక్షుడు (1789–1797) జార్జి వాషింగ్టన్ ప్రమాణం చేసే నాటికి వాషింగ్టన్‌లోని కాపిటల్ బిల్డింగ్ పూర్తవలేదు ఆ కార్యక్రమం కనుక న్యూయార్క్ సిటీలోని ఆనాటి (ఇప్పుడున్నది కాదు) ఫెడరల్ హాల్లో జరిగింది. ఆ తర్వాత నిర్మాణం పూర్తయిన కాపిటల్ బిల్డింగ్.. కాలక్రమంలో అధ్యక్షుల ప్రమాణ స్వీకార భవనం అయింది. మొన్న జనవరి 6 న విధ్వంసం జరిగింది ఈ పాలనా భవనంలోనే. వాషింగ్టన్ డీసీలో నేడు అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్షుల ప్రమాణ జరుగనున్న ‘క్యాపిటల్’ భవంతి ఇప్పుడు బైడెన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్న కాపిటల్ భవనానికి, ఆ చుట్టుపక్కల ప్రదేశాలకు భద్రతగా ఆర్మీ రంగంలోకి దిగుతున్నట్లే.. అమెరికా అంతర్యుద్ధం ప్రారంభం అవుతున్న దశలో 1861లో అధ్యక్షుడిగా గెలిచిన అబ్రహాం లింకన్ ప్రమాణ స్వీకారానికి అంతే భారీగా సైన్యాన్ని దింపి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయవలసి వచ్చింది. అధ్యక్షుడిగా రెండోసారి 1865 మార్చి 4న ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజులకే ఏప్రిల్ 15న లింకన్ హత్యకు గురయ్యారు. ఆయన మరణంతో అదే రోజు ఉపాధ్యక్షుడు ఆండ్రూ జాక్సన్ ఒక హోటల్ రూమ్‌లో అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయవలసి వచ్చింది. అప్పట్లో మార్చి నెలలో అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం జరిగేది. ప్రెసిడెంట్ విలియమ్ మెకిన్లే (1897–1901) 1901 సెప్టెంబర్ 14న హత్యకు గురైనప్పుడు కూడా ఆయన ఉపాధ్యక్షుడు థియోడర్ రూజ్వెల్ట్ అదే రోజు తన న్యూయార్క్, బఫెలో ప్రాంతంలోని తన ఇంట్లో నుంచి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. థియోడర్ రూర్వెల్ట్కు ఫ్రాంక్లిన్ డెలనో రూజ్వెల్ట్ అనే కజిన్ ఉన్నారు. ఆయన నాలుగుసార్లు అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసి చరిత్ర సృష్టించారు. 1945లో చనిపోడానికి కొద్ది రోజుల ముందు ఆయన నాలుగో ప్రమాణ స్వీకారం జరిగింది. రెండు టెర్మ్‌లకు మించి ఎక్కువ కాలం అధికారంలో ఉన్న ఏకైక అమెరికా అధ్యక్షుడు డెలనోనే. ఎలా సాధ్యం? ఎవరైనా రెండు టెర్మ్లే కదా అక్కడి రాజ్యాంగం ప్రకారం ఉండాలి! అప్పటికింకా.. ‘రెండుసార్లు మాత్రమే’ నిలబడాలి అనే 22వ రాజ్యాంగ సవరణ జరగలేదు. డెలనో నాలుగుసార్లు ఎన్నికల్లో గెలిచారు. కనుక నాలుగుసార్లు ప్రమాణ స్వీకారం చేయగలిగారు. చరిత్రలో ప్రసిద్ధి చెందిన ప్రమాణ స్వీకారం మాత్రం లిండన్ బైన్స్ జాన్సన్‌దే. ఆయన 1963–69 మధ్య అమెరికా అధ్యక్షుడిగా ఉన్నారు. అధ్యక్షుడు జాన్ ఎఫ్.కెనడీకి బైన్స్ ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు 1963లో కెనడీ హత్య జరగడంతో బైన్స్ అధ్యక్షుడయ్యారు. కెనడీ హత్యతో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉండటంలో బైన్స్ ఎయిర్ ఫోర్స్ విమానంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఇలా ప్రమాణ స్వీకారాలతో పాటు, వాటికి సంబంధించిన కార్యక్రమాలకు కూడా చరిత్రలో నిలచినవి ఉన్నాయి. ఇటీవలి కాలానికి వస్తే, 2009లో బరాక్ ఒబామా తొలిసారి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అమెరికన్ సింగర్ అరెథా ఫ్రాంక్లిన్ ఇచ్చిన ప్రదర్శన వాషింగ్టన్ చరిత్రలోనే నిలిచిపోయేంతగా వెలిగిపోయింది. అసలు ఆమె రాక వల్లనే ఒబామా స్వీకారానికి నిండుదనం వచ్చిందని యూఎస్ పత్రికలు అరెథాను ఆకాశానికి ఎత్తేశాయి. ‘‘అదొక మానవాళి మూకుమ్మడి ఉత్సవం’’ అని నాన్సీ బెక్ రాశారు. ఈరోజు జో బైడెన్ ప్రమాణ స్వీకారం కూడా చరిత్రలో నిలిచిపోబోయే ఘట్టమే. తీవ్ర ఉద్రిక్తతల మధ్య, సైన్యం నీడలో ‘ఐ డు సాలెమ్న్లీ స్వీయర్ దట్ ఐ విల్ ఫెయిత్‌ఫుల్లీ.. అని ప్రమాణం చేయబోతున్నారు. -
వాషింగ్టన్లో సాయుధుడి అరెస్ట్
వాషింగ్టన్: అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్ త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏర్పాట్లలో భాగంగా రాజధాని వాషింగ్టన్లో ఏర్పాటు చేసిన సెక్యూరిటీ చెక్‌పాయింట్ వద్ద వెస్లీ అలెన్ బీలెర్ (31) అనే వ్యక్తి శుక్రవారం ఆయుధంతో తిరుగుతూ పట్టుబడడం తీవ్ర కలకలం రేపింది. అనుమానాస్పదంగా సంచరిస్తున్న అతడి కారులో నుంచి లైసెన్స్ లేని 9ఎంఎం హ్యాండ్‌గన్, 500 రౌండ్ల తూటాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. వెస్లీని అదుపులోకి తీసుకొని విచారించారు. ఉగ్రవాదులతో అతడికి ఎలాంటి సంబంధాలు లేవని, తెలియకుండా ఆ ప్రాంతంలోకి వచ్చాడని నిర్ధారణ కావడంతో శనివారం విడిచిపెట్టారు. అక్రమంగా ఆయుధం కలిగి ఉన్నాడన్న ఆరోపణతో కేసు నమోదు చేశారు. భద్రతా సిబ్బందికి ఉచితంగా పిజ్జాలు జో బైడెన్ యూఎస్ క్యాపిటల్ బిల్డింగ్ ఎదుట ప్రమాణ స్వీకారం చేస్తారు. కొద్దిరోజుల క్రితం ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు వీరంగం సృష్టించారు. అప్పటినుంచి ఇక్కడ పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. భద్రతా సిబ్బంది నిర్విరామంగా పహారా కాస్తున్నారు. వారి శ్రమను చూసి చలించిపోయిన ‘వి ద పిజ్జా’ అనే రెస్టారెంట్ ఉచితంగా పిజ్జాలు అందజేస్తూ అందరి మన్ననలు చూరగొంటోంది. సెక్యూరిటీ సిబ్బందికి భోజనం అందించడానికి రెస్టారెంట్ యాజమాన్యం ప్రజల నుంచి విరాళాలు స్వీకరిస్తోంది. వి ద పిజ్జా ఔదార్యం చూసిన మరికొన్ని రెస్టారెంట్లు కూడా ఉచితంగా భోజనం అందించడానికి ముందుకొచ్చాయి. హ్యాండ్‌గన్, 500 రౌండ్ల తూటాల స్వాధీనం -
దేశంలో కొత్త చరిత్రకు శ్రీకారం
సాక్షి, అమరావతి: బీసీ కార్పొరేషన్ల చైర్పర్సన్లు, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సందడి చూస్తుంటే సంక్రాంతి పండుగ నెల రోజులు ముందే వచ్చినట్లుగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 56 బీసీ కార్పొరేషన్లకు పాలకవర్గాల ప్రమాణ స్వీకారోత్సవాన్ని గురువారం విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో నిర్వహించారు. ‘బీసీల సంక్రాంతి’ పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు.. అగ్రవర్ణాల్లో పేదలు సామాజికంగా, ఆర్థికంగా, సదుపాయాల పరంగా నాలుగు మెట్లు పైన ఉండటమే అభివృద్ధి అని నమ్మి ఓ ఉద్యమంలా పని చేస్తున్నామని తెలిపారు. అన్ని వర్గాల అభ్యున్నతి కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుంటే దిగిపోయిన పాలకుడు చెడిపోయిన బుర్రతో ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబుపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇవీ.. ఏడాదిన్నర క్రితం ఇదే చోట... ఇదే స్థలంలో 18 నెలల ముందు మీ బిడ్డ, మీ అన్న, మీ తమ్ముడు ఇక్కడే ప్రమాణ స్వీకారం చేశాడు. ఇప్పుడు అదే వేదిక మీద మీరందరూ ప్రమాణ స్వీకారం చేయడం నా మనసుకు ఎంతో సంతోషాన్నిస్తోంది. కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లుగా నియమితులైన మిమ్మల్ని చూస్తుంటే సంక్రాంతి పండుగ నెల ముందే వచ్చిందా అన్నట్లుగా ఉంది. 56 కార్పొరేషన్ల చైర్మన్లలో 29 మంది నా అక్క చెల్లెమ్మలే. 672 మంది డైరెక్టర్లలో 336 మంది నా అక్క చెల్లెమ్మలే ప్రమాణ సీక్వారం చేశారని గర్వంగా చెబుతున్నా. మహిళాభ్యుదయంలో మరో చరిత్రకు శ్రీకారం చుట్టాం. ప్రతి ఇంట్లోనూ సంతోషం.. నా 3,648 కి.మీ పాదయాత్రలో ప్రజల కష్టాలు, బాధలు చూశా. ఓ గ్రామంలో వెయ్యిమంది ఉంటే నాడు కనీసం ఇద్దరు ముగ్గురికి కూడా మేలు జరిగిన దాఖలాలు కనిపించ లేదు. అది కూడా టీడీపీ జెండా మోసినట్లు సర్టిఫికెట్ చూపిస్తే కానీ, జన్మభూమి కమిటీలు ఒప్పుకుంటే కానీ రాలేదు. ఆ స్థాయిలో దిగజారిన కార్పొరేషన్ వ్యవస్థలో మార్పులు తెచ్చాం. బీసీ పేద వర్గాల ప్రతి ఇంట్లోనూ సంతోషం కనిపించాలి. నాడు చెప్పా.. నేడు అమలు చేశా మనం అధికారంలోకి వస్తే బీసీల జీవితాలు మారుస్తానని నాడు మాట ఇచ్చా. 90 శాతం వాగ్దానాలు అమలు చేశాం. పేదలకు తోడుగా నిలబడకపోతే ప్రభుత్వం ఉండి ఏం ప్రయోజనం? అని నేను ప్రతి రోజూ అనుకుంటూ ఉంటా. వారికి తోడుగా నిలబడడం కోసమే దేవుడు నాకు అవకాశం ఇచ్చాడని అనుకుంటా. ఐదేళ్లలో విదిల్చింది రూ.19,329 కోట్లు.. 2014 మేనిఫెస్టోలో టీడీపీ ఏం చెప్పిందో చూశాం. 118 వాగ్దానాలు ఇచ్చి కనీసం 10 శాతం కూడా అమలు చేయలేదు. బీసీలకు ఏటా రూ.10 వేల కోట్లు ఇస్తామని చెప్పింది. అంటే ఐదేళ్లలో రూ.50 వేల కోట్లు బీసీల కోసం ఖర్చు చేయాల్సి ఉంటే కేవలం రూ.19,329 కోట్లు మాత్రమే విదిల్చింది. 2.88 కోట్ల బీసీ కుటుంబాలకు మేలు.. మనందరి ప్రభుత్వం వచ్చాక బీసీ అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ముల కోసం రూ.38,519 కోట్లు ఖర్చు చేశామని సగర్వంగా చెబుతున్నా. 2.88 కోట్ల బీసీ కుటుంబాలకు మేలు చేయగలిగాం. ఒక్కో కుటుంబంలో ఆరేడు పథకాలు కూడా అందాయి. ఇక బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, అట్టడుగున ఉన్న ఈ పేద వర్గాల కోసం మొత్తం రూ.59,317 కోట్లు చేశాం. తద్వారా 4.45 కోట్ల మందికి మేలు చేయగలిగాం. గ్రామ, వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న దాదాపు 1.30 లక్షల మంది ఉద్యోగుల్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు 83 శాతం వరకు ఉన్నారు. ఏడాదిన్నరలో దాదాపు నాలుగు లక్షలకుపైగా ఉద్యోగాలు ఇచ్చాం. గ్రామ స్వరాజ్యాన్ని చూస్తున్నాం. అభివృద్ధి అంటే ఇదీ.. పిల్లలు మంచి చదువులు చదువుకుంటే అది అభివృద్ధిగా భావించి 100 శాతం అక్షరాస్యత కోసం కృషి చేస్తున్నాం. కాళ్లు అరిగేలా తిరగకుండా, లంచాలు ఇవ్వకుండా మన గ్రామంలోనే పనులు జరిగితేనే అభివృద్ధి జరిగినట్లు. సంక్షేమ పథకాలు లబ్ధిదారుల ఇళ్లు వెతుక్కుంటూ వస్తేనే అభివృద్ధి అంటారు. నిలువ నీడ లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఇస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల రూపురేఖలను నాడు–నేడు ద్వారా మారుస్తున్నాం. అభివృద్ధిపై కోవిడ్ సమయంలో కూడా నాలుగు అడుగులు ముందుకే వేశాం కానీ ఒక్క అడుగు కూడా వెనక్కు వేయలేదు. ఏడాదిన్నరలో ప్రత్యేకంగా ఇవీ – శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు – క్యాబినెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు దాదాపు 60 శాతం పదవులు. – ఐదుగురు డిప్యూటీ సీఎంలలో నలుగురు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే. – సౌమ్యుడైన శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ కూడా బీసీనే. – గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో కనీసం ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపలేదు. మేం నలుగురిని రాజ్యసభకు పంపితే అందులో ఇద్దరు బీసీలే ఉన్నారు. – నామినేటెడ్ పదవులు, కాంట్రాక్టు పనుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం. అందులో సగం అక్క చెల్లెమ్మలకు ఇచ్చేలా చట్టం. హాజరైన మంత్రులు, ప్రజా ప్రతినిధులు.. బీసీల సంక్రాంతి కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు ధర్మాన కృష్ణదాస్, అంజాద్‌బాషా, మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, అనిల్‌కుమార్ యాదవ్, గుమ్మనూరు జయరామ్, ఎం.శంకరనారాయణ, ముత్తంశెట్టి శ్రీనివాస్, వెలంపల్లి శ్రీనివాస్, కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), పేర్ని వెంకట్రామయ్య (నాని), కురసాల కన్నబాబు, ఆదిమూలపు సురేష్, సీదిరి అప్పలరాజు, పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు, ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, గోరంట్ల మాధవ్, మార్గాని భరత్, వైఎస్సార్సీపీ బీసీ అధ్యయన కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాంతోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీసీలకు 18 నెలల్లో రూ.38,519 కోట్లు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే చరిత్రను తిరగరాస్తూ బలహీనవర్గాలను బలపరిచేలా మరో అడుగు ముందుకు వేశాం. బీసీలకు ఈ స్థాయిలో పదవులు ఇవ్వడం దేశ చరిత్రలోనే ఇది తొలిసారి. అందులో 50 శాతం పదవులు నా అక్క చెల్లెమ్మలకు ఇవ్వడం మహిళాభ్యుదయంలో మరో చరిత్ర. అధికారంలోకి వస్తే బీసీల జీవితాలను మారుస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చా. ఈ 18 నెలల్లో అది చేసి చూపించా. బీసీల సంక్షేమం కోసం రూ.38,519 కోట్లు ఖర్చు చేశాం. దిగిపోయిన పాలకుడి చెడిపోయిన బుర్ర.. ఈ అభివృద్ధి అంతా ఎక్కడ చూస్తారో అని ప్రజలను మభ్యపెట్టేందుకు గత పాలకులు ప్రయత్నిస్తున్నారు. ఒక దిగిపోయిన పాలకుడు చెడిపోయిన బుర్రతో చేస్తున్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్‌తో రాజధాని అక్కడే పెట్టాలని ముందే నిర్ణయించి, బినామీలతో భూములు కొనిపించి ఇప్పుడు వాటి విలువ ఎక్కడ పడిపోతుందోనని ఆందోళన చేస్తున్నాడు. ఒక చెడిపోయిన బుర్ర పని చేస్తుంటే అలా ఉంటుంది. ఒక మంచి బుర్ర పని చేస్తే అభివృద్ధి ఇలా ఉంటుందని చూస్తే ఎవరికైనా తెలుస్తుంది. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీ కార్పొరేషన్ల చైర్పర్సన్లు, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం సాక్షి, అమరావతి: కొత్తగా నియమితులైన 56 బీసీ కార్పొరేషన్ల చైర్పర్సన్లు, 672 మంది డైరెక్టర్లు గురువారం ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన ‘బీసీల సంక్రాంతి’ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ వారితో పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. తమ కులాల్లోని అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని ప్రభుత్వానికి తమ కులాలకు మధ్య వారధిగా ఉంటామని బీసీ కార్పొరేషన్ల చైర్పర్సన్లు, డైరెక్టర్లు ప్రతిజ్ఞ చేశారు. ప్రజలకు అభివాదం చేస్తున్న సీఎం వైఎస్ జగన్ ముఖ్యమంత్రికి జ్ఞాపిక అందిస్తున్న మంత్రులు చెల్లుబోయిన, శంకర నారాయణ, జయరాం, ఎమ్మెల్యేలు పార్థసారథి, జోగి రమేశ్ -
‘మఫ్లర్ మ్యాన్’ సందడి ‘క్రేజీ’
న్యూఢిల్లీ : ఆమ్ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ‘బేబి మఫ్లర్ మ్యాన్’ సందడి చేశారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాల రోజు సోషల్ మీడియాలో పాపులర్ అయిన ‘అవ్యాన్ తోమర్’కు కేజ్రీవాల్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార ఫంక్షన్‌కు ఆహ్మనం అందిన విషయం తెలిసిందే. కాగా ఆదివారం రామ్‌లీలా మైదానంలో ముడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఈ కార్యక్రమానికి కేజ్రీవాల్ మాదిరిగా టోపీ, స్వెటర్, మఫ్లర్, కళ్లజోడుతో వచ్చిన ఈ బుడతడు అందరి దృష్టిని ఆకర్షించాడు. (‘బేబీ మఫ్లర్‌మ్యాన్’కు ఆప్ బంపర్ ఆఫర్!) ఈవెంట్లో చిన్నారి సెంటర్ ఆఫ్ ఆట్రాక్షన్‌గా నిలవడంతో పిల్లవాడితో సెల్ఫీలు దిగేందుకు జనాలు ఎగబడ్డారు. ఈ చిన్నారిని తమ కెమెరాల్లో బంధించేందుకు మీడియా సైతం ఆసక్తి చూపింది. ఇక ఆప్ ఎమ్మెల్యేలు భగవత్మాన్, రాఘవ్ చద్దా, సోమ్‌నాథ్ భారతి వంటి వారు కూడా పిల్లాడితో ఫోటోలు దిగి ముద్దు చేశారు. అదే విధంగా మరికొంత మంది చిన్నారులు కూడా కేజ్రీవాల్‌ను అనుకరిస్తూ దుస్తులు ధరించి కార్యక్రమానికి వచ్చి ప్రత్యేకంగా నిలిచారు. (వైరల్ : పాటతో అదరగొట్టిన కేజ్రీవాల్) చదవండి : ఒకటి కాదు, రెండు కాదు.. హ్యాట్రిక్ కొట్టారు! -
కాంగ్రెస్, బీజేపీ అని కాదు.. అంతా నా వాళ్లే..!
న్యూఢిల్లీ : ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన అరవింద్ కేజ్రీవాల్ తన పట్ల ఢిల్లీ ప్రజల ప్రేమకు వెలకట్టలేమని అన్నారు. ప్రపంచంలో అద్భుతమైన, వెలకట్టలేని విషయం ఏదైనా ఉందంటే అది ప్రేమ మాత్రమే అని పేర్కొన్నారు. రామ్‌లీలా మైదానంలో ఆదివారం ‘ధన్యవాద్ ఢిల్లీ’ పేరుతో కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారోత్సవం జరిగిన సంగతి తెలిసిందే. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ కేజ్రీవాల్‌తో ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘బిడ్డపై తల్లిదండ్రులు చూపించే ప్రేమకు వెలకట్టలేం. నాపై ఢిల్లీ ప్రజలు చూపించే ప్రేమ కూడా అలాంటిదే. నా రాష్ట్ర ప్రజలపై నాకున్నది కూడా ప్రేమే. ఎన్నికల ప్రచారంలో నాపై ప్రతిపక్షాలు పనిగట్టుకుని ఆరోపణలు చేశాయి. కేజ్రీవాల్ అన్నీ ఉచితం అంటున్నారని ఎద్దేవా చేశారు. ఒక ముఖ్యమంత్రిగా.. ప్రజలు ఎన్నుకున్న నాయకుడిగా సంక్షేమం అందించడం తప్పా. విద్య, వైద్యం కూడా డబ్బులు తీసుకుని అందించాలా. అది ఎంత సిగ్గు చేటు’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఎన్నికలు ముగిసినందున ఇక రాజకీయాల గొడవ వదిలేయాలని ఆయన ప్రజలను కోరారు. పార్టీ ఏదైనా, ఎవరికి ఓటేసినా ఢిల్లీ జనమంతా ఒకే కుటుంబంగా అభివృద్ధి వైపు సాగుదామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీ అని కాకుండా అందరం ఒకే ఫ్యామిలీ అని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఇక మంత్రులుగా మనీష్ సిసోడియా, కైలేష్ గెహ్లాట్, ఇమ్రాన్ హుస్సేన్, సత్యేంద్ర జైన్, గోపాల్ రాయ్, రాజేంద్ర పాల్ గౌతమ్ ప్రమాణం చేశారు. కొత్త ముఖాలకు చోటు దక్కలేదు. -
ఒకటి కాదు, రెండు కాదు.. హ్యాట్రిక్ కొట్టారు!
కేజ్రీ... హ్యాట్రిక్ ఢిల్లీ అసెంబ్లీ పీఠంపై సామాన్యుడు మూడోసారి ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ విద్య, వైద్య రంగంలో చేసిన అభివృద్ధి, ఉచిత సంక్షేమ పథకాలు, ఎన్నికలకు ముందు సంయమనం సాగిస్తూ చేసిన పాజిటివ్ ప్రచారం తిరిగి ఆయన ఢిల్లీ పీఠంపై కూర్చోబెట్టాయి. మన దేశంలో ఇలా హ్యాట్రిక్ కొట్టిన సీఎంలు ఎందరు ? సుదీర్ఘ కాలం సీఎంలుగా పనిచేసిన వారు ఎవరు ? బ్రేక్ లేకుండా అన్ని సంవత్సరాలు ఎలా అధికారంలో కొనసాగారు? ఇదే ఇవాళ్టి సండే స్పెషల్... (చదవండి : ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం) పవన్ కుమార్ చామ్లింగ్ (ఎస్డీఎఫ్) రాష్ట్రం: సిక్కిం, పదవీ కాలం: 24 ఏళ్ల 165 రోజులు సిక్కిం ముఖ్యమంత్రిగా సేవలు అందించిన పవన్‌కుమార్ చామ్లింగ్ ఏకంగా అయిదు సార్లు అప్రతిహతంగా అధికారాన్ని అందుకున్నారు. 1994లో తొలిసారిగా సీఎం పీఠం ఎక్కిన ఆయన గత ఏడాది వరకు అదే పదవిలో కొనసాగారు. తన గురువు, సిక్కింను పరిపాలించిన నార్ బహుదూర్ భండారీపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన చామ్లింగ్ 1992లో సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎస్డీఎఫ్)పేరుతో కొత్త పార్టీ పెట్టారు. భండారీది అరాచకవాదమని, తాను ప్రజాస్వామ్యం ఎలా ఉంటుందో చూపిస్తానంటూ ఎన్నికల బరిలో దూకి 1995లో సీఎం పదవి చేపట్టారు. అభివృద్ధి, శాంతిభద్రతలపై ఎక్కువ దృష్టి సారించారు. సిక్కిం రాష్ట్రంలో సహజ వనరుల్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని వ్యవసాయాన్ని, పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టించారు. బడ్జెట్లో 70 శాతం నిధుల్ని గ్రామీణ ప్రాంతాల్లోనే వినియోగించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 30శాతం రిజర్వేషన్లు కల్పించి మహిళా సాధికారత సాధించారు. దేశంలో పూర్తిగా సేంద్రియ పంటలు పండిస్తున్న తొలి రాష్ట్రంగా సిక్కిం 2015లో రికార్డులకెక్కింది. పదో తరగతి వరకు అందరికీ ఉచిత విద్య అందివ్వడం కూడా ప్రజల్లో పవన్‌కుమార్‌పై ఒక క్రేజ్‌ని సృష్టించాయి. చామ్లింగ్ పదవి చేపట్టేనాటికి రాష్ట్రంలో 40శాతానికిపైగా జనాభా దారిద్య్రరేఖ దిగువన ఉన్నారు. దానిని 8శాతానికి తగ్గించారు. సగటు స్థూల జాతీయోత్పత్తి కంటే ఎప్పుడూ సిక్కింలో అధికంగా ఉత్పత్తి జరుగుతుంది. క్షేత్రస్థాయికి పరిపాలనను తీసుకువెళ్లడం, ప్రజలతో నేరుగా సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం, తాను చేసిన తప్పుల్ని గ్రహించుకొని వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టడం, నిరంతరం పుస్తకాలు చదువుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా పాలనలో మార్పులు చేపట్టడం వంటి చామ్లింగ్ చర్యలు ప్రజల్లో చరిష్మాను పెంచాయి. పశ్చిమబెంగాల్‌కు అత్యధిక కాలం సీఎంగా సేవలు అందించిన జ్యోతిబసు రికార్డును బద్దలు కొట్టేలా చేశాయి. జ్యోతిబసు (సీపీఐ–ఎం) రాష్ట్రం: పశ్చిమ బెంగాల్, పదవీ కాలం: 23 ఏళ్ల 137 రోజులు దేశంలో కమ్యూనిస్టు ఉద్యమానికి ఒక జ్యోతిలా వెలుగులు పంచిన జ్యోతిబసు పశ్చిమబెంగాల్‌ను రెండు దశాబ్దాల పాటు ఏలి తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సాధించారు. వామపక్ష భావజాలంపై గట్టి విశ్వాసం కలిగిన జ్యోతిబసు 1940లో యువకుడిగా ఉన్నప్పుడే కమ్యూనిస్టు పార్టీలో చేరారు. అయితే సీఎం పదవి చేపట్టడానికి ఆయన 37 ఏళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది. 1977లో దేశంలో కాంగ్రెస్ పార్టీ అత్యవసర పరిస్థితి విధించిన అనంతరం పశ్చిమ బెంగాల్లో లెఫ్ట్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చింది. జ్యోతిబసు రచించిన వ్యూహాలతోనే ఆ కూటమి అధికారాన్ని దక్కించుకుంది. సీఎం అయ్యాక భూసంస్కరణలు, వ్యవసాయ కూలీలకు కనీస వేతనాలు, పంచాయతీల్లో మూడు అంచెల వ్యవస్థ, వితంతువులకు, నిరుద్యోగులకు భృతి, యువజన వ్యవహారాల కోసం ప్రత్యేక శాఖ వంటివన్నీ ఆయనను అత్యధిక కాలం సీఎంగా కొనసాగేలా చేశాయి. 2000 సంవత్సరంలో బుద్ధదేవ్ భట్టాచార్యకు రాష్ట్ర పగ్గాలు అప్పగించి సీఎం పదవి నుంచి వైదొలిగారు. 1996లో పార్టీ నియమనిబంధనలకి తలొగ్గి గుమ్మం దాకా వచ్చిన ప్రధాని పదవిని వదులుకున్నారు. అప్పట్లో అటల్ బిహారీ వాజ్‌పేయి 13 రోజుల పాలన అనంతరం యునైటెడ్ ఫ్రంట్ నాయకుడిగా జ్యోతిబసు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కానీ సీపీఎం అగ్ర నాయకత్వం ప్రభుత్వంలో భాగస్వామ్యం అవడానికి నిరాకరించడంతో ప్రధాని అయ్యే అవకాశాన్ని కోల్పోయారు. మాణిక్ సర్కార్ (సీపీఐ–ఎం) రాష్ట్రం: త్రిపుర, పదవీ కాలం: 19 ఏళ్ల 363 రోజులు తనకంటూ ఒక సొంత ఇల్లు, కారు లేని ఏకైక ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్. త్రిపురలో వరసగా నాలుగుసార్లు ఎర్రజెండా ఎగురవేసిన కమ్యూనిస్ట్ దిగ్గజం మాణిక్ సర్కార్. దేశంలోనే నిరుపేద సీఎంగా రికార్డులకెక్కారు. త్రిపురలో ఒక టైలర్ కుటుంబంలో జన్మించిన మాణిక్ సర్కార్ చిన్నప్పుడే కమ్యూనిజం వైపు ఆకర్షితుడై సీపీఐ (ఎం)లో చేరారు. 1998లో తొలిసారిగా త్రిపుర సీఎంగా పదవి చేపట్టిన ఆయన 19 ఏళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. మాణిక్ సర్కార్ సీఎం పదవిలో ఉన్నప్పుడు తన జీతంలో నెలకి రూ.5 వేలు ఉంచుకొని మిగిలినది పార్టీకి విరాళంగా ఇచ్చేవారు. ఆయన సీఎం అయిన సమయంలో త్రిపురలో నిరంతరం హింస, ఘర్షణ చెలరేగుతూ ఉండేది. బెంగాలీలకు, ఆదివాసీలకు మధ్య ఘర్షణలు ఉండేవి. బెంగాల్ నుంచి వచ్చే తీవ్రవాదులు రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేవారు. అలాంటి హింసాత్మక వాతావరణం నుంచి శాంతి స్థాపన దిశగా మాణిక్ సర్కార్ తీసుకున్న చర్యలు, ఆయనలో నిజాయితీ, నిరాండబరత అన్నేళ్లు పదవిలో కొనసాగేలా చేశాయి. అయితే మాణిక్ సర్కార్ ఎంత నిరాడంబరంగా ఉన్నారో, అందరూ అంతే సామాన్యంగా ఉండాలని భావించారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు అరకొర జీతాలతో బతుకు బండి లాగాల్సి వచ్చేది. అందుకే రెండేళ్ల క్రితం త్రిపుర కోటపై ఎర్రజెండాకి బదులుగా కాషాయం జెండా రెపరెపలాడింది. నవీన్ పట్నాయక్ (బిజూ జనతాదళ్) రాష్ట్రం: ఒడిశా, పదవీ కాలం: 2000 సంవత్సరం నుంచి ఇంకా కొనసాగుతున్నారు. మాతృభాష ఒరియాలో కూడా మాట్లాడలేరు. అయినా అయిదు దఫాలుగా వరస విజయాలతో దూకుడు చూపిస్తున్నారు. ఒడిశాలో జన హృదయ నేత బిజు పట్నాయక్ మరణానంతరం ఆయన వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన నవీన్ పట్నాయక్ ఆ తర్వాత కాలంలో జనతాదళ్ నుంచి విడిపోయి బిజూ జనతాదళ్ స్థాపించారు. ప్రజా నేతగా ఎదిగారు. ఒకప్పుడు ఒడిశా అంటే అత్యంత వెనుకబడిన రాష్ట్రం. అలాంటి రాష్ట్రానికి పగ్గాలు చేపట్టిన నవీన్ అభివృద్ధి అంటే ఏంటో చూపించారు. ఖనిజ సంపద అత్యధికంగా ఉన్నప్పటికీ మౌలిక సదుపాయాలు, మానవ వనరులు లేని ఆ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు వచ్చేవారు కాదు. నవీన్ సీఎం అయ్యాక మౌలిక సదుపాయాల రంగంలో సంస్కరణలు తీసుకువచ్చి, నైపుణ్యం కలిగిన కార్మిక శక్తిని తయారు చేసి చూపించారు. దీంతో పెట్టుబడులు, ప్రభుత్వ రంగ సంస్థలు ఒడిశాని వెతుక్కుంటూ వచ్చాయి. ప్రజాసేవ, సుపరిపాలనే అస్త్రాలుగా ముందుకు సాగారు. చౌక ధరకే బియ్యం, స్కూలు బాట పట్టే విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ, ఎన్నో పేదరిక నిర్మూలన కార్యక్రమాలు చేపట్టి 80 లక్షల మందికి పైగా ప్రజల్ని దారిద్య్ర రేఖకి ఎగువకి తీసుకువచ్చారు. అనునిత్యం తుపాన్లలో చిక్కుకునే ఒడిశాలో ప్రకృతి వైపరీత్యాల సమయాలను ఆయన ఎదుర్కొనే తీరు అంతర్జాతీయంగా ప్రశంసలు తెచ్చిపెట్టింది. షీలా దీక్షిత్ (కాంగ్రెస్) రాష్ట్రం: ఢిల్లీ, పదవీ కాలం: 15 ఏళ్ల 25 రోజులు ఇప్పుడు అందరం కేజ్రీవాల్ గురించి మాట్లాడుతున్నాం కానీ ఢిల్లీ పీఠాన్ని వరసగా మూడుసార్లు దక్కించుకొని అరుదైన ఘనత సా«ధించిన తొలి సీఎం షీలాదీక్షిత్. కాంగ్రెస్ డార్లింగ్‌గా పేరు సంపాదించిన ఆమె 1998 నుంచి 2013 వరకు ఢిల్లీని పరిపాలించి దేశ రాజధాని రూపు రేఖలు మార్చారు. ఢిల్లీకి రాజధాని హంగులు అద్దింది షీలా దీక్షితే. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజల్ని భాగస్వామ్యుల్ని చేసే వ్యవస్థను ప్రవేశపెట్టి మంచి పరిపాలనా దక్షురాలిగా గుర్తింపుని తెచ్చుకున్నారు. మౌలిక సదుపాయాలు, రవాణా వ్యవస్థ, విద్య, ఆరోగ్య రంగాలను ఒక గాడిలో పెట్టారు. పెద్ద పెద్ద భవంతులు, ఫ్లై ఓవర్లు, ఢిల్లీ మెట్రో ఆమె హయాంలోనే వచ్చాయి. ఢిల్లీ అభివృద్ధి చెందడానికి, నిరుపేదల సంఖ్య తగ్గడానికి షీలా చేపట్టిన అభివృద్ధే కారణం. సీఎంగా ఉన్నప్పుడు ఆమెపై అవినీతి ఆరోపణలూ వచ్చాయి కానీ ఏవీ కోర్టు ముందు నిలవలేదు. రాజకీయాల్లో మహిళలు మనుగడ సాగించడమే కష్టమైపోతున్న రోజుల్లో షీలా దీక్షిత్ మూడు సార్లు వరసగా ఎన్నికల్లో విజయభేరి మోగించి రికార్డు సృష్టించారు. 2013లో కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీని ప్రవేశపెట్టి రాజకీయ రంగ ప్రవేశం చేశాక ఆయన చరిష్మా ముందు షీలా నిలబడలేకపోయారు. గాంధీ కుటుంబానికి వీర విధేయురాలైన ఆమె గత ఏడాది లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో 80 ఏళ్ల వయసులోనూ ఉత్సాహంగా పాల్గొని అన్ని నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ ఓట్ల శాతం పెరగడానికి కృషి చేశారు. రమణ్ సింగ్ (బీజేపీ) రాష్ట్రం: ఛత్తీస్‌గఢ్, పదవీ కాలం: 15 ఏళ్ల 4 రోజులు రాజకీయాల్లో మిస్టర్ క్లీన్ అన్న ఇమేజ్ సాధిం చడం అంత సులభమేమీ కాదు. అలాంటి ఇమేజ్‌తోనే నక్సల్స్ ప్రభావిత రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లో 2003–18వరకు మూడుసార్లు హ్యాట్రిక్ విజయాలు సాధించారు రమణ్ సింగ్. బీజేపీకి పదిహేనేళ్ల పాటు వెన్నుదన్నుగా నిలిచారు.. ప్రజా పంపిణీ వ్యవస్థలో భారీగా సంస్కరణలు తీసుకువచ్చి ఆహార భద్రత కల్పించారు. నిరుపేదలకు, ముఖ్యంగా ఆదివాసీలకు కడుపు నిండా తిండి దొరకడంతో వారంతా రమణ్ సింగ్‌ను ఆప్యాయంగా చావాల్ బాబా అని పిలిచేవారు. ఆహారం, విద్య, ఆరోగ్య రంగాల్లో ఆయన ప్రవేశపెట్టిన పథకాలే ఛత్తీస్‌గఢ్ పరిపాలనను రమణీయంగా మార్చాయి. వ్యూహాత్మకంగా నక్సల్స్ అణిచివేత కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనించేలా చర్యలు తీసుకున్నారు. అధికారం చేపట్టేనాటికి 7 వేల కోట్లు ఉన్న రాష్ట్ర బడ్జెట్‌ను 78 వేల కోట్లకు తీసుకువచ్చారు. ఆరోగ్య రంగంలో ముఖ్యమంత్రి స్వస్త బీమా యోజన ద్వారా ఏడాదికి రూ.30 కడితే చాలు ఉచితంగా ఆరోగ్య సేవలు అందించేవారు. శిశు మరణాల్ని అరికట్టారు. అయితే 2018కి ముందు ఎన్నికల్లో రమణ్ సింగ్‌పై పడిన అవినీతి మకిలి, కాంగ్రెస్ నుంచి విడిపోయి వేరు కుంపటి పెట్టిన అజిత్ జోగి పార్టీ బీజేపీ ఓట్లను చీల్చేయడంతో రమణ్ సింగ్ నాలుగోసారి అధికారం చేపట్టలేకపోయారు. కానీ ఇప్పటికీ రమణ్ సింగ్ పేరు ఆదివాసీల హృదయాల్లో మారు మోగుతూనే ఉంది. నరేంద్ర మోదీ (బీజేపీ) రాష్ట్రం: గుజరాత్, పదవీ కాలం: 12 ఏళ్ల 226 రోజులు 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీ, తర్వాత ఏడాది జరిగిన గోద్రా మత ఘర్షణల మచ్చను జయించి మరీ హ్యాట్రిక్ సీఎంగా నిలిచారు. గుజరాత్ మోడల్ అభివృద్ధినే పెట్టుబడిగా పెట్టి 2014లో లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రధాని పగ్గాలు కూడా చేపట్టారు. ప్రస్తుతం దేశంలో అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో గుజరాత్ ఒకటిగా నిలిచిందంటే దానికి మోదీ ప్రవేశ పెట్టిన అభివృద్ధి పథకాలే కారణం. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు మోదీ మౌలిక రంగాల కల్పనలో అత్యధికంగా నిధులు వినియోగించారు. ఆర్థిక రంగాన్ని పరుగులు పెట్టించడంలో కొత్త ఒరవడి సృష్టించడంతో ఆయన అభిమానులు మోడీనామిక్స్కి తిరుగులేదని బ్రహ్మరథం పట్టారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి 5.1% ఉన్నదానిని మోదీ సీఎం అయ్యాక 16.6 శాతానికి చేర్చారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం కల్పించడంతో నిరుద్యోగ సమస్య తొలగిపోయింది. భారీ ఎత్తున పెట్టుబడుల సదస్సులు నిర్వహించి పారిశ్రామిక రాయితీలు ఇచ్చారు. ఎవరైనా పరిశ్రమలను నెలకొల్పడానికి ముందుకు వస్తే చాలు, ప్రభుత్వ యంత్రాంగమే వారి దగ్గరకు పరుగులు తీసి ఆహ్వానించేది. అభివృద్ధి ఎంత జరిగిందో దానికి నీడలా దుర్భర దారిద్య్రం కూడా నెలకొని ఆర్థిక అసమానతలు పెరిగిపోయాయన్న విమర్శలున్నాయి. మాతా శిశు మరణాలు గుజరాత్లో అత్యధికమన్న వాదనా ఉంది. -
పేరు సార్థకం చేసుకున్న సామాన్యుడి పార్టీ..!
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడోసారి విజయ ఢంకా మోగించిన ఆమ్ ఆద్మీపార్టీ (సామాన్యూడి పార్టీ) తన పేరుకు తగ్గట్టే అడుగులు వేస్తోంది. ఆదివారం జరుగబోయే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి 50 మంది సాధారణ పౌరులను ముఖ్య అతిథులుగా ఆప్ ఆహ్వానించిందని ఆప్ నేత మనీష్ సిసోడియా శనివారం మీడియాతో తెలిపారు. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, రాజకీయ ప్రముఖులు, అధికార యంత్రాగానికి చెందిన ఉన్నతాధికారులతో పాటు.. పారిశుద్ధ్య కార్మికులు, ఆటో, అంబులెన్స్, మెట్రో రైల్ డ్రైవర్లు, పాఠశాల ప్యూన్లు వేదిక పంచుకోనున్నారు. ఇక రామ్‌లీలా మైదానంలో జరిగే అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ప్రజలను ఆప్ ఇప్పటికే కోరింది. మాస్కో ఒలింపియాడ్‌లో పతకాలు సాధించిన విద్యార్థులు, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నిమాపక దళ సిబ్బంది కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా కార్యక్రమానికి ఆహ్వానించినట్టుగా సిసోడియా తెలిపారు. కాగా, మొత్తం 70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ 62 సీట్లలో బీజేపీ 8 సీట్లలో విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
ఏపీ గవర్నర్‌గా విశ్వభూషణ్ ప్రమాణం
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా విశ్వభూషణ్ హరిచందన్ బుధవారం ఉదయం 11.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి ప్రవీణ్‌కుమార్ పదవీ ప్రమాణం చేయించారు. దీంతో విభజన తర్వాత ఏపీకి పూర్తి స్థాయి గవర్నర్‌గా విశ్వభూషణ్ బాధ్యతలు చేపట్టినట్టయింది.విజయవాడలోని రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. ఇంకా ఈ కార్యక్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారాం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ గౌతమ్ సవాంగ్, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, హైకోర్టు న్యాయమూర్తులు, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు, ప్రజాప్రతినిధులు, అఖిల భారత సర్వీసు అధికారులు, సీఎంవో కార్యాలయ అధికారులు, గవర్నర్ కార్యాలయ అధికారులు హాజరయ్యారు. గవర్నర్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పురస్కరించుకుని రాజ్‌భవన్ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. గవర్నర్ ప్రమాణ స్వీకారానికి సీఎం, ఎమ్మెల్యేలు హాజరయ్యేందుకు వీలుగా శాసనసభను మధ్యాహ్ననికి వాయిదా వేశారు. దీంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో అసెంబ్లీ నుంచి రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. కాగా, ఒడిశాకు చెందిన విశ్వభూషణ్‌కు విశేష రాజకీయ అనుభవం ఉంది. భారతీయ జనసంఘ్‌లో 1971లో చేరడం ద్వారా రాజకీయ ప్రవేశం చేసిన విశ్వభూషణ్ హరిచందన్.. ఆ పార్టీ జాతీయ కార్యనిర్వాహక సభ్యునిగా, రాష్ట్ర జనరల్ సెక్రటరీగా పనిచేశారు. ఎమర్జెన్సీని వ్యతిరేకించినందుకు ఆయన 1975లో మీసా చట్టం కింద నిర్బంధానికి గురయ్యారు. 1977లో భారతీయ జనసంఘ్ జనతా పార్టీగా మారే వరకు ఆయన ఆ పదవుల్లో కొనసాగారు. తర్వాత బీజేపీలో చేరి 1980 నుంచి 1988 వరకు ఒడిశా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1988లో విశ్వభూషణ్ జనతా పార్టీలో చేరి తిరిగి మళ్లీ 1996 ఏప్రిల్‌లో బీజేపీలో చేరారు. ఆయనకు కవిత్వమంటే మక్కువ. మొరుబొత్తాస్, రాణా ప్రతాప్, శేషఝలక్, అష్టశిఖ, మానసి పుస్తకాలను ఒరియాలో రచించారు. ఒక నాటికనూ రచించారు. చారిత్రక ప్రదేశాలను సందర్శించడం ఆయనకెంతో ఇష్టం. -
పార్లమెంటులో ‘జై తెలంగాణ’
సాక్షి, న్యూఢిల్లీ : 17వ లోక్‌సభ కొలువుదీరిన రెండోరోజు(మంగళవారం) తెలంగాణ ఎంపీలు ప్రమాణస్వీకారం చేశారు. మొత్తం 17 మంది సభ్యులకుగాను కిషన్‌రెడ్డి సోమవారమే ప్రమాణ స్వీకారం చేశారు. మిగిలిన 16 మందిలో పది మంది తెలుగులో, నలుగురు ఇంగ్లిష్‌లో, ఒకరు హిందీలో, మరొకరు ఉర్దూ లో ప్రమాణం చేశారు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు(బీజేపీ), పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత(టీఆర్ఎస్) తెలుగులో దైవసాక్షిగా ప్రమాణం చేశారు. జై తెలంగాణ, జైజై భారత్ అంటూ ముగించారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్(బీజేపీ) తెలుగులో దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేసి, భారత్ మాతా కీ జై అంటూ ముగిం చారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ (బీజేపీ) ఆంగ్లంలో దైవసాక్షిగా ప్రమాణం చేసి, భారత్ మాతా కీ జై అంటూ ముగించారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్(టీఆర్ఎస్) హిందీలో దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేసి, జై తెలంగాణ అంటూ నినదించారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి (టీఆర్ఎస్) తెలుగులో దైవసాక్షిగా ప్రమాణం చేశారు. మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి(కాంగ్రెస్) తెలుగులో, తన ఫోన్లో ఉన్న ప్రమాణ స్వీకార ప్రతిని చదివారు. చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి(టీఆర్ఎస్), మహబూబ్‌నగర్ ఎంపీ మన్నెం శ్రీనివాస్‌రెడ్డి(టీఆర్ఎస్), నల్ల గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి(కాంగ్రెస్) ఇంగ్లిష్ లో దైవసాక్షిగా ప్రమాణం చేశారు. భువనగిరి, నాగర్‌కర్నూలు ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (కాంగ్రెస్), పోతుగంటి రాములు (టీఆర్ఎస్) తెలుగులో దైవసాక్షిగా ప్రమాణం చేశారు. వెంకట్‌రెడ్డి (కాం గ్రెస్) తెలుగులో దైవసాక్షిగా ప్రమాణం చేస్తుండగా బీజేపీ ఎంపీ బండి సంజయ్ వెంకట్‌రెడ్డిని ఉద్దేశించి బీజేపీలోకి స్వాగతం అంటూ పిలిచారు. వెంకట్‌రెడ్డి తో మంత్రి కిషన్‌రెడ్డి కరచాలనం చేశారు. వరంగల్లు ఎంపీ పసునూరి దయాకర్(టీఆర్ఎస్), మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత (టీఆర్ఎస్) తెలుగు లో దైవసాక్షిగా ప్రమాణం చేశారు. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు(టీఆర్ఎస్) తెలుగులో దైవ సాక్షిగా ప్రమాణం చేశారు. అసదుద్దీన్ రాకతో హోరెత్తిన నినాదాలు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఉర్దూలో దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసేందుకు తన స్థానం నుంచి అసదుద్దీన్ వస్తుండగా బీజేపీ సభ్యులు బండి సంజయ్ కుమార్ తదితరులు భారత్ మాతా కీ జై, జై శ్రీరాం, వందేమాతరం అంటూ నినాదాలు చేశారు. మరింత గట్టిగా అరవం డి అంటూ అసదుద్దీన్ చేతులతో సైగ చేశారు. ప్రమాణ స్వీకారాన్ని ముగిస్తూ ‘జై భీమ్, జై మీమ్, తక్బీర్ అల్లా హో అక్బర్, జై హింద్’అంటూ నినదించారు. ప్రమాణ స్వీకారం అనంతరం అసదుద్దీన్ ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడారు. ‘నన్ను చూడగానే వారికి ఆ నినాదాలు గుర్తొచ్చినందుకు సంతోషం. వారు రాజ్యాంగాన్ని, ముజఫర్‌పూర్ చిన్నారుల మరణాలను కూడా గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తున్నా’అంటూ పేర్కొన్నారు. తరలివచ్చిన కుటుంబ సభ్యులు, నేతలు ప్రమాణ స్వీకారానికి ఎంపీల కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గస్థాయి నేత లు తరలివచ్చారు. ఎంపీలు రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుటుంబసభ్యులు, వెంకట్‌రెడ్డి సోదరుడు, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి గ్యాలరీ నుంచి ప్రమాణ స్వీకారాన్ని వీక్షించారు. ఎంపీ ధర్మపురి అరవింద్ కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. ఆయన తండ్రి డి.శ్రీనివాస్ రాజ్యసభ సభ్యుల గ్యాలరీ నుంచి వీక్షించారు. నామా, పోతుగంటి కుటుంబ సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్, ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్, సురేందర్‌రెడ్డి,మాణి క్రావు, తదితరులు ఎంపీ బీబీ పాటిల్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మెదక్ లోక్‌సభ స్థానం పరిధి లోని నియోజకవర్గ నేతలు భారీగా తరలివచ్చి కొత్త ప్రభాకర్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. -
లోక్‌సభలో తెలంగాణ ఎంపీల ప్రమాణం
సాక్షి, న్యూఢిల్లీ : 17వ లోక్‌సభలో తెలంగాణకు చెందిన సభ్యులు మంగళవారం ఎంపీలుగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. టీఆర్ఎస్ నుంచి 9 మంది, కాంగ్రెస్ నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఇద్దరు, ఎంఐఎం నుంచి ఒక ఎంపీలుగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. మొదట పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేతకాని ప్రమాణం చేయగా.. ఆ తర్వాత వరుసగా బండి సంజయ్ కుమార్, అరవింద్ ధర్మపురి, బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్ రెడ్డి, రేవంత్ రెడ్డి, అసదుద్దీన్ ఓవైసీ, డాక్టర్ రంజిత్ రెడ్డి, మన్నె శ్రీనివాస్ రెడ్డి, పోతుగంటిరాములు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పసునూరి దయాకర్, మాలోతు కవిత, నామా నాగేశ్వర్రావు ప్రమాణం చేశారు. వీరిలో కొత్త ప్రభాకర్ రెడ్డి, రాములు, నామా నాగేశ్వరరావు, మాలోతు కవిత, కొమటి రెడ్డి వెంకట్ రెడ్డి, వెంకటేశ్ నేత మాతృభాష తెలుగులో ప్రమాణస్వీకారం చేశారు. బీబీ పాటిల్ హిందీలో, అసదుద్దీన్ ఓవైసీ ఉర్దూలో ప్రమాణం చేశారు. ఇక అరవింద్ ధర్మపురి, రంజిత్ రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంగ్లీష్ భాషలో ప్రమాణం చేశారు. -
ఏపీ ఎంపీల ప్రమాణ స్వీకారం
సాక్షి, న్యూఢిల్లీ: పండగ వాతావరణం మధ్య 17వ లోక్‌సభ సోమవారం కొలువుదీరింది. తొలిరోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రివర్గ సభ్యులు, అక్షర క్రమంలో పలు రాష్ట్రాల సభ్యులు ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. అక్షర క్రమంలో మొదట అండమాన్ నికోబార్ దీవుల ఎంపీ, అనంతరం ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. వైఎస్సార్‌కాంగ్రెస్ ఎంపీలు పార్టీ కండువా ధరించి రావడం ఆకట్టుకుంది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎంపీల బంధువులు, మిత్రులు, పార్టీల నేతలు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, టీడీపీ ఎంపీ సి.ఎం.రమేష్ లోక్‌సభలోని రాజ్యసభ ఎంపీల గ్యాలరీ నుంచి వీక్షించారు. ఆంధ్రప్రదేశ్ సభ్యుల్లో 12 మంది మాతృభాష అయిన తెలుగులోనూ, 11 మంది ఇంగ్లీషులోనూ, ఇద్దరు హిందీలోనూ ప్రమాణ స్వీకారం చేశారు. 12 మంది తెలుగులో.. అరకు ఎంపీ గొడ్డేటి మాధవి (వైఎస్సార్సీపీ), విశాఖపట్నం ఎంపీ ఎం.వి.వి.సత్యనారాయణ (వైఎస్సార్సీపీ), అనకాపల్లి ఎంపీ డాక్టర్ భీశెట్టి వెంకట సత్యవతి (వైఎస్సార్సీపీ), కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ (వైఎస్సార్సీపీ), రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ (వైఎస్సార్సీపీ), బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ (వైఎస్సార్సీపీ), అనంతపురం ఎంపీ తలారి రంగయ్య (వైఎస్సార్సీపీ), కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి (వైఎస్సార్సీపీ), నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి (వైఎస్సార్సీపీ), చిత్తూరు ఎంపీ ఎన్.రెడ్డప్ప (వైఎస్సార్సీపీ) తెలుగులో దైవసాక్షిగా ప్రమాణం చేయగా.. విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ (వైఎస్సార్సీపీ), మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి (వైఎస్సార్సీపీ) పవిత్ర హృదయంతో ప్రమాణం చేశారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం: పీవీ మిథున్‌రెడ్డి ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం వైఎస్సార్సీపీ లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘మాకు ప్రజలు మంచి అవకాశం ఇచ్చారు.. సద్వినియోగం చేసుకుంటాం. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలన్నీ నెరవేర్చడం, ప్రత్యేక హోదా సాధించడం లక్ష్యంగా పనిచేస్తాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో సత్సంబంధాలు పెట్టుకోవడమే తప్ప.. పదవుల కోసం వెంపర్లాడే ప్రసక్తి లేదు. ప్రత్యేక హోదా కోసమే పోరాడుతాం..’ అని పేర్కొన్నారు. తన నియోజకవర్గంలో ఇంటింటికి తాగునీరు అందించేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. కర్నూలు ఎంపీ డా. సంజీవ్‌కుమార్ మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒక సైనికుడిగా పనిచేస్తూ రాష్ట్రానికి సంబంధించిన అన్ని సమస్యలపై పార్లమెంటులో గళమెత్తుతామన్నారు. కర్నూలు నగరాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. తన నియోజకవర్గ పరిధిలో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న కొల్లేరు సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ అన్నారు. చింతలపూడి ప్రాజెక్టు పూర్తికి పనిచేస్తామని, భూ సేకరణ సమస్యలను పరిష్కరిస్తామన్నారు. 11 మంది ఇంగ్లీషులో... రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి (వైఎస్సార్సీపీ), నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు (వైఎస్సార్సీపీ), ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ (వైఎస్సార్సీపీ), విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (టీడీపీ), గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ (టీడీపీ), నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు(వైఎస్సార్సీపీ), ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి (వైఎస్సార్సీపీ), నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి(వైఎస్సార్సీపీ), కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్‌కుమార్ (వైఎస్సార్సీపీ), హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ (వైఎస్సార్సీపీ) ఇంగ్లీషులో దైవ సాక్షిగానూ, తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు (వైఎస్సార్సీపీ) సత్యనిష్టతో ప్రమాణం చేశారు. కాగా శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్నాయుడు (టీడీపీ), అమలాపురం ఎంపీ అనురాధ (వైఎస్సార్సీపీ) హిందీలో ప్రమాణ స్వీకారం చేశారు. -
హిందీలో తెలుగు ఎంపీల ప్రమాణం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ నుంచి లోక్‌సభకు ఎన్నికైన 25 మంది ఎంపీలు సోమవారం సభలో ప్రమాణం చేశారు. వీరితో ప్రొటెం స్పీకర్ వీరేంద్ర కుమార్ ప్రమాణం చేయించారు. ఆంగ్ల అక్షర క్రమంలో మొదటగా అండమాన్ నికోబార్ ఎంపీలు, తర్వాత ఏపీ ఎంపీలు ప్రమాణం చేశారు. ఏపీ ఎంపీల్లో అరకు ఎంపీ గొడ్డేటి మాధవి ముందుగా తెలుగులో ప్రమాణం చేశారు. 12 మంది తెలుగులో, 11 మంది ఇంగ్లీషులో, ఇద్దరు హిందీలో ప్రమాణం చేశారు. 2. శ్రీకాకుళం టీడీపీ ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు హిందీలో ఈశ్వరుడి సాక్షిగా ప్రమాణం చేశారు. 3. విజయనగరం వైఎస్సార్సీపీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ తెలుగులో పవిత్ర హృదయంతో ప్రమాణం చేశారు. 4. విశాఖపట్నం వైఎస్సార్సీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తెలుగులో దేవుడి సాక్షిగా ప్రమాణం స్వీకరించారు. 5. అనకాపల్లి వైఎస్సార్సీపీ ఎంపీ డాక్టర్ భీశెట్టి వెంకట సత్యవతి తెలుగులో దైవసాక్షిగా ప్రమాణం చేశారు. 6. కాకినాడ వైఎస్సార్సీపీ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ తెలుగులో దైవసాక్షిగా ప్రమాణం చేశారు. 7. అమలాపురం వైఎస్సార్సీపీ ఎంపీ చింతా అనురాధ హిందీలో ప్రమాణం స్వీకారం చేశారు. 8. రాజమండ్రి వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్ తెలుగులో దైవసాక్షిగా ప్రమాణం చేశారు. 9. నరసాపురం వైఎస్సార్సీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇంగ్లీషులో దేవుడి సాక్షిగా ప్రమాణం చేశారు. 10. ఏలూరు వైఎస్సార్సీపీ ఎంపీ కోటగిరి శ్రీధర్ ఇంగ్లీషులో దేవుడి సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. 11. మచిలీపట్నం వైఎస్సార్సీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలుగులో పవిత్ర హృదయంతో ప్రమాణం చేశారు. 12. విజయవాడ టీడీపీ కేశినేని శ్రీనివాస్(నాని) ఇంగ్లీషులో దేవుడి సాక్షిగా ప్రమాణం చేశారు. 13. గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఇంగ్లీషులో దేవుడి సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. 14. నర్సరావుపేట వైఎస్సార్సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఇంగ్లీషులో దేవుడి సాక్షిగా ప్రమాణం చేశారు. 15. బాపట్ల వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేశ్ తెలుగులో దైవసాక్షిగా ప్రమాణం చేశారు. 16. ఒంగోలు వైఎస్సార్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఇంగ్లీషులో దేవుడి సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. 17. నంద్యాల వైఎస్సార్సీపీ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి ఇంగ్లీషులో దేవుడి సాక్షిగా ప్రమాణం చేశారు. 18. కర్నూల్ వైఎస్సార్సీపీ ఎంపీ డాక్టర్ సంజీవ్‌కుమార్ ఇంగ్లీషులో దేవుడి సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. 19. అనంతపురం వైఎస్సార్సీపీ ఎంపీ తలారి రంగయ్య తెలుగులో పవిత్ర హృదయంతో ప్రమాణం చేశారు. 20. హిందూపురం వైఎస్సార్సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంగ్లీషులో దేవుడి సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. 21. కడప వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తెలుగులో దైవ సాక్షిగా ప్రమాణం చేశారు. 22. నెల్లూరు వైఎస్సార్సీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి తెలుగులో దైవ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. 23. తిరుపతి వైఎస్సార్సీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు ఇంగ్లీషులో దేవుడి సాక్షిగా ప్రమాణం చేశారు. 24. రాజంపేట వైఎస్సార్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఇంగ్లీషులో దేవుడి సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. 25. చిత్తూరు వైఎస్సార్సీపీ ఎంపీ రెడ్డప్ప తెలుగులో దైవ సాక్షిగా ప్రమాణం చేశారు. -
ఇదో కొత్త చరిత్ర
సాక్షి, అమరావతి : సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం రాష్ట్రంలో కొత్త చరిత్రను లిఖించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు దాదాపు 60 శాతం మంత్రి పదవులు ఇస్తూ సామాజిక, రాజకీయ విప్లవం సృష్టిస్తూ నవ యుగానికి నాంది పలికారు. ఐదు ఉప ముఖ్యమంత్రి పదవుల్లో నాలుగు ఆ వర్గాలకే కేటాయించి యావత్ దేశం దృష్టిని ఆకర్షించారు. మంత్రిత్వ శాఖల కేటాయింపులోనూ ఆ వర్గాలకు అగ్రాసనం వేసి సామాజిక న్యాయ సాధన పట్ల తన చిత్తశుద్ధిని చాటి చెప్పారు. కీలకమైన హోం, రెవెన్యూ, పురపాలక, జలవనరులు, విద్య, అబ్కారీ– వాణిజ్య పన్నులు, ఆర్ అండ్ బి, కార్మిక– ఉపాధి కల్పన, సాంఘిక, మహిళా–శిశు, బీసీ, మైనార్టీ సంక్షేమం తదితర శాఖలను ఆ వర్గాలకే కేటాయించారు. శాసనసభ స్పీకర్ పదవిని కూడా బీసీ వర్గానికే ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించారు. కాపు సామాజిక వర్గానికి సముచిత ప్రాధాన్యమిస్తూ వ్యవసాయ, వైద్య, రవాణా, పర్యాటక శాఖలు కేటాయించి ప్రాధాన్యమిచ్చారు. మహానేత వైఎస్సార్ స్ఫూర్తిని కొనసాగిస్తూ రాష్ట్ర హోం మంత్రిగా దళిత మహిళను నియమించడం విశేషం. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు మంత్రిత్వ శాఖల కేటాయింపులో సముచిత ప్రాధాన్యమిచ్చి సమతౌల్యం సాధించారు. ఈ విధంగా మంత్రి మండలి ఏర్పాటు చేయడం దేశ, రాష్ట్ర చరిత్రలో తొలిసారి కావడం విశేషం. మైనార్టీలకు ఉప ముఖ్యమంత్రి పదవి బీసీ–ఇ కేటగిరి కిందకు వచ్చే ముస్లిం వర్గానికి చెందిన అంజాద్ బాషాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఉప ముఖ్యమంత్రిగా నియమించి ఆయనకు అరుదైన గౌరవం కల్పించారు. కడప నుంచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు మైనార్టీ సంక్షేమ శాఖను కేటాయించారు. ఎస్సీలకు అత్యున్నత రాజకీయ గౌరవం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎస్సీలకు రాజకీయంగా అత్యున్నత గుర్తింపునిస్తూ ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చారు. అంతే కాకుండా ఏకంగా ఐదు మంత్రి పదవులు కేటాయించడం ద్వారా ఎస్సీ వర్గాలకు తాను ఎంతటి ప్రాధాన్యమిస్తోంది చేతల్లో చూపించారు. మాల సామాజిక వర్గానికి మూడు, మాదిగ సామాజిక వర్గానికి రెండు పదవులు ఇచ్చారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే కలత్తూరు నారాయణస్వామిని ఉప ముఖ్యమంత్రిగా నియమించారు. మాల సామాజిక వర్గానికి చెందిన ఆయనకు కీలకమైన అబ్కారీ, వాణిజ్య పన్నుల శాఖలను కేటాయించడం ప్రాధాన్యత సంతరించుకుంది . ఆయన చిత్తూరు జిల్లా సత్యవేడు నుంచి ఓసారి, గంగాధర నెల్లూరు నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మాల సామాజిక వర్గానికి చెందిన మహిళ ఎమ్మెల్యే మేకతోటి సుచరితను రాష్ట్ర హోం మంత్రిగా నియమించారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి ఆమె మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మాల సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత పినిపె విశ్వరూప్‌కు సాంఘిక సంక్షేమ శాఖను కేటాయించారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఆదిమూలపు సురేష్‌కు కీలకమైన విద్యా శాఖను కేటాయించారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నుంచి ఆయన మూడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మాదిగ సామాజిక వర్గానిక చెందిన తానేటి వనితను మహిళా–శిశు సంక్షేమ శాఖ మంత్రిగా నియమించారు. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం నుంచి ఆమె రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాపు సామాజిక వర్గానికి పెద్దపీట రాష్ట్రంలో కాపు సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయంగా అత్యధిక ప్రాధాన్యం కల్పిస్తూ ఆ వర్గానికి ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చారు. నాలుగు మంత్రి పదవులు కూడా కేటాయిస్తూ వారికి కీలకమైన శాఖలు కేటాయించి పెద్దపీట వేశారు. ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్(నాని)ను ఉప ముఖ్యమంత్రిగా నియమించారు. ఆయనకు అత్యధిక ప్రాధాన్యమున్న వైద్య శాఖను కేటాయించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆళ్ల నాని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎంతో ప్రాధాన్యమున్న వ్యవసాయ శాఖను కురసాల కన్నబాబుకు కేటాయించారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి ఈయన రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రవాణా, సమాచార శాఖలను పేర్ని శ్రీవెంకటరామయ్య(నాని)కు కేటాయించారు. ఆయన కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గం నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ముత్తంశెట్టి శ్రీనివాస్ (అవంతి శ్రీనివాస్)కు పర్యాటక, సాంస్కృతిక, యువజ సర్వీసుల శాఖను కేటాయించారు. రాష్ట్రంలో పర్యాటక హబ్‌గా ఉన్న విశాఖపట్నం నగరానికి చెందిన ఆయనకు అందుకు సంబంధించిన శాఖలు కేటాయించడం ద్వారా తగిన ప్రాధాన్యమిచ్చారు. భీమిలి నియోజకవర్గం నుంచి ఈయన రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గిరిజనులకు రాజకీయ అగ్రాసనం రాష్ట్రంలో గణనీయ సంఖ్యలో ఉన్న గిరిజనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయంగా అత్యున్నత స్థానం కల్పించారు. పాముల పుష్ప శ్రీవాణిని ఉప ముఖ్యమంత్రిగా నియమిస్తూ.. ఆమెకు గిరిజన సంక్షేమ శాఖను కేటాయించారు. విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం నుంచి ఆమె వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రాంతీయ సమతుల్యం రాష్ట్రంలో అన్ని పాంత్రాలకు తన మంత్రివర్గంలో సమాన ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రాంతీయ సమతుల్యం సాధించారు. ఉత్తరాంధ్రకు ఉప ముఖ్యమంత్రి పదవితోపాటు కీలకమైన పురపాలక, ఆర్ అండ్ బి, గిరిజన సంక్షేమ, పర్యాటక మంత్రిత్వ శాఖలు ఇచ్చారు. ఉభయ గోదావరి జిల్లాలకు రెండు ఉప ముఖ్యమంత్రి పదవులతోపాటు రెవెన్యూ, వ్యవసాయ, సాంఘిక సంక్షేమ, వైద్య, గృహనిర్మాణ, మహిళా–శిశు సంక్షేమ శాఖలు కేటాయించారు. కృష్ణా– గుంటూరు జిల్లాల నుంచి ఐదు మందికి మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. కీలకమైన హోం, రవాణా, సమాచార, పౌరసరఫరాలు, దేవాదాయ, పశుసంవర్థక, మత్స్య, మార్కెటింగ్ శాఖలు కేటాయించారు. ప్రకాశం–నెల్లూరు జిల్లాల నుంచి నలుగురికి మంత్రివర్గంలో స్థానం కల్పించారు. కీలకమైన విద్యుత్, విద్య, పరిశ్రమలు, జలవనరుల శాఖలు కేటాయించారు. రాయలసీమ జిల్లాలకు ఆరు మంత్రి పదవులు దక్కాయి. రెండు ఉప ముఖ్యమంత్రి పదవులతోపాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్థిక, అబ్కారీ, వాణిజ్య పన్నులు, కార్మిక, ఉపాధి కల్పన, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలు కేటాయించారు. సామాజిక న్యాయానికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడం ద్వారా దేశంలో కొత్త రాజకీయ చరిత్రకు నాంది పలికారు. సంక్షేమ, అభివృద్ధి పాలన దిశగా ప్రభుత్వ పాలన వ్యవస్థను పరుగులు పెట్టించి రాజన్న రాజ్య స్థాపనకు ఉద్యుక్తులయ్యారు. బీసీలకు అగ్రతాంబూలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన మంత్రివర్గంలో బీసీలకు అగ్రాసనం వేశారు. ‘బీసీ–ఇ’ కేటగిరీ కిందకు వచ్చే ముస్లిం మైనార్టీలతో కలిపి బీసీలకు ఎనిమిది మంత్రి పదవులు కేటాయించారు. ఇక శాఖల కేటాయింపులో బీసీ వర్గాలను అత్యున్నత ప్రాధాన్యమిచ్చారు. సీనియర్ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్‌ను ఉప ముఖ్యమంత్రిగా నియమించి అత్యంత కీలకమైన రెవెన్యూ శాఖను కేటాయించడం విశేషం. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఆయన శెట్టి బలిజ సామాజికవర్గంలో రాష్ట్రస్థాయి నేతగా గుర్తింపు పొందారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన యువకుడైన అనిల్ కుమార్ యాదవ్‌కు కీలకమైన జలవనరుల శాఖను కేటాయించారు. నెల్లూరు నియోజకవర్గం నుంచి ఆయన వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. దేశంలోనే పొడవైన తీరం ఉన్న మన రాష్ట్రంలో మత్య్సకార సామాజిక వర్గం కూడా అధికంగా ఉంది. అందుకే ఆ సామాజిక వర్గానికి చెందిన మోపిదేవి వెంకటరమణారావుకు పశుసంవర్థక, మత్య్స, మార్కెటింగ్ శాఖలు కేటాయించారు. గుంటూరు జిల్లాకు చెందిన ఆయన ఇటీవల ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటికీ మంత్రి వర్గంలో స్థానం కల్పించడం చూస్తుంటే బీసీ వర్గాలకు ఎంతటి ప్రాధాన్యమిచ్చారనేది ఇట్టే తెలుస్తోంది. తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన బొత్స సత్యనారాయణను అత్యధిక ప్రాధాన్యమున్న పురపాలక శాఖ మంత్రిగా నియమించారు. గతంలో ఓసారి ఎంపీగా చేసిన ఆయన విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పోలినాటి వెలమ సామాజిక వర్గానికి చెందిన ధర్మాన కృష్ణదాస్‌కు రోడ్లు, భవనాల శాఖను కేటాయించారు. ఈయన శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం నుంచి నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. రాయలసీమలో అత్యధికంగా ఉండే బీసీ వర్గాలైన బోయ, కురుబ సామాజిక వర్గాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రాధాన్యమిచ్చారు. బోయ సామాజిక వర్గానికి చెందిన గుమ్మనూరు జయరాంను కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రిగా నియమించారు. ఈయన కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి విజయం సాధించారు. కురబ సామాజిక వర్గానికి చెందిన మాలగుండ్ల శంకర్ నారాయణకు బీసీ సంక్షేమ శాఖను కేటాయించారు. ఈయన తొలిసారి గెలిచినప్పటికీ మంత్రి మండలిలో స్థానం కల్పించడం ఆ సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి కల్పించిన ప్రాధాన్యతకు నిదర్శనం. సామాజిక సమతుల్యం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన మంత్రివర్గంలో ఇతర సామాజిక వర్గాలకూ సముచిత స్థానం కల్పించి సమతుల్యం పాటించారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నలుగురికి మంత్రులుగా అవకాశం కల్పించి కీలక శాఖలు కేటాయించారు. సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనుల శాఖ మంత్రిగా నియమించారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఈయన ఆరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మరో సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డిని కీలకమైన విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రిగా కీలక స్థానం కల్పించారు. ప్రకాశం జిల్లా కేంద్రం ఓంగోలు నుంచి ఆయన ఐదోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత శాసనసభలో పీఏసీ చైర్మన్‌గా సమర్థత నిరూపించుకున్న బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి అత్యధిక ప్రాధాన్యమున్న ఆర్థిక శాఖ మంత్రిగా అవకాశం కల్పించారు. కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం నుంచి ఆయన వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మేకపాటి గౌతంరెడ్డిని కీలకమైన పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రిగా నియమించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ఆయన వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కమ్మ, క్షత్రియ, వైశ్య సామాజిక వర్గాలకు ఒక్కో మంత్రి పదవి కేటాయించి ఆ వర్గాలకు గుర్తింపునిచ్చారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని)ని పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల మంత్రిగా నియమించారు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం నుంచి ఈయన వరుసగా నాలుగోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన చెరుకువాడ శ్రీరంగనాథ రాజును గృహ నిర్మాణ శాఖ మంత్రిగా నియమించారు. ఈయన ఎమ్మెల్యేగా ఎన్నికవడం ఇది రెండోసారి. వైశ్య సామాజిక వర్గానికి చెందిన వెలంపల్లి శ్రీనివాస్‌ను దేవాదాయ శాఖ మంత్రిగా నియమించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఈయన రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మహిళలకు మహోన్నత స్థానం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళలకు రాజకీయంగా మహోన్నత స్థానాన్ని కల్పించడం జాతీయ స్థాయిలో గుర్తింపు పోందింది. ముగ్గురు మహిళలకు ఆయన తన మంత్రివర్గంలో స్థానం కల్పించడమే కాక వారిలో ఒకరిని ఉప ముఖ్యమంత్రిగా నియమించడం ద్వారా మహిళలకు తానెంతటి గుర్తింపునిచ్చేది చెప్పారు. కరుపాం ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణిని ఉప ముఖ్యమంత్రిగా నియమించి గిరిజన సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖను కేటాయించారు. ఇక అత్యంత కీలకమైన హోం మంత్రిత్వ శాఖను దళిత మహిళకు కేటాయించడం విశేషం. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2009లో తొలిసారి రాష్ట్రంలో ఓ మహిళను హోం మంత్రిగా నియమించారు. సబితా ఇంద్రారెడ్డిని హోంమంత్రిని చేశారు. తండ్రి స్ఫూర్తిని తనయుడు వైఎస్ జగన్ కొనసాగిస్తూ తన మంత్రివర్గంలో హోం మంత్రిగా దళిత మహిళ మేకతోటి సుచరితను నియమించారు. ఇక మహిళా, శిశు–సంక్షేమ శాఖ మంత్రిగా తానేటి వనితకు అవకాశం కల్పించారు. నూతన మంత్రులకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు సాక్షి, అమరావతి: నూతన మంత్రులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘నా మంత్రివర్గంలోని కొత్త మంత్రులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మనం వేసే ప్రతి అడుగూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు చేసేదిగా ఉండాలి. పదండి.. మనమంతా కలిసి మన పనితో అందరికీ ఆదర్శప్రాయంగా నిలుద్దాం. ఈ సందర్భంగా అందరికీ శుభాభినందనలు’ అని శనివారం మంత్రివర్గ విస్తరణ అనంతరం ట్వీట్ చేశారు. మీ ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తా ‘దేవుడి ఆశీస్సులు, మీ దీవెనలతో మీ మనోభావాలకు అనుగుణంగా పని చేస్తా... మీ ఆకాంక్షలను నిలబెట్టేందుకు కృషి చేస్తా’ అని కూడా జగన్ సచివాలయంలో ప్రవేశించిన అనంతరం ట్వీట్ చేశారు. ►దళితుల పార్టీగా పేరున్న బీఎస్పీ 2007లో ఉత్తరప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన కేబినెట్లో మొత్తం 50 మంది మంత్రులు. వారిలో ముఖ్యమంత్రి మాయావతితో సహా 8 మంది దళితులు (16 శాతం). ►ఏపీ సీఎం వైఎస్ జగన్ మంత్రివర్గంలోని 25 మందిలో ఐదుగురు దళితులు (20 శాతం). పైగా ఇక్కడ దళితులకు లభించిన కీలక శాఖలు యూపీలో కూడా లభించలేదు. -
ప్రమాణ స్వీకారోత్సవానికి సర్వం సిద్ధం
సాక్షి, అమరావతి : రాష్ట్ర నూతన మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి సచివాలయం వద్ద ఏర్పాటుచేసిన ప్రత్యేక వేదిక సిద్ధమైంది. శనివారం ఉదయం 11.49 గంటలకు ముహూర్తం నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే ప్రజాప్రతినిధులు, అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. సభా వేదిక వద్ద ప్రత్యేకంగా గ్యాలరీలు, బారికేడ్లు, పార్కింగ్ తదితర ఏర్పాట్లపై గుంటూరు జాయింట్ కలెక్టర్ హిమాన్షు శుక్లా శుక్రవారం సంబంధిత అధికారులతో చర్చించారు. అక్కడ జరుగుతున్న పనులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం, గుంటూరు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పరిశీలించారు. అత్యంత ప్రముఖులు, ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రులు, వారి కుటుంబ సభ్యులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ప్రజలు వారికి కేటాయించిన ప్రాంతాలకు సులభంగా చేరుకునేలా బోర్డులను ఏర్పాటుచేశారు. సచివాలయం వైపు వెళ్లే రహదారుల్లో ట్రాఫిక్ అంతరాయం లేకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. కాగా, ఆహ్వాన పత్రికలకు వెనుక భాగాన రూట్ మ్యాప్‌ను కూడా ముద్రించారు. కూర్చున్న చోటుకే అల్పాహారం కార్యక్రమానికి హాజరయ్యే ప్రతి ఒక్కరికీ వారు కూర్చున్న ప్రాంతంలోనే అల్పాహారం, తాగునీరు అందించాలని.. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ తిలకించేందుకు వీలుగా ప్రాంగణంలో ఎల్ఇడి తెరలను ఏర్పాటుచేశారు. 1500 మంది పోలీసులతో ప్రభుత్వం బందోబస్తు ఏర్పాటుచేసింది. ఈ ఏర్పాట్లను డీజీపీ సవాంగ్, శాంతిభద్రతల ఏడీజీ రవిశంకర్ అయ్యన్నార్ స్వయంగా పర్యవేక్షించారు. మంత్రుల ప్రమాణ స్వీకార సభ ప్రాంగణం దిగువన నవరత్నాల చిహ్నాలు సిద్ధం చేస్తున్న సిబ్బంది -
నేడు సచివాలయానికి సీఎం జగన్
సాక్షి, అమరావతి: సచివాలయం తొలి బ్లాకులోని మొదటి అంతస్తులో గల సీఎం కార్యాలయంలోకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం తొలిసారిగా ప్రవేశించనున్నారు. ఇందుకు ఉదయం 8.39 గంటలకు ముహూర్తంగా నిర్ణయించారు. ఈ కార్యక్రమం పూర్తయిన తరువాత ఉదయం 9.30 గంటలకు సీఎం వైఎస్ జగన్ అన్ని శాఖల కార్యదర్శులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ వెంటనే సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలతో సమావేశం కానున్నారు. సీఎం కార్యాలయం పక్కనే గల కాన్ఫరెన్స్ హాల్లో ప్రొటెం స్పీకర్‌గా నియమితులైన శంబంగి చిన అప్పలనాయుడు చేత 11.15 గంటలకు గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ కూడా హాజరవుతారు. అనంతరం తొలి బ్లాకు పక్కనే ఏర్పాటు చేసిన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమ వేదికకు ముఖ్యమంత్రి చేరుకుంటారు. ఉదయం 11.49 గంటలకు గవర్నర్ నరసింహన్ మొత్తం 25 మంది చేత మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఆ తర్వాత మంత్రివర్గ సభ్యులందరూ గవర్నర్, ముఖ్యమంత్రితో కలసి గ్రూపు ఫొటో దిగుతారు. ఈ నెల 10వ తేదీన ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి అధ్యక్షతన తొలి కేబినెట్ సమావేశం జరగనుంది. ఇందులో ఎన్నికల ప్రణాళికలోని నవరత్నాల అమలుపై ప్రధానంగా చర్చించడంతో పాటు కొన్ని పనులకు ఆమోదం తెలపనున్నారు. -
వీఐపీ కాదు.. వీవీఐపీ వరుసలోనే
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ హాజరు కాలేదు. పవార్ గైర్హాజరుపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. తనకు వీవీఐపీ వరుసలో కాకుండా.. వీఐపీ వరుసలో అది కూడా ఐదో రోలో స్థానం కేటాయించడంతో శరద్ పవార్ మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరుకాలేదనే పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి భవన్ అధికారులు ఈ వార్తలపై స్పందించారు. అత్యంత సీనియర్ అతిథులు కూర్చునే వీవీఐపీ సెక్షన్‌లోని రెండో వరుసలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు సీటు కేటాయించినట్టు రాష్ట్రపతి భవన్ మీడియా ప్రతినిధి ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఆహ్వాన లేఖలో ‘వీ సెక్షన్’ అని ఉండటం వల్ల శరద్ పవార్ కార్యాలయ సిబ్బంది దానిని రోమన్ అంకెలలోని ఐదుగా పొరపాటు పడ్డారని ఆయన వివరించారు. -
23 : 3 : 23
అక్షర తూణీరం వైఎస్ జగన్మోహన్రెడ్డి అనే తాను మొన్న అభిజన్ముహూర్తంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రోహిణీ కార్తెలో ఒక్కసారిగా బ్లేజ్‌వాడ చల్లబడింది. ఉత్సవానికి కొన్ని గంటల ముందు, తర్వాత ఆకాశం మేఘావృతమై వర్షం కురిసింది. ప్రజలు ఆనందించారు. వేసవిలో వెన్నెల కాసిందని అనుకున్నారు. ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖరరెడ్డిది రుష్యశృంగ పాదమని భావించేవారు. మొన్న జనం చినుకుల్లో తడుస్తూ, మట్టివాసనని ఆఘ్రాణిస్తూ వైఎస్ అధికార పీఠంపై పాదంపెడితే వానలకి కొరత ఉండదని ఆనందంగా ఊపిరి పీల్చు కున్నారు. సకాలంలో వర్షాలుంటే దానికి మించిన సౌభాగ్యం ఉండదు. చంద్రబాబు హయాంలో లాగా రెయిన్గన్లతో లక్షల హెక్టార్ల పంటని కాపాడలేరు. మీడియాలో నీళ్ల చిమ్మెనలు చూపిస్తే, ఎండిన నేలలు పచ్చబారవు. పొలిటికల్ ఇండస్ట్రీలో నలభై ఏళ్ల అనుభవం ఉందని పదేపదే చెప్పుకునే చంద్రబాబు అతి ఘోర పరాజయం పొందినవేళ హైవోల్టేజీ షాక్‌కి గురయ్యారు. మన పాలన ఇంత ఘోరంగా ఉందా? ప్రజల్లో ఇలాంటి స్పందన ఇంత ఘాటుగా రావడమేంటని చంద్రబాబు ఆత్మ విచారణకి దిగారు. చివరి ఆరునెలలూ పూర్తిగా ఆత్మస్తుతికి, పరనిందకి అంకితమైపోయిన మాజీ ముఖ్యమంత్రి అసలే పాజిటివ్ థింకర్ అవడంతో తానే స్టేటు తానే సెంట్రల్ అనుకున్నారు. ఊహ మంచిదే కానీ ఒక్కోసారి ఫలించదు. అంతఃపురంలోంచి బయటికొచ్చి జనవాణిని స్పష్టంగా వింటే ఎన్నికల ఫలితాలు అర్థం అయ్యేవి. ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్‌లో ఎవర్ని కదిలించినా ఆశువుగా చెప్పుకున్నారు. అదీ చక్కగా వినసొంపుగా, అలంకారాలతో జనం మాట్లాడుకున్నారు. మహిళలైతే మరింత సొగసుగా వ్యాఖ్యానించారు. ఎన్నికల వేళ ఓ పెళ్లికి చిలకలూరిపేట వెళ్లాల్సి వచ్చింది. తలంబ్రాల ఘట్టం అయ్యాక అక్కడి బాజాభజంత్రీలతో ఇష్టాగోష్టికి దిగాను. ‘ఇక్కడ ఎవరు మీకు’ అని అడిగితే ప్రత్తిపాటి పుల్లారావు గారండీ అని చెప్పారు. ‘గెలుస్తారా, మంత్రి కూడా కదా’ అన్నాను. వాళ్లంతా ఒక్కసారి మొహమొహాలు చూసుకున్నారు. ఒక్క క్షణం ఆగి, ‘మాచెడ్డ కష్టమండీ’ అన్నాడొక పెద్దాయన. ధైర్యం పుంజుకున్న రెండో ఆయన, ‘మా పుల్లన మంచి మెజార్టీతో ఓడిపోతే ప్రభలు కట్టుకు కొండకి వస్తామని కోటయ్య సామికి మా వోళ్లంతా మొక్కారండీ’ అంటూ చేతులు భక్తిగా జోడించాడు. శృతి పెట్టెని శబ్దం చేస్తూ కట్టిపెట్టిన కుర్రాడు, ‘ఇట్టాంటి మేళాలు పదన్నా ఎళ్తాయండీ ప్రభల్తో’ అన్నాడు ఉత్సాహంగా. అబ్బా! మన మంత్రి పుల్లారావు గారికి జనంలో ఇంతటి పలుకుబడి ఉందా అని నివ్వెరపోయా. అయిదేళ్లు పగలూ రాత్రీ కష్టించి పోగు చేసుకున్న పేరు ప్రతిష్ట. జన సామాన్యపు ధోరణిని సరిగ్గా అంచనా వేసుకుంటే పార్టీ అడుగంటుతుందని నాలాంటి అమాయకుడికి కూడా అర్థం అవుతుంది. భజనల్లో కూచుంటే కాదు, జనంలో భుజకీర్తులు, కిరీటం లేకుండా తిరి గితే మన పాలన సౌడిభ్యం బాగా తెలుస్తుంది. ‘మా బెజవాడ రేవుల్లో దోసెడు ఇసుక లేదు. మొత్తం తోడేశారు. టీడీపీ రంగు, కృష్ణలో ఇసుక రంగు ఒకటే అయింది. దాంతో వాళ్లకి దానిమీద అభిమానం ఎక్కువైంది. కనక దుర్గమ్మ కొండమీంచి అంతంత కళ్లు పెట్టుకు చూస్తుంది గానీ ఆ తల్లి పలకదు ఉలకదు..’ అని ఒక పెద్దాయన బాధగా నిట్టూ ర్చాడు. ఉదాసీనంగా వూకొట్టి, బయలుదేరుతుంటే, ‘దుర్గమ్మ ఆడకూతురు కదా, ఓర్పు సహనాలు ఎక్కువ.. జై భవాని!’ అన్నాడు రోషంగా. నిజంగానే నేను ఉలిక్కిపడ్డాను. ఒక నిస్సహాయతలోంచే ఇలాంటి మాటలు సామాన్య ప్రజల్లోంచి వస్తాయి. వారి నాడి పట్టడానికి ఇదొక చిన్న శాంపిల్. కిందటిసారి ఎన్నికల తర్వాత చంద్రబాబు 23 మంది జగన్ పార్టీ ఎమ్మెల్యేలని కొనేసి సొంత దొడ్లో కట్టేసుకుంటే అంతా విడ్డూరంగా చెప్పుకున్నారు. రేట్లు కూడా చెప్పుకున్నారు. వైఎస్ పార్టీని కుంగెయ్యాలని గట్టి ప్రయత్నం జరిగింది. రాజ్యాంగం ప్రకారం చట్టసభల్లో స్పీకర్‌కి ముఖ్యమంత్రి కంటే, ప్రధాని కంటే ఎక్కువ అధికారం, గౌరవం ఇవ్వబడినాయి. ఈ కొనుగోలు సరుకులో కొందరికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు. ఇదంతా గమనిస్తున్న సామాన్య ఓటర్లకి గౌరవనీయ స్పీకర్ కోడెల ఘోరంగా ఓడిపోనున్నారని మూడు నెలల ముందే తెలుసు. ఓటేసి రాగానే కాలవల్లో, చెరువుల్లో స్నానాలు చేసి తడి వస్త్రాలతో ఇళ్లకు వచ్చామని ఓ పెద్ద రైతు సంతోషంగా చెప్పాడు. చంద్రబాబు సొంత మీడియాతోనే దెబ్బ తిన్నాడని అనుభవజ్ఞులు తేల్చారు. 23: 3: 23 దేవుడు ప్రసాదించిన నిష్పత్తిగా తేల్చారు. అయినా ఆయన మబ్బులు వీడి రాలేకుండా ఉన్నారు. నలభై ఏళ్ల అనుభవం చంద్రబాబుని వదలడం లేదు. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
ఈ నెల 8న రాష్ట్ర మంత్రివర్గం ఏర్పాటు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. అంతేవేగంతో పాలనాపరమైన అంశాలతో పాటు ప్రజలకిచ్చిన నవరత్నాల హామీలు నెరవేర్చడంపై దృష్టిసారించారు. ఈ నెల 8వ తేదీన మంత్రివర్గాన్ని ఏర్పాటుచేయాలని ఆయన నిర్ణయించినట్లు తెలిసింది. ఆ రోజు ఉదయం 11.39 గంటలకు సచివాలయం దగ్గరే మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. వర్షం వచ్చినా సమస్య లేకుండా ఉండేలా వేదికను ఏర్పాటు చేయాలని అధికారవర్గాలకు సంకేతాలందాయి. అసెంబ్లీ సభ్యుల ఆధారంగా నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రితో పాటు 26 మంది మంత్రులు ఉండొచ్చు. అయితే పూర్తి స్థాయిలో అంతమందితో మంత్రివర్గం ఏర్పాటుచేస్తారా.. లేదా తొలుత కొంతమందితో ఏర్పాటుచేసి, ఆ తర్వాత విస్తరణ చేపడతారా.. అనేది పూర్తిగా ముఖ్యమంత్రి విచక్షణాధికారంగా ఉంటుంది. మంత్రివర్గ కూర్పుపై ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టిసారించారని.. ఏ జిల్లాలో ఎవరికి స్థానం కల్పించాలనే అంశంపై కసరత్తు చేస్తున్నారని సమాచారం. 8.39 గంటలకు సచివాలయంలోకి అడుగుపెట్టనున్న సీఎం జగన్ ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా వైఎస్ జగన్ 8వ తేదీ ఉదయం 8.39 గంటలకు సచివాలయంలోకి వెళ్లనున్నారు. ముహూర్తం మేరకు సచివాలయంలోని ఒకటో బ్లాకు తొలి అంతస్తులో ఉన్న సీఎం కార్యాలయంలోకి ఆయన ప్రవేశించనున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న విదేశాలకు చెందిన, సింగపూర్‌కు చెందిన గ్రాఫిక్స్ బొమ్మలను తొలగించాలని అధికారులు నిర్ణయించారు. -
దుబాయ్‌లో వైఎస్సార్సీపీ అభిమానుల సంబరాలు
-
దుబాయ్‌లో వైఎస్సార్సీపీ అభిమానుల సంబరాలు
దుబాయ్ : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైఎస్సార్ సీపీ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. దుబాయ్‌లో ఉన్న వైఎస్సార్సీపీ అభిమానులందరూ ఒక్క చోట చేరి సెలబ్రేట్ చేసుకున్నారు. వైఎస్ జగన్ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా వైఎస్సార్సీపీ యూఏఈ కన్వీనర్లు ప్రసన్న సోమి రెడ్డి , బ్రహ్మనంద రెడ్డి , రమేష్ రెడ్డి , విజయ్ , దిలీప్ , రమణ రెడ్డి , యస్వంత్.. యూఏఈ మహిళా విభాగం నాయకురాలు మహిత రెడ్డి, పార్టీ అభిమానులు పాల్గొని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మోదీ, బాబుకు వైఎస్ జగన్ ధన్యవాదాలు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించిన నాటి నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. వైఎస్ జగన్‌ను అభినందిస్తూ ప్రధాని ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. ఇలా పలువురు ప్రముఖులు ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు అందజేశారు. ఈ నేపథ్యంలో వారందరికి వైఎస్ జగన్ ధన్యావాదాలు తెలిపారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన మోదీకి ధన్యవాదాలు తెలిపిన వైఎస్ జగన్.. మరోమారు ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన మోదీకి శుభాకాంక్షలు తెలియజేశారు. మోదీ పాలనకు బెస్ట్ విషేస్ చెప్పారు. అలాగే తనకు శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, బీజేపీ అగ్ర నాయకులు అరుణ్ జైట్లీకు ధన్యవాదాలు తెలియజేశారు. అంతేకాకుండా తన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయి శుభాకాంక్షలు అందజేసిన తెలంగాణ సీఎం కేసీఆర్, డీఎంకే అధినేత స్టాలిన్లకు వైఎస్ జగన్ ధన్యవాదాలు తెలిపారు. -
దేశ ప్రథమ పౌరుడు మెచ్చిన వంటకం
దేశ ప్రథమ పౌరుడు మెచ్చిన వంటకం ఇది. అందుకే రెండు రోజుల సమయం తీసుకున్నా సరే, వెనుకాడకుండా పాక శాస్త్ర ప్రవీణులు ప్రత్యేక శద్ధతో తయారు చేశారు. ఆ వంటకం దాల్ రైసినా..! ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండోసారి ప్రమాణ స్వీకారం అనంతరం రాష్ట్రపతి భవన్లో అతిథులకు ఇచ్చిన విందులో వడ్డించిన ఈ పప్పు తయారీకి ఏకంగా రెండు రోజులు పట్టింది. మే 28వ తేదీ రాత్రి పప్పు తయారు చేయడం మొదలు పెడితే, అతిథులకు వడ్డించేందుకు గురువారం రాత్రికి తయారైంది. మొట్ట మొదటసారికి ఈ వంటకాన్ని 2010లో అప్పటి రాష్ట్రపతి భవన్ చీఫ్ చెఫ్ మచీంద్ర కసూరి వండారు. కేవలం ఆరు నుంచి ఎనిమిది గంటల్లోనే ఆ వంటకం తయారీ పూర్తయింది. కానీ, ఆయన స్థానంలో చెఫ్‌గా వచ్చిన మొంతి సైనీ మాత్రం ఈ పప్పు వండటానికి 48 గంటలు పడుతుందని గట్టిగా చెబుతున్నారు. అన్ని గంటలు ఎందుకంటే .. కేవలం పప్పు ఉడకడం కోసం అన్ని గంటల సమయమైతే పట్టదు కానీ వండడానికి ముందు చేసే ప్రక్రియతో కలిపి రెండు రోజుల సమయం తీసుకుంటుంది. మోదీ ప్రమాణ స్వీకారోత్సవాన్ని తిలకించడానికి దేశ విదేశాల నుంచి 8 వేల మంది అతిథులు వచ్చారు. అంతమందికి సరిపడే పప్పు వంటాలంటే ఆ మాత్రం సమయం పట్టదా అని సైనీ ప్రశ్నిస్తున్నారు. ఆయన రెసిపీ ప్రకారం.. మినపప్పు, రాజ్మాలను ఒక రాత్రంతా నానబెట్టి ఉంచాలి. మధ్య మధ్యలో వాటిని నాలుగైదు సార్లు కడగాలి. ఆ తర్వాత అందులో వెన్న, క్రీమ్, టొమాటో ప్యూరీ, గరమ్ మసాలా, కసూరి మేథి కలిపి ఆరు నుంచి ఎనిమిది గంటల సేపు తక్కువ మంటపై ఉడికించాలి. పప్పు ఉడుకుతున్నంతసేపు నిరంతరం కలుపుతూ ఉండాలి. ఈ పప్పులో బయటకు చెప్పని ఒక పదార్థాన్ని కలుపుతారట. దీంతో రాష్ట్రపతి భవన్ అంతటా ఆ పప్పు ఘుమఘమలు వ్యాపించి అతిథుల నోరూరిస్తాయి. విదేశీ అతిథులెవరు రాష్ట్రపతి భవన్‌కు వచ్చినా సరే దాల్ రైసినా తప్పకుండా మెనూలో ఉండాలని ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఉన్నప్పుడే ఆదేశాలు జారీ చేశారట. 2015 గణతంత్ర దినోత్సవాలకు వచ్చినప్పుడు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులు భారత్ పర్యటన సందర్భంలో దాల్ రైసినాను వడ్డించారు. అప్పట్లో చెఫ్‌గా ఉన్న మచీంద్ర కసూరీ వెజిటేరియన్లో కొత్త కొత్త వంటకాలు నిరంతరం ప్రయత్నించేవారు. సీతాఫల్ హల్వా, అంజీర్ కోఫ్తా తయారీలోనూ కసూరీ సిద్ధహస్తులు. -
వైఎస్ జగన్ అనే నేను
సాక్షి, అమరావతి: అశేష జనవాహిని కేరింతలు.. హర్షధ్వానాలు.. దిక్కులు పిక్కటిల్లే నినాదాల నడుమ ‘వైఎస్ జగన్మోహన్రెడ్డి అనే నేను..’ అంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా గురువారం పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ నడిబొడ్డున గల ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉత్సాహం, ఉద్విగ్నభరిత వాతావరణంలో మధ్యాహ్నం సరిగ్గా 12.23 గంటల ముహూర్తానికి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, వైఎస్ జగన్‌తో పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రభుత్వ రహస్యాలను కాపాడతానని కూడా ప్రమాణం చేయించారు. జగన్ ప్రమాణం చేస్తున్నప్పుడు వేదికకు ఎడమవైపున ఆశీనురాలైన ఆయన మాతృమూర్తి వైఎస్ విజయమ్మ చలించారు.. కంటతడిపెట్టారు. ప్రమాణ స్వీకార సమయానికి ముందుగా అక్కడకు చేరుకున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం తొలుత జగన్‌ను ముఖ్యమంత్రిగా నియమిస్తూ గవర్నర్ జారీ చేసిన నియామక పత్రాన్ని చదవి వినిపిస్తూ కాబోయే ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. ఆ వెంటనే గవర్నర్ లేచి లాంఛనంగా ‘..అనే నేను’ అంటూ తొలి పలుకు చెప్పగానే ‘వైఎస్ జగన్మోహన్రెడ్డి అనే నేను, శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వ భౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయంగాని, పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’ అని అన్నారు. వెను వెంటనే మళ్లీ గవర్నర్ ‘..అనే నేను’ అనగానే.. ‘వైఎస్ జగన్మోహన్రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియ వచ్చిన ఏవిషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్పప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని ఏ వ్యక్తికీ లేదా.. వ్యక్తులకు తెలియ పరచనని లేదావెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’ అని అన్నారు. జగన్ ముఖ్యమంత్రి కాగానే.. వేదికపై కాస్త ఎడంగా కూర్చున్న గవర్నర్‌సతీమణి విమలా నరసింహన్ ఒక పుష్పగుచ్ఛాన్ని జగన్ సతీమణి వైఎస్ భారతీరెడ్డికి ఇచ్చి మనసారా అభినందనలు తెలియజేశారు. నవ్యాంధ్రలో నూతన అధ్యాయం.. 2019 మే 30.. నవ్యాంధ్రలో నూతన అధ్యాయం ప్రారంభమైంది. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించాలని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, అభిమానులు తరలి వచ్చారు. ఉదయం నుంచే ఇందిరా గాంధీ స్టేడియం వద్ద సందడి నెలకొంది. స్టేడియం యావత్తు వైఎస్ జగన్ నినాదాలతో మార్మోగింది. గంటగంటకూ జనం పెరిగిపోవడంతో ఉదయం 10 గంటల తర్వాత అదుపు చేయడం పోలీసులకు కష్టతరమైంది. స్టేడియం బయట 14 ఎల్ఈడీ తెరల ముందు జనం పెద్ద ఎత్తున గుమిగూడారు. జగన్, ఆయన కుటుంబ సభ్యులు తాడేపల్లిలోని నివాసం నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో తాడేపల్లి సెంటర్, వారధి మీదుగా మున్సిపల్ స్టేడియానికి చేరుకున్నారు. ఉదయం 11.50 గంటల సమయంలో జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి సభాస్థలికి చేరుకున్నప్పుడు ప్రజలు జేజేలు పలికారు. సభాస్థలి వద్ద పార్టీ నేతలు హెలికాప్టర్ నుంచి పూలు చల్లుతూ అభిమానాన్ని చాటుకున్న తీరు అపురూపం. వేదిక వద్దకు రాబోయే ముందు ఓపెన్ టాప్ జీప్‌లో వైఎస్ జగన్ జనానికి అభివాదం చేస్తూ సభా ప్రాంగణమంతా కలియతిరిగారు. అప్పటికే వేదికపైకి వచ్చిన తమిళనాడు డీఎంకే అధినేత స్టాలిన్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు, తెలంగాణ మంత్రులు, పుదుచ్ఛేరీ మాజీ మంత్రి మాల్లాడి కృష్ణారావులకు వినమ్రంగా నమస్కరిస్తూ వేదికపైకి వచ్చిన జగన్.. ప్రజలకు అభివాదం చేసినప్పుడు కొన్ని నిమిషాల పాటు ప్రాంగణమంతా హర్షధ్వానాలతో హోరెత్తింది. వైఎస్ జగన్ ఎదురేగి గవర్నర్ దంపతులకు స్వాగతం పలికారు. అనంతరం ప్రమాణ స్వీకార కార్యక్రమ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీసుబ్రమణ్యం ప్రకటించారు. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం సరిగ్గా 12.23 గంటలకు వైఎస్ జగన్‌తో నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం గవర్నర్ దంపతులకు జగన్ స్వయంగా కిందకు వెళ్లి వీడ్కోలు పలికారు. అనంతరం స్టాలిన్, కేసీఆర్‌లు జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ మాట్లాడుతూ నాన్నగారి (డాక్టర్ వైఎస్సార్) పేరు నిలబెట్టి కనీసం మూడు నాలుగు టర్ముల వరకు మీ పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగాలని దీవిస్తున్నానని అన్నప్పుడు సభా ప్రాంగణం జగన్ నినాదంతో మార్మోగింది. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి అరుదైన రికార్డు తెలుగు రాష్ట్రాల చరిత్రలో జగన్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడం ఓ అరుదైన రికార్డుగా నిలిచింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2004 నుంచి 2009 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు దివంగత సీఎం వైఎస్సార్ కుమారుడు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. అచ్చంగా తండ్రి బాటలోనే ఆయన తన తొలి సంతకానికి ఒక పవిత్రతను చేకూరుస్తూ అవ్వా తాతల పింఛన్ పెంపు ఫైలుపై సంతకం చేశారు. నాడు వైఎస్.. రైతులకు ఉచిత విద్యుత్ సరఫరాపై తొలి సంతకం చేశారు. అది నేటికీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అప్రతిహతంగా అమలవుతోంది.జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, తమిళనాడు డీఎంకే అధినేత స్టాలిన్, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు, ఆయన సతీమణి. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, ఆ పార్టీ మరో నేత వై.వెంకటేశ్వరరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, పుదుచ్చేరి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు, రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, సీనియర్ నేతలు, మాజీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పార్టీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, రాజ్యసభ మాజీ సభ్యుడు యలమంచిలి శివాజి, టీడీపీ నేతలు నన్నపనేని రాజకుమారి, కేఆర్ పుష్పరాజ్, సీనియర్ ఐఏఎస్, ఐపీస్ అధికారులు, సినీ ప్రముఖులు రాంగోపాల్‌వర్మ, దిల్ రాజు, మహివి రాఘవతో పాటు పలువురు హాజరయ్యారు. వీరితో పాటు జగన్ సతీమణి వైఎస్ భారతి, ఆయన ఇద్దరు కుమార్తెలు హర్షారెడ్డి, వర్షారెడ్డి, సోదరి షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్ తదితరులు మాతృమూర్తి విజయమ్మతో కలిసి వేదికపై ఆశీనులయ్యారు. పెద్ద సంఖ్యలో వైఎస్ కుటుంబ సభ్యులు వేదికకు కింది వైపున ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్యాలరీలో ఆశీనులయ్యారు. ఆకట్టుకున్న ప్రసంగం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం వైఎస్ జగన్ చేసిన ప్రసంగం అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంది. ’నేను మీ కష్టాలు చూశాను, మీ బాధలను విన్నాను, నేను ఉన్నాను’ అని జగన్ చెప్పినప్పుడు వివిధ గ్యాలరీలలో ఉన్న వారు తమ సీట్లలో నుంచి లేచి మరీ హర్షధ్వానాలు వ్యక్తం చేయడం గమనార్హం. ఆగస్టు 15లోగా సుమారు 4 లక్షల వాలంటీర్లను నియమిస్తామని ప్రకటించినప్పుడు యువకుల కేరింతలు మిన్నంటాయి. సభ ముగిసిన అనంతరం కూడా ఉద్యోగాల భర్తీపై యువతీ యువకులు పెద్దఎత్తున చర్చించుకోవడం గమనార్హం. అర్హులందరికీ పథకాలు అందేలా చూస్తామని.. కులం, మతం, ప్రాంతం, వర్గం, రాజకీయాలు, పార్టీలు చూడం అని జగన్ చేసిన ప్రకటనతో ’నాయకుడంటే ఇతనే.. తండ్రిని మించిన తనయుడు’ అని పలువురు వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రణాళిక విలువను జగన్ చాటిచెప్పిన తీరు ఆకట్టుకుంది. ‘ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్య శ్రీ అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి గుర్తుకు వస్తారు. ఇప్పుడు తండ్రి అడుగుజాడల్లో నడిచి అవ్వాతాతల పెన్షన్‌ను రూ.2250కి పెంచి జగన్ చరితార్ధుడయ్యారు. పండుటాకులకు ఆసరా ఇచ్చిన ఈ పథకం ఉన్నంత కాలం జగన్‌ను మరచిపోవడం సాధ్యం కాదు’ అని ఓ వామపక్ష పార్టీ నాయకుడు రవీంద్ర అభిప్రాయపడ్డారు. మొత్తం మీద రాష్ట్రంలో నూతన అధ్యయనానికి నవ యువకుడు నడుం కట్టారని మేధావులు అభిప్రాయపడ్డారు. ప్రమాణ స్వీకారోత్సవం ఇలా.. ►11.50 గంటలకు కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి నుంచి బయలుదేరిన జగన్ ►12.04 గంటలకు స్టేడియంలోకి ప్రవేశం ►12.10 గంటలకు వేదికపైకి ►12.18 గంటలకు గవర్నర్ ప్రసంగం ►12.23 గంటలకు సీఎంగా ప్రమాణ స్వీకారం ►12.29 గంటలకు ప్రమాణ స్వీకారం ముంగింపు ►12.30 గంటలకు గవర్నర్‌కు జగన్ వీడ్కోలు ►12.41 గంటలకు జగన్ ప్రసంగం ►1.05 గంటలకు అవ్వాతాతల పెన్షన్ పెంపు ఫైలుపై జగన్ తొలి సంతకం -
తెలంగాణ, ఏపీ అభివృద్ధికి కృషి చేస్తా
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించేందుకు తన వంతు కృషి చేస్తానని కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం జి. కిషన్‌రెడ్డి తెలిపారు. కేంద్ర మంత్రిగా గురువారం ఢిల్లీలో ప్రమాణస్వీకారం అనంతరం ఆయన తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ‘తెలంగాణ రాష్ట్రం నుంచి మొదటిసారిగా నలుగురు బీజేపీ అభ్యర్థులను ఎంపీలుగా గెలిపించినందుకు ప్రధాని మోదీ తరఫున, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తరఫున తెలంగాణ ప్రజలకు వందనాలు తెలియజేస్తున్నా. ప్రత్యేకంగా నన్ను సికింద్రాబాద్ నుంచి గెలిపించిన ఓటర్లకు పాదాభివందనం చేస్తున్నా. కేంద్ర మంత్రిగా నాకు మోదీ ఇచ్చిన బాధ్యతలకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తానని హామీ ఇస్తున్నా. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు సంబంధించి కేంద్ర మంత్రివర్గంలో ఒక తెలుగువాడిగా రెండు రాష్ట్రాల ప్రజలకు మేలు కలిగేలా కేంద్రం తీసుకొనే అన్ని కార్యక్రమాలను సమన్వయం చేసుకొని ముందుకెళ్తా. ప్రమాణస్వీకారం కంటే ముందు మోదీ మాతో మాట్లాడుతూ.. ప్రజలు ఎంతో విశ్వాసంతో పెద్ద బాధ్యత ఇచ్చారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్నికైన∙ప్రజాప్రతినిధులు పనిచేయాలని సూచించారు. వచ్చే వారంలో ప్రారంభం కానున్న 17వ పార్లమెంటు సమావేశాలకు సిద్ధం కావాలన్నారు. కేంద్ర మంత్రివర్గంలో కొత్త వాళ్లకు, పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు స్థానం కల్పించారు. రానున్న రోజుల్లో కార్యకర్తలకు మరింత ప్రాధాన్యమిచ్చి సిద్ధాంతాల ఆధారంగా పనిచేసే వారిని ప్రోత్సహిస్తాం. పార్టీని విస్తరిస్తాం. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ స్థానాన్ని తెలంగాణలో బీజేపీ భర్తీ చేసింది. అధికార టీఆర్ఎస్కు బీజేపీయే ప్రత్యామ్నాయంగా ఉంటుంది’ అని పేర్కొన్నారు. ‘అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం’ సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో గత ఐదేళ్లలో కేంద్రం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిందని, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ నిధులను, పథకాలను దారి మళ్లించి ప్రజలను మోసం చేసిందని బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీతోనే తెలంగాణకు మరిన్ని పథకాలు, నిధులు వస్తాయని భావించి ప్రజలు తమను గెలిపించారన్నారు. ఇక నుంచి మరింత బాధ్యతాయుతంగా పనిచేస్తూ అభివృద్ధి అంటే ఏంటో ఇప్పుడు చూపిస్తామని పేర్కొన్నారు. -
కార్యకర్త నుంచి కేంద్ర మంత్రి దాకా...
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్ : బీజేపీ కార్యకర్తలంతా ‘కిషనన్నా’అని ఆప్యాయంగా పిలుచుకునే గంగాపురం కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రి అయ్యారు. సికింద్రాబాద్ ఎంపీగా గెలుపొందిన ఆయనకు అంతా ఊహించినట్లే ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్లో కేంద్ర సహాయ మంత్రిగా అవకాశం లభించింది. తెలంగాణ నుంచి నలుగురు బీజేపీ ఎంపీలు గెలుపొందగా.. దాదాపు నాలుగు దశాబ్దాలుగా పార్టీతో అనుబంధం ఉన్న కిషన్‌రెడ్డిని మంత్రి పదవి వరించింది. మంత్రివర్గంలో చోటు లభించిన విషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గురువారం మధ్యాహ్నం 12 గంటలకు కిషన్‌రెడ్డికి ఫోన్లో తెలియపరిచారు. గురువారం రాత్రి రాష్ట్రపతి భవన్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రిగా కిషన్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. తలపాగా ధరించి వచ్చిన ఆయన హిందీలో ప్రమాణం చేశారు. 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్‌పేట నుంచి పోటీ చేసి ఓడిపోయిన కిషన్‌రెడ్డి... లోక్‌సభ ఎన్నికల్లో 62,144 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించి సత్తా నిరూపించుకున్నారు. ఆయన సేవలను గుర్తించిన బీజేపీ కేంద్ర కేబినెట్లో ఆయనకు స్థానం కల్పించింది. బీజేపీ ఆవిర్భావ సమయంలో సాధారణ కార్యకర్తగా పార్టీలో చేరిన ఆయన అంచలంచెలుగా ఎదిగారు. పార్టీ అప్పగించిన ప్రతి పని, బాధ్యతను శ్రద్ధతో నిర్వర్తించే కిషన్‌రెడ్డి క్రమశిక్షణగల పార్టీ నాయకుడిగా పేరుతెచ్చుకున్నారు. సాధారణ రైతు కుటుంబం నుంచి.. రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌లో 1964 మే 15న సాధారణ రైతు కుటుంబంలో కిషన్‌రెడ్డి జన్మించారు. ఆయన తండ్రి స్వామిరెడ్డి, తల్లి ఆండాళమ్మ. జయప్రకాశ్ నారాయణ స్ఫూర్తితో 1977లో జనతా పార్టీలో కార్యకర్తగా చేరారు. 1980లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం తర్వాత... యువ మోర్చా రంగారెడ్డి కమిటీ కన్వీనర్‌గా క్రియాశీలకంగా పనిచేశారు. అంచెలంచెలుగా ఎదిగిన ఆయన 1986లో బీజేవైఎం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షునిగా నియమితులయ్యారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఉపాధ్యక్షుడిగా వివిధ స్థాయిల్లో పనిచేసి 2002లో యువ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అంతర్జాతీయ స్థాయిలో సదస్సులు నిర్వహించారు. రాష్ట్ర, జాతీయ పార్టీలోనూ పలు బాధ్యతలు చేపట్టిన ఆయన... 2010లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. మరోవైపు 2004 శాసనసభ ఎన్నికల్లో హిమాయత్‌నగర్ నుంచి కిషన్‌రెడ్డి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. నియోజకవర్గాల పునర్విభజనలో హిమాయత్‌నగర్ అంబర్‌పేటలో విలీనమవడంతో 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్‌పేట నుంచి పోటీ చేసి గెలుపొందారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, శాసనసభాపక్ష నేతగా పార్టీ అభివృద్ధికి కృషి చేశారు. 2018లో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో 1,016 ఓట్ల తేడాతో ఓడిపోయినా లోక్‌సభ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించారు. తెలంగాణకు ప్రాధాన్యం.. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించిన అమిత్ షా నాయకత్వంలో నాలుగు స్థానాలను గెలుచుకుంది. ఈ క్రమంలో రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా తెలంగాణకు సముచిత స్థానం కల్పించేందుకు సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలిచిన కిషన్‌రెడ్డికి కేంద్ర మంత్రివర్గంలో అవకాశం కల్పించింది. గతంలో ఇదే స్థానం నుంచి బీజేపీ ఎంపీగా గెలిచిన బండారు దత్తాత్రేయకు కేంద్ర మంత్రి పదవి దక్కింది. అయితే అనూహ్యంగా మధ్యలో ఆ పదవి నుంచి ఆయన్ను తప్పించారు. అప్పటి నుంచి తెలంగాణకు కేంద్ర మంత్రివర్గంలో ప్రాధాన్యం లేనట్లయింది. మళ్లీ ఇప్పుడు అదే స్థానం నుంచి గెలిచిన కిషన్‌రెడ్డికి మంత్రి పదవి ఇచ్చింది. మోదీతో ప్రత్యేక అనుబంధం... ప్రధాని నరేంద్ర మోదీతో కిషన్‌రెడ్డికి ప్రత్యేక అనుబంధం ఉంది. బీజేవైఎం జాతీయ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి పనిచేసిన సమయంలో మోదీకి దగ్గరయ్యారు. అప్పట్లో బీజేపీ జాతీయ నేతలంతా కలసి పర్యటించిన నేపథ్యంలో మోదీ, కిషన్‌రెడ్డి ఒకే గదిలో బస చేసిన సందర్భం ఉందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అలా వారిద్దరి మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. కిషన్‌రెడ్డికి కేంద్ర మంత్రి పదవి దక్కడానికి అది కూడా ఒక కారణం. మొత్తానికి కేంద్ర మంత్రి పదవికి కిషన్‌రెడ్డి పేరు ఖరారు కావడంతో పార్టీ శ్రేణుల్లో, ఆయన అభిమానుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. కిషన్‌రెడ్డి కుటుంబ, రాజకీయ నేపథ్యమిదీ... జననం : మే 15, 1964 తల్లిదండ్రులు: స్వామిరెడ్డి, ఆండాళమ్మ భార్య: కావ్య, పిల్లలు: వైష్ణవి, తన్మయ్ రాజకీయ ప్రవేశం: 1977లో జయప్రకాశ్ నారాయణ స్ఫూర్తితో జనతా పార్టీలో చేరిక 1980 : భారతీయ జనతా పార్టీ పూర్తికాల కార్యకర్తగా నమోదు 1980 - 83 : యువ మోర్చా రంగారెడ్డి కమిటీ కోశాధికారి, కన్వీనర్ 1986 - 90 : యువ మోర్చా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు 1990 - 92: యువ మోర్చా జాతీయ కార్యదర్శి 1992 - 94: యువ మోర్చా జాతీయ ఉపాధ్యక్షుడు 1994 - 2001: యువ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి 2001 - 02: బీజేపీ రాష్ట్ర కార్యదర్శి 2002: యువ మోర్చా జాతీయ అధ్యక్షుడు 2003 - 05: బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రధాన కార్యదర్శి 2004: మొదటిసారిగా హిమాయత్‌నగర్ ఎమ్మెల్యేగా ఎన్నిక 2010 - 14: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు 2009, 2014: అంబర్‌పేట ఎమ్మెల్యే 2018: అంబర్‌పేట అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి 2019: సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా విజయం -
శుభారంభం
అనవసర ఆడంబరాలు, ఆర్భాటాలు లేవు... గర్వాతిశయాల జాడ లేదు. వాటి స్థానంలో తొణకని ఆత్మవిశ్వాసం పుష్కలంగా ఉంది. సత్సంకల్పంతో, సత్యనిష్టతో 14 నెలలపాటు తాను సాగించిన ‘ప్రజాసంకల్ప యాత్ర’లో తారసపడిన జన జీవితాల జ్ఞాపకాలు పదిలంగా ఉన్నాయి. ఆ జీవితా లను మెరుగుపరిచి తీరాలన్న దృఢ సంకల్పం గుండె నిండా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసుకుని గురువారంనాడు వేలాదిమంది సమక్షంలో నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రసంగం ఆద్యంతమూ ఆయన పరిపాలన ఎలా ఉండబోతున్నదో రేఖామాత్రంగా ఆవిష్కరిం చింది. సంక్షిప్తంగా సాగిన ఆ ప్రసంగంలో అతిశయోక్తులు, స్వోత్కర్షలు లేవు. ఎక్కడా తడబాటు లేదు. చెప్పదల్చుకున్న అంశాలను సూటిగా, స్పష్టంగా, అందరికీ అవగాహన కలిగే రీతిలో చెప్పడం ఈ ప్రసంగమంతా కనబడుతుంది. అంతేకాదు... పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చిన విధంగానే నవరత్నాల్లో ఒకటైన అవ్వాతాతల పింఛన్ పెంచుతూ తొలి సంతకం చేశారు. 341 రోజులపాటు 3,684 కిలోమీటర్ల మేర సాగిన పాదయాత్రలో జగన్మోహన్రెడ్డిని లక్షలాదిమంది ప్రజలు నిత్యం నిశితంగా గమనించారు. తమ మధ్యే నివాసం ఉంటూ, తమతోనే సహవాసం చేస్తూ, తమ వెతలను వింటూ ‘నేనున్నా’నంటూ ఆయన ఇచ్చిన భరోసాను గుండెల్లో దాచు కున్నారు. తమను కష్టాలపాలు చేస్తున్న తెలుగుదేశం పాలన ఎప్పుడు ముగిసిపోతుందా అని నిరీక్షించారు. ఆ ముహూర్తం ఆగమించిన వేళ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రసంగం కోట్లాదిమంది ఆశ లకూ, ఆకాంక్షలకూ అద్దం పట్టింది. వారి నమ్మకాన్ని వందల రెట్లు పెంచింది. రాష్ట్రం ఎదుర్కొం టున్న సమస్యలపై ఆయనకు పరిపూర్ణమైన అవగాహన ఉన్నదని, వాటిని పరిష్కరించడానికి అనుసరించాల్సిన వ్యూహం, దాని అమలుకు అవసరమైన పట్టుదల ఉన్నాయని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజానీకం మాత్రమే కాదు... ఖండాంతరాల్లో ఉంటూ భిన్న మాధ్యమాల ద్వారా ఆయన ప్రసంగాన్ని విన్న తెలుగువాళ్లంతా అవగాహన చేసుకున్నారు. అధికార చేలాంచలాలు అందుకున్న మరుక్షణం చేసిన వాగ్దానాలేమిటో మరిచిన పాలకుణ్ణి ప్రత్యక్షంగా చూసినవారికి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రసంగం ఆశ్చర్యం కలిగించి ఉండొచ్చు. కానీ చెప్పినవి మాత్రమే కాదు... చెప్పనివీ చేసి చూపించిన అపర భగీరథుడు వైఎస్ రాజశేఖరరెడ్డి వార సుడాయన. కనుకనే వైఎస్సార్ కాంగ్రెస్ వెలువరించిన రెండు పేజీల ఎన్నికల మేనిఫెస్టోను ప్రమా ణస్వీకార సభా వేదికపై చూపుతూ... దీన్ని తాను ఖురాన్‌లా, బైబిల్లా, భగవద్గీతలా భావించి, అందులోని వాగ్దానాలన్నిటినీ నెరవేర్చడానికి త్రికరణశుద్ధిగా పనిచేస్తానని జగన్ చెప్పగలిగారు. అంతేకాదు, అయిదేళ్లుగా రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న అవినీతిని అంతం చేయడానికి తీసుకోబోయే చర్యలేమిటో స్థూలంగా తెలియజేశారు. టెండర్ల విధానంలో పారదర్శకత ప్రవేశపెడతామని, అక్రమాలకూ, అవినీతికీ ఆస్కారం లేనివిధంగా రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. ఇందుకోసం హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో జ్యుడీషియల్ కమిటీని ఏర్పాటు చేయమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి విన్నవిస్తామని తెలిపారు. ఈ నిర్ణయం ఎంతటి ప్రభావాన్ని కలిగిస్తుందో సుస్పష్టమే. ఇది అమలైతే ఖజానాకు గండికొట్టే అక్రమార్కుల ఆటలిక సాగవు. తెలుగుదేశం పాలనలో అస్మదీయ కాంట్రాక్టర్లు ఓ వెలుగు వెలిగారు. కోటరీగా ఏర్పడి అన్యు లెవరూ టెండర్ల దరిదాపుల్లోకి రాకుండా చూశారు. ఎవరైనా సాహసించి టెండర్లలో పాల్గొంటే వారిని ‘బ్లాక్ లిస్టు’లో చేర్చారు. కొన్ని సందర్భాల్లో యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేయాల్సిన పనుల్ని సైతం ‘అయినవాళ్ల’ కోసం నిరవధికంగా ఆపారు. ముఖ్యంగా నిర్మాణ పనులకు సంబం ధించిన ప్రాజెక్టుల్లో కోట్లాది రూపాయలు కైంకర్యం చేయడం ఒక సంస్కృతిగా మారింది. నేతలకు ముడుపులు చెల్లిస్తే తప్ప పనులు ప్రారంభించడం దుర్లభమయ్యేలా చేశారు. ఈ బాధ తట్టుకోలేక కొందరు కాంట్రాక్టర్లు పరారైన సందర్భాలూ ఉన్నాయి. అసలు టెండర్ నోటిఫికేషన్ జారీకి ముందే కాంట్రాక్టర్లతో కుమ్మక్కై అంచనా వ్యయాన్ని భారీగా పెంచేయడం, కమీషన్లు దండుకోవడం ఒక కళగా అభివృద్ధి చేశారు. ఏపీలో అధికార పార్టీ కన్నుపడని, వారికి కాసులు రాల్చని కాంట్రాక్టు పనులంటూ లేవు. ఈ అవినీతి మహమ్మారిని రూపుమాపుతానని హామీ ఇవ్వడం సాధారణ విషయం కాదు. నిండైన ఆత్మవిశ్వాసం ఉన్న నాయకుడికే, సాహసోపేతంగా అడుగేయగల నాయ కుడికే అది సాధ్యం. ‘సాహసమున పనులు సమకూరు ధరలోన...’ అని వేమన ఎప్పుడో చెప్పాడు. ప్రభుత్వ పథకాలు నేరుగా జనం ముంగిట్లోకి తీసుకెళ్లేందుకు గ్రామంలో 50 ఇళ్లకు ఒక వాలం టీర్ చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 4లక్షలమంది వాలంటీర్లను నియమిస్తామని చెప్పడం పేద జనానికి ఊరటనిచ్చే అంశం. తమకు రావాల్సినవాటి కోసం నెలల తరబడి, సంవత్సరాల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి లంచాలు ఇవ్వక తప్పని దుస్థితిలో పడుతున్న లక్షలాదిమంది నిరుపేదలకు ఇదొక వరం. అలాగే ప్రభుత్వ పథకాలు, సేవలు సరిగా అందని పక్షంలో నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికే ఫిర్యాదు చేసేందుకు వీలు కల్పించాలని, గాంధీ జయంతి నాటికి గ్రామ సచివాలయాలను అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించడం హర్షించదగ్గ నిర్ణయాలు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఇరు రాష్ట్రాలూ కలిసిమెలిసి ముందుకు సాగుదామని, పరస్పరం సహకరించుకుందామని పిలుపునివ్వడం శుభసూచికం. చరిత్రలో నిలిచిపోయేవిధంగా పేరు తెచ్చుకోవాలని ఆయనా, డీఎంకే అధినేత స్టాలిన్ ఆకాంక్షించడం హర్షణీయం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకున్న విధంగా రాబోయే రోజుల్లో సమర్థవంతమైన, నిష్కళంకమైన పాలన అందు తుందన్న భరోసాను జగన్మోహన్రెడ్డి ప్రసంగం కల్పించింది. -
మోదీతో సహా కేంద్ర మంత్రులు ప్రమాణ స్వీకారం
-
మోదీ కేబినెట్లో ముగ్గురు మహిళలు
న్యూఢిల్లీ : దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ మరోసారి ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ ముందు బహిరంగ ప్రదేశంలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద మోదీతో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సారి మోదీ కేబినెట్లో మహిళలకు చోటు దక్కింది. నిర్మలా సీతారామన్, స్మతి ఇరానీ, హర్సిమ్రత్ కౌర్ బాదల్లు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. సాధ్వి నిరంజన్ జ్యోతి, రేణుకా సింగ్, దేబశ్రీ చౌదరి కేంద్ర సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఎవరికి ఏ పదవి అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. -
నరేంద్ర మోదీ డ్రీమ్ టీమ్ ఇదే...
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డ్రీమ్ టీమ్ ప్రమాణ స్వీకారం చేసింది. భారత ప్రధానమంత్రిగా మోదీ రెండోసారి అంతఃకరణ శుద్ధితో దైవసాక్షిగా ప్రమాణం చేశారు. మోదీ భారతదేశానికి 16వ ప్రధాని. మోదీ ప్రమాణస్వీకారం చేసిన అనంతరం కేంద్ర మంత్రిగా రాజ్ నాథ్ సింగ్ ప్రమాణస్వీకారం చేశారు. కాగా కేబినెట్ కూర్పుపై ప్రధాని మోదీతో పాటు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సుదీర్ఘంగా చర్చలు జరిపినా చివరి వరకూ గోప్యత పాటించారు. 58మందితో నరేంద్ర మోదీ మంత్రివర్గం కొలువుతీరింది. మోదీతో సహా 25మంది కేంద్ర మంత్రులు, స్వతంత్ర హోదాలో 9మంది సహాయ మంత్రులు, 24 సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే శాఖల కేటాయింపు ఇంకా జరగలేదు. కాగా గత మంత్రివర్గంలో 25మంది కేంద్రమంత్రులుగా, 11 సహాయ (స్వతంత్ర), 40 సహాయ మంత్రులుగా ఉన్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : మోదీతో సహా కేంద్ర మంత్రులు ప్రమాణ స్వీకారం కేంద్రమంత్రులు... 1. నరేంద్ర మోదీ (ప్రధానమంత్రి) 2. రాజ్‌నాథ్ సింగ్ 3. అమిత్ షా 4. నితిన్ గడ్కరీ 5. సదానంద గౌడ 6. నిర్మలా సీతారామన్ 7. రాంవిలాస్ పాశ్వాన్ 8. నరేంద్ర సింగ్ తోమర్ 9. రవిశంకర్ ప్రసాద్ 10. హర్సిమ్రత్ కౌర్ బాదల్ 11. థావర్ చంద్ గెహ్లాట్ 12. సుబ్రహ్మణ్యం జయశంకర్ 13. రమేశ్ పోఖ్రియాల్ 14. అర్జున్ ముండా 15. స్మృతి ఇరానీ 16. డాక్టర్ హర్షవర్థన్ 17. ప్రకాశ్ జవదేకర్ 18. పీయూష్ గోయల్ 19. ధర్మేంద్ర ప్రధాన్ 20. ముఖ్తార్ అబ్బాస్ నక్వీ 21. ప్రహ్లాద్ జోషీ 22. మహేంద్రనాథ్ పాండే 23. అరవింద్ సావంత్ 24. గిరిరాజ్ సింగ్ 25. గజేంద్ర సింగ్ షెకావత్ సహాయ మంత్రులు (స్వతంత్ర హోదా) 1. సంతోష్ గాంగ్వర్ 2. రావ్ ఇందర్జీత్ సింగ్ 3. శ్రీపాద యశో నాయక్ 4. జితేంద్ర సింగ్ (సహాయ మంత్రి) 5. కిరణ్ రిజిజు (సహాయ మంత్రి) 6. ప్రహ్లాద్ సింగ్ పటేల్ (సహాయ మంత్రి) 7. రాజ్ కుమార్ సింగ్ (సహాయ మంత్రి) 8. హర్దీప్ సింగ్ పూరీ (సహాయ మంత్రి) 9. మన్సూఖ్ మాండవియా (స్వతంత్ర సహాయ మంత్రి) సహాయ మంత్రులు 1. ఫగ్గీన్ సింగ్ కులస్తే 2.. అశ్వినీ చౌబే 3. అర్జున్ రామ్ మేఘవాల్ 4. జనరల్ వీకే సింగ్ 5. కిృషన్ పాల్ గుజ్జర్ 6. దాదారావ్ పాటిల్ 7. కిషన్ రెడ్డి 8. పురుషోత్తం రూపాలా 9. రాందాస్ అథవాలే 10. సాధ్వీ నిరంజన్ జ్యోతి 11. బాబుల్ సుప్రియో 12. సంజీవ్ కుమార్ బాల్యాన్ 13. దోత్రే సంజయ్ శ్యారావ్ 14. అనురాగ్ సింగ్ ఠాకూర్ 15. సురేష్ అంగాడి 16. నిత్యానంద్ రాయ్ 17. రత్తన్ లాల్ కఠారియా 18. వి.మురళీధరన్ 19. రేణుకా సింగ్ 20. సోమ్ ప్రకాశ్ 21. రామేశ్వర్ తెలి 22. ప్రతాప్ చంద్ర సారంగి 23. కైలాస్ చౌదరి 24. దేవశ్రీ చౌదురి -
జగన్ ప్రమాణస్వీకారానికి భారీగా తరలివచ్చిన అభిమానులు
-
‘బీజేపీ మా ప్రభుత్వాలను కూల్చాలని చూస్తోంది’
జైపూర్ : ప్రమాణ స్వీకారం కంటే ముందే మోదీ ప్రభుత్వం వివిధ రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు నడిపిస్తోన్న ప్రభుత్వాలను కూలదోసేందుకు ప్రయత్నిస్తోందని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ ఆరోపించారు. రెండో సారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీకి, అశోక్ గెహ్లోట్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బీజేపీపై విమర్శల వర్షం కురిపించారు. ‘నూతనంగా ఎన్నికైన బీజేపీ ప్రభుత్వం ప్రమాణస్వీకారం కంటే ముందే ప్రతిపక్షాలు పాలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోసేందుకు ప్రయత్నిస్తోంది. పశ్చిమబెంగాల్, కర్ణాటక, మధ్యప్రదేశ్‌లలో ఈ ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి’ అంటూ అశోక్ గెహ్లోట్ ట్వీట్ చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో రాజస్తాన్‌లో కాంగ్రెస్ 25 లోక్ సభ స్థానాల్లో కనీసం ఒక్క చోట కూడా విజయం సాధించలేకపోయింది. Even before the swearing in ceremony of newly elected BJP government, they are trying to disturb and dismantle the state governments of the opposition parties including West Bengal, Karnatka and Madhya Pradesh. My best wishes from Jaipur. — Ashok Gehlot (@ashokgehlot51) May 30, 2019 అశోక్ గెహ్లోట్ స్వయంగా తన కుమారున్ని కూడా గెలిపించుకోలేకపోయాడు. ఈ క్రమంలో అశోక్ గెహ్లోట్ రాజీనామా చేయాలంటూ ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం దినేష్ శర్మ డిమాండ్ చేస్తున్నారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో రాజస్తాన్‌లో కాంగ్రెస్ ఓటమి పాలయ్యింది. ముఖ్యమంత్రి స్వయంగా తన కుమారున్ని కూడా గెలిపించుకోలేకపోయారు. ఈ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ.. అశోక్ గెహ్లోట్ రాజీనామా చేయాలి’ అంటూ దినేష్ శర్మ డిమాండ్ చేశారు. -
సుష్మాకు నో ప్లేస్ : గుండె పగిలిన ట్విటర్
సాక్షి, న్యూఢిల్లీ : విదేశాంగ మంత్రి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నసుష్మా స్వరాజ్ (66)కు మోదీ 2.oలో చోటు దక్కలేదు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా పలువురు కేంద్రమంత్రులు రెండోసారి కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ సుష్మాకు అవకాశం దక్కలేదు. అయితే మాజీ ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తరహాలోనే సుష్మా కూడా కేంద్రమంత్రి పదవిని సున్నితంగా తిరస్కరించినట్టు తెలుస్తోంది. అనారోగ్య కారణాల రీత్యా తానే స్వయంగా తప్పుకున్నట్టు సమాచారం. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడంలేదని ముందుగానే సుష్మా స్వరాజ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆమెను రాజ్యసభ సభ్యురాలుగా ఎంపిక చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన టీంలో తప్పక చేర్చుకుంటారనే అంచనాలు బలంగానే వినిపించాయి. అయితే ఈ అంచనాలకు భిన్నంగా ప్రస్తుతానికి సుష్మా మాజీ కేంద్ర మంత్రుల జాబితాలోకి చేరిపోయారు. ముఖ్యంగా ప్రమాణ స్వీకారోత్సవంలో తేనిటీ విందుకు గైర్హాజరైన సుష్మా ప్రేక్షకుల వరుసలో జైట్లీ భార్య పక్కన ఆసీనులయ్యారు. దీంతో ఆమెకు మోదీ టీంలో స్థానం లేదని అందరూ ధృవీకరించుకున్నారు. మరోవైపు మోదీ ప్రభుత్వంలో సుష్మా స్వరాజ్‌కు చోటు దక్కకపోవడంపై ట్విటర్ వినియోగదారులు తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు. వియ్ మిస్ యూ మేమ్ అంటూ విచారం వ్యక్తం చేశారు. మరికొందరైతే మేడం తిరిగి కావాలి..ఈ విషయాన్ని రీట్వీట్ చేయండి.. ట్రెండింగ్ చేయండి..తద్వారా ఆమెను కేంద్రమంత్రిగా వెనక్కి తెచ్చుకుందామటూ ట్వీట్ చేస్తున్నారు. ఇది ఎన్ఆర్ఐలకు తీరని లోటని మరొక యూజర్ ట్వీట్ చేశారు. కాగా 2016 డిసెంబరులో సుష్మా స్వరాజ్‌కు మూత్రపిండ మార్పిడి చికిత్స జరిగిన సంగతి తెలిసిందే. చదవండి : నిండుతనం..చెరగని చిరునవ్వు సుష్మా స్వరాజ్ #sushmaswaraj we want you back mem plzz guys do retweet and make it trending so that mem will return — saksham gupta (@Guptasaksham07G) May 29, 2019 @SushmaSwaraj ji #sushmaswaraj 😢😭😢😭😢😭😢😭 ?????? — Nilesh U.R Dhanure (@DhanureNilesh) May 30, 2019 #SushmaSwaraj will not be part of Modi Cabinet. My heart breaks to hear this.#ModiSwearingIn #ModiSarkar2 — Nidhi Taneja (@nidhitaneja0795) May 30, 2019 Sushma Swaraj is not joining Modi's Cabinet. Huge loss for NRIs and Twitter.#ModiSwearingIn — Jet Lee(Vasooli Bhai) (@Vishj05) May 30, 2019 -
చప్పట్లు కొడుతూ మోదీ తల్లి హర్షాతిరేకం..
సాక్షి, అహ్మదాబాద్ : కుమారుడి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ తన నివాసంలోనే టీవీలో వీక్షించారు. మోదీ సోదరుడు పంకజ్ కూడా తల్లితో కలిసి ఈ వేడుకను తిలకించారు. గాంధీనగర్ సమీపంలోని రాయ్సన్ గ్రామంలో ఆమె తన నివాసంలో టీవీలో చూస్తూ... కొడుకు ప్రధానిగా ప్రమాణం చేస్తుండగా చప్పట్లు కొట్టి మురిసిపోయారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఆదివారం నరేంద్ర మోదీ గుజరాత్ వెళ్లి తల్లి వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్న విషయం తెలిసిందే.ఈ సందర్భంగా తల్లికి పాదాభివందనం చేసి, కాసేపు ఆమెతో గడిపారు. -
ప్రమాణ స్వీకారోత్సవం వేళ బీజేపీకి షాక్
న్యూఢిల్లీ : భారత ప్రధానిగా నరేంద్ర మోదీ రెండో సారి ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఢిల్లీ వింగ్ బీజేపీ వెబ్సైట్ హ్యాక్ అయ్యింది. హ్యాకర్స్ వెబ్‌సైట్‌లోని పలు పేజీల స్థానంలో బీఫ్(ఎద్దు మాంసం) ఐటమ్స్ పేర్లను చేర్చారు. అంతేకాక 'Shadow_V1P3R’కు చెందిన వ్యక్తులు వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసినట్లు వెల్లడించారు. వెబ్ సైట్ హోం పేజ్‌లోని నావిగేషన్ బార్లో బీజేపీ అని ఉన్న చోట బీఫ్ పదంతో ఎడిట్ చేశారు. ఉదాహరణకు బీజేపీని బీఫ్‌గా.. బీజేపీ హిస్టరీని ‘బీఫ్ హిస్టరీ’గా మార్చారు. ప్రస్తుతం నాయకులు ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమంతో బిజీగా ఉండటంతో దీనిపై ఇంతవరకూ ఎవరూ స్పందించలేదు. -
ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన మోదీ
-
కేంద్ర కొత్త ఆర్థికమంత్రిపై వీడని సస్పెన్స్
సాక్షి, న్యూఢిల్లీ : 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయాన్ని దక్కించుకున్న నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ మరోసారి అధికార పగ్గాలు చేపట్టింది. గురువారం రాష్ట్రపతి భవన్లో అట్టహాసంగా నిర్వహించిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో మోదీ రెండవసారి ప్రధానిగా ప్రమాణం స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మోదీ చేత ప్రమాణం చేయించారు. కేంద్రమంత్రులకు ఆయా శాఖలను ప్రకటించక పోవడంతో క్యాబినెట్లో అతి కీలకమైన ఆర్థికమంత్రి పదవి ఎవర్ని వరించనుందన్న ఉత్కంఠకు తెరపడలేదు. అయితే ఈ సాయంత్రం గానీ, రేపు (శుక్రవారం, మే 31) ఉదయం గానీ మంత్రి పదవులను కేటాయించే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. రాజ్‌నాథ్ సింగ్, అమిత్‌షా, సదానంద గౌడ , నిర్మలా సీతా రామన్, స్మృతి ఇరానీ, పియూష్ గోయాల్, రాం విలాస్ పాశ్వాన్, నరేంద్ర సింగ్తోమర్, రవిశంకర ప్రసాద్, అర్జున్ ముండా తదితరులు కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఇంకా కొనసాగుతోంది. కాగా ఆర్థికమంత్రి పదవి రేసులో అమిత్ షా, పియూష్ గోయల్ తదితర పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ప్రధాని మోదీ తన పోర్ట్‌ఫోలియో వివరాలను అధికారికంగా ప్రకటించేంతవరకు ఈ సస్పెన్స్‌కు తెరపడే ఛాన్సే లేదు. ముఖ్యంగా అనారోగ్య కారణాల రీత్యా తనకు క్యాబినెట్ నుంచి మినహాయింపునివ్వాల్సిందిగా మాజీ ఆర్థికమంత్రి అరుణ జైట్లీ ప్రధానికి లేఖ రాశారు. దీంతో ఈ ఊహాగానాలు మరింత జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. -
ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రంలో వరుసగా రెండోసారి ఎన్డీయే సర్కార్ కొలువు తీరింది. ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. మోదీ ప్రమాణ స్వీకారం అనంతరం రాజ్‌నాథ్ సింగ్ ప్రమాణం చేశారు. మోదీతోపాటు కేబినెట్ మంత్రులతో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గురువారం ప్రమాణం చేయిస్తున్నారు. దేశ,విదేశాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరు అయ్యారు. రాష్ట్రపతి భవన్లో ఫోర్కోర్డ్లో మోదీ ప్రమాణస్వీకార వేడుకకు వేదికగా నిలిచింది. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, తదితరులు హాజరయ్యారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన మోదీ -
అలకబూనిన జేడీయూ, కేబినెట్లోకి నో..
సాక్షి, న్యూఢిల్లీ: రెండోసారి ఎన్డీయే సర్కార్ కొలువు తీరకముందే లుకలుకలు మొదలయ్యాయి. బీజేపీ మిత్రపక్షం అయిన జేడీయూ మంత్రివర్గ కూర్పుపై అలకబూనింది. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో ఏర్పడనున్న మంత్రివర్గంలో తమకు ఒకటే మంత్రి పదవి కేటాయించడంపై జేడీయూ అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్ర మంత్రివర్గంలో చేరబోమంటూ ప్రకటన చేసింది. కేవలం మిత్రపక్షంగానే కొనసాగుతామని జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ స్పష్టం చేశారు. కాగా నరేంద్ర మోదీ రెండోసారి ప్రధానమంత్రిగా ఇవాళ రాత్రి 7గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్లో జరిగే ఈ వేడుకలో దేశ, విదేశాల నుంచి వచ్చిన సుమారు 8వేల మంది అతిథులు పాల్గొంటున్నారు. మోదీ కేబినెట్లో మొత్తం 60 మంది మంత్రులు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే 46 మందికి కేబినెట్లో బెర్త్‌లు ఖరారు అయ్యాయి. -
మోదీ 2.oలో కొత్త ముఖాలు వీరేనా!
సాక్షి, న్యూఢిల్లీ : 2019 ఎన్నికల్లో విజయ దుందుభి మోగించిన బీజేపీ అధికార పగ్గాలు చేపట్టనుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండోసారి తన స్థానాన్ని నిలబెట్టుకుంటున్నారు. అలాగే దాదాపు 62 మందితో భారీస్థాయిలో క్యాబినెట్ ఏర్పాటు చేయనుందని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం కొత్త మంత్రివర్గంలో అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, రవిశంకర్ ప్రసాద్, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, పియూష్ గోయల్, ప్రకాశ్ జవదేకర్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తదితరులు ప్రమాణం చేయనున్నారు. కాగా ఈ సారి కొత్తవారికి స్థానం కల్పించడం విశేషంగా నిలిచింది. ఈ నేపథ్యంలో మోదీ 2.0 లో ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం కొత్తవారి జాబితా అరవింద్ సావంత్ అనుప్రియ పాటిల్ రతన్ లాల్ కటారియా రమేష్ పోఖ్రియాల్ నిషాంక్ ఆర్సీపీ సింగ్ జి కిషన్ రెడ్డి సురేష్ అంగడి ఏ రవీంద్రనాథ్ కైలాష్ చౌదరి ప్రహ్లాద్ జోషి సోమ్ ప్రకాష్ రామేశ్వర్ తెలీ సుబ్రత్ పాథక్ దేబశ్రీ చౌదరి రీటా బహుగుణ జోషి -
టెలిఫోన్ ఆపరేటర్ నుంచి కేంద్రమంత్రిగా
సాక్షి, న్యూఢిల్లీ : దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ రెండోసారి ప్రమాణస్వీకారోత్సవానికి సర్వం సిద్దమైంది. ప్రాథమికంగా అందుతున్నసమాచారం ప్రకారం ప్రధాని నరేంద్రమోదీ సహా మొత్తం 60మంది మంత్రులతో జెంబో క్యాబినెట్ కొలువు దీరనుంది. ఈ మేరకు రాష్ట్రపతిభవన్‌లో ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఇప్పటికే పలువురి కొత్తవారితోపాటు 46 మంది మంత్రులు ఖరారయ్యారు. ఎన్డీయే భాగస్వామ్యపక్షాలైన శివసేన, జేడీయూ, అప్నాదళ్, ఎల్జేపీ సభ్యులకు కూడా మంత్రివర్గంలో చోటు దక్కనుంది. మరోవైపు తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి కేబినెట్లో బెర్త్ దక్కింది. ముఖ్యంగా కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న రాజస్థాన్ ఎంపీ అర్జున్ రామ్ మేఘవాల్ (65) ఒకరు. మూడుసార్లు ఎంపీగా గెలిచి వరుసగా రెండవసారి మోదీ 2.0లో స్థానం దక్కించుకోనున్నారు. గతంలో మోదీ నేతృత్వంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల, నీటివనరులు, రివర్ డెవలప్మెంట్ అండ్ గంగా రెజువెనేషన్ మంత్రిగా మేఘవాల్ పని చేశారు. తనకు కూడా పిలుపు వచ్చిందనీ, ఇందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతున్నాననంటూ మేఘవాల్ సంతోషం వ్యక్తం చేశారు. తనపై నమ్మకం ఉంచినందుకు ప్రధానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. మేఘవాల్ కరియర్, రాజకీయ ప్రస్థానం 1977లో లా కోర్సు, 1979 ఆర్ట్స్‌లో పీజీ చేశారు. అనంతరం ఇండియన్ పోస్ట్ అండ్ టెలీగ్రాఫ్ డిపార్ట్మెంట్లో టెలిఫోన్ ఆపరేటర్‌గా కరియర్‌ను ప్రారంభించారు. ఆ ఉద్యోగం చేస్తూనే పోటీ పరీక్షలకు హాజరయ్యేవారు. 1982లో ‘రాస్’ (రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్) అర్హత సాధించి రాజస్థాన్ ఉద్యోగ్ సేవాకు అసిస్టెంట్ డైరెక్టరయ్యారు. 1994లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హరిశంకర్ బాబ్డాకు ఓఎస్డీగా నియామకం. అలా ఐఏఎస్‌కు ప్రమోటై పలు కీలక పదవులను నిర్వహించారు. ఫిలిప్సీన్స్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా సాధించారు. వివిధ రంగాల్లో పరిశోధన చేశారు. ముఖ్యంగా కేంబ్రిడ్జ్ యూనివర్శిటీకి ఆంగ్లంలో కొన్ని సాహిత్య పేపర్స్‌ను సమర్పించారు. ఐఏఎస్‌గా రాజీనామా చేసి 2009లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. మాజీ ఐఎఎస్ అధికారి అయిన అర్జున్ మేఘవాల్ బికనూర్ పార్లమెంట్ స్థానం నుంచి వరుసగా మూడుసార్లు లోక్‌సభకు ఎంపిక కావడం విశేషం. 2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని 19వేల ఓట్ల మెజార్టీతో ఓడించారు. 2014 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శంకర్ పన్నూపై విజయం సాదించారు. తాజా ఎన్నికల్లో 6.5 లక్షల ఓట్లతో కాంగ్రెస్ పార్టీకే చెందిన మదన్ గోపాల్ మేఘవాల్‌ను ఓడించారు. 2004లో ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర బికనీర్‌కు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. అవార్డులు 2013లో ‘బెస్ట్ పార్లమెంటేరియన్’ అవార్డు కూడా దక్కించుకున్నారు. దీనితోపాటు మరికొన్ని అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. -
‘సైకిల్ అంటే నాకు ఫ్యాషన్ కాదు.. పాషన్’
గాంధీనగర్ : గురువారం రాత్రి 7 గంటలకు ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్ ఎదుట ఏర్పాటు చేసిన వేదికపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మోదీతో ప్రమాణం చేయించనున్నారు. అనంతరం పలువురు నేతలు కూడా కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోదీతో పాటు ప్రమాణ స్వీకారం చేయబోయే వారి పేర్లను ఇప్పటికే ప్రకటించారు. వీరిలో గుజరాత్‌కు చెందిన మన్సుక్ లాల్ మాండవ్య కూడా ఉన్నారు. మోదీ కాబినేట్‌లో మన్సుక్ మరోసారి మంత్రి పదవి చేపట్టనున్నారు. ఈ సందర్భంగా మన్సుక్ మాట్లాడుతూ.. ‘నరంద్రే మోదీ, అమిత్ షా నా మీద ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు. మరోసారి వారి ప్రభుత్వంలో నన్ను భాగం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వారిద్దరికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అన్నారు. గత ఐదేళ్లలో మన్సుక్ సైకిల్ మీదనే పార్లమెంట్‌కు వెళ్లారు. దాంతో విలేకరులు ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా సైకిల్ మీదనే వెళ్తారా అని ప్రశ్నించారు. అందుకు ఆయన బుదులిస్తూ.. ‘సైకిల్ మీద ప్రయాణించడాన్ని నేను పాషన్‌గా భావిస్తాను. సైకిల్ వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని జరగదు. సైకిల్ వాడకం వల్ల కాలుష్యం తగ్గడమే కాక ఇంధనం కూడా ఆదా అవుతుంది. పైగా ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఐదేళ్ల నుంచి పార్లమెంట్‌కు సైకిల్ మీదనే వెళ్లాను. ఇప్పుడు కూడా అలానే చేస్తాను’ అని చెప్పుకొచ్చారు. -
పెళ్లిలో వైఎస్ జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం
-
ఓవైపు పెళ్లి వేడుక, మరోవైపు వైఎస్ జగన్ ప్రమాణం..
చింతలపాలెం (హుజూర్నగర్) : వైఎస్ కుటుంబంపై తనకున్న ప్రేమను వినూత్నంగా వ్యక్తం చేశాడు ఓ వీరాభిమాని. తన కూతురు పెళ్లిపందిరిలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయించి అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ ఘటన గురువారం హుజూర్‌నగర్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. హుజూర్‌నగర్‌కు చెందిన బిల్లుపల్లి రమా ఇంద్రారెడ్డి తన కూతురు మంజుభార్గవి అల్లుడు ఫణీందర్రెడ్డిల వివాహం గురువారం జరుగుతోంది. ఇదే సమయానికి ఏపీలో వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంది. ఈనేపథ్యంలో ఇంద్రారెడ్డి జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం లైవ్‌లో చూడాలనుకున్నాడు. వివాహం వల్ల కుదరక పోవడంతో మండపంలోనే సీఎం వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం లైవ్ స్క్రీన్లను ఏర్పాటు చేయించాడు. దీంతో హాజరైన అతిథులు అందరూ పెళ్లితో పాటు జగన్ ప్రమాణ స్వీకారాన్ని తిలకించి ఆనందించారు. నూతన వధూవరులతో పాటు లైవ్ స్క్రీన్లు ఏర్పాటు చేసినందుకు ఇంద్రారెడ్డిని పలువురు ఆయనను అభినందించారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : పెళ్లిలో వైఎస్ జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం -
వైఎస్ జగన్, కేసీఆర్ ఢిల్లీ పర్యటన రద్దు
సాక్షి, అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఢిల్లీ పర్యటన రద్దైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేసీఆర్ హాజరు కాలేకపోతున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో మధ్యాహ్నం మూడున్నర తర్వాత ప్రత్యేక విమానాల ల్యాండింగ్‌కు విమానాయాన శాఖ అనుమతి నిరాకరించింది. దీంతో ముఖ్యమంత్రుల పర్యటన రద్దు అయినట్లు తెలుస్తోంది. కాగా కేసీఆర్ టూర్ షెడ్యూల్‌కు సంబంధించి సీఎంవో విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఆయన నేరుగా విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. రాత్రి 7 గంటలకు జరిగే మోదీ ప్రమాణస్వీకారోత్సవానికి గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్తారని అంతా భావించారు. కానీ ఢిల్లీ ఎయిర్‌పోర్టులో భద్రతా కారణాల దృష్ట్యా ప్రత్యేక విమానాలకు మధ్యాహ్నం మూడున్నర గంటల వరకే అనుమతిచ్చారు. దీంతో గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరాల్సిన ప్రత్యేక విమానం రద్దయింది. ఇక, కేసీఆర్ ఢిల్లీ పర్యటన రద్దుచేసుకుని నేరుగా గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి హైదరాబాద్ బయల్దేరారు. -
అక్టోబరు 2 కల్లా మరో లక్షా అరవై వేల ఉద్యోగాలు
-
ఆగస్టు 15 నాటికి 4 లక్షల ఉద్యోగాలు
-
అట్లాంటలో జననేత హోర్డింగ్స్
అట్లాంట : వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు (మే 30) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ప్రపంచం నలుమూలలా ఉన్న తెలుగు ప్రజలంతా వీక్షించారు. జననేతకు నేడు పట్టాభిషేకం జరుగుతున్నందున.. ‘యాత్ర’ మూవీ నిర్మాత గిరీష్ మేక అట్లాంటలో జననేత వైఎస్ జగన్ హోర్డింగ్‌లను ఏర్పాటు చేశారు. -
జగన్‌కు మోదీ, రాహుల్ శుభాకాంక్షలు
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. పూర్తి సహకారం అందిస్తాం : మోదీ ‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు. కేంద్రం నుంచి మీకు పూర్తి సహకారం అందిస్తానని మాట ఇస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మనం కలిసి పని చేద్దాం’ అంటూ మోదీ ట్వీట్ చేశారు. Congratulations to @ysjagan on taking oath as Andhra Pradesh’s Chief Minister. I assure full cooperation from the Centre. We will work together to take Andhra Pradesh to new heights. — Narendra Modi (@narendramodi) May 30, 2019 ‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్ మోహన్ రెడ్డి గారికి, ఆయన టీమ్‌కు నా అభినందనలు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’ అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. Congratulations to Jagan Reddyji on being sworn in as the CM of Andhra Pradesh. My best wishes to him, his new team of ministers and to all the people of the state. — Rahul Gandhi (@RahulGandhi) May 30, 2019 శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్‌ను జగన్ సరికొత్త శిఖరాలకు చేర్చగలరని రామ్‌నాథ్ కోవింద్ ఆశిస్తున్నారంటూ రాష్ట్రపతి భవన్ ట్వీట్ చేసింది. రామ్ నాథ్ కోవింద్ జగన్‌కు ఫోన్ చేసి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీస్వీకార ప్రమాణం చేస్తున్న సందర్భంగా శ్రీ వై ఎస్ జగన్ మోహన రెడ్డిగారికి రాష్ట్రపతి కోవింద్ శుభాభినందనలు తెలియచేశారు. రాష్ట్రపతి ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఆంధ్ర ప్రదేశ్‌ను ఆయన సరికొత్త శిఖరాలకు చేర్చగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. @ysjagan — President of India (@rashtrapatibhvn) May 30, 2019 నవ్యాంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో గురువారం మధ్యాహ్నం 12.23 గంటలకు ఏపీ నూతన ముఖ్యమంత్రిగా జగన్‌తో గవర్నర్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించారు. -
వైఎస్ జగన్ ప్రమాణస్వీకారోత్సవం
-
ఉద్వేగానికి లోనైన వైఎస్ విజయమ్మ
-
అమ్మ భావోద్వేగం
సాక్షి, అమరావతి : వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం ఆయన ప్రసంగం తరువాత తల్లి వైఎస్ విజయమ్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పదేళ్ల పాటు అలుపెరుగని పోరు సాగించి, కష్టనష్టాలు భరించి అశేషాంధ్రుల మనసు చూరగొని వైఎస్ జగన్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. గురువారం విజయవాడ నగర నడిబొడ్డున అశేష జనవాహిని, పార్టీ శ్రేణుల నడుమ సాగిన ఆయన ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రతీ క్షణాన్ని వైఎస్ విజయమ్మ ఆసక్తిగా గమనిస్తూ వచ్చారు. వైఎస్ జగన్ ప్రసంగిస్తూ.. కీలక నిర్ణయాలు వెలువరిస్తున్నప్పుడు కరతాళ ధ్వనులు చేస్తూ ప్రతిస్పందించారు. ప్రసంగం ముగింపులో ‘ఆశీర్వదించిన దేవుడికి, పైనున్న నాన్న గారికి, నా పక్కనే ఉన్న నా తల్లికి పాదాభివందనం చేస్తున్నా.. మీ అందరి చల్లని దీవెనలకు మరొక్కసారి కృతజ్ఞతలు’ అని వైఎస్ జగన్ అనగానే ఆమె ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు.జగన్‌ను తదేకంగా చూస్తూ తన్మయత్వం చెందుతూ లేచి నిలుచున్నారు. ఆమె కంట ఒక్కసారిగా నీరు ఉబికి వచ్చింది. ప్రసంగం ముగించి వస్తున్న జగన్.. ఆ దృశ్యాన్ని గమనించి తల్లి దగ్గరకు వెళ్లారు. ఇద్దరూ పర్పరం ఒక్కసారిగా ఆత్మీయంగా రెండు చేతులతో గుండెలకు హత్తుకున్నారు. తన్నుకొచ్చే ఆనంద భాష్పాల మధ్య ఆ సమయంలో ఆమె నోటి వెంట మాట రాలేదు. చెమ్మగిల్లిన తల్లి కళ్లు తుడిచి జగన్ ఓదార్చారు. మాతృ మూర్తి ప్రేమలో ముగ్ధుడవుతూ వీపుపై చేతులతో తడుతూ ‘అమ్మా..’ అని పలకరించే ప్రయత్నం చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. ఆయన అకాల మరణంతో ఒక్కడిగా రాజకీయాల్లోకి వచ్చిన వైఎస్ జగన్‌కు అమ్మ విజయమ్మే అండగా నిలిచింది. పదేళ్లుగా కొడుకు పడిన కష్టాలు, కన్నీళ్లు చూస్తూ తల్లడిల్లిపోయింది. ఎప్పటికప్పుడు ధైర్యం చెబుతూ ప్రజల్లోకి పంపించింది. తండ్రి ఆశయ సాధనలో అలుపెరగని పోరాటం చేసి.. ప్రజల ఆశీస్సులతో ఆఖండ విజయం సొంతం చేసుకున్న కొడుకును చూసి విజయమ్మ తల్లిగానే స్పందించారు. కొద్ది క్షణాల పాటు ఆ దృశ్యాన్ని ప్రత్యక్షంగా, టీవీల్లో వీక్షించిన ప్రజలు సైతం భావోద్వేగానికి లోనయ్యారు. ‘ఢిల్లీకి రాజైనా ఆ అమ్మకు కొడుకే కదా..’ అన్న నానుడిని గుర్తుకు తెచ్చుకున్నారు. -
ఏపీ సీఎంగా జగన్.. తెలంగాణలో సంబరాలు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పదవీ ప్రమాణ స్వీకారం చేయడంతో తెలంగాణలోని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. కేకులు కోసి, బాణాసంచా కాల్చి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ♦ వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం జోగిపేటలో దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జిల్లా వైఎస్సార్సీపీ బీసీ సెల్ అధ్యక్షుడు మల్లయ్య యాదవ్ నాయకులు, నరేష్, రమేష్, పలువురు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ♦ ఖమ్మం నగరంలో వైఎస్సార్సీపీ సంబరాలు అంబరాన్ని అంటాయి. కేక్ కట్ చేసి బాణసంచా కాలుస్తూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర సెక్రెటరీ దార్ల అశోక్, నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు. ♦ హైదరాబాద్‌లోని ప్రగతి మహా విద్యాలయలో వైఎస్ జగన్ స్నేహితులు కేక్ కోసి, బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. వైఎస్ జగన్ ప్రమాణస్వీకారోత్సవాన్ని ప్రొజెక్టర్ ద్వారా తెరపై వీక్షించి పులకించిపోయారు. వేడుకలతో ప్రగతి మహా విద్యాలయలో పండగ వాతావరణం నెలకొంది. చెన్నైలో అన్నదానం ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా వైఎస్సార్సీపీ నేతలు చెన్నైలో అన్నదానం చేశారు. వెయ్యి మందికి పైగా బిర్యానీ పంచారు. వైఎస్సార్సీపీ నేతలు దువ్వూరి సురేష్ రెడ్డి, కడివేటి గోపాలకృష్ణా రెడ్డి, రాంప్రసాద్ రెడ్డి తదితర నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
గ్రామ వాలంటీర్ల ద్వారా ప్రభుత్వ పథకాలు నేరుగా ఇంటికే
-
జగన్ చరిత్రలో నిలిచిపోవాలి: కేసీఆర్
సాక్షి, అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటూ అద్భుతమైన ఫలితాలు రాబట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణస్వీకారం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అభినందనలు తెలుపుతూ కేసీఆర్ ప్రసంగించారు. వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవాన్ని తెలుగు ప్రజల జీవన గమనంలో ఉజ్వల ఘట్టమని వర్ణించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ప్రేమాభిమానాలు, పరస్పర సహకారంతో ముందుకు సాగడానికి ఈ ఘట్టం బీజం వేస్తుందని బలంగా విశ్వసిస్తున్నానని అన్నారు. ఖడ్గచాలనం కాదు కరచాలనం కావాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నవ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తన పక్షాన, తెలంగాణ ప్రభుత్వం, ప్రజల తరపున హృదయపూర్వక అభినందనలు, ఆశీస్సులు అంటూ ప్రసంగాన్ని కేసీఆర్ ప్రసంగాన్ని ప్రారంభించారు. జగన్ వయసు చిన్నది, బాధ్యత పెద్దదని వ్యాఖ్యానించారు. ఈ బాధ్యతను అద్భుతంగా నిర్వహించగల అభినివేశం, శక్తి, సామర్థ్యం ఉందని గత 9 ఏళ్లుగా జగన్ నిరూపించారని అన్నారు. తండ్రి నుంచి వచ్చిన వారసత్వంతో ముఖ్యమంత్రి బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించగలరని ఆకాంక్షించారు. వైఎస్ జగన్ పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు, ప్రభుత్వాలు చేయాల్సింది ఖడ్గచాలనం కాదు కరచాలనం అని పేర్కొన్నారు. ఒకరి అవసరాలకు మరొకరు ఆత్మీయత, అనురాగంతో పరస్పరం సహకరించుకుంటూ అద్భుతమైన ఫలితాలు రాబట్టాలన్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి గోదావరి జలాలను ఒడిసిపడదాం వైఎస్ జగన్ ఆధ్వర్యంలో గోదావరి జలాల సంపూర్ణ వినియోగం వంద శాతం జరిగి తీరాలని కేసీఆర్ అన్నారు. కృష్ణా జలాలను సమస్యలను పరిష్కరించుకుని ప్రతి నీటిబొట్టును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రెండు రాష్ట్రాలు సమర్థవంతంగా వినియోగించుకుంటూనే సమృద్ధిగా ఉన్న గోదావరి జలాలతో ప్రతి అంగుళం సస్యశ్యామలం కావాలని ఆకాంక్షించారు. దీనికి అవసరమైన అండదండలు, సహాయ సహకారాలు తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని హామీయిచ్చారు. ఏపీ ప్రజలు ఇచ్చిన అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తండ్రి పేరు నిలబెట్టాలని వైఎస్ జగన్‌కు సూచించారు. చరిత్రలో నిలిచిపోయేవిధంగా పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. మూడు, నాలుగు టర్మ్‌ల వరకు వైఎస్ జగన్ పాలన కొనసాగాలని కేసీఆర్ కోరుకున్నారు. సంబంధిత కథనాలు నవరత్నాలను అమలు చేస్తాం : సీఎం వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్ మీ నాన్న వారసత్వాన్ని కొనసాగించు: ఎమ్కే స్టాలిన్ వైఎస్ జగన్‌కు టీటీడీ వేద పండితుల ఆశీర్వాదం -
వైఎస్ జగన్ అనే నేను.. తొలి సంతకం..
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జననేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సమక్షంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గవర్నర్ నరసింహన్‌కు వీడ్కోలు పలికిన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...తనకు ఆకాశమంతటి విజయాన్ని చేకూర్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన తెలంగాణ సీఎం కేసీఆర్, తమిళనాడు నేత, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, ఇతర పెద్దలకు కృతఙ్ఞతలు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీ ఇచ్చినట్లుగా నవరత్నాల్లోని ప్రతీ అంశాన్ని కులమత వర్గాలకు అతీతంగా ప్రతీ ఒక్కరికి అందేలా చూస్తామని పేర్కొన్నారు. అవ్వా, తాత, అక్కాచెల్లెళ్ల ఆశీస్సులు కోరుతూ ముఖ్యమంత్రిగా తన తొలి సంతకాన్ని వైఎస్సార్ పెన్షన్ ఫైల్‌పై చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ప్రసంగంలో భాగంగా..‘వైఎస్ జగన్ అనే నేను ప్రజల ఇచ్చిన ఈ తీర్పును గౌరవిస్తూ ముఖ్యమంత్రి పదవి స్వీకరిస్తున్నా. 3648 కిలోమీటర్లు ఈ నేల మీద నడిచినందుకు, తొమ్మిదేళ్ల కష్టానికి ప్రతిగా ఆకాశమంతటి విజయాన్ని అందించిన ప్రతీ అక్కా, చెల్లె, అవ్వా తాత, సోదరుడు, స్నేహితుడు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. పదేళ్ల నా రాజకీయ జీవితంలో.. 3648 కిలోమీటర్ల పాదయాత్రలో పేదలు పడిన కష్టాలు చూశాను. బాధలు విన్నాను. మీ కష్టాలు విన్న తర్వాత ఈ వేదిక మీద నుంచి ముఖ్యమంత్రిగా మీకు మాట ఇస్తున్నాను. మీ అందరికీ నేను ఉన్నాను. అందరి ఆశలు, ఆకాంక్షలు పూర్తిగా పరిగణనలోకి తీసుకుంటూ మేనిఫెస్టోలోని అన్ని అంశాలను పూర్తిగా అమలు చేస్తాం. గత ప్రభుత్వం మాదిరి ప్రతీ కులానికి ఓ పేజీ పెట్టి మోసం చేసేందుకు ప్రయత్నించలేదు. అటువంటి మోసాలకు తావు లేకుండా రెండే రెండు పేజీల మేనిఫెస్టో తెచ్చాను. మన సీఎం మన కోసం ఏం చేస్తాడన్న సంగతి ప్రలజందరికి తెలిసి ఉండాలి. దానికి అనుగుణంగా మేనిఫెస్టో తెచ్చి మీ కళ్ల ముందు పెట్టాను. మీ ఆకాంక్షల మేనిఫెస్టోను ఒక ఖురాన్, బైబిల్, భవద్గీతగా.. నా ఊపిరిగా భావిస్తానని సీఎం హోదాలో మాటా ఇస్తున్నాను. నవరత్నాలను అమలు చేస్తాను. అవ్వాతాతల ఆశీస్సుల కోసం ముఖ్యమంత్రిగా మొదటి సంతకం వైఎస్సార్ పెన్షన్ ఫైల్‌పై చేస్తున్నాను. జూన్ నెల నుంచి రూ. 2250 అందిస్తాం. తర్వాత ఏడాది రూ. 2500, మరుసటి ఏడాది రూ. 2750..అనంతరం రూ. 3000 వేలు అందిస్తాం’ అని పేర్కొన్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి రెండున్నర నెలల్లో 4 లక్షల ఉద్యోగాలు.. ‘ప్రభుత్వ పథకాలను నేరుగా డోర్ డెలివరీ చేసేందుకు యాభై ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమిస్తాం. ఆగస్టు 15 వచ్చే సరికి అక్షరాలా మన గ్రామాల్లోని యువతకు గ్రామ వాలంటీర్లుగా 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. గ్రామాల్లో చదువుకున్న పిల్లలకు రూ. 5 వేల జీతంతో గ్రామ వాలంటీర్లను నియమిస్తాం. వ్యవస్థల్లో లంచాలు లేకుండా చేసేందుకే వీరి నియామకం. సేవా దృక్పథం ఉన్న పిల్లలకు వేరే చోట ఉద్యోగం వచ్చేదాకా గ్రామ వాలంటీర్లుగా పని చేయవచ్చు. ప్రభుత్వ పథకాలు ఎవరికీ అందకపోయినా.. పొరపాటునైనా లంచాలు తీసుకుంటున్నారని తెలిసినా, వివక్ష కనిపించినా నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫోన్ చేయవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం. విప్లవాత్మక, పారదర్శక పాలనకు నాంది పలుకుతాం’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగంలోని ముఖ్యాంశాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో అవినీతికి చోటుండదు పెంచిన పెన్షన్లు జూన్ నుంచే అమల్లోకి ఆగస్టు 15 నాటికి 4 లక్షల ఉద్యోగాలు గ్రామ వాలంటీర్ల ద్వారా ప్రభుత్వ పథకాలు నేరుగా ఇంటికే గ్రామ సచివాలయంలో 10 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్న 72 గంటల్లోగా అర్హులకు పథకాల వర్తింపు సమస్యలు చెప్పుకునేందుకు ఆగస్టు 15 నుంచి కాల్ సెంటర్ సీఎం కార్యాలయంతో అనుసంధానం అక్టోబరు 2 కల్లా మరో లక్షా అరవై వేల ఉద్యోగాలు సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి అవినీతికి సంబంధించిన కాంట్రాక్టులన్నీ రద్దు చేస్తాం కాంట్రాక్టుల్లో ఎక్కువ మంది టెండర్లలో పాలు పంచుకునేట్లుగా రివర్స్ టెండరింగ్ తెస్తాం రివర్స్ టెండరింగ్ ద్వారా చేకూరిన లబ్దిని ప్రజలకు చూపిస్తాం సోలార్ పవర్, విండ్ పవర్‌ను గత ప్రభుత్వం అత్యధిక ధర చెల్లించి కొనుగోలు చేసింది. వాటన్నింటినీ తగ్గిస్తాం. పారదర్శకతకై హైకోర్టు జడ్జి చేత జ్యుడిషియల్ కమిషన్ వేయమని అడుగుతాం హైకోర్టు జడ్జి సూచనల మేరకు టెండర్లలో మార్పులు చేసి కాంట్రాక్టర్లను పిలుస్తాం 3 దశల్లో మద్య నిషేధం అమలు చేస్తాం తప్పుడు కథనాలు రాసినా, ప్రసారం చేసినా ఎల్లోమీడియాపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం పరువు నష్టం దావా వేసి కోర్టును ఆశ్రయిస్తాం అవినీతి రహిత పాలన అందించేందుకు ఆర్నెళ్ల నుంచి ఏడాది పాటు మాకు సమయం ఇవ్వండి -
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్
సాక్షి, విజయవాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం మధ్యాహ్నం 12:23 నిమిషాలకు విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో గవర్నర్ నరసింహన్.. వైఎస్ జగన్‌తో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. ‘‘వైఎస్ జగన్మోహన్రెడ్డి అనే నేను’’ అంటూ తెలుగులో దైవ సాక్షిగా ప్రమాణం చేశారాయన. ప్రస్తుతానికి వైఎస్ జగన్ మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, డీఎంకే అధినేత స్టాలిన్, పుదుచ్చేరి మంత్రి మాల్లాడి కృష్ణారావు, ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కేవీపీ రామచంద్రరావు, తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్, వైఎస్సార్ సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు వైఎస్ జగన్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. జననేత ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయటాన్ని చూడాలనే కోరికతో ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు హాజరవ్వటంతో స్టేడియం మొత్తం జనంతో నిండిపోయింది. ప్రమాణ స్వీకార ప్రాంగణానికి చేరుకునే ముందు వైఎస్ జగన్ తన నివాసంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి 11.54 నిమిషాలకు తాడేపల్లిలోని తన స్వగృహంనుంచి విజయవాడకు బయలుదేరివచ్చారు. ఆయన వెంట వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, వైఎస్ షర్మిల, అనిల్ సభా ప్రాంగణానికి వచ్చారు. 12.14 నిమిషాలకు పూలతో సుందరంగా అలంకరించిన ఓ ప్రత్యేక వాహనంలో వైఎస్ జగన్ అక్కడి జనాలకు అభివాదం చేస్తూ స్టేడియం చుట్టూ తిరిగారు. అనంతరం ఆయన స్టేజిమీదకు చేరుకుని మరోసారి ప్రజలకు అభివాదం చేయగా.. ఒక్కసారిగా ప్రజలు చేసిన కరతాళధ్వనులతో స్టేడియం మొత్తం ప్రతిధ్వనించింది. ప్రమాణం స్వీకారానికి కొద్ది క్షణాల ముందు జాతీయ గీతాలాపన జరిగింది. ప్రమాణ స్వీకార సమయంలో ‘‘వైఎస్ జగన్మోహన్రెడ్డి అనే నేను’’ అని ఆయన అనగానే స్టేడియం మొత్తం దద్దరిల్లింది. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే గవర్నర్ నరసింహన్.. వైఎస్ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కొద్దిసేపటి తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, డీఎంకే అధినేత స్టాలిన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రమాణస్వీకార వేదికపై సర్వమత ప్రార్థనలు జరిగాయి. నూతన ముఖ్యమంత్రికి మతపెద్దలు ఆశీర్వచనాలు ఇచ్చారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి : అవ్వతాతల పెన్షన్ పెంపుదలపై వైఎస్ జగన్ మొదటి సంతకం వైఎస్ జగన్‌కు టీటీడీ వేద పండితుల ఆశీర్వాదం వైఎస్ జగన్ సీఎం కావాలని పదేళ్లుగా.. -
ఇంటి నుంచి బయలుదేరిన వైఎస్ జగన్
-
‘చంద్రబాబుపై కసి తీర్చుకున్నారు’
సాక్షి, విజయవాడ: వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రేమాభిమానాలతో పాటు చంద్రబాబుపై మహా కసితో తమ పార్టీకి ప్రజలు పట్టం కట్టారని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఓట్ల రూపంలో చంద్రబాబుపై కసినంతా ప్రజలు తీర్చుకున్నారని వ్యాఖ్యానించారు. టీడీపీ రాక్షస పాలనకు చరమగీతం పాలన్న ఉద్దేశంతో తమకు అఖండ విజయం అందించారని అన్నారు. వైఎస్ జగన్ గొప్ప పరిపాలన ఇవ్వాలని ఆయన కోరుకున్నారు. వైఎస్సార్ కంటే జగన్ గొప్ప పరిపాలన అందిస్తారని అభిప్రాయపడ్డారు. మళ్లీ రాజన్న రాజ్యం రావాలని ప్రజలు కోరుకుని తమకు ఓటు వేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి అన్నారు. పదేళ్లుగా తమ నాయకుడు వైఎస్ జగన్ పడిన కష్టానికి ప్రతిపఫలం దక్కిందని ఆయన పేర్కొన్నారు. జగన్‌లో ప్రజలు గొప్పనాయకుడిని చూశారు కాబట్టి అఖండ విజయం కట్టబెట్టారని అన్నారు. -
రాష్ట్ర ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు
-
మొదటిసారి రాజకీయ కార్యక్రమానికి వచ్చాను
-
వైఎస్ జగన్‌కు వేద పండితుల ఆశీర్వాదం
-
జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి వర్మ
సాక్షి, విజయవాడ: తన జీవితంలో మొదటిసారి రాజకీయ కార్యక్రమానికి వచ్చానని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ అన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వంపై ఉన్న ఆగ్రహంతోనే వైఎస్సార్సీపీకి ప్రజలు కట్టం కట్టారని అన్నారు. వైఎస్ జగన్ చారిత్రాక విజయం సాధించారని ప్రశంసించారు. చంద్రబాబు పాలనపై ప్రజల్లో నెలకొన్న తీవ్ర అసంతృప్తి టీడీపీ ఓటమికి కారణమన్నారు. వైఎస్ జగన్ మాటల్లోని నిజాయితీ ప్రజలకు కనెక్ట్ అయిందన్నారు. ఆయనపై ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకుని అఖండ విజయంతో గెలిపించారని వివరించారు. వైఎస్ జగన్ మంచి పరిపాలన అందిస్తారన్న నమ్మకాన్ని రాంగోపాల్ వర్మ వ్యక్తం చేశారు. (చదవండి: అఖండ విజయం మిరాకిల్: అలీ) సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
వైఎస్ జగన్ సీఎం కావాలని పదేళ్లుగా..
సాక్షి, ఆదిలాబాద్‌రూరల్ : వైఎస్ రాజశేఖరరెడ్డికి అతను వీరాభిమాని..ఆయన తనయుడు జగన్మోహన్రెడ్డి సీఎం కావాలని ఆకాంక్షించాడు. అంతవరకు పాదరక్షలు ధరించనని ప్రతిన బూనాడు..ఆయనే ఆదిలాబాద్‌కు చెందిన బెజ్జంకి అనిల్‌కుమార్. నేడు ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకా రం చేస్తున్న వేళ ఆయన వ్రతం వీడుతున్నారు. వైఎస్ జగన్ సీఎం కావాలని.. అనిల్‌కుమార్ 1991లో రాజకీయాల్లో రంగప్రవేశం చేశాడు. ఎన్ఎస్యూఐ స్కూల్ ప్రెసిడెంట్‌గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. 1992లో ఆదిలాబాద్ పట్టణ కోశాధికారి వ్యవహరించారు. ఆ తర్వాత పట్టణ అధ్యక్షుడిగా, జిల్లా కన్వీనర్‌గా 1996 వరకు పనిచేశారు. 2006లో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో సంతకాల సేకరణ మహోద్యమంలో పాల్గొన్నాడు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి దివంగతులైనప్పుడు ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని ఆకాంక్షించాడు.. ఆమరణ దీక్షా చేపట్టాడు.. ఆదిలాబాద్ నుంచి బాసర పుణ్యక్షేత్రం వరకు సుమారు 160 కిలో మీటర్ల మేర పాదయాత్ర చేపట్టారు. అప్పుడే 2009 సెప్టెంబర్ 4న జగన్ సీఎం అయ్యేవరకు పాదరక్షలు ధరించనని ప్రతీన బూనారు. ప్రస్తుతం తెలంగాణలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. సుమారు పదేళ్ల తర్వాత ఆయన కల నేడు నెరవేరుతుంది. గురువారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తున్న వేళ ఆయన తన దీక్షను విరమించనున్నారు. విజయవాడలో ఆ మహాకార్యం జరిగే వేదిక సమక్షంలోనే పాదరక్షలు ధరించి పదేళ్ల తన కఠోర దీక్ష ముగించనున్నారు. ఆయన బిడ్డ ‘సాక్షి’.. తాను ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఘడియ రావడంతో ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వైఎస్ఆర్, వైఎస్ జగన్మోహన్రెడ్డి వీరాభిమాని అయిన బెజ్జంకి అనిల్‌కుమార్ ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయన వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం ఖాయమని, జగన్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ నెల 23న ఎన్నికల ఫలితాలు వెలుబడిన క్షణాన్ని ఆయన మరిచిపోలేకుండా ఉన్నారు. గతంలో వైఎస్సార్ జిల్లాకు వచ్చినప్పుడు ఆయన వెన్నంటే నిలిచారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావం తర్వాత గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు కూడా ఆ తల్లి వెన్నంటే నిలిచాడు. అనిల్‌కుమార్ వైఎస్సార్ కుటుంబానికి ఎంత వీరాభిమాని అంటే.. ఆయన తమ్ముడు బెజ్జంకి సంతోష్‌కుమార్‌కు ‘సాక్షి’ పత్రిక ఆవిర్భావం రోజు కూతురు పుట్టడంతో ఆమెకు ‘సాక్షి’ అనే పేరు పెట్టి తన అభిమానం చాటుకున్నాడు. తన ఆకాంక్ష నెరవేరినందున పాదరక్షలు విజయవాడలో ధరించనున్నట్లు అనిల్‌కుమార్ ‘సాక్షి’తో తెలిపారు. -
వైఎస్ జగన్‌కు టీటీడీ వేద పండితుల ఆశీర్వాదం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్ జగన్మోహన్రెడ్డికి టీటీడీ వేద పండితులు ఆశీర్వాదం అందజేశారు. గురువారం ఉదయం తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసానికి చేరుకున్న టీటీడీ ఈవో సింఘాల్, అర్చకులు వైఎస్ జగన్‌కు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అలాగే వైఎస్ జగన్ సర్వమత ప్రార్థనల్లో పాల్గొననున్నారు. మరికాసేపట్లో వైఎస్ జగన్ తన నివాసం నుంచి ప్రమాణ స్వీకారోత్సవం జరగనున్న విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి బయలుదేరనున్నారు. వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం కోసం రాష్ట్ర ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ కార్యక్రమానికి భారీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు తరలిరావడంతో విజయవాడలో పండగ వాతావరణం నెలకొంది. వైఎస్ జగన్‌కు స్వామి స్వరూపానందేంద్ర ఆశీస్సులు.. వైఎస్ జగన్ విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకున్నారు. ప్రమాణ స్వీకారానికి ముందు స్వామికి ఫోన్ చేసిన జగన్ ఆయన ఆశీస్సులు కోరారు. దీంతో ఆయన వైఎస్ జగన్‌కు ఆశీస్సులు అందజేశారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అఖండ విజయం మిరాకిల్: అలీ
సాక్షి, విజయవాడ: అపార నమ్మకంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలిపించారని సినీ నటుడు, వైఎస్సార్సీపీ నేత అలీ అన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు తమపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని కోరారు. వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించడం మామూలు విషయ కాదని, మిరాకిల్ అని వర్ణించారు. కొత్త ఇంటికి నవధాన్యాలు ఎంత ముఖ్యమో కొత్త రాజధాని అమరావతికి వైఎస్సార్సీపీ నవతర్నాల పథకాలు అంతముఖ్యమని అన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి అలీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రూపు తీసుకొస్తారని ఆకాంక్షించారు. నవతర్నాలతో మంచి పాలన అందిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ప్రమాణస్వీకారోత్సవానికి వాతావరణం కూడా అనుకూలించిందన్నారు. జగన్ పాలనలో వర్షాలు సకాలంలో కురుస్తాయని అన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడంతో రాష్ట్ర ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారని చెప్పారు. మైనార్టీలంతా వైఎస్ జగన్‌కు అండగా నిలబడ్డారని పేర్కొన్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
శివసేన నుంచి అరవింద్ సావంత్‌కు బెర్త్
సాక్షి, న్యూఢిల్లీ : దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ రెండోసారి గురువారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేస్తుండగా శివసేన నుంచి అరవింద్ సావంత్‌ను తన క్యాబినెట్లోకి తీసుకుంటారని ఆ పార్టీ ప్రతనిధి సంజయ్ రౌత్ వెల్లడించారు. ప్రధానితో పాటు 60 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా క్యాబినెట్లోకి అరవింద్ సావంత్‌ను తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి తమ పార్టీ చీఫ్ ఉద్ధవ్ థాకరే సూచించారని ఆయన తెలిపారు. ప్రధాని మోదీతో పాటు సావంత్ కేంద్ర మంత్రిగా ప్రమాణం చేస్తారని చెప్పారు. కాగా మోదీ ప్రమాణ స్వీకారం కార్యక్రమం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. పదివేల మందికి పైగా పోలీసులు బందోబస్తు విధుల్లో నిమగ్నమయ్యారు. దేశ విదేశాల నుంచి పెద్దసంఖ్యలో అతిధులు తరలివస్తున్నారు. బిమ్స్టెక్ నేతలతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల సీఎంలు, పార్టీల చీఫ్‌లు, వివధ రంగాల ప్రముఖులు అతిధుల జాబితాలో ఉన్నారు. -
కిక్కిరిసిన ఇందిరాగాంధీ స్టేడియం
-
ఘనంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. గవర్నర్ నరసింహన్ వైఎస్ జగన్ చేత ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు భారీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి తరలించారు. ప్రమాణ స్వీకారోత్సవాన్ని చూడటం కోసం విజయవాడ రాలేకపోయినవారు టీవీలో వీక్షించారు. వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో సభ ప్రాగంణం మొత్తం వైఎస్ జగన్ నినాదాలతో మారుమోగింది. వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారానికి తెలంగాణ సీఎం కేసీఆర్, డీఎంకే అధినేత స్టాలిన్, పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు హాజరయ్యారు. మరోవైపు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతు చేపట్టడాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు సంబరాలు చేసుకున్నారు. వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించిన అప్డేట్స్.. గన్నవరం ఎయిర్‌పోర్టుకు బయలుదేరిన కేసీఆర్, స్టాలిన్ తెలంగాణ సీఎం కేసీఆర్, డీఎంకే అధినేత స్టాలిన్ తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన కేసీఆర్, స్టాలిన్లు ఆ కార్యక్రమం పూర్తయిన తరువాత తాడేపల్లిలో వైఎస్ జగన్ నివాసానికి వెళ్లిన సంగతి తెలిసిందే. కేసీఆర్, స్టాలిన్లకు వైఎస్ జగన్ విందు.. తన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన కేసీఆర్, స్టాలిన్లకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అతిథి మర్యాదలు చేశారు. తన నివాసానికి వారిని ఆహ్వానించిన వైఎస్ జగన్.. వారికి విందు ఏర్పాటు చేశారు. వైఎస్ జగన్‌కు రాష్ట్రపతి అభినందనలు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అభినందనలు తెలిపారు. వైఎస్ జగన్ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ను ఉన్నత శిఖరాలకు చేర్చాలని ఆయన ఆకాక్షించారు. వైఎస్ జగన్ నివాసానికి కేసీఆర్, స్టాలిన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం ముగిసింది. అనంతరం వైఎస్ జగన్‌తో పాటు కేసీఆర్, స్టాలిన్లు తాడేపల్లిలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. అక్కడ వారికి పుష్పగుచ్ఛాలు అందజేసిన వైఎస్ జగన్ వారిని సాదారంగా ఇంటిలోనికి ఆహ్వానించారు. కేసీఆర్ వెంట తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్, తెలంగాణ మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌లు కూడా అక్కడికి వెళ్లారు. ఉద్వేగానికి లోనైన వైఎస్ విజయమ్మ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగించారు. ‘నన్ను దీవించిన రాష్ట్ర ప్రజలందరికీ పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆశీర్వదించిన దేవునికి, పైనున్న నాన్నగారికి, నా పక్కనే ఉన్న నా తల్లికి పాధాభివందనం చేస్తున్నాన’ని తెలిపారు. ఈ సందర్బంగా ప్రజలకు అభివాదం చేసిన వైఎస్ విజయమ్మ.. కాసింత ఉద్వేగానికి లోనయ్యారు. తన తనయున్ని అక్కున చేర్చుకున్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి అవ్వతాతల పెన్షన్ పెంపుదలపై వైఎస్ జగన్ మొదటి సంతకం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. అవ్వతాతల పెన్షన్ పెంపుదలపై తొలి సంతకం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్ పెన్షన్ కింద వృద్దుల పెన్షన్‌ను రూ. 2000 నుంచి రూ. 2250కి పెంచుతున్నట్టు ప్రకటించారు. ఇకపై వారి పెన్షన్‌ను ప్రతి ఏటా రూ. 250 పెంచుకుంటూ రూ. 3000 అందిస్తామని వెల్లడించారు. అదే విధంగా ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన తెలంగాణ సీఎం కేసీఆర్, తమిళనాడు నేత, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, ఇతర పెద్దలకు కృతఙ్ఞతలు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీ ఇచ్చినట్లుగా నవరత్నాల్లోని ప్రతీ అంశాన్ని కులమత వర్గాలకు అతీతంగా ప్రతీ ఒక్కరికి అందేలా చూస్తామని పేర్కొన్నారు. జగన్ చరిత్రలో నిలిచిపోవాలి: కేసీఆర్ ప్రమాణ స్వీకార వేదికపై నుంచి ప్రసంగించిన కేసీఆర్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నవ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తన పక్షాన, తెలంగాణ ప్రభుత్వం, ప్రజల తరఫున హృదయపూర్వక అభినందనలు, ఆశీస్సులు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటూ అద్భుతమైన ఫలితాలు రాబట్టాలని ఆయన ఆకాక్షించారు. వైఎస్ జగన్ ఆధ్వర్యంలో గోదావరి జలాల సంపూర్ణ వినియోగం వంద శాతం జరిగి తీరాలని కేసీఆర్ అన్నారు. కృష్ణా జలాలను సమస్యలను పరిష్కరించుకుని ప్రతి నీటిబొట్టును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జగన్ వయసు చిన్నది, బాధ్యత పెద్దదని వ్యాఖ్యానించారు. ఏపీ ప్రజలు ఇచ్చిన అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తండ్రి పేరు నిలబెట్టాలని వైఎస్ జగన్‌కు సూచించారు. చరిత్రలో నిలిచిపోయేవిధంగా పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. మూడు, నాలుగు టర్మ్‌ల వరకు వైఎస్ జగన్ పాలన కొనసాగాలని కేసీఆర్ కోరుకున్నారు. తండ్రి అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటున్నాను : స్టాలిన్ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకార వేదికపై ప్రసంగించిన స్టాలిన్ ఆయనకు అభినందనలు తెలిపారు. వైఎస్ జగన్ తన తండ్రి దివంగత మహానేత వైఎస్సార్ అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటున్నానని తెలిపారు. వేదికపై వైఎస్ జగన్‌కు మత పెద్దల అశీర్వచనాలు వైఎస్ జగన్ ప్రమాణ స్వీకార వేదికపై సర్వమత ప్రార్థనలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి మత పెద్దలు అశీర్వచనాలు ఇచ్చారు. వైఎస్ జగన్‌కు కేసీఆర్, స్టాలిన్ అభినందనలు ఆంధ్రప్రదేవ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి తెలంగాణ సీఎం కేసీఆర్, డీఎంకే అధినేత స్టాలిన్లు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా స్టాలిన్ వైఎస్ జగన్‌ను శాలువతో సత్కరించారు. వైఎస్ జగన్ కుటుంబసభ్యులకు గవర్నర్ శుభాకాంక్షలు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం గవర్నర్ అక్కడి విచ్చేసిన ఆయన కుటుంబసభ్యులను అప్యాయంగా పలకరించారు. వారికి శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా ప్రమాణ స్వీకారోత్సవానికి అథితులుగా వచ్చిన కేసీఆర్, స్టాలిన్లను కూడా గవర్నరు పలకరించారు. అనంతరం వైఎస్ జగన్ గవర్నర్‌కు వీడ్కోలు పలికారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేశారు. తొలుత జాతీయ గీతంతో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయాల్సిందిగా ఆహ్వానించారు. అనంతరం గవర్నర్ ఆయ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం గవర్నర్ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాభినందనలు తెలిపారు. ప్రమాణ స్వీకార ప్రాగంణానికి చేరుకున్న గవర్నర్ గవర్నర్ నరసింహన్ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకార సభా ప్రాగంణానికి చేరుకున్నారు. ప్రమాణ స్వీకార వేదికపైకి చేరుకున్న వైఎస్ జగన్ సభా ప్రాగంణానికి చేరుకున్న వైఎస్ జగన్ తొలుత ప్రత్యేక వాహనంలో స్టేడియంలో తిరుగుతూ ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం ఆయన వేదికపైకి చేరుకున్నారు. సభా ప్రాంగణానికి చేరుకున్న కేసీఆర్, స్టాలిన్ కొద్దిసేపటి క్రితం విజయవాడ చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రమాణ స్వీకార వేదిక వద్దకు చేరుకున్నారు. కేసీఆర్ వెంట తెలంగాణ మంత్రి మహమూద్ అలీ, ఎంపీ సంతోష్‌లు ఉన్నారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అంతకు ముందే ప్రాంగణానికి చేరుకున్నారు. డీఎంకే అధినేత స్టాలిన్ కూడా ప్రమాణ స్వీకార వేదిక వద్దకు చేరుకున్నారు. వేదికపై కేసీఆర్, స్టాలిన్లు ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. ఇంటి నుంచి బయలుదేరిన వైఎస్ జగన్ జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని తన నివాసం నుంచి విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియానికి బయలుదేరారు. తన కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక కాన్వాయ్‌లో వైఎస్ జగన్ ప్రమాణ స్వీకార ప్రాంగణానికి పయనమయ్యారు. వైఎస్ జగన్ వెంబడి వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, షర్మిల ఉన్నారు. మధ్యాహ్నం 12.23 గంటలకు గవర్నర్ నరసింహన్ వైఎస్ జగన్ చేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి వేదిక వద్దకు కటుంబసమేతంగా కేవీపీ.. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆప్త మిత్రుడు కేవీపీ రామచంద్రరావు తన కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం జరిగే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి చేరుకున్నారు. వేదిక వద్దకు బయలుదేరిన వైఎస్ కుటుంబ సభ్యులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు వైఎస్ కుటుంబ సభ్యులు, బంధువులు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి బయలుదేరారు. విజయవాడ చేరుకున్న పుదుచ్చేరి మంత్రి మల్లాడి వైఎస్ జగన్మోహన్రెడ్ది ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావడానికి పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు విజయవాడకు చేరుకున్నారు. ఆయనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున అధికారులు స్వాగతం పలికారు. ప్రముఖ చిత్రకారుడు బీఎస్వీ ప్రసాద్చే ప్రత్యేకంగా తయారు చేయించిన దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను ఆయన వైఎస్ జగన్‌కు అందజేయనున్నారు. ప్రమాణ స్వీకార మహోత్సవం అనంతరం మొదటగా కేసీఆర్, మల్లాడి, స్టాలిన్లు వైఎస్ జగన్‌ను సత్కరించనున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న స్టాలిన్.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారానికి హాజరు కావడం కోసం డీఎంకే అధినేత స్టాలిన్ గన్నవరం విమానశ్రయం చేరుకున్నారు. అక్కడ ఆయనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి స్వాగం పలికారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి ప్రమాణ స్వీకారోత్సవానికి వీలైనంత త్వరగా వెళ్లాలని అభిమానులు భావించడంతో ఉదయం నుంచే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం కిటకిటలాడుతోంది. స్టేడియం మొత్తం జగన్ నినాదాలతో మారుమోగుతుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా తమకు కేటాయించిన గ్యాలరీల్లోకి చేరుకుంటున్నారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, డీఎంకే అధినేత స్టాలిన్, పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావులతో పాటు పలు రాజకీయ పార్టీల ప్రముఖులు ఈ వేడుకకు హాజరుకానున్నారు. మరోవైపు తమ అభిమాన నాయకుడి ప్రమాణ స్వీకారోత్సవాన్ని చూడటానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విజయవాడ రాలేని వారు టీవీల్లో ఈ వేడుకను చూసేందుకు సిద్దమవుతున్నారు. ఉదయం నుంచే సామాన్య ప్రజలు ప్రమాణ స్వీకార వేదిక వద్దకు భారీగా చేరుకోవడంతో 8 గంటల వరకే గ్యాలరీలు నిండిపోయాయి. గ్యాలరీల్లో ఉన్నవారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. స్టేడియం బయట కూడా ప్రమాణ స్వీకారాన్ని చూసేందుకు ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. -
వైఎస్ జగన్ పట్టు వదలని విక్రమార్కుడు
ఈ మాట ఇప్పుడు చెబితే అతిశయోక్తి అనుకుంటారేమో. జగన్ పార్టీ పెట్టినప్పడే ఆంధ్రప్రదేశ్‌కి కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడని చెప్పా. తెలుగు రాష్ట్రాలు విడిపోతాయని నాకు తెలియదు కానీ తను(జగన్) కచ్చితంగా సీఎం అవుతాడని చెప్పా. జగన్ పట్టు వదలని విక్రమార్కుడు. తనలో ఓ కసి, కృషి, పట్టుదల చూశా. వీటన్నిటికీ మించి నేను సాధించగలను అనే నమ్మకం తనలో కనిపించేది. ‘‘నా ప్రయాణంలో ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని ప్రవాహాలు వచ్చినా నా దారి, ధ్యేయం ఒకటే. ఆంధ్రప్రదేశ్ బాగుండాలన్నదే నా పట్టుదల’’ అని అనుకున్నాడు జగన్. తన న్యాయమైన కోరికకు భగవంతుడు, ముఖ్యంగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశీస్సులు, తల్లి విజయమ్మ దీవెనలు అన్నిటికీ మించి ప్రజల ఆశీస్సులతోపాటు జగన్ టీమ్ కృషి ఫలితమే ఈ విజయం. శ్రీకాకుళం నుంచి వైజాగ్, చిత్తూరు వరకు నేను కూడా ప్రచారం చేశా. 130 సీట్లు సాధించి జగన్ ముఖ్యమంత్రి అవుతాడని అప్పుడే చెప్పా. అలాగే జగన్ 3,648 కిలోమీటర్లు నడిచాడంటే చిన్న విషయం కాదు. నా నట జీవితం 44 సంవత్సరాలు. అంతకుముందు, నాకు ఊహ తెలిశాక కూడా అన్ని కిలోమీటర్లు నడిచిన మానవుడు ఎవరూ లేరు. అన్ని కిలోమీటర్లు నడవడం మానవ సాధ్యమా? వాస్కోడిగామా సముద్ర మార్గంలో వచ్చి ఇండియాను కనుక్కున్నాడు. స్వాతంత్య్ర పోరాటం టైమ్‌లో వినోబా భావే ఇండియా మొత్తం తిరిగి ఐక్యం చేయాలనుకున్నాడు. ఇవన్నీ నిజాలే. చరిత్రలో చెరిగిపోని నిజాలు. నా దృష్టిలో జగన్ కూడా అంత గొప్ప వ్యక్తి. పాదయాత్రలో ప్రజల కష్ట సుఖాలను తెలుసుకున్నాడు జగన్. హీరోలకే హీరో : జయసుధ వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత జగన్మోహన్రెడ్డిని సీఎం చేయాలని కాంగ్రెస్ పార్టీలో ఉన్న 95 ›శాతం మంది ఆయనకు మద్దతు పలికారు. ఆ టైమ్‌లో జగన్‌కు, రాజకీయాలకు అసలు సంబంధమే లేదు. ఆయనో సక్సెస్ఫుల్ బిజినెస్‌మ్యాన్ అంతే. కానీ రాజశేఖరరెడ్డి గారి కోసం, ఆయన మీద అభిమానంతో ఓటేసిన ప్రజల కోసం ఆయన ముందుకు వచ్చారు. ఆ టైమ్‌లో ఆందరితోపాటు నేను కూడా ఆయనకు మద్దతు తెలిపా. ఎన్ని పెద్ద తలకాయలు ఎదురు నిలిచినా ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఓదార్పు యాత్ర మొదలు పెట్టాడు. ఎంత రాజకీయ కుటుంబంలో పుట్టినా ఇంతమందికి ఎదురు నిలబడి గెలుస్తాడా? నిలుస్తాడా? అని సహజంగానే సందేహాలు తలెత్తాయి. అలా అనుకున్నవాళ్లందరి నోర్లను జగన్ తన విల్ పవర్‌తో మూయించాడు. కొందరు తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిస్తే వెళ్లిపోతాడనుకున్నారు. కానీ ఎంత ఇబ్బందులపాలు చేస్తే అంత గట్టిగా తయారయ్యాడు జగన్. దేశ చరిత్రలో జగన్ పాదయాత్ర ఓ రికార్డుగా మిగిలిపోతుంది. రాబోయే రోజుల్లో యువతరానికి ఒక ఐకాన్‌లా నిలుస్తాడు. సినిమాల్లో మనం అనేక కథలు చూస్తుంటాం. ‘స్టాలిన్’, ‘భరత్ అనే నేను’ సినిమాలు చూశాం. ఇవన్నీ సినిమాలకే కాదు నిజంగా కూడా సాధ్యమే అని జగన్ తన గెలుపుతో నిరూపించాడు. హీరోలకే హీరో.. నిజమైన హీరో జగన్. ఏపీకి శుభారంభం : జయప్రద ఎన్నో రోజుల తర్వాత ప్రజలకి అద్భుతమైన సమయం వచ్చింది. శుభారంభం ఇది. దివంగత నేత మన వైఎస్ రాజశేఖర రెడ్డిగారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పేదవాళ్లను నేనున్నానంటూ అక్కున చేర్చుకుని వారి కన్నీళ్లు తుడిచేవారు. వైఎస్‌గారి దగ్గర నుంచి జగన్ రాజకీయంగా చిన్నప్పటి నుంచి ఎంతో నేర్చుకొని ఉంటారు. ఏపీని బాగా అభివృద్ధి చేయాలని, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఏపీని కేంద్ర బిందువుగా చేయాలనే తపన జగన్‌లో కనిపించేది. చంద్రబాబునాయుడి ధాటిని ఎదుర్కొంటూ ఒక సమర్థవంతమైన ప్రతిపక్ష నాయకునిగా నిలబడి ప్రజల కష్టాలు, కన్నీళ్లు తనవి అనుకుంటూ ప్రజల పక్షాన న్యాయం కోసం పోరాడినది ప్రజలు మరచిపోలేరు. ప్రజల మధ్యనే ఉంటూ 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. దాదాపు 10ఏళ్లుగా ప్రజల మధ్యలోనే ఉంటూ తన కుంటుంబాన్ని, తన వాళ్లకి దూరంగా ప్రజల మనిషిగా అయిపోయి ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ అన్ని వర్గాల ప్రజలను కలుసుకుని వారి నుంచి సమస్యలు తెలుసుకున్నారు. 2019 ఎన్నికల సమరంలో తన విజయ దుందుభి మోగించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుంటున్న ఈ సమయంలో జగన్‌బాబుకి నా అభినందనలు, శుభాకాంక్షలు. దేవుడికి బిడ్డ...ప్రజలకు అన్న... నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి వైఎస్ జగన్మోహన్రెడ్డి పొలిటికల్ ట్రావెల్ నార్మల్‌గా ఉండి ఉంటే నిదానంగా ఎప్పటికో ముఖ్యమంత్రి అయ్యేవారు. ఆయన్ను అణిచి అణిచి, తొక్కి తొక్కి పడేయాలనుకున్నారు చంద్రబాబునాయుడు. ‘జగన్ అనే వ్యక్తి మనిషే కాదు రౌడీ, గుండా, అవినీతిపరుడు’ అని ఇంటర్నేషనల్‌గా ప్రచారం చేసి, వ్యవస్థలను మ్యానేజ్ చేసి ఆయన్ను జైలుకు పంపించారు. జగన్ జైలు నుంచి బయటకు రాగానే కంగారుపడి మళ్లీ జైల్లో పెట్టించాలనే ప్రయత్నం చేశారు. అది మిస్‌ఫైర్ అయింది. లోపల జరిగేవన్నీ దేవుడు చూస్తూ ఉన్నాడు. కళ్ల ముందు కనిపించేవన్నీ ప్రజలు చూశారు. ఈ అన్యాయం చూడలేక జగన్‌ను దేవుడు తన బిడ్డగా చూసుకున్నాడు. ప్రజలందరూ అన్నగా భావించారు. కుల, మత, జాతి అనే బేధం లేకుండా జగన్‌కు ఓటు వేసేశారు. ఈ క్రెడిట్ అంతా జగన్‌ది, అతని వెనకున్న ప్రజలది. జనం ఎందుకు జగన్‌ని ప్రేమించారంటే.. అతని సిన్సియారిటీ, డెడికేషన్, నడత, నడక.. ఇలా ప్రతి కదలికలోనూ వాళ్లందరూ అతనిలో ఓ బిడ్డను చూసుకున్నారు. అయితే ఏదైనా డబ్బులతో కొనొచ్చు అని చంద్రబాబు అనుకున్నారు. కానీ, ప్రజలను ప్రేమతో చూసే జగన్‌కు ఓట్లు వేశారు. ఇప్పటి వరకూ జగన్ గొప్ప లీడర్. రేపటి నుంచి గొప్ప ప్రజా సేవకుడిలా ఉండిపోవాలని ఆశిస్తున్నాను. గాడ్ బ్లెస్ హిమ్. జై జగన్. జగన్‌ను చూసి మా జీవితాలను మార్చుకున్నాం ఈ విజయం మేం ఊహించిందే. మా నాయకుడు ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి దాదాపు 14 నెలల పాటు కుటుంబానికి దూరంగా ఎండనకా వాననకా ఎన్నో కష్టాలు పడ్డారు. ఆఖరికి పదునైన కత్తి రూపంలో ఆయన ప్రాణాన్ని తీసుకోవడానికి కూడా తెలుగుదేశం ప్రభుత్వం ప్రయత్నించింది. సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే మే నెలలో 175వ రోజు పాదయాత్రలో పాలకొల్లు దగ్గర వీరమాపురం మండలంలో నేను కూడా ఆయన వెంట నడిచా. రోహిణి కార్తెలో ఆయనతోపాటు సుమారు 6 కిలోమీటర్లు నడిచేసరికి నావల్ల కాలేదు. ఆ ఎండలో ఆయన నడుస్తుంటే మహిళలు, వృద్ధులు బారులు తీరారు. వారి కష్టసుఖాలు స్వయంగా తెలుసుకున్నారు. ఆ ఓపిక, మడమతిప్పని నైజం ప్రపంచంలో వైఎస్ రాజశేఖరరెడ్డిగారికి, వైఎస్ జగన్‌గారికి మాత్రమే ఉంది. ఇది అతిశయోక్తి కాదు. జగన్‌ను సీఎం చేయాలని సంవత్సరం క్రితమే ప్రజలు నిర్ణయించుకున్నారు. జగన్‌ను చూసి మా జీవితాలను కూడా చాలా మార్చుకున్నాం. - సినీ నటుడు పృథ్వీరాజ్ ఏదో చేయాలనే తపన జగన్‌లో కనిపిస్తోంది జగన్ తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగానే నిర్మొహమాటంగా, ముక్కుసూటిగా మాట్లాడటాన్ని చూస్తే సీఎంగా రాష్ట్ర ప్రజలకు ఏదో చేయాలనే తపన అతనిలో కనిపించింది. దాని వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుంది. అఖండ విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలకు జగన్ కమిట్మెంట్తో చేస్తారనే నమ్ముతున్నారు. తండ్రి మాదిరి మాట ఇస్తే వెనకడుగు వేయని మనస్తత్వం జగన్‌ది. గోల్ సాధించే వరకు అలుపెరగని పోరాట పటిమ, కమిట్మెంట్, రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర ద్వారా ఆయా వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపై అవగహన పెంచుకోవడం జగన్‌కు కలిసి వచ్చే అంశం. పారదర్శకతతో కూడిన అవినీతిరహిత పాలనను అందిస్తానని జగన్మోహన్రెడ్డి ఇటీవల ఢిల్లీలో చేసిన ప్రకటన చాలా సంతోషదాయకం. ‘ఇండియాటుడే’ వంటి మీడియా సంస్థలతో జగన్ మాట్లాడిన తీరు భవిష్యత్ పాలనపై అతని వైఖరికి అద్దంపడుతోంది. పోలవరం ప్రాజెక్టులో నిర్మాణవ్యయం పెంపు, ప్రాజెక్టు అథారిటీ అనుమతి తీసుకున్నారా?, కేబినెట్ ఆమోదం ఉందా? వంటి అంశాలపై క్షేత్రస్థాయి వాస్తవాలు తెలిసిన అధికారులతో జగన్ మాట్లాడాలి. పోలవరంలోకి జూలైలో వరద నీళ్లు చేరుతాయని అధికారులే చెబుతున్న పరిస్థితుల్లో జగన్ ముందు జాగ్రత్త చర్యలపై శ్రద్ధ తీసుకోవాలి. కేంద్రం నుంచి రాజ్యాంగబద్ధంగా మనకు రావలసిన అంశాలపై జగన్మోహన్రెడ్డి ఇప్పుడున్న పంథానే కంటిన్యూ చేసి రాష్ట్రానికి మంచి జరిగేటట్టు చూడాలి. మునుపెన్నడూ లేని రీతిలో జగన్మోహన్రెడ్డి రికార్డు స్థాయిలో ఓట్లు తెచ్చుకోవడం మామూలు విషయం కాదు. చిన్న తప్పు దొర్లినా, పెద్దదిగా చూపే ప్రయత్నాలు జరుగుతాయనే విషయాన్ని గుర్తెరిగి నిర్ణయాలు తీసుకుంటుండాలి. మద్యపానంతో వచ్చే దుష్పరిణామాలపై ప్రజల్లో అవగాహన కలిపించాలి. – ఉండవల్లి అరుణ్‌కుమార్, మాజీ ఎంపీ, రాజమండ్రి సుపరిపాలన ఫలాలు ప్రజలు అందుకుంటారు ‘నీతివంతమైన, పారదర్శక పాలనను జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ద్వారా ప్రజలు త్వరలోనే రుచి చూడనున్నారు. కొత్త యుగం, కొత్త శకం జగన్ మోహన్‌రెడ్డి నేతృత్వంలో ఆరంభం కానుంది. సుపరిపాలన ఫలాలను ప్రజలు అనుభవించే రోజులు వచ్చేశాయి. చిన్న చిన్న సమస్యల పరిష్కారం కోసం నెలలు, ఏళ్ల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే రోజులు ఇక ఉండబోవు. గ్రామ సచివాలయాల ఏర్పాటు ద్వారా గ్రామ స్వరాజ్యానికి బాటలు వేసే కసరత్తు తక్షణమే ఆరంభం కానుంది. ప్రజల బాగోగుల కోసం నిత్యం తపన పడే జగన్ ప్రభుత్వంలో అవినీతి రహిత పాలనను ప్రజలు ప్రత్యక్షంగా చూడనున్నారు. అవినీతి రహిత సుపరిపాలన ఎలా ఉంటుందో రాష్ట్ర ప్రజలకు త్వరలోనే అర్థమవుతుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ రైతులకు అన్యాయం జరిగింది. నేడు రైతు సంక్షేమ సర్కారు వచ్చింది. అన్నదాతల బాగోగులు లక్ష్యంగా పనిచేయనుంది. దారుణంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని క్రమంగా సరిదిద్ది, ప్రజలకు మంచి పాలన ఇచ్చే దిశగా అడుగులు వేయనున్నారు. సంక్షేమం, అభివృద్ధి, పారదర్శకత, నిజాయతీ అనే నాలుగు చక్రాల ధర్మ రథ పాలనను ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూడనున్నారు. – అజేయకల్లాం, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సామాజిక న్యాయానికి పెద్ద పీట వేయాలి వైఎస్ విజయం బడుగు, బలహీన వర్గాల విజయం. ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి, రాష్ట్రంలోని ఏ మూల ఏ సమస్య ఉందో క్షుణ్ణంగా అధ్యయనం చేసి జీర్ణించుకున్న వైఎస్ జగన్ మహానాయకుడనడంలో సందేహంలేదు. జగన్‌పై పలు సామాజికవర్గాలు ఎన్నో ఆశలు పెంచుకున్నాయి. వారి ఆకాంక్షల్ని నెరవేర్చేలా జగన్ అడుగులు వేయాలి. చంద్రబాబు పోతూపోతూ రాష్ట్ర ఖజానాను దివాళా స్థితికి తీసుకువెళ్లారు. అందువల్ల జగన్ కొత్త ఆర్థిక వనరులను సృష్టించుకోవాల్సి ఉంది. ప్రజాభిష్టాన్ని నేరవేర్చాలంటే ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం తప్పనిసరి. ప్రస్తుతం జగన్ ముందున్న పెద్ద సవాల్ ఇది. సమాజంలో మార్పు కోసం ముందు విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలి. విద్యా రంగంలోని వ్యాపారవేత్తలను తొలగించి విద్యా సంస్థలను జాతీయం చేయాలి. వ్యవసాయ రైతులకు జగన్ ఇచ్చిన హామీని నెరవేర్చాలని లక్షలాది మంది కోరుకుంటున్నారు. – హైకోర్టు మాజీ తాత్కాలిక న్యాయమూర్తి, అఖిల భారత బీసీ సమాఖ్య అధ్యక్షుడు జస్టిస్ ఈశ్వరయ్య ఆదర్శవంతమైన పాలన అందించాలి వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్‌కే కాకుండా దేశం మొత్తానికి ఆదర్శవంతమైన పాలన అందించాలని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి అన్నారు. ప్రజా సమస్యలపై జగన్ సుధీర్ఘంగా పోరాడారని అందుకే ప్రజల మన్ననలు పొంది ఎన్నికల్లో ఘన విజయం సాధించారని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఏపీ సీఎంగా వైఎస్ జగన్ దేశానికే దిక్సూచి లాంటి సమర్థవంతమైన పాలన అందిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. – జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి వైఎస్ జగన్‌ది ఇచ్చిన మాటకు నిలబడే తత్వం ఎన్ని కష్టాలు ఎదురైనా ఇచ్చిన మాటకు నిలబడే తత్వం వైఎస్ జగన్‌ది అని ఉమ్మడి ఏపీ మాజీ అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.రామచంద్రరావు అన్నారు. పాదయాత్ర ద్వారా జగన్ ప్రజల మనసులో నిలిచిపోయారని అందుకే ప్రజలు ఆయనకు పట్టం కట్టారని వ్యాఖ్యానించారు. నేరుగా ఏపీలోని రెండున్నర కోట్ల మందిని కలిసేలా చేసిన పాదయాత్ర చరిత్రలోనే ఎక్కడా లేదని చెప్పారు. ఇచ్చిన హామీల్ని అమలు చేసేందుకు చాలా బాగా కష్టపడాలని జగన్‌కు సూచించారు. ప్రభుత్వ హామీలతో ప్రజల నుంచి బాండ్లు స్వీకరించి హామీల్ని అమలు చేస్తే అత్యుత్తమ సీఎంగా జగన్ చరిత్రలో నిలిచిపోతారన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. – ఎస్.రామచంద్రరావు, ఉమ్మడి ఏపీ మాజీ ఏజీ యువతకు భరోసా ఇచ్చే పాలన అందించాలి యువతకు భరోసా ఇచ్చే పాలనను వైఎస్ జగన్ అందించాలని తెలంగాణ తొలి పూర్వపు ఏజీ కె.రామకృష్ణారెడ్డి అన్నారు. జగన్ అధికారంలోకి రావడానికి ప్రధానంగా 18–21 ఏండ్ల యువతే కీలకమని చెప్పారు. జగన్‌ను ఎలాగైనా అధికారంలోకి రానీయకూడదని అనేక పథకాల్ని అమలు చేసినా, ఎన్నో హామీలు ఇచ్చినా, మరెన్నో ఇబ్బందులకు గురిచేసినా ప్రజలు మాత్రం జగన్‌కే పట్టం కట్టారన్నారు. ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్ని జగన్ చక్కదిద్దుతారనే ఆశాభావాన్ని రామకృష్ణారెడ్డి వ్యక్తం చేశారు. – కె.రామకృష్ణారెడ్డి, తెలంగాణ తొలి పూర్వపు ఏజీ