'ఇక డిఫరెంట్ పాత్రలకే పరిమితం' | Mallika Sherawat tired of getting glamorous roles | Sakshi
Sakshi News home page

'ఇక డిఫరెంట్ పాత్రలకే పరిమితం'

Published Sun, Feb 1 2015 5:55 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

'ఇక డిఫరెంట్ పాత్రలకే పరిమితం' - Sakshi

'ఇక డిఫరెంట్ పాత్రలకే పరిమితం'

ముంబై: శృంగార సన్నివేశాలంటే ఏమాత్రం మొహమాటం, ఇబ్బంది లేకుండా నటించే వాళ్లలో మల్లికా శెరావత్  ముందంజలో ఉంటారు. మరి ఇక నుంచి ఆ తరహా సన్నివేశాలను ఆమె నుంచి ఆశించడం కష్టమే. ఇక తాను డిఫరెంట్ పాత్రలకే పరిమితమవుతానంటోంది మల్లికా. ఇప్పటికే తనకు గ్లామరస్ పాత్రలు వెల్లువలా వస్తున్నాయని మల్లికా తాజాగా తెలిపింది. 'నేనెందుకు స్క్రిప్ట్ లను ఎంపిక చేసుకోకూడదు.నాకు కూడా ఎంపిక చేసుకునే అవకాశాలు మెండుగా వస్తున్నాయి. ఇందులో భాగంగానే పలు రకాలైన గ్లామరస్ పాత్రలు చేయడానికి సన్నద్ధం అవుతున్నా' అంటూ మల్లిక పేర్కొంది.

 

ఇక నుంచి తాను సినిమాల్లోనటించడానికి ఆస్కారం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తానని..  ఏదో ఒక సాంగ్ కు డ్యాన్స్ చేసేందుకు మాత్రమే పరిమితం కానని తెలిపింది. తనకు డర్టీ పాలిటిక్స్ ఒక ప్లాట్ ఫాం లాంటిందని ఒక ప్రశ్నకు సమాధానం చెప్పింది ఈ ముద్దుగుమ్మ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement