
బ్యాక్ టు ప్లే
వెటరన్ బాలీవుడ్ నటుడు ఓమ్ పురి మనసు మళ్లీ నాటకాల వైపు మళ్లింది. నాలుగు దశాబ్దాల కిందట రంగస్థలానికి దూరమైన ఓమ్.. వెండితెరపై తన సత్తా చాటుకున్నాడు. తాజాగా నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో జరిగిన ఓ ఈవెంట్‌కు హాజరైన ఈ నటుడు.. అక్కడ తన మనసులో మాట బయటపెట్టాడు. తనను ఇంతవాణ్ని చేసిన రంగస్థలానికి ఎప్పుడూ రుణపడి ఉంటానని చెప్పిన ఓమ్‌పురి.. మళ్లీ నాటకాలాడతానని సభాముఖంగా ప్రకటించాడు. ఓం నిర్ణయాన్ని అక్కడున్నవారంతా కరతాళధ్వనులతో ఆహ్వానించడం కొసమెరుపు.