rastrapathi bhavan
-
రాష్ట్రపతితో ఫ్యూజన్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థుల భేటీ
ఫ్యూజన్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులకు అరుదైన అవకాశం లభించింది. నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన పోటీల్లో ఫ్యూజన్ స్కూల్ విద్యార్థులు అర్హత సాధించారు. బాలల దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో జరిగిన వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ సందర్భంగా ఆమె చూపిన ఆప్యాయతపై ఫ్యూజన్ విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. ఫ్యూజన్ స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీదేవి రావు మాట్లాడుతూ,రాష్ట్రపతిని కలవడం ఎంతో గర్వకారణం. ఇది జీవితకాల జ్ఞాపకం’అని అన్నారు.కాగా, బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం, ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు విద్యార్థులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసే అరుదైన అవకాశం కేంద్రం కల్పిస్తుంది. ఇందుకోసం విద్యార్థులు శారీరక, మానసిక, నాయకత్వ నైపుణ్యాల వంటి పరీక్షల్లో ప్రతిభను చాటాల్సి ఉంటుంది. -
రాష్ట్రపతి భవన్లో 51వ గవర్నర్ల సదస్సు
-
ఒలింపిక్స్‌కు వెళ్లిన భారత బృందానికి రాష్ట్రపతి తేనీటి విందు
ఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లిన భారత బృందానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్రపతి భవన్లో తేనేటి విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఒలింపిక్స్‌లో మీరు సాధించిన పతకాలతో 75వ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకుంటున్న దేశ గౌరవాన్ని మరింత పెంచారని రామ్‌నాథ్ కోవింద్ తెలిపారు. అనంతరం వారితో ఫోటో సెషన్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు. కాగా టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ అత్యధికంగా ఏడు పతకాలు సాధించగా.. ఇందులో ఒక స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్యాలు ఉన్నాయి. https://t.co/6W1xZNwvV6 — President of India (@rashtrapatibhvn) August 14, 2021 -
తొమ్మిదేళ్ల బాలిక నిరసన
-
ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన మోదీ
-
ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రంలో వరుసగా రెండోసారి ఎన్డీయే సర్కార్ కొలువు తీరింది. ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. మోదీ ప్రమాణ స్వీకారం అనంతరం రాజ్‌నాథ్ సింగ్ ప్రమాణం చేశారు. మోదీతోపాటు కేబినెట్ మంత్రులతో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గురువారం ప్రమాణం చేయిస్తున్నారు. దేశ,విదేశాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరు అయ్యారు. రాష్ట్రపతి భవన్లో ఫోర్కోర్డ్లో మోదీ ప్రమాణస్వీకార వేడుకకు వేదికగా నిలిచింది. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, తదితరులు హాజరయ్యారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన మోదీ -
మోదీ ప్రమాణానికి ‘బిమ్స్టెక్’ నేతలు
న్యూఢిల్లీ/చెన్నై: ప్రధాని మోదీ ప్రమాణస్వీకార వేడుకకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రపతిభవన్‌లో మే 30న జరిగే ఈ కార్యక్రమానికి బిమ్స్టెక్ దేశాల అధినేతలు హాజరుకానున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బిమ్స్టెక్లో భారత్‌తో పాటు బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయ్‌లాండ్‌లు సభ్యదేశాలుగా ఉన్నాయి. ఈ వేడుకకు పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ హాజరవుతారా? లేదా? అనే దానిపై స్పష్టత రాలేదు. షాంఘై సహకార సంస్థ(ఎస్సీవో) చైర్మన్, కిర్గిజిస్తాన్ అధ్యక్షుడు సూరొన్‌బే జిన్బెకోవ్, మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్నాథ్ కూడా మోదీ ప్రమాణస్వీకారానికి ఆహ్వానించినట్లు సమాచారం. వీరితో పాటు ప్రముఖ నటులు రజనీకాంత్, మక్కల్ నీది మయ్యం(ఎంఎన్ఎం) అధినేత కమల్‌హాసన్‌లకు ఈ కార్యక్రమానికి రావాలంటూ ఆహ్వానం పంపినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోవైపు మోదీ, ఆయన మంత్రివర్గ సహచరుల ప్రమాణస్వీకారం అనంతరం రాష్ట్రపతి కోవింద్ జూన్ 6న పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారని వెల్లడించాయి. అదేరోజు రాష్ట్రపతి ప్రొటెం స్పీకర్‌ను ఎంపిక చేస్తారనీ, ఆయన ఇతర ఎంపీలతో ప్రమాణస్వీకారం చేయిస్తారని పేర్కొన్నాయి. జూన్ 10న కొత్త స్పీకర్‌ను ఎన్నుకునేంతవరకూ ప్రొటెం స్పీకర్ ఈ బాధ్యతలు నిర్వర్తిస్తారు. ప్రొటెం స్పీకర్ కోసం బీజేపీ నేతలు సంతోష్‌కుమార్ గంగ్వార్, మేనకాగాంధీల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. 17వ లోక్‌సభ సమావేశాలు జూన్ 6 నుంచి 15 వరకూ సాగనున్నాయి. -
సిరివెన్నెలకు పద్మశ్రీ
సాక్షి, న్యూఢిల్లీ: అక్షరాన్ని అందలమెక్కించిన ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. తన పాటతో, తూటాలాంటి మాటతో తెలుగు సినీ రచనా రంగానికి కీర్తిప్రతిష్టలు తీసుకొచ్చిన సిరివెన్నెలకు 2019 ఏడాదికిగానూ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘పద్మ’ పురస్కారాల ప్రదానోత్సవం రెండో విడత కార్యక్రమం శనివారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ దర్బార్ హాల్లో çజరిగింది. రాష్ట్రపతి చేతుల మీదుగా సిరివెన్నెల సీతారామశాస్త్రి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. పద్మశ్రీ పురస్కారం స్వీకరించిన సిరివెన్నెలను ఢిల్లీ ఆంధ్ర అసోసియేషన్ శనివారం సాయంత్రం ఘనంగా సన్మానించింది. రాష్ట్రపతికి తిమ్మక్క ఆశీస్సులు అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ‘వృక్షమాతె’గా కర్ణాటకలో అందరూ పిలుచుకునే 107 ఏళ్ల సాలుమరద తిమ్మక్క రాష్ట్రపతి నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న అనంతరం రామ్‌నాథ్ కోవింద్ నుదుటిపై చేయుంచి ఆశ్వీదించారు. అలా చేయడం ప్రొటోకాల్‌కు వ్యతిరేకం అయినప్పటికీ రాష్ట్రపతి కూడా తల్లివంటి ఆమె నుంచి ఆశీస్సులను వినమ్రంగా స్వీకరించారు. దీంతో ప్రధాని మోదీ మొదలుకొని దర్బార్ హాల్లో ఉన్న సభికులు పెద్ద పెట్టున హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. అర్హుడిగా భావిస్తున్నా: రాష్ట్రపతి కోవింద్ అనంతరం ఈ ఘటనపై రాష్ట్రపతి ట్విట్టర్లో స్పందించారు. ‘పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో ఉత్తములైన, అర్హులైన వారిని గౌరవించడం రాష్ట్రపతికి దక్కే అరుదైన అవకాశం. కానీ, కర్ణాటకకు చెందిన పర్యావరణ ఉద్యమకారిణి, పద్మ అవార్డు గ్రహీతల్లో అత్యంత వయోవృద్ధురాలైన సాలుమరద తిమ్మక్క ఈ రోజు నన్ను ఆశీర్వదించడం నన్ను కదిలించివేసింది. ఆమె ఆశీర్వాదానికి నేను అర్హుడిని. సాధారణ భారతీయులకు ముఖ్యంగా ధైర్యం, పట్టుదల, నిరంతరం శ్రమించే గుణాలున్న భారతీయ మహిళలకు తిమ్మక్క ప్రతినిధి. అవార్డు గ్రహీతల స్ఫూర్తితో దేశం మరింత ఉన్నత శిఖరాలకు ఎదుగుతుంది’ అని కోవింద్ ట్వీట్‌చేశారు. దృఢసంకల్పానికి ప్రతీక కర్ణాటకలోని హుళికల్ గ్రామానికి చెందిన సాలుమరద తిమ్మక్క ధైర్యం, దృఢ సంకల్పానికి ప్రతీక. సంతానం కలగకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన తిమ్మక్క ఒక దశలో ఆత్మహత్యకు యత్నించారు. కానీ, భర్త బిక్కల చిక్కయ్య ఆమెకు ధైర్యం నూరిపోసి తోడుగా నిలిచారు. ఆపై ఇద్దరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. మొక్కలను నాటి వాటినే బిడ్డలుగా భావించి సాకాలనుకున్నారు. రోజంతా పొలం పనులు చేసి, సాయంత్రం మొక్కలు నాటేవారు. అలా వారు మొదటి ఏడాది తమ గ్రామ పరిసరాల్లో 10 మొక్కలు నాటారు. ఏడాదికేడాది సంఖ్య పెంచారు. నాటిన మొక్కలను నాలుగైదు కిలోమీటర్ల దూరం నుంచి నీటిని తీసుకువచ్చి మరీ బతికించారు. అలా వారు 65 ఏళ్లలో ఆ ప్రాంతంలో 400 మర్రి చెట్లు సహా 8000 చెట్లను పెంచారు. చిక్కయ్య 1991లో కన్నుమూశారు. -
ఏకకాల ఎన్నికలే ఉత్తమం
న్యూఢిల్లీ: లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణపై విస్తృత చర్చ జరగాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశ ఆర్థిక వృద్ధి రేటును రెండంకెలకు తీసుకెళ్లడం భారత్ ముందున్న ప్రధాన సవాలని, అందుకోసం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరముందని ఆయన పేర్కొన్నారు. ఆదివారం ప్రధాని మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్లో నీతిఆయోగ్ పాలక మండలి సమావేశం జరిగింది. ఈ భేటీకి 23 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఒక లెఫ్టినెంట్ గవర్నర్ హాజరయ్యారు. సమావేశంలో సీఎంలు వెలిబుచ్చిన అభిప్రాయాల్ని, సలహాల్ని విధాన నిర్ణయాల అమలులో పరిగణనలోకి తీసుకుంటామని ప్రధాని హామీనిచ్చారు. ముఖ్యమంత్రుల ప్రసంగం అనంతరం మోదీ ముగింపు ఉపన్యాసం చేస్తూ.. ‘లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణపై విస్తృత స్థాయిలో చర్చలు, సంప్రదింపులు జరపాలి. దీనివల్ల ఖర్చును ఆదా చేయవచ్చు. అదే సమయంలో వనరుల్ని సమర్థంగా వినియోగించుకునే అవకాశం ఏర్పడుతుంది’ అని పేర్కొన్నారు. ఇప్పటికే అనేక సందర్భాల్లో ఏకకాలంలో ఎన్నికల అంశాన్ని ప్రస్తావించిన ప్రధాని మోదీ.. నీతి ఆయోగ్ భేటీలో పునరుద్ఘాటించారు. విధానాల రూపకల్పనలో సీఎంల పాత్ర కీలకమని ఆయన ప్రశంసించారు. ఫలితం ఆధారంగా కేటాయింపులు జరిగేలా, ఖర్చుల్లో సవరణల కోసం 15వ ఆర్థిక సంఘానికి సలహాలు ఇవ్వాలని ముఖ్యమంత్రుల్ని కోరారు. ‘భారత్‌లో సామర్థ్యం, వనరుల కొరత లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో.. కేంద్రం నుంచి రాష్ట్రాలు రూ. 11 లక్షల కోట్లు అందుకుంటాయి. గత ప్రభుత్వం చివరి సంవత్సరంలో ఇచ్చిన దానికంటే రూ. 6 లక్షల కోట్లు ఎక్కువ ఇస్తున్నాం’ అని మోదీ చెప్పారు. వరద పరిస్థితిని సమర్థంగా ఎదుర్కొనేందుకు రాష్ట్రాలకు కేంద్రం నుంచి అన్ని రకాల సాయాన్ని అందచేస్తామని భరోసా నిచ్చారు. అభివృద్ధి కోసం నీతి ఆయోగ్ మంచి వేదిక 2017–18 నాలుగో త్రైమాసికంలో భారత ఆర్థిక వృద్ధి రేటు 7.7 శాతంగా ఉందని, ఈ వృద్ధి రేటును రెండంకెల స్థాయికి తీసుకెళ్లడం మన ముందున్న సవాలని, అందుకోసం అనేక చర్యల్ని చేపట్టాల్సి ఉందని ప్రధాని పేర్కొన్నారు. త్వరలోనే భారత్ 5 ట్రిలియన్ డాలర్ల(రూ. 3.4 కోట్ల కోట్లు) ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించాలని ప్రపంచం ఆశిస్తుందని చెప్పారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం, వెనకబడ్డ జిల్లాల (ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్) అభివృద్ధి, ఆయుష్మాన్ భారత్, మిషన్ ఇంద్రధనుష్, పౌష్టికాహార మిషన్, మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలు తదితర అంశాల్ని మోదీ ప్రస్తావించారు. ‘2020 నాటికి నవభారత లక్ష్యాన్ని చేరుకునేందుకు తగిన చర్యలు తప్పనిసరి’ అని ఆయన పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో చారిత్రక మార్పులు తీసుకువచ్చేందుకు నీతి ఆయోగ్ పాలక మండలి మంచి వేదిక అని కితాబునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలును ప్రస్తావించిన ప్రధాని స్వచ్ఛ్ భారత్ మిషన్, డిజిటల్ లావాదేవీలు, నైపుణ్యాభివృద్ధి తదితర అంశాలపై విధానాల రూపకల్పనలో సబ్ గ్రూపులు, కమిటీల ద్వారా ముఖ్యమంత్రులు కీలక పాత్ర పోషించారని మోదీ గుర్తుచేశారు. ఈ సబ్ గ్రూపులు చేసిన సిఫార్సుల్ని కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖలు పరిగణనలోకి తీసుకున్నాయని ఆయన చెప్పారు. ‘ఆయుష్మాన్ భారత్’ కింద దేశంలో 1.5 లక్షల వైద్య, సంరక్షణ కేంద్రాల్ని నిర్మిస్తున్నాం. ఈ పథకంలో 10 కోట్ల కుటుంబాలకు ఏడాదికి రూ. 5 లక్షల వరకూ ఆరోగ్య బీమాను అందిస్తాం. విద్య కోసం ‘సమగ్ర శిక్షా అభియాన్’ కింద సమగ్ర విధానాన్ని అమలుచేస్తున్నాం. ముద్రా యోజన, జన్‌ధన్ యోజన, స్టాండప్ ఇండియాలు ప్రజల ఆర్థిక అవసరాలకు చేయూతగా ఉంటున్నాయి’ అని ప్రధాని చెప్పారు. దేశంలో అభివృద్ధిని ఆకాంక్షిస్తున్న(ఆస్పిరేషనల్) 115 జిల్లాల్లో అన్ని విధాల అభివృద్ధి సాధించాల్సిన అవసరముందని అన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయడం, పెట్టుబడిని తగ్గించి పంటల దిగుబడిని పెంచే విధంగా సూచనలు చేయాలని బిహార్, ఆంధ్రప్రదేశ్, యూపీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌తో పాటు పలు రాష్ట్రాల సీఎంలకు ప్రధాని సూచించారు. రాష్ట్రాలతో సంప్రదింపులు జరపాలని నీతి ఆయోగ్‌కు సూచన సమావేశంలో వ్యక్తమైన సలహాల్ని విధానపర నిర్ణయాలు తీసుకునేటప్పుడు పరిగణనలోకి తీసుకుంటామని మోదీ హామీనిచ్చారు. అమలు చేయదగ్గ సలహాలు, సూచలనపై రాష్ట్రాలతో సంప్రదింపులు జరపాలని నీతి ఆయోగ్‌కు ఆయన సూచించారు. సమావేశంలో కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఒడిశా, జమ్మూ కశ్మీర్, ఢిల్లీ తదితర రాష్ట్రాల సీఎంలు గైర్హాజరయ్యారు. సమావేశం అనంతరం నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ.. బిహార్, ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఇచ్చిన అన్ని హామీల్ని తూచా తప్పకుండా అమలు చేస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారన్నారు. గత నాలుగేళ్లలో కేంద్ర ప్రభుత్వం 7.7 కోట్ల మరుగుదొడ్లను నిర్మించిందని, మహాత్మా గాంధీ 150 వ జయంతి వేడుకల నాటికి దేశంలో 100 శాతం పారిశుధ్యం సాధించాలని ఆకాంక్షించారన్నారు. ఢిల్లీ సంక్షోభాన్ని పరిష్కరించండి ప్రధానికి నలుగురు సీఎంల విజ్ఞప్తి ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్, ఆమ్ ఆద్మీ ప్రభుత్వం మధ్య కొనసాగుతున్న గొడవలో జోక్యం చేసుకోవాలని పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ ముఖ్యమంత్రులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. నీతి ఆయోగ్ పరిపాలక మండలి సమావేశం వేదికగా.. మమతా బెనర్జీ, చంద్రబాబు, కుమారస్వామి, పినరయి విజయన్లు ఢిల్లీ సంక్షోభాన్ని పరిష్కరించాలని కోరారు. ‘నాతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ సీఎంలు ఢిల్లీ ప్రభుత్వ సమస్యల్ని తక్షణం పరిష్కరించాలని ప్రధానిని కోరాం. అయితే ప్రధాని మోదీ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఆ విషయాన్ని పరిశీలిస్తానని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు’ అని సమావేశం అనంతరం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. శనివారం ఈ నలుగురు సీఎంలు అరవింద్ కేజ్రీవాల్‌కు మద్దతు తెలపడంతో పాటు.. లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో ఆందోళన చేస్తున్న కేజ్రీవాల్‌ను కలుసుకునేందుకు ప్రయత్నించారు. ఢిల్లీలో కొనసాగుతున్న సంక్షోభాన్ని ప్రధాని మోదీ వద్ద ప్రస్తావిస్తామని విలేకరుల సమావేశంలో వారు వెల్లడించారు. నెలరోజుల్లో ‘నవభారత’ పత్రం న్యూఢిల్లీ: ‘నవభారతం 2022’ నిర్మాణానికి సంబంధించిన అభివృద్ధి ఎజెండా పత్రాన్ని నెలరోజుల్లో సిద్ధం చేయనున్నట్లు నీతి ఆయోగ్ తెలిపింది. ఈ పత్రానికి తుదిరూపునిచ్చాక.. అభిప్రాయాలు, స్పందనల కోసం రాష్ట్రాలకు పంపిస్తామని సమావేశంలో వెల్లడించింది. గత సమావేశంలో పేర్కొన్నదాని ప్రకారం ఈ భేటీలో ఈ పత్రాన్ని రాష్ట్రాలకు అభిప్రాయాల కోసం ఇవ్వాల్సి ఉండగా.. కొన్ని కారణాలతో నెలరోజులు ఆలస్యం కానుందని నీతి ఆయోగ్ అధికారులు తెలిపారు. ‘నవభారతం 2022 అభివృద్ధి ఎజెండా రూపకల్పన చివరి దశలో ఉంది. అందువల్లే నేటి సమావేశంలో దీన్ని ఇవ్వలేకపోతున్నాం. క్షేత్రస్థాయిలో జరగాల్సిన మార్పులను ఈ ప్రతిపాదన ప్రతిబింబించాలని కోరుకుంటున్నాం. ఇది దాదాపుగా సిద్ధమైనట్లే. త్వరలోనే అభిప్రాయాల కోసం ఈ డాక్యుమెంటును రాష్ట్రాలకు పంపిస్తాం. ఆ తర్వాత విస్తృతమైన చర్చలు జరుగుతాయి. నెల, నెలన్నరలో ఇది అంతా పూర్తవుతుంది’ అని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ పేర్కొన్నారు. మూడేళ్లు, ఏడేళ్లు, 15 ఏళ్ల లక్ష్యాలను ఏర్పర్చుకుని వీటిని చేరుకునేందుకు దార్శనిక పత్రాల (విజన్ డాక్యుమెంట్) రూపకల్పన ప్రణాళికలను నీతి ఆయోగ్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. 2022 నాటికి (దేశ స్వాతంత్య్రానికి 75 ఏళ్లు) దేశం ఆరు ప్రధాన సమస్యల (పేదరికం, చెత్త, అవినీతి, ఉగ్రవాదం, కులతత్వం, మతతత్వం) నుంచి విముక్తమయ్యేలా పనిచేయాలని గతేడాది ప్రజెంటేషన్‌లో నీతి ఆయోగ్ పేర్కొంది. మీడియాతో నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్‌కాంత్, ఉపాధ్యక్షుడు రాజీవ్‌కుమార్ -
ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రన్ కు ఘన స్వాగతం
-
మాక్రన్‌కు రాష్ట్రపతి భవన్లో ఘన స్వాగతం
సాక్షి, న్యూఢిల్లీ: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మాక్రన్‌కు రాష్ట్రపతి భవన్లో ఘనస్వాగతం లభించింది. నాలుగు రోజుల భారత్ పర్యటనకు వచ్చిన ఆయన శనివారం ఉదయం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కు చేరుకున్నారు. అక్కడ ఆయనకు గౌరవవందనాలతో ఘనస్వాగతం పలికారు. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ఆయన సతీమణి సవితా కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ మాక్రన్ దంపతులకు ఆత్మీయస్వాగతం పలికారు. కాగా ఇవాళ ప్రధాని మోదీ, మాక్రన్ మధ్య ప్రతినిధుల స్థాయి చర్చలు జరగనున్నాయి. మాక్రన్ వెంట ఆయన భార్య బ్రిగిటె మేరీ, మంత్రులు వచ్చారు. -
పాలమూరు ప్రతిభ
► జాతీయసైన్స్ ప్రదర్శనకు ఎన్మన్గండ్ల విద్యార్థి లక్ష్మి ► మార్చి 3న రాష్ట్రపతి భవన్లో ప్రదర్శనకు పిలుపు ► మూగ, చెవిటి వినికిడి యంత్రం ఆవిష్కరణ ► పరికరంపై పేటెంట్ హక్కుకోసం దరఖాస్తు ► ఢిల్లీకి వెళ్లేందుకు సాయం కోసం ఎదురుచూపు మహబూబ్‌నగర్ విద్యావిభాగం: పట్టుదల ఉంటే పేదరికం అడ్డురాదని నిరూపించింది మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం ఎన్మన్‌గండ్లకు చెందిన పేద విద్యార్థిని లక్ష్మి.. చెవి, మూగ వినికిడి యంత్రాన్ని ఆవిష్కరించి అందరిచేత భళా! అనిపించుకుంది. మార్చిలో ఢిల్లీని రాష్ట్రపతి భవన్లో జరిగే సైన్స్ ఇన్స్పైర్ ప్రదర్శనకు హాజరుకావాలని రాష్ట్రపతి కార్యాలయం నుంచి పిలుపు అందుకుంది. రంగారెడ్డి జిల్లా మహ్మదాబాద్‌కు చెందిన లక్ష్మయ్య, బాలమణి దంపతులకు ఇద్దరు కూతుళ్లు కాగా, లక్ష్మి మొదటి సంతానం. తండ్రి లక్ష్మయ్య చనిపోవడంతో ఆమె తల్లి కూలీనాలి పనులు చేస్తూ తన ఇద్దరు కుమార్తెలను చదివిస్తోంది. లక్ష్మి నవాబ్‌పేట మండలం ఎన్మన్గండ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. యంత్రపరికరాల తయారీలో ఆమెకు ఉన్న ఆసక్తిని గమనించిన ఉపాధ్యాయులు ప్రోత్సహిస్తున్నారు. గత సంవత్సరం ఎన్మన్గండ్ల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతుండగా నాగర్‌కర్నూల్‌లో జరిగిన సైన్స్ ప్రదర్శనలో లక్ష్మి తయారుచేసిన వినికిడి యంత్రాన్ని ప్రదర్శించింది. ఈ పరికరమే నవంబర్‌లో రాష్ట్రస్థాయికి ఎంపికకాగా, లక్ష్మి తయారుచేసిన యంత్రానికి రెండవస్థానం దక్కింది. ఈ క్రమంలో గత డిసెంబర్ 10, 11వ తేదీల్లో ఢిల్లీలో నిర్వహించిన జాతీయస్థాయి వై/ê్ఞనిక ప్రదర్శనలో విద్యార్థిని లక్ష్మి అత్యంత సృజనాత్మకతతో వ్యవహరించింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 650ప్రయోగాలు పోటీపడగా అందులో ఆమె తయారుచేసిన మూగ, చెవిటి వినికిడి యంత్రం ఉత్తమప్రదర్శనగా ఎంపికైంది. ఉత్తమ ప్రతిభచాటినందుకు కేంద్ర శాస్త్ర సాంకేతికశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ చేతులమీదుగా అవార్డును అందుకుంది. ఈ క్రమంలో మార్చి 3న రాష్ట్రపతి భవన్లో నిర్వహించే వైజ్ఞానిక ప్రదర్శనకు రావాల్సిందిగా రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఆదివారం పిలుపు అందింది. మేలో లక్ష్మిని జపాన్ తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. -
ఆ భవనానికీ స్మార్ట్ టౌన్ హోదా!
న్యూఢిల్లీ: టర్కీ తర్వాత ఒక దేశ ప్రథమ పౌరుడు నివసించే అతి పెద్ద నివాసంగా పేరొందిన రాష్ట్రపతి భవన్ త్వరలో స్మార్ట్ టౌన్‌షిప్‌గా మారనుంది. ఇందుకోసం కేంద్రప్రభుత్వం ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్ (ఐబీఎమ్)తో ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గురువారం ఈ మేరకు భవన్లో చేపట్టబోయే ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ సెంటర్ (ఐఓసీ), 'మానిటర్' పేరుతో తయారుచేసిన ఆండ్రాయిడ్ అప్లికేషన్లను ప్రారంభించారు. ఈ అప్లికేషన్‌ను ఉపయోగించి నీటి నిర్వహణ, విద్యుత్, చెత్త డిస్పోజింగ్, తోటల నిర్వహణలను పర్యవేక్షించనున్నారు. దేశంలోని మిగతా ప్రాంతాల్లో స్మార్ట్ పట్టణాలను ఎలా నిర్మిస్తారో రాష్ట్రపతి భవన్లో కూడా అదే మోడల్‌ను అనుసరిస్తారు. ఏదైనా రాష్ట్రంలోని ఐదు గ్రామాలను ఎంపిక చేసి వాటిని పూర్తిగా అభివృద్ధి చేసి ఆ మోడల్ ను రాష్ట్రపతి భవన్ కు అన్వయిస్తారు. నిపుణుల బృందాలు, రాష్ట్రాల పరిపాలన భవనాలు, జిల్లా పరిపాలనా కేంద్రాలతో దీన్ని అనుసంధానిస్తారు. -
యోగాడేలో రాష్ట్రపతి ప్రణబ్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట్రపతి భవన్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు యోగాతో శాంతి, సుఖాలతో ఉండాలని ప్రణబ్ కోరారు. సమస్యలు లేని జీవనానికి యోగా సాధనమని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు.