
బాలీవుడ్ విలక్షణ నటుడు పరేష్ రావల్‌కు కొత్త గౌరవం దక్కింది. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (యన్‌యస్‌డీ) చైర్మన్‌గా పరేష్ రావల్‌ను నియమించారు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. ఈ విషయాన్ని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా తెలియజేస్తూ – ‘‘పరేష్ రావల్‌ను యన్‌యస్‌డీ చైర్మన్‌గా నియమించారనే విషయాన్ని తెలియజేయడం ఎంతో ఆనందంగా ఉంది. యన్‌యస్‌డీ ఫ్యామిలీ ఆయన్ను సగౌరవంగా ఆహ్వానిస్తోంది. ఆయన నాయకత్వంలో మరెన్నో మైలురాయిలు అందుకుంటాం’’ అని ట్వీట్ చేసింది. పరేష్ రావల్ నియామకం పట్ల ఇండస్ట్రీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment