Ramnath kovindh
-
జమిలి ఎన్నికలపై లా కమిషన్ నివేదిక
ఢిల్లీ: జమిలి ఎన్నికలపై నియమించిన ఉన్నతస్థాయి కమిటీ నేడు సమావేశం కానుంది. కమిటీ అధ్యక్షుడు, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కొవింద్‌కు లా కమిషన్ తన సూచనలను అందించనుంది. ఒకే దేశం ఒకే ఎన్నికపై సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి కావాల్సిన సలహాలు, సూచనలను అందించాలని ఉన్నతస్థాయి కమిటీ గత వారం నిర్వహించిన భేటీలో కోరింది. ఈ నేపథ్యంలో లా కమిషన్‌తో పాటు మిగిలిన సభ్యులు నేడు తమ సూచనలను కమిటీకి అందించనున్నారు. అందరి సూచనలను తీసుకున్న తర్వాత ఉన్నతస్థాయి కమిటీ మరోసారి చివరిగా భేటీ నిర్వహించనుంది. సెప్టెంబర్ 2న ఎనిమిది మందితో కూడిన ఉన్నస్థాయి కమిటీని జమిలి ఎన్నికల పరిశీలనకు కేంద్రం నియమించింది. ఈ కమిటీ ఇప్పటికే రెండు పర్యాయాలు సమావేశమైంది. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలు, మున్సిపాలిటీలు, పంచాయతీలు అన్నింటికి ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి కేంద్రం ప్రయత్నాలు మొదలుపెట్టింది. మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగానే బీజేపీ జమిలీ ఎన్నికలకు ప్రణాళికలు సిద్ధం చేసింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లోనే జమిలి విధానం తీసుకువస్తున్నారనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో ఊపందుకున్నాయి. ఇదీ చదవండి: మన దౌత్యం...కొత్త శిఖరాలకు -
మరణాంతరం ‘గాన గంధర్వుడి’కి పద్మ విభూషణ్, అవార్డు తీసుకున్న ఎస్పీ చరణ్
దివంగత గాయకుడు, గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు మరణాంతరం పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది పద్మ అవార్డుల ప్రదానోత్సవం రాష్టపతి భవన్లో ఘనంగా జరిగింది. సినీ పరిశ్రమకు అందించిన సేవలకు గాను బాలుకు ఈ అవార్డు దక్కగా.. ఆయన తనయుడు ఎస్పీ చరణ్ అవార్డు అందుకున్నారు. చదవండి: Padma Awards 2021: పద్మ అవార్డుల ప్రదానోత్సవం కాగా 2020లో మొత్తంలో 119మందిని పద్మాలు వరించాయి. 119 మందిలో 29 మంది మహిళలు ఉండగా... 16 మందికి చనిపోయిన అనంతరం అవార్డును ప్రకటించారు. స్టార్ షట్లర్ పీవీ సింధుకు పద్మ భూషణ్, బాలీవుడ్ నటికి కంగనా రనౌత్‌కు పద్మశ్రీ, నిర్మాత ఏక్తా కపూర్, సింగర్ అద్నాన్ సమీకి పద్మశ్రీ, నిర్మాత కరణ్ జోహార్‌కు పద్మ శ్రీ అవార్డును రాష్ట్రపతి ప్రదానం చేశారు. మరణానంతరం గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంతో పాటు అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్‌కు అవార్డులను ప్రకటించారు. Delhi: Playback singer SP Balasubrahmanyam awarded the Padma Vibhushan award posthumously. His son receives the award. #PadmaAwards2021 pic.twitter.com/HlSQGYmpxv — ANI (@ANI) November 9, 2021 -
కార్గిల్ విజయ్ దివాస్: సైనికుల త్యాగాలను దేశం ఎప్పటికీ మరువదు
న్యూఢిల్లీ: కార్గిల్ విజయ్ దివాస్‌ను పురస్కరించుకుని, దేశం కోసం అమరులైన సైనికులకు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీలు ఘన నివాళులు అర్పించారు. వీరి త్యాగాలు మరువలేనివని, దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టిన అమర వీరుల్ని భారతజాతి ఎప్పటికీ గుర్తించుకుంటుందని రామ్‌నాథ్, మోదీలు కొనియాడారు. కాగా, కార్గిల్ విజయ్ దివాస్ 21 వార్షికోత్సవ వేడుకలను సోమవారం ద్రాస్‌లో నిర్వహించారు. దీనికి మొదట దేశ ప్రథమ పౌరుడు రామ్‌నాథ్ కోవింద్ ద్రాస్ సెక్టార్‌కు వెళ్లాల్సి ఉండగా, పర్యటన చివరి నిముషంలో రద్దయింది. వాతావరణం పరిస్థితుల కారణంగా పర్యటన రద్దయినట్లు ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. అదేవిధంగా, భారత ప్రధాని నరేంద్రమోదీ నిన్న(ఆదివారం) జరిగిన మన్‌కీ బాత్ కార్యక్రమంలో దేశం కోసం అసువులు బాసిన సైనికులను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా, అమరుల త్యాగాలను ఈ దేశం ఎప్పటికీ మరువదని ట్విట్టర్ వేదికగా సైనికుల ధైర్యసాహసాలను కొనియాడారు. అదే విధంగా, భారత్ హోంమంత్రి అమిత్‌షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ బిపిన్ రావత్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. అమరులైన సైనికులకు తమ ఘనమైన నివాళులు అర్పించారు. వారు చేసిన ధైర్యసాహాసాలను గుర్తుచేసుకున్నారు. అదే విధంగా, ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక స్థూపంవద్ద రక్షణ శాఖ సహయ మంత్రి అజయ్ భట్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బదౌరియా, నేవీ వైస్‌చీఫ్ అడ్మిరల్ జి.అశోక్ కుమార్ నివాళులు అర్పించారు. కార్గిల్ యుధ్దం రక్షణ దళాల శౌర్యం, క్రమశిక్షణకు చిహ్నం అని అన్నారు. కాగా, వారి ధైర్యం, త్యాగానికి సెల్యూట్ తెలిపారు. కాగా, జూలై 26, 1999లో దాయాది పాకిస్తాన్ మన దేశాన్ని ఆక్రమించాలని.. ఎల్ఓసీ వద్ద భారత్ భూభాగంలో ప్రవేశించాయి. ఈ క్రమంలో భారత సైనికులకు, పాక్ ముష్కరులకు మధ్య భీకర యుద్ధం జరిగింది. అయితే, ఈ యుద్ధంలో భారత భద్రతా దళాలు, పాకిస్తాన్ ముష్కరులను సమర్థవంతంగా ఎదుర్కొని మట్టికరిపించిన సంగతి తెలిసిందే.ఈ యుద్ధంలో భారత సైనికులు చాలా మంది మృతి చెందారు. ఈ క్రమంలో.. దేశం కోసం తమ ప్రాణాలు అర్పించిన సైనికులను గుర్తుచేసుకుంటూ ప్రతి ఏడాది జూలై 26న కార్గిల్ విజయ్ దివాస్‌ను ఆపరేషన్ విజయ్‌గా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. In a message at the Dagger War Memorial at Baramulla, President Kovind paid tributes to the soldiers who laid down their lives defending the nation with indomitable courage and valour. pic.twitter.com/YweORqkf7W — President of India (@rashtrapatibhvn) July 26, 2021 We remember their sacrifices. We remember their valour. Today, on Kargil Vijay Diwas we pay homage to all those who lost their lives in Kargil protecting our nation. Their bravery motivates us every single day. Also sharing an excerpt from last year’s ’Mann Ki Baat.’ pic.twitter.com/jC42es8OLz — Narendra Modi (@narendramodi) July 26, 2021 -
యన్‌యస్‌డీ చైర్మన్‌గా పరేష్ రావల్
బాలీవుడ్ విలక్షణ నటుడు పరేష్ రావల్‌కు కొత్త గౌరవం దక్కింది. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (యన్‌యస్‌డీ) చైర్మన్‌గా పరేష్ రావల్‌ను నియమించారు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. ఈ విషయాన్ని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా తెలియజేస్తూ – ‘‘పరేష్ రావల్‌ను యన్‌యస్‌డీ చైర్మన్‌గా నియమించారనే విషయాన్ని తెలియజేయడం ఎంతో ఆనందంగా ఉంది. యన్‌యస్‌డీ ఫ్యామిలీ ఆయన్ను సగౌరవంగా ఆహ్వానిస్తోంది. ఆయన నాయకత్వంలో మరెన్నో మైలురాయిలు అందుకుంటాం’’ అని ట్వీట్ చేసింది. పరేష్ రావల్ నియామకం పట్ల ఇండస్ట్రీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. -
అది దేశ విద్యా విధానం
న్యూఢిల్లీ: నూతన జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) కేవలం ప్రభుత్వ విధానం కాదని.. అది మొత్తంగా భారత దేశ విద్యా విధానమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానం కూడా దేశ విదేశాంగ, రక్షణ విధానాలతో సమానమైన ప్రాముఖ్యత కలిగినదన్నారు. నూతన జాతీయ విద్యా విధానం అమలులో సాధ్యమైనంతగా మార్పుచేర్పులకు వీలు కల్పించాలని, ఈ విద్యా విధానానికి సంబంధించిన అన్ని అనుమానాలను నివృత్తి చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. ‘రోల్ ఆఫ్ ఎన్ఈపీ ఇన్ ట్రాన్స్ఫార్మింగ్ హయ్యర్ ఎడ్యుకేషన్’అనే అంశంపై సోమవారం జరిగిన గవర్నర్ల సదస్సును ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ విద్యా విధానంపై సంబంధిత వర్గాలకు అనేక అనుమానాలు, ప్రశ్నలు ఉండటం సహజమేనని ప్రధాని పేర్కొన్నారు. ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానాలిచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ‘విద్యా విధానంలో భాగమైన ప్రతీ వ్యక్తి అభిప్రాయాలను గౌరవిస్తాం. ప్రశ్నలకు జవాబిస్తాం. అనుమానాలను నివృత్తి చేస్తాం’అని స్పష్టం చేశారు. చాలా ప్రశ్నలు ఎన్ఈపీ అమలుకు సంబంధించే ఉన్నాయన్నారు. దేశ విద్యా విధానం ఆ దేశ ఆకాంక్షలను ప్రతిఫలిస్తుందని అభివర్ణించారు. ఈ విద్యా విధానాన్ని రూపొందించిన తీరు తరహాగానే.. అమలులోనూ సాధ్యమైనంత సానుకూల దృక్పథాన్ని ప్రదర్శించాలని సూచించారు. సదస్సులో రాష్ట్రాల గవర్నర్లతో పాటు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, రాష్ట్రాల విద్యా శాఖల మంత్రులు, వర్సిటీల వైస్ చాన్సెలర్లు పాల్గొన్నారు. ఎన్ఈపీ–2020పై సెప్టెంబర్ 25 లోపు యూనివర్సిటీల్లో వర్చువల్ సదస్సులు నిర్వహించాలని ఈ సందర్భంగా ప్రధాని కోరారు. నూతన విద్యా విధానాన్ని పాఠశాల ఉపాధ్యాయుల నుంచి, ప్రఖ్యాత విద్యావేత్తల వరకు అంతా స్వాగతిస్తున్నారని గుర్తు చేశారు. అకడమిక్, వొకేషనల్, టెక్నికల్ సహా అన్ని అంశాలను, అలాగే, పాలనాపరమైన అనవసర జాప్యాలను నివారించే చర్యలను కూడా నూతన ఎన్ఈపీలో సమగ్రంగా పొందుపర్చారన్నారు. కళాశాలలకు, విశ్వవిద్యాలయాలకు దశలవారీగా స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించాలనే ఆలోచన వెనుక.. ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించాలి, సమర్థ్ధతకు పట్టం కట్టాలనే ఉద్దేశం ఉందని ప్రధాని మోదీ వివరించారు. ‘ఈ స్ఫూర్తిని విజయవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది’అన్నారు. చదవడం కన్నా నేర్చుకోవడంపై, విశ్లేషణాత్మక ఆలోచనాధోరణిని పెంపొందించుకోవడంపై ఈ నూతన విద్యా విధానంలో ప్రధానంగా దృష్టి పెట్టారన్నారు. విద్యార్థులను ఇబ్బంది పెడుతున్న పుస్తకాలు, సిలబస్, పరీక్షల ఒత్తిడి భారాన్ని తగ్గించేందుకు తగిన చర్యలు ఈ విధానంలో ఉన్నాయన్నారు. చిన్న క్లాసుల నుంచే వృత్తి విద్యకు, శిక్షణకు ప్రాధాన్యతనిచ్చి, వారిని దేశీయ, అంతర్జాతీయ ఉద్యోగ మార్కెట్‌కు సిద్ధ్దం చేయడం లక్ష్యంగా ప్రణాళిక రూపొందించారని పేర్కొన్నారు. ‘స్వావలంబ భారత్’లక్ష్యాన్ని చేరుకునేందుకు వీలుగా ఈ నూతన ఎన్ఈపీ రూపొందిందన్నారు. గతంలో విద్యార్థులు తమకు ఆసక్తి లేని అంశాలను బలవంతంగా నేర్చుకోవాల్సి వచ్చేదని, నూతన విద్యా విధానంలో ఆ సమస్యకు పరిష్కారం చూపామని వివరించారు. 21వ శతాబ్దపు నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా భారత్‌ను రూపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. నూతన విద్యా విధాన స్థూల రూపకల్పనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువగా జోక్యం చేసుకోలేదన్నారు. విద్యావేత్తలు, విద్యార్థులు, తల్లిదండ్రుల అభిప్రాయాలకు ఈ విధానంలో సముచిత ప్రాధాన్యతనిచ్చారన్నారు. అంతర్జాతీయంగా ప్రఖ్యాతి గాంచిన వర్సిటీలు భారత్‌లో తమ కేంద్రాలను ప్రారంభించేలా నూతన విధానంలో అవకాశం కల్పించామన్నారు. దీనివల్ల మేధో వలస సమస్య కూడా తగ్గుతుందని పేర్కొన్నారు. ‘పరిశోధన’కు నిధులు పెంచాలి పరిశోధన, అభివృద్ధి’పై ప్రభుత్వ నిధులను భారీగా పెంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సూచించారు. ఇతర దేశాలతో పోలిస్తే...భారత్ ఈ రంగంలో అతి తక్కువ నిధులను కేటాయిస్తోందన్నారు. పరిశోధన, సృజనాత్మక ఆవిష్కరణలపై భారీగా పెట్టుబడులు పెట్టడం భారత్ వంటి పెద్ద ఆర్థిక వ్యవస్థకు అత్యావశ్యకమన్నారు. నూతన విద్యా విధానంపై సోమవారం వర్చువల్‌గా జరిగిన గవర్నర్ల సదస్సునుద్దేశించి ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. ‘రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్’కు జీడీపీలో అమెరికా 2.8%, దక్షిణ కొరియా 4.2%, ఇజ్రాయెల్ 4.3% నిధులను కేటాయిస్తుండగా, భారత్ మాత్రం జీడీపీలో 0.7% నిధులను మాత్రమే కేటాయిస్తోందన్నారు. -
ప్రియనేతకు తుదివీడ్కోలు
న్యూఢిల్లీ: కుటుంబ సభ్యులు, అభిమానులు, సహచరుల అశ్రునయనాల మధ్య మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు ముగిశాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, త్రివిధ దళాధిపతులు, పలువురు కేంద్ర మంత్రులు, సీనియర్ నేతలు ఆయనకు భారమైన హృదయంతో తుది వీడ్కోలు పలికారు. లోధి రోడ్‌లోని విద్యుత్ దహన వాటికలో మంగళవారం మధ్యాహ్నం పూర్తి అధికార లాంఛనాల మధ్య ప్రణబ్ ముఖర్జీకి ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ అంత్యక్రియలు నిర్వహించారు. కరోనా నేపథ్యంలో కుటుంబ సభ్యులు, ఇతరులు పీపీఈ కిట్స్ ధరించి కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ రాష్ట్రపతికి ఆర్మీ దళం గన్ సెల్యూట్‌తో గౌరవ వందనం సమర్పించింది. అంతకుముందు ప్రణబ్ మృతదేహాన్ని పూలతో అలంకరించిన వాహనంలో త్రివర్ణ పతాకం కప్పి దహనవాటికకు తీసుకువచ్చారు. పలు అనారోగ్య సమస్యలతో ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరెన్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రణబ్ సోమవారం సాయంత్రం గుండెపోటుతో తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆగస్టు 10న అదే ఆసుపత్రిలో ప్రణబ్‌కు వైద్యులు క్లిష్టమైన శస్త్ర చికిత్స సైతం నిర్వహించారు. అదే సమయంలో ఆయనకు కరోనా కూడా సోకింది. భారత రత్న పురస్కార గ్రహీత అయిన ప్రణబ్ మృతికి సంతాప సూచకంగా కేంద్రం సోమవారం నుంచి 7 రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రముఖుల నివాళి ప్రణబ్ నివాసంలో ఆయన భౌతిక కాయానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, త్రివిధ దళాధిపతులు జనరల్ ఎంఎం నరవణె(ఆర్మీ), అడ్మిరల్ కరమ్‌వీర్ సింగ్ (నేవీ), ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బధౌరియా (ఎయిర్‌ఫోర్స్), సీనియర్ కాంగ్రెస్ నేతలు, పార్టీలకతీతంగా సీనియర్ నేతలు, అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. మాస్క్, భౌతికదూరం తదితర కోవిడ్ నిబంధనలను పాటిస్తూ మాజీ ప్రధాని, చిరకాల సహచరుడు మన్మోహన్ సింగ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. తదితరులు ప్రణబ్‌కు శ్రద్ధాంజలి ఘటించారు. ప్రణబ్ నివాసంలోని ఒక గదిలో ఆయన భౌతిక కాయాన్ని ఉంచగా, ప్రముఖుల సందర్శనార్థం మరో గదిలో ఏర్పాటు చేసిన ప్రణబ్ చిత్రపటానికి నాయకులు పుష్పాంజలి సమర్పించారు. ప్రియతమ నేతకు తుది వీడ్కోలు పలికేందుకు అన్ని పార్టీల కార్యకర్తలు, ప్రజలు రాజాజీ మార్గ్‌లోని ప్రణబ్ నివాసానికి తరలివచ్చారు. వారంతా క్రమశిక్షణతో అభిమాన నేతకు అశ్రు నివాళి అర్పించారు. కొందరు అభిమానులు, సెక్యూరిటీ సిబ్బంది మొత్తం ముఖాన్ని కప్పి ఉంచే ఫేస్ షీల్డ్‌ను సైతం ధరించారు. కోవిడ్ ముప్పు నేపథ్యంలో అంతిమయాత్రకు అధికారికంగా ఉపయోగించే వాహనంలో కాకుండా, మరో వాహనంలో ప్రణబ్ భౌతిక కాయాన్ని లోధి రోడ్‌లోని శ్మశాన వాటికకు తరలించారు. పీపీఈ కిట్స్ ధరించిన సిబ్బంది మృతదేహాన్ని వాహనంలోకి చేర్చారు. ప్రణబ్ చిత్రపటం వద్ద పుష్పాలతో నివాళులర్పిస్తున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ స్వగృహంలో మ్యూజియం పశ్చిమబెంగాల్లోని జంగీపూర్‌లో ఉన్న తమ స్వగృహంలో ఒక అంతస్తును తమ తండ్రి జ్ఞాపికలతో ఒక మ్యూజియంగా రూపొందిస్తామని, ఒక గ్రం«థాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తామని ప్రణబ్ కుమారుడు అభిజిత్ ముఖర్జీ వెల్లడించారు. తన తండ్రి స్మృత్యర్థం ప్రభుత్వం ఒక పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేయాలని అభిజిత్ కోరారు. తన తండ్రి కోసం ఆగస్టు 4న జంగీపూర్‌లోని తమ వ్యవసాయ క్షేత్రం నుంచి ఒక పనస పండును తీసుకువచ్చానని గుర్తు చేసుకున్నారు. ‘అవి ఇక్కడ కూడా లభిస్తాయి. కానీ మా సొంత క్షేత్రం నుంచి ఆయన కోసం తీసుకురావాలనిపించింది. ఆయన ఆ పండును సంతోషంగా స్వీకరించారు. అప్పుడు అదృష్టవశాత్తూ ఆయన షుగర్ లెవల్స్ కూడా సాధారణ స్థాయిలోనే ఉన్నాయి. ఆయన కోరికను తీర్చినందుకు చాలా సంతోషించాను’అని గద్గద స్వరంతో పేర్కొన్నారు. ‘రాజకీయాల్లో కావచ్చు, జీవితంలో కావచ్చు.. ఎప్పుడు కూడా కక్షపూరితంగా ఉండవద్దు’అని తన తండ్రి పలుమార్లు తనతో చెప్పారన్నారు. ప్రణబ్‌కు శాయశక్తులా చికిత్స అందించిన వైద్యులకు అభిజిత్ కృతజ్ఞతలు తెలిపారు. ‘ఈ లోకంలో ఆయన పోషించాల్సిన పాత్ర ముగిసిందనుకుంటా. ఒక సాధారణ వ్యక్తి కోరుకునే అన్నింటినీ ఆయన పొందారు’అని వ్యాఖ్యానించారు. చైనా, యూఎస్‌ల్లో.. పశ్చిమబెంగాల్లోని ప్రణబ్ స్వగ్రామం మిరాటీలో గ్రామస్తులు ప్రియతమ నేతకు కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. ‘దాదాపు ప్రతీ దుర్గాపూజ ఉత్సవానికి కచ్చితంగా స్వగ్రామానికి వచ్చేలా ప్రణబ్ ప్రయత్నించేవారు. ఆయన లేకుండా దుర్గాపూజ ఉత్సవం ఎప్పటిలా ఎన్నటికీ జరగబోదు’అని గ్రామంలోని ఆలయ పూజారి బందోపాధ్యాయ వ్యాఖ్యానించారు. మరోవైపు, చైనా విదేశాంగ కార్యాలయం ప్రణబ్ చిత్రపటానికి నివాళులర్పించింది. అమెరికా, భారత్ కలిసి ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనే విషయంలో ప్రణబ్ విశేష కృషి చేశారని అమెరికా డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ తెలిపారు. గొప్ప నేతను దేశం కోల్పోయింది ప్రణబ్ ముఖర్జీ మృతికి మంగళవారం కేంద్ర కేబినెట్ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఒక గొప్ప నాయకుడిని, అద్భుతమైన పార్లమెంటేరియన్‌ను దేశం కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ రెండు నిమిషాలు మౌనం పాటించి, శ్రద్ధాంజలి ఘటించింది. ‘పాలనలో అనితరసాధ్యమైన అనుభవం ఉన్న నేత. దేశ విదేశాంగ, రక్షణ, వాణిజ్య, ఆర్థిక మంత్రిగా గొప్ప సేవలందించారు’అని కేబినెట్ ఒక తీర్మానంలో ప్రశంసించింది. జాతిజీవనంపై తనదైన ముద్రను వదిలివెళ్లారని, ఆయన మృతితో శిఖరాయమాన దార్శనిక నేతను దేశం కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. దేశాభివృద్ధికి ప్రణబ్ అందించిన సేవలను భారతీయులు తరతరాలు గుర్తుంచుకుంటారని ప్రధానమంత్రి మోదీ ట్వీట్ చేశారు. ఢిల్లీలోని ప్రణబ్ నివాసం వద్ద సెల్యూట్ చేస్తున్న సైనిక జవాన్లు -
రాష్ట్రపతి వ్యవస్థనూ భ్రష్టు పట్టిస్తారా!
తెలుగుదేశం పార్టీ ఎవరినైనా భ్రష్టు పట్టించగల సామర్థ్యం కలిగిన పార్టీ అని తెలుసు. కానీ చివరికి రాష్ట్రపతిని కూడా వదలకపోవడమే దురదృష్టకరం. టీడీపీ ఎంపీలు మర్యాదపూర్వకంగా కలిసి, రాష్ట్రపతి అది చెప్పారు.. ఇది చెప్పారు అంటూ ప్రచారం చేయడం ద్వారా ఆయన పరువు తీయడానికి కూడా వెనుకాడలేదని చెప్పాలి. రాష్ట్రపతి కూడా తమ అవినీతికి మద్దతుగా, హత్యా రాజకీయాలకు అనుకూలంగా, మహిళలను బూతులు తిట్టేవారికి సంఘీభావంగా మాట్లాడారన్నట్లు అర్థం వచ్చేలా టీడీపీ ఎంపీలు ప్రచారం చేయడం దుర్మార్గం. అవినీతి కేసులలో రక్షణ కల్పించాలని కోరడం ద్వారా టీడీపీ అధినేత రాష్ట్రపతిని కూడా బురదలోకి లాగాలని చూడటం హేయం. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ ఎంపీలు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి పెద్ద ఎత్తున పిర్యాదు చేశారు. ఈ ఏడాది కాలంలో వారు చేస్తున్న ఆరోపణలు అనండి, విమర్శలు అనండి అన్నిటిని కలిపి ఒక చోట పోగు చేసి రాష్ట్రపతికి ఇచ్చారు. ఆ తర్వాత వారు బయటకు వచ్చి ఏపీ ప్రభుత్వం టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతోందని మీడియాకు చెప్పడానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ఎవరైనా రాష్ట్రపతిని కలిసి వినతిపత్రాలు ఇవ్వడం తప్పు కాదు. కాకపోతే రాష్ట్రపతి కూడా టీడీపీ వాదనతో ఏకీభవించినట్లుగా మాట్లాడారని, పార్లమెంటులో ఈ అంశాలన్నీ లేవనెత్తాలని కోరారని చెప్పినట్లుగా టీడీపీ ఎంపీలు, టీడీపీ మీడియా ప్రచారం చేయడం మాత్రం అభ్యం తరకరం. తెలుగుదేశం పార్టీ ఎవరినైనా భ్రష్టు పట్టించగల సామర్థ్యం కలిగిన పార్టీ అని తెలుసు. కానీ చివరికి రాష్ట్రపతిని కూడా వదలకపోవడమే దురదృష్టకరం. మర్యాదపూర్వకంగా కలిసి, రాష్ట్రపతి అది చెప్పారు.. ఇది చెప్పారు అంటూ ప్రచారం చేయడం ద్వారా ఆయన పరువు తీయడానికి కూడా వెనుకాడలేదని చెప్పాలి. పార్లమెంటులో ఈ అంశాలన్నిటినీ ప్రస్తావించాలని చెప్పారంటే, తనకు ఇచ్చినా లాభం ఏమీ లేదని రాష్ట్రపతి భావిస్తున్నారని అనుకోవాలా? టీడీపీ ఎంపీలు బయటకు వచ్చి చెప్పిన విషయం ఏమిటంటే తెలుగుదేశం పార్టీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, అయ్యన్నపాత్రుడు వంటి బీసీ నేతలపై కేసులు పెట్టారని. సాధారణంగా ప్రభుత్వంపై ఏవో ఆరోపణలు చేయడానికి రాష్ట్రపతిని ప్రతిపక్షాలు కలుస్తుంటాయి. కానీ తమాషా ఏమిటంటే తమపై అవినీతి ఆరోపణల కేసులు పెడుతున్నారని ఫిర్యాదు చేయడానికి వీరు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లుగా ఉంది. ఈఎస్ఐ స్కామ్ వాస్తవమేనని అంటారు. అధికారులకు పాత్ర ఉందేమో కానీ అప్పటి మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడుకు సంబంధం లేదంటారు. బందరులో మోకా భాస్కరరావును హత్య చేసింది మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అనుచరులే అయినా ఆయనపై కేసు పెడతారా? అంటారు. అయ్యన్నపాత్రుడు మహిళా అధికారిని బట్టలూడదీసిగొడతానని అన్న వీడియో ఉంది. ఆయనపై కేసు వద్దంటారు. జేసీ ప్రభాకరరెడ్డి ఏకంగా నకిలీ సర్టిఫికెట్లను సృష్టించారే, అలా చేసినా ఫర్వాలేదా? మరి రాష్ట్రపతి కూడా అవినీతికి మద్దతుగా, హత్యలకు అనుకూలంగా, మహిళలను బూతులు తిట్టేవారికి సంఘీభావంగా మాట్లాడారన్నట్లు అర్థం వచ్చేలా టీడీపీ ఎంపీలు ప్రచారం చేయడం అంటే అంతకన్నా దుర్మార్గం ఉంటుందా? ప్రజావేదిక కూల్చారని కూడా ఫిర్యాదు చేశారట. వీరు రాష్ట్రపతిని అడిగి ఉండాల్సింది! టీడీపీ హయాంలో నదీగర్భంలో పర్యావరణ అనుమతులతో నిమిత్తం లేకుండా ఒక నిర్మాణం చేశాం. దానిని వైసీపీ ప్రభుత్వం కూల్చింది. అలా అక్రమ కట్టడం చేయడం సరైనదా? కూల్చడం సరైనదా అని టీడీపీ వారు రాష్ట్రపతిని అడిగి ఉండాల్సింది. అలాగే గతంలో ముఖ్యమంత్రి హోదాలోనూ, ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదాలోనూ కృష్ణానది కరకట్టపై అక్రమ కట్టడంలో చంద్రబాబు ఉంటున్నారు. దీన్ని సమర్థించాలని రాష్ట్రపతిని కోరారన్నమాట. టీడీపీ మీడియాలో వచ్చిన వాటి ప్రకారం వీటన్నిటికీ రాష్ట్రపతి మద్దతు ఇస్తారన్నమాట. అంటే వీరు ఈ దేశాన్ని ఎటువైపు తీసుకు వెళుతున్నారు? అయితే టీడీపీ ఎంపీలు ఒక విషయం కావాలని వదలివేస్తున్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌పై కేంద్రం పగ పట్టిందని, మోదీ కక్షతో ఐటీ దాడులు, ఈడీ దాడులు చేయిస్తున్నారని ఆరోపించేవారు. అసలు కేంద్ర దర్యాప్తు సంస్థలేవీ ఏపీలో అడుగుపెట్టడానికి వీలులేదని చంద్రబాబు ప్రభుత్వం అప్పట్లో ఆదేశాలు ఇచ్చింది. వాటన్నింటినీ జగన్ ఎత్తివేశారు. మరి వీరు గతంలో చేసింది కరెక్టు అయితే జగన్ చేసిన ఈ పని కూడా తప్పే అవ్వాలి కదా.. జగన్ సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వడం ఏమిటని రాష్ట్రపతిని టీడీపీ ఎంపీలు ప్రశ్నించి ఉండాల్సింది. అంతేకాక స్వయంగా చంద్రబాబు వద్ద పీఎస్‌గా ఉన్న శ్రీనివాస్ ఇంటిపై ఐటీ దాడులు చేయడం ఏమిటని రాష్ట్రపతిని ప్రశ్నించాలి కదా. రెండువేల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు జరిగాయని నిఘాసంస్థ ప్రకటించడం మోదీ కక్షకు నిదర్శనమని టీడీపీ నేతలు ఎందుకు చెప్పలేకపోయారు? అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, జేసీ ప్రభాకరరెడ్డి, అయ్యన్నపాత్రుడులపై రాష్ట్ర పోలీసులు పెట్టిన కేసులను ప్రస్తావించి పిర్యాదు చేసిన ఈ ఎంపీలు.. తమ అధినేతతో నిత్యం సంబంధం కలిగి ఉండే పీఎస్‌పై వచ్చిన రెండువేల కోట్ల కేసుపై పిర్యాదు చేయలేదంటే, చంద్రబాబు తప్పు చేసినట్లు ఒప్పుకుంటున్నారని అనుకోవాలా? పార్లమెంటులో కూడా చంద్రబాబు పీఎస్‌పై ఐటీ దాడి గురించి మాట్లాడే ధైర్యం వీరు చేస్తారా? యథాప్రకారం రాజధాని అమరావతి అంశాన్ని కూడా టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అమరావతి శి«థిలాలపై మూడు రాజధానులు కడతారా అని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. నిజానికి చంద్రబాబు ప్రభుత్వమే పచ్చని పంటలు పండే భూములను దిబ్బలుగా మార్చింది. జగన్ ప్రభుత్వం మూడు రాజధానులు ఉండాలని విధానపరమైన నిర్ణయం తీసుకుంది. దానిని టీడీపీ వ్యతిరేకించింది. మరి ఈ విషయంలో రాష్ట్రపతికి కేంద్రంపై కూడా ఫిర్యాదు చేయాలి కదా? ప్రధాని మోదీ గుప్పెడు మట్టి, చెంబుడు నీళ్లు ఆంధ్రుల ముఖాన కొట్టారని బాబు ఎన్నికల సమయంలో ప్రచారం చేశారు కదా.. దానిపై రాష్ట్రపతి కోవింద్‌కు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? తమ హయాంలో రాజధానికి లక్ష కోట్ల రూపాయలు అవసరమని కేంద్రానికి లేఖ రాశామని, అయినా కేంద్రం పట్టించుకోలేదని వారు ఎందుకు పేర్కొనలేదు? అయితే ఇప్పుడు తాము మాట మార్చి రాజధానికి డబ్బులే అక్కర్లేదని, సెల్ఫ్ పైనాన్స్ రాజధాని అని, దీనిని జగన్ కూడా ఒప్పుకోవాలని కోరుతున్నామని చెప్పి ఉండాల్సింది. రాజధానిలో లక్షల కోట్ల రూపాయల ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని జగన్ ఆరోపించారని, దానిపై విచారణ అధికారాన్ని సీబీఐకి ఇస్తూ ఏపీ ప్రభుత్వం లేఖ రాసిందని, అందువల్ల సత్వరమే దీనిపై విచారణ జరిపించాలని కూడా ధైర్యంగా రాష్ట్రపతికి చెప్పి ఉండాల్సింది. స్వయంగా ప్రధాని మోదీ ఏపీకి వచ్చి పోలవరం ప్రాజెక్టును తమ అధినేత చంద్రబాబు ఏటీఎమ్ మాదిరి వాడుకున్నారని ఆరోపించారని, దాని గురించి కూడా విచారణ జరిపించాలని కోరి ఉండాల్సింది. వీట న్నిటినీ వదలిపెట్టి కేవలం కొందరు మాజీ మంత్రుల అవినీతి కేసుల గురించే టీడీపీ ఎంపీలు ఎందుకు ప్రస్తావించారో తెలియదు. సరే. ఇక వైసీపీ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలలో దేనికైనా నిర్దిష్ట ఆధారాలతో చెప్పి ఉంటే అర్థం ఉండేది. ఉబుసుపోక సోది రాస్తే ఏం ప్రయోజనం? ఒకప్పుడు టీడీపీ ప్రతిపక్షంగా ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా ఒక పద్ధతిగా మాట్లాడుతుందన్న అభిప్రాయం ఉండేది. ఏది పడితే అది మాట్లాడడానికి కాస్త ఫీల్ అయ్యేవారు. కానీ చంద్రబాబు ఆధిపత్యం టీడీపీలో పెరిగిన తర్వాత, తదుపరి టీడీపీని ఆయన కైవసం చేసుకున్న తర్వాత ఆయన ఒకటే థియరీ అమలు చేస్తున్నారు. అదేమిటంటే అదికార పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, తన ప్రత్యర్థి మీద ఉన్నవి, లేనివి ఆరోపణలు చేసి అభియోగాలు మోపాలి. వీలైనంత బురద చల్లాలన్నదే లక్ష్యంగా చంద్రబాబు రాజకీయం చేశారు. కొన్నిసార్లు అది ఆయనకు కలిసి వచ్చింది కూడా. కానీ ఇప్పుడు కాలం మారింది. సోషల్ మీడియా యుగం నడుస్తోంది. దానితో ఆయన ఏమి చెప్పినా, అది అబద్ధమా? నిజమా అన్నది నిమిషాలలో తేల్చేస్తున్నారు. అందువల్లే చంద్రబాబు ఐదేళ్ల పాలనలో చేసిన అరాచకాలు, అవినీతి అన్నీ చాలావరకు బయటకు వచ్చేశాయి. దాని ఫలితమే 2019లో తెలుగుదేశం పార్టీ దారుణ ఓటమి అన్న సంగతి ఆయన అర్థం చేసుకోవాలి. కానీ ఆయన ఇప్పటికీ మూసపోసినట్లు పాత బురద రాజకీయమే చేస్తున్నారు. కాకపోతే ఆయా వ్యవస్థలలో తన పలుకుబడిని ఉపయోగించి పార్టీని నిలబెట్టుకోవాలని చూస్తున్నారు. ప్రభుత్వాన్ని బదనాం చేయాలని యత్నిస్తున్నారు. నిజమే ఏ ప్రభుత్వం అయినా కక్షతో ఎలాంటి కేసులు పెట్టకూడదు. రాష్ట్రపతికి ప్రభుత్వంపై ఫిర్యాదు చేయడం కూడా తప్పుకాదు. కాని ఉన్నవీ, లేనివీ అబద్ధాలు పోగు చేసి పేజీల కొద్దీ వినతిపత్రం ఇవ్వడం తప్పు. అనినీతి కేసులలో రక్షణ కల్పించాలని కోరడం తప్పు. అయినా వర్తమాన రాజకీయాలు ఇలా అయిపోయాయి. ఇలాంటి వాటిని గమనంలోకి తీసుకునే రాజకీయం అంటే దయ్యాలు ఆడుకునే ఆట అని ఒక రచయిత వ్యాఖ్యానించారు. ఎలాంటి లక్ష్యాలతో తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించారు? ప్రస్తుత టీడీపీ నేతలంతా కలిసి ఏ స్థాయికి ఈ పార్టీని తీసుకువచ్చారు!... నిజంగా ఇది విషాదమే. వ్యాసకర్త కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
జస్టిస్ ధర్మాధికారి రాజీనామా
ముంబై: బొంబాయి హైకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తుల్లో రెండో వారైన జస్టిస్ సత్యరంజన్ ధర్మాధికారి రాజీనామా చేశారు. కుటుంబపరమైన, వ్యక్తిగత కారణాల వల్ల ముంబైకి వెలుపల తాను విధులు నిర్వర్తించలేనని ఆయన పేర్కొన్నారు. పదోన్నతిపై తనను వేరే రాష్ట్ర హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమించినప్పటికీ.. ముంబై నుంచి బయటకు వెళ్లేందుకు తాను సిద్ధంగా లేనని తెలిపారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు పంపించానన్నారు. ‘పూర్తిగా వ్యక్తిగత, కుటుంబ కారణాలతో మాత్రమే రాజీనామా చేస్తున్నా. ముంబైని విడిచివెళ్లడం నాకు ఇష్టం లేదు. బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నన్ను నియమించేందుకు వారు సిద్ధంగా లేరు’ అని శుక్రవారం ఆయన మీడియాతో వ్యాఖ్యానించారు. ముంబైలో తాను నిర్వర్తించాల్సిన కొన్ని వ్యక్తిగత బాధ్యతలున్నాయన్నారు. 2003లో జస్టిస్ ధర్మాధికారి బొంబాయి హైకోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. -
విజయసాయిరెడ్డి లేఖకు రాష్ట్రపతి స్పందన
-
రాష్ట్రపతికి గవర్నర్ విందు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గౌరవార్థం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదివారం రాజ్‌భవన్‌లో విందు ఏర్పాటు చేశారు. విందుకు విచ్చేసిన రాష్ట్రపతి కోవింద్ దంపతులకు గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ రాజ్‌భవన్ ప్రవేశద్వారం వద్ద ఘన స్వాగతం పలికారు. రాష్ట్రపతి దంపతులు విందుకు హాజరైన అతిథులందరి వద్దకు వెళ్లి పరిచయం చేసుకున్నారు. తన ఆహా్వనాన్ని మన్నించి విచ్చేసిన రాష్ట్రపతికి గవర్నర్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. రెడ్‌క్రాస్ సొసైటీ యాప్ ఆవిష్కరణ: తెలంగాణ రెడ్‌క్రాస్ సొసైటీ (ఐఆర్సీఎస్) మొబైల్ యాప్‌ను ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ యాప్‌ను ఏ భాషలోనైనా వినియోగించవచ్చని, ఏ రాష్ట్రమైనా అడాప్ట్ చేసుకోవచ్చని గవర్నర్ తెలిపారు. ఈ యాప్ విశేషాలను రాజ్‌భవన్ కార్యదర్శి సురేంద్ర మోహన్ వివరించారు. సభ్యత్వం కోసం రెడ్‌క్రాస్ సొసైటీ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదని, ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని తమ వివరాలను నమోదు చేస్తే సొసైటీ సభ్యత్వం లభిస్తుందని చెప్పారు. యాప్ నుంచే డిజిటల్ సంతకం చేసిన సభ్యత్వ ధ్రువీకరణ పత్రం పొందవచ్చని పేర్కొన్నారు. అత్యవసర సమయాల్లో సమీపంలో ఉన్న రక్త నిధి కేంద్రాల వివరాలు, చిరునామా, ఫోన్ నంబర్, గూగుల్ రూట్ మ్యాప్ తదితర వివరాలను ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చని చెప్పారు. విందు ముగిసిన అనంతరం రాష్ట్రపతి కోవింద్ దంపతులకు తమిళిసై, కేసీఆర్‌లు రాజ్‌భవన్ నుంచి వీడ్కోలు పలికారు. ఆదివారం రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఏర్పాటు చేసిన విందుకు విచ్చేసిన రాష్ట్రపతి కోవింద్ దంపతులు, ముఖ్యమంత్రి కేసీఆర్, హైకోర్టు చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ -
రాష్ట్రపతికి తమిళిసై విందు
సాక్షి, హైదరాబాద్ : శీతాకాల విడిది కోసం నగరానికి వచ్చిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆయన గౌరవార్ధం ఆదివారం రాజ్‌భవన్‌లో విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి తన కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై పుష్పగుచ్చం ఇచ్చి సాదరంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి రాష్ర్టపతి సహా తెలంగాణ సీఎం కేసీఆర్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, హిమాచల్ గవర్నర్ దత్తాత్రేయ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, హైకోర్టు చీఫ్ జస్టిస్ చౌహాన్, హైకోర్టు న్యాయమూర్తులు సహా సీఎస్ ఎస్కే జోషి, డీజీపీ మహేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగానే ఇండియన్ రెడ్‌క్రాస్ మొబైల్ యాప్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆవిష్కరించారు. -
మైనారిటీల అభ్యున్నతికి కృషి చేయండి
న్యూఢిల్లీ: రాష్ట్రాల గవర్నర్లు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు ప్రజల అవసరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలని, సమాజంలో వెనుకబడ్డ తరగతులు, మైనార్టీల అభ్యున్నతికి కృషి చేయాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. శనివారం ఢిల్లీలో గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల సదస్సుల్లో మోదీ మాట్లాడారు. ఆరోగ్య, విద్య, పర్యాటక రంగాల్లో ఎన్నో అవకాశాలు ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకోవడం ద్వారా పేద, అణగారిన వర్గాల స్థితిగతులను మెరుగుపరచడంతోపాటు ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చునని ప్రధాని తెలిపినట్లు ప్రధానమంత్రి కార్యాలయం శనివారం ఒక పత్రిక ప్రకటన విడుదల చేసింది. రాజ్యాంగ విధులు నిర్వర్తించే గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు సామాన్యుల సమస్యలను పట్టించుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తూ షెడ్యూల్డ్ తెగలు, మైనార్టీ, మహిళ, యువజన వర్గాలకు ప్రభుత్వ పథకాల లబ్ది అందేలా చూడాలని కోరారు. పరస్పర సహకారం, పోటీతత్వంతో కూడిన సమాఖ్య వ్యవస్థ సాకారానికి గవర్నర్ల వ్యవస్థ ఎంతో కీలకమైందని ప్రధాని పేర్కొన్నారు. ‘భారత రాజ్యాంగ రచన 70 ఏళ్ల వేడుకలు జరుపుకుంటున్న ఈ తరుణంలో గవర్నర్లు, రాష్ట్ర ప్రభుత్వాలు పౌరుల విధులు, బాధ్యతలపై అవగాహన పెంచేందుకు కలిసి పనిచేయాలి’ అన్నారు. ఢిల్లీలో జరిగిన 50వ గవర్నర్ల వార్షిక సమావేశంలో తొలిసారి గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లుగా నియమితులైన 17 మంది పాల్గొన్నారు. రాజ్యాంగ పరిరక్షణే కాదు!రాష్ట్రపతి గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల పాత్ర కేవలం రాజ్యాంగ పరిరక్షణకు మాత్రమే పరిమితం కారాదని, ప్రజా జీవితంలో వీరికున్న అపార అనుభవం ప్రజలకు పూర్తిగా ఉపయోగపడాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆకాంక్షించారు. ఢిల్లీలో శనివారం ప్రారంభమైన 50వ గవర్నర్ల వార్షిక సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగిస్తూ.. గవర్నర్లు ఆయా రాష్ట్రాల ప్రజల సేవకు, సంక్షేమానికి నిత్యం పనిచేయాలని అన్నారు. కొత్తగా ఏర్పడ్డ కేంద్ర పాలిత ప్రాంతాలు లడాఖ్, జమ్మూ కశ్మీర్‌ల లెఫ్టినెంట్ గవర్నర్లు ఆర్.కె.మాథుర్, జి.సి.మర్మూల పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించిన రాష్ట్రపతి గిరిజనుల అభివృద్ధి, సాధికారత సమీకృత అభివృద్ధికి, దేశ భద్రతలకూ కీలకమని వ్యాఖ్యానించారు. ‘వెనుకబడిన వర్గాల వారి అభివృద్ధికి సంబంధించి గవర్నర్లు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అధికారాలతో ప్రభుత్వాలకు తగిన సూచనలు చేయవచ్చు’ అని సూచించారు. కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య గవర్నర్లను ఉద్దేశించి మాట్లాడారు. -
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన
-
సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ నియామకానికి రాష్ట్రపతి ఆమోదం
సాక్షి, ఢిల్లీ : సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే నియామకంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మంగళవారం ఆమోద ముద్ర వేశారు. నవంబర్ 18న ఆయన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతమున్న చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నవంబర్ 17వ తేదీన పదవీ విరమణ చేయనున్న సంగతి తెలిసిందే. ఆ లోపే వివాదాస్పద అయోధ్య కేసులో తుది తీర్పు ఇస్తానని రంజన్ గొగోయ్ ఇంతకుముందే ప్రకటించారు. -
మరోసారి దుర్భుద్ది బయటపెట్టిన పాక్
-
రాష్ట్రానికి రాష్ట్రపతి దంపతుల రాక
సాక్షి, నెల్లూరు(పొగతోట): భారత రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ దంపతులు ఈ నెల 14వ తేదీన షార్కు రానున్నారు. శ్రీహరికోట నుంచి ఈ నెల 15వ తేదీ తెల్లవారుజామున 2.51 గంటలకు చంద్రయాన్–2ను ప్రయోగించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. రాష్ట్రపతితోపాటు ఆయన సతీమణి కూడా షార్కు వస్తున్నారని అధికారులు తెలిపారు. ఈ నెల 14వ తేదీ తిరుపతి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి సాయంత్రం 4.25 గంటలకు శ్రీహరికోట చేరుకుంటారు. ప్రయోగం వీక్షించిన తర్వాత 15వ తేదీ రాష్ట్రపతి తిరుగు ప్రయాణమవుతారు. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. షార్ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రపతి దంపతుల రాక సందర్భంగా సోమవారం కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబు వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. చంద్రయాన్–2 ప్రయోగాన్ని వీక్షించేందుకు రాష్టపతి దంపతులు ఈ నెల 14వ తేదీ సాయంత్రం షార్కు వస్తున్నారని తెలిపారు. వారికి ఎలాంకి అసౌకర్యం కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. అధికారులందరూ సమన్వయంతో విధులు నిర్వహించాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అవసరమైన మందులు అంబులెన్స్‌తో సిద్ధంగా ఉంచాలన్నారు. షార్‌లోని ఆస్పత్రిలో అన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రపతి పర్యటనలో ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. విధుల్లో ఉండే అధికారులు, సిబ్బంది వివరాలను డీఆర్డీఓకు అందజేయాలన్నారు. విద్యుత్ అంతరాయం లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఈ నెల 12వ తేదీన ట్రయల్‌రన్ నిర్వహించాలని సూచించారు. సమావేశంలో ఎస్పీ ఐశ్వర్యరస్తోగి, జాయింట్ కలెక్టర్ కె.వెట్రిసెల్వి, డీఆర్ఓ సి.చంద్రశేఖరరెడ్డి, గూడూరు సబ్ కలెక్టర్ ఆనంద్, డీఆర్డీఏ పీడీ ఎంఎస్ మురళి, టీజీపీ ప్రత్యేక కలెక్టర్ భార్గవి, జెడ్పీ సీఈఓ సుధాకర్‌రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ జీవపుత్రకుమార్, బీసీ సంక్షేమశాఖ అధికారి రాజేశ్వరి, విద్యుత్‌శాఖ ఎస్ఈ విజయకుమార్‌రెడ్డి పాల్గొన్నారు. -
రాష్ట్రపతి, ప్రధానితో నరసింహన్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ శుక్రవారం ఢిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు గురువారం ఢిల్లీ వచ్చిన గవర్నర్ శుక్రవారం రాష్ట్రపతితో సమావేశమై తెలుగు రాష్ట్రాల్లోని తాజా పరిస్థితులను వివరించారు. అనంతరం మోదీని కలసి ప్రధానిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించడం పట్ల ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు కూడా రాష్ట్రపతి, ప్రధానితో భేటీ అయ్యారు. -
రాజస్తాన్ గవర్నర్‌ది కోడ్ ఉల్లంఘనే
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని కావాలని వ్యాఖ్యానించిన రాజస్తాన్ గవర్నర్ కల్యాణ్ సింగ్ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ధారించింది. కల్యాణ్ సింగ్‌పై రాష్ట్రపతి కోవింద్‌కు ఫిర్యాదు చేస్తూ లేఖ రాసింది. మార్చి 23న అలీగఢ్‌లో కల్యాణ్ సింగ్ తన నివాసంలో బీజేపీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగిస్తూ ‘ మనమంతా బీజేపీ కార్యకర్తలం. బీజేపీ గెలవాలని మనం కోరుకుంటున్నాం. మోదీ మరోసారి ప్రధాని కావాలి. మోదీ మళ్లీ ప్రధాని కావడం అవసరం’ అని వ్యాఖ్యానించారు. టికెట్ల పంపిణీపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆందోళన చేస్తున్న కార్యకర్తలను బుజ్జగించే ప్రయత్నంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. గవర్నర్ హోదాలో ఉన్న వ్యక్తులు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడం ఇదే తొలిసారి కాదు. 1990లో అప్పటి హిమాచల్ గవర్నర్ గుల్షర్ అహ్మద్ తన కొడుకు తరఫున ప్రచారంలో పాల్గొనడంతో ఈసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. తర్వాత ఆయన తన పదవికి రాజీనామా చేశారు. -
సిరివెన్నెలకు పద్మశ్రీ
సాక్షి, న్యూఢిల్లీ: అక్షరాన్ని అందలమెక్కించిన ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. తన పాటతో, తూటాలాంటి మాటతో తెలుగు సినీ రచనా రంగానికి కీర్తిప్రతిష్టలు తీసుకొచ్చిన సిరివెన్నెలకు 2019 ఏడాదికిగానూ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘పద్మ’ పురస్కారాల ప్రదానోత్సవం రెండో విడత కార్యక్రమం శనివారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ దర్బార్ హాల్లో çజరిగింది. రాష్ట్రపతి చేతుల మీదుగా సిరివెన్నెల సీతారామశాస్త్రి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. పద్మశ్రీ పురస్కారం స్వీకరించిన సిరివెన్నెలను ఢిల్లీ ఆంధ్ర అసోసియేషన్ శనివారం సాయంత్రం ఘనంగా సన్మానించింది. రాష్ట్రపతికి తిమ్మక్క ఆశీస్సులు అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ‘వృక్షమాతె’గా కర్ణాటకలో అందరూ పిలుచుకునే 107 ఏళ్ల సాలుమరద తిమ్మక్క రాష్ట్రపతి నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న అనంతరం రామ్‌నాథ్ కోవింద్ నుదుటిపై చేయుంచి ఆశ్వీదించారు. అలా చేయడం ప్రొటోకాల్‌కు వ్యతిరేకం అయినప్పటికీ రాష్ట్రపతి కూడా తల్లివంటి ఆమె నుంచి ఆశీస్సులను వినమ్రంగా స్వీకరించారు. దీంతో ప్రధాని మోదీ మొదలుకొని దర్బార్ హాల్లో ఉన్న సభికులు పెద్ద పెట్టున హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. అర్హుడిగా భావిస్తున్నా: రాష్ట్రపతి కోవింద్ అనంతరం ఈ ఘటనపై రాష్ట్రపతి ట్విట్టర్లో స్పందించారు. ‘పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో ఉత్తములైన, అర్హులైన వారిని గౌరవించడం రాష్ట్రపతికి దక్కే అరుదైన అవకాశం. కానీ, కర్ణాటకకు చెందిన పర్యావరణ ఉద్యమకారిణి, పద్మ అవార్డు గ్రహీతల్లో అత్యంత వయోవృద్ధురాలైన సాలుమరద తిమ్మక్క ఈ రోజు నన్ను ఆశీర్వదించడం నన్ను కదిలించివేసింది. ఆమె ఆశీర్వాదానికి నేను అర్హుడిని. సాధారణ భారతీయులకు ముఖ్యంగా ధైర్యం, పట్టుదల, నిరంతరం శ్రమించే గుణాలున్న భారతీయ మహిళలకు తిమ్మక్క ప్రతినిధి. అవార్డు గ్రహీతల స్ఫూర్తితో దేశం మరింత ఉన్నత శిఖరాలకు ఎదుగుతుంది’ అని కోవింద్ ట్వీట్‌చేశారు. దృఢసంకల్పానికి ప్రతీక కర్ణాటకలోని హుళికల్ గ్రామానికి చెందిన సాలుమరద తిమ్మక్క ధైర్యం, దృఢ సంకల్పానికి ప్రతీక. సంతానం కలగకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన తిమ్మక్క ఒక దశలో ఆత్మహత్యకు యత్నించారు. కానీ, భర్త బిక్కల చిక్కయ్య ఆమెకు ధైర్యం నూరిపోసి తోడుగా నిలిచారు. ఆపై ఇద్దరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. మొక్కలను నాటి వాటినే బిడ్డలుగా భావించి సాకాలనుకున్నారు. రోజంతా పొలం పనులు చేసి, సాయంత్రం మొక్కలు నాటేవారు. అలా వారు మొదటి ఏడాది తమ గ్రామ పరిసరాల్లో 10 మొక్కలు నాటారు. ఏడాదికేడాది సంఖ్య పెంచారు. నాటిన మొక్కలను నాలుగైదు కిలోమీటర్ల దూరం నుంచి నీటిని తీసుకువచ్చి మరీ బతికించారు. అలా వారు 65 ఏళ్లలో ఆ ప్రాంతంలో 400 మర్రి చెట్లు సహా 8000 చెట్లను పెంచారు. చిక్కయ్య 1991లో కన్నుమూశారు. -
అవినీతి రహిత పాలనకే ప్రాధాన్యం : రాష్ట్రపతి
సాక్షి, న్యూఢిల్లీ : అవినీతి రహిత పాలనకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. నిరుపేదలకు సైతం వంటగ్యాస్, విద్యుత్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. నవభారత నిర్మాణానికి ప్రభుత్వం కృషిసాగిస్తుందన్నారు. పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించడంతో గురువారం బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కోవింద్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఆయుష్మాన్ భారత్ సహా పలు ప్రభుత్వ పథకాలను ప్రస్తావించారు. మరుగుదొడ్ల నిర్మాణంతో మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడే చర్యలను ప్రభుత్వం చేపట్టిందన్నారు. హృద్రోగులకు ఉపయోగించే స్టెంట్ల ధరను సామాన్యులకు అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు. 50 కోట్ల మందికి ప్రభుత్వం ఆరోగ్య బీమాను అమలుచేస్తోందన్నారు. ప్రతి ఇంటికీ విద్యుత్ కనెక్షన్ అందుబాటులోకి వచ్చిందన్నారు. కాగా, అంతకుముందు పార్లమెంట్ సమావేశాలకు విపక్షాలు సహకరించాలని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. బడ్జెట్ సమావేశాల్లో సభ్యులు అర్ధవంతమైన చర్చల్లో భాగస్వాములు కావాలని కోరారు. కీలక అంశాలన్నింటిపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. మరోవైపు ఏప్రిల్-మేలో సార్వత్రిక ఎన్నికలు జరగనుండటంతో 16వ లోక్‌సభ చిట్టచివరి సమావేశం గురువారం ప్రారంభమైంది. ఫిబ్రవరి 13 వరకూ జరిగే ఈ సమావేశాల్లో ఫిబ్రవరి 1న ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. సభ సజావుగా సాగేందుకు సభ్యలు సహకరించాలని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహజన్ కోరారు. జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశాలను లేవనెత్తాలని సభ్యులకు ఆమె సూచించారు. -
ఢిల్లీలో ఘనంగా బీటింగ్ రిట్రీట్
-
పేదల కోటాకు రాజముద్ర
న్యూఢిల్లీ: విద్య, ఉద్యోగాల్లో అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. రాజ్యాంగ(103వ సవరణ) చట్టం పేరిట తెచ్చిన ఈ బిల్లు ఇప్పటికే పార్లమెంట్లో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్రపతి సంతకంతో చట్టరూపం దాల్చింది. ప్రభుత్వం త్వరలో ప్రకటించే తేదీ నుంచి ఈ చట్టం అమల్లోకి వస్తుంది. జనరల్ కేటగిరీలో ఆర్థికంగా వెనకబడిన ప్రజల అభివృద్ధికి ప్రత్యేక నిబంధనలు చేరుస్తూ రాజ్యాంగంలోని 15వ, 16వ నిబంధనల్ని సవరించి ఈ చట్టం రూపొందించారు. మైనారిటీ విద్యా సంస్థలు మినహా అన్ని విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో జనరల్ కేటగిరీలోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నారు. కుటుంబ ఆదాయం, ఇతర ఆర్థిక పరిమితుల ఆధారంగా ఆర్థికంగా వెనకబడిన వర్గాలను ప్రభుత్వం కాలానుగుణంగా గుర్తిస్తుందని కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ప్రకటన జారీచేసింది. ఈ రిజర్వేషన్లకు అర్హులు ఎవరంటే.. ► వృత్తిగత, వ్యవసాయిక వార్షికాదాయం రూ.8 లక్షల కన్నా తక్కువ ఉన్నవారు ► 5 ఎకరాల కన్నా తక్కువ వ్యవసాయ భూమి, 1000 చదరపు అడుగుల కన్నా తక్కువ విస్తీర్ణంలో ఇల్లు ఉన్నవారు ► నోటిఫైడ్ మునిసిపల్ ప్రాంతంలో 100 గజాల కన్నా తక్కువ విస్తీర్ణంలో ఇల్లు కలిగిన వారు ► నాన్ నోటిఫైడ్ మునిసిపల్ ప్రాంతంలో 200 గజాల కన్నా తక్కువ విస్తీర్ణంలో ఇల్లు కలిగిన వారు -
నూతన సీఐసీగా సుధీర్ భార్గవ
న్యూఢిల్లీ: నూతన ప్రధాన సమాచార కమిషనర్(సీఐసీ)గా కేంద్ర ప్రభుత్వం సుధీర్ భార్గవను నియమించింది. ఈయనతో పాటు మరో నలుగురు సమాచార కమిషనర్ల నియామకం చేపట్టింది. భార్గవ సీఐసీ సమాచార కమిషనర్‌గా చేశారు. ప్రధాన సమాచార కమిషనర్‌తో కలిపి మొత్తం 11 మంది ఉండాల్సిన ఈ కమిషన్‌లో ప్రస్తుతం ముగ్గురే ఉన్నారు. ఐఎఫ్ఎస్ అధికారి అయిన యశ్వర్ధన్ కుమార్ సిన్హా, మాజీ ఐఆర్ఎస్ అధికారి వనజా ఎన్ సర్నా, మాజీ ఐఏఎస్ నీరజ్ కుమార్ గుప్తా, మాజీ లా సెక్రటరీ సురేశ్ చంద్రలను సమాచార కమిషనర్లుగా నియమిస్తూ సోమవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరంతా ఈ ఏడాదే ప్రభుత్వోద్యోగులుగా పదవీ విరమణ పొందారు. ఇటీవల ప్రధాన సమాచార కమిషనర్ ఆర్.కె.మాథుర్‌తో పాటు ముగ్గురు సమాచార కమిషనర్లు శ్రీధర్ ఆచార్యులు, యశోవర్ధన్ ఆజాద్, అమితవ భట్టాచార్య పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే. దీంతో అప్పుడున్న ఇతర ముగ్గురు కమిషనర్లు వీలైనంత త్వరగా ఈ ఖాళీలను భర్తీ చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నియామకాల్లో పారదర్శకత ఏది?: మాడభూషి సాక్షి, న్యూఢిల్లీ: సీఐసీ నియామకాల్లో పారదర్శకత పాటించాలని మాజీ సీఐసీ మాడభూషి శ్రీధరాచార్యులు కోరారు. కేవలం పరిపాలన రంగానికి చెందిన అధికారులనే కాకుండా ఇతర రంగాలకు చెందిన వారినీ కమిషనర్లుగా నియమించాలన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీకి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత ఖర్గేకు లేఖలు రాశారు. సీఐసీ సభ్యుల ఎంపిక కమిటీలో ప్రధాని, ప్రతిపక్ష నేత సభ్యులు. సీఐసీ సభ్యుల ఎంపిక సమాచార హక్కు చట్టం నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నందునే పలువురు కోర్టుల్లో ప్రజాప్రయోజన వ్యాజ్యా(పిల్)లు దాఖలు చేస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. ‘సీఐసీ కమిషనర్లుగా కేవలం పరిపాలన వర్గాల వారినే ఎందుకు నియమిస్తున్నారు? న్యాయం, సామాజిక సేవ, మీడియా, జర్నలిజం, సైన్స్, టెక్నాలజీ తదితర రంగాల వారినీ నియమించాలన్న సమాచార హక్కు చట్ట నిబంధనలను ఎందుకు పాటించరు? ఇటీవల నియమించిన నలుగురినీ బ్యూరోక్రాట్ల నుంచే ఎందుకు ఎంపిక చేశారు?’ అని ప్రశ్నించారు. సీఐసీతోపాటు రాష్ట్రాల సమాచార హక్కు కమిషన్(ఎస్ఐసీ)లలో సకాలంలో నియామకాలు చేపట్టాలన్న నిబంధనలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. -
కరుణానిధి మృతిపై ప్రముఖుల సంతాపం
-
విశ్వవ్యాప్తంగా.. ఘనంగా!
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ 150వ జయంతి కార్యక్రమాల ప్రారంభోత్సవాలను ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిలషించారు. ఐక్యరాజ్య సమితి సహా అన్ని ప్రపంచ వేదికలపై ఈ ఉత్సవాలు నిర్వహించాలన్నారు. మహాత్ముడి 150వ జయంతి ఉత్సవాల నిర్వహణ కోసం ఏర్పాటైన జాతీయ కమిటీ ప్రథమ సమావేశంలో బుధవారం వారిరువురు ప్రసంగించారు. ఈ సంవత్సరం అక్టోబర్ 2 నుంచి మహాత్ముడి 150వ జయంతి వేడుకలు ప్రారంభమవనున్నాయి. ఉగ్రవాదం, ఇతర హింసాత్మక ఘటనలు పెచ్చరిల్లుతున్న నేటి సమాజానికీ గాంధీ ప్రవచించిన అహింస ఆచరణీయమని కోవింద్ పేర్కొన్నారు. గాంధీ కేవలం భారత్‌కే చెందడని, ఆయన ప్రపంచ మానవాళికి భారత్ అందించిన గొప్ప బహుమతి అని అభివర్ణించారు. భవిష్యత్ తరాలకు కూడా మహాత్ముడు స్ఫూర్తిదాయకంగా నిలిచేలా ఈ ఉత్సవాలను నిర్వహించాలని ప్రధాని మోదీ కోరారు. ‘కార్యాంజలి’ థీమ్ నేపథ్యంలో అన్ని కార్యక్రమాలను రూపొందించాలని, ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు. ప్రస్తుత సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు గాంధీ చూపిన మార్గంలో పరిష్కారాలున్నాయన్నారు. కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ ప్రధాని మన్మోహన్, బీజేపీ సీనియర్ నేత అడ్వాణీ, కేంద్ర మంత్రులు, 23 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, చైనా మేధావి క్వాన్యూ షాంగ్, అమెరికన్ గాంధీగా పేరుగాంచిన బెర్నీ మీయర్ తదితరులు హాజరయ్యారు. కార్యక్రమాల రూపకల్పన కోసం ప్రధాని నేతృత్వంలో 125 సభ్యులతో ఒక కార్యనిర్వాహక కమిటీని ఏర్పాటు చేశారు. సీజేఐ, సోనియా, రాహుల్ గైర్హాజరు ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ హాజరు కాలేదు. అలాగే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ ముఖ్యమంత్రులు కూడా గైర్హాజరయ్యారు.