National School of Drama
-
టీవి స్టార్‌గా పేరు తెచ్చుకుంటూనే.. ఎంట్రపెన్యూర్‌గా రాణిస్తున్న ఆష్క
నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఎన్ఎస్డీ) స్టూడెంట్ అయిన ఆష్క గొరాదియకు బాలీవుడ్లో బ్రేక్ రాలేదు. అయితే ఆ అసంతృప్తి ఆమె మాటల్లో ఎప్పుడూ తొంగి చూసేది కాదు. ప్రతి అడుగులో ఆత్మవిశ్వాసం కనిపించేది. ఆ ఆత్మవిశ్వాసమే ఆమెను వ్యాపార రంగం వైపు నడిపించింది. ‘రెనీ కాస్మెటిక్స్’తో ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఘనవిజయాన్ని సాధించింది.. బాల నటిగా కెరీర్ మొదలు పెట్టింది ఆష్క గొరాదియ. తన ప్రయాణంలో రకరకాల సవాళ్లు, కష్టాలు ఎదురైనా వెనక్కి తగ్గలేదు. వాటివల్ల పోరాటం ఎలా చేయాలో తనకు తెలిసింది. హిందీ సినిమాల్లో నటిస్తున్న కాలంలోనే హాలీవుడ్ కలలతో అమెరికా వెళ్లింది. అక్కడ పెద్దగా అవకాశాలు రాకపోవడంతో తిరిగి ఇండియాకు వచ్చింది. బాలీవుడ్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి, ఎన్నో టీవి సీరియల్స్‌లో నటించి ‘టీవి స్టార్’గా పేరు తెచ్చుకున్న ఆష్క ఎంటర్‌ప్రెన్యూర్‌గా ప్రయాణం మొదలుపెట్టాలనుకుంది. అయితే అది అంత తేలిక కాదనేది తనకు తెలియని విషయమేమీ కాదు. తన కళ్ల ముందే ఎన్నో అనుభవాలు ఉన్నాయి. అయితే అవేమీ తనకు అడ్డు కాలేదు. మొదటి అడుగుగా సొంతంగా ప్రొడక్షన్ కంపెనీ మొదలుపెట్టిన ఆష్క ఎన్నో సక్సెస్ఫుల్ టీవీ షోలు చేసింది. ఆ తరువాత ట్రావెలర్స్ కోసం ఒక మొబైల్ యాప్ వెంచర్‌ను లాంచ్ చేసింది. ఆ తరువాత స్నేహితులతో కలిసి ప్రారంభించిన ‘రెనీ కాస్మెటిక్స్’ ఆమెను స్టార్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మార్చింది.ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఆష్క ఘనవిజయం ఎంతోమంది ఔత్సాహికులకు స్ఫూర్తి ఇచ్చింది. ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణించాలనుకునే వారికి ఆమె చెప్పిన కొన్ని సలహాలు.. కల కనాలి... ముందుకదలాలి: ఒకరి నుంచి స్ఫూర్తి పొందిన తరువాత కల శ్రీకారం చుట్టుకుంటుంది. అయితే అది సాకారం కావాలంటే ఆచరణలోకి రావాలి. పనికి సంబంధించి స్థాయిని పెంచుకుంటూ పోవాలి. అంకింతభావం ప్లస్ కష్టం: నటన అయినా వ్యాపారమైనా సక్సెస్ కావాలంటే అంకితభావంతో పాటు బాగా కష్టపడాలి. ఒకవేళ విజయం సాధించకపోయినా మనం కన్న కలకు దూరం కావద్దు. ఓటమి నేర్పే పాఠాలతో ముందుకు వెళ్లాలి. సానుకూల ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వాలి. రిస్క్‌కు భయపడితే రిస్క్: ఈతకొట్టడానికి నీళ్లలోకి దిగిన తరువాత నీళ్లకు భయపడితే ఎలా! వ్యాపారం అన్నాక రిస్క్ ఉంటుంది. అంతమాత్రాన వెనక్కి తగ్గనవసరం లేదు. మూస ఆలోచనలకు భిన్నంగా కొత్తగా ఆలోచిస్తే విజయం మన చెంతకు నడిచొస్తుంది. కోవిడ్ కల్లోల సమయంలో ఎన్నో వ్యాపారాలలాగే మా వ్యాపారం కూడా దెబ్బతింది. ‘ఇక నీకు నటనే దిక్కు’ అనేవాళ్లు. అయితే నేనెప్పుడూ నమ్మకం కోల్పోలేదు. మంచిరోజులు వస్తాయని గట్టిగా నమ్మాను. అది నిజమైంది. నెట్వర్క్: నటనకైనా, వ్యాపారానికైనా పదిమందితో పరిచయం ముఖ్యం. ఈవెంట్స్, వర్క్‌షాప్‌లకు హాజరుకావడంతో పాటు ఆన్లైన్ కమ్యూనిటీలతో టచ్‌లో ఉండాలి. సామాజిక సంబంధాల ద్వారా కొత్త విషయాలు తెలుస్తాయి. ఆలోచన పరిధి విస్తరిస్తుంది. ముందుకు వెళ్లడానికి కావాల్సిన ధైర్యం లభిస్తుంది. యుఎస్పీ: ‘మా బ్రాండ్ ఇది’ అని మాత్రమే కాదు ‘మా యూఎస్పీ ఇది’ అని గర్వంగా చెప్పుకోగలగాలి. మా బ్రాండ్ విషయానికి వస్తే హై–క్వాలిటీ, గతంలో ఎప్పుడూ చూడని ప్యాకేజీ, పాకెట్–ఫ్రెండ్లీ ప్రైస్ అనేవి మా యూఎస్పీ. మార్కెట్ ప్లేస్‌లకు వెళుతూ ఎప్పటికప్పుడు ట్రెండ్స్ తెలుసుకోవాలి. ఆష్కకు నటన, యోగా, పోల్ డ్యాన్స్, ట్రావెల్ అంటే ఇష్టం. ఇక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది వాటికంటే రెండు రెట్లు ఎక్కువ ఇష్టమైనది. సినిమాలు, టీవీ సీరియల్స్‌లో ఆష్క‘బిజినెస్ ఉమన్’ పాత్ర ధరించలేదు. అయితే నిజ జీవితంలో మాత్రం ఆమె ‘బిజినెస్ ఉమన్’గా అద్భుత విజయాన్ని సాధించింది. ‘ది బాస్ లేడీ’ అని స్నేహితులతో పిలిపించుకుంటోంది. (చదవండి: పద్నాలుగేళ్లకే ఎలన్ మస్క్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా..) -
యన్‌యస్‌డీ చైర్మన్‌గా పరేష్ రావల్
బాలీవుడ్ విలక్షణ నటుడు పరేష్ రావల్‌కు కొత్త గౌరవం దక్కింది. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (యన్‌యస్‌డీ) చైర్మన్‌గా పరేష్ రావల్‌ను నియమించారు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. ఈ విషయాన్ని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా తెలియజేస్తూ – ‘‘పరేష్ రావల్‌ను యన్‌యస్‌డీ చైర్మన్‌గా నియమించారనే విషయాన్ని తెలియజేయడం ఎంతో ఆనందంగా ఉంది. యన్‌యస్‌డీ ఫ్యామిలీ ఆయన్ను సగౌరవంగా ఆహ్వానిస్తోంది. ఆయన నాయకత్వంలో మరెన్నో మైలురాయిలు అందుకుంటాం’’ అని ట్వీట్ చేసింది. పరేష్ రావల్ నియామకం పట్ల ఇండస్ట్రీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. -
పరేష్ రావల్‌కు కీలక పదవి
సాక్షి, న్యూఢిల్లీ : విలక్షణ నటుడు పరేష్ రావల్‌ను నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా చీఫ్‌గా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నియమించారు. పరేష్ రావల్‌కు నూతన బాధ్యతలను కట్టబెట్టినట్టు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ నిర్ధారించారు. పరేష్ నియామకం పట్ల నటుడికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ఈ నియామకంతో కళాకారులు, విద్యార్ధులకు మేలు చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మూడు దశాబ్ధాలకు పైగా తన సినీ ప్రస్ధానంలో పరేష్ రావల్ జాతీయ ఫిల్మ్ అవార్డు సహా పలు అవార్డులు అందుకున్నారు. సినిమా రంగంలో ఆయన చేసిన సేవలకు గాను 2014లో ఆయనకు పద్మశ్రీ అవార్డు లభించింది. సినిమాలతో పాటు నాటక రంగంలోనూ పరేష్ రావల్ చురుకుగా ఉండేవారు. సినిమాల కంటే నాటకాలనే తాను అమితంగా ప్రేమిస్తానని ఆయన గతంలో పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. చదవండి : అబ్దుల్ కలాం ఫిక్స్ -
థియేటర్ లెజెండ్ ఇబ్రహీం ఇకలేరు
న్యూఢిల్లీ: థియేటర్ లెజెండ్, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా(ఎన్ఎస్డీ) మాజీ డైరెక్టర్ ఇబ్రహీం అల్కాజీ(94) కన్నుమూశారు. నాటక రంగంలో విశిష్ట సేవలు అందించిన ఆయన మంగళవారం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఇబ్రహీం కుమారుడు ఫైజల్ అల్కాజీ ధ్రువీకరించారు. ‘‘తీవ్రమైన గుండెపోటు రావడంతో నాన్నను సోమవారం ఎస్కార్ట్ ఆస్పత్రిలో చేర్పించాం. మంగళవారం ఆయన మరణించారు’’అని పేర్కొన్నారు. బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో రాజకీయ, సినీ ప్రముఖులు ఇబ్రహీంకు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. కాగా ఇబ్రహీం మరణం పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. భారత థియేటర్ రంగానికి విశిష్ట సేవలు అందించి, ఎన్నో తరాలకు స్పూర్తిగా నిలిచిన ఇబ్రహీం లేని లోటు పూడ్చలేనిదని విచారం వ్యక్తం చేశారు. భారత అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ గ్రహీత అయిన ఈ లెజెండ్ వారసత్వాన్ని ఆయన శిష్యులు, కుటుంబ సభ్యులు కొనసాగించాలని ఆకాంక్షించారు. అత్యున్నత పురస్కారాల గ్రహీత ‘ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియన్ థియేటర్’గా ప్రసిద్ధికెక్కిన ఇబ్రహీం అల్కాజీ.. తుగ్లక్(గిరీశ్ కర్నాడ్), అషధ్ కా ఏక్ దిన్(మోహన్ రాకేశ్), అంధా యుగ్(ధర్మవీర్ భారతీ) వంటి ప్రముఖ నాటకాలకు తన దర్శకత్వ ప్రతిభతో ప్రాణం పోశారు. 1962 నుంచి 1977 వరకు ఎన్ఎస్డీ డైరెక్టర్‌గా కొనసాగిన ఆయన ఎంతో మందికి నటనలో శిక్షణ ఇచ్చి గొప్ప నటులుగా తీర్చిదిద్దారు. నసీరుద్దీన్ షా, ఓంపురి వంటి బాలీవుడ్ ప్రముఖులు ఆయన వద్దే పాఠాలు నేర్చుకున్నారు. ఇబ్రహీం ఇద్దరు పిల్లలు కూడా థియేటర్ ఆర్టిస్టులుగా రాణిస్తూ ఆయన నటనా వారసత్వాన్ని నిలబెడుతున్నారు. కళా రంగానికి అందించిన సేవలకు గానూ భారత ప్రభుత్వ ఆయనను పద్మశ్రీ(1966), పద్మభూషణ్(1991), పద్మ విభూషణ్(2010) పురస్కారాలతో సత్కరించింది. -
ప్రాణం పోయినా సరే... పని జరగాలి!
‘ఎక్కడ ఉన్నా సరే మసూద్ భాయ్ మనకు కావాలి.మన ప్రాణాలు పోయినా సరే’ లివాటు వ్యవహారం, పెంకితనం, మూర్ఖత్వం కలగలిసిన ‘ఆకాశ్’గా ‘ఛత్రపతి’లో నటించినా, ప్రాణాలు పోయినా సరే అనుకున్నది సాధించాలనే కరడుగట్టిన ఉగ్రవాది అజార్గా ‘ఖడ్గం’ సినిమాలో కనిపించినా... దుర్మార్గంలోని రకరకాల ఫ్లేవర్స్‌ను నేర్పుగా ప్రకటించగలిగే నటుడు షఫీ. ఢిల్లీలోని ‘నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా’లో చదువుకున్న ఈ చంద్రగిరి కుర్రాడు పెద్ద పెద్ద వాళ్ల దగ్గర నటనలో మెళకువలు నేర్చుకున్నాడు. ఏ పాత్ర చేస్తే ఆ పాత్రలో ఒదిగిపోయేంత నైపుణ్యాన్ని సాధించాడు. ‘ఖడ్గం’ సినిమాతో వెండితెరకు పరిచయమైన షఫీ, ‘ఛత్రపతి’ సినిమాలో విలన్‌తో చేతులు కలిపిన కథానాయకుడి తమ్ముడు ‘ఆకాశ్’గా అద్భుతమైన నటనను ప్రదర్శించాడు.‘‘నేను రైటర్, డైరెక్టర్, యాక్టర్‌ని’’ అని చెప్పుకునే షఫీలో ‘నేను ఇలా అనుకుంటున్నాను. ఇలా మాత్రమే నటిస్తాను’ అనే పట్టింపులేమీ లేవు. ఆయన దృష్టిలో రచయితకు, దర్శకుడికి మంచి ప్రాధాన్యత ఉంది. రచయిత ఊహలకు డైరెక్టర్ ఒక రూపం కల్పిస్తే నటుడు దానికి ప్రాణం పోస్తాడు అని నమ్ముతాడు షఫీ. ‘నా నుంచి డైరెక్టర్ తీసుకున్నట్లే... డైరెక్టర్ నుంచి కూడా నేను తీసుకుంటాను’ అంటాడు. అంత మాత్రాన భారం మొత్తం ఆ ఇద్దరి మీదే వేయడు. తాను చేస్తున్న పాత్రలో జీవం తీసుకురావడానికి రకరకాలుగా కసరత్తులు చేస్తుంటాడు.‘శ్యామ్‌గోపాల్‌వర్మ’ సినిమా కోసం ఎన్నో పుస్తకాలు చదివి, ఎంతో మంది వ్యక్తులను ఇంటర్వూ్య తీసుకొని నోట్స్ రాసుకున్నా, ‘కమ్లీ’ సినిమాలో రేడ్యా పాత్ర కోసం మహబూబ్‌నగర్ కూలీలను కలిసి వారి వేషభాషలు అధ్యయనం చేసినా, ‘ఖడ్గం’ సినిమా కోసం చార్మినార్ ప్రాంతంలో అద్దెకు ఉన్నా.... ఒక పాత్ర పండించడం కోసం చేయాల్సినంత హోంవర్క్ చేయడంలో ముందుంటాడు షఫీ. ‘డబ్బులు ముఖ్యం కాదు...సంతృప్తి ముఖ్యం’ అంటున్న షఫీ ఆచితూచి పాత్రలను ఎంచుకుంటాడు. ఒక్కసారి ఓకే అన్నాక...దానికి వందశాతం న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాడు. ‘ఖడ్గం’లో అజార్ నుంచి ‘శివమ్’లో ముస్తాఫా వరకు, ‘రెడీ’లో నాగప్ప నుంచి ‘ఖలేజా’లో సిద్దప్ప వరకు రకరకాల పాత్రలను విజయవంతంగా పండించాడు షఫీ.‘నటుడు తెల్లటి కాన్వాస్లాంటి వాడు’ అంటున్న షఫీ ఆ కాన్వాస్‌పై ‘విలన్’ అనే పెయింటింగ్‌ను అద్భుతంగా తీర్చిదిద్ది ‘ఉత్తమ విలన్’ అనిపించుకున్నాడు. -
ముగిసిన ఆదిరంగ్
-
ఆదిరంగ్ కళల తరంగ్
-
బ్యాక్ టు ప్లే
వెటరన్ బాలీవుడ్ నటుడు ఓమ్ పురి మనసు మళ్లీ నాటకాల వైపు మళ్లింది. నాలుగు దశాబ్దాల కిందట రంగస్థలానికి దూరమైన ఓమ్.. వెండితెరపై తన సత్తా చాటుకున్నాడు. తాజాగా నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో జరిగిన ఓ ఈవెంట్‌కు హాజరైన ఈ నటుడు.. అక్కడ తన మనసులో మాట బయటపెట్టాడు. తనను ఇంతవాణ్ని చేసిన రంగస్థలానికి ఎప్పుడూ రుణపడి ఉంటానని చెప్పిన ఓమ్పురి.. మళ్లీ నాటకాలాడతానని సభాముఖంగా ప్రకటించాడు. ఓం నిర్ణయాన్ని అక్కడున్నవారంతా కరతాళధ్వనులతో ఆహ్వానించడం కొసమెరుపు. -
ముగిసిన వేడుక
-
ఆకట్టుకున్న ‘కలోసునఖరీ’
-
అక్కడ...నాటకానికి అద్భుత ఆదరణ!
నూటపది సంవత్సరాలకు పైగా నాటకరంగ వికాసానికి కృషి చేస్తోంది ఇంగ్లండ్‌కు చెందిన ‘రాయల్ అకాడెమీ ఆఫ్ డ్రమటిక్ ఆర్ట్స్’ (RADA) విద్యార్థుల మార్పిడి కార్యక్రమంలో భాగంగా ఈ సంస్థ ఏటా ఒక విద్యార్థిని మన దేశానికి పంపిస్తుంది. మన దేశం నుంచి ఒక విద్యార్థిని తమ దేశానికి ఆహ్వానిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేస్తోన్న ‘నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా’ పోస్ట్‌గ్రాడ్యుయేట్ శివ తూము ఈ సంవత్సరం ‘రాడా’ ఆహ్వానానికి ఎంపికయ్యారు. ఇటీవల లండన్‌లో పర్యటించి వచ్చిన శివ తూముతో జరిపిన ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు... కొత్తవిషయాలు తెలుసుకున్నాను... నగరానికి నడిబొడ్డున బ్రిటిష్ మ్యూజియం పక్కనే విడిది. నడచి వెళ్లి చాలా విశేషాలు చూసేందుకు అనువైన ప్లేస్. ‘రాడా’ టెక్నికల్ డెరైక్టర్ నీల్ ఫ్రేజర్‌కు నన్ను పరిచయం చేశారు. ఫ్రేజర్ నా పర్యటన ఫలవంతం కావడానికి సహకరించారు. షేక్స్పియర్ సమకాలీన ‘గ్లోబ్’ థియేటర్ చూశాను. బ్రిటిష్ మ్యూజియం, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సందర్శించాను. థియేటర్ రంగంలో సాంకేతిక విషయాలను గమనించడం నా పర్యటన లక్ష్యం. రంగాలంకరణ- సౌండ్ -లైటింగ్-దర్శకత్వం తదితర అంశాల్లో పనిచేసిన నేను టెక్నికల్ అంశాలను తెలుసుకునేందుకు ఈ పర్యటనలో ప్రాధాన్యతనిచ్చాను. అక్కడి నాటకాల్లో స్టేజ్ మేనేజర్ ముఖ్యమైన వ్యక్తి. డిప్యూటీ స్టేజ్ మేనేజర్, ప్రాపర్టీ ఇన్చార్జ్, సెట్ ఇంచార్జ్, లైటింగ్ డిజైనర్, లైటింగ్ ఆపరేటర్, సౌండ్ డిజైనర్, సౌండ్ ఆపరేటర్లు స్టేజ్ మేనేజర్ టీమ్‌లో పనిచేస్తారు. స్క్రిప్ట్‌ను చదవడం, రిహార్సల్స్ దశ నుంచి తుది ప్రదర్శన వరకూ ఎవరి విధివిధానాలు వారికి స్పష్టంగా ఉంటాయి. ప్రదర్శనలో ప్రమాదాలకు ఆస్కారం లేకుండా హెల్మెట్, షాక్ ప్రూఫ్ షూస్ ధరిస్తారు. ప్రేక్షకుల దృష్టిలో పడకుండా నల్లటి దుస్తులు ధరిస్తారు. ప్రత్యేక నిపుణులు ఉంటారు... అక్కడ విజయవంతంగా ప్రదర్శింపబడుతోన్న మూడు నాటకాలు : మార్టిన్ షెర్మన్ రచన ‘వెన్ షి డాన్స్‌డ్’ సారాకేన్ రచన ‘ఫెడ్రియాస్ లవ్’ విలియం కాంగ్రెవ్ రచన ‘లవ్ ఫర్ లవ్’ చూశాను. స్టేజ్ నిర్వహణ, టైమ్ షెడ్యూల్ తదితర అంశాల్లో వారికి స్పష్టత ఉంది. ‘అందరూ అన్నీ చేయడం’ అనే దశలను చాలాకాలం క్రితం దాటారు. మనకు వైద్యంలో స్పెషలిస్ట్లున్నట్లుగా వారికి థియేటర్ ఆర్ట్స్‌లో ఒక్కో అంశానికి ఒక్కో ప్రత్యేక నిపుణులుంటారు. సెట్లు సెకనుల్లో మారిపోతాయి. పెద్దపెద్ద సెట్లను అమర్చేందుకు, తొలగించేందుకు దాదాపు 150 మంది ట్రైన్డ్ పర్సన్స్ చకచకా పనిచేస్తుంటారు. మ్యూజికల్స్ చూశాను... నటీనటులు పాడుతోండగా లైవ్ మ్యూజిక్ పర్ఫామ్ చేసే ప్రదర్శనలను మ్యూజికల్స్ అంటారు. ‘మెర్రీలీ వి రోల్డ్ ఎలాంగ్’ ఐదు సంవత్సరాలుగా ప్రదర్శిస్తున్నారు. 23 పౌండ్లు టికెట్. ‘పాంథమ్ ఆఫ్ ఒపేరా’, ‘విమెన్ ఇన్ బ్లాక్’ మ్యూజికల్స్ 27 సంవత్సరాలుగా ప్రదర్శిస్తున్నారు. ఈ హారర్ నాటకం చూసి భయపడకూడదు అని నిర్ణయించుకుని ఏ మేరకు భయపడలేదో తెలుసుకునేందుకు మళ్లీమళ్లీ వచ్చే ప్రేక్షకులుండడం గమనార్హం. ‘మౌస్ ట్రాప్’ అరవయ్యేళ్లుగా ప్రదర్శిస్తున్నారు. మ్యూజికల్స్ టికెట్ ధర మనలెక్కలో దాదాపు రెండువేల నుంచి పదివేల రూపాయలు. లండన్‌లో వీధినాటకాలకూ మంచి ఆదరణ ఉంది. వివిధ చారిత్రక వ్యక్తుల వేషాలతో శిల్పంలా నిలుచుంటారు. సంగీతం పాడుతుంటారు. మ్యాజిక్‌లు చేస్తుంటారు. మంచి జీవితం గడపడానికి వీలైన ఆదరణను సామాన్యుల నుంచి పొందుతుంటారు. నాటకాన్ని లైవ్ టెలికాస్ట్ చేశారు... అకాడెమీ (ఆస్కార్), కేన్స్, ఎమ్మీ, గోల్డెన్ గ్లోబ్ అవార్డులు స్వంతం చేసుకున్న ప్రముఖ హాలివుడ్ నటి హెలెన్ మిర్రెన్ తరచూ నాటకాల్లో నటిస్తారు. ఎలిజెబెత్ రాణి-ప్రధానమంత్రి భేటీ తదితర సెటైర్కల్ అంశాలతో పీటర్ మోర్గాన్ నటించిన ‘ద ఆడియన్స్’ అనే నాటకంలో ఆమె నటించారు. ఆ నాటకాన్ని డిజిటల్ ఫామ్‌లో మల్టిప్లెక్స్లాంటి థియేటర్లలో లైవ్ టెలికాస్ట్ చేశారు, పది పౌండ్ల టికెట్‌తో. థియేటర్లన్నీ కిటకిటలాడాయి. ఒక హాలీవుడ్ సినిమా రిలీజైన రోజే చూశాను. 20కి ఎక్కువ 30కి తక్కువ సంఖ్యలో ప్రేక్షకులున్నారు. ఇంగ్లండ్ నాటకరంగం హాలీవుడ్ నటులను కూడా టెంప్ట్ చేసే స్థితిలో ఉందని ఈ రెండు సంఘటనల ద్వారా గ్రహించాను. భారీ పారితోషకాలు! హాలీవుడ్ నటీనటులు సాంకేతిక నిపుణులకు తగిన భారీ పారితోషకాలు ఇవ్వగల స్థాయిలో అక్కడ థియేటర్ ఇండస్ట్రీ ఉంది. మనకు ఫిలిం ఇండస్ట్రీ ఉంది. థియేటర్ ఇండస్ట్రీని ఊహించగలమా! నాటకాలు అనే నిచ్చెన ఎక్కి సినిమా అనే పరమపదసోపానపటంలో ‘పండిపోవడం’ అనే రీతిలో మనమున్నాం! ప్రభుత్వ ప్రోత్సాహకాలను ఆశించడం, నాటకాభిమానుల నుంచి చందాలు వసూలు చేయడం మన నాటకరంగానికి తప్పనిసరి అవుతోంది. మన థియేటర్ ఎవరి దయాదాక్షిణ్యాలూ అవసరం లేని స్థాయికి రావాలని, అందుకు తగిన ‘ఇండస్ట్రీ’ ఏర్పడాలని ఆశిద్దాం. - పున్నా కృష్ణమూర్తి