ఫ్యూజన్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులకు అరుదైన అవకాశం లభించింది. నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన పోటీల్లో ఫ్యూజన్ స్కూల్ విద్యార్థులు అర్హత సాధించారు. బాలల దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్‌లో జరిగిన వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ సందర్భంగా ఆమె చూపిన ఆప్యాయతపై ఫ్యూజన్ విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. ఫ్యూజన్ స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీదేవి రావు మాట్లాడుతూ,రాష్ట్రపతిని కలవడం ఎంతో గర్వకారణం. ఇది జీవితకాల జ్ఞాపకం’అని అన్నారు.
కాగా, బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం, ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు విద్యార్థులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసే అరుదైన అవకాశం కేంద్రం కల్పిస్తుంది. ఇందుకోసం విద్యార్థులు శారీరక, మానసిక, నాయకత్వ నైపుణ్యాల వంటి పరీక్షల్లో ప్రతిభను చాటాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment