ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మాక్రన్‌కు రాష్ట్రపతి భవన్‌లో ఘనస్వాగతం లభించింది. నాలుగు రోజుల భారత్ పర్యటనకు వచ్చిన ఆయన శనివారం ఉదయం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కు చేరుకున్నారు. అక్కడ ఆయనకు గౌరవవందనాలతో ఘనస్వాగతం పలికారు. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ఆయన సతీమణి సవితా కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ మాక్రన్ దంపతులకు ఆత్మీయస్వాగతం పలికారు. కాగా ఇవాళ ప్రధాని మోదీ, మాక్రన్ మధ్య ప్రతినిధుల స్థాయి చర్చలు జరగనున్నాయి. మాక్రన్ వెంట ఆయన భార‍్య బ్రిగిటె మేరీ, మంత్రులు వచ్చారు.
Published Sat, Mar 10 2018 9:54 AM | Last Updated on Fri, Mar 22 2024 10:48 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement