ఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లిన భారత బృందానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్రపతి భవన్‌లో తేనేటి విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఒలింపిక్స్‌లో మీరు సాధించిన పతకాలతో 75వ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకుంటున్న దేశ గౌరవాన్ని మరింత పెంచారని రామ్‌నాథ్ కోవింద్ తెలిపారు.
అనంతరం వారితో ఫోటో సెషన్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు. కాగా టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ అత్యధికంగా ఏడు పతకాలు సాధించగా.. ఇందులో ఒక స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్యాలు ఉన్నాయి.
— President of India (@rashtrapatibhvn) August 14, 2021
Comments
Please login to add a commentAdd a comment