
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రంలో వరుసగా రెండోసారి ఎన్డీయే సర్కార్ కొలువు తీరింది. ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. మోదీ ప్రమాణ స్వీకారం అనంతరం రాజ్‌నాథ్ సింగ్ ప్రమాణం చేశారు. మోదీతోపాటు కేబినెట్ మంత్రులతో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గురువారం ప్రమాణం చేయిస్తున్నారు. దేశ,విదేశాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరు అయ్యారు. రాష్ట్రపతి భవన్‌లో ఫోర్‌కోర్డ్‌లో మోదీ ప్రమాణస్వీకార వేడుకకు వేదికగా నిలిచింది. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, తదితరులు హాజరయ్యారు.
సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన మోదీ
Comments
Please login to add a commentAdd a comment