Om Puri
-
ఓంపురి మృతిపై ‘ఏడీఆర్’ కేసు
ముంబై: ప్రముఖ సినీనటుడు ఓంపురి మృతికి సంబంధించి ముంబై పోలీసులు ‘ప్రమాదం వల్ల మరణించినట్లు’(ఏడీఆర్) శనివారం కేసు నమోదు చేశారు. స్వగృహంలో ఒంటరిగా ఉంటున్న ఓంపురి శుక్రవారం గుండెపోటుతో చనిపోవడం తెలిసిందే. గుండెపోటు తర్వాత వంటగదిలో నేలపై కుప్పకూలిపోయిన ఆయనకు గాయం కూడా అయ్యింది. సాధారణ ప్రక్రియ కింద ఏడీఆర్ నమోదు చేశామని, ఓంపురి మృతిపై ఇంతవరకు అనుమానించదగ్గ అంశమేదీ బయటపడలేదని పోలీసులు తెలిపారు. -
దివికేగిన నటశిఖరం
-
ఓం పురి (బాలీవుడ్ నటుడు) రాయని డైరీ
మనాలిలో దిగాం. ‘దిగాం’ కాదు, ‘ఎక్కాం’! గొప్ప ఔన్నత్యంతో ఉంటుంది మనాలి ఎప్పుడూ. ఫ్లయిట్‌లోంచి కిందికి దిగినా, మనాలిలో అది పైకి ఎక్కడమే. ఫ్లైట్లు, హైట్లు అన్నీ మనాలి పాదాల దగ్గర ఒత్తిగిలాల్సిందే. మనిషి చేసే ఈ స్కీయింగ్, ట్రెక్కింగ్, గ్లైడింగ్, రాఫ్టింగ్.. అన్నీ పిల్లాటల్లా కనిపిస్తాయేమో మనాలికి! ‘ట్యూబ్‌లైట్’ షూటింగ్‌కి వచ్చాం. దేశభక్తి చిత్రం. ఇండో చైనా వార్ అండ్ లవ్ మూవీ. పూర్తవొచ్చింది. కబీర్‌ఖాన్, సల్మాన్, మిగతా ఆర్టిస్టులు చాయ్ తాగుతూ డిబేట్లో పడిపోయారు. కశ్మీర్... క్రికెట్.. కరణ్‌జోహార్. ఏ దిల్ హై ముష్కిల్! ఏ టాపిక్ మీదైనా డిబేట్ జరగొచ్చు. డిబేట్ మాత్రం టాపిక్ కాకూడదు. డిబేట్‌ను వదిలేసి చాయ్ గ్లాసు పట్టుకుని కూర్చున్నాను. డిబేట్లలో కూర్చున్నప్పుడు చాయ్ తాగుతున్నంత సుఖంగా ఏమీ ఉండదు. మనది కాని మాట మన నోట్లోంచి వచ్చేస్తుంది! దేవుడా. అది మనం అనుకున్న మాట అయుండదు. మనం అనాలనుకున్న మాట కూడా అయుండదు. అయినా అనేస్తాం. ఎవరి కడుపులోనిదో మన నోట్లోంచి రావడం ఎంత దరిద్రం!! మొన్న నా బర్త్‌డేకి ఎటావా వెళ్లినప్పుడు బల్బీర్ యాదవ్‌తో ఇదేమాట అన్నాను. ‘దరిద్రం నా నెత్తికెక్కింది. మీ పాదాల దగ్గర నాకు నేను చితిపేర్చుకుని దగ్ధమై పోవడానికి వచ్చాను’ అన్నాను. ‘పుట్టిన రోజు అదేం మాట’ అన్నారు బల్బీర్ పెద్ద మనసుతో నన్ను దగ్గరకు తీసుకుంటూ! దూరంగా జరిగాను. ఆయన నన్ను హత్తుకోబోయారు. ఆ చేతుల్లో ఒత్తిగిలే అర్హతే నాకు లేదు. మనాలి కన్నా ఉన్నతుడిలా ఉన్నాడాయన. చేతులు జోడించాను. ఆయన కొడుకు సైనికుడు. అమర వీరుడు. సరిహద్దు కాల్పుల్లో అతడు చనిపోయినప్పుడు, టీవీలో నేను అన్న మాటకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఆ కుటుంబాన్ని వెతుక్కుంటూ ఎటావా వెళ్లాను. ఎంత అశుద్ధం నా నోట్లోంచి! ‘ఆర్మీలో చేరమని వారినెవరు బలవంతం చేశారు?’ అన్నాను. నిజానికి నా ఉద్దేశం అది కాదు. ఇంకొకటేదో! ఆ ఇంకొకటి సైనికులను తక్కువ చేసేది కాదని మాత్రం చెప్పగలను. నా మనసులో ప్రతి సైనికుడి మీద గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని ఒక గౌరవ వందనంలా డిబేట్లో వినిపించలేక పోయాను. మా నాన్న సైనికుడు. నేనూ ఒకప్పుడు సైన్యంలో చేరాలని తపించినవాడినే. కానీ నా మాట మిస్‌ఫైర్ అయింది. అది మా నాన్నను అవమానించినట్టు. నా దేశాన్ని అవమానించినట్టు. ఇంకో దేశం అయితే నన్ను ఉరితీసి ఉండేది. ఆ అమర వీరుడి ఫొటో ముందు తలబద్దలు కొట్టుకుంటున్నాను. ‘జీ ఆప్ ఠీక్ హో’ అన్నారు సల్మాన్ నా దగ్గరికొచ్చి. ‘ఏక్ దమ్ ఠీక్ హు సల్మాన్‌జీ’ అన్నాను. ‘ఎక్కడికో వెళ్లిపోయారు’ అంటున్నాడు నవ్వుతూ. వెళ్లిపోలేదు. ఉండిపోయాను.. ఎటావాలో. నా కొత్త బర్త్ ప్లేస్ అది. -మాధవ్ శింగరాజు -
ఆర్మీ నన్ను శిక్షించాలి : ఓం పురీ
అమరవీరులైన భారత ఆర్మీ జవాన్లపై తను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సీనియర్ నటుడు ఓం పురి క్షమాపణ చెప్పుకున్నారు. ఆర్మీ తనను శిక్షించాలని, ఆర్మీ జోన్‌కు పంపించి యుద్ధం ఎలా చేయాలో నేర్పించాలని క్షమాపణ ప్రకటనలో తెలిపారు. భారత జవాన్లను ఎవరు ఆర్మీలో చేరమన్నారు? ఎవరు వారిని ఆయుధాలు పట్టుకోమన్నారంటూ ఓ న్యూస్ చానల్ చర్చాకార్యక్రమంలో ఓం పురి రెచ్చిపోయారు. అమరవీరులైన ఆర్మీ జవాన్లపై ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు ఓం పురిపై పోలీసు స్టేషన్లలో కేసు కూడా నమోదైంది. ఈ కేసు నమోదు అనంతరం ఓం పురికి తన తప్పు తెలుసొచ్చినట్టై వెంటనే ఆర్మీకి క్షమాపణ చెప్పారు. తనది క్షమించరాని నేరమని, వెంటనే తనని శిక్షించమని ప్రాదేయపడ్డారు. మొదట తాను ఉడి ఉగ్రఘటనలో అమరవీరుల కుటుంబసభ్యులకు క్షమాపణ చెబుతానని చెప్పారు. ఒకవేళ వారు క్షమిస్తే, దేశాన్ని, ఆర్మీని క్షమాపణ కోరతానన్నారు. తనకు తాను కూడా ఓం పురి భారీ శిక్షే విధించుకున్నారు. తనని యుద్ద ప్రాంతంలోకి పంపాలని, దేశ రక్షణలో ఆర్మీజవాన్లకు సహకరిస్తానని చెప్పారు. ఆయుధాలను ఎలా వాడాలో ఆర్మీ తనకు నేర్పించాలని, ఎక్కడైతే ఆర్మీ జవాన్లు తమ ప్రాణాలను దేశానికి త్యాగం చేశారో ఆ ప్రాంతంలోకి తనను పంపించాలని ప్రాదేయపడ్డారు. క్షమించాలని మాత్రమే తాను కోరుకోవడం లేదని, తనను కచ్చితంగా శిక్షించాలని కోరుతున్నట్టు ఓం పురి తెలిపారు. పాకిస్తానీ నటులపై భారత్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్(ఐఎమ్పీపీఏ)నిషేధం విధించడంతో ఆయన ఆర్మీ జవాన్లపై అవమానకర వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలపై దేశమంతటా చర్చనీయాంశంగా మారాయి. పలువురు బాలీవుడ్ నటులు ఆయన వ్యాఖ్యలను ఖండించారు. జవాన్లను ఎవరైనా ఆర్మీలో చేరమని బలవంతం పెట్టారా? అని ఓం పురి వ్యాఖ్యానించారు. -
సీనియర్ నటుడిపై కేసు నమోదు
ముంబై: భారత సైన్యంపై ఓ టీవీ చర్చ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ సీనియర్ నటుడు ఓంపురిపై ముంబైలో కేసు నమోదైంది. భారత సైన్యాన్ని ఆయన అవమానించారంటూ అంధేరి పోలీసు స్టేషన్లో ఆయనపై కేసు నమోదు చేశారు. భారత్‌లో పాకిస్థాన్ కళాకారులు పనిచేయడాన్ని బలంగా సమర్థించిన ఓంపురి ఓ టీవీ చానెల్ చర్చలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘సైన్యంలో చేరమని వాళ్లని ఎవరు బలవంతపెట్టారు. మా నాన్న సైన్యంలో ఉన్నారు. మేం సైనికులను చూసి గర్వపడతాం. కానీ భారత్-పాకిస్థాన్.. ఇజ్రాయెల్, పాలస్తీనాలాగా కావాలని మీరు కోరుకుంటున్నారా?’ అని ఆయన పేర్కొన్నారు. ‘సల్మాన్ ఖానా? ఇంకో ఖానా అన్నది కాదు. నేరుగా ప్రధాని మోదీజీ వద్దకే వెళ్లి.. పాకిస్థానీ నటుల వీసాలను రద్దు చేయించండి. 15, 20మంది ఆత్మాహుతి బాంబర్లుగా తయారుచేసి పాక్ మీదకు పంపండి’ అని ఓంపురి అన్నారు. ఓంపురి వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. బాలీవుడ్ సినీ ప్రముఖులు అనుపమ్ ఖేర్, అశోక్ పండిట్ సహా పలువురు ఆయన వ్యాఖ్యలను తప్పుబట్టారు. భారత సైన్యాన్ని కించపరిచేలా మాట్లాడటం తగదని అన్నారు. -
భారత సైన్యంపై ఓం పురి వివాదాస్పద వ్యాఖ్యలు
ఉడీ ఘటన అనంతరం పాకిస్తాన్ నటులపై భారత్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్(ఐఎమ్పీపీఏ) విధించిన నిషేధ నేపథ్యంలో ప్రముఖ నటుడు ఓం పురి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉడీ ఘటనలో అమరవీరులైన భారత సైన్యంపై ఆయన అవమానకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వివాదం రాజుకున్నాయి. పాకిస్తానీ నటులపై ఐఎమ్పీపీఏ తీసుకున్న నిషేధంపై ఓ ప్రముఖ న్యూస్ చానల్ చర్చ నిర్వహించింది. ఆ చర్చలో ఉడీ ఉగ్రదాడిలో అసువులు బాసిన 18 వీర జవాన్లపై ఓం పురి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓం పురి చేసిన వ్యాఖ్యలు ఈ విధంగా ఉన్నాయి.." ఎవరు వారిని(భారత సైన్యాన్ని) ఆర్మీలో చేరమన్నారు? ఎవరు వారిని ఆయుధాలు పట్టుకోమన్నారు. మేమేమి జవాన్లను ఆర్మీలో చేరమని చెప్పలేదుగా.15 నుంచి 20 మానవ బాంబులు తయారుచేయండి. పాకిస్తాన్‌ను పేల్చడానికి వాటిని వాడండి. ఇజ్రాయిల్, పాలస్తీనా మాదిరి భారత్-పాకిస్తాన్‌లు కూడా యుగయుగాలుగా శత్రువులుగా మారలనుకుంటున్నారా? కోట్లమంది ముస్లింలకు భారత్ పుట్టినిల్లు. భారత్-పాకిస్తాన్ విభజన అంటే కేవలం దేశాల విభజనే మాత్రమే కాదు, కుటుంబాలు విడిపోవడం కూడా. భారతీయుల కుటుంబసభ్యులు అక్కడ ఉన్నారు. అక్కడ వారు ఇక్కడా ఉన్నారు. సరిహద్దు కుటుంబాలు ఎలా యుద్ధం చేసుకుంటారు?. పాకిస్తాన్ నటులను, సెలబ్రిటీలపై నిజంగా నిషేధం విధించాలంటే, భారత ప్రభుత్వాన్ని వారి వీసాలు రద్దు చేయమనండి" అంటూ న్యూస్ చానల్ చర్చా కార్యక్రమంలో రెచ్చిపోయారు. ముందు కూడా పాకిస్తాన్ నటులకు ఆయన మద్దతిచ్చారు. వాలిడ్ వీసాతో వారు ఇక్కడ పనిచేస్తున్నారని, వారిని నిషేధించడం సరికాదన్నారు. పాకిస్తానీ నటులపై నిషేధం, పరిస్థితుల్లో మార్పు తేవన్నారు. దీంతో ఓం పురి వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. -
పాకిస్థాన్ లో ఓం పురి..!
ఇస్లామాబాద్ః 'యాక్టర్ ఇన్ లా' అనే పాకిస్థానీ సినిమాలో నటించిన వెటరన్ నటుడు ఓం పురి.. ఆ సినిమా ప్రమోషన్ కోసం పాకిస్థాన్ వెళ్ళారు. లాహోర్ లో ఆయన తన పాకిస్థానీ అభిమానులను కలుసుకోవడంతోపాటు.. తన సినిమా చూడాలంటూ కోరారు. అలాగే ఇతర పాకిస్థానీ నగరాల్లో కూడా ఓం పురి చిత్రం కోసం ప్రచారం చేస్తున్నారు. ఫహద్ ముస్తాఫా, మెహ్విష్ హయత్ లు 'యాక్టర్ ఇన్ లా' సినిమాలలో ప్రధాన భూమికలు పోషిస్తున్నారు. వీరు కాకుండా ఓంపురితోబాటు రెహన్ షేక్, తలత్ హుసేన్ కూడా నటిస్తున్నారు. అత్యంత సున్నితమైన నేపథ్యంలో నడిచే ఈ పాకిస్తానీ చిత్రం అక్కడి ప్రజల మనసుల్ని దోచుకుంటుందన్న ఆశాభావాన్ని ఓం పురి వ్యక్తం చేస్తున్నారు. నబీల్ ఖురేషి దర్శకత్వంలో రూపొందిన ఈ ఉర్దూ చిత్రం సెప్టెంబర్ 13న విడుదలయ్యేందుకు సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది. -
65 ఏళ్ల వయసులో ఓంపురి సంచలన నిర్ణయం
ముంబై: సీనియర్ నటుడు ఓం పురి దంపతులు విడిపోయారు. అయితే వాళ్లకు కోర్టు మాత్రం విడాకులు మంజూరు చేయలేదు. 26 ఏళ్ల క్రితం పెళ్లయిన ఓంపురి, నందిత దంపతులు విడాకులు కావాలంటూ కోర్టు మెట్లు ఎక్కారు. అయితే తర్వాత ఇద్దరూ రాజీకి రావడంతో కోర్టు వారికి 'జ్యుడీషియల్ సెపరేషన్' మంజూరు చేసింది. దీని ప్రకారం వాళ్లిద్దరూ చట్ట ప్రకారం భార్యాభర్తలుగానే ఉంటారు గానీ.. విడివిడిగా ఉండాలి. ఒకరి వ్యవహారాల్లో మరొకరు జోక్యం చేసుకోకూడదు. కొడుకు ఇషాన్ (18) బాగోగులను మాత్రం ఇద్దరూ చూసుకుంటారు. మొత్తానికి 65 ఏళ్ల వయసులో ఓంపురి భార్య నుంచి విడిపోవాలన్న సంచలన నిర్ణయం తీసుకున్నారు! అయితే.. కోర్టు వీళ్లకు ఓ నిబంధన కూడా విధించింది. ఒకవేళ మళ్లీ వీళ్లు తిరిగి ఎప్పుడు కలవాలన్నా.. ఓ థర్డ్ పార్టీ సమక్షంలోనే కలుసుకోవాలని షరతు విధించింది. అలాగే ఓంపురికి తన 18 ఏళ్ల కొడుకుని కలుసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. దీంతో ఇద్దరూ ఒకరిపై మరొకరు పెట్టిన కేసులను ఉపసంహరించుకున్నారు. భవిష్యత్తులో మళ్లీ మీరు కలిసి జీవించే అవకాశం ఉందా అని మీడియా ప్రశ్నించినపుడు.. చెప్పలేం అని నందిత సమాధానమిచ్చారు. అసలు గొడవ ఎలా వచ్చిందంటే.. సుదీర్ఘ కాలం పాటు సంసార జీవితాన్ని గడిపిన ఓంపురి, నందితలకు అసలు గొడవ ఓ పుస్తకం కారణంగా వచ్చింది. 2009లో 'అన్ లైక్లీ హీరో, ది స్టోరీ అఫ్ ఓంపురి' అంటూ ఆయన జీవిత చరిత్ర పుస్తకాన్ని నందిత రాసి విడుదల చేశారు. దాంట్లో ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన, ఓంపురికి సంబంధించిన కొన్ని అభ్యంతరకర శృంగార ఘటనలను ప్రచురించడం, అది కూడా చాలా అగౌరవకరంగా ఉండటంతో ఓంపురికి ఎక్కడలేని కోపం వచ్చింది. అప్పటి నుంచి వారి మధ్య వివాదం రాజుకుంది. ఈ నేపథ్యంలోనే భర్త తనపై దాడి చేశాడంటూ ముంబైలోని వెర్సోవా పోలీసుస్టేషన్లో గృహహింస కేసును నమోదుచేసిన సంగతి తెలిసిందే. -
సెల్ఫీలంటూ చావగొడుతున్నారు
- పాకిస్థానీ అభిమానులను ఉద్దేశించి ఓంపురి సరదా వ్యాఖ్య - 'యాక్టర్ ఇన్ లా'తో దాయాది గడ్డపై సీనియర్ నటుడి అరంగేట్రం ఇస్లామాబాద్: తనదైన విలక్షణ శైలితో గొప్ప నటుడిగా పేరుపొందిన ఓంపురి.. తొలిసారి దాయాదిదేశపు వెండితెరపై అలరించనున్నారు. ఆయన నటించిన పాకిస్థానీ చిత్రం 'యాక్టర్ ఇన్ లా' విడుదలకు సిద్ధమైంది. సినిమా ప్రమోషన్ లో భాగంగా యూనిట్ తో కలిసి సోమవారం ఇస్లామాబాద్ లో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. పాకిస్థానీలు తనను ఆదరిస్తున్న తీరకు ముగ్థుణ్నవుతున్నానని ఓంపురి అన్నారు. 'పాకిస్థాన్ వచ్చానని తెలిస్తేచాలు తెలిసినవాళ్లు ఫోన్లమీద ఫోన్లు చేస్తుంటారు. ఎప్పుడైనా బయటికి వెళ్తానా.. సెల్ఫీ దిగాలంటూ అభిమానులు చావగొడుతున్నారు. వాళ్లలా అడగటం నాకూ ఇష్టమే' అని ఓంపురి సరదాగా వ్యాఖ్యానించారు. పాకిస్థానీలతో తన బంధం రెండు దశాబ్ధాలనాటిదని, ఇరుదేశాల ప్రజల మధ్య ఉన్న ప్రేమానురాగాలు చూస్తే ఇండియా- పాకిస్థాన్ లు తగువులాడుకోవటం విస్మయం కలిగిస్తుందని, ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. 40 ఏళ్ల కెరీర్ లో తొలి ఐటమ్ సాంగ్!? షానీ అర్షద్ ద్వయం సంగీతం అందిస్తున్న 'యాక్టర్ ఇన్ లా' సినిమాలోని నాలుగు పాటల్లో ఒకటి ఐటమ్ సాంగ్. సినిమాలో ప్రాధాన్యం ఉన్న పాత్ర పోశిస్తోన్న ఓంపురి ఐటమ్ సాంగ్ లోనూ కనిపిస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై దర్శకుడు నబీల్ ఖురేషీ మాట్లాడుతూ.. 'అలా ప్రచార జరగటం మంచిదే. ఎందుకంటే 40 ఏళ్ల కెరీర్ లో ఓంపురి ఏనాడూ ఐటమ్ సాంగ్ లో కినిపించలేదు. ఇలానైనా ఆ రికార్డ్ బ్రేక్ అవుతుందేమో' అని అన్నారు. -
నటుణ్ని కాకుంటే ప్రధానమంత్రి అయ్యుండేవాడిని
లాహోర్: 'రైల్వే గోడౌన్ లో పనిచేసిన మా నాన్న సిమెంట్ దొంగతనం కేసులో జైలు పాలయ్యాడు. ఉద్యోగంలో నుంచి తీసేయడంతో రైల్వే క్వార్టర్స్ ఖాళీచేయాల్సివచ్చింది. అమ్మా, అన్నయ్య, నేను రోడ్డున పడ్డాం. అప్పుడు నాకు ఆరేళ్లు. కుటుంబపోషణ కోసం అన్నయ్య స్టేషన్ లోనే కూలీగా మారాడు. నేనేమో అంగట్లో టీ అమ్మేవాణ్ని' అంటూ పొరుగుదేశస్తులతో తన చిన్ననాటి సంగతులు గుర్తుచేసుకున్నారు లిజెండరీ యాక్టర్ ఓంపురి. లాహోర్ లోని అలహమ్రా ఆర్ట్ సెంటర్ లో ప్రారంభమైన అంతర్జాతయ చలనచిత్రోత్సవంలో పాల్గొన్న ఆయన భారత్- పాక్ సంబంధాలపై మనసులోని మాటలు బయటపెట్టారు. ఇరుదేశాల మధ్య ప్రతిబంధకాలనే తాళాలు వేసున్నప్పటికీ, వాటిని తెరవగలిగే తాళం చెవులు నరేంద్ర మోదీ, నవాజ్ షరీఫ్ ల వద్ద ఉన్నాయని, ఇద్దరు ప్రధానుల నిర్ణయాలే ఇరు ప్రాంతల ప్రజల ఐక్యతకు బాటలువేస్తాయని, పాకిస్థాన్ కు రావటం ఎప్పుడూ సంతోషంగానే ఉంటుందని ఓంపురి అన్నారు. నటుడు కాకుంటే ఏమయ్యేవారు? అనే మీడియా ప్రశ్నకు..'చిన్నప్పుడు చాయ్ అమ్మాను కదా, మెల్లగా టీ దుకాణం పెట్టుకుని ఇప్పటికి ప్రధానమంత్రి అయ్యుండేవాడిని' అని చమత్కరించారు. -
అక్టోబర్ 18న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: ఓం పురి (నటుడు), జ్యోతిక (నటి) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 9. ఇది కుజసంబంధమైనది. ఈ రోజు పుట్టిన తేదీ 18. ఇది కూడా కుజసంబంధమైనదే కాబట్టి కుజుని ప్రభావం వల్ల వీరికి జన్మతః నాయకత్వ లక్షణాలు, దేహదారుఢ్యం కలిగి ఉండటం వల్ల యూనిఫారం ధరించే ఉద్యోగాలకోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. 9 అనేది సంపూర్ణతకి, కార్యసిద్ధికి సంకేతం కాబట్టి పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. పరిశ్రమలు స్థాపించాలనే కోరిక తీరుతుంది. రియల్ ఎస్టేట్‌లోనూ, మైన్స్, భూమికి సంబంధించిన వ్యవహారాలలోనూ విజయం సాధిస్తారు. వాహనాలు కొంటారు. అలాగే వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది. దూకుడుగా, నిర్మొహమాటంగా వ్యవహరించడం వల్ల సహోద్యోగులతోనూ, తోటివారితోనూ వివాదాలు తలెత్తవచ్చు. లక్కీ డేస్: 1,3,6,9; లక్కీ కలర్స్: ఎల్లో, పర్పుల్, వైట్, క్రీమ్, రోజ్, ఆరంజ్, రెడ్; లక్కీ డేస్: ఆది, మంగళ, శుక్రవారాలు? సూచనలు: మాట లలోనూ, చేతలలోనూ సంయమనం పాటించడం, దుర్గాదేవి ఆలయాన్ని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి, పూజలు చేయించుకోవడం, మతగ్రంథాల పఠన, వికలాంగులను ఆదరించడం. - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరో గ్రాఫో థెరపిస్ట్ -
బ్యాక్ టు ప్లే
వెటరన్ బాలీవుడ్ నటుడు ఓమ్ పురి మనసు మళ్లీ నాటకాల వైపు మళ్లింది. నాలుగు దశాబ్దాల కిందట రంగస్థలానికి దూరమైన ఓమ్.. వెండితెరపై తన సత్తా చాటుకున్నాడు. తాజాగా నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో జరిగిన ఓ ఈవెంట్‌కు హాజరైన ఈ నటుడు.. అక్కడ తన మనసులో మాట బయటపెట్టాడు. తనను ఇంతవాణ్ని చేసిన రంగస్థలానికి ఎప్పుడూ రుణపడి ఉంటానని చెప్పిన ఓమ్పురి.. మళ్లీ నాటకాలాడతానని సభాముఖంగా ప్రకటించాడు. ఓం నిర్ణయాన్ని అక్కడున్నవారంతా కరతాళధ్వనులతో ఆహ్వానించడం కొసమెరుపు. -
'ఇక డిఫరెంట్ పాత్రలకే పరిమితం'
ముంబై: శృంగార సన్నివేశాలంటే ఏమాత్రం మొహమాటం, ఇబ్బంది లేకుండా నటించే వాళ్లలో మల్లికా శెరావత్ ముందంజలో ఉంటారు. మరి ఇక నుంచి ఆ తరహా సన్నివేశాలను ఆమె నుంచి ఆశించడం కష్టమే. ఇక తాను డిఫరెంట్ పాత్రలకే పరిమితమవుతానంటోంది మల్లికా. ఇప్పటికే తనకు గ్లామరస్ పాత్రలు వెల్లువలా వస్తున్నాయని మల్లికా తాజాగా తెలిపింది. 'నేనెందుకు స్క్రిప్ట్ లను ఎంపిక చేసుకోకూడదు.నాకు కూడా ఎంపిక చేసుకునే అవకాశాలు మెండుగా వస్తున్నాయి. ఇందులో భాగంగానే పలు రకాలైన గ్లామరస్ పాత్రలు చేయడానికి సన్నద్ధం అవుతున్నా' అంటూ మల్లిక పేర్కొంది. ఇక నుంచి తాను సినిమాల్లోనటించడానికి ఆస్కారం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తానని.. ఏదో ఒక సాంగ్ కు డ్యాన్స్ చేసేందుకు మాత్రమే పరిమితం కానని తెలిపింది. తనకు డర్టీ పాలిటిక్స్ ఒక ప్లాట్ ఫాం లాంటిందని ఒక ప్రశ్నకు సమాధానం చెప్పింది ఈ ముద్దుగుమ్మ. -
ఆయనతో కష్టమే!
సీనియర్ అని గౌరవమో... లేక ఓల్డేజ్ గైతో రొమాన్స్‌లో పసలేదనో... మొత్తానికి మల్లికాషెరావత్ మనసులో మాటైతే బయట పెట్టేసింది. ‘డర్టీ పాలిటిక్స్’ సినిమాలో ఓంపురితో కలసి చేసిన మల్లిక... ఆయనతో ‘బోల్డ్’ సీన్స్‌లో నటించడం ఎంతో కష్టమంటోంది. అయితే... ఆయన ‘ఎక్స్పీరియన్స్’ తనను కంఫర్టబుల్‌గా మార్చేసిందని వెంటనే కవరింగ్ ఇచ్చేసింది. ‘ఈ సినిమాలో ఓంపురితో నాకు కొన్ని బోల్డ్ సన్నివేశాలున్నాయి. తొలుత ఎలా చేయాలో ఆందోళన పడ్డా. కానీ ఆయన అనుభవం నాలోని ఆందోళన పోగొట్టింది. నిజంగా ఆయన ఓ ప్రొఫెషనల్’ అంటూ తన ఎక్స్‌పీరియన్స్‌ను షేర్ చేసుకుందీ సెక్సీ తార! కెరీర్లో తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని... గాడ్‌ఫాదర్ ఎవరూ లేకనే ఈ పరిస్థితని గోడు వెళ్లబోసుకుంది. -
సరికొత్త పాత్రలో ఓంపురి
న్యూఢిల్లీ: దేశంలో రైతుల ఆత్మహత్యల నేపథ్యంగా తీయబోయే 'ప్రాజెక్ట్ మరఠ్వాడ'లో ప్రముఖ నటుడు ఓంపురి కీలకపాత్ర పోషించనున్నారు. ప్రభుత్వ సహాయాన్ని ఆశించి తన గ్రామం నుంచి ఎంతో ఆశగా ముంబై చేరిన రైతుకు... అక్కడి అవినీతి అధికారుల నుంచి ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటాడన్నది ఈ సినిమా కథాంశం. ఈ సరికొత్త పాత్ర 'ప్రాజెక్ట్ మరఠ్వాడ'పై ఓంపురి మాట్లాడుతూ... ఈ చిత్రం ప్రభుత్వాలు రైతులకు ఏ మాత్రం చేయూత అందించకున్నా... వారు మాత్రం మన కోసం ఎంతో శ్రమిస్తారు. మరఠ్వాడకి చెందిన రైతు తుకారాం(ఓంపురి) ఎదుర్కొన్న సమస్యల్ని తెరపై చూడవచ్చు. "నిత్యం పెద్ద సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కీలకపాత్రలో ఓంపురి కనిపిస్తారు. నాపై నమ్మకం ఉంచిన నటీనటులు, నిర్మాత సత్యవ్రత్ త్రిపాఠికి కృతజ్క్షతలు" అని చిత్ర దర్శకుడు భావిన్ వాడియా తెలిపారు. ఈ నెల 20 తేదీ నుంచి ఈ చిత్ర షూటింగ్ ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. -
ఆయనతో భలే ఇబ్బంది: మల్లికా శెరావత్
శృంగార సన్నివేశాలంటే ఏమాత్రం మొహమాటం, ఇబ్బంది లేకుండా నటించే వాళ్లలో మల్లికా శెరావత్ కొంత ముందంజలో ఉంటారు. అయితే.. ఆమె సైతం ఓ నటుడితో అలాంటి సన్నివేశాలు చేయడానికి ఇబ్బంది పడ్డారంటే నమ్మగలరా? అవును.. 'డర్టీ పాలిటిక్స్'లో సీనియర్ నటుడు ఓంపురితో 'ఆ' సన్నివేశాలు చేయడానికి ఇబ్బంది పడ్డానని స్వయంగా మల్లికా శెరావత్ తెలిపింది. ఆయనతో అలాంటి సీన్లు చేయడానికి తాను చాలా ఇబ్బంది పడ్డానని, అయితే ఆయన తనను సౌకర్యంగా ఉండేలా చేశారని ఈ సెక్స్ బాంబ్ చెప్పింది. కె.సి. బొకాడియా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మూలకథ భన్వారీదేవి సెక్స్ స్కాండల్ అని అంటున్నారు. ఇందులో ఓంపురి ఓ నాయకుడి పాత్రను చేస్తున్నారు. ఆయనను ఉపయోగించుకుని జీవితంలో ఎదగడానికి ప్రయత్నించే అనోఖిదేవి అనే పాత్రలో మల్లికా శెరావత్ నటించింది. ఈ సినిమాలో ఇంకా నసీరుద్దీన్‌షా, అనుపమ్‌ఖేర్, జాకీ ష్రాఫ్, అశుతోష్ రాణా, రాజ్‌పాల్ యాదవ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. -
అవకాశాల్లేకపోతే రిటైర్మెంటే
ముంబై: పాతతరం నటులకు నిర్మాతలు అవకాశాలు ఇవ్వకపోతే రిటైరవడం తప్ప మరో మార్గమే లేదని వెటరన్ నటుడు ఓంపురి పేర్కొన్నాడు. ‘ఎక్కువమంది పాతతరం నటులకు అవకాశాలు అంతగా దొరకడం లేదు. పాత్రలు ఉండడం లేదు. పాశ్చాత్య దేశాల మాదిరిగా మంచి పాత్రలను ఇక్కడ ఆశించలేం. పాశ్చాత్య దేశాల్లో పాతతర నటులకు కూడా అవకాశాలు ఉంటాయి. ప్రేమకథలతోపాటు వారికోసమే ప్రత్యేకంగా అనేక పాత్రలను సృష్టిస్తారు. సినిమాలు తీస్తారు. ఒకవేళ నాకు కనుక పని లభించనట్టయితే అప్పుడు ఈ రంగం నుంచి తప్పుకుంటా. పాత్రల కోసం ఎవరి తలుపులూ తట్టను. ఒకవేళ అవకాశాలు లభిస్తే మాత్రం విడిచిపెట్టను. అంతగా అవకాశాలు రాకపోయినట్టయితే నాటక రంగానికైనా వెళ్లిపోతా’ అని ఈ 63 ఏళ్ల నటుడు భవితవ్యంపై తన మనసులో మాట చెప్పాడు. ‘100 ఫుట్ జర్నీ’ అనే ఆంగ్ల హాస్య కథాచిత్రంలో నటిస్తున్న ఓంపురికి బాలీవుడ్లో ప్రస్తుతం ఎలాంటి అవకాశాలు లేవు. ‘నాకు బాలీవుడ్లో పని లేదు. నాకు పని కల్పించమంటూ ఎవరో ఒకరికి చెప్పండి. ఇది అత ్యంత గంభీరమైన విషయం. ప్రియదర్శన్ తరచూ నాకు అవకాశాలు కల్పిస్తుండేవాడు. ఇప్పుడు అతను కూడా అవకాశాలు ఇవ్వడం లేదు. పెద్దవయస్కులమైన మాకోసం ప్రత్యేకంగా ఎటువంటి పాత్రలను సృష్టించడం లేదు. పని కల్పించడంటూ నేను ఎవరి గడపా తొక్కడం లేదు’ అని అన్నాడు. 71 ఏళ్ల అమితాబ్ బచ్చన్‌కు అవకాశాలు లభిస్తున్నాయని, నా కంటే పెద్దవాడైన అమితాబ్‌కు ఇప్పటికీ అవకాశాలు లభించడం తన లాంటి వాళ్లకు వరమని అన్నాడు. అయితే వాళ్లంతా స్టార్ నటులని, తాము మాత్రం కాదని అన్నాడు. -
అవకాశాల్లేకపోతే రిటైర్మెంటే
పాతతరం నటులకు నిర్మాతలు అవకాశాలు ఇవ్వకపోతే రిటైరవడం తప్ప మరో మార్గమే లేదని వెటరన్ నటుడు ఓంపురి పేర్కొన్నాడు. ‘ఎక్కువమంది పాతతరం నటులకు అవకాశాలు అంతగా దొరకడం లేదు. పాత్రలు ఉండడం లేదు. పాశ్చాత్య దేశాల మాదిరిగా మంచి పాత్రలను ఇక్కడ ఆశించలేం. పాశ్చాత్య దేశాల్లో పాతతర నటులకు కూడా అవకాశాలు ఉంటాయి. ప్రేమకథలతోపాటు వారికోసమే ప్రత్యేకంగా అనేక పాత్రలను సృష్టిస్తారు. సినిమాలు తీస్తారు. ఒకవేళ నాకు కనుక పని లభించనట్టయితే అప్పుడు ఈ రంగం నుంచి తప్పుకుంటా. పాత్రల కోసం ఎవరి తలుపులూ తట్టను. ఒకవేళ అవకాశాలు లభిస్తే మాత్రం విడిచిపెట్టను. అంతగా అవకాశాలు రాకపోయినట్టయితే నాటక రంగానికైనా వెళ్లిపోతా’ అని ఈ 63 ఏళ్ల నటుడు భవితవ్యంపై తన మనసులో మాట చెప్పాడు. ‘100 ఫుట్ జర్నీ’ అనే ఆంగ్ల హాస్య కథాచిత్రంలో నటిస్తున్న ఓంపురికి బాలీవుడ్లో ప్రస్తుతం ఎలాంటి అవకాశాలు లేవు. ‘నాకు బాలీవుడ్లో పని లేదు. నాకు పని కల్పించమంటూ ఎవరో ఒకరికి చెప్పండి. ఇది అత ్యంత గంభీరమైన విషయం. ప్రియదర్శన్ తరచూ నాకు అవకాశాలు కల్పిస్తుండేవాడు. ఇప్పుడు అతను కూడా అవకాశాలు ఇవ్వడం లేదు. పెద్దవయస్కులమైన మాకోసం ప్రత్యేకంగా ఎటువంటి పాత్రలను సృష్టించడం లేదు. పని కల్పించడంటూ నేను ఎవరి గడపా తొక్కడం లేదు’ అని అన్నాడు. 71 ఏళ్ల అమితాబ్ బచ్చన్‌కు అవకాశాలు లభిస్తున్నాయని, నా కంటే పెద్దవాడైన అమితాబ్‌కు ఇప్పటికీ అవకాశాలు లభించడం తన లాంటి వాళ్లకు వరమని అన్నాడు. అయితే వాళ్లంతా స్టార్ నటులని, తాము మాత్రం కాదని అన్నాడు. -
సిగరెట్లు మానేసిన ఓం పురి!
బాలీవుడ్ విలక్షణ నటుడు ఓం పురి సిగరెట్లు కాల్చడం మానేశాడు. నోట్లో వైట్ ప్యాచ్ రావడం, ముఖంలో కూడా కొంచెం తేడా కనిపించడంతో ఆయన స్నేహితులు, శ్రేయోభిలాషులు అంతా కేన్సర్ వచ్చిందేమోనని భయపడ్డారు. ఇటీవలే నోటికి సంబంధించి చిన్న శస్త్రచికిత్స కూడా చేయించుకున్న ఓం పురి.. ఇక జన్మలో సిగరెట్లు ముట్టేది లేదంటూ వాటిని వదిలిపెట్టేశాడు. నోట్లో వచ్చిన వైట్ ప్యాచ్ ఎంతకీ తగ్గకపోవడంతో ఆస్పత్రిలో చేరానని, దాంతో తనకు వెంటనే శస్త్రచికిత్స చేశారని ఓం పురి తెలిపాడు. అదృష్టవశాత్తు అది ఇంకా కేన్సర్ కారకంగా మారలేదని, అందువల్ల తన ప్రాణానికి వచ్చిన ముప్పేమీ లేదని చెప్పాడు. అయితే వైద్యులు మాత్రం ఆయన్ను సిగరెట్లు మానేయాల్సిందేనని గట్టిగా చెప్పారు. ఇన్ని సంవత్సరాలుగా వాటిని ఏమాత్రం వదిలిపెట్టలేని తాను.. డాక్టర్లు చెప్పడంతో వెంటనే మరునిమిషం నుంచే సిగరెట్లు మానేసినట్లు ఓంపురి చెప్పాడు. మన ఆరోగ్యం కంటే ఏమీ ముఖ్యమైనది కాదని, ఆ విషయం తాను ఆస్పత్రిలో చేరాకే తెలిసిందని అన్నాడు. ఇక సినిమాల గురించి చెబుతూ.. భారతీయ సినిమాల్లో తనకు ఇక అవకాశాలు ఏమీ కనిపించడం లేదని, ఇన్నాళ్ల పాటు అన్ని రకాల పాత్రలు చేసిన తర్వాత ఇప్పుడు ఇంట్లో నిరుద్యోగిగా కూర్చోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే అప్పుడప్పుడు మాత్రం పాశ్చాత్య దేశాల నుంచి ఒకటీ అరా ఆఫర్లు వస్తున్నాయని, వాటివల్లే కాస్త ఊరటగా ఉంటోందని తెలిపాడు. -
ఫ్యామిలీ కోర్టులో బాలీవుడ్ నటుడికి ఎదురుదెబ్బ!
బాలీవుడ్ నటుడు ఓం పురికి ముంబైలోని ఫ్యామిలీ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గత కొద్దికాలంగా ఓంపురికి, ఆయన భార్య నందితకు మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో నందితా ముంబైలోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. నందితా పిటిషన్ విచారణ చేపట్టిన కోర్టు గత వారం ఆమెకు అనుకూలంగా తీర్పునిచ్చింది. నందితాకు మెయింటెనెన్స్ కింద ప్రతినెలకు 1.25 లక్షల రూపాయలు.. కుమారుడికి 50 వేల రూపాయలను చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది. అంతేకాకుండా వైద్య, విద్య ఖర్చుల కోసం పత్రినెల 1.15 లక్షలు చెల్లించాలని ఓం పురికి ఆదేశించింది. ఆదాయ వనరుల లేమి ఉన్నందున్న.. నందితా లీగల్ ఖర్చుల కింద 25 వేల రూపాయలు కూడా ఓంపురి చెల్లించాలని తీర్పులో పేర్కోంది. ఇవియే కాకుండా నందితా కోసం చెల్లిస్తున్న ఇన్పూరెన్స్ ప్రీమియం, మెడిక్లెయిమ్ పాలసీలు, విద్యుత్, టెలిఫోన్ బిల్లులు, సొసైటీ మెయింటెనెన్స్ చార్జీలను ఓంపురి చెల్లిస్తున్నారు. వ్యక్తిగత విభేదాల కారణంగా తాము ఇద్దరం కలిసి జీవించడానికి వీలు లేనందున తమకు విడాకులు మంజూరు చేయాలని 2012 లో పిటిషన్ దాఖలు చేశారు. దాంతో తాను గృహిణి అని.. తనకు జీవించనడానికి ఆదాయ వనరులు లేనందున ఇంటిరిమ్ మెయింటెనెన్స్ చెల్లించాలని నందిత పిటిషన్ దాఖలు చేశారు. ప్రతినెల ఓంపురికి 35 లక్షల నుంచి 45 లక్షల రూపాయల ఆదాయం ఉందిని కోర్టుకు దాఖలు చేసిన పిటిషన్ నందితా పేర్కొన్నారు. -
భార్యపై దాడి కేసులో ఓంపురి అరెస్టు
ముంబై: భార్యపై దాడికి పాల్పడిన కేసులో బాలీవుడ్ నటుడు ఓంపురిని ముంబైలోని వెర్సోవా పోలీసులు శనివారం అరెస్టు చేశారు. తర్వాత రూ.10 వేల పూచీకత్తు సమర్పించడంతో ఆయనను విడుదల చేశారు. ఓంపురి ఆగస్టు 22న తనను ఒక కర్రతో తీవ్రంగా కొట్టినట్లు ఆయన భార్య నందిత ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ కేసులో ఓంపురి స్వయంగా లొంగిపోవడంతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ఆయన రూ.10 వేలకు పూచీకత్తు బాండు సమర్పించడంతో ఆయనను విడుదల చేసినట్లు పోలీసులు తెలిపారు. -
గృహ హింస కేసుపై స్పందించిన బాలీవుడ్ నటుడు ఓం పురి!
తనపై నమోదైన గృహ హింస కేసుపై బాలీవుడ్ నటుడు ఓం పురి స్పందించాడు. నందితా తనను టార్గెట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ విషయంపై ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. ఈ వివాదం కోర్టు పరిధిలో ఉంది. ఈ వివాదం రేపు కోర్టులో విచారణకు వస్తుంది. త్వరలోనే వాస్తవాలు తెలుస్తాయి అని ఓం పురి పీటిఐకిచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. గత 35 సంవత్సరాలు సినీ పరిశ్రమలో పనిచేస్తున్నానని, సుమారు 250 చిత్రాల్లో నటించానని, అయితే తనపై ఎలాంటి ఫిర్యాదులు రాలేదని ఓం పురి తెలిపారు. తన భార్య ఆరోపణలన్ని అవాస్తవాలని, తన కుమారుడి క్షేమం గురించి ఆలోచించడం కారణంగా తాను మౌనం వహిస్తున్నానని ఓం పురి తెలిపారు. ఓం పురిపై ఆయన భార్య నందిత వెర్సోవా పోలీసు స్టేషన్ లో గృహ హింస కేసు నమోదు చేసింది. ముంబైలోని వెర్సోవా ప్రాంతంలోని తమ ఫ్లాట్ లో తనను కర్రతో కొట్టారని పిర్యాదు చేసింది. అంతేకాక తన కుమారుడికి స్కూల్ ఫీజు, తనకు పురి భృతిని చెల్లించడం లేదని ఫిర్యాదులో తెలిపింది. -
పరారీలో ఓం పురి, బాలీవుడ్ నటుడిపై గృహ హింస కేసు!
బాలీవుడ్ నటుడు ఓం పురిపై గృహ హింస కేసును ముంబైలోని వెర్సోవా పోలీస్ స్టేషన్ లో నమోదైంది. ఓం పురిపై ఆయన భార్య నందితా ఆగస్టు 23 తేదిన వెర్సోవా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో నందితా పురిని కూపర్ హాస్పిటల్ కు పంపామని, ఆతర్వాత తమకు మెడికల్ రిపోర్టు కూడా ఇచ్చిందని పోలీసులు తెలిపారు. ఓం పురి తనపై కర్రతో దాడి చేశాడని నందితా పురి ఫిర్యాదులో తెలిపిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదైనప్పటి నుంచి ఓంపురి కనిపించకుండా పోయాడని, ఆయన కోసం వెతుకుతున్నామని పోలీసులు తెలిపారు. ఓం పురిపై నందితా రాసిన జీవిత కథ తర్వాత వారి మధ్య విభేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. 'అన్ లైక్లీ హీరో: ది స్టోరి ఆఫ్ ఓం పురి' అనే పుస్తకాన్ని 2009లో ప్రచురించింది. ఈ పుస్తకంలో వ్యక్తిగత జీవితానికి సంబంధించిన శృంగార సంఘటనలను ప్రచురించడంతో ఓం పురి ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటి నుంచి వారి మధ్య విభేధాలు కొనసాగుతునే ఉన్నాయి. ఆక్రోష్, ఆర్ధ సత్య, హెరా ఫెరీ చిత్రాల్లో తన నటనతో అభిమానులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.